విష్ణు మహా పురాణము

4 - నాల్గవ అధ్యాయము

శ్రీమైత్రేయుడు:

బ్రహ్మానారాయణాఖ్యో సౌకల్పాదౌ భగవాన్ యథా

ససర్జ సర్వ భూతాని తన్మే వద మహామునే

శ్రీమైత్రేయుడు:

కల్పాది యందు నారాయణు డనబడు బ్రహ్మ సర్వ భూతముల నెట్లు సృజించెను? తెల్పుమన మైత్రేయునకు పరాశరు లిట్లనిరి.

శ్రీపరాశరుడు:

ప్రజాస్స సర్జ భగవాన్ బ్రహ్మా నారాయణాత్మకః

ప్రజాపతి పతిర్దేవో యథాతన్మే నిశామయ

అతీత కల్పావసానే ని శాసుప్తోత్థితః ప్రభుః

సత్త్వోద్రిక్తస్తాదా బ్రహ్మాశూన్యం లోకమవైక్షత

నారాయణః పరోఽచిన్త్యః పరేషామపిస ప్రభుః

బ్రహ్మ స్వరూపీ భగవాననాదిః సర్వ సంభవః

ఇమంచోదాహరన్త్యత్ర శ్లోకం నారాయణం ప్రతి

బ్రహ్మ స్వరూపిణం దేవం జగతః ప్రభుమవ్యయమ్

ఆపోనారా ఇతిప్రోక్తా అపోవైనరసూనవః

అయనంతస్యతాః పూర్వంతేన నారాయణః స్మతః

తోయాన్తస్స్థాం మహీం జ్ఞాత్వా జగత్యేకార్ణవే ప్రభుః

అనుమానాత్తదుద్దారం కర్తు కామః ప్రజాప్రతిః

అకరోత్స్వతనూమన్యాం కల్పాదిషు యథాపురా

మత్స్యకూర్మాదికాంతద్వద్వారాహంవపురాస్థితః

వేదయజ్ఞమయం రూపమ్ అశేష జగతః స్థితౌ

స్థితః స్థిరాత్మా సర్వాత్మా పరమాత్మా ప్రజాపతిః

జనలోకగతైస్సిద్ ధైస్సనకాద్యైరభిష్టుతః

ప్రవివేశ తదా తోయమాత్మాదారోధరాధరః

నిరీక్ష్యతం తదాదేవీ పాతాలతల మాగతమ్

తుష్టావప్రణతాభూత్వా భక్తి నమ్రా వసుంధరా

శ్రీపరాశరుడు:

జరిగిన కల్పము చివర రాత్రి నిదుర నుండి లేచి సత్త్వగుణోద్రిక్తుడై లోకమును శూన్యముగా గనెను. నారాయణుని గూర్చి ఈ క్రింది శ్లోకము మహర్షులు దహరింతురు. ఆపః = నీరు, నారములన బడినవి. అవి నరుడు గన్నవి. ఆ నారాయణునకవి మొదట ఆయనము = గమ్య స్థానమయినవి. అనగా నుదకముల యందాయన తొలుత విశ్రమించె నన్నమాట. నారాః + ఆయనం యస్యసః నారాయణః అను నిర్వచనముం బట్టి ఈ శబ్ద మేర్పడినది. ప్రళయ మందేకార్ణవ మైన తఱి నీటి లోపల నున్నట్లు ఊహించి ఈ భూమిని మీది కెత్త వలెనని ప్రజాపతి కోరెను. అపుడు మనువు కల్పాదులందు వలె తాను మత్స్య కూర్మాద్యనేక శరీరములు దాల్చెను. అట్లే వేదము యజ్ఞ స్వరూపముగా గల వరాహ రూపమును ధరించెను. అపుడు స్థిరము సర్వము పరమునైన యాత్మ తానై జనలోక మందున్న సనకాది సిద్దులు స్తుతించు చుండ దనకు నాదారమయిన యా పరమాత్మ ధరణిం దాల్చి నీటం బ్రవేశించెను. అతనిం జూచి పృథివి పాతాళమునకు వచ్చిన యా వారాహ మూర్తి కెఱిగి భక్తిచే వినమ్రయై యిట్లు స్తుతించెను.

పృథివి:

నమస్తే పుణ్డరీకాక్ష తుభ్యం శంఖగదాధర

మాముద్ధారాస్మాదద్యత్వం త్వత్తోహంపూర్వముత్థితా

త్వయాహముద్ధృతా పూర్వంతన్మయాహంజనార్ధన

తథాన్యానిచభూతాని గగనాదీ న్యశేషతః

నమస్తే పరమాత్మత్మన్ పురుషాత్మ న్నమోస్తుతే

ప్రదాన వ్యక్తభూతాయ కాలభూతాయతే నమః

త్వంకర్తాసర్వ భూతనాంత్వంపాతా త్వంవినాషకృత్

సర్గాదిషుప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మ రూపధృత్

సంభక్షయిత్వాసకలం జగత్యేకార్ణవీకృతే

శేషేత్వమేవగోవిన్ద చిన్త్యమానోమనీ షిభిః

భవతోయత్పరంరూపం తన్నజానాతికశ్చన

అవతారేషుయద్రూపంతదర్చన్తిదివౌకసః

త్వామారాధ్యపరం వ్బ్రహ్మయాతాముక్తిం ముముక్షవః

వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి

యత్కిఞ్చన్మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః

బుద్ధ్యాచాయత్పరిచ్చేద్యం తద్రూపమఖిలంతవ

త్వన్మయాహంత్వదధారత్వత్సృష్టాత్వత్స మాశ్రయా

మాధవీమితి లోకోయమభిధత్తే తతోహిమాం

పృథివీ:

ఓ పుండరీకాక్ష! శంఖ చక్ర ధర! నీకు నమస్కారము. ఇందుండి నన్నుద్దరింపుము. మున్ను నిట్లుద్దరించితివి. అపుడు నేను నీ స్వరూపమే యైతిని. ఆకాశాది సర్వ భూతములు సర్వ జగములు నీవే. ఓ పరమాత్మ! పురుష రూప! ప్రధాన వ్యక్త భూతునకు కాలాత్మకునకు నీకు నమస్కారము. సర్వ ప్రపంచమేకార్ణవ మైనపుడీ వొక్కడివే శయనింతువు. జ్ఞానులపుడు నిన్ను ధ్యానించుదురు. నీ పరతరమైన రూపమేవ్వాడు నెఱుంగడు నీవవతార మెత్తినప్పటి రూపమునే దేవత లర్చింతురు. (ఇదే అర్చనా మూర్తి యన్న మాట) వాసుదేవుని నిన్నారాధింపక యెవ్వడు ముక్తి పడయును? ముముక్షువుల కారాధ్య మయిన పరబ్రహ్మ మిదియె. మనసుచే నేత్రాదీంద్రియము లచేనేదేది గ్రహింప నగునో బుద్దిచే నేది పరిచ్చిన్నమో (కొలవ బడునదో) ఆ రూప మంతయు నీవె. నేను త్వన్మయను = నీతో నిండిన దానను. నా రూప మంతయు నీవే యన్నమాట. నాకు నేవే యాధారము. నీవే దిక్కు, నీ చేతనే సృష్టింప బడిన దానను. అందు వలన లోకము నన్ను ‘మాధవి’ అని పేర్కోను చున్నది. జ్ఞానమయా! జయము జయము! ఇత్యాదిగా వసుందర చేసిన స్తవము మూలము పారాయణార్హము. అర్థము సుగమము.

జయాఖిలజ్ఞానమయజయస్థూలమయావ్యయ

జయానంతకయావ్యక్తజయవ్యక్తమాయప్రభో

పరపరాత్మాన్ సర్వాత్మాన్ జయ యజ్ఞపతేఽనఘ

త్వంయజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారస్త్వ మగ్నయః

త్వంవేదాస్త్వంతదజ్ఞానిత్వంయగ్నపురుషోహరే

సూర్యాదయోగ్రహాస్తా రానక్షత్రాణ్యాఖిలానిచ

మూర్తామూర్తమదృశ్యంచ దృశ్యంచ పురుషోత్తమ

యచ్చోక్తంయచ్చనైవోక్తంమయాత్ర పరమేశ్వర

తత్సర్వంత్వంనమస్తుభ్యం భూయోభూయోనమోనమః

ఏవంసంస్తూయమానస్తూపృథివ్యా పృతివీధరః

సామస్వరధ్వనిశ్రీమాన్ జగర్జ పరిర్ఘరమ్

తాతాస్సముతిప్య ధరం స్వదంష్ట్రయా మహావరాహః స్ఫుటపద్మలోచనః

రసాతలా దుత్పలపాత్రసన్నిభః సముత్థితోనీల ఇవాచలో మహాన్

ఉత్తిష్ఠతాతేన ముఖానిలాహతం తత్సంభ వామ్భో జనలోక సంశ్రయాన్

సనన్దనాదీ నపకల్మషా న్మునీంశ్చకార భోయోపి పవిత్రతాపదమ్

పృథివి యిట్లువొగడ శ్రీమంతుడు సామస్వర ధ్వనితో ఘుర్ఘురించెను. వికసిత పద్మ లోచనుడగు హరి తన కోరచే నా భూ దేవిని బాతాలము నుండి యెత్తి యొక నల్లని మహా పర్వతము వలె నల్లగలువ రేకుల వలె నిగనిగ లాడు మేనితో పైకి లేచెను. అట్లెగసిన యవ్వరాహ మూర్తి ముఖ వాయువుల తాకిడికి కెరటములు లేచి నయుదకము జనలోక మందుండు సనందనాది మునులను మిగుల నిర్మలులం జేసెను. సహజ విమలులైన వారు వేదమయము లయిన భగవ న్నిశ్శ్వాసములచే బావిత్రమైన యా తీర్థముచే మరింత బవిత్రతకు స్థాన మయిరని భావము.

ప్రయాన్తితోయాని ఖురాగ్రవిక్షతే రసాతలే ధఃకృతశబ్దసంతతి

శ్వాసానిలాస్తాః పరితః ప్రయాన్తిసిద్ధా జేన్ యే నియతం వసన్తి

ఉత్తిష్ఠత స్తస్యజలార్ ద్రకుక్షే ర్మహావరాహస్య మహీం విగృహ్య

విదూన్వతో వేదమయంశరీరం రోమాన్తరస్థా మునయః స్తువన్తి

తం తుష్ణువు స్తోషపరీతచేతసో లోకో జేన్ యే నివసన్తి యోగినః

సనందనాద్యా హ్యతినమ్రకన్ధరా ధరాధరం తారతరోద్ధతేక్షణమ్

ఉదధి నుండి యువ్వేత్తుగా భూమింగొని మీది కెగసి వేదమయ శరీరమును విదిలించి నంతట నట రోమకూప మందున్న మునులు జనలోక మందలి యోగుల సనందనాదులు మిక్కిలి తలలు వంచి కొరకోణం ధరణిం ధరించి తళతళ మెఱయు మెరుగు కన్నుల బరతెంచిన హరింగని యిట్లు స్తుతించిరి.

మునులు:

జయేశ్వరాణాంపరమేశకేశవప్రభో గదాశంఖధరాసిచక్రభృత్

ప్రసూతినాశస్థితిహేతురీశ్వరస్త్వమేవనాన్యత్పరమంచ యత్పదమ్

పాదేషువేదాస్తవయూపడంష్ట్రద న్తేషుయాజ్ఞాశ్చితయశ్చవక్త్రే

హుతాశజిహ్వోఽసి తానూరహాణి దర్భాః ప్రభోయజ్ఞపుమాంస్త్వమేవ

విలోచనేరాత్యహానీమహాత్మాన్ ఘ్రాణంసమస్తాని హవీంషి దేవ

స్రుక్తుండసామస్వరధీరనాదప్రాగ్వంశకాయాఖిలసత్త్రసంధే

పూర్తేష్టధర్మ శ్రవణోఽసి దేవసనాతనాత్మన్ భగవన్ ప్రసీద

పదక్రమాక్రాన్తభువం భవన్తమాదిస్తితించాక్షరవిశ్వమూర్తే

విశ్వస్యవిద్మః పరమేశ్వరోఽసి ప్రసీద నాథోఽసి చరాచరస్య

దంష్ట్రా గ్రవిన్యస్తమశేషమేతద్భూమండలం నాథ విభావ్యతే తే

విగాహతః పద్మవనం విలగ్నం సరోజినీ పత్రమివోడపంకజమ్

ద్యావాపృధివ్యోరతులప్రభావ యదన్తరం తద్వపుషాతవైవ

వ్యాప్తంజగద్వ్యాప్తిసమర్థదీప్తె హితాయవిశ్వస్యవిభో భవత్వమ్

పరమార్థస్త్వమేవైకోనాన్యోప్తి జగతః పతే

తవైవమహిమాయేనవ్యాప్తమేతచ్చరాచరమ్

యదేతద్దృశ్యతేమూర్తమేతత్ జ్ఞానాత్మనస్తవ

భ్రాన్తిజ్ఞానేన పశ్యన్తిజగ ద్రూపమయోగినః

జ్ఞానస్వరూపమఖిలంజగదేతద బుద్ధయః

అర్థస్వరూపం పశ్యన్తోభ్రామ్యన్తేమోహాసం ప్లవే

మునులు:

జయజయ పరమేశ్వర! కేశవప్రభో గదాశంఖచక్రాసిధర! సృష్టి స్థితి లయ కారణ! నీ కంటె పరమ పదము మఱి లేదు. నీ పాదము లందు వేదము నీ కోర, యూపము దంతము లందు యజ్ఞములు, మొగమందు చితులు (వేదులు) నాలుక అగ్ని, రోమములు దర్భలుగా నుదయించిన యగ్నమూర్తివి నీవే. ఓ మహాత్మా! నీ నేత్రములు పగలు రాత్రియు, సర్వాత్మక మయిన పరబ్రహ్మ నీ శిరస్సు. సర్వ సూక్తములు నీ సటాకలాపము. ఎల్ల హవిస్సులు నీ నాసిక. స్రుక్కు ముట్టె. సామస్వారము నీ గంభీర నాదము. ప్రాగ్వంశము నీ శరీరము. సర్వసత్రములు నీ శరీర మందలి సంధులు. ఇష్టాపూర్త ధర్మములు చెవులు. ఓ సనాతన మూర్తీ! భగవంతుడా ప్రసన్నుడవు కమ్ము. పద క్రమములచే (పదవీ న్యాసములచే) సర్వ భువనము ఆది నాక్రమించిన నీవు స్థితి నందిననాశ శూన్య విశ్వమూర్తీ! విశ్వమునకు పరమేశ్వరు దవని యెఱిగి కొందుము. ఈ భూ మండల మెల్ల నీ దంష్ట్రాగ్ర మందు నిలుప బడి పద్మ వనము నందిగిన యెడ బురదతో దగిలిన తామర పూరేకువలె భాసించు చున్నది. విశ్వహితము సేయ సర్వజగద్వ్యాప్తి నందు గల దీప్తితో నీ శరీరముచే భూనభోంతరము లావరించితివి. జగత్పతీ! పరమార్ధ వస్తువు నీవొక్కడవే! మఱి యొక్కడు లేడు. నీ మహిమచేతనే యీ చరాచరము వ్యాప్తమయినది. రూపుగొని కానవచ్చు నీ దృశ్య జగత్తు జ్ఞానిక మూర్తివగు వీవని యెఱుంగకయు యోగులు భ్రాంతి జ్ఞానముచే జగద్రూపముగ గందురు. జ్ఞాన స్వరూపమైన యీ జగత్తును బుద్ది(జ్ఞానము) లేనివారు అర్ధ స్వరూపమని చూచి (వస్తు దృష్టిచే) మోహ ప్రవాహమున పరిభ్రమించు చుందురు.

యేతుజ్ఞానవిదశ్శుద్ధచేతసస్తేఽఖిలం జగత్

జ్ఞానాత్మకంప్రపశ్యన్తిత్వ ద్రూవం పరమేశ్వర

ప్రసీదసర్వసర్వాత్మన్ వాసాయాజగతామిమామ్

ఉద్దరోర్వీమమేయాత్మన్ శంనోదేహ్యాబ్జలోచన

సత్త్వోద్రిక్తో ఽసి భగవన్ గోవిన్ద పృథివీమిమామ్

సముద్దరభవాయేశ శంనోదేహ్యబ్జలోచన

సర్గప్రవృత్తిర్భావతోజగతాముపకారిణీ

భవత్యేషానమస్తేస్తు శంనోదేహ్యబ్జలోచన

జ్ఞాన విశుద్ధ మనస్కులు నీ రూపమును కేవలము జ్ఞాన రూపముగా గాంతురు. ఓ సర్వమూర్తీ! సర్వ! జగత్తులు నిలువ నీ యుర్వి నుద్దరిమ్పుము. నః = మాకు, శం= ఆత్యన్తిక సుఖమును (ముక్తిని) దేహి = దయ దేయుము, సర్గమందు నీ ప్రవృత్తి (సృష్టికి దిగుట) జగ దుపకారము కొఱకగు గాక. నీకు నమస్కారము. అబ్జలోచనా! నమస్కారము.

శ్రీపరాశరుడు:

ఏవంసంస్తూయమానస్తు పరమాత్మామహీధరః

ఉజ్జహారక్షితింక్షిప్రంన్యస్తవామ్శ్చమహామ్భసి

తస్యోపరిజలౌఘస్యమహతీనౌరివస్థితా

వితతత్వాత్తు దేహస్య న మహీయాతి సంప్లవమ్

తతఃక్షితింసమామ్క్రుత్వా పృథివ్యాంసోఽచినోద్గిరీన్

యథావిభాగంభాగావాననాదిః పరమేశ్వరః

ప్రాక్సర్గదగ్దా నఖిలాన్ పర్వతాన్ పృథివీతలే

అమోఘేన ప్రభావేనససర్జామోఘవాఞ్ఛతః

భూవిభాగంతతఃకృత్వా సప్తద్వీపాన్ యథాతథమ్

భూరాద్యాంశ్చతురోలోకాన్ పూర్వవత్సమకల్పయత్

బ్రహ్మరూపధరోదేవస్తతోఽసౌరాజసావృతః

చకారసృష్టింభగవాంశ్చతుర్వక్త్రధరోహరిః

నిమిత్త మాత్రేన వాసౌసృజానాంసర్గకర్మణి

ప్రధాన కారణీభూతాయతోవై స్తుజ్యశక్తయ

నిమిత్తమాత్రం ముక్త్త్వైనం నాన్యత్కించిదపేక్షతే

నీయతేతపాతంశ్రేష్ఠస్వశక్త్వావస్తువస్తుతామ్

శ్రీపరాశరుడు:

ఇట్లు స్తుతింప బడి పరమాత్మ భూమినెత్తి యుదకము లందు నిల్పెను. వరాహ మూర్తి శరీరము బహు విస్తీర్ణ మగుటచే నబ్దియందది మునిగిపోక గొప్ప యోడవలె భాసించెను. అపుడు భూమిని సమమోనర్చి కడచిన సర్గమందు దగ్దములైన పర్వతముల నెల్ల నమోఘ ప్రభావమున నాల్గు లోకములను యథాతథముగ ముందటి వలె రూపొందించెను. ఆ మీద హరి రజః ప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మ స్వరూపము దాల్చి సృష్టి చేసెను. ఆచేతలో నీతడు నిమిత్త మాత్రుడే. సృజ్య శక్తులు ప్రధాన కారణములు. పరమేశ్వరుని నిమిత్త మాత్రత్వమును వీడి మఱి యితరము నపేక్షింపకయే. అనగా విశేష కారణాపేక్ష లేకుండగనే సృజ్య వస్తువు జీవుల (సృక్య వస్తువుల) ప్రాచీన కర్మ వాసనలచే వస్తుత్వమును బొందింప బడుచుండును.