పూరోర్జనమేజయః తస్యాపి ప్రచిన్వాన్ ప్రచిన్వతః ప్రవీరః ప్రవీరాన్మనుస్యు మనస్యోశ్చాభయదః తస్యాపిసుద్యుస్సుద్యోర్భహుగతః తస్యాపిసం యాతిస్సంయాతే రహం యాతిస్తతోరౌద్రాశ్వః॥
ఋత్వేపుకక్షేపుస్థండిలేపు కృతేపు జలేపు ధర్మేపుధృతేపుస్థలేపు సన్నతేపు వనేపునామానో రౌద్రాశ్వస్యదశపుత్రాబభూవుః॥
ఋతేపోరన్తినారః పుత్రోఽభూత్॥
సుమతి మప్రతిరథం ధృవంచా ప్యన్తినారః పుత్రా నవాప॥
అప్రతిరథస్యకణ్వః పుత్రోఽభూత్॥
తస్యాపిమేధాతిథిః॥
యతః కణ్వాయనాద్విబభూవుః॥
పూరుడు జనమేజయుడు ప్రవిన్వంతుడు ప్రవీరుడు మనస్యుడు అభయదుడు సుద్యుడు బహుగతుడు సంయాతి అంయాతి రౌద్రాశ్వుడు వరుసగా తండ్రి కొడుకులు. రౌద్రాశ్వుని కొడుకులు పదిమంది. ఋత్వేపు కక్షేపు స్థండిలేపు కృతేపు జలేపు జలేపు ధర్మేపు స్థలేపు సన్నతేపు వనేపు ననువారు. ఋతేపువు కొడుకు అన్తినారుడు. అతనికి సుమతి అప్రతిరథుడు ధ్రువుడు ననువారు పుత్రులు. అప్రతిరథునికి కణ్వుడు వానికి మేధాతిథి కల్గిరి. ఇతనికి కణ్వాయనులని ద్విజులు గల్గిరి.
అప్రతిరథస్యాపరః పుత్రోఽభూదై లీనః॥
ఐలీనస్యదుష్యన్తాద్యాశ్చత్వారః పుత్రాబభూవుః॥
దుష్యన్తాచ్చక్రవర్తీభరతోఽభూత్॥
యన్నామహేతుర్దేవైశ్శోకోగీయతే॥
మాతా భాస్త్రాపితుః పుత్రో యేనజాత స్స ఏవసః।
భరస్వపుత్రం దుష్యన్త మావమం స్థాశ్శకున్తళామ్॥
రేతోధాః! పుత్రోనయతి నరదేవ! యమక్షయాత్।
త్వంచాస్యధాతాగర్భస్య సత్యమాహ శకున్తళా॥
భరతస్య పత్నీత్రాయే నవ పుత్రా బభూవుః॥
నైతే మమానురుపా ఇత్యభిహితా స్తన్మాతరః।
పరిత్యాగభాయా త్తత్పుత్రాన్ జఘ్నుః॥
తతోఽస్య వితథే పుత్రజన్మని పుత్రార్థినో మరుత్సోమయాజినో దీర్ఘతమసః పార్ ష్ణ్యసా స్తద్ బృహస్పతివీర్యా దుతథ్యాపత్న్యాం మమతాయాం సముత్పన్నోభారద్వాజఖ్యః పుత్రోమరుద్భిర్దత్తః॥
తస్యాపినామనిర్వచనశ్లోకః పఠ్యతే॥
మూఢే! భర! ద్వాజమిమం భారద్వాజం బృహస్పతే!
యదౌయదుక్త్వాపితరౌభరద్వాజస్త్వయమితి॥
భరద్వాజస్స తస్యవితథేపుత్రజన్మని మరుద్భిర్థత్తః తతోవితథసంజ్ఞామవాప॥
అప్రతిరథునికి రెండవ కొడుకు ఐలీనుడు. అతనికి దుష్యంతుడు మొదలగు నలుగురు కుమారులు. దుష్యంతునకు భరతుడు చక్రవర్తి గల్గెను. ఈతని కీ పేరు గల్గుటకు దేవతలు గానము చేసిన శ్లోకముల తాత్పర్యమిది. తల్లి చర్మపు తిత్తి. దాని వలన పుట్టిన పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడే. తిత్తిలో నుంచిన ద్రవ్యము తిత్టిది గాదు. ఆ ద్రవ్యము ఉంచిన వానిదే. ఎవని వలన పుత్రుడు పుట్టెనో, ఆతడే యాతడు ‘ఆతావై పుత్ర నామాసి’ అని శృతి. ఓ దుష్యంతుడా! పుత్రుని భరింపుము. శకుంతల నవమానింపకుము. రేతో ఆధానము చేసిన వాడా! ఓ రాజా! పుత్రుడు యమలోకము నుండి స్వర్గమును చేర్చును. నీ గర్భమునకు (శిశువునకు) దాతవు. శకుంతల నిజము చెప్పినది. భరతుని ముగ్గురు భార్యలందు తొమ్మండ్రుగురు పుత్రులు గల్గిరి. ఈ పిల్లలు నాకు అనురూపులు గారని యాతడన్నందులకు వారిని పరిత్యజించునన్న భయముచే వారినా తల్లులే చంపిరి. అందువలన నితని పుత్రజన్మ మట్లు వ్యర్తమై పోగా పుత్రార్థియై మరుత్సోమ యాగము చేయగా గర్భగతుడు, దీర్ఘతమసుని ప్రక్కన బృహస్పతి యన్నయగు నుతధ్యుని భార్యయగు మమత యొక్క గర్భమున విడిచిన బృహస్పతి యొక్క వీర్యమున మమత యందు పుట్టి భరద్వాజుడు మరుద్దేవతలచే నీయబడెను. అతని నామ నిర్వచనము సేయు శ్లోక తాత్పర్యమిది. ఓ మూడురాలా! ద్వాజం (ఇద్దరి వలన జన్మించిన) ఈ భరద్వాజుని నీవు భరింపుము. ఓ బృహస్పతి నీవు భరింపుము. అని పరస్పరము వీని తల్లిదండ్రులిట్లు పలికి వెళ్ళిపోయిరి. అందునితడు భరద్వాజుడైనాడు. ఆ భరద్వాజుడు భరతుని పుత్రా జన్మ (వితథమై) వ్యర్థమై పోగా మరుత్తులచే నివ్వబడి నందున వితథుడను పేరొందెను.
వితథస్యాపిమన్యుః పుత్రోఽభవత్॥
బృహత్ క్షత్రమహావీర్యనగరగర్గా అభవన్మన్యు పుత్రాః॥
నగరస్యసంకృతి స్సంకృతేర్గురుప్రీతి రన్తిదేవౌ॥
గర్గాచ్చినిః తతశ్చగార్ గ్యాశ్శైన్యాః క్షత్రోపేతా ద్విజాతయోబభూవుః॥
మహావీర్యాచ్చదురుక్షయోనామపుత్రోఽభవత్॥
తస్య త్రయ్యారుణిః పుష్కరిణః కపిశ్చపుత్రత్రయ మభూత్॥
తచ్చపుత్ర త్రితయమాపిశ్చాద్విపతా ముపజగామ॥
బృహత్ క్షత్రస్య సుహోత్రః॥
సుహోత్రాద్దస్తీ యిదం హస్తినపుర మావాసయామాస॥
అజమీఢద్విజమీఢపురుమీఢాస్త్రయోహస్తినస్తనయాః॥
అజామీఢాత్కణ్వః॥
కణ్వానమేధాతిథిః॥
యతః కణ్వయనాద్విజాః॥
అజమీఢస్యాన్యః పుత్రోబృహదిషుః॥
బృహదిషోః బృహద్ధను బృహద్దనుషశ్చ బృహత్కర్మాతతశ్చజయద్రథ స్తస్మాదపివిశ్వజిత్॥
తతశ్చసేనజిత్॥
రుచిరాశ్వకాశ్యదృఢహనువత్సహనుసంజ్ఞాస్సేనజితః పుత్రాః॥
రుచిరాశ్వపుత్రః పృథుసేనః పృథుసేనాత్పారః॥
పారాన్నీలః॥
తస్యైకశతం పుత్రాణామ్॥
తేషాం ప్రధానః కామ్పిల్యాధిపతిః సమరః॥
సమరస్యాపి పారసుపారసదాశ్వా స్త్రయః పుత్రాః॥
సుపారాత్పృథుః పృథోస్సుకృతిస్తతోవిభ్రాజః॥
తతశ్చాణుహః॥
యశ్శుకదుహితరం కీర్తింనా మోపయేమే॥
ఆణుహా ద్బ్రహ్మదత్తః॥
తతశ్చవిశ్వక్సేనస్తస్మాదుదక్సేనః॥
భల్లాభాస్తస్యచాత్మజః॥
ద్విజమీఢస్యతు యవీనరసంజ్ఞః పుత్రః॥
తస్యాపిధృతిమాన్ తస్మాచ్చసత్యధృతి స్తతశ్చదృఢనేమిః తస్మాచ్చసుపార్ శ్వ స్తతస్సుమతి స్తతశ్చసంనతిమాన్॥
సంనతిమతః కృతః పుత్రోఽభూత్॥
యంహిరణ్యనాభోయోగమధ్యాపయామాస॥
యశ్చతుర్వింశతిం ప్రాచ్యసామగానాం సంహితాశ్చకార॥
కృతాచ్చోగ్రాయుధః॥
యేన ప్రాచుర్యేణ నీపక్షయః కృతః॥
ఉగ్రాయుధాత్ క్షేమ్యః క్షేమ్యాత్సుధీరస్తస్మాద్రిపుజయస్తస్మాచ్చబహురథ ఇత్యేతేపౌరవాః॥
వితథుని కొడుకు మన్యువు. అతనికి బృహత్ క్షత్ర మహావీర్య నగర గర్గులను వారు పుత్రులు. నగరునికి సంకృతి అతనికి గురుప్రీతి, రంతిదేవులు గల్గిరి. గర్గునికి శిని కలిగే. అతని నుంచి గార్గ్యులు శైన్యులు ననువారు క్షత్రమిశ్రులై నద్వి జాతులు కల్గెను. మహావీర్యునికి దురుక్షయుడు గల్గెను. అతనికి త్రయ్యారుణి పుష్కరిణుడు కపియను ముగ్గురు సుతులు గల్గిరి. ఆ ముగ్గురును దర్వాత విప్రత్వము నొందిరి. బృహత్ క్షత్రునికి సుహోత్రుడు అతనికి హస్తియు గల్గిరి. ఇతడే హస్తినపురమును నిర్మించెను. హస్తి యొక్క తనయులు అజమీడ, ద్విజమీడ, పురుమీడులు ముగ్గురు. అజమీడునికి కణ్వుడు అతనికి మేదాతిథియుం గల్గిరి. ఆ వంశము వారు కణ్వాయను లనబడిరి. అజమీడుని మరియొక కొడుకు బృహదిషువు. అతనికి బ్రహద్ధనువు, అతనికి బృహత్కర్మ, వానికి జయద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి సేనజిత్తు గల్గిరి. సేనజిత్తు కొడుకులు రుచిరాశ్వ, కాశ్వద్రుడహను, వత్సహన్వాదులు కొడుకులు. రుచిరాశ్వ పుత్రుడు పృథుసేనుడు వానికి పారుడు వానికి నీలుడు అతనికి నూరుగురు పుత్రులు గలిగిరి. వారిలో ముఖ్యులు కాంపిల్యాధిపతి సమరుడు. అతనికి పార, సుపార, సదశ్వులు ముగ్గురు కొడుకులు. సుపారునికి పృథువు, అతనికి సుకృతి, అతనికి విభ్రాజుడు, అతనికి అణుహుడు గల్గిరి. అణుహుడు శకుని కూతురు కీర్తిని పెండ్లాడెను. అనుహుణుకి బ్రహ్మదత్తుడు, అతనికి విష్వక్సేనుడు, అతనికి ఉదక్సేనుడు, అతనికి భల్లాభుడుం గల్గిరి. ద్విజమీడుని కుమారుడు యవీనరుడు. వానికి కృతుడుం గల్గిరి. ఇతనిచే హిరణ్యనాభుడు యోగ శాస్త్రము నధ్యయనము సేయించెను. ఇతడు ప్రాచ్యసామగుల యొక్క సంహితల నిరువది నాల్గింటిని చేసినాడు. కృతుని కుమారుడు ఉగ్రాయుధుడు, ఇతడు నీపక్షయము బ్రచురముగా జేసెను. (నీపులను శత్రురాజులను హతమార్చెనన్న మాట) ఉగ్రాయుధుడు, క్షేమ్యుడు, సుధీరుడు, రిపుంజయుడు, బహురథుడు ననువారు తండ్రి కొడుకులు పౌర వంశము వారు.
అజమీఢస్యనళినీనామపత్నీ, తస్యాం నీలసంజ్ఞః పుత్రోఽభవత్॥
తస్మాదపిశాన్తిశ్శాన్తేః పురంజయః తస్మాచ్చఋక్షః॥
తతశ్చహర్యశ్వః॥
తస్మాన్ముద్గలసృఞ్జయబృహదిషుయవీనరకాంపిల్య సంజ్ఞాపఙ్చానామేవతేషాం విషయాణాం రక్షణాయాలమేతేమత్పుత్రా ఇతిపిత్రాఽభిహితాః పాఞ్చాలాః॥
ముద్గులాచ్చమౌద్గల్యాః క్షత్రోపేతాద్విజాతయాబభూవుః॥
ముద్గలాద్దర్యశ్వః॥
హర్యశ్వాద్దివోదాసోఽహాల్యచమిథునమభూత్॥
శరద్వతశ్చాహాల్యయాంశతానన్దోఽభవత్॥
శతానన్దాత్సత్యధృతిర్ధనుర్వేదాన్తగోజజ్ఞే॥
సత్యధృతేర్వరాప్సరసమూర్వశీం దృష్ట్వారేతస్స్కన్నం శరస్తమ్భేపపాత॥
తచ్చద్విధాగతమపత్యద్వయం కుమారః కన్యాచాభవత్॥
తౌచమృగయాముపయాతశ్శంతనూర్ దృష్ట్వాకృపయాజగ్రాహ॥
తతః కుమారః కన్యాచాశ్వత్థామ్నోజననీకృపీ ద్రోణాచార్యస్యపత్న్యభవత్॥
దివోదాసస్యపుత్రోమిత్రాయుః॥
మిత్రాయోశ్చ్యవనోనామరాజా॥
చ్యవనాత్సుదాసాత్సౌదాసః సౌదాసాత్సహదేవస్తస్యాపిసోమకః॥
సోమకాజ్జన్తుః పుత్రశతజ్యేష్ఠోఽభవత్॥
తేషాంయవీయాన్ పృషతః పృషతాద్ద్రుపదస్తస్మాచ్చధృష్టద్యుమ్నస్తతోధృష్టకేతుః॥
అలమీఢుణి భార్య నళిని నీలుడు గల్గెను. అటుపై శాంతి సుశాన్తి పురంజయుడు ఋక్షుడు హర్వశ్వుడు తండ్రి కొడుకులు. హర్యశ్వునికి ముద్గలుడు సృంజయుడు బృహదిషువు యవీనరుడు కాంపిల్యులను పేర నైదుగురు కల్గిరి. ఈ నాపుత్ర పంచకము నేలుదురని తండ్రి పేర్కోనుట వలన పాంచాలురనంబడిరి. ముద్గాలుని వలన మౌద్గాల్యులను క్షత్రవంశ సంబంధము నందిన ద్విజులు గల్గిరి. ముద్గలునికి హర్వశ్వుడు వానికి దివోదాసుడు అహల్యయు నను మిథునము జనించెను. శరద్వతునకు అహల్యయందు శతానందు డుదయించెను. శాతానందునికి సత్యధృతి యను ధనుర్వేద పారంగతు డుదయించెను. సత్యధృతికి నూర్వశిం జూచినంత రేతః స్ఖలనమై రెల్లు స్తంభమందు బడెను. అదియు రెండు భాగము లయ్యె. దాన నొక కుమారుడు కుమారికయుం జనించిరి. వెతకేగిన శంతనుడు వారిం జూచి దయతో స్వీకరించెను. అందు వలన బాలుడు కృపాచార్యుడు బాలిక కృపి యయ్యెను. ఆ కృపి ద్రోణాచార్యులకు పత్నియయ్యె. వారి కశ్వత్థామ జనించెను. దివోదాసుని పుత్రుడు మిత్రాయువు. అతనికి కుమారుడు చ్యవనుడను రాజు. అతనికి సుదాసుడు అతనికి సౌదాసుడు అతనికి సహదేవుడు అతనికి సోమకుడు అతనికి జంతువు అనువాడు నూర్గురు కొడుకులలో జ్యేష్టుడు. వారిలో చివరివాడు పృషతుడు. అతనికి ద్రుపదుడు. అతనికి ధృష్టద్యుమ్నుడు అతనికి ధృష్టకేతువుం గల్గిరి.
అజమీఢస్యాన్యోఋక్షనామాపుత్రోఽభవత్॥
తస్యసంవరణః॥
సంవరణాత్కురుః॥
యఇదం ధర్మక్షేత్రం కురుక్షేత్రం చకార॥
సుధనుర్జహ్నుపరీక్షిత్ప్రముఖాః కురోః పుత్రాబభూవుః॥
సుధనుషః పుత్రస్సుహోత్రస్తస్మాచ్చ్యవనః, చ్యవనాత్కృతకః॥
తతశ్చోపరిచరోవసుః॥
బృహద్రథప్రత్యగ్రకుశామ్భకుకుచేలమాత్స్యప్రముఖాః వసోః పుత్రాస్సప్తాజాయన్త॥
బృహద్రథాత్కుశాగ్రః కుశాగ్రాద్వృషభః వృషభాత్పుష్పవాన్ తత్మాత్సత్యహితస్థాస్మాత్సుధన్వాతస్యచజన్తుః॥
బృహద్రథాచ్చాన్యశ్శకలద్వాజన్మాజరయా సంధితోజరాసంధనామా॥
తస్మాత్సహదేవస్సహదేవాత్సోమపస్తతశ్చశ్రుతిశ్రవాః॥
ఇత్యేతే మయా మాగధాభూపాలాః కథితాః॥
అజమీఢునికి మరియొక కుమారుడు ఋక్షుడు. అతనికి సంవరణుడు వానికి కురువు కల్గిరి. ఈ కురువే కురుక్షేత్రమును ధర్మక్షేత్రమును గావించిన యాతడు. కురువు కొడుకులు సుధన్వుడు జహ్నువు పరీక్షిత్తు మొదలయిన వారు. సుధ్వనుని పుత్రుడు సుహోత్రుడు వానికి చ్యవనుడు అతనికి కృతకుడు అతనికి ఉపరి చరవసువు గల్గిరి. బృహద్రథ ప్రత్యగ్రకుశాంబ కుచేలమాత్స్య ప్రముఖులు వసువు కొడుకు లేడ్వురు. బృహద్రథునికి కుశాగ్రుడు ఆతనికి వృషభుడు అతనికి పుష్పవంతుడు అతనికి సత్యహితుడు అతనికి సుధన్వుడు అతనికి జంతువుం గల్గిరి. బృహద్రథుని యింకొక కొడుకు జరాసంధుడు రెండు శకలములుగా(తొండెములుగా) బుట్టి జరయను రాక్షసిచే సంధానింప బడినందున వానికి జరాసంధుడను పేరు వచ్చెను. అతనికి సహదేవుడు అతనికి సోమపుడు అతనికి శ్రుతిశ్రవుడు గల్గిరి. ఈనే చెప్పిన వారందరూ మగధ భూపాలురు.
Summary of chapter 19 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Pūru lineage is traced through Janmejaya, Prācīnvān, Pravīra, and Raudhrāśva's ten sons. Ilīna → Duṣyanta → Bharata Cakravartī is narrated; Bharata's sons are rejected and Bharadvāja is born from Bṛhaspati's retas in Mamata's womb, abandoned, and raised by the Maruts (hence called "Vitatha"). Hasti founds Hastināpura. The Ajamīḍha lineage is given — including Kṛpa and Kṛpī born from Śaradvatī's retas in reeds; Dīvodāsa → Saudāsa → Pṛṣata → Drupada → Dhṛṣṭadyumna. Ṛkṣa → Saṃvaraṇa → Kuru (who consecrates Kurukṣetra). Uparicara-Vasu → Bṛhadratha → Jarāsandha (born in two halves, joined by the rākṣasī Jarā) → the Magadha lineage.