విష్ణు మహా పురాణము

13 - జాంబవతీ కళ్యాణము - స్యమంతకోపాఖ్యానము

శ్రీపరాశరుడు:

భజనభజమానదివ్యాన్ధకదేవాపృథమహాభోజవృష్టిసజ్ఞాస్సత్వతస్యపుత్రాబభూవుః

భజమానస్య నిమికృకణవృష్ణయ స్తథాఽన్యేతద్వైమాత్రః శతజిత్సహస్రజిదయుతజిత్సం జ్ఞాస్త్రయః

దేవాపృథస్యాపిబభ్రుః పుత్రోఽభవత్

తయోశ్చాయం శ్లోకోగీయతే

యథైవశృణుమోదూరాత్సం పశ్యామస్తథాఽన్తికాత్

బభ్రుశ్శ్రేష్ఠోమనుష్యాణాం దేవైః దేవాపృథస్సమః

పురుషాః షట్చషష్టిశ్చసహస్రాణితథాఽష్టయే

తేఽమృతత్వమనుప్రాప్తాబభ్రోః దేవాపృథాదపి

మహాభోజస్త్వతిధర్మాత్మాతస్యాన్వయేభోజాః మృత్తికావపురనివాసినో మార్తికావరా బభూవుః

వృష్ణస్సుమిత్రో యుథాజిచ్చపుత్రావభూతామ్

తతశ్చానమిత్రః తథాఽనమిత్రాన్నిఘ్నః

నిఘ్నస్యప్రసేన సత్రాజితౌ

తస్యతుసత్రాజితో భగవానాదిత్యః సఖాఽభవత్

శ్రీపరాశరుడు:

సత్త్వతుని కుమారు లేడుగురు భజన, భజమాన, దివ్య, అంధక దేవా, పృథ, మహాభోజ, వృష్టి నామకులు గల్గిరి. భజమానునికి నిమి, కృకణ, వృష్ణులు గల్గిరి. వారికి సవతి తల్లి కొడుకులు శతజిత్తు, సహస్రజిత్తు, ఆయతజిత్తు ననువారు ముగ్గురు. దేవాపృధునికి బభ్రువు గల్గెను. ఆ తండ్రి కొడుకుల గూర్చిన శ్లోకము భావమిది. దూరము నుండి యేమి విన్నామో దగ్గర నది చూచు చున్నాము. బభ్రువు మానవోత్తముడు దేవాపృథుడు దేవా సమానుడు. బభ్రువు వలన అఱువది యాఱువేల మంది, దేవాపృథుని వలననూ ఎనిమిది వేలమంది పురుషులు అమృతత్వము నందిరి. ఆ వంశమందు మహాభోజుడు బహు ధర్మమూర్తి. అతని పరంపర భోజులను పేర మృత్తికావర పురవాసులు మార్తికులనియు పేర్వడిరి. వృష్టి కొడుకులు సుమిత్రుడు యుధాజిత్తు. ఆటనుండి అనమిత్రుడు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులు ప్రసేన, సత్రాజిత్తులు. సత్రాజిత్తునకు సూర్య భగవానుడు మిత్రుడు.

సత్రాజిచ్చరితమ్:

ఏకదాత్వమ్భోనిధితీర సంశ్రయస్సూర్యంసత్రాజిత్తుష్టావ

తన్మనస్కతయ్జాచ భాస్వా నభిష్టూయ మనోఽగ్రతస్తస్థౌ

తతస్త్వస్పష్టమూర్తిధరం చైనమాలోక్య సత్రాజిత్ సూర్యమాహ

యథైవవ్యోమ్ని వహ్నిపిణ్డోపమం త్వామహమపశ్యం తథైవాద్యాగ్రతో గతమప్యత్ర భగవతా కించిన్న ప్రసాదీకృతం విశేషముపలక్షయామీత్యేవముక్తే భగవతాసూర్యేణ నిజకణ్ఠాదు న్ముచ్యస్యమన్తకం నామమహామణివరమవతార్ యైకాన్తేన్యస్తమ్

తతస్తమాతామ్రోజ్జ్వలం హ్రస్వవపుషమీషదాపింగళ నయనమాదిత్యమద్రాక్షీత్

కృతప్రణిపాతస్తవాదికంచ సత్రాజితమాహ భగవానాదిత్యస్సహస్రదీధితిః వరమస్మత్తోఽభిమతం వృణీష్వేతి

సచ తదేవమణిరాత్నమయాచత

సచాపితస్మితద్దత్వా దీధితిపతి ర్వియతిస్వధిష్ణ్యమారురోహ

సత్రాజితోఽప్యమలమణిరత్నసనాథకణ్ఠతయా సూర్య ఇవతేజోభిరశేష దిగన్తరాణ్యుద్భాసయన్ ద్వారకాం వివేశ

సత్రాజిచ్చరితమ్:

ఒకతఱి సముద్ర తటమందు సత్రాజిత్తు సూర్యుని స్తుతించెను. తదేక మనస్కుడై చేసిన ఆ స్తుతికి భాస్కరుడు వచ్చి ఎదుట నిలిచెను. కనబడీ కనబడకుండ నున్న ఈయనను జూచి సత్రాజిత్తు ఆకాశమందగ్ని గోళమట్లు నిన్నెట్లు చూచితినో అట్లే ఇప్పుడు నా యెదుట నున్నను కొంచెము అప్రసన్నుడవైన వానింగా జూచు చున్నాను. అనినంతట సూర్య భగవానుడు తన కంఠము నుండి తీసి స్యమంత మణి రత్నము నేకాంత మందుంచెను. ఆ మీదట సత్రాజిత్తు ఆదిత్యుని నెఱ్ఱగ వెలుంగుచు పోట్టివాడై యించుక తేనెరంగు కన్నులతో నున్న వానింగా గాంచెను. ప్రణామములు చేసి స్తుతించిన సత్రాజిత్తుం గని భగవంతుడు భానుడు సహస్ర కిరణుడు నీకభిమతమైన వరముం గోరుమన నతడా మణి రత్నమునే గోరెను. దానిని వానికి రవి యెసంగి నింగిం దనస్థానము నారోహించెను. సత్రాజిత్తు అత్యంత స్వచ్చమైన యా స్యమంతకమణి రత్నమును కంఠమున ధరించి సూర్యుని వలె వెలుంగుచు సర్వదిక్కుల వెలిగించుచు ద్వారకం బ్రవేశించెను.

ద్వారకావాసీజనస్తు తమాయాన్తమవేక్ష్యభగవన్తమాదిపురుషం పురుషోత్తమమవనిభారావ తరణాయాంశేన మానుషరూపధారిణం ప్రణిపత్యాహ

భగవన్ భవన్తం ద్రష్టుం నూనమయమాదిత్య ఆయాతీత్యుక్తోభగవానువాచ

భగవాన్ నాయామాదిత్యః సత్రాజితోఽయ మాదిత్యదత్తం స్యమన్తకాఖ్యం మహారాణి రత్నం బిభ్ర దత్రోపయాతి

తదేనం విస్రబ్దాః పశ్య తేత్యుక్తాస్తే తథైవ దదృశుః

అట్లు దేదీప్యమాన ప్రభతో నరుదెంచు నా సత్రాజిత్తుణి గాంచి పౌరులు భూభారావతరణమునకై విష్ణు నంశమైన మానుష మూర్తియై భూమి యందవతరించిన పురుషోత్తముడు భగవంతుడు ఆది పురుషుడునగు కృష్ణుని మ్రొక్కి స్వామీ! తమ దర్శనము గావింప సూర్య భగవను డిడుగో వచ్చు చున్నాడని తెలుప భగవంతుడు హరి యీతడు సూర్య భగవానుడు గాడు ఆదిత్యు దిచ్చిన స్యమంతకమను పేరిమణిని ధరించి యిటు సత్రాజిత్తు వచ్చు చున్నాడు శాన్తులై చూడడన వారునట్లనే చూచిరి.

సచతం స్యమన్తకమణిమాత్మనివేశనేచక్రే

ప్రతిదినం తన్మణిరత్న మష్టౌకనకభారాన్ స్రవతి

తత్ప్రభావాచ్చ సకల స్యైవరాష్ట్రస్యోపసర్గానా వృష్టివ్యాళాగ్ని తోయదుర్బిక్షాదిభయం నభావతి

అచ్యుతోఽపితద్దిత్యం రత్నముగ్రసేనస్యభూపతేర్యోగ్య మేతదితిలిప్సాంచక్రే

గోత్రేభేదభయాచ్చాక్తోఽపినజహార

సత్రాజిదప్యచ్యుతో మామేతద్యాచయిష్యతీత్యవగమ్యరత్న లోభాత్ భ్రాత్రేప్రసేనాయ దద్రత్నమదాత్

తచ్చశుచినాద్రియమాణ మశేషమేవ సువర్ణస్రవాదికం గుణజాతముత్పాదయతి అన్యథా ధార యన్తమేవ హన్తీతి అజానన్నసావపిప్రసేనస్తేనకాంఠ సక్తేనాశ్వమారుహ్యాటవ్యాం మృగయామగచ్చత్

తత్రచ సింహా ద్వాధమవాప

సాశ్వం చతం నిహత్యసింహోఽప్యమలమణిరత్న మాస్యాగ్రేనాదాయ గన్తుమభ్యుద్యతః

ఋక్షాధిపతినా జామ్భవతా దృష్ఠోఘాతితశ్చ

జాంబవానాప్యమల మణిరత్న మాదాయస్వ బిలం ప్రవివేశ

సుకుమారసంజ్ఞాయబాలకాయచ క్రీడనకమకరోత్

ఆ సత్రాజిత్తు రత్నమును దనయింట నుంచికొనెను. ప్రతిదినమా మణిరత్నం ఎనిమిది బారువుల బంగారమును గనుచుండెను. ఆ ప్రభావము వలన సకల రాష్టము అనావృష్ట్యాదులగు నీతిబాధాలు అగ్ని వాయు వ్యాళాది ఉపద్రవములు వాసి దుర్భిక్షము మొదలయిన భయము లందలంగి సుఖముండెను. కృష్ణడా దివ్య రత్నము ఉగ్రసేనకు యోగ్యమని దాని జేకొన నిశ్చయించెను. శక్తుడయ్యు జ్ఞాతులతో భేదము వచ్చునను భయముచే దానిని గైకొనడయ్యె. సత్రాజిత్తు ఎన్నటికేని కృష్ణుడు దీనినిమ్మని తన్నడుగునని గ్రహించి యా మణి యెడగల యాశచే దానిని తమ్ముడగు ప్రసేనున కిచ్చెను. ఈ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో అశేష సువర్ణాదికమును బ్రసవించును. తక్కుంగల గుణము లన్నియు ఫలించును. మరొక విధముగా (అశుచియై) దీనిం ధరించి వాని నిది చంపునని యెఱుంగక యీ ప్రసేనుడు దానిని కంఠమున ధరించి గుఱ్ఱమెక్కి వేటాడ అడవికి పోయెను. అక్కడ సింహముచే మరణ మందెను. ఆశ్వముతో గూడ వానిం జంపి యా రత్నమును నోట గఱచుకొని పోవ ప్రయత్నించి ఋక్షాధిపతి (ఎలుగు రాజు) జాంబవంతుని చేతిలో నది మడిసెను. జాంబవంతుడా మణి రత్నమును చేకొని తన గుహం బ్రవేశించెను. సుకుమారుడను పేరు గల బాలకునికి దానిని ఆట వస్తువుగా నిచ్చెను.

అనాగచ్చతితస్మిన్ కృష్ణోమణిరత్న మభిలషితవాన్ సచప్రాప్తవాన్ నూనమేతదస్యకర్మేతి అఖిల ఏవయదులోకః పరస్పరం కర్ణాకర్ణ్యా కథయత్

విదతలోకాపవాదవృత్తాన్తశ్చభగవాన్ సర్వ యదు సైన్య పరివార పరివృతః ప్రసేనాశ్వ పదవీమను ససార

దదర్శచాశ్వసమవేతం ప్రసేనం సింహేన వినిహతమ్

అఖిలజనమధ్యే సింహ పదదర్శ నకృతపరిశుద్ధిః సింహపద మనుససార

ఋక్షపతినిహతంచ సింహమత్యల్పేభూమిభాగేదృష్ట్వా తతశ్చతద్రత్న గౌరవాదృక్షస్యాపి పదాన్యనుయయౌ

గిరితటేచసకల మేవతద్యదుసైన్యమవస్థాప్యతత్పదానుసారి ఋక్షబిలం ప్రవివేశ

అన్తః ప్రవిష్టశ్చధాత్ర్యః సుకుమారక ముల్లాలయంత్యాః వాణీం శుశ్రావ

సింహః ప్రసేనమవధీత్సింహోజామ్భవతాహతః

సుకుమారజమారోదీస్తవహ్యేష స్యమన్తకః

ఇత్యాకర్ణ్యోపలబ్ధస్యమన్తకోఽన్తః ప్రవిష్టః కుమారక్రీడనకీకృతంచ

ధాత్ర్యాః హస్తేతేజోభిర్జాజ్వల్య మానం స్యమన్తకం దదర్శ

తంచస్యమన్తకాభిలషిత చక్షుష మపూర్వపురుషమాగతం సమవేక్ష్యధాత్రీత్రాహి త్రాహీతి వ్యాజహార

తదార్తరవనన్తరం చామర్షపూర్ణహృదయః సజామ్బవానాజగామ

తయోశ్చపరస్పరముద్దతావర్షయోర్యుద్దమేకవిం శతిదినాన్యభవత్

తేచయదుసైని కాస్తత్రసప్తాష్టదినానితన్నిష్క్రా న్తి ముదీక్షమాణాస్తస్థుః

అనిష్క్రమణేచ మధురిపురసావవశ్యమత్రబిలేఽత్యన్తం నాశమవాప్తో భవిష్యత్యన్యథా తస్య జీవతః కథమేతావన్తి దినాని శత్రుజయే వ్యాక్షేపోభవిష్యతీతికృతాధ్యవసాయాః ద్వారకా మాగమ్య హతః కృష్ణ ఇతి కథయామాసుః

తద్భాన్ధవాశ్చతత్కాలోచితమఖిలముత్తరక్రియాకలాపంచక్రుః

ఆ ప్రసేనుడు తిరిగి రాకున్నంత కృష్ణుడు మణిపై చూపు పెట్టెను. అది యతడు గైకొనెను. నిక్కమిది యీ పని వీనిదని సకల యదులోక అందరు చెవి కొరుకుకొనిరి. ఆ లోకాపవాదము చెవింపడ కృష్ణ భగవానుడు యదుసైన్య పరివృతుడై ప్రసేనుని గుఱ్ఱము జాడం బట్టి యేగి సింహ నిహతుడి పడియున్న ప్రసేనుని జూచెను. అందరిలో సింగము నడుగు లంగని మనస్సు కలతతేరి యా యడుగు జాడలంటి పోయి ఎలుగుల రాజుచే హతమైన సింహము నత్యల్ప దూరమున చూచి ఆ మీదట గూడ నా రత్నము నెడ గౌరవముం బట్టి యా ఎలుగుగొడ్డు అడుగు జాడల ననుసరించెను. ఆ కొండచరియ నెల్ల యదు సైన్యమును నిలిపి యా యడుగులం బట్టి చని యా భల్లూకముండు బిలముం ప్రవేశించి సుకుమారుని యాడించు చున్న దాది యొక్క కంఠ స్వరమాలించెను. అది యుయ్యాలలో నా బాలునూపుతూ పాడుచున్న పాట భావమిది. “సింహము ప్రసేనుని గూల్చినది. ఆ సింహము జాంబవంతునిచే నీల్గినది. ఓ సుకుమారా! ఏడవకుము ఈ శ్యమంతకము నీదే కదా!” ఇట్లు ఆ దాది పలుకు విని శ్యమంతకము గనబడ లోపలికేగి యా కుమారునికి ఆట వస్తువుగా జేయబడిన యా మణి రత్నమును దాది చేతిలో జాజ్వల్యమానముగా నున్న దానిం జూచెను. శ్యమంతకముపై వలపుగొన్న చూపుల నరుదేంచిన యయ్యపూర్వ పురుషుని జూచి ధాత్రి రక్షింపు రక్షింపుమని కేకలు వేసెను. ఆయార్తరవ మాలించిన వెంటనే సునమదినిండి యా జాంబవంతు డరుదెంచెను. వారిరువురికి ఇరువది యొక్క రోజులు పోరు జరిగెను.. యదు సైనికులు ఆ గుహ కడ ఏడెనిమిది రోజులు కృష్ణుని రాక కెదురు చూచు చుండిరి. అతడు రాకున్నంత హరి యీ బిల మందు అవశ్యము అంతమంది యుండును. కాదేని యతడు జీవించి యుండిన నతనికి శత్రు సంహారమున కిన్నాళ్ళేల పట్టునని నిశ్చయించి ద్వారక కేతెంచి కృష్ణుడు హతుడయ్యెనని చెప్పిరి. బంధువులు తత్కాలోచిత మగు నుత్తర కర్మకలాములు గూడ జరిపిరి.

తతశ్చాస్యయుధ్యమానస్యాతిశ్రద్దాదత్త విశిష్టోపపాత్రయుక్తాన్న తోయాదినా శ్రీకృష్ణ స్యబల ప్రాణ పుష్టిరభూత్

ఇతరస్యానుదినుమతి గురుపురుష భేద్యమానస్య అథినిష్ఠుర ప్రహారపాత పీడితాఖిలావయవస్య నిరాహార తయాబలహానిరభూత్

నిర్జతశ్చ భగవతాజామ్బవాన్ ప్రణిపత్య వ్యాజహార

సురాసురగన్ధర్వ యదు రాక్షసాదిభిరప్యఖిలై ర్భవాన్న జేతుంశక్యః, కిముతావనిగోచరై రల్పవీ ర్యైర్నరైర్నరావయవభూతైశ్చ తిర్యగ్యోన్యనుసృతిభిః కింపునరస్మద్విదైః అవశ్యం భగవతాస్మ త్స్వామినా రామేణే వనారాయణస్య సకల జగత్పరాయణస్యాంశేన భగవతా భవితవ్యమిత్యుక్త స్తస్మైభగవానఖిలావనీ భారావతరణార్థమవతరణమాచచక్షే

ప్రీత్యభివ్యఞ్జితకరతలస్పర్శనేన చై న మపగతయుద్ద ఖేదంచకార

సచప్రణిపత్య పునరప్యేనం ప్రసాద్య జామ్బవతీం నామకన్యాం గృహాగాతాయార్ఘ్యభూతాం గ్రహయామాస

స్యమన్తకమణిరత్న మపిప్రణిపత్యతస్మై ప్రదదౌ

అచ్యుతోఽప్యతి ప్రనతాత్తస్మాద గ్రాహ్యమపితన్మణిరత్నమాత్మసంశోధనాయజగ్రాహ

సహజామ్బవత్యాస ద్వారకామాజగామ

అట్లు వారుద్దేశించి చేసిన యా యాచరణ మందుత్తమ పాత్రులందు మిక్కిలి శ్రద్ధతో పెట్టిన మృష్టాన్నములచే శ్రీకృష్ణుని బలము ప్రాణము పుష్టినొందె. అవ్వల శత్రువునకో అనుదినము నా గురు పురుషునిచే (మహా పురుషునిచే పెద్ద మనిషిచే) గొట్ట బడునతి నిష్ఠురములైన దెబ్బలచే నొడలు నవయవములు నెచ్చటను నిరాహారి యగుట చేత బలము తరిగెను. అట్లు భగవంతునికోడి జాంబవంతుడు వ్రాలి యిట్లనియె. నీవు సురాసుర గంధర్వ యక్ష రాక్షసాదు లెవ్వరికీ జయింప రావు. నేలనున్న అల్ప బలులయిన నరులు నరుల కవయవ భూతములైన పశు పక్ష్యాదులకు వాని ననుసరించు నావంటి వారి మాట చెప్పనేల? తప్పక నీవు సకల జగత్పరాయణు డగు నారాయణున యంశమైన నా స్వామి రాముడవే యైయుందువు. అని విన్నవింప కృష్ణస్వామి యతనికి దానవనీ భారముండింప వచ్చుట నెరింగించెను. మఱియునుం బ్రీతి వ్యక్తమగు తన కరతల స్పర్శచే నాతని యుద్ద ఖేదమెల్ల నుపశమింప జేసెను. అతడు మఱి మఱి ప్రణామములు సేయుచు స్వామిం బ్రసన్నుం గావించి తన ఇంటి కేతెంచిన తన ప్రభువునకు పాదములు గడిగి యర్ఘ్యముగా జాంబవతిం దన కన్యా రత్నముం గ్రహింప జేసెను. మఱియుం బదముల కెరగి శ్యమంతక మణిరత్నముం గూడ స్వామికి కానుక పెట్టెను. అచ్యుతుండును మిక్కిలి వినతుడై యిచ్చిన యా మణిని గ్రహింప కూడనిదైనను తన శోధనకు (అపవాదవాపి కొనుటకు) దాను గైకొనెను. జాంబవతితో ద్వారక కేతెంచెను.

శ్రీకృష్ణుడు శ్రీజాంబవతితో ద్వారకాపుర ప్రవేశము చేయుట:

భగవదాగమనోద్భూతహర్షోత్కర్షస్య ద్వారకావాసి

జనస్య కృష్ణావలోకనాత్తత్ క్షణమేవాతి పరిణతవయసోఽపి నవయౌవనమివాభవత్

దిష్ట్యాదిష్ట్యేతి సకలయాదవః స్త్రియశ్చసభాజయామాసుః

భగవానపియథానుభూత మశేషం యాదవసమాజేయథావదాచచక్ష

స్యమన్తకం చసత్రాజితాయదత్వా మిథ్యాభిశాస్తిపరిశుద్ధిమావాప

జామ్భావతీం చాన్తః పురే నివేశయామాస

సత్రాజితోఽపిమయాస్యాభూతమలినమారో పితమితిజాత సంత్రాసాత్ స్వసుతాం

సత్యభామాం భగవతే భార్యార్థం దదౌ

శ్రీకృష్ణుడు శ్రీజాంబవతితో ద్వారకాపుర ప్రవేశము చేయుట:

భగవంతుని యాగామనముచే గల్గిన యానందాతిశయముచే ద్వారకావాసి జనమ్మునకు మిగుల వయస్సు చెల్లిన వారికి గూడ కృష్ణ సందర్శనముచే ఆ క్షణము నూతన యౌవనము వచ్చినట్లయ్యెను. మహాభాగ్యము మహాభాగ్యమని సకల యాదవులు స్త్రీలును శ్రీహరిని గౌరవించిరి. స్వామియును యాదవ సమాజమునందు దాను పొందిన యనుభవము నున్నదున్నట్లు వారికి తెలిపెను. శ్యమంతకమణిని సత్రాజిత్తున కిచ్చి యాపవాదు తొలగించుకొని జాంబవతిని అంతఃపురము నందుంచెను. సత్రాజిత్తుడును నేను కృష్ణుని యందు లేనిపోని అపవాదును ఆరోపించితినని భయము వలన తన కుమార్తె సత్యభామను భగవంతునికి పత్నిగా నిచ్చెను.

తాంచాక్రూర కృతవర్మ శతధన్వ ప్రముఖా యాదవాః ప్రాగ్వారయాం బభూవుః

తతస్తత్ప్రదానాదవజ్ఞాతమేవాత్మానం మన్యమానాః సత్రాజితేవై రానుబన్ధంచక్రుః

అక్రూరకృతవర్మప్రముఖాశ్చ శతధన్వానమూచుః

ఆయమతీవదురాత్మాసత్రాజితః యోస్మాభిర్భావతాచప్రార్థితోప్యాత్మజామస్మాన్

భవన్తం చావిగణయ్యకృష్ణాయదత్తవాన్

తదలమనేనజీవతా ఘాతయిత్వైనం తన్మహారత్నం స్యమన్తకాఖ్యం తయాకిం నగృహ్యతే, వయమ భ్యుపపత్స్యామోయద్యచ్యుత స్తనోపరివై రానుబంధం కరిష్యతీత్యేవముక్తస్తథేత్యసావప్యాహ

జతుగృహదగ్దానాం పాణ్డుతనయానాం విదిత పరమార్థోపి భగవాన్ దుర్యోధనప్రయత్నశైథిల్య కరణార్థం పార్థానుకూల్యకారణాయ వారణావతం గతః

గతేదతస్మిన్ సుప్తమేవసత్రాజితం శతధన్వా జఘాన మణిరత్నం చాదదాత్

పితృవధామర్షపూర్ణాచసత్యభామా శీఘ్రం స్యన్ధనమారూఢా వారణావతం గత్వా భగవతేఽహం ప్రతిపాదితేత్యక్షాన్తిమతాశతధన్వనాస్మత్పి తావ్యాపాదితః తచ్చ స్యమన్తక మణిరత్న మపహృతం యస్థ్యావభాసనేనాపహృతతిమిరం త్రైలోక్యం భవిష్యతి

తదియం త్వదీయాపహాసనా, తదాలోచ్యయదత్రయుక్తం తత్క్రియతామితి కృష్ణమాహ

ఆమెను లోగడ అక్రూర కృతవర్మ శతధనాదులు యాదవులు వరించి యుండిరి. ఆమెను కృష్ణుని కిచ్చినందున దమ్ము అవమానించెనని యెంచి సత్రాజిత్తు నందు వైరానుబంధము మొనరించిరి. అక్రూర కృతవర్మాదులా శతదన్వుని గని యిట్లు పలికిరి. అతి దుర్మార్గుడీ సత్రాజిత్తు. మేము నీవు బ్రార్ధించినను మమ్ములను నిన్నుంగూడ లెక్కసేయక తన పుత్రికను కృష్ణున కిచ్చెను. ఈతడు బ్రతికి యుండినది చాలు. వీనిని చంపించి యా మహారత్నము శ్యమంతకమను రత్నమును నీవెందులకు దీసికొనవు? నీపై కృష్ణుడు వైరాను బంధమును గొనెనేని మేమును నీవై యుండెదము. అన నతడట్లే కానిండనియే. లక్కయింట దగ్దులైరి. పాండవులని విని నిజ మెఱింగిన హరి భగవంతుడు దుర్యోధనుని ప్రయత్నములను వమ్ముచేయ యర్జునుని కానుకూల్య మొనరింప వారణావతమున కేగెను. అతడేగిన మీదట నిదురించు చున్న సత్రాజిత్తును శతధన్వుడు చంపి మణి రత్నమును దీసికొనెను. తండ్రి వధకు నిండుకోపము గొని సత్యభామ సత్వరముగ రథమెక్కి వారాణావాతముచని కృష్ణ భగవానునికి నన్నిచ్చుటకు సహింప లేక శతధన్వుడు మా తండ్రిని వధించెను. మఱియు నెమ్మణి ప్రభలచే ముల్లోకముల యంధకారము పటాపంచలగునో అట్టి శ్యమంతక మణిని గూడ హరించెను. ఇది నీకు చేసిన పరాభవమే కావున కర్తవ్య మిప్పుడేమో యాలోచింపు మని కృష్ణునితో పలికెను.

తయాచైవముక్తః పరితుష్టాన్తః కరణోఽపికృష్ణః సత్యభామా మమర్షతామ్రనయనః ప్రాహ

సత్యే! సత్యం మమైవైశాపహాసనా నాహమేతాం తస్యదురాత్మనస్సహిష్యే

నహ్యనుల్లజ్ఘ్యవరపాదపం తత్కృతనీడాశ్రయిణోవిహఙ్గ మావధ్యన్తే తదలమమునాస్మత్పురతః శోకప్రేరితవాక్యపరికరేనేత్యుక్త్వా ద్వారకామభ్యేత్య ఏకాన్తేబలదేవం వాసుదేవః ప్రాహ

మృగయాగతం ప్రసేనమటవ్యాం మృగపతిర్జఘాన

సత్రాజితోఽప్యదునాశతధన్వనానిధం ప్రాపితః

తదుభయవినాశాన్తన్మణిరాత్నమావాభ్యాం సామాన్యం భవిష్యతి

తదుత్తిష్ఠారుహ్యతాం రథః శతధన్వనిధానాయోద్యమం కుర్విత్యభిహితస్తథేతి సమన్విచ్చితవా

కృతోద్యమౌచతావుభావుపలభ్య శతధన్వాకృతవర్మాణముపేత్యపార్ ష్ణిపూరణకర్మనిమిత్తమచోదయత్

ఆహచైనం కృతవర్మా

నాహం బలదేవవాసుదేవాభ్యాం సహవిరోధాయాలమిత్యుక్తశ్చా క్రూరమచోదయత్

అసావప్యాహ

నహికశ్చిద్భాగావతాపాద ప్రహారపరిశమ్పితజగత్రాయేణ సురరిపువనితావై ధవ్యకారిణాప్రబలరిపుచక్రాప్రతి హతచక్రేణచక్రిణా మదముదిత నయనావలోకనారిబలశాతనేనా తిగురువై రివారణాపకర్షణావిష్కృతమహి మోరుసీరేణసీరిణాచసహ సకల జగన్ధ్వానామమరవరాణా మాపియోద్దుం సమర్థః

కిముతాహం తదన్యశ్శరణమభిలష్యతామిత్యుక్తశ్శతధనురాహ

యద్యస్మత్పరిత్రాణాసమర్థం భవానాత్మానమవగచ్ఛతి తదయమస్మత్తస్తావన్మణిః సంగృహ్యరక్ష్యతామితి

ఏవముక్తః సోఽప్యాహ

యద్యన్త్యాయామప్యవస్థాయాం నకస్మైచిద్భవాన్ కథయిష్యతి తదహమేతం గృహీష్యామీతి

దథేత్యుక్తే చాక్రూరస్తన్మణిరత్నం జగ్రాహ

శతధనురప్యతులవేగాం శతయోజనవాహినీం బడబామారుహ్యాపక్రాన్తః

ఆ సత్యభామచే నిట్లు పలుకబడి శ్రీకృష్ణుడు సంతుష్టమైన మనసు గలవాడైనను సత్యభామతో క్రోధముచే నెఱ్ఱనైన నేత్రములు గలవాడై నిట్లనెను. సత్యా! సత్యమిది నాకు జేసిన యవమానమే. ఆ దురాత్ముని ఈ పనిని నేను సహింపను. శత్రు వృక్షమును తిరస్కరించిన దాని నాశ్రయించి యున్న పక్షుల నెవ్వరు జంపరు. నాముందు శోక ప్రేరితమై వచ్చిన నీవాక్య సముదాయము చాలునని పలికి ద్వారకకు వచ్చి ఏకాంతము నందు బలదేవునితో వాసుదేవుడు యిట్లనియె. వేటకై చనిన ప్రసేను నడవిలో సింహము చంపెను. సత్రాజిత్తు కూడ శతధన్వునిచే నిపుడు చంపబడెను. ఆ యిద్దరు పోవుట శ్యమంతక మణి మనకు ఉమ్మడి సొత్తుగా గలదు. అందువలన నీవిపుడు లేలెమ్ము. రథమెక్కుము. శతధన్వుని చంపు ప్రయత్నము సేయుము. అన విని బల రామమూర్తి యట్లేయని యంగీకరించెను. కృష్ణ బలరాము లందులకు బూనుకుని రని తెలిసి శతధన్వుడు కృతవర్మ దరికేగి తన సహాయ నిమిత్తము ప్రేరేపించెను. అప్పుడు కృతవర్మ నేను బలదేవ వాసుదేవులతోడి విరోధమునకు జాలనన అక్రూరుని ప్రేరేపించెను. ఇతడును నిట్లనియె. అడుగం దట్టిన మాత్రమున జగత్రయము గంపించును. అమర వైరుల యంగనలకు వైధవ్యము గూర్చును. ప్రజల రిపు చక్రమునకు అప్రతిహతమైన చక్ర ఆయుధమును దాల్చు నా చక్రితోను అల్లల్లన నొకయింత కనుదెరచి చూచి నంతన నరిబలముం జెక్కి వైచునట్టి ప్రబల శత్రు మదవారణములం బలిమియై దోరించుటలో వెలువరింప బడిన మహా మహిమము గల హలాయుధము గల హరి తోడను బోరుట కఖిల జగద్ద్వంద్యులగు బృందారకులలో గూడ నొక్కడును సమర్థుడు లేడు. నేనెక్కడ? అందుచే మఱొక్కని శరణు గోరుమన శతధన్వుడు నాకు రక్షణ యిచ్చుటకు నిన్నీవ సమర్థునిగ భావింతువేని యిదిగో యీ మణిని జాగ్రత్తగ భద్ర పరుపుమన నతడు అంత్యావస్థలో గూడ నీవింకొకని కిది తెలుపు నందువేని దీనిని నేను దీసికొందు ననియె. అతడట్లేయన నక్రూరుడు యామణిని చేకొనియె. శతధన్వుడు వేగము గల నూరామడల లేక ధాటింగొని పోగల గుఱ్ఱమెక్కి యటనుండి తఱలెను.

శైబ్యసుగ్రీవమేఘ పుష్పవలాహకాశ్వచతుష్టయయుక్త రథస్థితౌ బలదేవ వాసుదేవౌ తమనుప్రయాతౌ

సాచబడబా శతయోజన ప్రమాణమార్గామతీతా పునరపివహ్యమానా మిథిలావనోద్దే శేప్రాణానుత్ససర్జ

శతధనురపి తాం పరిత్యజ్య పదాతిరేవాద్రవత్

కృష్ణోఽపిబలభద్రమాహ

తావదాత్ర స్యన్ధనేభవతాస్థే యమహమేన మధమాచారం పదాతిరేవపదాతిమనుగమ్య

యావత్ ఘాతయామి

అత్రహి భూభాగే దృష్టదోషాస్స భయా అతోనైఽతేశ్వాభవాతేమం భూమిభాగముల్లజ్ఘనీయాః

తథెత్యుక్త్వాబలదేవోరథ ఏపతస్థౌ

కృష్ణోపిద్విక్రోశమాత్రభూమిభాగమనుసృత్య దూరస్తితస్యైవ చక్రంక్షిప్త్వా శతధనుషశ్శిరశ్చిచ్చేద

తచ్చరీరామ్భరాదిషుచబహుప్రకారమన్విచ్చన్నపిస్యమన్తకమణింనావా పయదా తదోపగమ్యబలభద్రమాహ

పృథైవాస్మాభిః శతధనుర్ఘాతితః నప్రాప్తమఖిల జగత్సారభూతం తన్మహారత్నం స్యమన్తకాఖ్య

మిత్యాకర్ణ్యోద్భూతకోపో బలదేవోవాసుదేవమాహ

దిక్త్వాం యస్త్వమేవర్థలిప్సుః, ఏతచ్చతే భ్రాతృత్వాన్మయాక్షాన్తం తదయం పంథాస్స్వే చ్ఛయాగమ్యతాం నమేద్వారకయా నత్వయా నచాశేషబన్దుభిః కార్య మలమలమేభిర్మమా గ్రతోఽళీ కశపథై రిత్యాక్షిప్యతత్కథాం కథంచిత్ ప్రసాద్యమానోఽపి నతాస్థౌ

సవిదేహపురీంప్రవివేశ

జనకరాజశ్చార్ ఘ్యపూర్వకమేనం గృహం ప్రవేశాయామాస

సతత్త్రైవచతస్థౌ

వాసుదేవోఽపి ద్వారకామాజగామ

శ్యమంతకోపాఖ్యానము:

శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము లనెడి నాల్గు గుఱ్ఱములు నూన్చిన రథమందు బలభద్ర వాసుదేవు లెక్కి శతధన్వుని దరిమి కొనిపోయిరి. అతడెక్కిన గుఱ్ఱము నూరామడల పరువెత్తి చని చని మిథిలా నగరోపవన ప్రాంతమున ప్రాణములు వాసెను. శతధన్వుడు దానింబాసి పాదచారియై పరువెత్తెను. అప్పుడు కృష్ణుడు బలరామునితో నీవీ రథము మీద నిక్కడనే యుండుము. నేను పాదచారినై యీ పదాతియగు నీయధముని వెంబడించి కూల్చి వత్తును. ఈ ప్రాంతము నందిబ్బందులు భయంకర మయినవి చాల గలవు. నీవీ గుఱ్ఱములనిది దాటిపోనీకుమన బలరాము దట్లేయని రథమందే యుండెను. కృష్ణుడు రెండు క్రోషుల దూరము వెంబడించి దూరమందుండగనే శతధన్వునిపై చక్రము బ్రయోగించి వాని శిరస్సు ఖండించెను. వాని యోడలి పైనున్న వస్త్రము లందెంత వెదకినను ఆ శ్యమంతక మణిం బడయడయ్యె. అంతట వచ్చి బలభద్రున కిట్లనియె. శతధన్వుని మనము వృధాగా గూల్చితిమి. సర్వ జగమ్ములందు సారమైన యా మహారత్నము దొరకలేదు. అనవిని బలరాముడు కోపముతో కృష్ణునిం గూర్చి, ఛీ ఛీ నీవు దురాశకు వశుడ వైతివి తమ్ముడవని సైచితిని. నీ దారిని నీవు పొమ్ము. ద్వారకతో గాని నీతోగాని బంధువులతో గాని నాకు పనిలేదు. నీ మాయా శపథములు చాలు చాలునని కసరి కృష్ణునిచే బ్రతిమాల బడియు నట నిలువక విదేహ రాజ నగరముం బ్రవేశించెను. జనకరాజు నర్ఘ్య పూర్వాకముగా నతని నింటిలో బ్రవేశ పెట్టెను. అతడక్కడనే యుండెను. వాసుదేవుడు ద్వారక కేతెంచెను.

యావచ్చజనకరాజగృహేబలభద్రోఽవతస్థేతావద్దార్తరాష్ట్రో దుర్యోధనస్తత్సకాశాద్గదాశిక్షామశిక్షయత్

వర్షత్రయాన్తేచ బభ్రూగ్రసేనప్రభృతిభిర్యాదవైర్నతద్రత్నం కృష్ణేనాపహృతమితిక్రుతా వగతిభిర్విదేహనగరీం గత్వా బలదేవః సంప్రత్యాయ్య ద్వారకామానీతః

అక్రూరోఽప్యుత్తమ మణి సముద్భూతసువర్ణేన భగవద్ద్యానపరోఽనవరతం యజ్ఞానియాజ

వ్యసనగతౌహిక్షత్రియవైష్యౌనిఘ్నన్ బ్రహ్మహాభవతీత్యేవం ప్రకాశం దీక్షాకవచం ప్రవిష్ట ఏవతస్థౌ

ద్విశాష్టివర్షాణ్యేవం తన్మణిప్రభావాత్తత్రోపసర్గదుర్ భిక్షమారికామరణాదికం నాభూత్

ఆథాక్రూరపక్షీయైః భోజైశ్శత్రుఘ్నేసత్వతస్యప్రపౌత్రెవ్యాపాదితే భోజైస్సహాక్రూరో ద్వారకామపహాయాపక్రాన్తః

తదపక్రాన్తిదినాదారభ్యతత్రొపసర్గదుర్భిక్షవ్యాళానావృష్టిమారికాద్యుపద్రవా బభూవుః

ఆథయాదవా బలభద్రోగ్రసేనసమవేతా మన్త్రమమన్త్రయన్

భగవానురగారికేతనః కిమిదమేకదైవ ప్రచురోపద్రవాగామనమేతదాలోచ్యతామిత్యుక్తే

అన్ధకనామాయదు వృద్ధః ప్రాహ

అస్యాఽక్రూరస్యపితాఽశ్వఫల్గో యత్రయత్రా భూత్తత్రతత్ర దుర్భిక్షమారికానా వృష్ట్యాదికం నాభూత్

కాశీరాజస్యవిశాయేత్వనా వృష్ట్యాంచ శ్వఫలోనీతః తతసత్ క్షణాదేవ దేవోవవర్ష

బలభద్రుడు జనకునింట నున్నంత వరకు దుర్యోధనుడు గదా యుద్దము నాతని కడ నభ్యసించెను. మూడేండ్ల తర్వాత బభ్రువు ఉగ్రసేనుడు మున్నుగా గల యాదవులు శ్యమంతక మణిని కృష్ణుడు అపహరింప లేదని తెలిసికొన విదేహ నగరికేగి వారు బలదేవుని విశ్వసింప జేసి ద్వారకకు తీసుకొని వచ్చిరి. అక్రూరుడును నయ్యుత్తమ మణి ప్రసవించు సువర్ణ సంపదచే భగవద్ద్యాన నిష్ఠుడై నిర్విరామముగ యజ్ఞములు చేసెను. అరువది రెండేండిట్లా మణి మహిమచే నక్కడ ఆపదలు దుర్భిక్షము మసూచి మరణములును లేవయ్యెను. అవ్వల నక్రూరుని వైపు వారగు భోజులచే సత్వతుని ప్రపౌత్రుడు (ముని మనువడు) చంపబడ భోజులతో గూడ నక్రూరుడు ద్వారకను విడిచి వెళ్ళిపోయెను. ఆ వెళ్ళిన నాటనుండి యక్కడ ఆపదలు కఱవు ఘాతుక మృగభయము అనావృష్టి మహామారి మొదలయిన యుపద్రవము లేర్పడెను. అంత బలరామోగ్రసేనులతో యాదవు లాలోచన సేసిరి. భగవంతుడు కృష్ణుడు ఈ యుపద్రవము లేర్పడుట గూర్చి యాలోచింప వలయునన అంధకుడను యదు వృద్ధుడు ఈ యక్రూరుని తండ్రి శ్వఫల్గు డెటనెట నుండు నక్కడ దుర్భిక్షమారికానావృష్ట్యాద్యుపద్రవము లుండవనియె. కాశీరాజు రాజ్యమందు అనావృష్టి యేర్పడ శ్వఫల్గుడటకు గోపోబదినంత నా క్షణమ పర్జన్యుడు వర్షించెను.

కాశీరాజపత్న్యాశ్చ గర్భే కన్యారత్నం పూర్వమాసీత్

సాచకన్యాపూర్ణేఽపిప్రసూతికాలే నైవనిశ్చక్రామ

ఏవంచ తస్యగర్భస్యద్వాదశవర్షాణ్యనిష్క్రామతోయయుః

కాశీరాజశ్చతామాత్మజాం గర్భస్థామాహ

పుత్రి! కస్మాన్నజాయసే! నిష్క్రంయతామ్మాస్యం తేద్రష్టుమిచ్చామి, ఏతాంచమాతరంకిమితి

చిరంక్లేశయిష్యసీత్యుక్తాగర్భస్థైవ వ్యాజహార

తాత! యద్యేకైకాం గాం దినేదినేబ్రహ్మణాయప్రయచ్చసి తదహమన్యైస్త్రీభిర్వర్ షైరస్మాద్గర్భాత్తతోవశ్యం నిష్క్రమిష్యామీత్యేతద్వాచనమాకర్ణ్య రాజాదినేదినే బ్రాహ్మణాయాగాం ప్రాదాత్

సాహితావతాకాలేనజాతా

తతస్తాస్యః పితా గాందినీతి నామచకార

తంచగాందిణీంకన్యాం శ్వఫల్గాయోపకారిణే గృహమాగతయార్ ఘ్యభూతాం ప్రాదాత్

 తస్యామయమక్రూరః శ్వఫల్గాజ్జజ్ఞే

 తస్యైవం గుణమిథునాదుత్పత్తిః

 తత్ కథమస్మిన్నపక్రాన్తే అత్రదుర్భిక్షమారికాద్యుపద్రవా నభవిష్యన్తి

తదయమత్రానీయతామ్ అలమతిగుణవత్యపరాధాన్వేషణేనేతి యదువృద్దస్యాన్ధకస్యై తద్వచనమాకర్ణ్య కేశవోగ్రసేన బలభద్రపురోగమ్యైరయదుభిః కృతాపరాధా తితిక్షుభి రభయన్దత్వాశ్వఫలపుత్రః స్వపురమానీతః

తత్రచాగతమాత్ర ఏవ తస్యస్యమన్తకమణేః ప్రభావాదనావ్రుష్టి మారికాదుర్భిక్ష వ్యాళాద్యుపద్రవోపశమా బభూవుః

 కాశీరాజు భార్య గర్భమందు మున్నొక కన్య యుండెను. ప్రసూతి సమయము పూర్తియైనను నా శిశువు గర్భము వెలువడి రాకుండెను. ఇట్లు పండ్రెండేండ్లయ్యెను. అప్పుడా కాశీరాజు గర్భమందున్న శిశువుతో, పుత్రీ! ఎందు వలన నీవు పుట్టవు? వెడలిరమ్ము! నీమోము చూడ గోరుచున్నాను. ఈ మీ యమ్మ నెందులకు చిరకాలము శ్రమ పెట్టెదవు? అన గర్భమందున్న యా యాడు శిశువిట్లనియె. తండ్రీ! దినదిన మొక్క గోవును బ్రాహ్మణు కిత్తువేని యింక మూడేండ్లకీ గర్భమును వేలుపడి వత్తునని విని యారాజు ప్రతిదినము విప్రునకు గోవునిచ్చు చుండెను. ఆ పిల్లయు నా చెప్పిన సమయమునకు జనించెను. అందుచే నామెకు తండ్రి గాందినియను పేరు పెట్టెను. ఆ గాందినిని యింటి కేతెంచిన శ్వఫల్గునకును తనకుపకారి యైన దానికి అర్ఘ్య (పూజాద్రవ్య) మైన యా కన్యను దానము చేసెను. ఆ శ్వఫల్గున కీయక్రూరుడు జనించెను. అతని పుట్టుక యిటువంటి గుణవంతు లయిన మిథునము నుండియైనది. ఈతడిట తలగి వెళ్ళినచో దుర్భిక్షమారి కాద్యుపద్రవము లెందులకు కలుగవు? అందువలన నీతని నిక్కడకు గొనిరండు. అతి గుణవంతుని యెడ దప్పులు వెదకుట యిక చాలునని యదువృద్దు డంధకుడు సెప్ప విని కేశవోగ్రసేన బలరామాదులతో యాదవులు సేసిన తప్పు సైరించి యభయ మిచ్చి శ్వఫల్గు కుమారు నక్రూరును పురమునకు రప్పించెను. అక్కడ నతడు వచ్చినంతనే యా శ్యమంతక మణి ప్రభావముచే ననావృష్ట్యాది

సర్వోపద్రవములు నుపశమించినవి.

కృష్ణశ్చిన్తయామాస

స్వల్పమేతత్కారణం యదయం గాన్దిన్యాంష్వఫల్గేనాక్రూరోజనితః

సుమహాంశ్చాయ మనావృష్టిదుర్భిక్షమారికాద్యుపద్రపద్రవప్రతిషేధకారీ ప్రభావః

తన్నూనమస్యకాశేసమహామణిః స్యమన్తకాఖ్యాస్తిష్ఠతి

తస్యహ్యేవం విధాః ప్రభావాః శ్రూయన్తే

అయమపిచాయజ్ఞాదనన్తరమన్యత్క్రత్వతదం తస్యాన న్తర మన్యద్యజ్ఞాన్తరం చాజస్ర మవిచ్చిన్నం యజతీతి

అనల్పోపాదానం చాస్యాసంశయ మత్రాసౌమణివరస్తిష్ఠతీతికృతయద్యవసాయోఽన్యత్ర యోజనముద్దిశ్య సకలయాదవసమాజమాత్మగృహేవాచీకరత్

తత్రచోపవిశ్తెశ్వఖిలేషుయదుషు పూర్వం ప్రయోజనముపన్యస్యపర్యవసితేచ తస్మిన్ ప్రసంగాన్తర పరిహాస కథామక్రూరేణసహకృత్వాజనార్దన స్తమక్రూరమాహ

దానపతే! జానీమ ఏవవయం యథాస్హతధన్వనా తదిదమఖిలజగత్సారభూతం స్యమన్తకం రత్నం భవతః సమర్పితం తదశేషరాష్ట్రోపకారకం భవత్సాకాశే తిష్ఠతి తిష్ఠతు సర్వ ఏవవయం తత్ప్రభావ ఫలభుజః క్వింత్వేషబలభద్రోస్మా నాశఙ్కితవాన్ తదస్మత్ప్రీతయే దర్శయ స్వేత్యభిదాయ జోషం స్థితేభగవతి వాసుదేవే సరత్నస్సోఽచిన్తయత్

కిమత్రానుష్ఠేయ మన్యథాచేద్బ్రవీమ్యహం తత్కేవలామ్భారతిరోధాసమన్విష్యన్తోరత్నమేతే ద్రక్షన్తి అతివిరోథోనక్షమ ఇతిసంచిన్త్యతమఖిల జగత్కారణ భూతం నారాయణమహాక్రూరః

అంతట కృష్ణుడిట్లు తలంచెను. గాంధిని యందు స్వఫల్గునికి అక్రూరు డుదయించెననుట ఇది చిన్న కారణము. అనావృష్టి దుర్భిక్షాద్యుపద్రవముల వారించు నీ ప్రభావము చాల గొప్పది కావున నిశ్చయముగ నితని దగ్గర నా మహామణి శ్యామంతకముండి తీరును. ఆ మణి ప్రభావము లనేకము లిట్టివి విన బడుచున్నవి. కావున నితని దరిని నిస్సంశయముగ అధిక జీవనాద్రవ్యమగు మణి రత్నమున్నదని నిశ్చయము చేసి మఱియు నొండు ప్రయోజనము నుద్దేశించి కృష్ణుడు సకల యాదవ సమాజముం దనయింట సంఘటించెను. ఆ సభయందందఱుం గూర్చుండ తొలుత సమావేశము యొక్క ప్రయోజనము నుపన్యసించి యదిపూర్తి యయినంతట నక్రూరునితో బ్రసంగాంతరమునకుం దిగి పరియాచకము లాడి జనార్దను డతనితో నిట్లనియె. దానపతీ! మేమెఱుంగనే యెఱుగుదుము. శతధన్వుడు సకల జగత్సారమయిన శ్యమంతక రత్నము నీకిచ్చినట్లు. సర్వరాష్ట్రో పకారక మయిన యది నీ దగ్గర నున్నది. ఉండుగాక! మేమందరమును దాని ప్రభావము యొక్క ఫలము ననుభవించు వారమే. అని యీతడు బలరాముడు మమ్ముల శంకించెను. అందుచే దానిని మా ప్రీతి కొఱకు జూపింపుమని పలికి భగవంతుడు వాసుదేవు డూరకున్నంత రత్నము దగ్గర పెట్టికొన్న యక్రూరు డిట్లనుకొనెను. ఇప్పుడు చేయ వలసినదేమి? ఇంకొకలాగు పల్కితినేని కేవలము బట్టచాటున నున్న దానిని వీరు వెదకువారై యమ్మణిం జూడగలరు. అథి విరోధము మంచిది గాదు, అని యాలోచించి యఖిల జగత్కారణమై యా నారాయణుం గూర్చి అక్రూరుడు యిట్లనియె.

భగవన్మమైతత్ స్యమన్తక రత్నం శతధనుషాసమర్పితమ్ అపగతేచతస్మిన్నద్యశ్వః పరశ్వోవా భగవాన్ యాచయిష్యతీతి కృతమతిరతి కృచ్చ్రేణైతావన్తం కాలమదారయమ్

తస్యచధారణ క్లేశేనాహ మశేషోపభోగేశ్వసంగిమానసోవేద్మిస్వసుఖకలామాపి

ఏతావన్మాత్రమప్య శేషరాష్ట్రోపాకారిధారయితుం నశక్నోతీతిభావాన్మన్యత ఇత్యాత్మనానచోదితవాన్

తదితం స్యమన్తకరత్నం గృహ్యతామిచ్చయాయస్యాభిమతం తస్యసమర్ ప్యతామ్

తతః స్వోదరవస్త్రనిగోపితమతిలఘు కనకసముద్గతకగతం ప్రకటీకృతవాన్

తతశ్చనిష్క్రామ్యస్యమన్తకమణిం తస్మిన్ యదుకుల సమాజే ముమోచ

భగవన్! ఈ రత్నమును శతధన్వుడు బహూకరించెను. అతడు సనిన మీదట ఇపుడో రేపో ఎల్లుండియో, భగవంతుడు హరి దీని నడుగ గలడని భోగములందు నా మనస్సత్తు కొనక రవ్వంత యేని సుఖ మెఱుంగ నైతిని. అశేష రాష్ట్రోపకారియైన దీనినింత మాత్రమేని యితడు భద్రపరుప లేక పోయినాడని నీవను కొందువని నిన్నిందులకు బ్రేరేపణ సేయనైతిని. అందువలన నిస్యమంతకముం గైకొనుము. నీ వేవ్వనికీయ నభిమతము వానికి బహూకారింపుము అని తన కడుపునకు జుట్టుకొన్న బట్టలో దాచు కొన్న మిక్కిలి చిన్న పెట్టినున్న దానిని వెలువరించెను. ఆ బరణి నుండి తీసి దానిని నయ్యదకుల సమాజము నందు విడిచెను.

ముక్తమాత్రేచతస్మి న్నతికాన్త్యాతదఖిలమాస్థాన ముద్ద్యోతితమ్

అథాహాక్రూర! స ఏషమణిః శతధన్వనాఽస్మాకం సమర్పితః యస్యాయంస ఏవ గృహ్ణాత్వితి

తమాలోక్యసర్వయాదవానాం సాధుసాధ్వితివిస్మితమనసాం వాచోఽశ్రూయన్త

తమాలోక్యాతీవబలభద్రోమయాయమచ్యుతేనైవ సామాన్యస్సమన్విచ్ఛిథ ఇతికృత స్పృహోభూత్

మమైవాయం పిత్రుధనమిత్యతీవచసత్యభామాఽపి స్పృహయాంచకార

బలసత్యావలోకనాత్కృష్ణోఽప్యాత్మానాం గోచక్రాన్తరావస్థితమివమేనే

సకలయాదవసమక్షం చాక్రూరమాహ

ఏతద్దిమణిరత్నమాత్మసం శోధనాయ ఏతేషాం యదూనాం మయాదర్శితమ్ ఏతచ్చమమబలభద్ర స్యచాసామాన్యం పితృధనంచై తత్సత్యభామాయా నాన్యస్యైతత్

ఏతచ్చసర్వకాలం శుచినాబ్రహ్మచార్యాదిగుణవత్రాధ్రియమాణమశేషరాష్ట్రస్యోపకారకమ్ అశుచినాద్రియమాణమాదారమేవహన్తి

అతోఽహమస్యషోడశస్త్రీసహస్రపరిగ్రహాదసమర్దోధారణే కథమేతత్సత్యభామాస్వీకరోతి

ఆర్యబలభద్రేణాపిమదిరాపానాద్యశేషోపభోగపరిత్యాగః కార్యః

తదలం యదులోకోఽయం బలభద్రః అహంచ సత్యాచాత్వాం దానపతేప్రార్థయామః

తద్భావానేవదారయితుం సమర్థ

త్వద్ధృతం చాస్యరాష్ట్రస్యోపకారకం తద్భావానశేషరాష్ట్రనిమిత్తమేతత్పూర్వవద్దారయత్వాన్య

న్నవక్తవ్యమిత్యుక్తోదానపతి స్తథేత్యాహ, జగ్రాహచతన్మహారత్నమ్

తతః ప్రభాత్యక్రూరః ప్రకటేనైవతేనాతిజాజ్వల్యమానేనాత్మకాణ్ఠవసక్తేనాదిత్య ఇవాంశుమాలీ చచార

ఇత్యేతద్భగవతోమిథ్యాభిశస్తిక్షాళనం యస్స్మరతి నతస్యకదాచిదల్పాపిఽమిధ్యాభిశస్తిః భవతి అవ్యాహతాఖిలేన్ద్రియశ్చాఖిలపాపమోక్షమవాప్నోతి

విడిచిన మాత్రదాని యాపరిమిత కాంతిచేత నయ్యాస్థానమెల్ల మిఱుమిట్లు గొనెను. అంత నక్రూరుడదే మణి శతధన్వుడు మాకిచ్చినది ఇది ఎవ్వనిదో యాతడే దీనిం గైకొను గాక యనియె. అది చూచి సర్వయాదవులు ‘బాగు బాగు’ అని మది నచ్చెరువు గొని పలుకు పలుకులు వినబడెను. దానిం జూచి బలరాముడు మా కృష్ణునితో బాటు నాకునిది సమానమైన సొత్తని దానిపై వేడుక పడెను. నా తండ్రి సోత్తేయిది యని సత్యభామ దానిపై మిక్కిలి ముచ్చట పడెను. బలరామ సత్యభామలను జూచి కృష్ణుడు దనను గోచక్రాంతర మందున్న వానింగా భావించెను. సకల యాదవ సమక్షమందు నక్రూరునిం గూర్చి హరి యిట్లనియె. ఈ మణి రత్నమును నాయపవాదు తొలగించు కొనుటకై యీ యాదవుల కుంజూపితిని. ఇది నాకు మా బలరామునకు సరివంతయినది. సత్యభామ పితృ ధనమిది యామెదే. మఱి యెవ్వరిదిం కాదు. సర్వకాలము దీనిని శుచియై బ్రహ్మచర్యాది గుణ సంపన్నుడై ధరించునేని యిది సర్వరాష్ట్రోపకారకము. అశుచియై ధరించిన నిది యా ధరించిన వానిని జంపును. ఇందువలన పదాఱు వేలమందిని బెండ్లాడిన నేనద్దానిం ధరింప అసమర్థుడను. సత్యభామ మాత్రమేట్లు దీనిని స్వీకరించును! ఆర్య బలరామమూర్తి

ఈనిం ధరించునేని మద్యపానాది సకలోప భోగపరిత్యాగము సేయ వలసి యుండును. అందుచే నదివద్దు. ఈ యదులోకము బలభద్రుడు నేను సత్యయును నోదానపతీ! నిన్ను బ్రార్థింతుము. అది నీవే ధరింప సమర్థుడవు. నీవు ధరించిన నిది సర్వరాష్ట్రోపకారక మగును. అందువలన నీవే అశేష రాష్ట్ర నిమిత్తముగా ధరింపుము. మాఱుమాట పలుకకుము. అనిన దానపతి యట్లె యనియె. ఆ రత్నముం గైకొనెను. అది మొదలక్రూరుడు వెల్లడియై జాజ్వలు మానమై యున్న య మణిరత్నముం దన కంఠమున దాల్చి కిరణ మాలియైన యాదిత్యునట్లు సంచరించెను. ఈ కృష్ణ భగవానుని లోకాపవాదు బాపుకొన్న యితి వృత్తము నెవ్వడు స్మరించునో వానికించుకేని యపకీర్తిం గలుగదు. ఇంద్రియ పటుత్వము గలవాడై సకలపాప వుముక్తిం బొందును.