విష్ణు మహా పురాణము

3 - కాల స్వరూపము

శ్రీమైత్రేయుడు:

నిర్గుణస్యా ప్రమేయస్య శుద్దస్యా ప్య్మలాత్మనః

కథంసర్గాదికర్ తృత్వం బ్రహ్మణోభ్యుపపద్యతే

శ్రీ మైత్రేయుడు:

“గుణము లేని దేశకాలాది కొలతల కందని దేహము లేని శుద్దమైన వాడు సహకారి సామగ్రి లేనివాడు పుణ్యపాప సంస్కారములు రాగాది గుణములు లేని పరబ్రహ్మ పుట్టించుట పెంచుట త్రుంచుట మొదలగు కార్యక్రమము నందు కర్తయగు యెట్లు పోసగును?”.

శ్రీ పరాశరుడు:

శక్తయ స్సర్వభావానా మచిన్త్యజ్ఞానగోచరాః

యతోఽతో బ్రహ్మణస్తౌస్తూ సర్గాద్యాఽభావశక్తయః

భవన్తి తపతాంశ్రేష్ఠ పావకస్య యథోష్ణతా

తన్నిబోధ యథాసర్గేభగవాన్ సంప్రవర్తతే

నారాయణాఖ్యోభగవాన్ బ్రహ్మలోక పితామహః

ఉత్పన్నః ప్రోచ్యతే విద్వాన్నిత్య ఏవోపచారతః

నిజేన తస్య మానెన ఆయుర్వర్శశతం స్మృతమ్

తత్పరాఖ్యం తదర్ధంచ పరార్ధమాభిధీయతే

శ్రీపరాశరుడు:

“మణి మంత్రౌషధ్యాదులు యొక్క శక్తులు అచింత్యమైన జ్ఞానమునకే గోచరములగును. అచింత్య జ్ఞానమనగా తర్కమునకు లొంగనిది. భిన్నాభిన్నత్వాది వికల్పములచే నూహించుటకు వశము గానిది, కేవలము అర్దాపత్తి ప్రమాణ విషయము లన్నమాట. అగ్నికి దాహశక్తి వలె పరబ్రహ్మకు గూడ సృష్ట్యాది హేతువులయిన స్వభావ సిద్దములయిన శక్తులు గల వన్నమాట. స్వభావ సిద్దము లనగా నవి యాయన స్వరూప భూతములే. కనుకనే మణి మంత్రౌషధ్యాదులచే మరి యే యితరమైన వేడిమినైన నివారింప వచ్చును గాని స్వభావమైన పరబ్రహ్మ యొక్క యీ శక్తులను వారింప శక్యము గాదు. కావుననే యాయన యీ యైశ్వర్యము నిరంకుశము. ఓ తపస్వి శ్రేష్ఠ! భగవంతుడు సృష్టి యందేట్లు ప్రవర్తిన్చునో యెఱుంగుము. నారాయణుడే బెహ్మయు లోకపితా మహుండునైతనంత తా నావిర్భవించగా భగవంతుడు (స్వయంభువు) పుట్టినాడని లోకములో జీవుల పుట్టుకతో పోల్చి చెప్పుట ఔపచారికము. అట్టివాని పరమాయువు బ్రహ్మ మానముచే నూరేండ్లు పూర్వ పదార్ధము. తరువాతి యేబదేండ్లు రెండవ పరార్ధ (ద్విపరార్ధ) కాలమని చెప్ప బడినది.

కాలస్వరూపం విష్ణోశ్చయన్మయోక్తం తవానఘ

తేన తస్య నిబోధ త్వం పరిమాణోపపాదనమ్

కాష్ఠా పఞ్చదశాఖ్యాతా నిమేషా మునిసత్తమ

కాష్ఠాత్రింశత్కలత్రింశత్కలామౌహూర్తికోవిధిః

తావత్సంఖ్యై రహోరాత్రం ముహూర్తై ర్మానుషం స్మృతమ్

అహోరాత్రాణితావన్తి మాసః పక్షద్వాయాత్మకః

తైష్షద్భిరయనం వర్షంద్వేయనే దక్షిణోత్తరే

అయనందక్షిణా రాత్రి ర్దేవానా ముత్తరందినమ్

దివ్యిర్వర్షసహ స్రైస్తు కృతత్రేతాది సంజ్ఞకమ్

దివ్యాబ్దానాం సహస్రాణి యుగేష్వాహుః పురావిదః

తత్ర్పమాణై శ్శతై స్సంధ్యా పూర్వా త త్రాభిదీయతే

సంధ్యాం శశ్చాపి తత్తుల్యో యుగస్యానన్తరోహి సః

సంధ్య సంధ్యంశయోరన్తర్యః కాలో మునిసత్తమ

యుగాఖ్యః స తువిజ్ఞేయః క్రుతత్రేతాదిసంజ్ఞితః

కృతం త్రేతా ద్వాపరశ్చ కలిశ్చేతి చతుర్యుగమ్

ప్రోచ్యతేతత్సహశ్రంచ బ్రాహ్మణోదివసం మునే

విష్ణువు యొక్క కాల స్వరూపమిది. మఱి ఆ బ్రహ్మ యొక్క యితర చరాచర జీవుల యొక్క జీవనకాల పరిమాణము నెరింగి కొనుము. (పరిణామము అను పాఠాంతరమున జీవుల యొక్క అవసాన స్థితి కూడా నెరింగి కొనుమని అన వచ్చును). దానికి యనువైన కాలమాన మిది. 15 నిమిషములు ఒక కాష్ఠ. 30 కాష్ఠలు 1 కల. 30 కలలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 దినము(1 పగలు + 1 రాత్రి). 30 దినములు ఒక మాసము. 15 దినములు ఒక పక్షము (శుక్ల పక్షము, కృష్ణ పక్షము). 2 పక్షములు ఒక మాసము. 6 మాసములు ఒక ఆయనము. 2 ఆయనములు (ఉత్తర, దక్షిణాయనములు) 1 సంవత్సరము. ఉత్తరాయణము 5 మాసములు దేవతలకొక పగలు పితృ దేవతలకు రాత్రి. దక్షిణాయనము 6 మాసములు దేవతల రాత్రి, పితృ దేవతలకు పగలు. దేవతలు వేయి సంవత్సరములు (దివ్య) ఒక మహా యుగము. నాలుగు వేల దివ్య సంవత్సరము లనగా,

యుగములు

కృత యుగము = 4 వేల దివ్య సంవత్సరములు.

త్రేతా యుగము = 3 వేల దివ్య సంవత్సరములు.

ద్వాపర యుగము = 2 వేల దివ్య సంవత్సరములు.

కలి యుగము = 1 వేయి దివ్య సంవత్సరములు.

యుగ సంధ్య

కృత యుగము = 4వందల దివ్య సంవత్సరములు.

త్రేతా యుగము = 3 వందల దివ్య సంవత్సరములు.

ద్వాపర యుగము = 2 వందల దివ్య సంవత్సరములు.

కలి యుగము = 1 వంద దివ్య సంవత్సరములు.

యుగ సంధ్యాంశము

కృత యుగము = 4వందల సంవత్సరములు.

త్రేతా యుగము = 3 వందల సంవత్సరములు.

ద్వాపర యుగము = 2 వందల సంవత్సరములు.

కలి యుగము = 1 వంద సంవత్సరములు.

ఈ విధముగా యుగ పరిమాణము మొత్తము 10 వేల + సంధ్య, సంధ్యంశము మొత్తము 2 వేలు 12 వేల దివ్య సంవత్సరములు ఓకే మహా యుగము. ఇట్టివి వేయి దివ్య మహాయుగములు బ్రహ్మకొక పగలు. ఆయన పగటి వేళ మనువులు పదునాలుగు ఆయా కాలములో సప్తర్షులు, దేవతలు, ఇంద్రుడు, మనువు ఆయన కుమారులునేక కాలము నందే సృజింప బడుదురు. ఉప సంహరింప బడుదురు. 71 చతుర్యుగములు (మహా యుగములు) ఒక మన్వంతరము. అది మనువు కాలము. ఇంద్రర్షి మను పుత్రుల కాలమిది. ఒక కోటి యిరువది లక్షల దివ్య సంవత్సరములు బ్రహ్మ యొక్క దివస ప్రమాణము.

బ్రాహ్మణోదివసే బ్రహ్మన్ మనవస్తుచతుర్దశ

భవన్తి పరిణామంచ తేశాంకాలకృతంశృణు

సప్తర్శయస్సురాశ్షక్రో మనుస్తత్సూనవోనృపాః

ఏకకాలే హి సృజన్త్యే సంహ్రియంతేచ పూర్వవత్

చతుర్యుగాణాంసంఖ్యాతాసాధికా హ్యేకసప్తతిః

మన్వతరం మనోః కాలః సురాదీనాంచ సత్తమ

అష్టౌశతసహస్రాణిదివ్యయా సంఖ్యాయాస్మృతమ్

ద్విపఞ్చశాత్తథాన్యాని సహస్రాణ్యధికానితు

త్రింశత్కోట్యస్తు సంపూర్ణాసంఖ్యాతాస్సంఖ్యయాద్విజ

సప్తషష్టి స్తథాన్యాని నియుతాని మహామునే

వింశతిశ్చసహస్రాణి కాలోయ మధికంవినా

మన్వన్తరస్యసంఖ్యేయం మానుషైర్వత్సరైర్ద్విజ

చతుర్దశగుణోశహ్యేషకాలో బ్రాహ్మమహస్మృతమ్

 బ్రాహ్మోనైమిత్తికొనామతస్యాన్తే ప్రతిసంచరః

తదాహి దాహ్యతేస్వరం త్రైలోక్యం భూర్భువాదికమ్

జనంప్రయాన్తి తపార్తామహర్లోకనివాసినః

ఏకార్ణ వేతుత్రైలోక్యే బ్రహ్మానారాయణాత్మకః

భోగిశయ్యాంగత శ్షేతే త్రైలోక్యగ్రాసబృంహితః

జనస్ థై ర్యోగిభిర్దేవః చిన్త్య మనోబ్జసంభవః

తత్ప్రమాణాం హితాంరాత్రిం తదన్తే సృజతేపునః

ఏవంచ బ్రాహ్మణోవర్షమేవం వర్షషతంతుతత్

శతంహితస్యవర్షాణాం పరమాయుర్మహాత్మనః

ఏకమస్యాప్యాతీతంతుఽపరార్ధం బ్రహ్మణోఽనఘ

తస్యాన్తేభూన్మహాకల్పః పాద్మ ఇత్యభిమిశ్రుతః

ద్వితీయస్యపరార్ధస్యవర్తమానస్యవైద్విజ

వరాహఇతికల్పోఽయం ప్రథమః పరికీర్తితః

అందు పదునలుగురు మనువులు గతింతురు. అనగా ఒక మంవంతరమునకు ఎనిమిది లక్షల యేబది యేడు వేల నూట నలుబది మూడు దివ్య వర్షములు ప్రమాణము. అది మనుష్య మనమున ముప్పదికోట్ల ఎనుబది యైదు లక్షల డెబ్బది యొక్క వేయి నాలుగు వందల యిరువది తొమ్మిది సంవత్సరములు. బ్రహ్మ యొక్క పగటి చివర నైమిత్తిక ప్రళయము (ప్రతి సంచరము) కల్గును. ముల్లోకములును తగలబడి పోవును. ఆ వేడి కోర్వక మహాలోక మందలి జనులు జనలోకమున కేగుదురు. అంతయు నొకే సముద్ర మగును. అపుడు బ్రహ్మ నారాయణ స్వరూపుడయి ముల్లోకములను మ్రింగి కడుపులో నిమిడించు కొని శేష తల్పమున శయనించును. భగవంతు డయిన విష్ణువు నీటిపై శేష శయ్యాయందు సృష్టికర్త యగు బ్రహ్మ యాయన నాభి కమల మందును నిద్రింతురు. అపుడు జనలోక గతులగు యోగులాయనను ధ్యానించు చుందురు. సరిగా నదే ప్రమాణమున రాత్రిని గడిపి ఆవల యాయన మరల సృష్టి కావించును. ఇట్టి దినములు, పక్షములు మాసముల లెక్కచే నొక్క సంవత్సరమై యట్టివి నూరేండ్లు బ్రహ్మకు పరమాయుర్ధాయమగును. ఇపుడా బ్రహ్మకు ‘పాద్మమహా కల్పమను’ పేరా నొక పదార్ధము గతించినది. ద్వితీయ పరార్ధ మందిపుడు వరాహ కల్పము అనుఁ బేరుగల మొదటి కల్పము నడుచు చున్నది.