అనమిత్రస్య పుత్రశ్శినిర్ నామాభవత్॥
తస్యాపిసత్యకః సత్యకాత్సాత్యకిః యుయుధానాపరనామా॥
తస్మాదపి సంజయః తత్పుత్రశ్చకుణిః కుణేర్యుగంధరః॥
అనమిత్రస్త్యైవాన్వయేవృష్టిః తస్మాచ్చ్వఫల్కః తత్ప్రభావః కథిత ఏవ॥
శ్వఫల్క స్యాన్యః కనీయాన్ చిత్రకోనామభ్రాతా॥
శ్వఫల్కాదక్రూరోగాన్దిన్యామభవత్॥
ఉపమద్గోః మృదామృదవిశ్వారిమేజయగిరిక్షత్రోపక్షత్రశత్రుఘ్నారిమర్దన ధర్మదృగ్ దృష్ట ధర్మగంధమోజవాహప్రతివాహాఖ్యాః పుత్రాస్సుతారాఖ్యాకన్యాచ॥
పృథువిపృథు ప్రముఖాశ్చిత్ర కస్యపుత్రాబహవోబభూపుః॥
కకురభజమానశుచికంబళబర్హిషాఖ్యాస్తథాఽన్ధకస్య చత్వారః పుత్రాః॥
కకురాద్ధృష్టః తస్మాచ్చకపోతరోమా తతశ్చవిలోమా తస్మాదపితుమ్పురుసఖోభవదను సంజ్ఞశ్చ॥
అనోరానకదున్దుభిః తతశ్చాభిజిత్ అభిజితః వునర్వాసుః॥
తస్యాప్యాహుకః పిత్రః ఆహూకీచకన్యా॥
ఆహుకస్యదేవకోగ్రసేనౌద్వౌపుత్రౌ॥
దేవవానుపదేవస్సహదేవోదేవ రక్షితాచదేవకస్యచత్వారః పుత్రాః॥
తేషాంవృకదేవోపదేవాదేవరక్షితా శ్రీదేవా శాంతిదేవా సహదేవా దేవకీచ సప్తభగిన్యః॥
అనమిత్రుడు శిని సత్యకుడు సాత్యకి (యుయుదానుడు) సంజయుడు కుణి యుగంధరుడు ననువారు వరుసగా తండ్రి కొడుకులు. వీరు శైనేయులన బరగిరి. అనమిత్రుని వంశములోనే వృష్టి అతనికి శ్వఫల్కుడు గల్గిరి. శ్వఫల్కుని ప్రభావము చెప్పితిని. శ్వఫల్కుని తమ్ముడు చిత్రకుడు. శ్వఫల్కునికి గాందిని యందు అక్రూరుడు పుట్టెను. అట్లే ఉపమద్గువు గల్గెను. ఉపమద్గువునకు మృద అమృద విశ్వ అరిమేజయ గిరిక్షత్ర ఉపక్షత్ర శత్రుఘ్ను అరిమర్దన ధర్మదృగ్ దృష్టధర్మగంధమో జవాహ ప్రతివాహులను కొడుకులు, సుతార యనెడి కన్యయుం గల్గిరి. దేవాంతుడు ఉపదేవునను వారు అక్రూరుని తనయులు. పృథులు విపృథువు మొదలయిన వారు పెక్కుమంది చిత్రకునికి గల్గిరి. కుకుర భజమాన శుచికంబళ బర్హిషులు నల్గు రంధకుని కొడుకులు. కకురునకు దృష్టుడు వానికి కపోతరోముడు వానికి విలోముడు వానికి తుంబురుని మిత్రుడగు అనువు వానికి ఆనక దుందుభి వానికి అభిజిత్తు వానికి పునర్వసువు వానికి ఆహుకుడను పుత్రుడు ఆహుకియను పుత్రిక కల్గిరి. ఆహుకునికి దేవుడు ఉగ్రసేనుడు నను ఇర్వురు కొడుకులు జనించిరి. దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు దేవరక్షితయను కన్యయు నల్వురు దేవకుని సంతానము. వారికి వృకదేవ ఉపదేవ దేవరక్షిత శ్రీదేవ శాంతిదేవ సహదేవ దేవకీ యనువారేర్వురు భగినులు. వారినందరినీ వసుదేవుడు పెండ్లాడెను.
ఉగ్రసేనస్యాపి కంసస్య గ్రోధసునామానకాహ్వశంకుసుభూమి రాష్ట్ర పాల యుద్ద తుష్టి సుతుష్టి మత్సంజ్ఞాః పుత్రాబభూవుః॥
కంసాకంసవతీసుతనూరాష్ట్ర పాలికాహ్వాశ్చోగ్రసేనస్య తనూజాః కన్యాః॥
విదూరథాచ్చూరః, శూరాచ్చామీ శమినః ప్రతిక్షత్రః తస్మాత్స్వయంభోజః తతశ్చహృదికః॥
తస్యాపికృతవర్మ శతధనుర్దేవార్హదేవగర్భాద్యాః పుత్రా బభూవుః॥
తస్యాంచాసౌదశపుత్రానజనయత్ వాసుదేవ పూర్వాన్॥
వసుదేవస్య జాతమాత్ర స్యైవతద్గృహే భగవదంశావతార మవ్యాహతదృష్ట్యా పశ్యద్బిర్దేవైర్దివ్యానక దుందుభయోవాదితాః॥
తతశ్చాసావానకదుందుభి సంజ్ఞామవాప॥
తస్యచదేవభాగదేవశ్రవాష్టకకకుచ్చక్రవత్సదారక సృంజయశ్యామ శమికగణ్డూష సంజ్ఞా నవభ్రాతరోఽభవన్॥
పృథాశ్రుతదేవా శ్రుతకీర్తిః శ్రుతశ్రవారాజాధిదేవీచ వసుదేవాదీనాం పంచభగిన్యోఽభవన్॥
తస్మైచావుత్రాయపృథామాత్మజాం విధిణా శూరోదత్తవాన్॥
తాస్యాంచధర్మానిలేన్ద్రె ర్యుధిష్ఠిరభీమసేనార్జునాఖ్యాస్త్రయః పుత్రాః సముత్పాదితాః॥
ఉగ్రసేనునకు కంస న్యగ్రోధ సునామ ఆనక శంకు సుభూమి రాష్టపాల యుద్ధతుష్టి సుతుష్టిమంతులను కొడుకులు గల్గిరి. ఉగ్రసేనుని కూతుండ్రు కంస, కంసవతి, సుతను, రాష్ట్రపాలికలను వారు, భజమానునికి విదూరథుడు పుట్టెను. విదూరథుడు శూరుడు, శమి, ప్రతిక్షత్రుడు, స్వయంభోజుడు, హృదికుడు, ననువారు వరుసగా తండ్రి కొడుకులు. హృదికునికి కృతవర్మ, శతధన్వుడు, దేవార్హుడు, దేవగర్భుడు మొదలయిన కుమారులు గల్గిరి. దేవగర్భుని కొడుకు శూరుడు, మారిష యాతని ధర్మపత్ని. ఆమె యందతనికి వాసుదేవాదులు పదిమంది పుత్రులు గల్గిరి. వసుదేవుడు పుట్టగానే యతని యింట భగవదంశావతారమును దివ్య దృష్టిం జూచి దేవతలు స్వర్గమున ఆనక దుందుభులు మ్రోయించిరి. అందుచే నితడానక దుందుభియను పేరొందెను. అతనికి దేవభాగ దేవశ్రవ అష్టక కకుచ్చక్ర వత్సధారక సృంజయ శ్యామ శమిక గండూషు లనువారు తొమ్మండ్రు తమ్ములుండిరి. పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాదిదేవి యనువారు వసుదేవాదులకై గుదురు భగిను లుండిరి. శూరునికి కుంతియను నతడు సఖుడుండెను. శూరుడు సంతతి లేని యా కుంతీయను వానికి తన కూతురు పృథయను నామెను యథావిధిగ దత్తము సేసెను. ఆమెను పాండురాజు పెండ్లాడెను. ఆమెయందు ధర్మ, అనిల, ఇంద్ర దేవతల వలన వరసగా యుధిష్ఠర, భీమ, అర్జునులు ఉదయించిరి. కుంతీ కన్యగా నున్నపుడు (వివాహము కానప్పుడు) సూర్య భగవానుని వలన కానీనుడు కర్ణుడను వాడు పుట్టెను. (కన్యకు బుట్టిన వాడు కానీనుడు) ఆ పాండు రాజునకు మాద్రియను భార్య యందు నాసత్యుడు, దసృడునాను నశ్వినీ దేవతల వలన నకులుడు, సహదేవుడు గల్గిరి.
శ్రుతదేవాంతు వృద్ధధర్మానామ కారూశ్మ ఉపయేమే॥
తస్యాంచదన్తవక్త్రోనామ మహాసురోజజ్ఞే॥
శ్రుతకీర్తి మపికేకయరాజా ఉపయేమే॥
తస్యాంసంతర్దనాదయః కై కేయాః పంచపుత్రాబభూవుః॥
రాజాధిదేవ్యామావంత్యౌ విందానువిందౌజజ్ఞాతే॥
శ్రుతశ్రవసమపిచేది రాజోదమఘోషనామోపయేమే॥
స వా పూర్వమప్యుదారవిక్ర మోదైత్యానామాది పురుషో హిరణ్యకశిపుర భవత్॥
యశ్చ భగవతా సకల లోక గురుణా నారసింహేన ఘాతితః॥
పునరప్యక్షయవీర్య శౌర్య సంపత్పరాక్రమ గుణస్సమాక్రాన్త సకల త్రైలోక్యేశ్వర ప్రభావోదశాననోనామాభూత్॥
బహుకాలోపభుక్తభగవత్సకాశావాప్త శరీరపాతోద్భవ పుణ్యఫలో భగవతా రాఘవరూపిణా సోఽపి నిధన ముపపాదితః॥
పునశ్చేది రాజస్యదమఘోషస్యాత్మ జశ్శిశుపాలనామాఽభవత్॥
శిశుపాలత్వేఽపిభగవతో భూభారావాతారణాయావతీర్ణాంశస్య పుండరీకనయనాఖ్య స్యోపరి ద్వేషానుబన్ధ మతితరాంచకార॥
భగవతాచ స నిధనముపానీత, తత్త్రైవపరమాత్మాభూతే మనస ఏకాగ్రతయా సాయుజ్యమావాప॥
భగవాన్ యదిప్రసన్నోయథాభిలషితందదాతి।
తథా అప్రసన్నోఽపి నిఘ్నదివ్యమనుపమం స్థానం ప్రయచ్చతి॥
శ్రుతదేవను వృద్ధధర్ముడను కారూశుడు (కరూశ దేశాధిపతి) పెండ్లాడెను. ఆమె యందు దంతవక్త్రుడను మహాసురుడు పుట్టెను. శ్రుతకీర్తిని కేకయరాజు పెండ్లాడెను. ఆమెయందు సంతర్దనాదులు (కైకయులు) ఐదుగురు పుత్రులు జనించిరి. రాజాధి దేవియందు ఆవంత్యులు (అవంతీ దేశాధిపతికి పుట్టిన వారు) విందుడు, అనువిందుడు ననువారు ఇద్దరు పుట్టిరి. శ్రుతశ్రవసను చేదిరాజు దమఘోషుడు పెండ్లాడెను. ఆమె యందు శిశుపాలుడు పుట్టెను. అతడే పూర్వము కూడా గొప్ప విక్రమవంతుడగు హిరణ్యకశిపుడను రాక్షస రాజుగా బుట్టినాడు. నరసింహావతారమున భగవంతుడు వానిని సంహరించెను. వెండియు నాతడు అక్షయవీర్య శౌర్య సంపత్పరాక్రమ గుణుడయి త్రిలోకేశ్వర ప్రభావము నాక్రమించిన దశాననుడై జనించెను. బహుకాల మనుభవించిన భగవత్సాన్నిధ్యముచే పొందబడిన శరీరపాతము వలన బుట్టిన పుణ్యఫలము వలన సకల లోక గురువగు రఘువంశోద్భవుడు శ్రీరామచంద్ర స్వరూపుడగు భగవంతుని వలన మరణ మొందెను. మరల చేదిరాజగు దమఘోషునికి పుత్రుడై శిశుపాలుడను పేరందెను. శిశుపాలత్వ మందును భూభారావతారణమున కవతరించిన పుండరీకాక్షుడగు శ్రీకృష్ణ భగవానునిపై మిగుల ద్వేషాను బంధము నొనరించెను. ఆ భగవంతుని చేతనే నిధన మొందింప బడెను. ఆ భగవంతుని యందు మనసు నిల్పి సాయుజ్య ముక్తి నందేను. భగవంతుడు ప్రసన్నుడయ్యెనా యభిలషించిన దిచ్చును. అప్రసన్నుడయ్యేనా అప్పుడు సంహారము చేసి యనుపమ దివ్య స్థానము నిచ్చును.
Summary of chapter 14 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Śaineyā lineage is narrated along with the miraculous birth of Akrūra's father Śvaphalkā. The Ugrasena family is enumerated: Kaṃsa's siblings are named. Devakā's daughters are all married by Vasudeva and Vasudeva's ten brothers and multiple wives are listed. The first six sons of Devakī are slain by Kaṃsa. Balarāma is transferred from Devakī's womb to Rohiṇī's womb by Yoganidrā. Kṛṣṇa's birth is described. Yoganidrā is placed in Yaśodā's womb. Kṛṣṇa's 16,100 wives and 180,000 sons are mentioned. Śiśupāla's three births as Hiraṇyakaśipu → Rāvaṇa → Śiśupāla are narrated.