మైత్రేయుడు:
కథితాగురుణాసమ్యగ్భూసముద్రాదిసంస్థితిః।
సూర్యాదీనాంచాసంస్థానంజ్యోతిషామాపివిస్తరాత్॥
దేవాదీనాంతథాసృష్టిఃఋషీణాంచాపివర్ ణితా।
చాతుర్వణ్యస్యచోత్పత్తిస్తిర్యగ్యోనిగతస్యచ॥
ధ్రువప్రహ్లాదచరితం విస్తరాచ్చత్వయోదితమ్।
మన్వన్తరాణ్యశేషాణి శ్రోతుమిచ్చామ్యనుక్రమాత్॥
మన్వన్తరాధిపాంశ్చైవశక్రదేవపురోగమాన్।
భవతాకథితానేతాన్ శ్రోతుమిచ్చామ్యహంగురో॥
మైత్రేయుడు:
గురువు (పరాశరుడు) చే భూ సముద్రాదుల యొక్కయు, సూర్య తేజో మండలం యొక్కయు సన్నివేశము విస్తృతముగ చెప్పా బడినది. అట్లే దేవాదుల యొక్కయు, ఋషుల యొక్కయు సృష్టి వర్ణింప బడెను. చాతుర్వర్ణ్య సముత్పత్తి ధృవ ప్రహ్లాద చరితము వివరముగ మీచే చెప్పబడెను. మన్వంతరముల నన్నిటిని తదధిపతులగు నింద్రాదులను మీరు చెప్పగా విన గోరిక గలదు.
శ్రీపరాశరుడు:
అతీతానాగతానీహయానిమన్వన్తరాణివై।
తాన్యాహంభవతస్సమ్యక్కథయామియాథాక్రమ్॥
స్వాయంభువోమనుఃపూర్వంపరస్స్వారోచిషస్తథా।
ఉత్తమస్తామాసశ్చైవరైవతశ్చాక్షుషస్తథా॥
షడేతేమనవోతీతాస్సాంప్రతంతురవేస్సుతః।
వైవస్వతో యంయస్యైతత్సప్తమంవర్తతేఽన్తరమ్॥
స్వాయంభువంతుకథితంకల్పాదావన్తరంమయా।
దేవాస్తత్రర్షయశ్చైవయథావత్కథితామయా॥
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మనోస్స్వారోచిషస్యతు।
మన్వన్తరాధిపాన్ సమ్యగ్దేవర్షీంస్తత్సుతాంస్తథా॥
పారావారాస్సతుషితాదేవాస్స్వారోచిషేఽన్తరే।
విపశ్చిత్తత్రదేవేన్ద్రోమైత్రేయాసీన్మహాబలః॥
ఊర్జస్తమ్బస్తథాప్రాణోదత్తోగ్నీఋషభస్తథా।
నిఃస్వరశ్శార్వరీవాంశ్చతత్రసప్తర్షయోభవన్॥
చైత్రకింపురుషాద్యాశ్చ సుతాస్స్వారోచిషస్యతు।
ద్వితీయమేతద్వ్యాఖ్యాతమన్తరంశృణుచోత్తమమ్॥
శ్రీపరాశరుడు:
ఈ వారాహ కల్పము నందు అతీతము లైనవియు అనాగతము లైనవియు నగు మన్వంతరములను క్రమముగ చెప్పెదను. స్వాయంభువ మనువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుష మనువు అను నారుగురు మనువులు గతించిరి. ప్రస్తుతము సూర్య పుత్రుడగు వైవస్వత మనువు యొక్క అంతరము అనగా నేడవ మన్వంతరము జరుగు చున్నది. కల్పాది యందలి స్వాయంభువ మన్వంతరము అందు దేవతలను, సప్తర్షులను పూర్తిగ జెప్పితిని. ఇక ముందు స్వారోచిష మన్వంతరమును, తదధిపతులను దేవతలను ఋషులను మను పుత్రులను తెల్పెదను. ఈ మన్వంతరము నందు తుషితునితో గూడి పారావారులు దేవతలు, మహాబలుడగు విపశ్చిత్ అను నాతడు దేవేంద్రుడు. ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, వాతుడు, వృషభుడు, నిరయుడు, పరీవాన్ అను సప్తర్షులుండిరి. చైత్రుడు కింపురుషుడు మున్నగు వారు స్వారోచిషుని పుత్రులు. ఇది రెండవ మన్వంతరము. మొదటి స్వాయంభువ మన్వంతరము నందు యామాఖ్య దేవతలు పన్నిద్దరు. మరీచ్యాదులు సప్తర్షులు. ప్రియవ్రతోత్తానపాదులు మను పుత్రులు. విశ్వభుక్ అనువాడు దేవేంద్రుడు.
తృతీయేఽప్యన్తరేబ్రహ్మన్నుత్తమొనామయోమనుః।
సుశాన్తిర్నామదేవేన్ద్రో మైత్రేయాసీత్సురేశ్వరః॥
సుధామానస్తథాసత్యాశ్మివాంశ్చాథప్రతర్ధనాః।
వశవర్తిశ్చపఞ్చైతేగణాద్వాదశాకాస్స్మృతాః॥
వసిష్ఠతనయాస్తత్రసప్తర్షయోభవన్।
అజఃపరశుదివ్యాద్యాస్తథోత్తమమనోస్సుతాః॥
తామసస్యాన్తరేదేవాస్సుపారాహరయస్తథా।
సత్యాశ్చసుధీయశ్చైవసప్తవింశతికాగణాః॥
శిభిరిన్ద్రస్తథాచాసీచ్చతయజ్ఞోపలక్షణః।
సప్తర్షయశ్చయేతేశాం సప్తనామానిమేశృణు॥
జ్యోతిర్ధామాపృథుఃకావ్యశ్పైత్రోఽగ్నిర్దనకస్తథా।
పీవరశ్చర్షయోహ్యేతే సప్తతత్రాపిచాన్తరే॥
నరఃఖ్యాతిఃకేతురూపోఙానుజౌంఘౌదయస్తథా।
పుత్రాస్తుతామసస్యాసన్ రాజానస్సుమహాబలః॥
తృతీయ మంవంతరమున నుత్తముడు మనువు. సుశాంతి యనువాడు దేవేంద్రుడు. సుధాములు, సత్యులు, జపులు, ప్రతర్దనులు, వశవర్తులు అను నైదు గణములు దేవతలు, ఒక్కొక్క గణమున పన్నిద్దరు గలరు. వసిష్ఠ తనయులు సప్తర్షులు. అజుడు పరశు దేప్తాదులు ఉత్తమ మనుపుత్రులు. చతుర్థమగు తామస మన్వంతరమున సుపారులు హరులు సత్యులు సుధియులునగు దేవా గణములు. ఒక్కొక్క గణమున నిరువది యేడుగురు గలరు. శిభియను వాడు దేవేంద్రుడు. శతక్రతుత్వ వజ్రిత్వ సహస్రాక్షత్వాది లక్షణములు సర్వ మన్వంతరీయ దేవేంద్రులకు సమానము. జ్యోతిర్ధామ పృథువు కావ్యుడు చైత్రుడు అగ్నిధనకుడు పీడుడు అనువారు సప్తర్షులు. నరుడు ఖ్యాతి కేతురూడుడు, జానుజంఘుడు మున్నగు వారు మహాబలులు రాజులునైన మనుపుత్రులు.
పంచమేచాపిమైత్రేయరైవతోనామనామతః।
మనుర్విభుశ్చతత్రేన్ద్రోదేవాశ్చైవాన్తరేశృణు॥
అమితాభాభూతనయావైకుంఠాస్సుసమేధసః।
ఏతేదేవగణాస్తత్ర చతుర్దశచతుర్దశ॥
హిరణ్యరోమావేద శ్రీరూర్ ధ్వబాహుస్తథావరః।
వేదబాహుస్సుధామాచ పర్జన్యశ్చ మహామునిః॥
ఏతేసప్తర్షయో విప్ర! తత్రాసన్ రైవాతేఽన్తరే॥
బలబన్దుసుసం భావ్యసత్యకాద్యాశ్చతత్సుతాః।
నరేన్ద్రాస్సుమహావీర్యా బభూవుర్మునిసత్తమ॥
స్వారోచిషశ్చోత్తమశ్చ తామసోరైవతస్తథా!।
ప్రియవ్రతాన్వయాహ్యేతే చత్వారోమనస్మృతాః॥
విష్ణుమారాధ్యతపసాసరాజర్షిః ప్రియవ్రతః।
మన్వన్తరాధిపానేతాన్ లబ్ధవానాత్మవంశజాన్॥
ఐదవదగు రైవత మన్వంతరమున రైవతుడు మనువు. విభువనువాడు దేవేంద్రుడు. అమితాభుడు భూతనయుడు వైకుంఠులు సుమేధసులు అగు పదునలుగురతో గూడిన పదునాలుగు గణములు దేవతలు. హిరణ్యరోముడు వేదశ్రీ ఊర్ధ్వబాహువు అతరుడు వేదబాహువు సుధాముడు పర్జన్యుడనువారు సప్తర్షులు. బలబంధువు సుసంభావుడు, సత్యకుడు మున్నగు వారు రైవత మను పుత్రులు. వారు మహావీర్య సంపన్నులు. రాజేంద్రులు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను నీ నలుగురు మనువులు ప్రియవ్రత వంశములోని వారు. రాజర్షియగు ప్రియవ్రతుడు తపస్సుచే విష్ణువు నారాధించి మన్వంతరాధి పతులయిన ఈ నల్వురను గనెను.
షష్ఠేమన్వన్తరేచాసీచ్చాక్షుషాఖ్యస్తథామనుః।
మనోజవస్తథైవేన్ద్రో దేవానపినిబోధమే॥
ఆప్యాః ప్రసూతాభవ్యాశ్చపృథుకాశ్చదివౌకసః।
మహానుభావాలేఖాశ్చపంచైతేహ్యష్టకాగణాః॥
సుమేధావిరజాశ్చైవ హవిష్మానుత్తమోమధుః।
అతినామాసహిష్ణుశ్చసప్తాసన్నితిచర్షయః॥
ఊరుః పూరుశ్శతద్యుమ్న ప్రముఖాస్సుమహాబలాః।
చాక్షుషస్య మనోః పుత్రాః పృథివీపతయేభవన్॥
వివస్వతస్సుతోవిప్రశ్రాద్ధదేవో మహాద్యుతిః।
మనుస్సంవర్తతేధీమాన్ సాంప్రతంసప్తమేఽన్తరే॥
ఆదిత్యవసురుద్రాద్యా దేవాశ్చాత్రమహామునే।
పురందరస్తథైవాత్ర మైత్రేయత్రిదశేశ్వరః॥
వసిష్ఠకాశ్యపోథాత్రిర్జమదగ్నిస్స గౌతమః।
విశ్వామిత్ర భరద్వాజౌ సప్తసప్తర్షయోత్రతు॥
ఇక్ష్వాకుశ్చనృగశ్చైవ దృష్టశ్శర్యాతి రేవచ।
నరిష్యన్తశ్చవిఖ్యాతోనాభాగోఽరిష్ట ఏవచ॥
కరూషశ్చవృషధ్రశ్చవసుమాన్ లోకవిశ్రుతః।
మనోర్ వైవస్వతస్యైతేనవపుత్రాస్సుధార్మికాః॥
విష్ణుశక్తిరనౌపమ్యాసత్త్వోద్రిక్తాస్థితౌస్థితా।
మన్వన్తరేష్వ శేషేషు దేవత్వేనాధితిష్ఠతి॥
అంశేనతస్యాజజ్ఞేసౌయజ్ఞస్స్వాయంభువేఽన్తరే।
ఆకూత్యాంమానసోదేవ ఉత్పనః ప్రథమేఽన్తరే॥
తతఃపునస్సవై దేవః ప్రాప్తేస్వారోచిషేఽన్తరే।
తుషితాయాంసముత్పన్నోహ్యజితస్తుషితై స్సహ॥
ఆరవ మన్వంతర మందు చాక్షుషుడు మనువు. మనోజవుడను వాడు దేవేంద్రుడు. ఆప్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, దివౌకసులు అను నైదు అష్టక గణములు దేవతలు. సుమేధ విరజుడు హవిష్మంతుడు ఉత్తముడు మధువు అతినాముడు సహిష్ణువు అను నీ యేడుగురు సప్తర్షులు. ఊరువు పూరువు శతద్యుమ్నుడు మున్నగు మహాబలులు చాక్షుష మను పుత్రులు. వీరు భూపతులు. ఇప్పుదేడవ మన్వంతరము. ఇందు వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు మనువు. ఈతడు బ్రాహ్మణుడు శ్రాద్ధదేవుడు. మహాతపస్వి, బుద్ధి మంతుడు. ఆదిత్య వసు రుద్రాదులు దేవతలు. పురందరుడను వాడు దేవేంద్రుడు. వసిష్ఠుడు కాశ్యపుడు అత్రి జమదగ్ని గౌతముడు విశ్వామిత్రుడు భరద్వాజుడు నీ యేడుగురు సప్తర్షులు. ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు నాభాగుడు రిష్టుడు కరూషుడు పృషద్రుడు అను నీ తొమ్మండుగురు వైవస్వత మనువు పుత్రులు. మిక్కిలి ధార్మికులు. సాటిలేనిదియు సత్త్వ గుణ ప్రధానమునగు విష్ణు శక్తి (అంశము) అన్ని మన్వంతరము లందును సర్వ జగద్రక్షకముగా యజ్ఞాది దేవతా రూపమున నుండును. దానికి విష్ణ్వంశముతోనే స్వాయంభువ మన్వంతరమున యజ్ఞము పుట్టినది. ప్రథమ మన్వంతరమున ఆకూతికి మానసదేవుడు పుట్టెను. అతడు స్వారోచిష మన్వంతరమున తుషితయందు పుట్టి తుషితులతో నజయుడై యుండెను.
ఔత్తమేచా న్తరేచాపితుషితస్తుపునస్సవై।
సత్యాయామభవత్సత్యససత్యైస్సహసురోత్తమైః॥
తామసస్యాన్తరేచాపిసంప్రాప్తేపునరేవహి।
హర్యాయాంహరిభిస్సార్థంహరిరేవబభూవహ॥
రైవతేఽప్యన్తరేదేవస్సంభూత్యాంమానసోఽభవత్।
సంభూతోమానసై స్సార్థం దేవై ర్దేవవరోహరిః॥
ఉత్తమ మన్వంతరమున ఆ తుషితుడే సత్యయందు సత్య దేవతలలో సత్యుడను పేరున బుట్టెను. తామస మన్వంతరము నందు హర్యయందు హరులతో కూడా హరియే (విష్ణువే) పుట్టెను. రైవత మన్వంతరము నందు ఆతడే సంభూతి యందు మానసుడుగా విష్ణువే దేవతలతో పుట్టెను.
చాక్షుషస్యాన్తరేదీవోవైకుణ్ఠః పురుషోత్తమః।
వికుణ్ఠాయామసౌజజ్ఞేవై కుంణ్ఠైర్దైతైస్సహ॥
మన్వన్తరేఽత్రసం ప్రాప్తేతథావైవస్వతే ద్విజ।
వామనః కాశ్యపాద్విష్ణురదిత్యాంసాంబభూవహ॥
త్రిభిః క్రమైరిమాన్ లోకాన్ జిత్వాయేనమహాత్మనా।
పురందరాయ త్రైలోక్యం దత్తం నిహతకణ్టకమ్॥
ఇత్యేతా స్తనవ స్తస్యసప్తమన్వన్తరేషువై।
సప్తచైవాభవన్విప్రయాభిస్సంవర్దితాః ప్రజాః॥
యస్మాద్విష్టమిదంసర్వం తస్యశక్త్యామహాత్మనః।
తస్మాత్సప్రోచ్య తేవిష్ణుర్విశేర్దాతోః ప్రవేశనాత్॥
సర్వేచదేవామనవస్సమస్తాస్సప్తర్షయోయేమనుసూనవశ్చ।
ఇన్ద్రశ్చయోఽయంత్రిదశేశభూతో విష్ణోరశేషాస్తువిభూతయస్తాః॥
చాక్షుష మన్వంతరమున పురుషోత్తముడగు వైకుంఠవాసి వికుంఠ యందు వైకుంఠ దేవతలతో గూడ పుట్టెను. ఈ వైవస్వంత మన్వంతరమున విష్ణువు కాశ్యపుని వలన అదితి యందు వామనుడుగ పుట్టెను. ఆ మహానుభావుడు మూడు అడుగులచే ముల్లోకముల నాక్రమించి నిష్కంటకము చేసి యింద్రున కిచ్చెను. ఈ రీతిగా సప్త మన్వంతరము లందును నా మహా విష్ణు శరీరములే పుట్టి ప్రజాభి వృద్ధిని చేసినవి. ఈ ప్రపంచ మంతయు నాతని శక్తిచే ప్రవిష్టమై యున్నది. విశతి = ప్రవిశతి ప్రపంచమితి. ప్రపంచ మందు ప్రవేశించిన వాడు కావున విష్ణువను పేరు. కావున సమస్త దేవతలు మనువులు సప్తర్షులు మను పుత్రులు దేవేంద్రులు వీరందరు విష్ణుదేవుని విభూతులే.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
A complete enumeration of all fourteen Manvantaras with their presiding Manus, Indras, Saptarṣis, deva-gaṇas, and — most distinctively — the form (rūpa) of Bhagavān Viṣṇu who descends in each Manvantara. The seven past Manvantaras have the following Viṣṇu rūpas: Yajña (1st, Svāyambhuva), Vibhu (2nd, Svārocisa), Satyasena (3rd, Uttama), Hari (4th, Tāmasa), Vaikuṇṭha (5th, Raivata), Ajita (6th, Cākṣuṣa), and Vāmana (7th, Vaivasvata). For the seven future Manvantaras (8–14), their avatāras are named as Sārvabhauma, Ṛṣabha, Viṣvaksena, Dharmasetu, Svadhāma, and future forms for the 13th and 14th.