యయాతే శ్చతుర్థపుత్ర స్యానోస్సభానలచక్షుః పరమేషు సంజ్ఞాస్త్రయః పుత్రా బభూవుః॥
తస్మాదుశీనర తితిక్షూద్వౌపుత్రావుత్పన్నౌ॥
ఉశీనరస్యాపిశిబి నృగ నవ కృమి వర్మాఖ్యాః పంచపుత్రాబభూవుః॥
పృషదర్భ సువీర కేకయ మద్రకా శ్చత్వారశ్శిబిపుత్రాః॥
తితిక్షోరపి రుశద్రథః పుత్రోఽభూత్॥
తస్యాపి హేమః హేమస్యాపిసుతపాః సుతపసశ్చ బలిః॥
యస్యక్షేత్రేదీర్ఘతమసాంగవంగ కళింగ సుహ్మపౌణ్డ్రాఖ్యం బాలేయం క్షత్ర మజన్యత॥
యయాతి నాల్గవ కుమారుడగు అనువునకు సభానలచక్షుః పరమేషువులను వారు ముగ్గురు పుత్రులు గల్గిరి. సభానలుడు, కాలానలుడు, సృంజయుడు, పురంజయుడు, జనమేజయుడు, మహాశాలుడు, మహామనుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. మహామనునకు ఉశీనరుడు తితిక్షువు అను నిద్దరు గల్గిరి. ఉశీనరునకు శిబి నృగుడు నవుడు కృమి వర్మ యను నైదుగురు కుమారులు. శిబి కొడుకులు వృషదర్భ సువీర కేకయ మద్రకులను నల్గురు. తితిక్షువునకు రుశద్రథుడను వాడు గల్గెను. వానికి హేముడు వానికి సుతపుడు వానికి బలియుం గల్గిరి. అతని భార్య యందు దీర్ఘ, తమస, అంగ, వంగ, కళింగ, సుహ్మ, పౌణ్డ్రులను వారు క్షత్రజాతి వారు పుట్టిరి. ఇది బాలేయ (పవిక్షేత్రజ వంశమను ప్రసిద్ధి నందెను) ఆ సంతతి యొక్క పేర దేశములు నేర్పడినవి.
అంగాదనపాన స్తతోదివిరథ స్తస్మాద్దర్మరథః॥
యస్యాజపుత్రోదశరథ శ్శాన్తాంనామకన్యా మనపత్యస్యదుహితృత్వే యుయోజ॥
రోమపాదాచ్చతురంగః తస్మాత్పృథులాక్షః॥
తతశ్చమ్పః యశ్చమ్పాంనివేశయామాస॥
చమ్పస్య హర్యంగోనామాత్మజోఽభూత్॥
హర్యంగాద్భద్రరథః భద్రరథాద్బృహద్రథః బృహద్రథాద్బృహత్కర్మా బృహత్కర్మణశ్చ।
బృహద్భానుః తసాచ్చబృహన్మనాః బృహన్మనసోజయద్రథః॥
జయద్రథో బ్రహ్మక్షత్రాన్తరాల సంభూత్యాం పత్న్యాం విజయం నామపుత్ర మజీజనత్॥
యోగంగాగతో మంజూగతం పృథాపవిద్ధం కర్ణంపుత్ర మవాప॥
అంగుడు, అనపానుడు, దివిరథుడు, ధర్మరథుడు, చిత్రరథుడు (రోమపాదుడు) నను తండ్రి కొడుకుల వరుస ఏర్పడెను. రోమపాదుడు దశరథుని చెలికాడు. సంతతి లేని ఆ రోమపాదునకు శాంత యను కన్యను అజమహారాజు కుమారుడు దశరథుడు కుమార్తెనుగా నిచ్చెను. రోమపాదుడు చతురంగుడు, పృథులాక్షుడు, చంపుడు ననువారు వరుసగా తండ్రి కొడుకులు. చంపుడు చంపా నగర నిర్మాణము సేసెను. చంపుని కొడుకు హర్యంగుడు అతని కొడుకు భద్రరథుడు. అతని వాడు బృహద్రథుడు, అతనికి బృహత్కర, అతనికి బృహద్భానువు, అతనికి బృహన్మనుడు, అతనికి జయద్రథుడు గల్గిరి. జయద్రథుడు బ్రహ్మ క్షత్రకులముల సాంకర్యమున పుట్టినది యగు బహార్య యందు విజయునిం గనియె. విజయునికి ధృతి, యతనికి ధృతవ్రతుడు, అతనికి సత్యకర్మ, అతనికి అతిరథుడు గల్గిరి. ఇతడు గంగకు వెళ్లి పెట్టెలో నున్న వానిని పృథ (కుంతీ) చేత్యక్తమైన సుతుని కర్ణునిం బుత్రుంగా బడసెను. కర్ణునికి వృషసేనుడు గలిగె. ఇంతవరకు అంగ వంశ్యులు. ఈ మీద పూరు వంశము వినుము.
Summary of chapter 18 of the Vishnu Mahā Purāṇa is as follows:
Bali's sons Aṅga, Vaṅga, Kaliṅga, Suhma, and Pauṇḍra gave their names to the kingdoms of eastern India. From Aṅga descends Rompāda, the friend of Daśaratha. Campā city is founded by Campa. The lineage continues through Jāyadratha → Vijaya → Atiratha — who discovers the infant Karṇa in a basket on the Gaṅgā. Karṇa's son Vṛṣasena is also mentioned.