విష్ణు మహా పురాణము

7 - సోమవంశము - గంగా చరిత్రము - కౌశిక వంశము

శ్రీపరాశరుడు:

తస్యాప్యాయుర్థీమానమావసుర్విశ్వావసుశ్శృ తాయుశ్శతాయురయుతాయురితిసంజ్ఞాః షట్పుత్రా అభవన్

తథాఽమావసోర్భీమానామాపుత్రోఽభవత్

భీమస్యకాఞ్చనః కాఞ్చనాత్సుహోత్రః తస్యాపిజహ్నుః

యోఽసౌయజ్ఞవాటమఖిలంగఙ్గామ్భసాప్లావితమవలోక్యక్రోధసం రక్తలోచనో భగవన్తం యజ్ఞ పురుష మాత్మనిపరమేణసమాధినా సమారో ప్యాఖిలామేవగఙ్గామపిబత్

అథైనం దేవర్షయః ప్రసాదయామాసుః

దుహితృ త్వేచాస్యగఙ్గామనయన్

జహ్నోశ్చసుమన్తుర్నామ పుత్రోఽభవత్

తస్యాప్యఙ్ కస్తతో బలాకాశ్వస్తస్మాత్కుశస్తస్యాపి కుశామ్బకుశనాభాధూధూర్త రజసోవసుశ్చేతి చత్వారః పుత్రా బభూవుః

తేషాం కుశామ్బః శాక్రతుల్యోమే పుత్రో భవేదితి తపశ్చకార

తంచోగ్రాతపసమవలోక్యమా భవత్వన్యోస్మత్తుల్య వీర్య ఇత్యాత్మనైవాస్యేన్ద్రః పుత్రత్వమగచ్చత్

సగాధిర్నమ పుత్రః కౌశికో భవత్

గాధిశ్చసత్యవతీం కన్యామజనయత్

తాంచభార్గవః ఋచికో వవ్రే

గాధిరప్యతిరోషణాయాతివృద్దాయ బ్రాహ్మణాయదాతుమనిచ్ఛన్నే కతశ్శ్యామకర్ణానామిన్దు వర్చసామనిలారం హసామశ్వానాం సహస్రకం కన్యాశుల్కమయాచాత

తేనాపిఋషిణా వరుణ సకాశాదుపలభ్యాశ్వతీర్థోత్పన్నంతాదృశమశ్వ సహస్రం దత్తమ్

తతస్తామృచికః కన్యాముపాయేమే

ఋచికశ్చతస్యాశ్చరుమపత్యార్థం చకార

తత్ప్రసాదిశ్చతన్మాత్రేక్షాత్ర వరపుత్రోత్పత్తయే చరుమపరం సాధయామాస

ఏష చరుర్భువత్యా అయమపరశ్చరుస్త్వాన్మాత్రాసంయగుపయోజ్య ఇత్యుక్త్వా వనంజామ

ఉపయోగకాలేచతాం మాతాసత్యవతీమాహ

పుత్రి! సర్వ ఏవాత్మపుత్రమతి గుణమభిలషతి నాత్మజాయాభ్రాతృగుణేశ్వతీవాదృతోభవతీతి

అతోఽర్హసిమమాత్మీయం చరుందాతుం మదీయం చరుమాత్మనోపయుక్తుమ్

మత్పుత్రేణహిసకల భూమణ్డల పరిపాలనం కార్యమ్ కియద్వాబ్రాహ్మణస్య బలవీర్య సంపదిత్యుక్త్వా స్వాస్వచరుం మాత్రేదత్తవతీ

అథవనాదాగత్యసత్యవతీమృషిరపశ్యత్

ఆహచైనామతిపాపే! కిమిదమకార్యం భవత్యాకృతమ్ అతిరౌద్రం తేవపు ర్లక్ష్యతే

నూనం త్వయాత్వన్మాతృసాత్కృతశ్చరురుపయుక్తః నయుక్తమేతత్

మయాహితత్రచరౌసకలిశ్చర్యవీర్యశౌర్యబలసంపదారోహితా త్వదీయచరావప్యఖిలశాన్తిజ్ఞాన తితిక్షాది బ్రాహ్మణ గుణసంపత్

తచ్చవిపరీతం కుర్వన్త్యాస్తవాతిరౌద్రాస్త్రధారణ పాలనానిష్ఠ క్షత్రియాచారః పుత్రోభవిష్యతి. తస్యాశ్చోపశమరుచిర్ బ్రాహ్మణాచార ఇత్యాకర్ ణ్యైవ సా తస్యపాదౌజగ్రాహ

ప్రణిపత్యచైనమాహ

భగవన్మయైతదజ్ఞానదనుష్టితః ప్రసాదం మేకురు మైనం విదః

పుత్రోభవతు కామమేవం విధః పాత్రో భవత్విత్యుక్తే మునిరప్యాహ

ఏవమస్త్వితి

అనన్తరం చసాజమదగ్నిమజీజనత్

తన్మాతాచ విశ్వామిత్రం జనయామాస

సత్యవత్యాపి కౌశికీనామ నద్యభవత్

జమదగ్ని రిక్ష్వాకు వంశోద్భవస్య రేణోస్తనయాం రేణుకాముపయేయే

తస్యాం చాశేషక్షత్రహన్తారం పరశురామ సంజ్ఞం భగవతస్సకల లోక

గురోర్నారాయణ స్యాంశం జమదగ్ని రజీజనత్

విశ్వామిత్ర పుత్రస్తు భార్గవ ఏవశునశ్శేఫోదేవై ర్థత్తః, తతశ్చదేవరాత నామాభవత్

తతశ్చాన్యేమధుశ్ఛందోధనం జయకృత దేవాష్టక కచ్ఛపహరిరాఖ్యా విశ్వామిత్రపుత్రా బభూవుః

తేషాంచ బహూని కౌశిక గోత్రాణి ఋష్యన్తరేషు వివాహాన్యభవన్

శ్రీపరాశరుడు:

ఆ పురూరవునకు ఆయువు అమావసువు విశ్వావసువు శ్రుతాయువు శతాయువు అయుతాయువునను నాఱుగురు పుత్రులు గల్గిరి. అమావసువునకు భీముడను కొడుకు గల్గెను. భీమునికి కాంచనుడు అతనికి సుహోత్రుడు అతనికి జహ్నువుం బుట్టిరి. ఈ జహ్నువు యజ్ఞ వాటమును గంగ ముంచెత్త కోపముచే గన్నెఱ్ఱ చేసి భగవంతుని యజ్ఞ పురుషుని బరమ సమాధి చేత ఆత్మారోపణము సేసికొని గంగనెల్ల ద్రావి వైచెను. అప్పుడు దేవర్షు లీయనను బ్రసన్నుం గావించిరి. గంగ నీయనకు గుమార్తె గావించిరి. జహ్నువునకు సుమంతుడు పుత్రు డుదయించెను, అతనికి అజకుడు అతనికి బలాకాశ్వుడు వానికి కుశుడు గల్గిరి. అతనికి కుశాంబ కుశనాభ అదోర్తరసజ వసువులను నల్గురు తనయులు గల్గిరి. అందు కుశాంబుడింద్ర తుల్యుడు సుతుడు కావలెనని తపస్సు చేసెను. వాని ఉగ్రతపము గని నాసమానుడింకొకడు గలుగ కుండుగాక యని యింద్రుడు తనకు దానతనికి పుత్రుండయ్యెను. అతడే గాధి కౌశికు డనబడెను. గాధికి సత్యవతి జనించెను. ఆమెను భృగు వంశీయుడు ఋచికుడు వరించెను. గాధి మిగుల రోష స్వభావుడై వృద్దుడై యున్న బ్రాహ్మణునికి పిల్ల నీయ నిష్టపడక చెవులు నలుపు మేనికాంతి చంద్ర సదృశము వాయు వేగమును గల వేయి గుఱ్ఱములను గన్యాశుల్క మడిగెను. ఆ ఋషియు వరుణుని యొద్దనుండి ఆశ్వతీర్థము నందు పుట్టిన యా లక్షణములు గల అశ్వ సహస్రము తెచ్చి యిచ్చెను. అందుచే ఋచికుడు సత్యవతిని పెండ్లాడెను. ఋచికు డామెకు సంతానము కొఱకొక చరువును కల్పించెను. ఆమె బ్రతిమలినంత ఆమె తల్లికి క్షత్రియ వరుడు పుత్రుడు పుట్టుట కింకొక చరువును సాధించెను. ఈ చరువు నీకు ఈ యింకొక చరువును మీయమ్మ లెస్సగ నుపయోగింప దగినది అని తెల్పి వనముకేగెను. ఉపయోగించు సమయమున సత్యవతితో తల్లి పుత్రి! తన కొడుకు మిగుల గుణవంతుడు గావలెనని యందరుం గోరుదురు. అంతియకాని తన భార్య సోదరులు మొదలగు వారి గుణముల యెడ నంద యాదరము గొనరు. అందుచే నీవు నీ చరువును నాకిచ్చి నా చరువును నీవు ఉపయోగించు కొన దగుదువు. నా కొడుకు సకల భూ మండల మేలవలెను. బ్రాహ్మణుని బలవీర్య సంపద యెంతపాటి? అన సత్యవతి తన చరువుం దల్లికిచ్చెను. వనమేగిన ఋషివచ్చి సత్యవతి వంక చూచెను. ఇట్లనెను గూడ! ఓసీ! అతి పాపురాల నీవీ పాడుపని సేసితివేమి? నీ శరీర మతిరౌద్రముగ కన్పించు చున్నది. మీతల్లి కిచ్చిన చరువును నీవుపయోగించితివి నిక్కము. ఇది తగని పనినేనా చరువునందు సకలైశ్వర్య బల సంపద నుంచితిని. నీ చరువు నందు శాంతి జ్ఞానము ఓరిమి మొదలయిన యఖిల బ్రాహ్మణ గుణ సంపదన నుంచితిని. దానిని విపరీతము సేసితివి గావున నీకతి రౌద్రాస్త్ర ధారణ పాలనా నిష్టుడగు క్షత్రియాచారుడు పుత్రుడు గల్గును. ఆమెకు శమదమాది సంపన్నుడు బ్రహ్మ తేజస్వి బ్రాహ్మణు డాచార్యుడు దయించును. అన విని యామె యాతని పాదముల బట్టుకొనెను. ప్రణతయై మఱియు నిట్లనెను. స్వామీ! నేను దెలియక యిటు సేసితిని. దయ సూపుము. నా కొడుకిట్టి వాడు కాకుండుత! పౌత్రుడిట్టి వాడైన గానిమ్మన ముని యట్లేనగు ననియె. అవ్వాల నామె జమదగ్నిం గనెను. ఆమె తల్లి విశ్వామిత్రుం గన్నది. సత్యవతి కౌశికి యను నది యయ్యె. జమదగ్ని ఇక్ష్వాకు వంశ్యుడగు రేణువను రాజు కూతురును రేణుకను వివాహమాడెను. ఆమె యందశేష క్షత్ర సంహారకుడగు భగవంతుని పరశురాముని సకల లోక గురువగు నారాయణు నంశమున గనెను. విశ్వామిత్రు కొడుకు భార్గవుడే శునశ్షేపుడను పేరివాడు. దేవతలచే నీయ బడినాడు. అందుచే దేవరాతుడన బేరొందెను. ఆ తర్వాత మధుచ్ఛందుడు ధనుంజయుడు కృతదేవుడు అష్టకుడు కచ్ఛపుడు హరియను వారు విశ్వామిత్రునికి పుత్రులు గలిగిరి. వారి కనేకములు కౌశిక గోత్రములు ఇతర ఋషులందు వివాహము చేసికొన దగినది గల్గినవి.