విష్ణు మహా పురాణము

10 - నిత్యనైమిత్తిక కామ్యక్రియ వర్ణనమ్ పాణిగ్రహ విధానమ్

సగరుడు:

కథితంచాతురాశ్రమ్యం చాతుర్వర్ణ్య క్రియాస్తథా

పుంసఃక్రియామాహంశ్రోతుమిచ్చామి ద్విజసత్తమ!

నిత్యాంనైమిత్తికాంకామ్యాం క్రియాంపుమ్సామశేషతః

సమాఖ్యాహిభగుశ్రేష్ఠ! ధర్మజ్ఞోహ్యసిమేమతః

సగరుడు:

బ్రాహ్మణోత్తమా! నాల్గాశ్రమముల యొక్కయు వర్ణముల యొక్కయు కర్తవ్య క్రియలు చెప్పితివి. నీవు సమస్త ధర్మముల నెఱింగిన వాడవు. కావున మానవుడాచరింప వలసిన నిత్య నైమిత్తిక కామ్య కర్మము నెల్ల వినగోరేద నెఱింగింపుము.

ఔర్యుడు:

యదేతదుక్తంభవతా నిత్యనైమిత్తికాశ్రితమ్

తదహంకథయిష్యామి శృణుష్వైకమానామమ

జాతస్యజాతకర్మాదిక్రియాకాణ్డమ శేషతః

పుత్రస్యకుర్వీతపితా శ్రాద్ధంచాభ్యుదయాత్మకమ్

యుగ్మాంస్తుప్రాఙ్ముఖాన్విప్రాన్ భోజయేన్మనుజేశ్వర

యథాతృప్తిస్తథాకుర్యాద్ దై వంపిత్ర్యస్వజన్మనామ్

దధ్నా యవైస్సబదరైఃమిశ్రాన్ పిణ్దాన్ముదాయుతః

నాన్దీముఖేర్థ్యేభ్యస్తీర్థేన దద్వాద్ దీవేన పార్థివ!

ప్రాజాపత్యేనవాసర్వముపచారం ప్రదక్షిణమ్

ప్రకుర్వీతతథాఽశేషవృద్దికాలేషుభూపతే

తతశ్చనామకుర్వీత పితైవ దశమేఽహని

దేవపూర్వంనరాఖ్యంహి శర్మవర్మాదిసంయుతమ్

శర్మేతిబ్రాహ్మణస్యోక్తం నాపశాబ్దయుతంతథా

నామఙ్గల్యంజుగుప్సావన్నామకుర్యాత్సమాక్షరమ్

నాతిదీర్ఘంనాతిహ్రస్వం నాతిగుర్వక్షరాన్వితమ్

సుఖోచ్చార్యంతుతన్నామ కుర్యాద్యత్ప్రవణాక్షరమ్

తతోఽనన్తరసంసంస్కారసంస్కృతోగురువేశ్మని

యథోక్తవిధిమాశ్రిత్యకుర్యాద్విద్యాపరిగ్రహమ్

గృహీతవిద్యోగురవేదత్త్వాచగురుదక్షిణామ్

గార్హాస్థ్వ మిచ్చాన్ భూపాలకుర్యాద్దారపరిగ్రహమ్

బ్రహ్మచార్యేణవాకాలం కుర్యాత్సంకల్పపూర్వకమ్

గురోశ్శుశ్రూషణంకుర్యాత్తత్పుత్రాదేరథాపివా

వైఖానసోవాపిభావేత్పరి వ్రాడథవేచ్చయా

పూర్వంసంకల్పితంయాదృక్కు ర్యాన్మహీపతే

వర్ షైరేకగుణాంభార్యాముద్వ హేత్త్రిగుణస్స్వయమ్

నాతికేశామకేశాంవా నాతికృష్ణాంనపిఙ్గళామ్

నిసర్గతోఽదికాఙ్గాంచా న్యూనాఙ్గాంవాపినోద్వహేత్

నావిశుద్దాంసరోమాంవా కులజాంవాఽతిరోగిణీమ్

నుదుష్టాందుష్టవాక్యాంవా వ్యఙ్గినీంపితృమాతృతః

నశ్మశ్రువ్యఞ్జనవతీం నచైవపురుషాకృతిమ్

నఘర్ ఘరస్వరాంక్షామాం తథాకాకస్వరాంనచ

నానిబన్దేక్షణాంతద్వాద్వృత్తాక్షీంనోద్వాహేద్భుధః

యస్యాశ్చరోమ శేజఙ్ఘే గుల్భౌయస్యాస్తథోన్నతౌ

గణ్డయోః కూబరౌయస్యా హసన్త్యాస్తాంచనోద్వాహేత్

నాతిరూక్షవింపాణ్దూకారజామరుణేక్షణామ్

ఆపీనహస్తపాదంచనకన్యాముద్వ హేద్భుదః

నవామనాంనాతిదీర్ ఘంనోద్య హేత్సంహతభ్రువమ్

నచాతిచ్చిద్రదశనాంనకరాక్షముఖీం నరః

పఞ్చమీంమా తృపక్షాచ్చ పిత్రుపక్షాచ్చసప్తమీమ్

గృహస్థశ్చోద్వ హేత్కన్యాం న్యాయేన విదినానృప

కమ్యోదకప్రదానంతేమయైతాత్కథితంనృప

యద్దత్వాప్రీణయత్యేత న్మనుష్యస్సకలంజగత్

బ్రాహ్మోదైవస్తథైవార్షః ప్రాజాపత్యస్తథాసురః

గాన్ధర్వరాక్షసౌచాన్యౌ పైశాచశ్చాష్టమోఽధమః

ఏతేషాంయస్యయోధర్మ వర్ణస్యోక్తోమహర్షిభిః

కుర్వీతదారగ్రహణం తేనాన్యత్ పరివర్ణయేత్

సధర్మచారిణీంప్రాప్యగార్హస్థ్యంసహితస్తయా

సముద్వాహేద్దదాత్యేతత్సుమ్యగూఢంమహత్ఫలమ్

ఔర్యుడు:

నీవడిగిన దానిని చెప్పెదను. ఏకాగ్ర మనస్కుడవై వినుము. తండ్రి కుమారుడు పుట్టగనే జాతకర్మ మున్నగునవి అభ్యుదయ శ్రద్ధతో జేయ వలయును. ఓ రాజా! ప్రాఙ్ముఖులగు బ్రాహ్మణ దంపతులను భుజింప జేయవలెను. హేతువాగు సంస్కారములను పిత్రర్చనలను బ్రాహ్మణులకు తృప్తి కలుగ నట్లు చేయవలెను. పెరుగు, యవలు, రేగుపల్లు వీనితో మిశ్రమమైన పిండములను సంతోషముతో నాందీముఖ దేవతల నుద్దేశించి దైవతీర్థ (కరాగ్ర) ముతో సమర్పించ వలెను. సమస్త వృద్ది కాలము లందు (కన్యాపుత్ర వివాహాదు లందు వి.పు.3 అం.13అ. 5,6 శ్లోకములలో చెప్పా బడినది.) ఉపచారముల నెల్ల ప్రాజాపత్య తీర్థము (కనిష్టికా మూలము)లో ప్రదక్షిణముగ చేయ వలయును. పిమ్మట తండ్రి పురుడు పడవ రోజు గడువగానే (11వ రోజున) కుల దేవతా నామయుక్తమై పురుష వాచకముగ నుండి బ్రాహ్మాణాదులగు నాల్గు వర్ణముల వారికి క్రమముగ శర్మ వర్మ గుప్త దాస పదములంతము నందు గల నామము నుంచ వలెను. అర్థశూన్యము అప్రశస్తము అపశబ్ద సహితము అమంగళకరము ఏవగింపును కలిగించునదియు గాక సమాక్షరములు గలదియుయై అథి దీర్ఘాక్షరములు అతి హ్రస్వాక్షరములు అథి గురు వర్ణ సమేతము కానిది సుఖముగ నుచ్చరింప దగినది లఘ్వక్షరములు చివర గలదై యుండు పేరును పెట్టవలెను. పిమ్మట బాలుడు అనంతర సంస్కారము (ఉపనిష్క్రమణ, అన్నప్రాశన, ఉపనయనము) లచే సంస్కరింప బడినవాడై విధి ననుసరించి విద్యాస్వీకారము చేసి, గురువునకు దక్షిణ నొసంగి గృహస్థాశ్రమము కోరి భార్యను చేపట్ట వలెను. లేక సంకల్ప పూర్వకముగా నైష్టిక (యావజ్జీవ) బ్రహ్మచార్యముతో నైనను కాలము గడుప వచ్చును. గురువునకు లేక వారి పుత్రాడులకు శుశ్రూష చేయవలెను. ఇచ్చ ననుసరించి అనగా పూర్వ సంకల్పమును బట్టి వానప్రస్థుడు లేక పరివ్రాజకుడు (సన్యాసి) కావచ్చును. ఏకగుణ వయస్కయగు భార్యను త్రిగుణ వయస్కుడగు నాతడు పెండ్లాడ వలెను. అనగా తనకంటే చిన్నదానిని వివాహము చేసికొన వలయునని తాత్పర్యము. అధిక కేశములు కలది, లేక కేశ శూన్యయైనది మిక్కిలి నల్లనిది గోరోచన వర్ణము గలది స్వభావ విరుద్ధముగా నధికాంగము గలదియు హీనాంగములు గలదియు అపరిశుద్ద మైనదియు దుష్కులమున బుట్టినదియు అదిక రోమములు గలది అతి రోగవతియు, దుష్టురాలు, దుష్ట వాయము లాడునది కుష్టాది రోగాలగు తల్లి దండ్రులు గలది పుంస్త్వాభివ్యన్జకమగు గడ్డము మీసాలు గలది, పురుశాకారము గలది, ఘర్ఘర స్వరము గలది, క్రుశించినది, కాకి ధ్వని గలది, చంచల దృష్టి గలది, గుండ్రని నేత్రములు గలది, రోమయుతము లగు పిక్కలు గలది, ఎత్తైన చీలమండలము గలది, నవ్వుచుండగా గుంటలు పడు చక్కిళ్ళు గలదియు వివాహమునకు పనికి రాదు. మిక్కిలి రూక్షమైన కాంతి కలది, తెల్లని గోళ్ళు కలది, ఎర్రని చూపు గలది, మిక్కిలి లావైన హస్త పాదములు గలది, మిక్కిలి పొట్టిది, మిక్కిలి పొడవైనది, కలిసి యున్న కనుబొమ్మలు కలది, మిక్కిలి ఎడమైన దంతములు గలది, భయంకర ముఖము గలదియు పనికి రాదు. మాతృ పక్షము నుండి అయిదవది, పితృపక్షము నుండి యేడవదియగను కన్యను ధర్మవిధి ననుసరించి వివాహమాడ వచ్చును, వివాహము లెనిమిది విధములు గలవు. బ్రాహ్మము, దైవము, ఆర్శము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. వీనిలో నేవర్ణముణ కేది ధర్మముగా మహర్షులచే చెప్పబడి యున్నదో దానిని స్వీకరించి యితరమును విడువ వలెను. తనతో కూడి ధర్మ మాచరించు దానితో చేసికొనిన సద్వివాహము మహాఫలము నొసంగును.