విష్ణు మహా పురాణము

12 - యదు వంశము

శ్రీపరాశరుడు:

క్రాష్టోస్తుయదు పుత్రస్యాత్మజోధ్వజనీవాన్

తతశ్చ స్వాతిః తతోరుశంకుః రుశంకోశ్చిత్రరథః

తత్తనయశ్శ శిబిన్దుః చతుర్దశమహారత్నశ్చ క్రవర్త్య భవత్

తస్యచశతసహస్రంపత్నీనామ భవత్

దశలక్షసంఖ్యాశ్చపుత్రాః

తేషాంచపృథుశ్రవసశ్చపుత్రః పృథుకీర్తిః పృథుజయః పృథుదానః షట్పుత్రాః ప్రధానాః

పృథుశ్రవసశ్చ పుత్రః పృథుతమః

తస్మాదుశనాః యేవాజిమేధానాంశతమాజహార

తస్యపరావృతో రుక్మేషుపృథురుక్మజ్యామఘపలిత హరిత సంజ్ఞాస్తస్యపంచాత్మజాబభూవుః

తస్యాయమద్యాపి జ్యామఘస్య శ్లోకో గీయతే

భార్యావశ్యాస్తుయే కేచిద్భవిష్యన్త్యథవామృతాః

తేషాంతుజ్యామఘశ్శ్రేష్ఠశ్శై బ్యాపతి రభూన్నృపః

అవుత్రాతస్యసాపత్నీశై బ్యానామతథాప్యసౌ

అపత్యకామోపిభయాన్నాన్యాం భార్యా మవిన్దత

సత్వేకదా ప్రభూతరథ తురగ గజ సమ్మర్దాతి దారుణే మహాహవేయుధ్యమానః సకలమేవారిచక్ర మజయత్

తచ్చారిచక్రమపాస్తపుత్రకళత్ర బన్దుబలకోశం స్వమదిష్ఠానం పరిత్యజ్యదిశః ప్రతి విద్రుతమ్

తస్మింశ్చ విద్రుతేతిత్రాసాలోలయత లోచన యుగళం త్రాహిమాన్తాం తాంభ్రాత

రిత్యాకుల విలాప విధురం సరాజకన్యారత్న మద్రాక్షీత్

తద్దర్శనాచ్చ తస్యామనురాగానుగతాన్తరాత్మా సనృపోఽచిన్తయత్

సాధ్విదం మమాపత్యరహితస్యవన్ధ్యాభర్తుస్సాంప్రతంవిధినాఽపత్య కారణంకన్యారత్నముప పాదితమ్

తదేతత్సముద్వహామీతి

అథవైనాంస్యన్దనమారోప్యస్వమదిష్టానంనయామి

తయైవదేవ్యాశైబ్యయాఽహమనుజ్ఞాతస్సమూడవహామీతి

అథైనాంరథమారోప్యస్వనగరమగచ్చత్

విజయినంచ రాజాన మశేషపౌరభృత్య పరిజనామాత్యసమేతాశైబ్యాద్రష్టుమదిష్టానద్వార మాగతా

సాచావలోక్యరాజ్ఞః సవ్యపార్శ్వవర్తినీం కన్యామీషదుద్బూతామర్ష స్పురదధరపల్లవా రాజానమవోచత్

అతిచపల చిత్తాత్రస్యన్దనేకేయమారోపితేతి

అసావప్యనాలోచితోత్తరవచనోఽతిభయాత్తామహ స్నుషామమేయమితి

అథైనంశైభ్యోవాచ

నాహంప్రసూతాపుత్రేణ నాన్యాపత్న్యభవత్తవ

స్నుషాసంబన్ధతా హ్యేషా కతమేన సుతేన తే

ఇత్యాత్మేర్ష్యా కోపకలుషితవచన ముషిత వి వేకోభయాద్దురుక్తపరిహారార్థ మిద మవనీపతి రాహ

శ్రీపరాశరుడు:

యదువు కొడుకు క్రోష్టువు. వానికి ధ్వజినీవంతుడు, వానికి స్వాతి, వానికి రుశంకువు, వానికి చిత్రరథుడు, వానికి శశిబిందువుం గల్గిరి. ఇతడు చక్రవర్తి పదునాల్గు మహారత్నము లీతని వద్ద నుండెనట వానికి నూరువేల మంది భార్యలు పది లక్షల మంది కుమారు లుండిరి. పృథుశ్రవసుడు, పృథువర్మ, పృథుకీర్తి, పృథుయశుడు, పృథుజయుడు, పృథుదాసుడు అను ఆరుగురు పుత్రులు ప్రధానులు. వీరిలో పృథుశ్రవసుని పుత్రుడు పృథుత్తముడు వానికి ఉశనుడు గల్గెను. ఇతడు నూరశ్వమేధములు చేసెను. వాని కుమారుడు శితపుపు. వానికి రుక్మకవచుడు వానికి పరావృత్తు వానికి రుక్మేషువు, పృథువు, జ్యామఘుడు, పలితుడు, హరితుడను నైదుగురు కుమారులు గల్గిరి. జ్యామఘుని గూర్చి యొక శ్లోకము కీర్తింపబడు చున్నది. భార్యకు లొంగిన వారుందురు. కొందఱు గతించి యుందురు. శైభ్యకు భర్తయగు జ్యామఘుడు శ్రేష్ఠుడు. ఆమెకు సంతతి లేదు. అయినను భయపడి మరొక భార్యను అతడు సేసికొన లేదు. అతడొకతఱి చతురంగ బలసమ్మర్ద దారుణమైన యుద్ధము నందు సర్వ శత్రుమండలమును జయించెను. ఆ శత్రుకూటమి పుత్రకలత్ర బంధు బతకోశ సమృద్ధమైన తమ రాజధానులను వదలి పారిపోయిరి. అప్పుడు భయబ్రాంతియై బెదరు చూపులనొక రాజకన్యామణిని తండ్రీ! అమ్మా అన్నా రక్షించు రక్షింపుమని యేడ్చుచున్న దానినా రాజు చూచెను. అమెం గనుట వలన నామె యందనురక్త మనస్కుడై యిట్లనుకొనెను. బాగున్నది సంతానము లేని (వంధ్యాభర్తనగు) నాకు దైవము సంతాన కారణము నొక కన్యారత్నమును సంఘటించెను. అందువలన నేనీమెం బెండ్లాడెదను లేదా ఈమెను రథమెక్కించుకొని రాజధానికిం గొనియేగెదను. ఆ శైబ్య అనుమతిగొనియే వివాహ మయ్యెదనని తన నగరమునకు వచ్చెను. శైబ్య విజయము గొని వచ్చుచున్న ప్రభువును దర్శింప పౌరభృత్య పరిజనామాత్య వర్గముతో నేదురేగి నగర ద్వారమందు నిలిచి రాజు వజ్జనున్న కన్యంగని యించుక కినుక పొడమ నధర పల్లవ మదర రాజుతో ననియె. ఓ అతి చపలచిత్తుడా! ఎవతెను రథమెక్కించుకొని వచ్చితిని? అన నీ రేడు మిగుల జడిసిపోయి యామె నా కోడలు అనెను. అంతట శైబ్య నేనా కొడుకును గనలేదు. నీకా ఇంకొక పెండ్లాము లేదు. నీ యే కొడుకు చేత నీ కోడలి చుట్టరిక మనెను. ఇట్లు అసూయా కోపకలుషితములయిన మాట వలన వివేకము కోల్పోయి జడుపు వలన తాను మును జెప్పిన తప్పుడు మాట తలగించుకొన నవనిపతి యామె కిట్లనియె.

యస్తేజనిష్యత్యాత్మజస్తసేయమనాగతస్యైవభార్యాని రూపితేత్యాకర్ ణ్యోద్భూతమృదు

హాసాతథేత్యాహ

ప్రవివేశచరాజ్ఞాసహాధిష్ఠానమ్

అన న్తరంచాతిశుద్దలగ్న హోరాంశకావయవోక్త కృతపుత్రజన్మలాభ గుణాద్వయసః పరిణామ ముపగతాపి శైబ్యా స్వల్పైరేవాహోభిర్గర్భమవాప

కాలేనచకుమారమజీజనత్

తస్యచ విదర్బ ఇతి పితా నామచక్రే

సచతాం స్నుషాముపయేమే

తస్యాం చాసౌక్రథకై శికసంజ్ఞౌ పుత్రా వజనయత్

పునశ్చతృతీయం రోమపాద సంజ్ఞం పుత్రమజీజనత్ యోనారదాదవాప్త జ్ఞానవాన్ భవిష్యతీతి

నీకు కలుగ బోవు కుమారుని కింతదాక యవతరింపని వానికీమె కాబోవు భార్యగా నిర్దేశింప బడినదన విని యా యింతి యించుక నవ్వి యట్లే యగుగాక! యనియె. రాజుతో నగర ప్రవేశముం జేసెను. మఱియు నామీద అతి వినిర్మల శుభలగ్న హోరాంశ లందు రాజు నీకు పుత్రా లాభము గల్గునన్న వచన ప్రభావముచే వయసు గడచిన తర్వాత గూడ నారాజ్ఞి గర్భవతియై సకాలమున కుమారుని గనియె. ఆ శిశువునకు దండ్రి విదర్భుడను నామముంచెను. అతడా రాజకన్యను బెండ్లాడెను. ఆమె యందతడు క్రథుడు, కైశికుడు నను నిర్వురుం కొడుకులను కనియె. అటుపై రోమపాదుడను మూడవ పుత్రునిం గాంచె. అతడు నారదుని వలన జ్ఞాన సంపన్నుం డగును.

రోమపాదాద్బభ్రుః బబ్రోః ధృతిః ధృతేః కైశికః కైశికస్యాపిచేదిః పుత్రోభవత్ యస్యసంతతౌ చైద్యాభూపాలాః

క్రథస్యస్నుషాపుత్రస్యకున్తిరభవత్

కున్తేః దృష్టిః దృష్టేః నిధృతిః నిధృతేర్దశార్హాస్తతశ్చవ్యోమః తస్యాపిజీమూతః తతశ్చ వికృతిః తతశ్చభీమరథః తస్మాన్నవరథః తస్యాపిదశరథః తతశ్చశకుని స్తత్తనయః కరంభిః కరంథేర్దేవరాతోఽభవత్

తస్మాద్దేవక్షత్రః తస్యాపి మధుః మధోః కుమారవంశః కుమారవంశాదనుః అనోః పురమిత్రః పృథివీపతి రభవత్

తతశ్చాంశుస్తస్మాచ్చసత్వతః

సత్వతాదేతేసాత్వతాః

ఇత్యేతాం జ్యామఘస్య సంతతిం సమ్యక్ర్ఛద్దాసమన్వితః శ్రుత్వాపుమాన్ మైతేయ! స్వపాపైః ప్రముచ్యతే

రోమపాదునికి బభ్రువు బభ్రువునకు ధృతియు ధృతికి కైశికుడు, కైశికునికి చేదియను కొడుకు దయించెను. అతని సంతతియే చైద్య రాజులు. జ్యామఘుని కోడలి పుత్రుడగు క్రధునకు కుంతియు. కుంతికి దృష్టి అతనికి నిధృతి అతనికి దశార్హుడు అతనికి వ్యోముడు అతనికి జీమూతుడు అతనికి వికృతి అతనికి భీమరథుడు అతనికి నవరథుడు అతనికి శకుని అతనికి కరంభి అతనికి దేవరాతుడుం కల్గిరి. దేవరాతుని కొడుకు దేవక్షత్రుడు అతనికి మధువు మధునికి కుమారా వంశుడు అతనికి అనువు అనువునకు పుర మిత్రుడుం

బుట్టిరి. అతనికి అంశుడు అతనికి సత్వతుడు గలిగిరి. అతనికి వంశపరంపర సాత్వతులన బడిరి. ఈ జామ్యఘుని సంతతిని శ్రద్ధతో విన్న యాతడు సర్వ పాపముల నుండి విడివడును.