శ్రీపరాశరుడు:
చిన్తయన్నితిగోవిన్ధముపగంయసయాదవః।
అక్రూరోస్మీతిచరణౌ ననామశిరసాహరేః॥
సోప్యేనంధ్వజవజ్రాబ్జకృతచిహ్నేనపాణినా।
సంస్పృశ్యాకృష్యచప్రీత్యా సుగాడంపరిషస్వజే॥
కృతసం వందనౌతేనయథావద్బలకేశవౌ।
తతః ప్రవిష్టౌసంహృష్టౌ తమాదాయాత్మ మందిరమ్॥
సహతాభ్యాంతదాఽక్రూరః కృతసంవన్దనాదికః।
భుక్తభోజ్యోయథాన్యాయ్యమాచచక్షేతతస్తయోః॥
యథానిర్భాత్సితస్తేన కంసేనానకదున్దుభిః।
యథాచదేవకీదేవీ దానవేనదురాత్మనా॥
ఉగ్రసేనేయథా కంసస్సదురాత్మాచవర్తతే।
యంచై వార్థం సముద్దిశ్య కంసేనతువిసర్జితః॥
తత్సర్వం విస్తరాచ్చ్రుత్వా భగవాన్ దేవకీసుతః।
ఉవాచాఖిలమప్యేతద్ జ్ఞాతం దానపతేమయా॥
కరిష్యే తన్మహాభాగయదత్రౌపయికంమతమ్।
విచిన్త్యం నాన్యథై తత్తేవిద్దికంసంహతంమయా॥
అహంరామశ్చమథురాం శ్వోయాస్యావస్సహత్వయా।
గోపవృద్దాశ్చయాస్య న్తిహ్యాదాయోపాయనం బహు॥
నిశేయంనీయతాం వీర! నచిన్తాంకర్తుమర్హసి।
త్రిరాత్రాభ్యన్తరేకం సంనిహనిష్యామిసానుగమ్॥
శ్రీపరాశరుడు:
గోవిందునిట్లు తలంచుచునయ్యాదవుడు వచ్చి శిరసువంచి అక్రూరుడను నేనని స్వామి చరణములను నమక్షరించెను. అతడును ధ్వజ వజ్ర పద్మరేఖంకితమయిన హస్తముచే దాకి దగ్గర కాకర్షించుకొని ప్రీతితో గాఢముగ గౌగాలించు కొనెను. అతని వందనము లందుకొని బలరామ కృష్ణు లానందించుచు నతనింజేకొని తమ మందిరముం జొచ్చిరి. అయ్యెడ నక్రూరుడు వారితో లోనికేగి వారికి నమస్కరించి వారితో సగౌరవముగ విందారగించి వారికి దాను వచ్చిన పని నిట్లు దెలిపెను. దుష్ట దానవుడు కంసుడు వాసుదేవుని దేవకీ దేవిని బెదరించుట వాడుగ్రసేనునితో దూర్వృత్తితోనుండుట యతనిని విడిచి వేయుట మొదలగున దెల్లం దెలుప భగవంతుడు విని యదెల్ల నేనెఱుంగుదును. మహాభాగా! యిందేనేమి సేయవలయును నది సేసెదను. ఇది యింకొక రీతిగ నివాలోచింపకుము. కంసుడు నాచే విహతుడైనట్లే యెరుంగుము. నేనును, బలరాముడును నీతోగూడ రేపు మధురకు వెళ్ళుదము. గోపా వృద్దులును నుపాయనము లెన్నో కొని వెళ్ళుదురు. ఓ వీరాగ్రేసరా! ఈ రేయిక్కడ గడుపుము. మనసున జింతింపకుము. మూడు రాత్రులలోగా నేను సపరివారుని గంసుని సంహరింతును అనెను.
శ్రీపరాశరుడు:
సమాదిశ్యతతోగోపానక్రూరోఽపిచకేశవః।
సుష్వాపబలభద్రశ్చ నన్దగోపగృహేతతః॥
తతః ప్రభాతేవిమలేకృష్ణ రామౌమహాద్యుతీ।
అక్రూరేణసమంగన్తుముద్యతౌమథురాంపురీమ్॥
దృష్ట్వాగోపీజనస్సాస్రశ్శ్లథద్వాలయబాహుకః।
నిశశ్వాసాతి దుఃఖార్తః ప్రాహచేదం పరస్పరమ్॥
మథురాం ప్రాప్యగోవిన్దః కథం గోకులమేష్యతి।
నగరస్త్రీకలాలాపమధు శ్రోత్రేణ పాస్యతి॥
విలాసవాక్యపానేషు నాగరీణాం కృతాస్పదమ్।
చిత్తమస్య కథం భూయోగ్రామ్యాగోపీషు యాస్యతి॥
సారంసమస్తగోష్ఠస్యవిధినాహరతాహరిమ్।
ప్రహృతంగోపయోషిత్సు నిర్ ఘృణేన దురాత్మనా॥
భావగర్భాస్మితం వాక్యం విలాసలలితా గతిః।
నాగరీణా మతీవై తత్కటాక్షేక్షిత మేవచ॥
గ్రామ్యోహరిరయం తాసాం విలాసనిగళైర్యుతః।
భవతీనాంపునః పార్శ్వం కయాయుక్త్యాసమేష్యతి॥
ఏషైషరథమారుహ్యమథురాంయాతికేశవః।
క్రూరేణాక్రూరకేణాత్రనిర్ ఘృణేనప్రతారితః॥
కింనవేత్తినృశంసోయమనురాగపరం జనమ్।
యేనై వామక్ష్ణోరాహ్లాదం నాయత్యన్యాత్రనోహరిమ్॥
ఏషరామేణసహితః ప్రయాత్యత్య న్తనిర్ఘృణః।
రథమారుహ్యగోవిన్దస్త్వర్యతామస్యవారణే॥
గురూణామగ్రతోవక్తుం కింబ్రవీథననః క్షమమ్।
గురవః కింకరిష్యన్తి దగ్దానాం విరహాగ్నినా॥
నన్దగోపముఖాగోపా గన్తుమేతేసముద్యతాః।
నోద్యమం కురుతేకశ్చిద్గోవినివర్తనే॥
సుప్రభాతాఽద్యరాజనీమధురావాసయోషితామ్।
పాస్యన్త్యచ్యుతవక్త్రాబ్జం యాసాంనేత్రాళిపఙ్త్కయః॥
ధన్యాస్తేపథియేకృష్ణ మీతోయంత్యనివారితాః।
ఉద్వహిష్యన్తిపశ్యన్తస్స్వదేహం పులకాఞ్చితమ్॥
మథురానగరీపోరనయనానాంమహోత్సవః।
గోవిన్దావయవైః దృష్టైరతీవాద్యభవిష్యతి॥
కొనుస్వప్నస్సభాగ్యాభిః దృష్టస్తాభిరధోక్షజమ్।
విస్తారికాన్తినయనాయాద్రక్ష్యన్త్యనివారితాః॥
ఆహోగోపీజనస్యాస్యదర్శయిత్వామహానిధిమ్।
ఉత్కృత్తాన్యద్యనేత్రాణివిధినాఽకరుణాత్మనా॥
అనురాగేణశైథిల్యమస్మాసువ్రాజతాహరేః।
శైథిల్యముపయాన్త్యాశు కరేషువలయాన్యపి॥
అక్రూరః క్రూరహృదయశ్శీఘ్రం ప్రేరయతేహయాన్।
ఏవమార్తాసుయోషిత్సు కృపాకస్యనజాయతే॥
ఏషకృష్ణరథస్యోచ్చైశ్చక్రరేణుర్నిరీక్ష్యతామ్।
దూరీభూతోహరిర్యేనసోపిరేణుర్నలక్ష్యతే॥
ఇత్యేవమతిహార్ దేన గోపీజననిరీక్షితః।
తత్యాజవ్రాజభూభాగం సహరమేణకేశవః॥
గోపకుల కెళ్ళి ప్రయాణమని యాదేశించి యక్రూరుడు కృష్ణుడు బలరాముడును నందగోపునింట నిదురించిరి. అవ్వల వేకువ వెలుగు వచ్చినంత కృష్ణ బలరాములు అక్రూరునితో మథురకేగ సన్నద్దులైరి. గోపీజన మదిచూచి కంటనీరు గ్రుక్కికొని కరకంకణములు జార కృశించి కుమిలి నిట్టూర్పులు వుచ్చుచు నొండొరు లిట్లనుకొనిరి. 'గోవిందుడు మథురా నగరమున కేగి యిక గోకులమున కేల తిరిగివచ్చును?’ ఇక నాగరిక సుందరుల మధురములగు పలుకు దేనియాల వీనుల గ్రోలగలడు. నెఱజాణలు మథురాపురీ విలాసినుల శృంగార వాక్యపానము లందు రుచిమరగిన వీనిచిత్తము మఱల నీమన పల్లెటూరి ముద్దియలవై పేటలు మఱలును? సర్వ గోకులమునకు సారమైన హరిని హరించి కొనిపోవు నాపాడు దైవము దయమాలి గోపా సుందరుల యెడ అపకారము చేసినాడు. నర్మగర్భమున నల్లన నవ్వుచుం బలుకు పలుకులు ఆ యొయ్యారము కులుకు నడకలు ఆ నగర కాంతల వాల్చూపులను మఱగి యీ బేల యీ పల్లెటూరి పిల్లడే యుక్తిచే మీపజ్జకు వచ్చును? అక్రూరుండట, కాదీతడు క్రూరుండు. నిర్దయుడు. వీనిచే బెలుపడి యిడుగో! ఇదే యీతడు రథమెక్కి మథురకుం జనుచున్నాడు. ఈ నృశంసుడు (ఘాతకుడు) ఈ జనము వీనిపై నెక్కడలేని మొహముం గొని యున్నదని యెఱుగడా? మన కన్నుల పండువును హరి నీతడొండెడ గొంపోవు చున్నాడు. ఇతడో పరమ నిర్దయుడు. గోవిందుడు బలరామునితో రథమెక్కి వేల్లుచున్నాడు. వీని నాపుటకు త్వరపడుడు! పెద్దల సన్నిధిలో చెప్పుట మనకు తగదందురా? విరహాగ్ని దగ్ధులమైన మనలను పెద్దలు మాత్రమేమి సేయగలరు? అదిగాక నందగోపుడు మున్నగా నిదేవీరు పయనమగు చున్నారు. ఒక్కడును గోవిందుని మరలింప పూనుకొనడే! ఈ రేయి మథురా నగర భామినులకు సుప్రభాతము. వారి చూపుం దుమ్మెదల పంక్తు లచ్యుతుని నెమ్మోము దామరలం ద్రావనున్నవి. స్వామి యిట నుండి మథురకుం జనుచుండ నేవ్వరిచే గాని నివారింప బడక వారితో పోవుచు వారిని గాంచుచు నేమ్మేను పులకరించు వారు ధన్యలు. స్వామి ప్రత్యంగ సౌకుమార్య సౌందర్యముం దిలకించు మథురాపురీ పౌర నయనముల కిప్పుడు మహోత్సవము గానున్నది. కనుదమ్ములు విచ్చి గాంతులు విస్తరింప నెవ్వరి యడ్డు లేకుండ నీ గోపా సుందరుల దర్శింప నా భాగ్యవతు లేమి మంచి కలలు గన్నారో కదా! గోపీజనమున కీపెన్నిధిం జూపించి చూపోపమింగాబోలు కరుణమాలి యవ్విది యిప్పుడు కన్నులు పెరికినాడు (విరహము చేత మఱియొక వస్తువును చూచు నిచ్ఛలేక పోవుతచేత కళ్ళు లేనట్లే). శైథిలయము నందుచున్న హరియొక్క ప్రేమతో బాటు మా ముంజేతి ముఱుగులును వెంటనే వాడులగు చున్నవి (హరి విరహముచే కృశించితిమి). అక్రూరుడు నిజముగా క్రూర హృదయుడు. గుర్రములను దొందఱగ దోలుచున్నాడు. ఇట్లు బాధపడు నబలల యెడ నెవ్వనికి జాలి కలుగదు? ఇదిగో కృష్ణ రథము. ధూళి యెత్తుగ రేగినం చూడుడు. అదికూడా కనబడుట లేదు. హరి దూర మరిగి నాడు. అని ఇట్లు హార్దాముగ గోపీజనము నిరీక్షింప హరి బలరామునితో వ్రేపల్లియ ప్రాంతమును వదలెను.
గచ్చన్తోజవనాశ్వేన రథేన యమునాతటమ్।
ప్రాప్తేమధ్యాహ్నసమయే రామాక్రూరజనార్ధనాః॥
అథాహకృష్ణమక్రూరోభావద్భ్యంతావదాస్యతామ్।
యావత్కరోమికాళిన్డ్యా ఆహ్నికార్షణమమ్భసి॥
తథేత్యుక్తస్తతస్స్నాచాన్తస్సమహామతిః।
దధ్యౌబ్రహ్మపరం విప్ర! ప్రవిష్టోయమునాజలే॥
ఫణాసహస్రమాలాడ్యం బలభద్రం దదర్శసః।
కున్దమాలాఙ్గమున్నిద్రపద్మపత్రాయతేక్షణమ్॥
వృతంవాసుకిరమ్భాద్యైర్మహద్భిః పవనాశిభిః।
సంస్తూయమానమద్గన్ధివనమాలావిభూషితమ్॥
దధానమసితేవస్త్రే చారురూపావతం సకమ్।
చారుకుణ్డలినంభాన్తమన్తర్జలతలేస్థితమ్॥
తస్యోత్సఙ్గేఘనశ్యామమాతామ్రాయథాలోచనమ్।
చతుర్భాహుముదారాఙ్గంచక్రాద్యాయుధభూషణమ్॥
పీతేవసానంవసనే చిత్రమాల్యోపశోభితమ్।
శక్రచాపతటిన్మాలావిచిత్రమివతోయదమ్॥
శ్రీవత్సవక్షసం చారుస్ఫురన్నకరకుణ్డలమ్।
దదర్శకృష్ణ మక్లిష్టం పుణ్డరీకావాతంసకమ్॥
సనన్ధనాద్యైర్మునిభిస్సిద్దయోగై రకల్మషైః।
సంచిన్త్యమానంతాత్రస్థైర్నాసాసాగ్రన్యస్తలోచనైః॥
బలకృష్ణౌతథాక్రూరః ప్రత్యభిజ్ఞాయవిస్మితః।
అచిన్తయద్రథాచ్చీఘ్రం కథమత్రాగతావితి॥
వివక్షోః స్తంభాయామాసవాచంతస్యజనార్దనః।
తతోనిష్క్రామ్యసలిలాద్రథమభ్యాగతః పునః॥
దదర్శతత్రచైవోభౌ రథస్యోపరినిష్ఠితౌ।
రామకృష్ణౌయథాపూర్వం మనుష్యవపుశాన్వితౌ॥
నిమగ్న శ్చపునస్తోయేదదర్శచతథై వతౌ।
సంస్తూయమానౌగన్ధర్వైర్మునిసిద్దమహోరగైః॥
తతోవిజ్ఞాతసద్భావస్సతుదానపతిస్తదా।
తుష్టావసర్వవిజ్ఞానమయమచ్యుతమీశ్వరమ్॥
జనమునం బోవు గుఱ్ఱములం బూన్చిన రథముతో పోవుచు మధ్యాహ్న సమయమున నమ్మువ్వురు యమునా తీరముం జేరిరి. అప్పుడు కృష్ణునితో నక్రూరుడు మీరిద్దిరు నిటనుండుడు. నే కాళిందిందోగి మాధ్యాహ్నికానుష్ఠానము గావింతును. అన వారు సరియన నతడు స్నానము సేసి యాచమించి యయ్యమునా జలముల పరబ్రహ్మమును ధ్యానించెను. వేయి పూల మాలలతో వికసించిన తామరపూ రేకులంబోలు కన్నులతో వాసుకిరంభుడు మొదలయిన మహాసర్ప వారముచే స్తుతింప బడుచు ఘుమఘుమలు నించు వనమాల గైసేసి నీలాంబరమును దాల్చి చక్కని శిరో భూషణముతో సొంపగు కుండలములతో నానీటం భాసించు బలభద్రుం దర్శించెను. అతని యొడిలో మేఘశ్యాముడై ఎఱుపాఱు కన్నులు నాల్గు బాహువులు చక్రాద్యాయుధములు గైసేసి యున్న తమూర్తియై పీతాంబరములు దాల్చి రంగురంగుల పూలమాలలు గైసేసి యింద్ర ధనుస్సున మెరుపులా మాలలన్వింత గొలుపు మేఘమట్లు శ్రీవత్సవక్షుండును చక్కగా మెఱయు మకరకుండలములం ధరించి తెల్ల దామర పువ్వును సిగం గైసేసి యున్న వాడునునగు శ్రీకృష్ణ పరమాత్మను పుణ్యశీలురు సనందనాది మునులు సిద్దయోగులు నీతనిలిచి ముక్కుకొనం జూపులు నిలిపి ధ్యానించు చుండ దర్శించెను. వారిద్దరు బలరామ కృష్ణులని గుర్తించి విస్మయమంది యక్రూరుడు రథము నుండి వీరితకెట్లు వచ్చిరని యాలోచించెను. అది యడుగవలె ననుకొన్న యాతని వాక్కును హరి స్తంభింప జేసెను. అంతట నీరు వెడలి యాతడు రథము దరికేతెంబెను. అతడయ్యిద్దర నా రథము నందు మునుపటి యట్ల మనుష్య రూపులై యున్నవారిం జూచెను. నీట మునిగి యక్కడను ముందతియట్ల కంచెను. గంధర్వులు మునులు సిద్దులు మునులు సిద్దులు నాగులు నందు ఇద్దఱను గొనియాడు చుండిరి. అంతట నాదానపతి కలరూప దెలిసి సర్వ విజ్ఞానమయు నీశ్వరు నచ్యుతుని స్తుతించెను.
అక్రూరుడు:
సన్మాత్రరూపిణేఽచిన్త్యమహిమ్నే పరమాత్మనే।
వ్యాపినేనై కరూపైకస్వరూపాయ నమోనమః॥
సర్వరూపాయతేచిన్త్యహవిర్భూతాయతేనమః।
నమోవిజ్ఞాతపారాయపరాయప్రకృతేః ప్రభో॥
భూతాత్మాచేన్ద్రియాత్మాచప్రదానాత్మాతథాభవాన్।
ఆత్మాచపరమాత్మాచత్వమేకః పఞ్చధాస్థితః॥
ప్రసీదసర్వసర్వాత్మన్ క్షరాక్షరమయేశ్వర।
బ్రహ్మవిష్ణుశివాఖ్యాభిః కల్పనాభిరుదీరితః॥
అనాఖ్యేయయస్వరూపాత్మన్ననాఖ్యేయప్రయోజన।
అనాఖ్యేయాభిధానంత్వాంనతోస్మిపరమేశ్వర॥
నయత్రనాథవిద్యన్తే నామజాత్యాదికల్పనాః।
తద్బ్రహ్మపరమం నిత్యమవికారిభావానాజ!॥
న కల్పనామృతేఽర్థస్యసర్వస్యాధిగమోయతః।
తతః కృష్ణాచ్యుతాన న్తవిష్ణుసంజ్ఞాభిరీడ్యతే॥
సర్వార్థాస్త్వమజవికల్పనాభిరేతైః దేవాద్యైర్భవతిహియైరనన్తవిశ్వమ్।
విశ్వాత్మాత్వమితివికారహీనమేత త్సర్వస్మిన్నహిభావతోఽస్తికించిదన్యత్॥
త్వం బ్రహ్మాపశుపతి రార్యమావిధాతా దాతాత్వం త్రిదశపతిస్సమీరణోఽగ్నిః।
తోయేశోధనపతిరంతకస్త్వ మేకో భిన్నార్డైర్జగడభిపాసిశక్తిభేదైః।
విశ్వం భావం త్సృజతిసూర్యగభస్తిరూపో విశ్వేశ తేగుణమయోఽయమతః ప్రపఞ్చః॥
రూపంపరంసదితి వాచకమక్షరం యద్ జ్ఞానాత్మనేసదసతేప్రణతోఽస్మితస్మై॥
ఓన్నమోవాసుదేవాయనమస్సంకర్షణాయచ।
ప్రద్యుమ్నాయ నమస్తుభ్యమనిరుద్దాయతే నమః॥
సన్మాత్ర రూపియు అచింత్య మహిముడును సర్వవ్యాపియు కారణ దశయందేక రూపియు కార్యదశ యందనేక రూపియునైన పరమాత్మకు నమస్కారము నమస్కారము. సర్వరూపుడు హవిర్మూర్తి ప్రకృతి కతీతుడు. విజ్ఞానమునకు పర్యవసాన భూతుడు పంచాభూతములకు ఆత్మయైనవాడు అవ్యక్తరూపుడు ఏకాదశేంద్రియ రూపుడు ఆత్మయు (జీవుడు) పరమాత్మయు (నిరుపాధికుడు) నుగా నీవొక్కడవే యైదు విధములై యున్నావు. ఓ సర్వ! సర్వాత్మక! క్షరక్షరమయా! బ్రహ్మ విష్ణు శివులను పేర వివిధ కల్పనల బేర్కొన బడువాడవు. అనిర్వచనీయ స్వరూపభూత! అనిర్వచనీయ ప్రయోజన! అనిర్వచనీయాభిధాన! పరమేశ్వర! నిన్ను మ్రొక్కెద. నామజాత్యాది కల్పన యెచటలేదో, అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారియునైన వస్తువు నీవు. వివిధ కల్పనారహితముగ సర్వార్థావగతి కలుగదు కావున నీవు కృష్ణ అచ్యుతానన్త విష్ణువులను సంజ్ఞలచే బేర్కొన బడుదువు. బ్రహ్మాది దేవతలు పంచ భూతములు దిక్పాలురునై శక్తి భేదములచే జగత్తుం బ్రోతువు. సూర్య కిరణ రూపుడవై నీవు విశ్వమును సృజింతువు. ఈ ప్రపంచము నీ గుణ వికారము. సత్ అను అక్షరమును నీకు వాచకమునైన రూపమునకు సదసదాత్మకునను ప్రణతు డనయ్యెద. ‘ఓం నమో వాసుదేవాయ’ ఇత్యాది శ్లోకము మంత్రం రూపము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నా నిరుద్దములనెడి శ్రీమహావిష్ణువు వ్యూహ చతుష్టయమును ఈ మంత్రమున పేర్కొన బడినవి. దాన నక్రూరుడా హరికి నమస్కరించెను.
Summary of chapter 18 of the Vishnu Mahā Purāṇa is as follows:
Akrūra arrives at Gokula and meets Kṛṣṇa and Balarāma. On the journey to Mathurā, when they stop at the Yamunā for bathing, Akrūra submerges in the water and receives a divine vision: he sees Balarāma and Kṛṣṇa in their supreme four-armed divine forms, luminous and attended by nāgas and siddhas, in the cosmic ocean beneath the river — a revelation of their true transcendent nature.