విష్ణు మహా పురాణము

9 - ప్రబలంబాసుర వధ

శ్రీపరాశరుడు:

తస్మిన్ రాసభదై తేయే సానుగేవినిపాతితే

సౌమ్యంతద్గోపగోపీనాం రమ్యంతాలవనంబభౌ

తతస్తౌజాతహర్ షౌతు వాసుదేవసుతావుభౌ

హత్వాధేనుకదై తేయం భాణ్డీరం వటమాగతౌ

క్ష్వేళమానౌప్రగాయన్తౌ విచిన్వన్తౌచపాదపాన్

చారయన్తౌచగా దూరే వ్యాహరన్తౌచనామభిః

నిర్ యోగాపాశస్కన్ధౌతౌవనమాలావిభూషితౌ

శుశుభాతేమహాత్మానౌబాలశృఙ్గావివర్షభౌ

సువర్ణాఞ్జనచూర్ణాభ్యాం తౌతదారూషితామ్భరౌ

మహేన్ద్రాయుధసం యుక్తౌశ్వేతకృష్ణావివామ్భుదౌ

చేరతుర్లోకసిద్దాభిః క్రీడాభిః రేమిరేతరమ్

సమస్తలోకనాథానాం నాథభూతౌభువంగతౌ

మనుష్యధర్మాభిరతౌమానయన్థౌ మనుష్యతామ్

తజ్జాతిగణయుక్తాభిః క్రీడాభిశ్చేరతుర్వనమ్

తతస్త్వాన్దోళికాభిశ్చనియుద్దైశ్చమహాబలౌ

వ్యాయామంచక్రతు స్తత్రక్షేపణీయై స్తథాశ్మభిః

శ్రీపరాశరుడు:

రాసభాసురుడు పరివారముతో గూలిన తరువాత నాతాళవనము గోపీ గోపాలురకు ప్రశాంత రమణీయ మయ్యెను. వాసుదేవ సుతులట్లు ధేనుకుం గూల్చి యానందముతో భాంఢీరవటమునకు వచ్చిరి. పాటలు పాడుచు చెట్లలో నొకరి నొకరు వెదకి కొనుచు నల్లంత దూరముసని కదుపులం గాయుచు వానిని పేరుపేరునా పిలుచుచు వనమాలా భూషితులై యా మహానుభావులు దూడ పలుపులను మూపున వేసికొని చిఱుగొమ్ముల గులుకు గిత్తలట్లు శోభించిరి. బంగారుజర్రీ గాటుకపొడి చిందిన వలువలం దాల్చి యింద్ర ధనుస్సు తోడ దీపించు తెల్లని నల్లన్ని మేఘములట్లు భాసించిరి. అఖిల లోకనాథులకు నాథులైన మహానుభావు లవని నవతరించి లోక ప్రసిద్దములైన చెడుగడి మొదలయిన పెక్కు బాలక్రీడల వినోదించు చుండిరి. మఱియు గుస్తీలు సాముగారిడీలు, ఉండేలు బ్రద్దలు, గోటీ బిళ్ళలు, వడిసెం రాళ్ళు విసరుట మొదలగు బాలక్రీడల నమ్మహా బలశాలురు తోడి బాలురతో గ్రీడింప జొచ్చిరి.

తల్లిప్సురసుర స్తత్రహ్యుభయోరామమాణయోః

ఆజగామప్రలమ్భాఖ్యోగోపవేశాతిరోహితః

సోవగాహతనిశ్శంక స్తేషాం మధ్య మమానుషః

మానుషంవపురాస్థాయప్రలమ్భోదానవోత్తమః

తయోశ్చిద్రాన్తర ప్రేప్సురవిషహ్యమమన్యత

కృష్ణంతతోరౌహిణేయం హన్తుం చక్రేమనోరథమ్

హరిణాక్రీడనం నామబాలక్రీడనకంతతః

ప్రకుర్వన్తోహితేసర్వేద్యౌద్వౌయుగపదుత్థితౌ

శ్రీమదామ్నాసహగోవిన్దః ప్రలమ్భేనతథాబలః

గోపాలై రపరైశ్చాన్యేగోపాలాః పప్లువుస్తతః

శ్రీదామానంతతః కృష్ణః ప్రలమ్బం రోహిణీసుతః

జితవాన్ కృష్ణ పక్షీయైః గోపై రన్యేపరాజితాః

తేవాహయన్తస్త్వన్యోన్యం భాణ్డీరం వటమేత్యవై

పునర్నివవృతుస్సర్వేయేయేతత్రపరాజితాః

సంకర్షణం తుస్కన్ధేనశీఘ్ర ముత్ క్షిప్యదానవః

నభస్థ్సలంజగామాశు సచన్ద్రఇవవారిదః

అసహన్ రౌహిణేయస్యసభారందానవోత్తమః

వవృ ధేసుమహాకాయః ప్రావృషీవబలాహకః

సంకర్షణస్తుతం దృష్ట్వాదగ్ధశైలోపమాకృతిమ్

స్రగ్దామలంబాభరణం మకుటాటోపమస్తకమ్

రౌద్రంశకటచక్రాక్షం పాదాన్యాసచలత్ క్షితిమ్

అభీతమనసాతేనరక్షసారోహిణీసుతః

హ్రియమాణ స్తతః కృష్ణ మిదంవచన మబ్రవీత్

వారిం పట్టుకొననెంచి యయ్యిద్దరు నాడుకొనుచున్న తఱి ప్రలంబాసురుడు గోపా వేషము వేసికొని అమానుషుడు (రక్కసుడు) గోపాలుర నడమ నిశ్శంకముగా వచ్చి చేరెను. అయిద్దరన్నదమ్ముల నేమరియుండు సమయము గనిపెట్టుచు కృష్ణుని, బలరాముని సహింపరాని వారని గ్రహించి తుదముట్టింప నుబలాట పడెను. “హరిణాక్రీడనము” (లేళ్ళవలె గంతులు వేయుచు వెళ్ళుచున్న యిద్దరిలో ముందు వెళ్ళినవాడు జేత) అను పేర యోకానొక బాలక్రీడకుం జొచ్చి గోపాలు రెల్లరు నిద్దరిద్దరు జంటలుగా నయ్యాటం దలపడిరి. శ్రీదామునితో గోవిందుడు ప్రలంబునితో బలరాముడుం మఱియుం గల గోపాలురతో గోపాలురు నెగురుట కారంభించిరి. కృష్ణుడు శ్రీదాముని హలిబ్రలంబుని నోడించిరి. కృష్ణ పక్షీయులగు గోపకులన్యులం గోపాలుర నోడించిరి. ఒకరి నొకరు మోసికొని భాండీరవటమున కేగి తిఱిగి యటనుండి యిటకోడిన వారోడని వారిని మోచికొని రావలయునని పందెము సరచుకొనిరి. ప్రలంబాసురుడు సంకర్షుణుని మూపున కేక్కించుకొని తటాలున నెగిరి యా క్షణమే చంద్రుని తోడి మబ్బువలె నాకసమునకు బోయెను. ఆ దానవుడు బలరాముని బరువు మోయలేక యొడలు పెంచనారంభించి వర్షా కాలమున మేఘమట్లు విజృంభించెను. హలి వానిని దావాగ్ని ఎఱయైన పర్వత మట్లున్న వానిని పూలమాలలు గుత్తుక వ్రేలాడ నెత్తిపై కిరీటమూని యున్న వానిని రౌద్రరూపుని బండి చక్రమట్లున్న మిడిగ్రుడ్ల వానిని యడుగుమోప భూమి కంపించు చున్న వానిని జడుపు గిడుపులేని యా రక్కసునిచే రోహిణీ తనయుడు మోచుకొని పోబడి యంతట కృష్ణుని కిట్లనియె.

కృష్ణ కృష్ణ హ్రియామ్యేషపర్వతోదగ్రమూర్తినా

కేనాపిపశ్యదైత్యేనగోపాలచ్చద్మరూపిణా

యదత్రసాం ప్రతంకార్యంమయామదునిషూదన

తత్కాథ్యతాం ప్రయాత్యేషదురాత్మాఽతిత్వరాన్వితః

కృష్ణ కృష్ణా! పెద్ద పర్వత మట్లున్న వీడెవ్వడు ఒకానొక మయా గోపాలకుడగు దైత్యుడు నన్ను మోచికొని పోవుచున్నాడు. ఓ మధుసూదనా! ఇప్పుడే నేమి సేయ వలయునది సెప్పుము. ఈ క్రూరుడు తురతుర బోవుచున్నాడు.

శ్రీపరాశరుడు:

తమాహరామం గోవిన్ధస్స్మితభిన్నోష్ఠసంపుటః

మహాత్మారౌహిణేయస్యబలవీర్య ప్రమాణవిత్

శ్రీపరాశరుడు:

అన విని గోవిందుడు నగవున బెదవులదర బలరాముని బలవీర్య ప్రమాణ మెఱిగిన ప్రొడ గావున నతనితో నిట్లనియె

శ్రీకృష్ణుడు:

కిమయం మానుషోభావోవ్యక్తమేవావలమ్బ్యతే

సర్మాత్మన్ సర్వగుహ్యానాం గుహ్యగుహ్యాత్మనాత్మయా

స్మరాశేషజగద్బీజకారణంకారణాగ్రజ

ఆత్మానమేకంతద్వాచ్చజగత్యేకార్ణవేచయత్

కింనవేత్సియథాహంచత్వంచై కంకారణం భువః

భారవతారణార్థాయమర్ త్యలోకముపాగతౌ

నభశ్శిరస్తేఽమ్భువహాశ్చకేశాః పాదౌక్షితిర్వక్త్రమనన్తవహ్నిః

సోమోమనస్తేశ్వసితం సమీరణో దిశశ్చతస్రోఽవ్యయబాహవస్తే

సహస్రవక్త్రోభగవాన్మహాత్మా సహస్రహస్తాఙ్ఘ్రి శరీరభేదః

సహస్రపద్మోద్భవయోనిరాద్యస్సహస్రశస్త్వాం మునయోగృణన్తి

దివ్యంహిరూపం తవవేత్తినాన్యోదేవైరశేషైరవతారరూపమ్

తదర్ చ్యతేవేత్సినకిం యద న్తేత్వయ్యేవవిశ్వంలయమభ్యుపైతి

త్వయాధృతేయం ధరణీబిభర్తి చరాచరం విశ్వమనన్తమూర్తే

కృతాదిభే దైరజ! కాలరూపో నిమేషపూర్వోజగదేతదత్సి

అత్తం యథాబాడబావహ్నినామ్బుహిమస్వరూపం పరిగృహ్యకాన్తమ్

హిమాచలే భానుమతోంఽషుసంగాజ్జలత్వమభ్యేతిపునస్తదేవ

ఏవం త్వయాసంహరణేఽత్తమేతజ్జగాత్సమస్తం త్వదదీనకంపునః

తవై వసర్గాయసముద్యతస్య జగత్త్వమభ్యేత్యనుకల్పమీశ

భవానహంనవిశ్వాత్మాన్నే కమేవహికారణమ్

జగతోఽస్యజగాత్యర్ థే భేధేనావాం వ్యవస్థితౌ

తత్స్మర్యతామమేయాత్మం స్త్వయాత్మాజహిదానవమ్

మానుష్యమేవావలంబ్యబన్ధూనాం క్రియతాం హితమ్

శ్రీకృష్ణుడు:

ఓ సర్వాత్మక! గుహ్యాతి గుహ్యముల కన్నిటికిన గుహ్యుడవు కేవల నిర్గుణ పరబ్రహ్మ వయిన నీ మానవాకార విడంబన మేల స్పష్టముగా నవలంబించెదవు. అశేష జగద్బీజ కారణము కారణము కంటె ముందు ముందు బుట్టిన వాడవు జగమే కార్ణవమైనపుడు ఏకైకాత్మకమై శేషించిన నీ స్వరూపము స్మరింపుము. నేను నీవును భూభారావతరణమునకే మర్త్య లోకమునకు వచ్చినామని నీ వెఱుంగవా?

విరాడ్రూప నిరూపణము

గగనము నీ శిరస్సు. మేఘములు నీ కేశములు. భూమి పాదములు ముఖము అనంతాగ్ని మనస్సు చంద్రుడు నిట్టూర్పు వాయువు నీ నాల్గు బాహువులు నాల్గు దిశలు. సహస్ర ముఖుడవు. భగవంతుడవు. మహాత్ముడవు. సహస్ర పాద సహస్రహస్త శరీర భేదము గలవాడవు. అనేక పద్మోద్భవులకు (బ్రాహ్మలకు) ఆద్య కారణము. అని మునులు నిన్ను వేయి విధాల వర్ణింతురు. నీ దివ్య రూపము నొరుడెఱుంగడు నీ ఆయా యవతారముల రూపమును దేవత లర్చింతురు. తుదకీ విశ్వము నీ యందే లయమందును. ఇది నీ వెఱుంగవా? నీచే ధరింప బడిన యీ ధరణి చరాచర ప్రపంచమును ధరించును. ఓ అనంతమూర్తీ (శేషుని స్వరూప మన్నమాట) నిమేషాది కృతయుగాది భేదమందిన కాలము నీ స్వరూపము. అదే యీ జగమును భక్షించుచు బడబాగ్నిచే దినబడిన నీరు చక్కని మంచు రూపమొంది హిమగిరి యందు భానుమంతుని భాను (కిరణ) స్పర్శముచే నదే నీరగును. ఇట్లే సంహార మందు (ప్రళయ కాలమున) నీచే అత్తం (తిన బడిన) యీ ఎల్ల జగత్తు నీ యంద ధీనమై యుండి (ఘనీభావమున) సృష్టి సేయనుద్యమించు నీయొక్క రూపమే కల్పానుసారముగ జగద్భావము పొందును. నీవు నేనును గలసి ఈ జగత్తున కేకైక కారణమై యున్నాను. జగత్తు కొఱకై భిన్నరూపులై యున్నాము. ఓ విశ్వాత్మా! అమేయాత్మా నిన్ను నీవు స్మరింపుము. ఈ దానవు సంహరింపుము. మానుష్య రూపముతోనే బంధువులకు హిత మాచరింతము.

శ్రీపరాశరుడు:

ఇతిసంస్మారితోవిప్ర! కృష్ణేనసుమహాత్మన

విహస్యపీడయామాన ప్రలమ్భం బలవాన్ బలః

ముష్టినాసోహనన్మూర్ ధ్నికోపసంరక్తలోచనః

తేనచాస్య ప్రహారేణ బహిర్యాతేవిలోచనే

సనిష్కాసితమస్తిష్కోముఖాచ్చోణితముద్వామన్

నిపపాతమహీపృష్ఠే దైత్యవర్యోమమారచ

ప్రలమ్భం నిహతం దృష్ట్వాబలేనాద్భుతకర్మణా

ప్రహృష్టాస్తుష్టువుర్గోపాస్సాధుసాధ్వితిచాబ్రువన్

సంస్తూయమానోగోపైస్తురామోదై త్యేనిపాతితే

ప్రలమ్భేసహకృష్ణేనపునర్గోకులమాయయౌ

అని యిట్లు కృష్ణుడు జ్ఞప్తిసేయ బలశాలి బలుడు ప్రలంబునిం బట్టి పీడించెను. కోపముచే కన్నులేఱ్ఱవడ వాని నడినెత్తిం గ్రుద్డెను. ఆ దెబ్బతో కనుగ్రుడ్లు వెలికివచ్చి మెదడు బయలువడి నోట రక్తము గ్రక్కికొనుచు నవనీతలము నంబడి యా దైత్యుడు చనిపోయెను. అద్భుతలీల నిట్లు బలరామునిచే ప్రలంబుడు గూలుట గని గోపకులు ప్రహృష్టులై సాదుసాదు (బాగు బాగని) అని బలభద్రుం గొనియాడిరి. అట్లు గోపకులచే స్తుతింపబడి బలరామ మూర్తి శ్రీకృష్ణమూర్తితో గోకులమునకు విచ్చేసెను.