శ్రీపరాశరుడు:
అతః పరంభావిష్యానహం భూపాలాన్ కీర్తయిష్యామి॥
యోఽయం సామ్ప్రతమవనీపతిః పరిక్షిత్తస్యాపి జనమేజయ శ్రుతసే నోగ్రాసేనభీమసేనాశ్చత్వారః
పుత్రాభవిష్యన్తి॥
జనమేజయస్యాపి శతానీకో భవిష్యతి॥
యోఽసోయాజ్ఞ్యవల్క్యాద్వేదధీత్యకృపాదస్త్రాణ్యవాప్యవిష మవిష యిరక్తచిత్తవృత్తిశ్చ శౌనకోపదేశాదాత్మజ్ఞాన ప్రవీణః పరంనిర్వాణమవాప్స్యతి॥
శతానీకాదశ్వమేధదత్తోభవితా॥
తస్మాదప్యాదిసీమకృష్ణః॥
అధిసీమక్రుష్ణాన్నిం చక్ను॥
యోగఙ్గయాఽపహృతే హస్తినపురే కోశామ్బ్యాంనివత్స్యతి॥
తస్యాప్యుష్ణః పుత్రోభవితా॥
ఉష్ణాద్వి చిత్రరథః॥
తతశ్శుచిరథః॥
తస్మాద్వృష్టిమాంస్తతస్సుషేణ స్తస్యాపిసునీథః సునీథాన్నృపచక్షుస్తస్మాదపిసఖిబాలస్తస్యచ
పారిప్లవస్తతశ్చసునయ స్తస్యాపిమేధావీ॥
మేదావినోరిపుంజయ స్తతోఽర్వ స్తస్మాచ్చ తిగ్మస్తస్మాద్బృహద్రధః బృహద్రథాద్వాసుదాసః।
తతోఽపరశ్శతానీకః॥
తస్మాచ్చోదయన ఉదయనాద్విహీనర స్తతశ్చదణ్డపాణిస్తతోనిమిత్తః॥
తస్మాచ్చక్షేమకః॥
అత్రాయం శ్లోకః॥
బ్రహ్మక్షత్రస్య యోయోనిర్వంశోదేవర్షిసత్కృతః।
క్షేమకం ప్రాప్యరాజానం సంస్థానం ప్రాప్యతేకలౌ! ఇతి॥
శ్రీపరాశరుడు:
ఈ మీద భవిష్య రాజులను వర్ణింతును. ఇపుడు ప్రభువుగా నున్న పరీక్షిత్తునకు జనమేజయ, శ్రుతసేన, ఉగ్రసేన, భీమసేనులు నల్గురు కుమారులు గల్గుదురు. జనమేజయునికి శాతానీకుడు గల్గును. యీతడు యాజ్ఞవల్క్యుని కడ నధ్యయనము సేసి కృపాచార్యుల వలన అస్త్రోపదేశము వడసి విషయభోగ విరక్తుడయి శౌనకుని యుపదేశముచే ఆత్మజ్ఞాన సంపన్నుడై పరమ నిర్వాణమును (మోక్షమును) బొందును. శతానీకునికి అశ్వమేధదత్తు డుదయించును. అతనికి అధిసీమ కృష్ణుడు అతనికి నిచక్నుడు కల్గును. అతడు హస్తినాపురమును గంగముంచి వేయగా కౌశాంబి పట్టణ మందు వసించును. ఆటనుంచి ఉష్ణుడు చిత్రరథుడు శుచిరథుడు వృష్టిమంతుడు సుషేణుడు సునీథుడు నృపచక్షువు మఖిబలుడు పారిప్లవుడు సునయుడు మేధావి రిపుంజయుడు అర్ముడు తిగ్ముడు బహద్రథుడు వసుదాసుడు శాతానీకుడు (2వ శతానీకుడు) ఉదయనుడు విహీనరుడు దండపాణి నిమిత్తుడు క్షేమకుడును వరుసగా దండ్రి కొడుకు లగుదురు. ఇచట నొక శ్లోకము గలడు (భావమిది). “బ్రహ్మక్షత్రమునకు మూలమయిన దేవర్షులు మెచ్చిన వంశము క్షేమకుని పొంది కలియుగ మందు సంస్థానమును (సమాప్తి) బొందును.
Summary of chapter 21 of the Vishnu Mahā Purāṇa is as follows:
The future Kuru lineage is traced from Parīkṣit → Janamejaya → Śatānīka (who attains mokṣa through the teachings of Yājñavalkya and Śaunaka) → Nicaknu (who moves the capital to Kauśāmbī after Hastināpura is submerged by the Gaṅgā) → a long succession of kings ending with Kṣemaka, who will be the last Paurava king before the Kali Yuga fully takes hold.