శ్రీపరాశరుడు:
ఆధ్యాత్మికాది మైత్రేయ! జ్ఞాత్వా తాపత్రయం బుధః।
ఉత్పన్నజ్ఞానవైరాగ్యః ప్రాప్నోత్యాత్యన్తికం లయమ్॥
ఆధ్యాత్మికోపిద్వివిధశ్శారీరో మానస స్తథా।
శారీరో బహుభిర్భేదైర్భిద్యతే శ్రూయతాం చసః॥
శిరోరోగ ప్రతిశ్యాయ జ్వర శూలభగన్దరైః।
గుల్మార్శశ్వయథుశ్వాసచ్ఛర్ ద్యాదిభిరనేకధా॥
తథాఽక్షిరోగాతీసార కుష్ఠాంగామయసంజ్ఞితైః।
భిద్యతే దేహజస్తాపో మానసం శ్రోతుమర్హసి॥
కామక్రోధ భయద్వేషలోభ యోహవిషాదజః।
శోకాసూయావమానేర్ ష్యామాత్సర్యాదిమయస్తథా॥
మానసోపి ద్విజశ్రేష్ఠతాపో భవతినై కధా।
ఇత్యేవమాదిభిర్భేదైస్తాపో హ్యాధ్యాత్మికః స్మృతః॥
మృగపక్షి మనుష్యాద్యైః పిశాచోరగరాక్షసైః।
నరీసృపాద్యైశ్చ నృణాం జయతే చాధిభౌతికః॥
శీతవాతోష్ణవర్షామ్బువై ద్యుతాదిసముద్భవః।
తాపోద్విజపర శ్రేష్ఠైః కథ్యతేచాధిదైవికః॥
గర్భజన్మ జరాజ్ఞాన మృత్యునారకజం తథా।
దుఃఖం సమస్రశోభో దైర్బిద్యతే మునిసత్తమ॥
సుకుమారతనుర్గర్భేజన్తుర్ బహుమలావృతే।
ఉల్బసంవేష్టితో భగ్నపృష్ఠగ్రీవాస్థిసంహతిః॥
అత్యమ్లకటుతీక్ష్ ణోష్ణలవణైః మాతృ భోజనైః।
అత్యంతతాపై రత్యథం వర్ధమానాతివేదనః॥
ప్రసారణాకుఞ్చనాదౌనాంగానాం ప్రభురాత్మనః।
శకృన్మూత్రమహావఙ్కశాయీ సర్వత్ర పీడితః॥
నిరుచ్ఛ్వాసస్సచై తస్యస్స్మరన్ జన్మశతాన్యధః।
ఆస్తేగర్భేఽతిదుఃఖేన నిజకర్మనిబన్ధనః॥
శ్రీపరాశరుడు:
ఆధ్యాత్మికము ఆదిభౌతికము నని తాపము మూడు రకములు. ఈ మూడింటి స్వరూప ముందెలిసి జ్ఞాన వైరాగ్యములను బొందినవాడు ఆత్యంతిక లయమును (ముక్తిని) బొందును. ఆధ్యాత్మిక తాపము రెండు విధములు. శరీరము మానసము నని. శరీర తాపము పలు రకములు విను. శిరో రోగము, ప్రతిశ్యాయము, పడిశము, జ్వరము, శూల భగందరము (గుహ్య మందలి పుండు), గుల్మ (పైత్యముచే), కడుపులో బుట్టు పుండు, ఆర్ష (మూలశంఖ), శ్వయథువు (వాపు), శ్వాస (ఒగరుపు), ఛర్ది (వాంతి) మొదలగు పెక్కు విధములు. కంటి రోగాలు, అతిసారము, కుష్ఠము, అన్గామయము (ఒడలు నొప్పులు మొదలయినవి), మానసా తాపము, కామాదుల వలన బుట్టు బాధ శోక అసూయ అవమాన ఈర్ష్య మాత్సర్యాది మయము మృగ పక్షి మనుష్య పిశాచోరగ రాక్షస సరీ సృపాదులగు భూతములచే గల్గు బాధ ఆధి భౌతికము. శీత వాత తపోష్ణవర్షాంబు వైద్యుతాదులచే గల్గు తాపము ఆది దైవికము. గర్భ జన్మరాజ్ఞాన మృత్యు నారక జన్యమయిన దుఃఖము వేలకొలది రకములుగ నుండును. జీవుడు మిక్కిలి సున్నిత మయిన శరీరము గల్గి మల పూరిత మయిన కడుపలో మావిచే గ్రమ్ముకొని పృష్ఠము మెడ ఎముకలు కుంచించు కొని పోవ మిక్కిలి పులుపు కారము తీక్షణ మయిన వేడియు గల తల్లి దిన్న యాహారాము లత్యంత తాపకారము లయిన వానిచే బెరుగు వేదనతో నవయవములు చాచుకొనుట ముడుచు కొనుట మొదలగు నవి చేసికొన లేక మూత్ర పురీష మయమగు పెను రొంపిలో పండుకొని అన్ని విధముల పీడ నందుచు నూపిరాడక చైతన్యము గలిగి యనేక పూర్వ జన్మములను స్మరించుచు తాను జేసిన ప్రారబ్ధమునకు గట్టుపడి గర్భమందు దుఃఖము గుడుచు చుండును.
జాయమానః పురీషాస్రుఙ్మూత్ర శుక్లావిలాసనః।
ప్రాజాపత్యేన వాతేన పీడ్య మానాస్థిబన్ధనః॥
అధోముఖోవైక్రియతే ప్రబలై స్సూతిమారుతైః।
క్లేశాన్నిష్ట్క్రాన్తిమాప్నోతి జఠరాన్మాతురాతురః॥
మూర్ఛామవాప్య మహతీం సంస్పృష్టో బాహ్యవాయునా।
విజ్ఞానభ్రంశ మాప్నోతి జాతశ్చ మునిసత్తమ॥
కంటకై రివతున్నాఙ్గః కక్రచై రివదారితః।
పూతి వ్రణాన్నిపతితో ధరణ్యాం క్రిమికోయథాll
కణ్డూయనేఽపిచాశక్తః పరివర్తేప్యనీశ్వరఃl
స్నానపానాదికాహారమప్యాప్నోతి పరేచ్ఛయాll
అశుచిప్ర స్తరేసుప్తః కీటదంశాదిభిస్తథాl
భక్ష్యమాణోఽపినై వైషాం సమర్థో వినివారణే ll
జన్మదుఃఖాన్యనేకాని జన్మనోఽనన్తరాణిచl
బాలభావే యదాప్నోతిహ్యాధిభౌతాదికానిచll
అజ్ఞానతమసాచ్ఛన్నోమూఢాన్తః కరణోనరఃl
నజానాతి కుతః కోహంక్వాహంగంతాకిమాత్మకఃll
కేనబన్ధేన బద్ధోహం కారణం కిమకారణమ్l
కింకార్యం కిమకార్యం వాకిం వాచ్యం కించనోచ్యతేll
కోధర్మః కశ్చవాధర్మః కస్మిన్వర్తేఽథవాకథమ్l
కిం కర్తవ్యమకర్తవ్యం కింవాకిం గుణదోషవత్ll
ఏవం పశుసమైర్మూఢైరజ్ఞానప్రభవం మహత్l
అవాప్యతేనరై ర్దుఃఖం శిశ్నోదరపరాయణైఃll
పుట్టునపుడు మూత్రపురీష రక్త శుక్లములు మొగముం గ్రమ్ముకొన ప్రాజాపత్య వాయువుచే పీడితములైన అథి సంధిబంధములు కలవాడై ప్రబలము లయిన ప్రసూతి వాయువులచే నధోముఖుడుగా జేయబడి అతికష్టము మీద తల్లి జఠరము నుండి వెలువడి నేలపై బడును. పడునపుడు మహామూర్ఛ నంది ఆతురుడై బాహ్య వాయువుచే దాకబడి విజ్ఞానము గోల్పోవును. పుట్టిన తర్వాత గూడ ముళ్ళు గ్రుచ్చుకొన్నట్లు రంపములచే గోయబడినట్లు మలమయ మయిన పుండు నుండి క్రిమి (పురుగు) వలె క్రిందిపడి దురదగొని గోకికొనలేక యటు నిటు తిరుగలేక (దొరలుటకు చేతకాక) పరేచ్ఛచే స్నానపానాదిక మయిన యాహారము నందును. మురికి మలమూత్రముల కంపు గొట్టు పడక (పొత్తిళ్ళ) బరుండి చీమలు నల్లులు దోమలు కుట్ట వానిం దోలుకోన లేక అనేక జన్మ దుఃఖములను జన్మాంతరములను బాల్యాది దశలందు గ్రమ్ము ఆది భౌతికాది దుఃఖము లను అజ్ఞానంధకారమున గుమిలి మనసు మూఢమై తెలియ నేరక నరుడు ఎటనుండి ఎవ్వడను నేను ఎక్కడికి పోవుచున్నాను నా స్వరూప మేమి యేమి బంధములో నేను బద్దుడను ఇందు కారణమేది యకారణ మేది ఏమి చేయవలె ఏమి చేయరాదు ఏమనవలె ఏమన గూడదు యధర్మమేది దేనియందు ఎట్లు నేను బ్రర్తింతును నేను చేయగూడని పనియేమి యేది గుణము కలది యేది దోషము గలది అని పశుప్రాయులై మూఢూలై యజానముచే శిశ్నోదర పరాయణులై యజ్ఞాన మహా దుఃఖములో గుమిలి పోవుదురు.
అజ్ఞానంతామసోభావః కార్యారమ్భ ప్రవృత్తయఃl
అజ్ఞానినాం ప్రవర్తన్తే కర్మలోపాత్తతోద్విజాఃll
నరకం కర్మణాం లోపాత్ఫలమాహుర్మనీషిణః।
తస్మాదజ్ఞానినాం దుఃఖమిహ చాముత్ర చోత్తమమ్॥
జరాజర్ జ్ఝరదేహశ్చ శిథిలావయవః పుమాన్।
విచలచ్ఛీర్ణదశనో వలిస్నాయుసిరావృతః॥
దూరప్రణష్టనయనో వ్యోమాన్తర్గతతారకః।
నాసావివరనిర్యాతలోమపుంజశ్చలద్వపుః॥
ప్రకటీభూతసర్వాస్థిర్నతపృష్ఠాస్థిసంహతిః।
ఉత్సన్నజఠరాగ్నిత్వా దల్పాహారోఽల్పచేష్టితః॥
కృచ్ర్ఛాచ్చంక్రమణోత్థానశయనాసన చేష్టితః।
మన్దీభవచ్చ్రోత్రనేత్రస్స్రవల్లాలా విలాసనః॥
ఆనాయత్తైస్సమస్తైశ్చ కరణై ర్మరణోన్ముఖః।
తత్‌క్ష ణేప్యనుభూతానా మస్మర్తాఖిలవస్తునామ్॥
సకృదుచ్చారితే వాక్యే సముద్భూత మహాశ్రమః।
శ్వాసకాశ సముద్భూతమహాయాస ప్రజాగరః॥
అన్యేనోత్థాప్య తేన్యేనతథాసంవేశ్యతేజరీ।
భృత్యాత్మపుత్ర దారాణా మవమానాస్పదీకృతః॥
ప్రక్షీణాఖిలశౌచశ్చ విహారాహార సస్పృహః।
హాస్యః పరిజనస్యాపి నిర్విణ్ణాశేషబాన్ధవః॥
అనుభూతమివాన్యస్నిన్ జన్మన్యాత్మ విచేష్టితమ్।
సంస్మరన్ యౌవన్తే దీర్ఘం నిశ్వసత్యతితాపితః॥
ఏవమాదీని దుఃఖాని జరాయామనుభూయవై।
మరణేయాని దుఃఖాని ప్రాప్నోతి శృణు తాన్యపి॥
అజ్ఞానము తమోగుణ జన్యము. ఒక పని (కర్మ) చేయుట మానుటయు నా యజ్ఞానము చేతనే జరుగును. కర్మ లోపముచే నరకము గల్గు నందురు పండితులు. అందుచే నజ్ఞానుల కిహమందు బరమందును మహా దుఃఖము తప్పదు. ముదిమిచే నొడలు బడలు వడి తల నెరిసి కన్నులు గ్రుడ్డివడి కనుపాపలు దించు కొనిపోయి ముక్కు సోణముల నుండి వెండ్రుకలు వెలువడి మెను వడక యెముక లన్నియు బయలుపడి వెన్నెముకలు వంగిపోయి జఠరాగ్ని పోయినందున అల్పాహారము అల్ప చేష్టయునై అతికష్టము మీద కదలుచు లేచుచు పరుండుచూ చెవులు కళ్ళు శక్తి గోల్పోవ చొంగగారి మొగమెల్ల గ్రమ్మ సర్వేంద్రియములు జడను పడి పనిచేయక మరణమునకు ఉన్ముఖుడై యాక్షణమున తాను గన్న, విన్న విషయములు జ్ఞాపకము రాక లేకలేక యోకమాట పలికిన దాన బెట్టు శ్రమగుడుచుచు శ్వాసకోశ రోగములచే బుట్టిన వేపరీతాయాసముచే నిద్రలేక ఇంకొకడు లేవదీయ పరుండబెట్ట ముసలియై నౌకరులు తన బిడ్డలు భార్యలు చేయు నవమానములకు గురియై శౌచ క్రియ లన్నియు పోయి విహారాహారముల మీద మాత్రము కోరిక పోక తోడివారు గూడ నవ్వ బంధువు లందరు నిర్విణ్నులయిపోగా వయస్సులో తన చేష్టితముల నేదో మరియొక జన్మయందనుభవించినట్లు స్మరించుచు పరితాప పడు నిట్టూర్పు పుచ్చును. ఇట్లనేక దుఃఖము లను ముదిమి యందనుభవించి యాపై మరణమందా జీవి కుడచు దుఃఖములను గూడ వినుము.
శ్లథద్గ్రీవాంఘ్రిహస్తోఽథ వ్యాప్తోవేపథునాభృశమ్।
ముహుర్‌గ్లానిః పరవశో ముహుర్ జ్ఞానలవాన్వితః॥
హిరణ్యధాన్యతనయ భార్యా భృత్యగృహాదిషు।
ఏతేకథంభవిష్య న్తీత్యతీవమమతాకులః॥
మర్మవిధ్బిః ర్మహారోగైః క్రకచైరివదారుణైః।
శరై రివాన్తకస్యోగ్రైశ్చిద్యమానానుబన్ధనః॥
పరివర్తితతారాక్షోహ స్తపాదం ముహుః క్షిపన్।
సంశుష్యమాణతాల్వోష్ఠపుటోఘురఘురాయతే॥
నిరుద్ధకంఠదోషౌఘిరుదానశ్వాసపీడితః।
తాపేనమహతావ్యాప్తస్తృషాచార్తస్తథా క్షుధా॥
క్లేశాదుత్ క్రాన్తిమాప్నోతి యమకింకర పీడితః।
తతశ్చ యాతనాదేహం క్లేశేనప్రతిపద్యతే॥
మరణ కాలమున కాళ్ళు చేతులు మెడ శిథిల మగును. అంతలోనే శ్రమ, అంతలోనే తెలివి, కంపము, పరవశత్వము, అల్పజ్ఞానము కలుగు చుండును. తన భార్య గృహము ధనము సేవకులు మున్నగునవి మున్నగునవి తన యనంతారమే మగును అను చింత కలుగు చుండును. ఱంపములతో గోయుచున్నట్లు మర్మస్థానము లందు బాధ, ఆస్థి సంధులలో యముని బాణములు గ్రుచ్చు కొనినట్లు బాధ, కనుగ్రుడ్లు తిరిగి పోవుచున్నట్లుండుట, కాళ్ళు చేతులు తనను కొనుట, కంఠము పెదవులు మొదలగునవి ఎండి పోయినట్లుండుట, శ్వాస ఆడకపోవుట, ఆకలి దప్పుల బాధ, యమభటులు పెట్టు బాధలు మున్నగు వానితో నతి క్లేశమున యాతనా దేహము ప్రవేశించును.
ఏతాన్యన్యానిచోగ్రాణిదుఃఖాని మరణే నృణామ్।
శృణుష్వ నరకేయాని ప్రాప్యన్తేపురు షైర్మృత్తైః॥
యామ్యకింకరపాశాదిగ్రహణం దణ్డతాడనమ్।
యమస్య దర్శనం చోగ్రముగ్రమార్గ విలోకనమ్॥
కరమ్భవాలుకా వహ్నియన్త్రశస్త్రాదిభీషణే।
ప్రత్యేకంనరకేయాశ్చ యాతనాద్విజ! దుస్సహాః॥
క్రకచైః పాట్యమానానాం మూషాయాం చాపిదహ్యతామ్।
కుఠారైః కృత్యమానానాం భూమౌచాపినిఖన్యతామ్॥
శూలేష్వారోప్యమాణానాం వ్యాఘ్రవక్త్రేప్రవేశ్యతామ్।
గృధ్రైస్సంభక్ష్యమాణానాం ద్వీపిభిశ్చోపభుజ్యతామ్॥
క్వాథ్యతాంతైలమధ్యేచక్లి ద్యతాంక్షారకర్దమే।
ఉచ్చాన్నిపాత్యమానానాం క్షిప్యతాం క్షేపయన్త్రకైః॥
నరకేయాని దుఃఖాని పాప హేతూద్భవానివై।
ప్రాప్యన్తేనారకై ర్విప్రతేషాం సంఖ్యానవిద్యతే॥
నకేవలం ద్విజశ్రేష్ఠా నరకే దుఃఖపద్దతిః।
స్వర్గేపిపాతభీతస్య క్షయిష్ణోర్నాస్తినిర్వృతిః॥
పునశ్చ గర్భేభవతి జాయతే చపునః పునః।
గర్భే విలీయతే భూయోజాయమానో స్తమేతివై॥
జాతమాత్రశ్చమ్రియతేబాలభావేథయౌవనే।
మధ్యమం వావయః ప్రాప్యవార్ధకం వాథవా మృతిః॥
యావజ్జీవతితావచ్చదుఃఖైర్నానావిధైః ప్లుతః।
తంతుకారణపక్ష్మౌఘైరా స్తేకార్పాసభీజవాత్॥
ద్రవ్యనాశేతథోత్పత్తౌ పాలనేచసదానృణామ్।
భవన్త్యనేక దుఃఖాని తథై వేష్టవిప త్తిషు॥
యద్యత్ప్రీతికరం పుంసాం వస్తు మైత్రేయ! జాయతే।
తదేవదుఃఖ వృక్షస్య బీజత్వముపగచ్చతి॥
కళత్రపుత్రమిత్రార్థగృహక్షేత్రద్నాదికైః।
క్రియతేనతథాభూరిసుఖం పుంసాయథాసుఖమ్॥
ఇతిసంసార దుఃఖార్కతాపతాపితచేతసామ్।
విముక్తిపాదపచ్చాయామృతేకుత్రసుఖం నృణామ్॥
తదస్యత్రివిధస్యాపి దుఃఖజాతస్యవై మమ।
గర్భజన్మజరాద్యేషు స్థానేషుప్రభవిష్యతః॥
నిరస్తాతిశ యాహ్లాదసుఖభావై కలక్షణా।
భేషజం భగవత్ ప్రాప్తి రేకాన్తాత్యన్తికీమతా॥
తస్మాత్తత్ ప్రాప్తయేయత్నః కర్తవ్యః పణ్డితై ర్నరైః।
తత్ ప్రాప్తి హేతుర్ జ్ఞానంచకర్మచోక్తం మహామునే॥
ఇక నరకములో యమభటులు పాశములతో గట్టుట, దండములతో గొట్టుట భయంకర యమ దర్శనము భయంకర మార్గములు, ఱంపములతో గోయుట మూసలలో వేసి క్రాచుట, గొడ్డళ్ళతో పగుల గొట్టుట భూమిలో పాతి పెట్టుట మున్నగు నరక యాతనలు దుస్సహములు, ఇవన్నియు నీ జీవుడు చేసిన పాపముల ఫలితములే. వీనినెల్ల లెక్కింప జాలము. స్వర్గమునకు వెళ్ళిన వారికి గూడ వారి పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడి పోవుదుమను దుఃఖము వెంటాడుచునే యుండును. కావున నచటను సుఖము లేదు. మరల గర్భమును చేరుట, పుట్టుట, తిరిగి బాల్యముననో, యౌవనము ననో, వార్ధక్యము ననో మరణించుట యను జనన మరణ ప్రవాహము సాగును. ఈ సంసారము నందేది సుఖ కారణమో అదియే దుఃఖమునకు కారణమగును. కావును ధార పుత్ర ధనాదు లందు సంగము పెంచు కొనక యీ తాపత్రయముల లోని దోషములను గుర్తించి ముక్తి కొఱకై యత్నించుట యొక్కటియే యీ బాధను తొలగించుటకు నౌషదము. వివేకు లందులకే యత్నింప వలెను.
ఆగమోత్థం వివేకాచ్చద్విధాజ్ఞానం తదుచ్యతే।
శబ్దబ్రహ్మా గమమయం పరం బ్రహ్మవివేకజమ్॥
అన్ధం తమ ఇవాజ్ఞానందీపవచ్చేన్ద్రియోద్భవమ్।
యథాసూర్య స్తథాజ్ఞానం యడవిప్రర్షేవివేకజమ్॥
మనురప్యాహవేదార్థం స్మృత్వాయన్మునిసత్తమ।
తదేతచ్చ్రూయతామత్రసంబంధేగదతోమమ॥
ద్వేబ్రహ్మాణీవేదితవ్యేశబ్దబ్రహ్మపరం చయత్।
శబ్దబ్రాహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి॥
ద్వేవైవిద్వేవేదితవ్యే ఇతిచాథర్వణీశృతిః।
పరమాయాత్వక్షర ప్రాప్తిః ఋగ్వేదాదిమయాపరా॥
యత్తదవ్యక్తమజరమచిన్త్యమజవ్యయమ్।
అనిర్దేశ్యమరూపంచపాణిపాదాద్యసం యుతమ్॥
విభుసర్వగతం నిత్యం భూతయోనిరకారణమ్।
వ్యాప్యవ్యాప్తం యతస్సర్వం యద్వైపశ్యన్తిసూరయః॥
తద్రహ్మతత్పరం ధామతద్ధ్యేయం మోక్షకాం క్షిభిః।
శ్రుతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణః పరమం పదమ్॥
తదేవభగవద్వాచం స్వరూపం పరమాత్మనః।
వాచకోభగవచ్ఛబ్దస్తస్యాద్యస్యాక్షయాత్మనః॥
ఏవం నిగదితార్థస్యసత్తత్త్వం తస్యతత్త్వతః।
జ్ఞాయతేయేనతద్ జ్ఞానం పరన్యత్త్రయీమయమ్॥
అశబ్దగోచరస్యాపితస్యవై బ్రాహ్మణోద్విజ।
పూజాయాం భగవచ్చబ్దః క్రియతేహ్యుపచారతః॥
శుద్దేమహావిభూత్యాఖ్యే పరేబ్రహ్మణిశబ్ధ్యతే।
మైత్రేయ! భగవచ్చబ్దస్సర్వకారణ కారణే॥
సంభర్తేతితథాభర్తాభకారోర్థద్వయాన్వితః।
నేతాగమయితాస్రష్టాగకారార్థస్తథామునే॥
ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్యయశసశ్శ్రియః।
జ్ఞానవైరాగ్యయోశ్శైవషణ్ణాంభగ ఇతీరణా॥
వసన్తితత్రభూతానిభూతాత్మన్యఖిలాత్మని।
సచభూతేష్వ శేషేషువకారార్థ స్తతోవ్యయః॥
ఏవమేషమహాన్ శబ్దో మైత్రేయ! భగవానితి।
పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్యనాన్యగః॥
తత్రపూజ్యపదార్థోక్తిపరిభాషాసమన్వితః।
శబ్దోయం నోపచారేణత్వన్యత్రహ్యుపచారతః॥
కర్మాచరణము జ్ఞానము నీరెండును ముక్తికి సాధనములే. ఆగమములలో జెప్పిన శబ్ద బ్రహ్మోపాసనము, వివేకము వలన కలిగెడి బ్రహ్మ తత్త్వ జ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్ద బ్రహ్మ తత్త్వమున కృతార్థుడైనచో పర బ్రహ్మత్వము ప్రాప్తించును. పరాఽపర విద్యల రెండును నెరుంగ వలసి యున్నవని అధర్వణీయ మగు ముండకోపనిషత్తు చెప్పు చున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్ఠాణము అపరావిద్య. అక్షర తత్త్వమగు పరబ్రహ్మము నందించునది పరావిద్య. పరబ్రహ్మ తత్త్వము, అవ్యక్తము, అజరము, అచింత్యము, అవ్యయము, అనిర్దేశ్యము, అరూపము, అపాణిపాదము, సర్వగతము, సత్యము, భూతయోని, వ్యాప్యము, వ్యాప్తమునై యున్నది. ఈ తత్త్వమును శూరులు మాత్రమే యెల్లప్పుడు దర్శింప గలరు. ఆతత్త్వమే విష్ణు భగవానుడు.
ఉత్పత్తిం ప్రళయంచై వభూతానామాగతిం గతిమ్।
వేత్తివిద్యామవిద్యాం చసవాచ్యోభగవానితి॥
జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజాంస్య శేషతః।
భగవచ్చబ్ధవాచ్యాని వినాహేయైర్గుణాదిభి॥
సర్వాణితత్రభూతాని వస న్తిపరమాత్మని।
భూతేషుచససర్వాత్మా వాసుదేవ స్తతస్స్మృతః॥
ఖాణ్డిక్య! జనకాయాహపృష్ఠః కేశిధ్వజ పురా।
నామవ్యాఖ్యామన న్తస్యవాసుదేవస్యతత్త్వతః॥
భూతేషువసతేసో న్తర్వస న్త్యత్రచాతానియత్।
ధాతావిధాతా జగతాం వాసుదేవ స్తతః ప్రభుః॥
భూతముల యుత్పత్తి వినాశములను, వాని రాకపోకలను, విద్యాఽవిద్యలను నెరింగిన మహానుభావుడే భగవత్పదవాచ్యుడు. హేయములగు దుర్గుణములు కాని, దోషములు గాని ఏమియు లేక జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులను నారు శక్తులు గలవాడే భగవానుడు. ఆ పరతత్త్వమునకు వాసుదేవుడని పేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నకు సమాధానముగా ప్రజాపతియే యీ వాసుదేవ పదమునకు నర్థము నిట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించువాడు, వాని స్థితిని వ్యవస్థ చేయువాడు కూడ ప్రభువగు వాసుదేవుడే.
ససర్వభూత ప్రకృతిం వికారాన్ గుణాంశ్చ దోషాంశ్చమునే! వ్యతీతః।
అతీత సర్వవరణోఽఖిలాత్మాతేనాస్తృతం యధ్బువనాన్తరాళే॥
సమస్త కల్యాణ గుణాత్మకోఽసౌస్వశక్తిలేశావృతభూతవర్గః।
ఇచ్ఛాగృహీతాభిమతోరుదేహస్సం సాధితాశేషజగద్దితోయః॥
తేజో బలైశ్యర్య మహావబోధసువీర్యశక్త్యాది గుణైక రాశిః।
పరః పరాణాం సకలా నయత్ర క్లేశాదయస్సన్తిపరాపరేశే॥
స ఈశ్వరో వ్యష్టిసమష్టిరూపోఽవ్యక్తస్వరూపః ప్రకటస్వరూపః।
సర్వేశ్వరస్సర్వదృక్సర్వవిచ్ఛ సమస్తశక్తిః పరమేశ్వరాఖ్యః॥
సంజ్ఞాయతేయేనతద స్తదోషం శుద్ధం పరం నిర్మల మేకరూపమ్।
సందృశ్యతేవాఽప్యవగమ్యతేవా తద్ జ్ఞానమజ్ఞానమతోఽన్యదుక్తమ్॥
అతడు సర్వ భూతులకును ప్రకృతి, మూలతత్త్వము. సమస్త గుణ దోషములకు నతీతుడు. సర్వావరణములకు నతీతుడు. అఖిలాత్ముడు. ఈ భువనాంతరాళ మంతయు ఆయనచేతనే ఆవరింపబడి యున్నది. అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు. స్వశక్తి లేశమాత్రము చేతనే సమస్త భూతసృష్టిని చేయగలడు. తన యిచ్చచేత తన కిష్టములగు గొప్ప రూపముల ధరించి, సమస్త లోకములకు హితమును సాధించును. తేజో బలైశ్వర్య వీర్యశక్తి జ్ఞానముల రాశి, పరమైన వానికంటె పరుడు. ఆ పరావరుని యందు నెట్టి క్లేశములు లేవు. అతడీశ్వరుడు. వ్యష్టి సమష్టిరూపుడు, వ్య్కతరూపుడు, అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు, సర్వద్రష్ట, సర్వశక్తియు నగు పరమేశ్వరుడు సమస్త దోష రహితమును, శుద్దమును, పరమును, నిర్మలమును, నేకరూపమును నగు నామహా తత్త్వమును నేది తెలుప గలదో, చూప గలదో, అవగతము చేయగలదో అది జ్ఞానము. తదితర మజ్ఞానము.
Summary of chapter 5 of the Vishnu Mahā Purāṇa is as follows:
The ātyantika (absolute) dissolution — mokṣa — is attained through knowledge of the tāpatraya: the three forms of suffering. Ādhyātmika (bodily and mental suffering), ādhibhautika (from other beings), and ādhidaivika (from nature) — their recognition produces vairāgya, which produces jñāna, which produces mokṣa. The chapter provides vivid descriptions of garbha-duḥkha (womb suffering), the torments of infancy and old age, the agonies of death, and the horrors of naraka. Even svarga is accompanied by the fear of falling — so no conditional state is truly a refuge. The Muṇḍakopaniṣat is cited to establish the teaching on the two vidyās (parā and aparā). The definition of Bhagavān is given: one who possesses the six qualities — jñāna, śakti, bala, aiśvarya, vīrya, and tejas — without any hēya (undesirable) qualities. This is Vāsudeva, the Paramātman, in whom all beings arise and to whom all return.