విష్ణు మహా పురాణము

5 - జనక రాజ వంశ వృక్షము

శ్రీపరాశరుడు:

ఇక్ష్వాకు తనయోయోఽసౌనిమినామా సతు సహస్ర సంవత్సరం సత్ర మారేభే

వసిష్ఠంచహోతారంవరయామాస

తమాహవసిష్ఠః అహమిన్ద్రేణపంచవర్షశతం యాగార్థంప్రథమంవృతః

తదనన్తరం చప్రతిపాల్యతామాగతస్తవాపి ఋత్విగ్భవిష్యామీత్యుక్తేస పృథివీపతిర్నకించి దుక్తవాన్

వసిష్ఠోఽప్యనేనసమన్విచ్చితమిత్యమరపతేర్యాగమకరోత్

సోఽపితత్కాలమే వాన్యైర్గౌతమాదిభిర్యాగ మకారయత్

సమాప్తేచామరపతేర్యాగే త్వరమాణో వసిష్టో నిమియజ్ఞం కరిష్యామీత్యాజగామ

తత్కర్మకర్ తృత్వంచతత్రగౌతమస్యదృష్ట్వాఽథ స్వతేజసాతస్మై రాజ్ఞేమామప్రత్యాఖ్యాయైతేన

గౌతమాయ కర్మన్తరం సమర్పితం యస్మాత్తస్మాదయం విదేహోభవిష్యతీతి శాపం దదౌ

ప్రబుద్ధశ్చా వవనిపతిరపి ప్రాహ

యస్మాన్మామ సంభాష్యాజానత ఏవ శయానస్యశాపోత్సర్గమసౌదుష్టగురు శ్చకార తస్మాత్

తస్యాపి దేహః పతిష్యతీతి ప్రతిశాపం దత్త్వా దేహ మత్యజత్

తచ్చాపచ్చమిత్రావరుణయోస్తేజసి వసిష్ఠ చేతః ప్రవిష్టమ్

ఊర్వశీదర్శనాదుద్భూతబీజ ప్రపాతయెస్తయోస్సకాశాద్వశిష్టోదేహమపరం లేభే

నిమేరపితచ్చరీరమతి మనోహరతై లగన్దాదిభిరుపసంస్క్రియమాణం నైవక్లేదాదికం దోషమవాప సద్యోఽమృతమివ తస్థౌ

యజ్ఞసమాప్తౌచభాగ గ్రహణాయదేవానాగతా నృత్విజ ఊచుః యజమానాయవరోదీయ తామితి

దైవైశ్చనిన్దితోఽసౌనిమిరాహ

భగవన్తోఽఖిల సంసార దుఃఖహన్తారః

నహ్యేతాదృగన్యద్దుఃఖమస్తి యచ్చరీరాత్మనోర్వియోగోభవతి

తదహమిచ్చామిసకల లోకలోచనేషువస్తుం నపునః శరీరగ్రహణంకర్తుమిత్యేవముక్తైర్దవై

రసావశేషభూతానాంనేత్రేష్వవతారితః

తతోభూతాన్యున్మేషనిమేషంచక్రుః

అపుత్రస్య చతస్య భూభుజః శరీరమరాజకభీరవస్తేమునయోఽరణ్యాంమమథుః

తతశ్చకుమారోజజ్ఞే

జననాజ్జనకసంజ్ఞా మావాప

అభూద్విదేహోఽస్యపితేతి వైదేహః మథనాన్మిథిరితి

తస్యోదావసుః పుత్రోఽభవత్

ఉదావసోర్నన్దవర్ధనః తత్పుత్రః సుకేతుః తస్మాచ్చ దేవరాతః తతశ్చబృహదుక్థః తస్యచ మహావీర్యః తస్యాపిసుధృతిః

తతశ్చదృష్టకేతురజాయత

దృష్టకేతోః హర్యశ్వః తస్యచమరుః మరోః ప్రతీకః తస్మాత్ కృతిరథః తస్యదేవమీడః తస్యాపి

విబుదః విబుధస్యాపి మహాధృతిః తతశ్చక్రుతరాతః

తతో మహారోమాతతస్స్వర్ణరోమా తస్య పుత్రోహ్రస్వరోమా హ్రస్వరొమ్ణః సీరధ్వజోఽభవత్

తస్యపుత్రార్థం యజ్ఞభువంకృషతః సీరే సీతా సముత్పన్నా దుహితాచ

సీరధ్వజస్యభ్రాత్రాసాంకాశ్యాధిపతిః కుశధ్వజనామాసీత్

సీరధ్వజస్యాపత్యం భానుమాన్ భానుమతశ్శతద్యుమ్నః తస్యశుచిః తస్మాచ్చోర్జనామాపుత్రోజజ్ఞే

తస్యాపిశతధ్వజః తతః కృతిః తతోరంజనః తత్పుత్రః పురుజిత్ తతోఽరిష్టనేమిః తస్మా

చ్చ్రుతాయుః శ్రుతాయుషస్సుపార్శ్వః తస్మాత్సృఞ్ఞయః తతః క్షేమావీ క్షేమావినః అనేనాః

తస్మాద్భౌమరథః తస్యచసత్యరథః తస్మాదుపగః ఉపగోరుగుప్తః తత్పుత్రః స్వాగతః తస్మాచ్చ

స్వాఙ్జః తస్యచస్వాపనః తస్మాచ్చసువర్చాః తస్యాపిసుభాషః తతస్సుశ్రుతః తస్మాజ్జయః

జయపుత్రో విజయః విజయస్యఋతః ఋతాత్సునయః సునాయాద్వీతహవ్యః తస్మాద్ద్రుతిః

ధృతేర్బహుళాశ్వః తస్య పుత్రః కృతిః

కృతౌసంతిష్ఠత్యయం జనకవంశః

ఇత్యే తే మైథిలాః

ప్రాయేణై తే ఆత్మవిద్యాశ్రయిణో భూపాలా భవన్తి

శ్రీపరాశరుడు:

ఇక్ష్వాకుని తనయుడు నిమి సహస్ర సంవత్సర సత్రయాగ మారంభించెను. అందు వశిష్ఠుని హోతగా వరించెను. అతనింగని వశిష్ఠుడు నన్నింద్రుడు తొలుత నైదువంద లేండ్లు జరుగు యాగమున వరించి నాడు. ఆ మీద వచ్చి నీకును ఋత్విక్కు నయ్యెద, నందనుక నాగుమన రాజు మారు పలకడయ్యే. వశిష్ఠుడాత డంగీకరించెననుకొని అమరపతి యాగముం జేసెను. నిమియును తత్కాలముగ గౌతమాదు లన్యులచే యాగము గావింపించెను. ఇంద్ర యాగము ముగియ వశిష్ఠుడు త్వరపడి నిమి యజ్ఞము సేయుదునని వచ్చెను. అక్కడ గౌతము డాయాగ కర్తయగుట జూచి నిద్ర పోవుచున్న యా ఱేనికి నన్ను గాదని ఈ గౌతమునికి ఈ యార్త్విజ్యమిచ్చె గావున నీతడు విదేహుడు గాగలడని శాప మిచ్చెను. అవని పతియు మేల్కొని యిట్లనియె. నన్ను బలుకరింపకయ నిద్రలో నున్న నాకు శాపమిచ్చె నీ దుష్ట గురువు గావున వానికిని దేహము పడిపోవునని ప్రతిశాప మిచ్చి తానూ దేహమును విడిచెను. ఆతడిచ్చిన శాపము వలన వశిష్ట చిత్తము మిత్రావరుణుల తేజస్సునం బ్రవేశించెను. ఊర్వశీ దర్శనము వలన బీజస్ఖలన మయిన యా మిత్రావరుల నుండి వశిష్ఠుడు మరియొక దేహముం బడసెను. ఇక నిమి యొక్క శరీరము అతిమనోహర తైల గంధాదులచే నుపసంస్కృతమై క్లేదాది దోషము లేవియు నొందక సద్యోమరణ మందినట్లుండెను. యజ్ఞ సమాప్తియై భాగములందికొన వచ్చిన దేవతలం గని ఋత్విక్కులు యజమానునికి వరమిండని కోరిరి. దేవతలు వరమిత్తుమడుగమన నిమి యనియె. భగవంతులు తమరు సంసార దుఃఖహరులు. శరీరమునకు జీవాత్మకు వియోగమయి నప్పుడు గల్గు నీ దుఃఖము వంటి దుఃఖ మింకొకటి లేదు. కావున నేను సర్వలోకుల లోచనము లందు వసింప గోరెదను గాని శరీర గ్రహణము గోరను. అన దేవత లశేష భూతముల కన్నులంద తడవ తరింప జేసిరి. అందువలన భూతములు (ప్రాణులు) ఉన్మేష నిమేషములు (రెప్ప పాటు) సేయ మొదలిడెను. పుత్ర సంతానము లేని యాఱేని శరీరమును రాజ్య మరాజకమగునని భయపడి మునులు అరణియందు మథించిరి. అందుండి కుమారుడు జనించెను. జనించుట వలన జనకుడను పేరొందెను. ఈతని తండ్రి విదేహుడగుటచే (దేహము లేని వాడగుటచే) నీతని పుత్రుడీతడు వైదేహుడనియు, మథనము వలన మిథియని గూడ పేరందెను. అతని కుదావసువు పుట్టెను. అటనుంచి వరుసగా నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్థుడు, మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యశ్వుడు, మారుడు, ప్రతీకుడు, కృతిరథుడు, దేవమీడుడు, విబుధుడు, మహాధృతి, కృతరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడును తండ్రి కొడుకులయిరి. సీరధ్వజుడు, సంతానార్థియై యజ్ఞభూమి దున్నుచుండ సీత యుదయించినది. సీరధ్వజుని తమ్ముడు సాంకాస్య పురాధిపతి కుశధ్వజుడు. సీరధ్వజుని కుమారుడు భానుమంతుడు ఆటనుంచి శుచి ఊర్జుడు శతధ్వజుడు కృతిరంజనుడు పురుజిత్తు అరిష్టనేమి శ్రుతాయువు సుపార్శ్వుడు సృంజయుడు క్షేమావి అనేసుడు భౌమరథుడు సత్యరథుడు ఉపగుపు ఉపగుప్తుడు స్వాగతుడు స్వాంగుడు స్వాపనుడు సువర్చుడు సుభాషుడు సుశ్రుతుడు జయుడు విజయుడు ఋతుడు సునయుడు వీతహవ్యుడు ధృతి బహులాశ్వుడు కృతి యునుంగా నిమి వంశ వృక్షము తండ్రి కొడుకులుగా విస్తరించినది. ఈ జనక వంశము కృతియందు నిలుపు గొన్నది. వీరందరు మైథిలులు. వీరు సాధారణముగా ఆత్మవిద్యా సంపన్నులయిన భూపాలురుగా నుందురు. రాజర్హు లన్నమాట.