విష్ణు మహా పురాణము

17 - ద్రుహ్యు వంశము

శ్రీపరాశరుడు:

ద్రుహ్యోస్తు తనయోబభ్రుః

బభ్రోస్సేతుః

సేతుపుత్ర ఆరబ్దనామా

ఆరబ్దస్యాత్మజాగాన్ధారః గాంధారస్యఘర్మః ఘర్మాత్ ఘృతః ఘృతాద్దుర్దమః తతః ప్రచేతాః

ప్రచేతసః పుత్రశ్శతధర్మః బహులానాంమ్లేచ్చానాముదీచ్యానామాధిపత్య మకరోత్

శ్రీపరాశరుడు:

ద్రుహ్యుని తనయుడు బభ్రువు. ఆయన వాడు సేతువు. సేతువు కొడుకు ఆరబ్దుడు. అతని కొడుకు గాంధారుడు. అతని వాడు ఘర్ముడు. ఘర్మునికి ఘృతుడు. అతనికి దుర్ధముడు, అతనికి ప్రచేతసుడు, అతని కొడుకు శతధర్ముడు పుట్టిరి. ఈతడు ఔత్తరాహులగు (భారత ఖండమునకు నుత్తర దిశనున్న) మ్లేచ్చులకు దొర యయ్యెను.