సగరుడు:
గృహస్థస్యసదాచారం శ్రోతుమిచ్చమ్యహంమునే।
లోకా దస్మాత్పరస్మాచ్చ యమాతిష్ఠన్నహీయతే॥
సగరుడు:
మహామునీ! గృహస్థుడు ఏ సదాచారము నాచారించుట వలన నిహపర లోకముల నుండి చ్యుతుడు కాడో, అట్టి గృహస్తు సదాచారమును వినగోరు చున్నాను.
ఔర్యుడు:
శ్రూయాతాంపృథివీపాల సదాచారస్య లక్షణమ్।
సదాచారవతావుంసా జితౌ లోకా వుభావసి॥
సాధవః క్షీణదోషస్తు సచ్చాబ్ధస్సాదువాచకః।
తేషామాచరణంయత్తు సదాచారస్సాఉచ్యతే॥
సప్తర్షయోఽథమనవః ప్రజానాంపతయస్తథా।
సదాచారస్యవాక్తారః కర్తారశ్చమహీపతే॥
ఔర్యుడు:
ఓ రాజా! సదాచార స్వరూపమును వినుము. సదాచార వంతుడు ఇహ పర లోకముల జయించును. సజ్జనులు పాప రహితులు సత్పదమునకు సాధువని యర్థము. వారి యాచరణమే సదాచార మనబడును. సప్తర్షులు మనువులు, సదాచారకర్తలు వక్తులునై యున్నారు.
బ్రాహ్మేముహూర్త ఉత్థాయ మనసామతిమాన్నృప!।
విబుధశ్చిన్తయేద్దర్మమర్థంచాప్యవిరోధినమ్॥
అపీడయాతాయోః కామముభయోరపిచిన్తయేత్।
దృష్టాదృష్టవినాశాయత్రివర్గాసమదర్శనః॥
పరిత్యజేదర్థకామౌ ధర్మపీడాకరౌనృప।
ధర్మ మ ప్యసుఖోదర్కం లోకవిద్విష్టమేవచ॥
తతఃకాల్యంసముత్థాయ కుర్యాన్మూత్రంనరేశ్వర!॥
నైర్ ఋత్యామిషువిక్షేపమతీత్యాభ్యధికంభువః।
దూరాదావసథాన్మూత్రం పురీషంవిసర్జయేత్॥
పాదావసేచానోచ్చిష్టే ప్రక్షిపేన్న గృహాఙ్గణే॥
ఆత్మచ్చాయాంతరుచ్చాయాంగోసూర్యాగ్న్యనిలాంస్తథా।
గురుద్విజాతీంశ్చబుదోనమేహేతకదాచన॥
నకృష్టేసస్యమధ్యేవా గోవ్రజేజనసంసది।
నవర్ త్మనిననద్యాదితీర్ థేషుపురుషార్ భ॥
నాప్సునైవాంభాసస్తీరేనశ్మశానేసమాచరేత్।
ఉత్సర్గంవైపురీషస్య మూత్రస్యచవిసర్జనమ్॥
ఉధఙ్ముఖోదివామూత్రంవిపరీతముఖోనిశి।
కుర్వీతానాపదిప్రాజ్ఞోమూత్రోత్సర్గంచపార్థివ॥
తృణైరాస్తీవసుధాం వస్త్రప్రావృతమస్తకః।
తిష్టేన్నాతిరంతత్ర నైవకించిదుదీరయేత్॥
వల్మీకమూషికోత్ఖాతాం మృదంనాన్తార్ జలాత్తథా।
శౌచావశిష్టంగేహాచ్చ నాదద్యాల్లేపసంభవామ్॥
అణుప్రాణ్యుపాపన్నామ్చాహలోత్ఖాతాంచపార్థివ।
పరిత్యజేన్మృదశ్పైతాస్సకలాశ్శౌచసాధనే॥
ఏకాలిఙ్గేగుదేత్రిస్రః దశావామకరేనృప।
హస్తద్వయేస ప్తచాన్యా మృదశ్శౌచోపసాదితాః॥
అచ్చేనాగన్ధ ఫేనజలెనాబుద్భుదేనచ।
అచామేచ్చమృదంభూయాస్తదాదద్యా త్సమాహితః॥
నిష్పాదితాఙ్ఘ్రిశౌచస్తుపాదావభ్యుక్ష్యవైపునః।
త్రిః పిబేత్సలిలంతేనతథాద్విః పరిమార్జయేత్॥
శీర్షణ్యానితతః ఖాని మూర్ధానంచసమాలభేత్।
బాహూనాభించతోయేన హృదయంచాపిసంస్పృశేత్॥
ఓ భూపతీ! బుద్ది మంతుడైన వాడు బ్రాహ్మ (సూర్యోదయమునకు వెనుక మూడవ) మూహర్తమందు లేచి, మెలుకువతో కామమును దృష్టాదృష్ట పాప వినాశము కొఱకై చింతింప వలెను. ధర్మమునకు బాధను కల్గించు నర్థ కామములను ఉత్తరత్ర సుఖమును చేకూర్చునదియు లోక దూషితమైనట్టిది యునగు ధర్మమును కూడ విడిచిపెట్ట వలయును. పిమ్మట లేచి కాలకృత్య మగు మూత్రోత్సర్జనము చేయ వలయును. గ్రామమునకు నైఋతి దిక్కు నందు గాని లేక ఇంటికి బాణప్రక్షేప దూరమనకు మించిన చోట మూత్ర పురీషములు విడువ వలెను. ఇంటి ముంగిట పాద ప్రక్షాళన గాని, ఉమియుట మొదలగునవి గాని చేయరాదు. విగ్నుడైన వాడు తన నీడకు చెట్టు నీడకు గోవు, సూర్యుడు, అగ్ని, వాయువు, గురువు, బ్రాహ్మణుడు వీనికిని అభిముఖుడై మూత్ర పురీషములు విడువ రాదు. దున్నిన చోట సస్య మధ్యము యందు ఆవుల మందలోను జన సముదాయమున మార్గమందు నది మున్నగు తీర్థము లందు నీటి యందు నీటి తీరమందు శ్మశాన మందు మూత్ర పురీషములు విడువ రాదు. ప్రాజ్ఞుడు సంకటము లెన్నడు పగలు సంధ్యలందు నుత్తరాభి ముఖుడుగను రాత్రి దక్షినాభి ముఖుడుగను మూత్ర పురీషములను విడువ వలెను. నేలపై గడ్డి పఱచి వస్త్రముతో తలను చుట్టి విడువ వలెను. అచట చిరకాల ముండరాదు, మాట్లాడ రాదు. పుట్టమట్టి ఎలుక కన్నాపు మట్టి నీటిలోని మట్టి శౌచము చేసికొనగా మిగిలిన మట్టి మూత్రాది లేప సంగతమైన మట్టిని ఇంటినుండి శౌచము కొఱకై తీసికొని రాకూడదు. అణువుల తోను, జీవములతోను కూడి యున్నదియు నాగలితో దున్నబడినది యగు మట్టిని శౌచమునకు ఉపయోగించరాదు. శౌచము చేసికొనుటకు మట్టిని మూత్రావయవ మందొక పర్యాయము పురీషోత్సర్జ నావయమ మందు మూడు మారులు ఎడమ చేతి యందు పదిమారులు రెండు చేతులందు నేడేసి మారులు వాడవలెను. స్వచ్చమును వాసన గాని నుఱుగు గాని లేనిదియు బుడగలు లేనిదియునగు నీటితో నాచమనము చేసి మరల సావదానుడై మట్టి రాచుకొన వలెను. ఇట్లు పాదశౌచము చేసికొని పాదములు కడుగుకొని త్రిరాచమనము చేసి రెండు పర్యాయములు పరిమార్జనముస్ చేసికొని తలలో నున్న ఇంద్రియము లను తలను బాహువులను నాభిని హృదయమును నానీటితో స్పృశింప వలెను.
స్వాచాస్తశ్చతతః కుర్యాత్పుమాన్కేశ ప్రసాధనమ్।
ఆదర్ శాఞ్జనమాఙ్గల్యదూర్వాద్యాలమ్భానానిచ॥
తతస్స్వవర్ణధర్మేణవృత్త్యర్థంచధనార్జనమ్।
కుర్వీతశ్రద్దాసంపన్నోయజేచ్చపృథివీపతే॥
సోమసంస్థాహవిస్సంస్థాఃపాకసంస్థాశ్చసంస్థితాః।
ధనేయతోమనుష్యాణాంయతేతాతోధనార్జనే॥
నదీనదతతాకేషు దేవఖాతతటేషుచ।
నిత్యక్రియార్థంస్నాయీత గిరిప్రసవణేషుచ॥
కుపేషూద్ధృతతోయేన స్నానంకుర్వీతవాభువి।
స్నాయీతోద్ధృతతోయేన హ్యథవాభువ్యసంభవే॥
పిమ్మట ఆచనము చేసి కేశాలంకరణము అద్దము చూహు కొనుట అంజనము కాటుక మంగళ వస్తువులు దూర్వాదులను గ్రహించుట చేయవలెను. పిమ్మట స్వవర్ణ ధర్మముతో జీవిత నిమిత్తమై ధనార్జన చేయ వలెను. ఓ రాజా! శ్రద్ధతో గూడిన వాడై యాగముల నాచరించ వలెను. సోమ సంస్థలు ఏడు. హవిస్సంస్థలు ఏడు. పాక సంస్థలు ఏడు. ఈ యాగము లన్నియు ధనాయత్తము లగుట వలన ధనార్జనకై ప్రయత్నింప వలెను. నిత్య కర్మానుష్టానార్తమై నదుల నాదములు తటాకములు మనుష్య నిర్మితములు కాని దేవఖాత జలములందు సెలయేళ్ల యందు స్నానమాచరించ వలెను. కూపముల యందు తడిన జలముతో తత్తీర భూమి యందు అది శాక్యముగా నప్పుడు ఇంటియందు స్నానము చేయ వలయును.
శుచివస్త్రధరస్స్నాతోదేవర్షిపితృతర్పణమ్।
తేషామేవహితీర్థేనకుర్వీతసుసమాహితః॥
త్రిరపః ప్రీణనార్థాయదేవానామపవర్జయేత్।
తథర్షీణాంయథాన్యాయం సకృచ్చాపిప్రజాపతేః॥
పితౄణాంప్రీణనార్థాయత్రిరపః పృథివీపతే।
పితామహేభ్యశ్చతథాప్రీణయేత్ర్పపితామహాన్॥
మాతామహాయతత్పిత్రే తత్పిత్రేచసమాహితః।
దద్యాత్పైత్రేణతీర్థేన కామ్యంచన్యాచ్చృణుష్వమే॥
మాత్రేప్రమాత్రేతన్మాత్రే గురుపత్న్యైతథానృప।
గురవేమతులాదీనాం స్నిగ్ధమిత్రాయభూభుజే॥
పరిశుద్ద వస్త్రము ధరించి సావధాన చిత్తుడై దేవర్షి పితృ తర్పణమును దేవ - ఋషి పితృ తీర్థముల (కరాగ్ర కనిష్టకా మూల తర్జనీ మూలముల)లో చేయవలెను. వీరికి తృప్తికై ముమ్మారు (అనగా భూః భువః సువః దేవాన్ రుశీన్ పితౄణ్ తర్పయామి) అని విడువ వలెను. ప్రజాపతికి ఒక్క పర్యాయము విడువ వలెను. పితామహులకు ప్రపితామహులకు మాతామహునకు వారి తండ్రికి వారి తండ్రికి పితృ తీర్థము (తర్జనీ మూలము)తో నివ్వవలెను. కామ్యముల చెప్పెద విను. తల్లికి ఆమె తల్లికి ఆమె తల్లికి గురుపత్నికి గురువునకు మేనమామ మున్నగు వారికి అప్తమిత్రునకు భూ నాథునకు నివ్వవలెను.
ఇదంచాపిజపేదమ్బుదద్యాదాత్మేచ్ఛయానృప।
ఉపకారాయభూతానాంకృతదేవాదితర్పణమ్॥
దేవాసురా స్తథాయక్షానాగాగన్ధర్వరాక్షసాః।
పిశాచాగుహ్యకాస్సిద్ధాఃకుష్మాణ్డాస్తరవఃఖగాః॥
జలేచారాభూనిలయావాయ్వాధారాశ్చజన్తవః।
తృప్తిమేతేనయాన్త్యాశుమద్దత్తేనామ్బునాఖిలాః॥
నరకేషుసమస్తేషుయాతనాసుచయేస్థితాః।
తేషామాప్యాయనాయైతద్దీయతేసలిలంమయా॥
యేబాన్దవాన్ధవాయే హ్యన్యజన్మనిబాన్ధవాః।
తేతృప్తిమఖిలాయాన్తుయేచాస్మత్తోఽమ్బుకాజ్ క్షిణః॥
యత్రక్వచనసంస్థానాం క్షుత్తృష్ణోవిహతాత్మనామ్।
ఇదామప్యాయయానాంయాతు మయాదత్తంతిలోదకమ్।
ఈ దేవాది తర్పణోదకమును భూతోపకారము కొఱకు తన యిచ్చ ననుసరించి యెచటనైన యుంచుచు నీ వాక్యముల జపించ వలెను. దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, గుహ్యులు, సిద్దులు, కూష్మాండ గణములు, చెట్లు, పక్షులు, జల చరములు, భూ నిలయములు, వాయ్వాధార జంతువులు అన్నియు నేనిచ్చుచున్న ఈ తర్పణోదకములతో శీఘ్రముగ తృప్తి నొందుగాక! సమస్త నరకము లందు యాతనా శరీరము లందున్న వారికి తృప్తికై నాచే నీ జలమివ్వ బడుచున్నది. బంధువులు అబాందవులు గాని అన్య జన్మ బంధువులు గాని నా వలన జలము నపేక్షించు వారందరూ తృప్తి పొందుదురు గాక! ఈ నాచే నీయబడిన తిలోదకము ఎచట నున్నను ఆకలి దప్పికలచే బాధితులైన వారికి తృప్తిని కలిగించు గాక!
జగదాప్యాయనోద్భూతం పుణ్యమాప్నోతిచానఘ॥
దత్త్వామ్యోదకంసంయగేతేభ్యశ్శ్రద్దయాద్విజః।
ఆచమ్యచతతోదద్యాత్సూర్యాయసలిలాంజలిమ్॥
నమోవివస్వతే బ్రహ్మభాస్వతేవిష్ణు తేజసే।
జగత్సవిత్రేశుచయ సవిత్రేకర్మదాయినే॥
రాజా! కామ్యోదక ప్రదానమును చెప్పితిని. దీనినిచ్చుటచే నరుడు సకల ప్రపంచమును సంతోష పెట్టిన వాడగును. మఱియు ప్రపంచ ప్రీతనముచే కలుగు పుణ్యమును పొంద గలడు. శ్రద్ధతో కామ్యోదకమును సమర్పించి ఆచమించి సూర్యునకు ఈ క్రింది మంత్రముతో జలాంజలిని సమర్పింప వలయును. వేదములతో ప్రకాశించు వాడును సర్వవ్యాపక మగు తేజస్సు గలవాడును జగజ్జనకుడును పరిశుద్దుడును ప్రేరకుడును కర్మ సాక్షియును సూర్యుని కొఱకు సమస్కారములు.
తతోగృహార్చనం కుర్యాదభీష్టసురపూజనమ్।
జలాభిషేకైః పుష్పైశ్చదూపాద్యైశ్చనివేదనైః॥
అపూర్వమగ్నిహోత్రంచ కుర్యాత్ప్రాగ్బ్రహ్మణేనృప॥
ప్రజాపతింసముద్ధిశ్య దద్యాదాహుతిమాదరాత్।
గృహేభ్యః కాశ్యపాయాథ తతోఽనుమతయేక్రమాత్॥
తచ్చేషంమణికేపృథ్వీపర్జన్యాభ్యాంక్షిపేత్తతః।
ద్వారేదాతువేదాతుశ్చ మధ్యేచబ్రహ్మణఃక్షిపేత్॥
గృహస్యపురుషవ్యాఘ్ర! దిగ్దేవానపిమేశృణు॥
పిమ్మట ఇంటి యందు నభిమత దేవతలను జలాభిషేక పుష్ప ధూప నివేదనాదులతో నర్చించ వలెను. బ్రహ్మాది పంచాహుతులతో నపూర్వాగ్ని హోత్ర హోమము (వైశ్వ దేవము)ను చేయ వలెను. ప్రజాపతిని గృహమునకు కాశ్యపునకు అనుమతి దేవతలకు ఆహుతుల నివ్వవలెను. మిగిలిన దానితో ఔపసనాగ్ని వద్ద ఉదపాత్ర యందు భూపర్జనస్య దేవతల నుద్దేశ్యించి బలి వేయవలెను. ద్వారము నందు ధాతకు విధాతకు గృహమధ్య మందు బ్రహ్మకు బలి వేయవలెను. దిగ్దేవతలను వినుము.
ఇన్ద్రాయధర్మరాజాయవారుణాయితథేన్దవే।
ప్రాచ్యాదిషుబుదోదద్యాద్దుతశేషాత్మకంబలిమ్॥
ప్రాగుత్తరేచదిగ్భాన్వన్తరిబలిం బుధః।
నిర్వపేద్వైశ్వదేవంచకర్మకుర్యాదతః పరమ్॥
వాయవ్యంవాయవేదిక్షు సమస్తాసుతథాఽనిశమ్।
బ్రాహ్మణేచాన్తరిక్షాయ భానవేచ క్షిపేద్బలిమ్॥
విశ్వేదేవాన్ విశ్వభూతాంస్తథావిశ్వపతింపిత్రూన్।
యక్షాణాంచసముద్ధిశ్యబలిందద్యాన్నరేశ్వర॥
శేషాన్నముతో తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ నింద్రునకు, యమునకు, వరుణునకు, చంద్రునకు ఈశాన్యమున ధన్వంతరికి బలి వేయవలెను. వాయవ్య దిక్కున వాయువునకు బలి వేయవలెను. అట్లే దిక్కులన్నిటి యందు నిరంతరమూ బ్రహ్మకు అంతరిక్షమునకు, సూర్యునకు, విశ్వదేవులకు, సమస్త భూతములకు, విశ్వపతికి పితరులకు యక్షులకు బలి ప్రక్షేపము చేయవలెను. (ఈ క్రమము పారస్కర గృహ్య సూత్రమున చూడనగును).
తతోఽన్యదన్నమాదాయ భూమిభాగే శుచౌబుధః।
దద్యాదశేషభూతేభ్యస్స్వేచ్చయాతత్సమాహితః॥
దేవామనుష్యాః పశవోవయాంసి సిద్దాశ్చయక్షోరగదైత్యసంఘాః।
ప్రేతాః పిశాచాస్తరవస్సమస్తా యేచాన్నమిచ్చన్తిమయాఽత్రదత్తమ్॥
పిపీలికాకీటపతంగకాద్యా బుభుక్షితాః కర్మనిబన్ధబద్ధాః।
ప్రయాన్తుతేతృప్తిమిదంమయాఽన్నం తేభ్యోనిసృష్టంసుఖినోభవన్తు॥
యేషాంనమాతానపితాణబన్ధుర్ నైవాన్నసిద్ధిర్నతథాఽన్యదస్తి।
తత్తృప్తయేఽన్నం భువిదత్తమేత త్తేయాన్తుతృప్తింముదితా భవన్తు॥
భూతానిసర్వాణితథాన్న మేతదహంచవిష్ణుర్నయతోఽన్యదస్తి।
తస్మాదహం భూతానికాయభూతమన్నం ప్రయాచ్చామిభవాయతేషామ్॥
చతుర్దశోభూతగణోయ ఏషస్తత్రాస్థితాయేఽఖిల భూతసంఘాః।
తృప్త్యర్థమన్నం హిమయానిసృష్టం తేషామిదంతేముదితాభవన్తు॥
ఇత్యుచ్చార్యనరోదద్యాదన్నం శ్రద్ధాసమన్వితః।
భువిభూతోపకారాయ గృహీ సర్వాశ్రయో యతః॥
అన్నాంతరమును తీసికొని పరిశుద్దమగు భూమి యందు విద్వాంసుడు సావధాన చిత్తుడై సమస్త భూతములకు బలి ప్రక్షేపము చేయ వలెను. ఆ సమయమున నీ క్రింది శ్లోకమును చెప్పా వలెను. వాని తాత్పర్యమిది. అన్నమపేక్షించు చున్న దేవతలు మనుష్యులు పశువులు, పక్షులు, సిద్ద యక్షోరగ దైత్య సంఘములు ప్రేతలు, పిశాచములు, వృక్షములు వీని కొరకూ నాచే నీ యన్నము ఇవ్వబడు చున్నది. చీమలు, కీటకములు, మిడుతలు మున్నగు వానికి కర్మ సూత్రా బద్దములై యాకలి గొన్నవానికి నన్నిటికిని నన్నమీయ బడినది. దీనిచే నవి తృప్తి నొంది నాచే భూమిపై నుంచ బడిన ఈ అన్నము వలన నా జీవము లన్నియు తృప్తి చెంది యానందించు గాక! సమస్త భూతములు అన్నము నేనును విష్ణువు కంటే వేరు గాము. అందువలన నేను భూత సముదాయ శరీర భూతమయిన అన్నమును వాని తృప్తికై యిచ్చు చున్నాను. దేవమనుష్య పశు పక్షి సిద్ద యక్ష ఉరగ దైత్య ప్రేత పిశాచ వృక్ష పిపీలికా కీట శాల్బాది పదునాలుగు గణముల కొఱకు తృప్తి కలిగించుటకై నాచే నివ్వబడిన ఈ అన్నముచే నవి సంతోషించు గాక! అని చెప్పుచు అందఱికిని ఆశ్రయ భూతుడైన గృహస్తు శ్రద్ధతో సమస్త భూతోపకారము కొఱకై అన్న ప్రదానము చేయ వలయును.
శ్వచణ్డాలవిహంగానాం భువిదద్యాత్తతోనరః।
యేచాన్యేపతితాః కేచిదపుత్రాభువిమానవాః॥
తతోగోదోహమాత్రంవై కాలంతిష్టేద్గృహాన్తరే।
అతిథిగ్రహణార్ థాయ తదూర్ ద్వంవాయథేచ్చయా॥
అతిథింతత్రసంప్రాప్తం పూజయేత్స్వాగతాదినా।
తదాసనప్రదానేన పాదాప్రక్షాలనేనచ॥
శ్రద్దయాచాన్నన్నదానేనప్రియ ప్రశ్నత్తరేణచ।
గచ్చతశ్చానుయానేనప్రీతిముత్పాదయేద్గృహీ॥
అజ్ఞాతకులనామానమన్యతస్సముపాగతమ్।
పూజయేదతిథింసమ్యక్ నికగ్రామనివాసినమ్॥
ఆకించనమసంబన్దమన్య దేశాదుపాగతమ్।
అసంభోజ్యాతిథిం భుఙన్ భోక్తుకామః వ్రజత్యధః॥
కుక్కలు చండాలురు పక్షులు పతితులు పుత్ర రహితులునగు నగు మానవుల కొఱకై భూమి మీద అన్నము వేయ వలెను. పిమ్మట ఇంటి ముంగిట నతిథి కొఱకై గోదోహన కాల మాత్రము (1/4 గడియ లేక 6 నిమిషములు) గాని అంతకు మించిగాని నిరీక్షించ వలెను. అచటకు దయచేసిన యతిథిని స్వాగతము పలుకుట ఆసన ప్రదానము పాదములు కడుగుట మున్నగు వానితో కలిగించు వలెను. ఇతర స్థలము నుండి వచ్చిన ఏకగ్రామ వాసికాని అతిథిని కులము గాని పేరుగాని తానేరుంగకయే చక్కగ పూజించ వలెను. దరిద్రుడు తనతో సంబంధము లేనివాడును నితర దేశము నుండి దయ చేసిన వాడును, నాకలి గొన్న వాడు నగు అతిథిని విడిచి భుజించిన గృహస్థు పతితు డగును.
స్వాధ్యాయగోత్రచరణమపృష్ట్వాచతథాకులమ్।
హిరణ్యగర్భబుద్ధ్యాతం మన్యేతాభ్యాగతంగృహీ॥
పిత్రర్థంచాపరంవిప్రమేకమాప్యాశయేన్నృప।
తద్దేశ్యంవిదితాచారసంభూతింపాఞ్చయజ్ఞికమ్॥
అన్నాగ్రంచసముద్దృత్య హస్తకారోపకల్పితమ్।
నిర్వాపభూతంభూపాల! శ్రోత్రియాయోపపాదయేత్॥
దద్యాచ్చభిక్షాత్రితయం పరివ్రాడ్బ్రహ్మచారిణామ్।
ఇచ్ఛాయాచబుదోదద్యాద్విభ వేసత్యవారితమ్॥
ఇత్యేతేఽతిథయః ప్రోక్తాః ప్రగుక్తాభిక్షవశ్చయే।
చతురః పూజయన్నేతాన్ స్తుకృచ్ర్ఛాత్ప్రముచ్యతే॥
గృహస్థు అభాగ్యత (భోజన సమయాగతు)డైన యతిథిని అధ్యయనమును గోత్రమును అవాంతర శాఖాను కులమును నడుగకయే బ్రహ్మబుద్ది చేయవలెను. రాజా! పితృ యజ్ఞార్థమై మఱియొక బ్రాహ్మణుని ఆదేశీయుడై కులాచారముల నెరింగి యున్న వానిని పంచ యజ్ఞముల నాచరించు వానిని భుజింప జేయ వలెను ఉచ్చిష్టము కాని అన్నము తీసి “మనుష్యే భ్యోహన్తా” అను మంత్రముచే వేరు చేయబడి యున్న యన్నమును శ్రోత్రియ బ్రాహ్మణునకు సమర్పించ వలెను. యతులకు బ్రహ్మచారులకు ముమ్మారు భిక్షాన్నాము నీయ వలెను. సంపద గల బుధుడు వారు వద్దను వరుకు పెట్ట వచ్చును. వెనుక చెప్పిన అతిథులు యతులు బ్రహ్మచారులు శ్రోత్రియుడు నను నాలుగు వర్గముల వారిని పూజించిన వాడు పాప నిర్ముక్తుడగును.
అతిథిర్యస్యభగ్నాశోగృహాత్ప్రతినివర్తతే।
సతస్మైదుష్కృతందత్త్వాపుణ్యమాదాయగచ్చతి॥
ధాతాప్రజాపతిశ్శక్రోవహ్నిర్వసుగుణోఽర్యమా।
ప్రవిశ్యాతిథిమేతేవైభుఞ్జతేన్నం నరేశ్వర॥
తస్మాదతిథిపూజాయాం యతేతసతతం నరః।
సకేవలమఘంభుఙ్త్కేయోభుఙ్త్కేహ్యతిథింవినా॥
ఎవని యింటి నుండి అతిథి భగ్నాశుడై వెళ్ళునో యతడు పాపము నా యజమాని కొసంగి వాని పుణ్యమును తీసికొని వెళ్ళును. ఓ రాజా! దాత ప్రజాపతి ఇంద్రుడు అగ్ని వసు గణము, సూర్యుడు, వీరతిథిలో ప్రవేశించి యన్నము తిను చుందురు. కావున నతిథి పూజ విషయమై నరుడు ప్రయత్నించ వలెను. అతిథి లేకుండా భుజించు వాడు కేవలము పాపమునే భుజించు చున్నాడు.
తతస్స్వవాసినీందుఃఖీం గర్భిణీంవృద్దబాలకాన్।
భోజయేత్సంస్కృతాన్నేనా ప్రథమంచరమంగృహీ॥
అభుక్తవత్సుచై తేషుభుఞ్జన్ భుంక్తే సదుష్కృతమ్।
మృతష్చగత్వానరకం శ్లేష్మభుగ్జాయతేనృప॥
అస్నాతాశీమలంభుంక్తే అజపః పూయశోణితమ్।
అసంస్కృతాన్నభుఙ్మూత్రం బాలాదేఃప్రథమంశ కృత్॥
ఆహోమిచక్రిమీన్ భుఙ్క్తే అదత్త్వావిశామశ్నుతే॥
పిమ్మట గృహస్థు వివాహితయై తన యింట నున్న స్వవాసినిని దుఃఖిథ యైన దానిని గర్భవతిని వృద్దులకు పిల్లలకు ముందుగ వైశ్వదేవ సంస్కృతమైన యన్నమును భుజింప జేసి చివరకు తాను తిన వలెను. పైవారు భుజింపకయే గృహస్థు భుజించిన పాపమునే భుజించు చున్నాడు. అతడు మృతుడై నరకమును చేరి శ్లేష్మమును భుజించును. స్నానము చేయక భుజించు వాడు మలమును, జపము చేయక భుజించు వాడు చీము, రక్తమును భుజించును మలమును, హోమము చేయక భుజించు వాడు క్రిములను నతితులకు పెట్టక తినువాడు విషమును తినును.
తస్మాచ్ఛృణుష్వరాజేన్ద్రయథాభుఞ్జీతవైగృహీ।
భుఞ్జతశ్చయథాపుంసః పాపబన్దోనజాయతే॥
ఇహచారోగ్యమతులం బలవృద్దిస్తథానృప।
భవత్యనిష్ఠశాన్తిశ్చ వైరిపక్షాభిచారతః॥
స్నాతోయథావత్కృత్వాచ దేవర్షిపితృతర్పణమ్।
ప్రశస్తరత్నపాణిస్తుభుఞ్జీతప్రయతోగృహీ॥
కృతేజపేహుతేవహ్నౌశుద్ధవస్త్రధరోనృప।
దత్త్వాఽతిథిభ్యోవిప్రేభ్యోగురుభ్యస్సంశ్రితాయచ।
పుణ్యగన్ధధరశ్షస్తమాల్యధారీనరేశ్వర!॥
నైకవస్త్రధరోనార్ ద్రపాణిపాదోనరేశ్వర!
విశుద్ధవదనఃప్రీతో భుఞ్జీతనవిదిజ్ముఖః॥
ఓ రాజేంద్రా! గృహస్థు ఎట్లు భుజింప వలెనో, భుజించు చున్న వానికి పాప సంబంధమెట్లు కలుగదో, ఈ లోకము నందు చక్కని ఆరోగ్యము బలవృద్దియు ఎట్లు కలుగునో, శత్రుపక్షుము విషయమై అభిచరించు వానికి అనిష్టశాన్తి ఎట్ల కలుగునో చెప్పెద వినుము. గృహస్థు స్నాము చేసి యథావిధిగ దేవ ఋషి పితృ తర్పణములు చేసి సావధానముగ ప్రశస్తమగు రత్నమును చేత ధరించి భుజింప వలెను. శుద్ధ వస్త్ర ధారియై జపము, హోమము చేసి అతిథులకు బ్రాహ్మణులకు, గురువులకు, నాశ్రితులకు చేత ధరించి ప్రశస్తములగు పుష్పమాలలు ధరించి భుజింప వలెను. పరిశుద్ద ముఖము గలవాడై, సంతుష్టుడై నన్నమిడి పవిత్రగంధము ధరించి ప్రశస్తములగు పుష్పమాలలు ధరించి భుజింప వలెను. పరిశుద్ద ముఖము గలవాడై, సంతుషుడు భుజింప వలెను. ఏకవస్త్రము ధరించి గాని, తడికాళ్ళు తడిచేతులు కలవాడై కాని, విదిక్కులకభి ముఖుడై గాని భుజింప రాదు.
ప్రాఙ్ముఖోదఙ్ముఖోవాపిసచై వాన్యమనానరః।
అన్నంప్రశస్తంపథ్యంచప్రోక్షితం ప్రోక్షణోదకైః॥
నకుత్సితాహృతంనైవాజుగుప్సావదసంస్కృతమ్।
దత్త్వాతుభుఙ్ క్తేశిష్టేభ్యః క్షుధితేభ్యస్తథాగృహీ॥
ప్రశస్తశుద్ధపాత్రేషు భుఞ్జీతాకుపితోనృప॥
నాసందిసంస్థితే పాత్రేనాఽ దేశేచ నరేశ్వర।
నాఽకాలేనాఽతిసంకీర్ణేదత్త్వాగ్రంచనరోఽగ్నయే॥
మంత్రాభిమన్త్రితంశస్తం నచాపర్యుసహితంనృప।
అన్యత్రఫలమూలేభ్యశ్శుష్కశాఖాదికాత్తథా॥
తద్వద్ధరీతకీభ్యశ్చ గుడభక్ష్యేభ్యఏవచ।
భుఞ్జీతోద్దృతసారాణి నకదాచిన్నరేశ్వర!॥
నశేషంపురుషోఽశ్నీయాదన్యత్రజగాతీపతే!।
మధ్వమ్బుదదిసర్పిభ్యస్సక్తుభ్యశ్చవివేకవాన్॥
ఆశ్నీయాత్తన్మయోభూత్వాపూర్వంతుమధురంరసమ్।
లవణామ్లౌతథామధ్యేకాటుతిక్తాదికాంస్తతః॥
ప్రాగ్ద్రవంపురుషోఽశ్నీయాన్మద్యేచకఠినాశనమ్।
అన్తేపునర్ ద్రవాశీచ బలారోగ్యే నముఞ్చతి॥
మనుజుడు ఇతర దృష్టి లేనివాడై తూర్పు, ఉత్తర దిశాభిముఖుడై ప్రశస్తమైనది హితకరమైనది గాయత్రీ మంత్రోదక ప్రోక్షితమైనదియు నగు దానిని తిన వలెను. నీచులు తీసికొని వచ్చినదియు, వైశ్వదేవాదులచే సంస్కరింప బడనిదియు పనికి రాదు. శాస్త్రము ననుసరించు శిష్టులకు ఆకలిగొన్న వారికి పెట్టి తాను తినవలెను. కోపాదులు లేనివాడు భోజనమునకు ప్రశస్తములని చెప్పబడియు నగు పవిత్రములు ప్రేపపాత్రాల యందు భుజించ వలెను. రాజా! పేప బెత్తముల పాత్రలందు యోగ్య ప్రదేశము నందు, సంధ్యాది సమయమందు, జన సమ్మర్ధ ప్రదేశమందు భుజింప రాదు. ముందుగా అన్నమును అగ్ని యందు హోమము చేసి, మంత్రములతో నభిమంత్రింప బడినదియు, ప్రశస్థమైనదియు పర్యుషితము (బహుకాల ముంచ బడినది) కానిదియగు అన్నము తినవలెను. ఫలములు, దుంపలు, వెళ్ళు, ఎండిన కొమ్మలు మొదలగునవి అపక్వ లేహ్యములు, మోదకాది భక్ష్యములు మున్నగు వానికి పర్యుషి తత్వము లేదు. సారము తీసివేసిన యాహారముల నెప్పుడు భుజింప రాదు. రాజా! వివేక వంతుడెపుడును సగము తినిన దానిని మఱల తినరాదు. తేనె, నీరు, పెరుగు, నెయ్యి, పిండి వీనికి మాత్రము పై దోషము లేదు. తదేక చిత్తుడై ముందుగ మధుర రసమును, మధ్యలో నుప్పని, పుల్లని పదార్థములను, పిమ్మట కారము, చేదునగు వస్తువులను తినవలెను. మనుజుడు ముందుగ ద్రవ పదార్ధమును, మధ్యము యందు కఠిన పదార్ధమును తిరిగి చివర ద్రవ పదార్ధమును తిని వాడు బలారోగ్యములను వీడడు.
అనింద్యంభక్షయేన్నిత్యం వాగ్యతోఽన్నమకుత్సయన్।
పఞ్చగ్రాసంమహామౌనం ప్రాణాద్యాప్యాయనాయతత్॥
భుక్త్వాసమ్యగథాచామ్యప్రాఙ్ముఖోదఙ్ ముఖోఽపివా।
యథావత్పునరాచామేత్పాణీప్రక్షాళ్యమూలతః॥
స్వస్థఃప్రశాన్తచిత్తస్తు కృతాసనపరిగ్రహః।
అభీష్టదేవతానాంతు కుర్వీతస్మరణంనరః॥
అగ్నిరప్యాయయేద్దాతుంపార్థివంపవనేరితః।
దత్తావకాశంనభసాజరయథ్వస్తుమేసుఖమ్॥
అన్నంబలాయమేభూమేరపామగ్న్యనిలస్యచ।
భవత్వేతత్పరిణతంమమాస్త్వవ్యాహతం సుఖమ్॥
వాఙ్నియమముతో నన్నమును నిందింప కుండ నిత్యము ననిషిద్దమైన యన్నమును తినవలెను. ప్రాణా పాన వ్యానో దాన సమాన వాయువుల సంతృప్తి కై కఠిన మౌనముతో నైదు గ్రాసముల (ఆహుతుల)ను పుచ్చుకొన వలెను. ప్రాఙ్ముఖుడుగ గాని యుత్తరాభి ముఖుడుగ గాని కూర్చుండి యాచమనము చేసి భోజనము చేసి, కాళ్ళు చేతులు చక్కగ కడుగు కొని యథావిధిగా మఱల నాచమనము చేయ వలెను. స్వస్థము ప్రశస్తమునగు మనసు కలవాడై యాసనము నందు కూర్చుండి యభీష్ట దేవతా స్మరణము చేయ వలెను. వైశ్వానరాగ్ని వాయు ప్రేరితమై, యాకాశముచే నొసంగ బడిన యవకాశము గల అన్నమును జీర్ణింప జేసి యా యన్న రసముచే నాయొక్క పార్థివ ధాతువు (శరీరము)ను సంతృప్తి నొందించు గాక! దాని వలన నాకు సుఖము చేకూరు గాక! అని పంచ భూతానుగ్రహమును కోర వలెను. తినిన యన్నము పరిపక్వమై నాకు సంబంధించిన పృథివీ జలాగ్ని వాయువులకు బలము కలిగించు గాక! దాని వలన నభ్యన్తరము లేని సుఖము కలుగు గాక!
ప్రాణాపానసమానానాముదానవ్యానయోస్తథా।
అన్నం పుష్టికరంచాస్తు మమాప్యావ్యాహతం సుఖమ్॥
అగస్తిరగ్నిర్బడబానలశ్చ భుక్తంమయాఽన్నంజరాయత్వశేషమ్।
సుఖంచమేతత్పరిణామజాతం యచ్చత్వరోగంమమచాస్తూదేహే॥
విష్ణుస్సమస్తేన్ద్రియదేహదేహీ ప్రధానభూతోభాగావాన్యథైకః।
సత్యేనతేనాత్తమశేషమన్నమారోగ్యదం మేపరిణామమేతు॥
విష్ణురత్తతథైవాన్నం పరినామశ్చవైతథా।
సత్యేనతేనమేభుక్తం జీర్యత్వన్నమిదంతథా॥
ఇత్యుచ్చార్యస్వహస్తేన పరిమార్ జ్య తథోదరమ్।
అనాయాస ప్రదాయీని కుర్యాత్కర్మాణ్యతన్ద్రితః॥
నాచే తినబడిన యన్నము నా పంచ ప్రానములకు పుష్టికరమైన నాకు బీరుపోని సుఖము చేకూర్చును గాక! అగస్త్యుడు, అగ్నిదేవుడు, బడబాగ్నియు నాచే తినబడిన యన్నమును నిశ్శేషముగ జీర్ణింప జేయుదురు గాక! దాని పరిణామము వలన నా శరీరము నందు రోగము లేకుండా సుఖము కలుగు గాక! సమస్త ప్రాణుల దేహములే దేహముగా గల వాడును భగవంతుడు నగు విష్ణువొక్కడే, కావున నాచే తినబడిన యీ యన్నమంతయు సత్యరూపుడగు ఆ విష్ణువుచే భుజింప బడినది నాకు నారోగ్యము నిచ్చునదిగ పరిణమించు గాక! తినువాడు, తినబడు నన్నము, తత్పరిణామమున్ను ఆ విష్ణువే యై యున్నాడు. అట్టి సత్య స్వరూపుడగు విష్ణుదేవుని చేతనే తినబడిన నాయన్నము చక్కగా జీర్ణించు గాక! అని యుచ్చారించుచు చేతితో నుదరమును నిమురుకొనుచు నలసత లేని వాడై శ్రమను కలిగించని పనులను చేయ వలయును.
సచ్ఛాస్త్రాదివినోదేన సన్మర్గాదవిరోధినా।
దినంనయేత్తతస్సంధ్యాముపతిష్ఠేత్సమాహితః॥
దినాన్తసంధ్యాంసూర్యేణ పూర్వామృక్షైర్యుతాంబుధః।
ఉపతిష్ఠేద్యథాన్యాయ్యం సంయాగాచమ్యపార్ థివ!॥
సర్వకాలముపస్థానంసంధ్యయోః పార్థివేష్యతే।
అన్యత్రసూతకాశౌచవిభ్రమాతురాభీతితః॥
సూర్యేణభ్యుదితోయశ్చ త్యక్తస్సూర్యేణవాస్వపాన్।
అన్యత్రాతురభావాత్తు ప్రాయశ్చిత్తీయతేనరః॥
తస్మాదనుదితేసూర్యేసముత్థాయ మహీపతే।
ఉపతిష్టేన్నరస్సంధ్యామస్వపంశ్చదినాన్తజామ్॥
ఉపతిష్ఠన్తివైసంధ్యాంయేనపూర్వంనపశ్చిమామ్।
వ్రజన్తితేదురాత్మానస్తామిస్రంనరకంనృప॥
సజ్జనుల మార్గమునకు విరుద్దము కాని సచ్చాస్త్రాదుల వినోదముతో పగటిని గడిపి, పిమ్మట సావధాన చిత్తుడై సంద్యోపస్థానము చేయవలెను. రాజా! చక్కగా నాచమనము చేసిన వాడై సాయంకాల సంధ్యను సూర్యునితో కూడి నదిగను, ప్రాతస్సంధ్యను నక్షత్ర యుతముగను న్యాయము ననుసరించి యనుష్టింప వలెను. సూతకా శౌచాముగాని, శావా శౌచము గాని, ఉన్మాదము గాని, రోగము గాని, ప్రాణ భయాదులను గాని వదలి మిగిలిన సర్వకాలము లందు సంధ్యోపస్థానము తప్పక చేయవలెను. ఆ తురస్థితిలో తప్ప ఇతర సమయ మందు సూర్యోదయ కాలమున నిద్రించు వాడును ప్రాయశ్చిత్తార్హు డగును. కావున సూర్యోదయమునకు మున్నె లేచి ప్రాతస్సంధ్యను, నిదురించని వాడై సాయం సంధ్యను నుపాసించ వలెను. పూర్వ సంధ్యను పశ్చిమ సంధ్యను నుపాసించిన వారు అంధతామిస్ర నరకము నందుదురు.
పునఃపాకముపాదాయస్సయ్మప్యవనీపతే।
వైశ్వదేవనిమిత్తంవైపత్న్యాసార్థంబలింహరేత్॥
తత్రాపిశ్వపచాదిభ్యస్తథైవాన్నవిసర్జనమ్॥
అతిథించాగతంతత్రస్వశక్త్యాపూజయేద్బుధః।
పాదశౌచాసనప్రహ్వస్వాగాతోక్త్వాచపూజితమ్॥
తాతాశ్చాన్నప్రదానేన శయనేనచపార్థివ॥
దివాఽతిథౌతువిముఖే గతేయత్పాతకంనృప।
తదేవాష్టగుణంపుంసాం సూర్యోఢేవిముఖేగతే॥
తస్మాత్స్వశాక్త్వారాజేన్ద్రసూర్యోఢమతిథింనరః।
పూజయేత్పూజితేతస్మిన్పూజితాస్సర్వదేవతాః॥
అన్నశాకామ్బుదానేనాస్వశక్త్వాప్రీణయేత్పుమాన్।
శయనప్రస్తరమహీప్రడానైరథవాఽపీతం॥
కృతపాదాది శౌచశ్చభుక్త్వాసాయంతతోగృహీ।
గచ్ఛేచ్ఛయ్యామస్ఫుటితామపిదారుమయీంనృప॥
నావిశాలాంనవై భగ్నాం నాసమాంమలినంనచ।
నచజన్తుమయీంశయ్యామధితిష్ఠేదనాస్తృతామ్॥
ప్రాచ్యాందిశిశిరశ్శస్తంయామ్యాయామథవానృప।
సదైవస్వపతః పుంసోవిపరీతంతురోగదమ్॥
ఓ రాజా! సాయంకాలము నందు కూడ వైశ్వదేవార్థమై తిరిగి పాకమును చేసి భార్యతో గూడ బలి ప్రక్షేపము నాచరించ వలెను. అందును చండాలాదులకై అన్న ప్రక్షేపనమును చేయవలెను. ఆ సమయమున వచ్చిన యతితిని బుధుడు తన శక్తి ననుసరించి పూజింప వలెను. పాద ప్రక్షాళనము ఆసన కల్పనము నుప్రభావము, స్వాగత వచనములతో నాదరించి అన్నదానము శాయనోప కల్పములతో పూజింప వలెను. పగటి యందు నతిథి విముఖుడై వెళ్ళుట వలన వచ్చు పాపము కంటె నెనిమిది రెట్లు పాపము, సూర్యాస్తమ యానంతరము వచ్చిన యథితి విముఖుడై వెళ్ళుట వలన వచ్చును. కావున రాజేంద్రా! సూర్యోఢు డగు (రాత్రి వచ్చిన) అతిథిని స్వశక్తితో పూజింప వలెను. అతడు పూజితుడైన సర్వ దేవతలు పూజింప బడినట్లే. నరుడు తన శక్తి ననుసరించి యన్న శాక జలాదుల నొసంగి కాని లేక పాన్పు తృనాది ప్రస్తారము చోటు నిచ్చిగాని సంతోష పెట్ట వలయును. గృహస్థు పాదాది శౌచము చేసికొని భోజన మాచరించి మంచమును గాను, బద్దలుకాని అనిషిద్ద ద్రుమ నిర్మిత మయిన బల్లము గాని చేర వలెను. విశాలము కానిది, బ్రద్దలైనది విషమ మయినది, మాలిన మయినది, జంతుమయ మయినది, పరువ బడినది యగు శయ్య పనికి రాదు. రాజా! పరుండునపు డెప్పుడును తూర్పు తలంపి గాని, దక్షిణ తలంపి గాని ప్రశస్తము. ఇతర మయినది రోగ ప్రదము.
ఋతావుపగమశ్శస్తస్స్వపత్న్యామవనీపతే।
పున్నామార్ క్షేశుభేకాలేజ్యేష్టాయుగ్మాసురాత్రిషు॥
నాద్యూనాంతుస్త్రియంగచ్ఛేన్నాతురాంనరజ్వాలామ్।
నానిష్టాంనప్రకుపితాం నాప్రశస్తాంనగుర్విణీమ్॥
నాఽదక్షిణాంనాన్యకామాంనాకామాంనాన్యయోషితమ్।
క్షుత్క్షామాంనాతిభుక్తంవాస్వయంచై భిర్గుణైర్యుతః॥
స్నాతస్స్రగ్గన్ధధృత్ప్రీతో నాధ్మాతః క్షుధితోఽపివా।
సకామస్సానురాగశ్చ వ్యవాయంపురుషోవ్రజేత్॥
చతుర్ధశ్యష్టమీచైవ అమావాస్యాఽథపూర్ణిమా।
పర్వాణ్యేతానిరాజేన్ద్ర! రవిసంక్రాన్తిరేవచ॥
తైలస్త్రీమాంసభోగీచసర్వేఽప్యేతేషువైపుమాన్।
విణ్మూత్రభోజనంనామప్రయాతినరకంమృతః॥
అశేషపర్వస్వేతేషుతస్మాత్సంయమిభిర్ బుధైః।
భావ్యంసచ్చాస్త్రవేదేజ్యాధ్యానజప్యపరైర్నరైః॥
నాఽన్యాయోనౌవియోనౌవా నోపయుక్తౌషధస్తథా।
దేవద్విజగురోణాంచ వ్యవాయీ నాశ్రయేభవేత్॥
చైత్యచత్వరతీర్తేషు నైవగోష్ఠే చతుష్పథే।
నైవశ్మశానోపవనే సలిలేషు మహీపతే!॥
ప్రోక్తపర్వస్వశేషేషు నైవభూపాల! సంధ్యయోః।
గచ్చేద్వ్యవాయంమనసా నమూత్రోచ్చారపీడితామ్॥
పర్వస్వభిగమోనిన్ద్యో దివాపాపప్రదోనృప!।
భువిరోగావహోనౄణామప్రశస్తో జలాశయే॥
పరదారాన్నగచ్ఛేచ్చ మనసాపికథఞ్చన।
కిమువాచాస్థిబన్ధోఽపి తేశునాస్తివ్యవాయినామ్॥
మృతోనరకమభ్యేతిహీయతేఽత్రాపిచాయుషః।
పరదారరతిః పుంసాముభయత్రాపిభీతిదా॥
ఇతిమత్వాస్వదారేషుఋతుమత్సుబుధో వ్రజేత్।
తథోక్తదోషహీనేషుసకామేష్వనృతావాపి॥
ఓ రాజా! స్వభార్య యందు ఋతుకాలము నందు సంగమము ప్రశస్తమని అష్టమాధ్యాయమున చెప్పా బడినది. ఇంకా విశేషములు చెప్పుచున్నాను. పున్నామ నక్షత్రము లందు అనగా అశ్వినీ, కృత్తికా, రోహిణీ, పునర్వసు, పుష్యమీ, హస్త అనురాధా, శ్రవణ, పూర్వాభాద్ర, ఉత్తరభాద్రా కాలము లందు నుత్తరోత్తర శుభములైన సమ సంఖ్యా రాత్రులందు ప్రశస్తము. అననుకూల మయినది, బాధితురాలు, రజస్వల, ఇష్టము లేనిది, కుపితురాలు, గర్భవతి, అనుకూల భావము లేనిది, ఇతరుని యందు కోరిక గలది, కామము లేనిది, ఇతరుని భార్య, ఆకలిచే కృశించినది, అతి భోజనము చేసినదియు నగు స్త్రీ గాని ఈ గుణములతో కూడియున్న తాను గాని సంగామమునకు పనికి రారు. స్నానము చేసిన వాడై మాలా గంధముల ధరించిన వాడై ప్రీతుడై అతి తృప్తుడుగాని వాడై ఆకలి గొనని వాడై సంగామేచ్చ గలవాడై అనురాగ వంతుడై పురుషుడు సంగమము చేయ వలెను. చతుర్దశి అష్టమి అమావాస్య పూర్ణిమ రవి సంక్రమణము అనునవి పర్వములు. ఈ పర్వము లందు తైలమును స్త్రీని మాంసమును అనుభవించు వాడు చనిపోయి మూత్ర పురీషము లాహారములుగా గల నరకమును చేరును. కావున పండితులు సమస్త పర్వకాలము లందు నియమవంతులై సచ్చాస్త్రము వేదము యాగము ధ్యానము జపము నందు ఆసక్తి గలవారై యుండ వలయును. ఇతర (గవాది) యోనియందు గాని, అయోని యందుగాని రసాయనాదికము సేవించి గాని దేవతలు ద్విజులు గురువుల యొక్క ఆశ్రమము నందుగాని సంగమము చేయరాదు. గుడి మొదలగు చోట్ల ఇంటి ముంగిట తీర్తము లందు గోశాల యందు నాలుగు వీధులు కలిసిన చోట శ్మశాన వనము నందు జలము లందు పైన చెప్పబడిన సమస్త సంస్థ పర్వములందు సంధ్యా సమయము లందు గాని మూత్ర పురీషములచే పీడితయైన స్త్రీని గాని మనస్సుతో గుడ సంగమించ రాదు. పర్వకాల సంగమము నిద్యము. దివా మిథునము పాపప్రదము. జలాశయ సంగమము రోగ ప్రదమగుటచే నప్రశస్తము. పరస్త్రీలను మనసు లోనైనను సంగమించ రాదు. సంగమించిన వారికి నేముకల సంబంధము లేని కృమి కీటకాది జన్మ వచ్చును. ఈ లోకమున ఆయువు క్షీణించును. మరణించిన తరువాత నరకము వచ్చును. పరస్త్రీ సంగమేచ్చ ఇహ లోక పరలోకము లందు రెంటియందును భయప్రదము. అది తలంచి స్వభార్య యందు ఋతు (4 నుండి 16 రోజుల వరకు) కాలమందు తెలిసిన వాడు సంగమించ వలెను. వెనుక చెప్పిన దోషములచే శూన్యులై సంగమేచ్చ గలవారు ఋతుకాలము కాని సమయము నందును ప్రవర్తింప వచ్చును.
Summary of chapter 11 of the Vishnu Mahā Purāṇa is as follows:
The twenty-one yajñas proper to the gṛhastha are enumerated in three groups of seven: seven soma-yajñas, seven havis-yajñas, and seven pāka-yajñas. Rules for snāna, tarpana, and the directional bali offerings to Indra (east), Yama (south), Varuṇa (west), and Soma/Kubera (north), along with Dhanvantari, Viśvedeva, and Brahman are described. Atithi-sevā rules specify that a guest who arrives at meal-time must be fed before the householder himself eats. Detailed bhojana-niyamas covering eating sequence, foods to avoid, and conduct during the meal are also given.