వ్యాసశ్చాహ మహాబుద్ధిర్యదత్తైవహివస్తుని।
తచ్చ్రూయతాం మహాభాగ! గదతో మమతత్త్వతః॥
కస్మిన్ కాలేఽల్పకోధర్మో దదాతిసుమహత్పలమ్।
మునీనాం పుణ్యవాదోఽభూత్ కైశ్చాసౌక్రియతే సుఖమ్॥
సందేహనిర్ణయార్థాయ వేదవ్యాసం మహామునిమ్।
యయు స్తేసంశయంప్రష్టుం మైత్రేయ! మునిపుంగవాః॥
దదృశు స్తేమునింతత్రజాహ్నవీసలిలేద్విజ।
వేదవ్యాసం మహాభాగమర్థస్నాతంసుతంమమ॥
స్నానావసానంతేతస్య ప్రతీక్షన్తోమహర్షయః।
తస్థుస్తీరేమహానద్యాస్తరుషణ్డముపాశ్రితాః॥
మగ్నోఽథ జాహ్నవీతోయాదుత్థాయహసుతోమమ।
శూద్రస్సాధుఃకలిస్సాధురిత్యేవం శృణ్వతాంవచః।
తేషాం మునీనాం భూయశ్చమమజ్జసనదీజలే॥
సాదుసాధ్వీతిచోత్థయ శూద్ర! ధన్యోఽసిచాబ్రవీత్॥
నిమగ్నశ్చ సముత్థాయపునః ప్రాహమహామునిః।
యోషితస్సాధుధన్యాస్తాస్తాభ్యోధన్యతరోస్తికః॥
తతస్స్నాత్వాయథాన్యాయమాచాన్తంచ కృతక్రియమ్।
ఉపతస్థుర్మహాభాగం మునయస్తేసుతంమమ॥
ఈ కలియుగ విశేష ప్రసంగములో మహాజ్ఞాని వ్యాసుడు పలికిన పలుకులు వినుము. మునులు తొల్లి యేకాల మందు అల్ప ధర్మమేని మహాఫల మిచ్చును. దేనిచే జీవులకు మహా సుఖము కల్గునన దాన మునులకు పూజ్యగోష్టి జరిగి వారు వేదవ్యాసుని ప్రశ్నింపగా గంగా జలముల నున్న యాయనను సగము స్నానము చేసినవాని నడిగిరి. స్నానము పూర్తియగు దాక తీరమందు చెట్ల క్రింద నిరీక్షించుచు కూర్చుండిరి. నా కుమారుడు వ్యాసుడు నీట మునిగి లేచి శూద్రుడు సాధువు అనుమాట వారు వినుచుండ నా మీద నతడు నీట మునుగక శూద్రా! బాగుబాగు ధన్యుడ వైనావని నీతి నుండి లేచి పలికెను. అవ్వల మరియొక సారి మునిగి లేచి యమ్మహా ముని స్త్రీలు ధన్యులు బాగుబాగు వారికంటే మరి ధన్యత లెవ్వరున్నారనియే? ఆ మీద యథావిధి స్నానము చేసి యనుష్టానము చేసికొన్న నా కొడుకును మునులు వందనములు చేసి యాసనము పై కూర్చున్న తరువాత మీరెందులకు వచ్చినారని సాత్యవతేయుడు వారిని ప్రశ్నించెను?
తమూచుస్సంశయంప్రష్టుం భవన్తంవయమాగతాః।
అలన్తేనాస్తుతావన్నః కథ్యతామపరంత్వయా॥
కలిస్సాద్వితీయత్ప్రోక్తం శూద్రస్సాధ్వితియోషితః।
యదాహభగవాంత్సాదు ధన్యాశ్చేతిపునః॥
తత్సర్వం శ్రోతుమిచ్చామోనచేద్గుహ్యం మహామునే।
తత్కథ్యతాంతతోహృత్ స్థంపృచ్చామస్త్వాం ప్రయోజనమ్॥
మాకు గల్గిన సందేహము నడుగ వచ్చితిమి. అది యట్లుండగనిమ్ము. మరియొకటి అడిగెదము తెల్పుము. కలి బాగు, శూద్రుడు బాగు, స్త్రీ బాగుబాగు. వారు ధన్యులని మరిమరి పల్కినావది యెల్ల గుహ్యము కాదేని వివరముగ వినగోరెద మదియానతిమ్ము. ఆ మీద మా హృదయ మందున్న మారాక ప్రయోజనము నడిగెదము. అన వ్యాస భగవానుడు నవ్వి మునివరులారా! వినుండు. బాగుబాగు అని నేనన్నదాని యభిప్రాయమిది
యత్కృతేదశభీర్వర్షై స్త్రేతాయాంహాయనేనతత్।
ద్వాపరేతచ్చమాసేనహ్యహో రాత్రేణతత్కలౌ॥
తపః సోబ్రహ్మచర్యస్య జపాదేశ్చఫలంద్విజా।
ప్రాప్నోతిపురుష స్తేన కలిస్సాద్వితిభాషితమ్॥
ధ్యాయన్ క్రుతేయజన్ యజ్ఞేస్త్రేతాయాంద్వాపరేఽర్చయన్।
యదాప్నోతి తదాప్నోతి కలౌసంకీర్త్య కేశవమ్॥
ధర్మోత్కర్షమతీవాత ప్రాప్నోతిపురుషః కలౌ।
అల్పాయాసేన ధర్మజ్ఞా స్తేనతుష్టోఽస్మ్యహంకలౌ॥
వ్రతచర్యాపరైః గ్రాహ్యావేదాః పూర్వంద్విజాతిభిః।
తతస్స్వధర్మసం ప్రాప్తైర్యష్టవ్యం విధివద్దనైః॥
త్రేతా యుగమందు పదేండ్లు చేసిన పుణ్యము కలిలో నొక్కయేడొనరించిన జాలును. ద్వాపర మందు ఒక్క నెల రోజులు సేసిన పుణ్యము కలిలో ఒక్క అహోరాత్రము ఆచరించిన జాలును. జపతపో బ్రహ్మచర్యాదుల ఫలమిట్లు ఫలించును. అందుచే కలి బాగు అంటిని. కృత యుగమున ధ్యానము చేసి త్రేతా యుగమున యజించి ద్వాపరమున నర్చించి యే ఫలము వడయునో యది కలి యందు విష్ణువును సంకీర్తనము సేసి పడయును. ఈ కలిలో పురుషుడు అల్పశ్రమ చేతనే ధర్మోత్కర్షను బొందును. అందుచేత నేను కలియుగ విషయమున సంతుష్టిం జెందెద. బ్రాహ్మణులు వృథా కథలు, వృథా భోజనము, వృథా యజ్ఞాచరణము సేసి పతితులగుదురు. కావున వారు మంచి నియమములు నిష్ఠ గలవారుగా నుండ వలయును.
అసమ్యక్కరణేదోషస్తేషాం సర్వేషువస్తుషు।
భోజ్యపేయాదికంచైషాంనేచ్చాప్రాప్తికరంద్విజాః॥
పారతంత్ర్యం సమస్తేషు తేషాంకార్యేషువై యతః।
జయన్తితేనిజాన్ లోకాన్ క్లేశేనమహతాద్విజాః॥
ద్విజశుశ్రూషయైవై షపాకయజ్ఞాధికారవాన్।
నిజాన్ జయతివై లోకాన్ శూద్రోధన్యతరస్తతః॥
భక్ష్యాభక్ష్యేషునాస్యాస్తి పేయాపేయేషు వైయతః।
నియ మోమునిశార్దూల స్తేనాసౌసాధ్వితీరితః।
స్వధర్మస్యావిరోధేననరై ర్లబ్ధంధనంసదా।
ప్రతిపాదనీయం పాత్రేషు యష్టవ్యంచ యథావిధి॥
తస్యార్జనే మహాన్ క్లేశః పాలనేచద్విజోత్తమాః।
తథాసద్వినియోగేచ విజ్ఞాతంగహనం నృణామ్॥
ఏవమన్యైస్తథాక్లేశైః పురుషాద్విజసత్తమాః।
నిజాన్ జయన్తివైలోకాన్ ప్రాజాపత్యాదికాన్ క్రమాత్॥
యోషిచ్చు శ్రూషణాద్భర్తుః కర్మణామనసాగిరా।
తద్దితాశుభమాప్నోతి తత్సాలోక్యంయతోద్విజాః॥
నాతిక్లేశేనమహతాతానేవపురుషోయథా।
తృతీయం వ్యాహృతం తేనమయా సాధ్వితియోషితః॥
ఏతద్వః కథితం విప్రాయాన్నిమిత్తమిహాగతః।
ఆయనుష్ఠానము అన్ని వస్తువుల యందు సరిగా జేయని యెడల దోషము సంక్రమించును. తినదగినది త్రావదగినది ఈ కలిలో వీరికి స్వేచ్చాను సారము చేయబడును. అన్ని పనుల యందు వారికి పరాధీనత తప్పదు. కావున నట్టివారు ఎన్నో క్లేశములు పడి యుత్తమ లోకములం గెలుతురు. బ్రాహ్మణ సేవ చేతనే శూద్రుడు పాక యజ్ఞాధికారము వడసి పుణ్య లోకముల సాధించును. కావున శూద్రుడు ధన్యుడన్నాను. స్వధర్మమునకు విరోధము గల్గకుండ మానవులు సంపాదించిన ధనమును సత్పాత్రములకీ వలెను. యథావిధి యజింప వలెను. అట్టి ధన సంపాదనములో క్లేశము. దానిని రక్షించుకొనుటలో మహా క్లేశము. అట్లే దాని వినియోగములో గూడ ఇంకెంతో తెలియ వచ్చును. అట్లనేక క్లేశములు పడి ప్రజాపత్యాది నిజ లోకములను మానవులు జయింతురు. పతి సేవ చేసి త్రికరణ శుద్ధిగ భర్తహితము కోరి అతిక్లేశపడి పురుషుడు సంపాదించు లోకము లెల్ల సులభముగ అతనితో స్త్రీ పొందును. అందుచే స్త్రీ బాగుబాగు! అని మూడవ వచనము పల్కితిని. ఇందులకై వచ్చిన వారు కావున మీకిది తెల్పితిని. ఇంకేమి కోరెద రడుగుడు తెల్పెదను.
ఋషయస్తేతతః ప్రోచుర్ యత్ప్రష్టవ్యం మహామునే।
అస్మిన్నేవచతత్ప్రశ్నే యథావత్కథితంత్వయా॥
తతః ప్రహస్య తానాహ కృష్ణద్వైపాయనో మునిః।
విస్మయోత్పుల్లనయనాంస్తాపసాం స్తానుపాగతాన్॥
మయైషభవతాం ప్రశ్నోజ్ఞాతో దివ్యేనచక్షుషా।
తతోహివః ప్రసంగేనసాధుసాధ్వితి భాషితమ్॥
స్వల్పేనహి ప్రయత్నేనధర్మస్సిధ్యతివై కలౌ।
సరై రాత్మగుణామ్భోభిః క్షాళితాఖిలకిల్బిషైః॥
శూద్రేశ్చ ద్విజశుశ్రూషాతత్పరైః ద్విజసత్తమాః।
తథాస్త్రీభిరనాయాసాత్పతిశుశ్రూషయైవహి॥
తతస్త్రితయమప్యేతన్మమధన్యతరంమతమ్।
ధర్మసంపాదనేక్లేశో ద్విజాదీనాం కృతాదిషు॥
భవద్భిర్యదభిప్రేతంతదేతత్కథితంమయా।
అపృష్టేనాపి ధర్మజ్ఞాః కిమన్యత్క్రియతాం ద్విజాః॥
తతస్సంపూజ్యవ్యాసం ప్రశశంసుః పునః పునః॥
యథాగతం ద్విజాజగ్ముః వ్యాసోక్తి కృతానిశ్చయాః॥
భవతోఽపి మహాభాగ! రహస్యం కథితంమయా।
అత్యన్త దుష్టస్యకలేరయమేకో మహాన్ గుణః॥
కీర్తనాదేవ కృష్ణస్యముక్తబన్ధః పరంవ్రజేత్॥
అని వ్యాసుడు ఋషులు ఇంకను నడుగ వలసిన ప్రశ్నములకు బ్రత్యుత్తర మిందులోనే నీవు తెల్పితి వనిరి. అంతట కృష్ణ ద్వైపాయనుడు నవ్వి, ఆశ్చర్యముచే విప్పారిన నవయవములు గల వారినిం గని ఈ మీ ప్రశ్నము దివ్యదృష్టితో నేను గ్రహించితిని. అందుచేతనే ప్రసంగ మాత్రమున బాగుబాగు అంటిని. కలిలో స్వర్గ మాత్ర ప్రయత్నము చేతనే ధర్మము సిద్ధించును. తమ సద్గుణములను జలములచే నెల్ల పాపములను బ్రక్షాళనము చేసికొన్న మానవుల కిది కలిలోనే సాధ్యము. శూద్రులు గూడ ద్విజ శుశ్రూషాపరులై స్త్రీ పతి శుశ్రూష చేసి ధన్యులగుదురు కావున నేనీ ముగ్గురును నత్యంత ధన్యులని తలంతును. కృతాది యుగము లందు ధర్మ సంపాదన మందు ద్విజాదులకు చాల శ్రమ యున్నది. మీరడుగ కుండనే మీ యభిప్రాయము గ్రహించి నేనిది తెల్పితిని. మఱియేమి సేయుమందురు? అనిన వారు వ్యాసుని బూజించి కొనియాడిరి. వ్యాస వచనము లందు నిశ్చయము గొని వచ్చిన దారిని మునులు చనిరి. నీకీ రహస్యమును దెల్పితిని. అత్యంత దుష్టుడైన కలికిగల గుణమిదొక్కటే. కృష్ణ కీర్తన మాత్రమున నరుడు బంధముక్తుడై పరమందును. నీవడిగిన జగమ్ముల ఉపసంహార వృత్తాంతమును అవాంతర ప్రాకృతిక ప్రళయమున గూర్చి యీపై నీకు దెల్పెదను.
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
Having described Kali's dangers, Parāśara narrates a memorable episode: a group of sages approaches Vyāsa at the Yamunā and finds him emerging from the water exclaiming "Good! Good!" three times — praising Kali Yuga, the Śūdra, and women. Vyāsa explains: the merit earned over ten years in Tretā is obtained in one year in Kali; the merit of one month in Dvāpara is obtained in one day in Kali; and the fruits of meditation, yajña, and arcana from the other three yugas are all obtained in Kali through Viṣṇu-saṃkīrtana alone. The Śūdra gains the merit of yajña through sincere service to brāhmaṇas. Women gain all the merit their husbands earn through sincere service to their husbands. The chapter closes with the teaching that Kṛṣṇa-nāma alone, without any other sādhanā, liberates from saṃsāra in Kali Yuga.