విష్ణు మహా పురాణము

17 - అక్రూరగమనము

శ్రీపరాశరుడు:

అక్రూరోపివినిష్క్రమ్యస్యన్దనేనాశుగామినా

కృష్ణసందర్శనాకాంక్షీ ప్రయాయౌ నన్దగోకులమ్

చిన్తయామాసచాక్రూరో నాస్తిధన్యతరోమయా

యోఽహమంశావతీర్ణస్యముఖంద్రాక్ష్యామిచక్రిణః

అద్యమేసఫలంజన్మ సుప్రభాతాచమేనిశా

యదున్నిద్రాబ్జపత్రాక్షం విష్ణోర్ ద్రక్ష్యామ్యహం ముఖమ్

పాపం హరతియాత్పుంసాం స్మృతంసంకల్పనామయమ్

తత్పుణ్డరీకనయనం విష్ణోర్ ద్రక్ష్యామ్యాహం ముఖమ్

వినిర్జగ్ముర్యతోవేదావేదాఙ్గాన్యఖిలానిచ

ద్రక్ష్యామితత్పరం ధామధామ్నాం భగవతో ముఖమ్

యజ్ఞేషుయజ్ఞ పురుషః పురుషైః పురుషోత్తమః

ఇజ్యతేయోఖిలాధార స్తంద్రక్ష్యామిజగత్పతిమ్

ఇష్ట్వాయమిన్ద్రోయజ్ఞానాం శతేన నామరరాజతామ్

అవాపతమనన్తాదిమహంద్రక్ష్యామికేశవమ్

నబ్రహ్మానేన్ద్రరుద్రాశ్వివస్వాదిత్యమరుద్గణాః

యస్యస్వరూపం జాన న్తిప్రత్యక్షం యాతిమేహరిః

సర్వాత్మాసర్వవిత్సర్వస్సర్వభూతేష్వవస్థితః

యోహ్యచిన్త్యోఽవ్యయోవ్యాపీ సవక్ష్యాతిమయాసహ

మత్స్య కూర్మ వరాహాశ్వ సింహరూపాదిభిః స్థితమ్

కర్తుం మనుష్యతాం ప్రాప్తస్స్వేచ్చాదేహధృదవ్యయః

యోఽన న్తః పృథివీం థత్తేశేఖరస్థితి సంస్థితామ్

సోఽవతీర్ణోజగత్యర్థేమామక్రూరేతివక్ష్యతి

పితృపుత్రసుహృద్భ్రాతృమాతృ బన్ధుమయీమిమామ్

యన్మాయాం నాలముత్తర్తుంజగత్తస్మైనమోనమః

శ్రీపరాశరుడు:

శ్రీకృష్ణ దర్శనమునకు అక్రూరుడు రథముపై నంద గోకులమున కేగెను. ఏగుచు దనలో, స్వాంశముతో నవతరించిన చక్రాయుధుని ముఖముం జూడ నున్నాను. ఇప్పుడు నా జన్మము సఫల మయినది. ఈ రేయి సుప్రభాత మైనది. అప్పుడే వికసించిన తామర రేకులట్టి కన్నుల విలసిల్లు విష్ణు ముఖమును దర్శింప నున్నాను. సంకల్పనాత్మక మైనది పాపమును హరించు విష్ణుని పుండరీకముల బోలు కన్నుల నింపగు నెమ్మోము చూడ నున్నాను. ఎటనుండి వేదములు వేదాంగములు బయలు వెడలినవో యా పరంధాముని భగవంతుని ముఖము దర్శింప నున్నాను. యజ్ఞము లందు యజ్ఞ పురుషుడుగా పురుషులచే పురుషోత్తముడుగ యజింపబడు సర్వాధారుడగు జగత్పతిని దర్శింప నున్నాను. ఇంద్రుడు నూరు యజ్ఞములం దెవ్వని యజించి అమరరాజు పదవి నందె నా స్వామిం గేశవుని దర్శించెద. బ్రహ్మరుద్రా శ్విన్యాదిత్య మరుద్గణము లెవ్వని స్వరూప మెఱుంగ రాహరి నాకు ప్రత్యక్ష మగుచున్నాడు. సర్వాత్మకుడు సర్వవిదుడు సర్వభూతాంతఃస్థుడు అచింత్యుడు అవ్యయుడు సర్వవ్యాపి నాతో మాటాలాడ నున్నాడు. మత్స్యకూర్మాది రూపములచే జగముల యొక్క స్థితిని గావించిన ప్రభువు అజుడు నాతో పలుక నున్నాడు. ఇపుడు జగత్ప్రభువు తన మీదినున్న స్థితి సహారాదికార్యము నొనరింప స్వేచ్చగృహీత మనుష్యాకారుడై యున్నాడు. ఎవ్వడనంతమూర్తియై (శేషుడు) తన శిరమ్మున భూమిందాల్చునో అతడవతరించి యున్నాడు. నన్ను అక్రూరా! యని పిలువ నున్నాడు. పితృపుత్ర మిత్రకలత్రాది బంధుమోహమయ మయిన ఎవ్వని మాయను జగత్తు తరింప జాలరట్టి మాధవునకు నమస్కారము.

తరత్యవిద్యాం వితతాం హృదియస్మిన్నివేశితే

యోగమాయామమేయత్మా తస్మైవిద్యాత్మానేనమః

యజ్వభిర్యగ్నపురుషో వాసుదేవశ్చసాత్వతైః

వేదా న్తవేదిభిర్విష్ణుః ప్రోచ్యతే యో నతోస్మి తమ్

ఏ స్వామి హృదయము నందున్న నరుడు సర్వవ్యాపిని యైన యవిద్యను యోగామాయను తరించునట్టి యమేయాత్మునకు జ్ఞానమూర్తికి నమస్కారము. యజ్వలు యజ్ఞ పురుషుడని సాత్వతులు (ఉపాసకులు) వాసుదేవుడని వేదాంతవిదులు విష్ణుడని వర్ణింతురా పరబ్రహ్మకు నతుడనయ్యెదను.

యథాయత్రజగద్ధామ్నిధాతర్యేతత్ప్రతిష్ఠితమ్

సదస త్తేనసత్యేనమ్యసౌయాతుసౌమ్యతామ్

స్మృతేసకలకళ్యాణభాజనం యత్రజాయతే

పురుషస్తమజం నిత్యం వ్రజామిశరణం హరిమ్

ఎట్లు ఎచ్చట దాతయందీ సదసదాత్మక వస్తుతత్త్వము నిలువ బదినదో ఆ సత్య రూపముచే నీతడు నాయందు బ్రసన్నుడగు గాక! ఎవని స్మరించినంత పురుషుడు సకల కళ్యాణ భాజనమగునో అట్టి నిత్యుని ఆజుని హరిణి శరణొందెద.

ఇత్థం సంచి న్తయన్విష్ణుంభక్తినంరాత్మమానసః

అక్రూరోగోకులంప్రాప్తః కించిత్సూర్యేవిరాజతి

సదదర్శతదాకృష్ణమాదావాదోహనేగావామ్

వత్సమధ్యగతంపుల్లనీలోత్పలదళచ్చవిమ్

ప్రఫుల్లపద్మపత్రాక్షం శ్రీవత్సాఙ్కితవక్షసమ్

ప్రలమ్భబాహుమాయామతుఙ్గోరః స్థలమున్నసమ్

సవిలాసస్మితాధారం భిభ్రాణం ముఖపఙ్కజమ్

తుఙ్గరక్తనఖంపద్భ్యాం ధరణ్యాం సుప్రతిష్ఠితమ్

బిభ్రాణం వాససీపీతేవన్యపుష్పవిభూషితమ్

సేందునీలాచలాభంతం సితామ్భోజావాతంసకమ్

హంసకున్దేన్దుదవళంనీలామ్భరధరంద్విజ!

తస్యాను బలభద్రంచ దదర్శయదునన్దనమ్

ప్రాంశుముత్తఙ్గబాహ్వంసంవికాసిముఖపఙ్కజమ్

మేఘమాలాపరివృతం కైలాసాద్రిమివాపరమ్

తౌదృష్ట్వావికసద్వాక్త్రసరోజస్సమహామతిః

పులాకాఞ్చితసర్వాఙ్గస్తదాఽక్రూరోఽభవన్మునే

ఇట్లు భక్తి వినమ్రమతియై విష్ణుం దలచుచు నక్రూరుదించుక ప్రోద్దుండగా గోకులమును జేరెను. అతడు తొలుత ఆవుల పాలు పిదుకుచున్న కృష్ణుని దూడల నడుమ నుండగా వికసితనీలోత్పల దలశ్యాముని హరిని దర్శించెను. బాగుగ వికసించిన పత్రముల వంటి నేత్రములు గలవానిని శ్రీవత్సాంకిత వక్షుని ఆజానుబాహుని విశాలోత్తుంగ వక్షుని ఉన్నతనాసుని సవిలాసదరహాస ముఖారవిందునితుంగ రక్తనఖమృదుల పదవిన్యాస మవనిం జేయువాని పీతాంబరధారిని వనమాలా విభూషితుని “చంద్రబింబముతో గూడిన నీలాచల మట్లు తెల్లదామరల దలపూవులుగా దాల్చిన శ్రీకృష్ణుని హంసలు మొల్లలు జాబిల్లి యు నిట్లచ్చపు తెలికాంతుళ గులుకు నెమ్మేన నల్లని వలువ ధరించి” యా కృష్ణుని వెంటనున్న యదునందనుని ఎత్తరియై ఎత్తయిన భుజ శిరస్సులు గల్గి సువికాసి ముఖ పంకజుడై మేఘమాలలు వైనలమిన రెండవ కైలాసాద్రియో యన్నట్లున్న బలభద్రుని వీరిద్దరిని జూచి యమ్మాహామతి యగు నక్రూరుడు మోముదామర విప్పార మేనెల్ల పులకింప నిట్లు భావించెను.

తదేతత్పరమంధామ తదేతత్పరమంధామపదమ్

భగవద్వాసుదేవాంశో ద్విధాయోఽయం వ్యవస్థితః

సాఫల్యమక్ష్ ణోర్యుగమేతదాత్ర దృష్టేజగద్దాతరియాతముచ్చైః

అప్యఙ్గమేతద్భగవత్ప్రసాదాత్తదఙ్గసంగే ఫలవన్మమస్యాత్

అప్యేషపృష్టేమమహ స్తపద్మం కరిష్యతి శ్రీమదనన్తమూర్తిః

యస్యాఙ్గుళిస్పర్శహతాఖిలాఘైరవాప్య తేసిద్దిరపా స్తదోషా

యేనాగ్నివిద్యుద్రవిరష్మిమాలాకరాళమత్యుగ్రమపాస్యచక్రమ్

చక్రం ఘ్నతాడైత్యపతేర్ హృతాని దైత్యాఙ్గనానాం నాయనాఞ్జనాని

యత్రామ్బువిన్యస్యబలిర్మనోజ్ఞానవాపభోగాన్వసుదాతలస్థః

తథామరత్వం త్రిదశాధిపత్యం మన్వ న్తరం పూర్ణమపేతశత్రుః

అప్యేషమాం కంస పరిగ్రహేణ దోషాస్పదీభూతమదోషదుష్టమ్

కర్తావమానోపహతంధిగస్తు తజ్జన్మయత్సాధుబహిష్కృతస్య

జ్ఞానత్మకస్యామలసత్త్వరాశేరపేతదోషస్యసదాస్ఫుటస్య

కింవాజగత్యత్రసమ స్తపుంసామజ్ఞాతమస్యా స్తిహృదిస్థితస్య

తస్మాదహంభ క్తివినమ్రాచేతా వ్రజామిసర్వేశ్వరమీశ్వరాణామ్

అంశావతారం పురుషోత్తమస్య హ్యనాదిమధ్యా న్తమజస్యవిష్ణోః

యా పరమతేజ మిది. ఇది పరమ పదము. వాసుదేవ భగవానుని యంశమిట రెండు రూపములై యున్నది. జగద్దాత యిట కనబడగా కన్నుల సాఫల్యము చేకూరునా? ఈ యనంతమూర్తి నావెన్ను దన కరకమలమున దట్టునా? ఎవని కరాంగుళి తాకిన పాపములు వోయి అచ్చమయిన సిద్ది కలుగుని అగ్ని మెఱపు రవి కిరణముల మాలల వలె వెలుంగు భయంకరమై అత్యుగ్రమైన చక్రాయుధమును వదలి రాక్షస రాజ చక్రమును గూల్చి దైత్యుభార్యాల కన్నుల కాటుకలు హరించెనో భూతలము నందుండియే బలి ఎవని చేతియందు నుదకము (దానధార) నునిచి మనోహర భోగములను అనగా అమరత్వమును మన్వంతరమంతదాక శత్రుశూన్య మగునట్లుగా అమరాధిపత్యమును బడసెనో అట్టి మహాప్రభువు దోష రహితమయిన నన్ను కంసుని చేరదీసి నందున దోషమునకు స్థానమైయున్న వానినిగా తలచి అవమానముచే దూషితునింగా నోనరించునా? అట్టియెడ సాధువులచే వెలివెట్ట బడిన వాని జన్మము ఛీఛీ! పరమ నికృష్టము. జ్ఞాన స్వరూపుడు. అచ్చపు సత్త్వగుణమునకు నిధి. దోషదూరుడు. ఎల్లప్పుడు స్ఫుటమై తోచువాడు సర్వజన హృదయము నందున్న వాడునైన యీ స్మామికి జగమ్మునం దెలియరాని దేమున్నది? కావున నేను భక్తిచే మనసు విధేయము గాగ నీశ్వరేశ్వరుడు అజుడు వ్యాపకుడు నగు పురుషోత్తముని యొక్క ఆదిమధ్యాంత రహితమయిన అంశావతారమును శరణం దెదను.