విష్ణు మహా పురాణము

5 - పాతాళ వర్ణనము

శ్రీపరాశరుడు:

విస్తారఏషకథితః పృథివ్యాభావతోమయా

సప్తతిస్తుసహస్రాణి ద్విజోచ్చ్రాయోఽపికథ్యతే

దశసహస్రమేకైకం పాతాళంమునిసత్తమ

అతలంవితలంచైవ నితలంచగాభస్తిమత్

మహాఖ్యంసుతలంచాగ్ర్యం పాతాలంచాపి సప్తమమ్

శుక్ల కృష్ణారుణాః పీతాశ్శర్కరాశ్శైలకాఞ్చనాః

భూమాయోయత్రమైత్రేయ! వరప్రాసాదశోభితాః

తేషుదానవదై తేయజాటయశ్సతసంఘశః

నివసన్తిమహానాగాజాతయశ్చమహామునే

శ్రీపరాశరుడు:

ముని శ్రేష్ఠులారా! భూమి యొక్క వైశాల్యము డెబ్బది వేల యోజనములు, దాని యెత్తు నంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, నితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము యనునవి సప్త పాతాళములు. అచట కృష్ణా, శుక్లా, అరుణా, పీతా, శర్కరా, శైలకాంచనీ అను భూములు ఉత్తమ సౌధములతో నొప్పు చుండును. ఆ ప్రదేశము లందు దైత్య దానవ జాతులు వందల కొలది గలరు. బ్రాహ్మణోత్తములారా! అచట పెద్ద సర్ప జాతులు కూడా గలవు.

స్వర్లోకాదపిరమ్యాణిపాతాలానీతినారదః

ప్రాహస్వర్గసదంమధ్యేపాతాలాభ్యాగతోదివి

ఆహ్లాదకారిణశ్శుభ్రామణయోయత్రసుప్రభాః

నాగాభరణభూషాసుపాతాళం కేనతత్సమమ్

దైత్యదానవకన్యాభిరితశ్చైతశ్చశోభితే

పాతాలేకస్యనప్రీతిర్విముక్తస్యాపిజాయతే

దివాకరరాశ్మయోత్రప్రభాంతన్వన్తినాతపమ్

శశిరశ్మిశీతాయనిషిద్యోతాయకేవలమ్

భక్ష్యభోజ్యమహాపానముదితై రతిభోగిభిః

యత్రనజ్ఞాయతేకాలో నాంతోఽపిదనుజాదిభిః

వనానినద్యోరమ్యాణిసరాంసికమలాకరాః

పుంస్కోకిలాభిలాపాశ్చమనోజ్ఞాన్యమ్బరాణిచ

భూషణానయతిశుభ్రాణిగాన్ధాఢ్యంచానులేపనమ్

వీణావేణుమృదఙ్గానాం స్వనాసూర్యాణిచద్విజ

ఏతన్యన్యానిచోదారభాగ్యానిదానవైః

దైత్యోరగైశ్చభుజ్యన్తేపాతాలాన్తరగోచరైః

స్వర్గము కంటెను పాతాళములు రమ్యములని పాతాళము నుండి స్వర్గమున కేగి సభా మధ్యమున నారద మహర్షి చెప్పిరి. వీనియందాహ్లాద జనకము లైన పరిశుభ్ర కాంతి భరితములైన రత్నము లున్నవి. నాగాభరణ భూషణములు పెక్కు లున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటియగును. దైత్యదానవ కన్యారత్నము లిందందందు క్రీడింతురు. ఇట్టి పాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతిజనకమై యుండును. పగటి సూర్యు కిరణము లిచ్చట కాంతి నొసంగును గాని ఎండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్ర కాంతులును చలిని గాక చక్కని వెలుగును మాత్రమే యిచ్చును. భక్ష్య భోజ్యలేహ్య పానీయా రూపమైన యాహారము లచే మదించిన భోగులగు దానవాదులు కాలగమనము నిచట గమనింపనే గమనింపరు. వనములు నదులు సరోవారములు పుంస్కోకిలల కళకళ రావములతో మనోహరములై యుండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గందాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణావేణు మృదంగ నాదము శ్రవణ మనోహరముగ వినిపించును. ఇచటి భాగ్య భోగ్యములు పరమ మనోహరములు. పాతాళ వాసులగు దానవులు దైత్యులు నాగులును ఆ భోగము లనుభవించు చుందురు.

పాతాళానామధశ్చా స్తేవిష్ణోర్యాతామసీతనుః

శేషాఖ్యాతతద్గుణాన్వక్తుంనశక్తా దైత్యదానవాః

యోనన్తః పఠ్యతేసిధైర్దేవాదేవార్షి పూజితః

యస్సహస్రశిరావ్యక్తస్వస్తికామలభూషణః

ఫణామణిసహస్రేణయస్సవిద్యోతయన్ దివః

సర్వాన్ కరోతినిర్వీర్యాన్ హితాయాజగతోఽసురాన్

మదాఘార్ణితనేత్రోఽసౌయస్సదైవైకకుణ్డలః

కిరీటస్రగ్ధరోభాతిసాగ్నిశ్శ్వేత ఇవాచలః

నీలవాసామదోద్రిక్తశ్శ్వేతహారోపశోభితః

సాభ్రఙ్గాప్రపాతోసౌకై లాసాద్రిరివోన్నతః

లాంగలాసక్తహస్తాగ్రో బిభ్రాన్ముసల ముత్తమమ్

ఉపాస్యతేస్వయంకాన్త్యా యోవారుణ్యాచమూర్తయా

పాతాళమున కడుగున విష్ణువు యొక్క తమోమయ శరీరము శేషుడను పేర అనంత కళ్యాణ గుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ, దేవర్షి, సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్వస్తిక ముద్రాంకితము లైన వేయి శిరస్సులచే సహస్ర ఫణామణి కాంతి పుంజములచే దెసలను రంజింప జేయు చుండును. లోకహితమునకై ఆయన యచటి యసురులను తన దేజముచే నిర్వీర్యము నొనరించు చుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీట ధారియై, పుష్ప మాలాంకృతుడై మద ఘార్ణిత నేత్రుడై అగ్ని సహిత శ్వేతాచల మాట్లు ప్రకాశించు చుండును. నీల వసనుడు మదోత్సికుడు శ్వేతహోరోప శోభితుడు ఆకాశగంగా ప్రపాత సంయుత కైలాస పర్వత మున్నట్లు ఈ శేషుడు ఒక చేత నాగలియు మరొక చేత రోకలియు ధరించి వారుణియను నాగాంగనతో గూడి యుపాసింప బడును.

కల్పన్తేయస్యవక్త్రేభ్యో విషానలశిఖోజ్జ్వలః

సంకర్షణాత్మకోరుద్రో నిష్కమ్యాత్తిజగత్త్రయమ్

సభిభ్రచ్చేఖరీభూతమ శేషంక్షితిమణ్డలమ్

ఆస్తేపాతాలమూలస్థశ్షేశోఽశేష సురార్చితః

తస్యవీర్యంప్రభావశ్చస్వరూపం రూపమేవచ

నహివర్ణయితుంశక్యం జ్ఞాతుంవాత్రిదశైరపి

యస్యైషాసకలాపృథ్వీఫణామణిశిఖారుణా

ఆస్తేకుసుమమాలేవ కస్తద్వీర్యంవదిష్యతి

కల్పాంత మందు సహస్ర ముఖముల నుండి విషానల జ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగ త్రయమును మ్రింగి వేయును. గిరి మండలమట్లు అశేషక్షితి మండలమును ఫణాగ్రమున ధరించి అశేషు డశేష సురార్చితుడై పాతాలమూల మందధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్య ప్రభావ రూప వైభవము వర్ణింప జాలరు. తెలిసికొన జాలరు. ఆయన ఫణామణి శిఖలచే అరుణమయి కుసుమ మాలికవలె నిలాతల మఖిలము నిలిచి యున్నది. అట్టి మహానుభావుని శక్తి నెవ్వడు వర్ణింప గలదు.

యదావిజృమ్భతేఽనన్తోమదాఘార్ణితలోచనః

తదాచలతిభూరేషాసాద్రితోయాసకాననా

గన్ధర్వాప్సరసస్సిద్దాః కిన్నారోరాగచారణాః

నాన్తంగుణానాంగాచ్చన్తితేనానన్తోయమవ్యయః

యస్యనాగావదూహస్తైర్లేపితంహరిచన్దనమ్

ముహుశ్శ్వాసానిలాపాస్తంయాతిది(క్ష్ క్షో) క్షూదవాసతామ్

యమారాధ్యపురాణర్షిర్గర్గోజ్యోతీంషితత్త్వతః

జ్ఞాతవాన్ సకలంచైవ నిమిత్తఫలితం ఫలం

తేనేయం నాగవర్యేణ శిరసా విధృతామహీ

బిభర్తిమాలార లోకానాం సదేవాసురమానుషామ్

మదముచే తిరుగడువడు కన్నులతో నయ్య నంతుడెప్పుడు విజృంభించునో అపుడు భూమండలము ఆ పర్వత సముద్రముగా కంపించును. గంధర్వాప్సర సిద్ద కిన్నరోరగా వారణులు కూడా ఆశేషాహి గుణముల యంతు తెలియలేరు. కావుననే యాయన అనంతుడను పేరొందెను. నాగకన్యా తిలకములు తమ మృదుల కరకమలములచే నతనికి పూయు హరి చందనము శ్వాసా నిలములచే విసరబడి దెసలకు సువాసన భరిత పటవాసమై (పరిమళ చూర్ణమై) వాసించుచు. ఆ ఫణిరాజు నారాధించి పురాణ మహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యముల నెరింగెను. సకల శకున ఫలితములను దెలుప గల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసా వహింప బడిన యీ వసుంధర దేవాసుర మానుష విశేష సహితము లయిన సర్వ లోకములను ధరింప గల్గు చున్నది.