విష్ణు మహా పురాణము

8 - సూర్యాది జ్యోతిర్మండల సంస్థానము

శ్రీపరాశరుడు:

వ్యాఖ్యాతమేతద్భ్రహ్మాణ్డసంస్థానంతవసువ్రత

తతః ప్రమాణసంస్తానేసూర్యాదీనంశృణుష్వమే

యోజనానాం సహస్రాణి భాస్కరస్యరతోనవ

ఈషాదణ్డస్తథైవాస్య ద్విగుణో మునిసత్తమ

సార్ధకోటిస్తథాసప్తనియుతాన్యదికానివై

యోజనానాంతుతస్యక్షస్తత్రచక్రంప్రతిష్ఠితమ్

సార్ధకోటిస్తథాసప్తనియుతాన్యధికానివై

యోజనానాంతూతస్యాక్షస్తత్రచక్రంప్రతిష్టాతమ్

త్రినాభిమతిపంచారేషణ్ణేమిన్యక్షయాత్మకే

సంవత్సరమయేకృత్స్నం కాలచక్రం ప్రతిష్టితమ్

హయాశ్చసప్తచ్ఛన్ధాంసి తేషాంనామానిమేశృణు

గాయత్రీచబృహత్యుష్ణిగ్జగాతీత్రిష్టుబేవచ

అనుష్టుప్పఙ్త్కిరిత్యుక్తాశ్చన్ధాంసిహరయోరవేః

చత్వారింశాత్సహస్రాణి స్వితీయోక్షోవివస్వతః

పంచాన్యానితుసార్దాని స్యన్ధనస్యమహామతే

అక్షప్రమాణముభయోః ప్రమాణంతద్యుగార్ధయోః

హ్రస్వోఽక్షక్షస్తద్యుగార్దేన ధ్రువాధారోరథస్యతు

ద్వితీయేఽక్షేతతశ్చక్రం సంస్థితం మానసాచలే

శ్రీపరాశరుడు:

ఈ బ్రహ్మాండ సంస్థితిం గూర్చి వివరించితిని. ఇక సూర్యాది జ్యోతిస్సుల యొక్క కొలతలను వాని సంస్థానము (ఉనికి) వినుము. సూర్యుని రథము తొమ్మిది వేల యోజనములు. ఈషాదండము కాడికి యిరుసునకు ననుబంధ పడియుండు పోలుగఱ్ఱ దీనికి రెండింతలు. అనగా పదునెనిమిది వేల యోజనములు. ఈ రథము యొక్క యక్షము (బండి కన్ను కుంచము) ఒక కోటి ఏబది యేడు లక్షల యోజనములు. దీని యందు చక్రము ప్రతిష్టితము. ఈ చక్రము త్రినాభికము. అనగా కేవలము వర్తులాకారము గాక కోడిగ్రుడ్డు ఆకారముగా నుండునన్న మాట. అదిగాక ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నములు మూడు ఈ కాల రూప చక్రమునకు నాభులని వ్యాఖ్యాతలన్నారు. ఇంకొకరు నాల్గేసి మాసము లోకటిగా మొత్తము సంవత్సరమును మూడు కాలములుగా గణించి యవి యీ చక్రము కాకుతారు. దీనియందు అరలు అయిదు. బండి చక్రముల ఆకునకు నాకునకు నడుమగల యంతము అర. అవి యీ సంవత్సరాత్మక కాలచాక్రములో వత్సర, పరివత్సర, ఇద్వాత్సర, అనువత్సర యుగములను నైదు భాగాములని యొక వ్యాఖ్యాత హేమంత శిశిరము లోకే ఋతువుగా గణించి వసంతాది ఋతువు లయిదు దీని యందరలై యున్నవని మరియొకరు. ఇందు నేములు యారు. నేమియనగా బండి చక్రము చుట్టునుం గల యీనుప పట్టా. ఆ పట్టాను తాకుచు ఆకులుండును. ఆ తాకిన బిందువులు ఆరు రుతువులుగా కాలచక్రము చుట్టూ నున్నవని సంకేతము. గుఱ్ఱము లేడును ఏడు ఛందస్సులు. అవి గాయత్రి బృహతి ఉష్ణిక్కు జగతి త్రిష్టుభము అనుష్టుప్పు పంతియను పేరుగలవి. అక్షము (ఇరుసు) యొక్క ఒకవైపు మేరువు మీద రెండవకొన మానస గిరి మీదను నానియుండగా నీ చక్రము అక్షము మీదను ఆ అక్షము థ్రువ మండలము నందును నను బంధింప బడి యున్నది. చక్రముతో నిరుసును ఇరుసుతో ధ్రువుడును దిరుగు చుండును. జంబూద్వీపము నడుమ మేరువు దానిమీద పదునైదు లక్షల యోజనములలో ధ్రువమండల మున్నది. మేరువు మీద పదునారు వేల యోజనములలో మహాక్షము యొక్క మొదలును, ఏబదివేల యోజనములలో మానసోత్తర పర్వతము మీద ఆ మహాక్షయ యొక్క తుదిభాగము గలవు.

మానసోత్తరశైలస్య పూర్వతోవాసవీపురీ

దక్షిణేతుయమస్యాన్యా ప్రతీచ్యాంవరుణస్యచ

ఉత్తరేణసోమస్య తాసాంనామానిమేశృణు

వస్వౌకసారా శక్రస్య యామ్యా సంయమనీతథా

పురీ సుఖాజ లేశాస్య స్సోమస్యచవిభావరీ

కాష్ఠాంగతోదక్షిణతః క్షిప్తేషురివసర్పతి

మైత్రేయభగవాన్ భానుర్ జ్యోతిషాంచక్రంసంయుతః

అహోరాత్రవ్యవస్థానకారణంభగవాన్ రవిః

దేవయానఃపరః పన్దా యోగినాంక్లేశసంక్షయే

మానసోత్తర పర్వతమునకు దూర్పున ఇంద్ర రాజధాని వసౌకసారము. దక్షిణమున యమపురి సంయమని యనునది, పడమట వరుణపురి సుఖపురి యను పేరు గలది, ఉత్తరమున సోముని యొక్క పురము విభావరి యను నదియుం గలవు. దక్షిణ దిశనున్న రవి విసరిన బాణమట్లు ఉత్తర దిశకు జ్యోతిశ్చక్ర మంతయు దన వెంటంగొని నడచును. ఆయనము (గమనము) సేయును. అట్లారు మాసము లయనము (గమనము) సేసి యుత్తరమునకు జేరును. ఆటనుండి ఆరు మాసము లయనించి క్షిణమునకు జేరును. సర్వద్వీపము లందును అహోరాత్ర వ్యవస్థకు కారణమైన సూర్య భగవానుడీ రెండు దారులందు సంచారము సేయు చుండును. సూర్యుడు దక్షిణ దిశ నుండి యుత్తర దిశకు బోవు కాలము ఉత్తరాయణము. ఉత్తరాయణము ఆరు మాసములు. (తదభిమాని దేవత) అగ్ని జ్యోతి (అర్చిరభిమానినీ ఆతివాహిక దేవత) అహస్సు (అహరభిమానినీ దేవత) శుక్ల పక్షము (తదభిమానినీ దేవత) వీనికి దేవయాన మార్గమని పేరు. ఈ మార్గము నందు పోవు యోగులు అనగా జ్ఞానులు బ్రహ్మపద మందుదురు కావున నీ మార్గము యోగుల క్లేశములను హరించు గొప్ప మార్గము.

దివాసస్యరవిర్మధ్యేసర్వకాలంవ్యవస్థితః

సర్వద్వీపేషుమైత్రేయ! నిళార్ధస్య చసన్ముఖః

ఉదయాస్తమాయేచై వసర్వకాలంతుసమ్ముఖే

దిశాస్వశేషాసుతథా మైత్రేయ! విదిశాసుచ

యైర్యత్రదృశ్య తేభాస్వాన్ సతేషా ముదయస్స్మృతః

తిరోభావంచాయత్రైతి తత్రైవాస్తమాయో రవేః

నైవాస్తమయమర్కస్యనోదయస్సర్వదాసతః

ఉదాయాస్తమయాఖయంహి దర్శనాదర్శనంరవేః

సూర్య నెవ్వరెచట జూచెదరో యది పగలు. ఆయన చాటు పడిన పుడదియే రాత్రి. ఎల్లప్పుడు ప్రకాశించు రవికి నిజముగా ఉదయాస్తమయములు లేవు. ఆయన కనబడుట కనుపింప కుండుటయే యాయన ఉదాయాస్తమయములు.

శక్రాదీనాంపురేతిష్టన్ స్పృశత్యేషపురత్రయమ్

వికోణౌద్వౌవికోణస్థాస్త్రీన్ కోణాన్ ద్వేపురేతథా

ఉదితోవర్దమానాభిరామధ్యాహ్నాత్తపన్ రవిః

తతఃపరం హ్రస్తన్తీభిః గోభిరస్తంనిగచ్చతి

ఉదయాస్తమయాభ్యంచ స్మృతేపూర్వాపరేదిశౌ

యావత్పురస్థాత్తపతి తావత్పృష్టేఽథపార్ శ్వయోః

ఋతేమరగిరేర్మేరోరుపరిబ్రహ్మణస్సభామ్

ఏఏమారీచయోఽర్కస్యప్రయాన్తిబ్రహ్మణస్సభామ్

తేతేనిరస్తాస్థాద్భాసా ప్రతీప ముపయాన్తివై

తస్మాద్దిశ్యుత్తరస్యాంవైదివారాత్రిస్సదైవహి

సర్వేషాంద్వీపవర్షాణాం మేరురుత్తరతోయతః

ప్రభావివాసవతోరాత్రావస్తంగచ్ఛతిభాస్కరే

విశత్యగ్నిమతోరాత్రావగ్నిర్దూరాత్ప్రకాశతే

వహ్నేః ప్రభాతథాభానుంది నేశ్వావిశతి ద్విజ

అతీవవహ్నిసంయోగాత్తతస్సూర్యః ప్రకాశతే

తేజసీభాస్కరాగ్నేయే ప్రకాశోష్ణస్వరూపిణీ

పరస్పరానుప్రవేశాదాప్యాయేతే దివానిశమ్

దక్షిణోత్తరభూమ్యర్దేసముత్థిష్ఠతిభాస్కరే

అహోరాత్రంవిషతయమ్భాస్తమః ప్రాకాశ్యశీలవత్

ఆతామ్రాహిభవన్త్యాపోదివానక్త ప్రవేశానాత్

దినంవిశతిచైవామ్భోభాస్కరేఽస్తముపేయుషి

తస్మాచ్చుక్లాభవన్త్యాపో నక్తమహ్నః ప్రవేశనాత్

ఏవంపుష్కరమధ్యేనయదాయాతిది దివాకరః

త్రింశద్భాగంతుమేదిన్యాస్తదామౌహూర్తికీగతిః

కులాలచక్రపర్యన్తే భ్రమన్నేషదివాకరః

కరోత్యహస్తథారాత్రిం విముఞ్చన్మేదినీంద్విజ!

ఆయనస్యోత్తరస్యాదౌమకరంయాతి భాస్కరః

తతః కుమ్భంచమీనంచారాశేరాశ్యన్తరంద్విజ!

త్రిష్వే తేష్వథభుక్తేషుతతోవైషువతీం గతిమ్

ప్రయాతిసవితాకురవాన్నహోరాత్రంతతస్సమమ్

తతోరాత్రిఃక్షయంయాతి వర్ధతేఽనుదినందినమ్

తతశ్చమిథునస్యాన్తేపరాంకష్టాముపాగతః

రాశింకర్కటకం ప్రాప్యకురుతేదక్షిణాయనమ్

కులాలచక్రవర్యన్తే యథాశీఘ్రంప్రవర్తతే

దక్షిణప్రక్రమేసూర్యస్తథాశీఘ్రంప్రవర్తతే

అతివేగాతయాకాలంవాయువేగాగతిశ్చరన్

తస్మాత్ప్రకృష్టాంభూమింతుకాలేనాల్పేగచ్ఛతి

సూర్యోద్వాదశిభిశ్చిఘ్ర్యాన్ముహూర్ తైక్షిణాయనే

త్రయోదశార్ధమృక్షాణామహ్నాతుచరతేద్విజ

ముహూర్ తైస్తావదృక్షాణి నక్తామష్టాదశైశ్చరన్

కులాలచక్రమధ్యస్తోయథామందంప్రసర్పతి

తథోదగయనేసూర్యస్సర్పతేమన్ధవిక్రమః

తస్మాద్దీర్ఘేణకాలేనభూమిమలపాంతుగచ్ఛతి

అష్టాదశముహూర్తంతఉత్తరాయణ పశ్చిమమ్

ఆహోభవతితత్రాపి తపతేమన్దవిక్రమః

త్రయోదశార్ధమహ్నేవ ఋక్షాణాం చరతే రవిః

ముహూర్ తైస్తావదృక్షాణి రాత్రౌ ద్వాదశభిశ్చరన్

అతోమన్ధతరం నాభ్యంచక్రంభ్రమతివైయథా

మృత్పిణ్డ ఇవమధ్యస్థో ధ్రువోభ్రమతివైతథా

కులాలచక్రనాభిస్తు యథాతత్రైవవర్తతే

ధ్రువస్తథాహిమైత్రేయ తత్రైవపరివర్తతే

ఉభయోఃకాష్ఠయోర్మద్యేభ్రమతోమణ్డలానిచ

దివానాక్తంచసూర్యస్యమన్దా శీఘ్రాచవైగతిః

మన్దాహ్నియస్మిన్నయనేశీఘ్రానక్తం తదాగతిః

శీఘ్రానిశియదాచాస్య తదామన్దాగతిర్దివా

ఏకప్రమాణమేవైషమార్గంయాతి దివాకరః

అహోరాత్రేణయోభుఙ్తే సమస్తా రాశాయోద్విజ

షడేవరాశీన్ యోభుఙ్తేరాత్రావంయాంశ్చషడ్దివా

రాశిప్రమాణజనితా దీర్ఘహ్రస్వాత్మాతాదివా

తథానిశాయాంరాశీనాం ప్రమాణైర్లఘదీర్ఘతా

దినాదేః దీర్ఘహ్రస్వత్వంతాద్భోగేనైవజాయతే

ఉత్తరేప్రక్రమేశీఘ్రానిశి మన్దాగతిర్దివా

దక్షిణేత్వయనేసైవ విపరీతా వివస్వతః

ఉషారాత్రిస్సమాఖ్యాతా వ్యుష్టిశ్చాప్యుచ్యతేదినమ్

ప్రోచ్యతేచతాయోస్సంధ్యా ఉషావ్యుష్ట్యోర్యదన్తరమ్

సంధ్యాకాలేత్సంప్రాప్తే రౌద్రేపరమదారుణే

మన్దేహారాక్షసాఘోరాస్సూర్యమిచ్చన్తిఖాదితుమ్

ప్రజాపతికృతశ్శాప స్తేషాంమైత్రేయరాక్షసామ్

అక్షయత్వంశరీరాణాం మరణంచదినేదినే

తతస్సూర్యస్యతే ర్యుద్దంభవ త్యత్యన్తదారుణమ్

తతోద్విజోమాస్తోయంసంక్షిపన్తిమహామునే

భాస్కరుని రథ వైశాల్యము (భాస్కరుని కాంతి ప్రసరించు మేర అన్నమాట) తొమ్మిది వేల యోజనములు. దాని యీషాదండము (కాడికిని యిరుసునకు మధ్య నుండునది) పదునెనిమి వేల యోజనముల పొడవు ఆ రథము యొక్క అక్షము ఒకకోటి యేబదివేల యోజనములు దానిపై చక్రముంచ బడినది. ఆ చక్రము మూడు నాభులు అయిదు అరలు ఆరు నేములు కలది. దీని యందు సంవత్సర మయమైన కాలచక్రము ప్రతిష్టింప బడినది. మూడు నాభులనగా బూర్వాహ్ణము మధ్యాహ్నము, సాయాహ్నము అనునవి. అయిదు అరలనగా 1. సంవత్సరము 2. పరివత్సరము 3. ఇద్వాత్సరము 4. అనువత్సరము 5. యుగము ననున వైదు. నేము లాఱనగా నారు రుతువులు. మేరు పర్వతమునకు మానస పర్వతమునకు నడుమ నున్న దూరమే యక్షము యొక్క కొలత. అక్షము యొక్క ఒక కొన మేరువు మీదను, రెండవ కొన మానసగిరి మీదను ఆని యుండగా నీ చక్రము తిరుచు చున్నదియని గ్రహింప నగును. చక్ర మక్షము మీదను (ఇరుసు మీద) ఇరుసు. ధ్రువమండల మందును గట్ట బడియున్నవి. చక్రముతో నిరుసును, ఇరుసుతో ద్రువుడును దిరుగు చుందురు. జంబూ ద్వీపము నడుమ మేరువు. దానిమీద బదునైదు లక్షల యోజనములలో ధ్రువుడు, మేరువు మీద బదునారు వేల యోజనములలో మహాక్షము యొక్క మొదలు, దాని కొస చక్రముతో గూడ మానస పర్వతము మీద నేబదివేల యోజనములలో నున్న యాకాశము నున్నవి. మానసోత్తర పర్వతమునకు దూర్పుగా నింద్ర పురమున్నది. దక్షిణమున యమ పురము, పడమట వరుణ పురము, ఉత్తరమున సోమపురి యున్నవి. ఇంద్రుని పురము పేరు వస్వౌకసారము, యమపురము ‘సంయమని’, వరుణుని పురము ‘సుఖ’, చంద్రుని పురము ‘విభావరి’ సూర్యుడు విసరిన బాణము వలె దక్షిణ దిశయందు దిరుగును. సూర్యుడే యహోరాత్రములకు గారణము. అతడంతట దన కాంతిని బ్రసరింప జేయును. దేవతల పర్వతమగు మేరువు నందు, బ్రహ్మలోక మందు నతని కాంతులు ప్రసరింపవు. బ్రహ్మ లోకమునకు బ్రసరించిన కాంతు లందలి కాంతులచే ద్రోసి వేయబడి దివిటీ ముందరి దీపముల వలే నుండును. అందుచేతనే యుత్తర దిక్కు నందెల్లప్పుడు దివా రాత్రుము లుండుట తటస్థించును. అనగా మేరువు మీద నున్న బ్రహ్మ లోకము తన ప్రకాశాముచే నేల్లవేళల పట్టపగలై యుండు ననియు, నీ సూర్య కాంతియట ప్రసరింపని కారణముచే, నెల్లప్పుడు రాత్రిగానే యుండునని తాత్పర్యము. సూర్యు డస్తమింప గనే రాత్రి యాతని కాంతి యగ్నిం బ్రవేశించును. అగ్నికాంతి సూర్యోదయము కాగానే పగలు సూర్యునందు బ్రవేశించును. సూర్యాగ్నుల తేజస్సులు రెండును నొకదాని యందోకటి, ప్రవేశించి రాత్రింబవళ్ళూ ప్యాయనము సేయుచున్నవి. మేరువునకు దక్షిణము వైపు సూర్యు డుదయింపగా తమో రూపమైన రాత్రి నీటియందు బ్రవేశించును. కావుననే పగలు నీరించుక యెఱ్ఱగా నుండును, రాత్రి నీరు తెల్లగా చంద్రుని వలె నుండును. ఇట్లు మేరువానస పర్వతముల నడుమ నున్న పుష్కర మందలి యొక ముహూర్తములో భూ మండలము యొక్క ముప్పది యావ భాగమును రవి యతిక్రమించును. కుమ్మరి సారియందు వలె జ్యోతిశ్చక్రమున నిట్లు దక్షిణాయనమున సంచరించి, యుత్తరాయనమున ప్రవేశించి రాత్రింబవళ్ళ ప్రమాణమును జిన్నదిగా బెద్దదిగా జేయు చుండును. మకర కుంభ మీనా రాశుల మూడిటం గడచి, విషువములకు సూర్యుడు వచ్చిన అపుడు పగలు రాత్రియు సమానముగా నుండును. ఆవల రాత్రి తగ్గును పగలు హెచ్చు చుండును. మిథునము దాటి కర్కాటకమునకు రాగానే దక్షిణాయన మారంభ మగును. అపుడు పగలు తక్కువ రాత్రి హెచ్చు నగును. పగలు పదమూడున్నర నక్షత్రము లను, రాత్రి పదమూడున్నర నక్షత్రము లను నతడు నడచును. పగలారు రాశులందు రాత్రి యాఱు రాశులందు నతడు సంచరించును. అతని సంచారముం బట్టి రాసుల ప్రామానములు హ్రస్వ దీర్ఘములగు చుండును. ఉపయనగా రాత్రి. వ్యుష్టియనగా బగలు. వాని నడిమి కాలమునకు ‘సంధ్య’ యని పేరు. అది పరమ దారుణమైన కాలము రౌద్రము. అచ్చట మందేహులను రాక్షసులు సూర్యుని భక్షింప కోరుదురు. అక్షయములైన శరీరములును, దిన దినము చావును గలుగునని బ్రహ్మ వారికి శాప మిచ్చెను. అందుచే వారు సూర్యునితో దారుణ యుద్దము చేయు చుందురు. బ్రాహ్మణులు సంధ్యా సమయమున నిచ్చు అర్ఘ్యములు మంత్రం పూతములై వజ్ర సమానములై వారిని ఖండించును. అగ్ని హోత్రము నందా సమయమున జేయు హోమమున యొక్క ప్రథ మాహుతిచే సూర్యుడు లెస్సగా బ్రకాశించును.

ఓఙ్కారబ్రహ్మసంయుక్తం గాయత్ర్యాచాభిమన్త్రితమ్

తేనపాపానిదాహ్యంతే వజ్రభూతేనవారిణా

అగ్నిహోత్రేహూయ తేయా సంన్త్రాప్రథమాహూతిః

సూర్యోజ్యోతిస్సహశ్రాంశుస్తయాదీప్యాతిభాస్కరః

ఓఙ్కారోభగవాన్విష్ణుస్త్రిధామావచసంపాతిః

తదుచ్చారణతస్తేతువినాశంయాన్తిరాక్షసాః

వైష్ణవోంశఃపరస్సూర్య అన్తర్జ్యోతిరసంప్లవమ్

అభియాయత మోఙ్కారంతస్యతత్ప్రేరకంపరమ్

తేనతత్ప్రేరితంజ్యోతిరోఙ్కారేణాతిదీప్తిమత్

దహత్యశేషరక్షాంసిమన్దేహాఖ్యాన్యఘానివై

తస్మాన్నోల్లజ్ఘనంకార్యం సంధ్యోపాసనకర్మణః

సహన్తిసూర్యంసంధ్యాయా నోపాస్తింకురుతేహియః

తతఃప్రయాతిభగవాన్ బ్రహ్మణై రభిరక్షితః

వాలఖిల్యాదిభిశ్చైవ జగతఃపాలనోద్యతః

కాష్టానిమేశాదశపఙ్చచైవ త్రింశచ్చకాష్టాగణయేత్కలాంతమ్

త్రింశత్కలశ్చైవభవేన్ముహుర్తస్తత్త్రింశతారాత్య్రహనీసమేతే

హ్రాసవృద్దీత్వహ ర్భాగైఃదివసానాంయథాక్రమమ్

సంధ్యాముహూర్తమాత్రావై హ్రాసేవృద్దౌసమాస్మృతా

లేఖాప్రభృత్యథాదిత్యే త్రిముహూర్తతేతువై

ప్రాతఃస్మృతస్తతఃకాలో భాగస్త్వహ్నస్సపఞ్చమః

ప్రాతఃకాలాత్ స్మృత స్థాస్మాత్త్రి ముహూర్తస్తూసఙ్గవః

మధ్యాహ్నాస్త్రిముహూర్తస్తుతస్మాత్కాలాత్తుసఙ్గవాత్

తస్మాన్మాధ్యాహ్నికాత్కాలాదపరాహ్ణఇతిస్మృతః

త్రయ ఏవముహూర్తాస్తు కాల ఏషస్మృతోబుద్దైః

అపరాహ్ణేవ్యతీతేతు కాలఃసాయాహ్నఉచ్యతే

దశపఞ్చముహూర్తావై ముహూర్తాస్త్రయ ఏవచ

దశాపఞ్చముహూర్తంవై ఆహోవైషు వతిస్మృతమ్

వర్ధతేహ్రసతేచైవఆయనేదక్షిణోత్తరే

ఆహస్తుగ్రసతేరాత్రిం రాత్రిర్ గ్రసతివాసరమ్

శరద్వాసన్తయోర్మధ్యేవిషువంతువిభావ్యతే

తులామేషగతేభానౌసమరాత్రిదినంతుతత్

కర్కటేఽవస్థితేభానౌ దక్షిణాయనముచ్యతే

ఉత్తరాయణమాప్యుక్తం మకరాస్థేదివాకరే

త్రిమ్శంముహూర్థంకథితమహోరాత్రంతుయన్మయా

తానిపఞ్చదశాబ్రహ్మన్ పక్షఇత్యభిధీయతే

మాసఃపక్షద్వయేనోక్తో ద్వౌమాసౌచారకజానృతుః

ఋతుత్రయంచాప్యయనం ద్వేఽయనేవర్షసంజ్ఞితే

సంవత్సరదయః పంచ చతుర్మాసవికల్పితాః

నిశ్చయస్సర్వకాలస్య యుగామిత్యభిధీయతే

సంవత్సరస్తుప్రథమోద్వితీయః పరివత్సరః

ఇద్వాత్సరస్తృతీయస్తు చతుర్ థశ్చానువత్సరః

వత్సరః పఞ్చమాశ్చాత్ర కాలోఽయంయుగసంజ్ఞితః

యశ్శ్వేతస్యోత్తరేశైలశృంగవానితివిశ్రుతః

త్రీణితస్యతుశృంగాణియైరాసౌశృంగవాన్ స్మృతః

దక్షిణంచోత్తరంచైవ మధ్యమంవై షువంతథా

శారద్వసన్తయోర్మధ్యే తద్భానుఃప్రతిపద్యతే

మేషాదౌచతులాదౌచ మైత్రేయ! విషువంస్మృతమ్

తదాతుల్యమహోరాత్రంకరోతి తిమిరాపహః

దశపంచముహూర్తంవైతదేతదుభయంస్మృతమ్

ప్రథమేకృత్తికాభాగే యదాభాస్వాం స్తదాశశీ

విశాఖానాంచతుర్ థేంఽశే మునే! తిష్ఠసంశయమ్

విశాఖానాంయదాసూర్యశ్చరత్యంశంతృతీయకమ్

తదాచన్ద్రంవిజానీయాత్కృత్తికాశిరసిస్థితమ్

తదైవవిషువాఖ్యోవై కాలఃపుణ్యోభిధీయతే

తదాదానానిదేయానిదేవేభ్యః ప్రయతాత్మభిః

బ్రాహ్మణేభ్యః పితృభ్యశ్చముఖమేతత్తుదానజమ్

దత్తదానస్తువిషువేకృతకృత్యోభిజాయతే

ఓంకారమే భగవంతుడైన విష్ణువు. అది వాక్పతి. ఋగ్యజుస్సా మాత్మకము. (త్రిదామ) అది యుచ్చరింపగనే రక్కసులు నశింతురు. సూర్యుడు విష్ణుని యంశము. అంతర్జ్యోతియు, అవికారము నగు నోంకారము చని, యవ్విష్ణుని ప్రేరణ చేయును. ఓంకారమున బ్రేరేపింప బడి మిక్కిలి వెలుంగు గల యా జ్యోతిస్సు సకల రాక్షసుల నుమందేహులను వారిని నశింప జేయును. అందుచేతనే సంద్యోపాసనము (సంధ్యా వందనము) మానరాదు. అట్లు మానిన విప్రుడు సూర్య హాని చేసిన వాడును, ఆవల వాలఖిల్యాదుల చేతను భ్రాహ్మణుల చేతను నుతింప బడి సూర్యుడు లోకములను రక్షింప నేగును. ముప్పది ముహూర్తములచే నొక్క రాత్రి యుంబవలు నేర్పడును. ఐదవ భాగము మూడు ముహూర్తముల కాలము ప్రాతః కాలమాన బడును. ఆవల మూడు ముహూర్తముల కాలము సంగవమన బడును. అవలిది మధ్యాహ్నము. అవలిది అపరాహ్నము. అంతకు మీదిది సాయాహ్నము. ఇట్లు ముప్పది గడియలు పదుహేను ముహూర్తములలో గల పగటి కా మైదు విధములుగా విభజింప బడింది. పదునైదవ ముహూర్తము విషువన్ముహూర్త మనబడు చుండును. దక్షిణోత్తరాయణము లందు రాత్రిం బవళ్ళు హెచ్చుచు దగ్గుచు చివరకు ముప్పది ముహూర్తముల కాలముగా గణింప బడుచుండును. శరద్వసంత ఋతువుల నడుమ విషువత్తు వచ్చును. అనగా తులా మేషములను సూర్యుడు పొందినపుడు విషువత్తులు వచ్చును. కర్కట మందు సూర్యుడు రాగా దక్షిణాయనము. మకర మందుండునచో నుత్తరాయణము నగును. రాత్రింబవళ్ళు ముప్పది ముహూర్తము లని యిపుడు చెప్పిన దానిలో బదునేను ముహూర్తములకు బక్షమని పేరు. కృత్తికా ప్రథమ భాగమున సూర్యుడున్నప్పుడు విశాఖా చతుర్థ పాదమున చంద్రుడుండును. విశాఖా చతుర్థ పాదమున జంద్రు డున్నప్పుడు కృత్తికా శిరస్సున సూర్యు డుండును. అట్లున్నపుడే విషువత్తు అనునది యేర్పడును. అపుడు బ్రాహ్మణులను పితృ దేవతలను నర్చింప దగును. దానాదులొనర్ప వలయును.

ఆహోరాత్రార్ధమాసౌతు కాలాః కష్టాఃక్షణాస్తథా

పౌర్ణమాసీతువిగ్నేయా అమావాస్యాతథైవచ

సినీవాలీకుహూశ్చైవ రాకాచానుమతి స్తథా

తపస్తపస్యౌమధుమాధవౌచ శుక్రశ్శుచిశ్చాయనముత్తరం స్యాత్

నభోనభస్యౌచఝషస్తథోర్జస్సహస్సహస్యావితిదక్షిణంస్యాత్

లోకాలోకస్తుయశ్శైలఃప్రాగుక్తోభవతోమయా

లోకపాలాస్తుచత్వారస్తత్రతిష్ఠన్తిసువ్రతాః

సుధాన్వాశంఖపాశ్చివకర్దమస్యాత్మజౌద్విజ!

హిరణ్యరోమాచై వాన్యశ్చతర్ధఃకేతుమానపి

నిర్ ద్వన్ద్వానిరభిమానావిస్తన్ద్రానిష్పరిగ్రహాః

లోకపాలస్థ్సితాహ్యేతేలోకాలోకేచతుర్దిశమ్

ఉత్తరంయదగస్త్యస్య అజవీథ్యాశ్చదక్షిణమ్

పితృయానస్సవైపన్థా వైష్యానరపథాద్బహిః

తత్రాసతేమహాత్మానో ఋషయోయేఽగ్నిహోత్రిణః

భూతారమ్భకృతంబ్రహ్మ శంసన్తోఋత్విగుద్యతాః

ప్రారభన్తే లోకకామాస్తేషాంపన్థాస్సదక్షిణః

చలితంతేపునర్ బ్రహ్మస్థాపయన్తియుగేయుగే

సంతత్యాతపసాచై వమర్యాదాభిశ్శ్రుతేనచ

జాయమానాస్తుపూర్వేతే పశ్చిమానాంగృహేషువై

పశ్చిమాశ్చైవపూర్వేషాం జాయన్తేనిధనేష్విహ

ఏవమావర్తమానస్తే తిష్ఠన్త్యాభోతసంప్లవాత్

సవితుర్ధక్షినంమార్గం శ్రితాహ్యాచంద్రతారకమ్

నాకవీథ్యురంయచ్చసప్తర్షిభ్యశ్చదక్షిణమ్

ఉత్తరస్సవితుఃపన్థాదేవయానస్తుసస్మృతః

తత్రతేవశినస్సిద్ధావిమలా బ్రహ్మచారినః

సంతతింతేజుగుప్సన్తి తాస్మాన్మృత్యుర్జితశ్చతైః

అష్టాశీతిసహస్రాణిమునినామూర్ ధ్వరేతసామ్

ఉదక్పన్థానమర్యమ్ణశ్శ్రితాన్యాభూతసంప్లవాత్

తేఽసంప్రయోగాల్లోభాస్య మైథునసయాచవర్జనాత్

ఇచ్చాద్వేషాప్రవృత్త్యాచ భూతారమ్భవివర్జనాత్

పునశ్చాకామాసంయోగాచ్చబ్దాదేఃదోషదర్శనాత్

త్రైలోక్యస్తితికాలోఽయమపునర్మారఉచ్యతే

బ్రహ్మహత్యాశ్వ మేదాభ్యాం పాపపుణ్యకృతోవిధిః

ఆభూతసంప్లవాన్తంతత్ఫలముక్తంతయోర్ ద్విజ

యావన్మాత్రప్రదేశేతు మైత్రేయావస్థితో ధ్రువః

క్షయమాయాతితావత్తు భూమేరాభూతసంప్లవాత్

ఊర్ద్వోత్తరమ్రుశిభ్యస్తు ద్రువోయాత్రవ్యవస్థితః

ఏతద్విష్ణుపదందివ్యం తృతీయంవ్యోమ్నిభాస్వరమ్

నిర్దూతదోషపంకానాంయతీనాంసంయతాత్మనామ్

స్థానంతత్పరమంవిప్రపుణ్యపాపయపరిక్షయే

అపుణ్యపుణ్యోపరమే క్షీణాశేషాప్తిహేతవః

యత్రగాత్వానశోచన్తి తద్విష్ణోఃపరమంపదమ్

ధర్మధ్రువాద్యాస్తిష్ఠన్తి యత్రవై లోకసాక్షిణః

తత్సార్ ష్ట్యోత్పన్నయోగేద్దాస్తద్విష్ణోఃపరంపదమ్

యాత్రోతమేతత్రోతంచ యద్భూతంసచరాచరమ్

భావ్యంచవిష్ వంమైత్రేయ! తద్విష్ణోఃపరమంపదమ్

దివీవచక్షురాతతం వితతంయన్మహాత్మనామ్

వివేకాజ్ఞానద్రుష్టంచ తద్విష్ణోఃపరమంపదమ్

యస్మిన్ ప్రతిష్ఠితోభాస్వాన్ మేధీభూతస్స్వయంధ్రువః

ధ్రువేచసర్వజ్యోతీంషి జ్యోతీష్ష్వమ్భోముచోద్విజ!

మేఘేషుసంతతావృష్టిర్వృష్టేస్సృష్టేశ్చపోషణమ్

ఆప్యాయనంచ సర్వేషాం దేవాదీనాంమహామునే!

తతశ్చాజ్యాహుతిద్వారా పోషితాస్తేహవిర్భుజః

సృష్టేఃకారణతాం యాన్తి భూతానాంస్థితయేపునః

ఏవమేతత్పదంవిష్ణోస్తృతీయమమలాత్మకమ్

ఆధారభూతంలోకానాంత్రయాణాంవృద్ధికారణమ్

తతఃప్రభవతి బ్రహ్మన్ సర్వపాపహరాసరిత్

గంగాదేవాంగనాంగానామనులేపనపింజరా

వామపాదామ్భుజాంగుష్టనఖస్రోతోవినిర్గతామ్

విష్ణోర్బిభర్తియాం భక్త్యా శిరసాఽహర్నిశంధ్రువః

తతస్సప్తర్శయోయస్యాః ప్రాణాయామపరాయణాః

తిష్ఠన్తివీచిమాలాభిరుహ్యమానజటాకలే

వార్యోఘైస్సంతతైర్యస్యాఃప్లావితంశశిమణ్డలమ్

భూయోదికతరా కాన్తింవహత్యేతదహఃక్షయే

మేరుపృష్టేపతిత్వోచ్పైఃనిష్క్రాన్తశశిమణ్డలాత్

జగతఃపాపనార్థాయ యాప్రయాతి చతుర్దిశమ్

సితాచాలకానన్దాచచక్షుర్భద్రేతిసంస్థితా

ఏకైకయాచతుర్భేదా దిగ్బేదగతిలక్షణా

భేదంచాకనన్దాఖ్యంయస్యాశ్శార్వోఽపిదక్షిణమ్

దధారశిరసాప్రీత్యావర్షాణామధికంశతమ్

శంభోర్జటాకలాపాచ్చ వినిష్క్రాన్తాస్థి శర్కరాః

ప్లావయిత్వాదివంనిన్యే యాపాపాన్ సగారాత్మజాన్

స్నాతస్యసలిలేయస్యాస్సద్యఃపాపంప్రణశ్యతి

అపూర్వపుణ్యప్రాప్తిసద్యోమైత్రేయ! జాయతే

దత్తాఃపితృభ్యోయాత్రాపస్తానయైఃశ్రద్దాయాఽన్వితైః

సమాశాతంప్రయచ్చన్తి త్రుప్తింమైత్రేయ! దుర్లభామ్

యాస్యామిష్ట్వామహాయజ్ఞైర్యజ్ఞేశం పురుషోత్తమమ్

ద్విజభూపాః పరామృద్దిమవాపుర్దివిచేహచ

స్నానాద్విదూతపాపాశ్చయజ్జలేయతయస్తథ

కేశవాసక్తమానసః ప్రాప్తానిర్వాణముత్తమమ్

శ్రుతాభిలషితాదృష్టాస్ప్రుష్టాపీతావగాహితా

యపావయతిభూతాని కీర్తితాచదినేదినే

గంగాగంగేయన్నామయోజనానాం శతేష్వపి

స్థితై రుచ్చార్దితంహన్తిపాపంజన్మత్రయార్జితమ్

యతస్సాపావనాయాలంత్రయాణాంజగతామపి

సముద్భూతాపరంతత్తుతృతీయంభగవత్పదమ్

లోకలోకమను పర్వతమున సుథన్వుడు, శంఖపుడు అను కర్దాముని కొడుకు లిర్వురు. హిరణ్యరోముడు కేతుమంతుడు అను నిర్వురును ద్వంద్వాతీతులు నిరభిమానులు నై నాల్గు దెసలు నల్గురును పాలకులై యుందురు. అగస్త్యుని కుత్తరముగా, అజవీధికి దక్షిణముగా ధూమాది మార్గమను పేరా పితృ యానమను మార్గమున్నది. అది వైశ్వానర మార్గమున కవ్వల గలదు. అట అగ్ని హోత్రములు సేసిన పుణ్యు లుందురు. భూతముల సృష్టికి గారణమైన బ్రహ్మ వేదమును బఠించుచు ఋత్విక్కుల ద్వారమున కర్మ మాచరించు వార లుందురు. అది వారి మార్గము. దక్షిణమున యుగయుగమున జలించు బ్రహ్మమును వేదమును వారుద్దరింతురు. ఆ యుద్దరణము వంశ ప్రవర్తనము చేత తపస్సు చేత వర్ణాశ్రమాది వ్యవస్థల చేత శాస్త్ర ప్రవర్తనము చేత వారు చేయుచుందురు. వారు భూత ప్రళయము జరుగు దాక సూర్యాది దక్షిణ మార్గమున వసించి చంద్ర నక్షత్ర మండలము లున్నంత వరకు, తండ్రి కుమారుని యందు కుమారుడు మరల తండ్రి యందు నాయాకులము లందు అధికారికమైన కర్మము వలన బుట్టు చుందురు. నాగ వీది కుత్తరముగా సప్తర్షి మండలమునకు దక్షిణమున సూర్యుని యుత్తర మార్గము అర్చిరాది మార్గమును పేరా దేవయానము నున్నది. అచటి వారు జితంద్రియులై, పరిశుద్ధులై సిద్దులయి బ్రహ్మచారులై సంతానము నెడ జుగుప్స గలవారై యుందురు. సంతాన విముఖులై యుండుట చేత మృత్యువును జయించి యుందురు. అమృతు లగుదురని యర్ధము. ఎనుబది వేలమంది యూర్ధ్వ రేతస్కులైన మునులు యుత్త మార్గము నాశ్రయించి, ప్రళయము దాక సంచరింతురు. లోభము విడిచి, మిధునము విడిచి, ఇచ్చ, ద్వేషము లేక భూతముల నారాదించుట మాని కామము విడిచి శబ్దాదులగు విషయములు దుష్టములని తెలియుట వలనను, శుద్దులై యమృతులయ్యెదరు. ఇతన మృతత్వమనఁగా జిరకాలము, అనఁగా బ్రహ్మ మొదలు పగటికాల మంతయు పునరావృత్తి లేక యుందురు. భీతి ప్రళయము జరుగ నంతకాల ముండుతయే యిట నమృతత్వము అని పేర్కొన బడినది. త్రిలోకముల యొక్క స్థితి కిది సమయము. అపునర్నాకమని దీనికే పేరు. బ్రహ్మ హత్యచే నగు పాపము ఆశ్వమేధముచేఁ గల్గు పుణ్యము, భూత ప్రళయము దాక అనుభవింప వలసినవి. భూమి నుండి ధ్రువ మండలము దాక గల్గు మేలును సర్వమును భూత ప్రళయమున నశించును. సప్త ధ్రువముల కుత్తరముగా బైన ధ్రువుఁడున్నాడు. ఇదే విష్ణుపదము. భూమి నుండి మూడవ దివ్య స్థానము ఆకాశమునఁ బ్రకాశము గల్గి యుండునది. పాపముల వాసి మనసు గెల్చిన యతుల కది నివాసము. అదే వైరాజుని హృదయ నాడీ స్థానము. విష్ణు నివాస మదియే. ఇది స్వర్గము కంటె గొప్పది. (మీదిది సత్య లోకము కంటె క్రిందిది. పుణ్య పాపములు రెండును క్షీణమైన వారిట నుందురు. అనఁగా మొక్షార్హు లుండు చోటని యర్ధము. ఆ మోక్షము కూడ క్రమముక్తిని సూచించునదే. ఇట నున్నవారు, దేహము పొందుటకుఁ గల హేతు వులన్నియు క్షీణమయి, క్రమముగా బ్రహ్మ లోకమున కేగి బ్రహ్మతోఁబాటు మోక్షము పొందుదురు. ఏ లోకమున, విష్ణునితో సమానైశ్వర్యము వడసి, ఇంద్రియాదుల గెల్చినందు వలనఁ గలిగిన యోగ సమాధిచే, వేలుంగు వారు చరింతురో యది యా విష్ణువు యొక్క పరమ పదము. ఆకాశమున సర్వ ప్రకాశమై ప్రాపంచిక మైన జ్ఞానము కంటె భిన్నమైన వివేక జ్ఞానముచే నింతింత యని నిర్ణయింప రానిదిగాఁ జూడబడు నాస్తానమే విష్ణువు యొక్క పరమ పదము. ఏ స్థానమున నిలువు గాంచి వెలుంగు వాఁడై స్వయముగా ధ్రువుఁదున్నాడో ఏ ధ్రువుని యందెల్ల జ్యోతిస్సు, జ్యోతిస్సుల యందు మేఘములు, మేఘముల యందెడతెగని వర్షము, వర్షము వల్ల పోషణము, దేవాదులకు తృప్తి కలుగు చున్నదో, అజ్యాహుతులచే (నేయి హోమములు చేయుటచే) దేవతలు పోషింపఁబడి, సృష్టికిఁ గారణులై, భూతముల రక్షణ మొనర్చు చున్నారో, అట్టి దానికెల్ల నాధారమై, ముల్లోకముల వృద్దిని గూర్చునట్టి యా మూఁడవ స్థానము విష్ణు పదము. ఆ విష్ణు పదము నుండి గంగా నది, సర్వ పాపముల హరించు నదియై, దేవతా స్త్రీల శరీర గంధములచేఁ (నెఱ్ఱనిదై) బరమళించునదై. (ప్రభవించినది లెస్సగా నేర్పడినది) త్రివిక్రముని పాదముచేఁ బగిలిన బ్రహ్మాండము యొక్క పగులులో నుండి యది జనించినది. విష్ణు పాదముచే. బ్రహ్మాండము పగిలి యంబరము నుండి, విష్ణుమాయ, విష్ణు పాద మను వజ్రము వంటి యూరు దండముచేఁ గొట్టబడిన బ్రహ్మాండము తూటుపడి యందుండి భూమి కేగెను. అనఁగా నడి వరకుఁ బుట్టి యున్నను దృష్టికి గోచరము కాకుండ యున్న యా నది యది మొదలు దేవాదులకుఁ దృప్తి కలిగించుచుఁ బ్రకట మయినది. బ్రహ్మయొక్క కమండలు జలముచేఁ విష్ణు పాదము కడుగఁ బడెననియు, నది చాలకపోగా ధర్మము బ్రహ్మజ్ఞచే నీరుగా మారెననియు, నదియుం జాలకున్న బ్రహ్మాండ కటాహము తూటు పడగా నందుండి వెలుపలి ధారగా నా కన్నము నుండి వెడలి విష్ణు పాదము స్పృశించుచు భూమి కరిగెననియు, నదియె గంగ యయ్యెనని పురాణము లందున్నది. విష్ణుని ఎడమ పాదము యొక్క బొటన వ్రేలి గోటి నుండి వెడలిన యా గంగను ధ్రువుఁడు భక్తితో నెత్తిపై భరించు చున్నాడు. ఆవల సప్తర్షులు ప్రాణాయామ పరులై, యఘమర్షణ స్నానము చేయుచు నా నీట జడల దేలించు చుందురు. ఆ జల ప్రహములచేఁ జంద్ర మండలము దడుపఁబడి రాత్రి వేళ మిక్కిలి కాంతిని వహించును. చంద్రమండలము నుండి మేరుగిరిపై బడి, లోకములు పావనము లొనర్ప నాల్గు దెసలకుఁ బ్రవహించు చున్నది. ఆయా దిక్కుల కేగుటంబట్టి, సీత, అలకనంద, చక్షువు, భద్రా అను పేరుల గొని యున్నది. అలకనందయను శాఖను నూరు వత్సరముల కంటె నెక్కువగా శిరమ్మున ధరించెను. అతని జటాకలాపము నుండి దిగి సాగర కుమారుల యస్థి చూరములం దడిపి, వారి కుత్తమ గతు లనుగ్రహించెను. అందు స్నాన మొనర్చిన నప్పుడే పాపము పోవును. అపూర్వమైన పుణ్యము లభించును. కుమారులు తండ్రులకు వదలిన యీ యుదకములు నూరేండ్ల వరకు వారికిఁ దృప్తి నిచ్చును. గంగా, గంగా అని రెండు మార్లు తలంచినఁ జాలు మూడు జన్మల పాపము నశించును.