శ్రీసూతుడు:
పరాశరం మునివరం కృతపౌర్వాహ్నికక్రియమ్।
మైత్రేయః పరిపప్రచ్ఛ ప్రణిపత్యాభివాద్యచ॥
శ్రీ మైత్రేయుడు:
త్వత్తోహి వేదాధ్యయన మదీయ మఖిలంగురో।
ధర్మశాస్త్రాణి సర్వాణి తథాఙ్గాని యథాక్రమమ్॥
త్వత్ప్రసాదా న్మునిశ్రేష్ఠమామన్యే నాకృతశ్రమమ్।
వక్ష్యన్తి సర్వశాస్త్రేషు ప్రాయశో యేపి తద్విదః॥
సోఽహమిచ్చామి సర్వజ్ఞ శ్రోతుం త్వత్తో యథాజగత్।
బభూవ భూయశ్చ యథా మహాభాగ భవిష్యతి॥
యన్మయంచ జగద్బ్రహ్మ యథాశ్పైత చ్చరాచరమ్।
లీన మాసీ ద్యథాయత్ర లయ మేష్యతి యాత్రచ॥
యత్ర్పమణాని భూతాని దేవాదీనాంచ సంభవమ్।
సముద్రపర్వతానాంచ సంస్థానంచ తథాభువః॥
సూర్యాదీగాంచ సంస్థానం ప్రమాణం మునిసత్తమ।
దేవాదీనాం తథావంశా న్మనూన్ మన్వంతరాణిచ॥
కల్పాన్ ??????గాంశ్చ చాతుర్యుగవికల్పితా।
కల్పాన్తస్య స్వరూపంచ యుగాధర్మాంశ్చ కృత్ స్నశః॥
దేవర్షి?????????????రితం యన్మహామునే।
వేదశాఖాప్రణయనం యథావ ద్వ్యాసకర్తృకమ్॥
ధర్మాం??బ్రాహ్మ????నాం తాథాచాశ్రమవాసినామ్।
శ్రోతు మిచ్చామ్యాహం సర్వం త్వత్తోవాసిష్ఠనందన!॥
బ్రహ్మ????పాద ప్రవణం కురుష్వ మయి మానసమ్।
యేనాహ మేతజ్జానీయాం త్వత్ర్పసాదా న్మహామునే!॥
శ్రీ సూతుడు:
మెత్రేయుడు పూర్వయామ మందనుష్ఠానము చేసికోని యున్న పరాశర మునీంద్రులకు సాష్టాంగముగా నమస్కరించి యిట్లనియె. “ఓ గురుదేవా! నీ వలన వేదములను, వేదాంగములను వరుసగా జదువు కొంటివి. సర్వ శస్త్రములు నద్యయనము చేసితివి. నీ యనుగ్రహమున సర్వ శాస్త్రము లందు మరెవ్వరు చేయని పరిశ్రమ జేసితినని నన్ను పండితులు ప్రశంస జేయుచున్నారు. మఱి నీ వలన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను విన గుతూహల పడుచున్నాను. ఓ బ్రహ్మ మూర్తీ! ఈ జగత్తు దేన నిండినదో, దేని వికారమో, దేనబుట్టి పెరిగి లీన మగు చున్నదో దీనికి మూలమైన, పంచ భూతముల యొక్క సంస్థానము, ప్రమాణము, దేవాదుల వంశములు, మనువులు, మన్వంతర చతుర్యుగ కల్పకల్పనలు, కల్పాంతము యొక్క స్థితి, నాలుగు యుగముల ధర్మములు, దేవర్షి రాజ చరితము, వేద శాఖా విభాగము బ్రాహ్మణాది వర్ణ ధర్మములు, బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములు విన గోరెదను. నీ మనస్సును నా యెడ ప్రసన్న మొనరింపుము. దాన నంతను నేఱుంగ గలన”న
శ్రీపరాశరుడు:
సాధు మైత్రేయ ధర్మజ్ఞ! స్మారితోస్మి పురాతనమ్।
పితుః పితామే భగవాన్ వసిష్ఠో యదువాచహ॥
విశ్వామిత్రప్రయుక్తేన రక్షసాభక్షితః పురా।
శ్రుతస్తాత స్తతః క్రోధో మైత్రేయాసీ నమ్మా తులః॥
తతోహం రక్షసాంసత్త్రం వినాశాయ సమారభమ్।
భస్మీకృతాశ్చ శతశాస్తస్మిన్ సుత్త్రేనిశాచరాః॥
తతస్సంక్షీయమాణేషు తేషు రాక్షస్స్వశేషతః।
మామువాచ మహాభాగో వసిష్ఠోఽ స్మత్పితామహః॥
అలమత్యన్తకోపేన తాత మన్యుమిమం జహి।
రాక్షసా నాపరాధ్యన్తి పితుస్తే విహితం హితత్॥
మూఢానామేనా భవతి క్రోధో జ్ఞానవతాంకుతః।
హన్యతే తాత కఃకేన యత స్స్వకృతభు క్పుమాన్॥
సంచితస్యాపి మహతా వత్స! క్లేశేన మానవైః।
యశాసప్తపసశ్చ్యైవ క్రోదో నాశకరః పరః॥
స్వగాప్ వగ్ వ్యాసేధకారణం పరమర్షయః।
వజ్ యన్తి సదాక్రోధం సదాక్రోధం తాత మా తద్వశోభవ॥
అలంనిశాచరైద్ గదై దీనై నిరపరాదిభిః।
సత్త్రంతే విరమ త్వేతత్ క్షమాసారాహి సాధవః॥
ఏవం తాతేన మనునీతో మహాత్మనా।
ఉపసంహృతవాన్ సత్రం సద్య స్తద్వాక్య గౌరవాత్॥
తతః ప్రీత స్సభగవాన్ వసిష్ఠో మునిసత్తమః।
సంప్రాప్తశ్చ తదాతాత్ర పులస్త్యో బ్రహ్మణస్సుతః॥
పితామహేన దత్తార్ఘ్యః కృతాసన పరిగ్రహః।
మామువాచ మహాభాగో మైత్రేయ! పులహాగ్రజః॥
శ్రీ పరాశరుడు:
మైత్రేయా! మంచిది. ధర్మగ్నుడవు, ఆ పితామహుడు వశిష్ఠ భగవానుడు తెలిపిన యీ పురాతన వృత్తాంతము నీచే జ్ఞప్తికి వచ్చినది. మున్ను విశ్వామిత్రు నానతిచే నొక రాక్షసుడు మా తండ్రియగు శక్తియను మహర్షిని భక్షించినట్లు విని కినిసి రాక్షసులు చేయునట్టి సత్రయాగము జరుప నారంభించితిని. అందు వందల కొలది రాక్షసులు నాచే భస్మమైరి. ఆ రాక్షస క్షయము చూచి,”నాయనా! తీవ్రక్రోధము వలదు. రాక్షసులు అపరాధము చేయ లేదు. నీ తండ్రి మరణము విధి విహితము. మూర్ఖులకు గాని జ్ఞానులకు కోపము గలుగదు. ఎవనిచే నెవడు చంప బడును? ప్రారబ్ద మనుభవించుట జీవి యొక్క ధర్మము. పెక్కు జన్మములు మిక్కిలి శ్రమించి సంపాదించుకొన్న కీర్తిని, తపస్సును క్రోధము నశింప జేయును. స్వర్గమునకు, మోక్షమునకు, నభ్యంతరమైన కోపమును మహర్షులు త్యజింతురు. తండ్రీ! దానికి వశుడవు గాకుము. నిరపరాధులు, దీనులునైన నిశాచరులు దగ్దు లయినారు. చాలునిక నీ సత్రయాగము చాలింపుము. సాధువులు క్షమసారులు గదా! (సాధువుల కోరిమి పరమ ధర్మము, బలము కూడ) ఇట్లు మా తండ్రి చేత ననునయింప బడి యాయన మాట యందుగల గౌరవముచే నా సత్ర యాగము నాపితిని. అవ్వల పితామహునిచే నర్ఘ్య మీయబడి యాసన మలంకరించి పులహుని పులస్త్యు డిట్లనియె.
పులస్త్యుడు:
వైరే మహతి యద్వాక్యా ద్గురో రద్యాశ్రితాక్షమా।
త్వయా తస్మాత్సమస్తానిభవ్ శాస్త్రాణి వేత్స్యతి॥
సంతతేర్న మమచ్చేదః క్రుద్దేనాపియతః కృతః।
త్వయా తస్మా న్మహాభాగ దదామ్యన్యం మహావరమ్॥
పురాణసాహితాకర్తా భవాన్ వత్స! భవిష్యతి।
దేవతాపార మార్ధ్యంచ యథావద్వేత్స్యతే భవాన్॥
ప్రవృత్తేచ నివృత్తేచ కర్మ ణ్య స్త్వమాలామతిః।
మత్ప్రసాదాద సందిగ్ధా తవ వత్స భవిష్యతి॥
ఇతిపూర్వం వసిష్ఠేనా పులస్త్యనచ ధీమతా।
యదుక్తం తత్ స్మృతిం యాతి త్వత్ర్పశ్నా దఖిలం మమ॥
సోఽహం వదామ్యశేషం తే మైత్రేయ పరిపృచ్ఛతే।
పురాణ సంహితంసమ్యక్ తాం నిబోధ యథాతథమ్॥
విష్ణోస్సకాశా దుద్భూతం జగత్తత్రైవచ స్థితమ్।
స్థితి సంయమకర్తాఽసౌ జగతోస్య జగచ్చ సః॥
మిత్రాపుత్రవచో నిశమ్య సకలస్మ్రుత్వాత్మన స్తధ్వరం।
సత్రం చైవనివారితం స సుమహాభాగోభావత్తారణమ్॥
కృత్వావైష్ణవముత్తమం మునివరం మైత్రేయమధ్యాపయ।
త్తత్త్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతామ్॥
పులస్త్యుడు:
“తీవ్రమయిన వైర మేర్పడినను మాహానుభావుడు, గురువు, పితామహుడు వశిష్ఠుడు చెప్పినట్లు యోరిమిం గైకొంటిని. ఈ విధేయత వలన నీవు సర్వ శాస్త్రములు నేఱుంగ గలవు. కుపితుడయ్యు నా సంతానమును విచ్ఛిన్నము చేయకుండుట వలన నీ కింకొక వరమీయ దలచితిని. నీవు పురాణ సంహితకు గర్తవు గాగలవు. దేవతక పరమార్ధ తత్త్వము సమగ్రముగ మనస్సచ్చాముగ ప్రకాశించును” అని నంతట వశిష్ఠుడు “మా పితామహుడు గూడ పులస్త్యుడు వరమిచ్చి నట్లు జరుగ గలదనియె”. ఆ యిరువురు మహానుభావులు చెప్పినట్లు సర్వ శాస్త్రములు మీరడిగిన యీ క్షణమందు జ్ఞప్తికి వచ్చు చున్నవి. కావున, మైత్రేయా! పురాణ సంహిత నిదిగో చెప్పు చున్నాను. నీవది యెల్ల చక్కగా వినుము. జగత్తు విష్ణువు నుండి పుట్టినది. ఆయన యందే నిలిచినది. ఆయననే దీని లయకర్త. ఇట్లు మైత్రా వరుణుల కుమారుడయిన వశిష్ఠ మహర్షి మాట విని యాయన యిచ్చిన వరమెంచి సత్రయాగ మాపు విష్ణు భాక్తాగ్రేసరుడయినా మైత్రేయునిచే తత్త్వార్థ ప్రతిపాదకమును, విను వారికి దెలుపు వారికి గూడ సర్వార్థముల నిచ్చు నీ పురాణ సంహితను నధ్యయనము సేయించెను.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
Maitreya approaches Parāśara and asks the four foundational questions: what is the cause of this world, what is it made of, in whom does it rest, and how did it originate? Parāśara establishes Viṣṇu-Nārāyaṇa as the eternal, unborn Brahman — simultaneously the efficient cause (nimitta-kāraṇa), the material cause (upādāna-kāraṇa), and the resting place (ādhāra) of the entire cosmos. The teaching of the Purāṇa's lineage (Brahmā → Pulastya → Parāśara) is given.