విష్ణు మహా పురాణము

17 - సదాచారోల్లంఘనాది స్వరూపమ్

శ్రీపరాశరుడు:

ఇత్యాహభగవానౌర్వస్సగరాయమహాత్మనే

సదాచారంపురాసమ్య ఙ్మైత్రేయ! పరిపృచ్ఛతే

మయాఽప్యేతదశేషేణ కథితంభవతోద్విజ!

సముల్లఙ్ఘ్యసదాచారం కశ్చిన్నాప్నోతిశోభనమ్

శ్రీపరాశరుడు:

మైత్రేయా! ఔర్యుడు మహాత్ముడగు సగరునకు సదాచారమును గూర్చి అడుగగా నిట్లు చెప్పెను. నా చేత గూడ నీకు చెప్ప బడెను. సదాచారము లేకుండ నేవ్వడును మంచిని పొందలేదు.

మైత్రేయుడు:

షణ్డాపవిద్ధప్రముఖాః కథితాభగవంస్త్వయా

ఉదాక్యాద్యాశ్చమేసర్వేనగ్నమిచ్చామివేదితుమ్

కోనగ్నః కింసమాచారోనగ్న సంజ్ఞాంనరోలభేత్

నగ్నస్వరూపమిచ్చామియథావత్కథితంత్వయా

మైత్రేయుడు:

షండుడు, అపవిద్ధుడు మున్నగు వారు ఉదక్యాదులును నాకు తెలిసిన వారే. నగ్నుడనగా నెట్టివాడు? వాని స్వరూపమును విన గోరెద. నీకు తెలియనిది లేదు.

శ్రీపరాశరుడు:

ఋగ్యజుస్సామ సంజ్ఞేయం త్రయీవర్ణావృతిర్ ద్విజ

ఏతాముజ్ఝ తియోమోహాత్సనగ్నః పాతకీ స్మృతః

త్రయీసమస్తవర్ణానాం ద్విజసంవరణం యతః

నగ్నోభవత్యుజ్ఘి తాయామతస్తస్యాంనాసంశయః

ఇదంచశ్రూయతామన్యద్యద్భీష్మాయమహాత్మనే

కథయామాసధర్మజ్ఞోవసిష్ఠోమత్పితామహః

మయాపితస్యగదతశ్శ్రుతమేతన్మహాత్మనః

నగ్నసంబన్ది మైత్రేయా! యత్ప్రుష్టోహమిహత్వయా

దేవాసురమభూద్యుద్దందివ్యమబ్దశతంపురా

తస్మిన్ పరాజితా దేవాదైత్యైర్ హ్రాదపురోగమైః

క్షీరోదస్యోత్తరం కూలంగత్వాతప్యన్తవైతపః

విష్ణోరరధనార్ థాయాజగుశ్చేమంస్తవంతథా

శ్రీపరాశరుడు:

ఋగ్యజుస్సామ వేదములకు త్రయీయని పేరు. త్రయీ యనునది వర్ణ రూపమైన యావరణమే గాక సర్వ దుఃఖ నివారకమైన సంవరణము కూడ. అట్టి దానిని అజ్ఞానముచే విడిచిన బ్రాహ్మడు మహాపాతకి యగు నగ్నుడు. సందేహము లేదు. నివారకమైన సంవరణము కూడా. మా పితామహుడు ధర్మజ్ఞుడునగు వసిష్ఠుడు మహానుభావుడగు భీష్మునకు చెప్పు చుండగా నీవు నన్నడిగిన నగ్న సంబంధ విషయమును నేను విన్న దానిని చెప్పు చున్నాను. వినుము - పూర్వము దేవాసురులకు నూరు దివ్య సంవత్సరములు యుద్దము జరుగగా నందుహ్రాదుడు మున్నగు రాక్షసులచే దేవతలు జయింప బడి క్షీర సముద్రము యొక్క యుత్తర తీరము చేరి తపస్సు చేయుచు శ్రీవిష్ణువు నారాదించుటకై పఠించిన స్తోత్రమిది.

దేవతలు:

ఆరాధనాయలోకానాంవిష్ణోరీశస్యయాంగిరమ్

వక్ష్యామోభగవానద్యతయావిష్ణుః ప్రసీదతు

యతోభూతాన్యశేషాణిప్రసూతానిమహాత్మనః

యస్మింశ్చలయమేష్యన్తి కస్తంసంస్తోతుమీశ్వరః

తథాఽప్యరాతివిధ్వంసధ్వస్తవీర్యాభయార్థినః

త్వాంస్తోష్యామస్తవోక్తీనాం యథార్ థ్యంనేశగోచరేత్

త్వముర్వీసలిలంవహ్నిర్వాయురాకాశమేవచ

సమస్తమన్తః కరణంప్రధానం తత్పరః పుమాన్

ఏకం తావైతద్భూతాత్మన్ మూర్తామూర్తమయంవపుః

ఆబ్రహ్మస్తబ్మపర్యన్తం స్థానకాలవిభేదవాత్

తత్త్రైశంతవయత్పూర్వంత్వన్నాభికమలోద్భవమ్

రూపంసర్గోపకారాయకస్మై బ్రహ్మాత్మనేనమః

శక్రార్కరుద్రావస్వశ్విమారుత్సోమాదిభేదవత్

వయమేకంస్వరూపంతేతస్మైదేవాత్మనేనమః

దమ్భాప్రాయమసంబోధితితిక్షాదమవర్జితమ్

యద్రూపంతవగోవిన్దతస్మై తుభ్యం యక్షాత్మనేనమః

క్రౌర్యంమాయామయం ఘోరంయచ్చరూపంతవాసితమ్

నేశాచారాత్మ నేతస్మై నమస్తే పురుషోత్తమ

దేవకృత విష్ణు స్తవము:

లోకారాధన కొఱకై విష్ణువునకు సంబంధించిన మేము చెప్పబోవు వాక్కుచే సర్వేశ్వరుడగు విష్ణువు ప్రసన్నుడగును గాక! సమస్త భూతములు నే మహాత్ముని నుండి బయలు దేరినవో యెవ్వని యందు లయమగు చున్నావో యట్టివాని నెవడు స్తుతింప గలడు? అయినను శత్రుకృత పరాభవముచే నశించిన శౌర్యము గల వారమై యభయమును గోరుచు మేము నిన్ను స్తుతించెదము. నీ యథార్థ స్థితి వాక్కుల కందదు. నీవు భూమ్యాది పంచ భూతములు సమస్తాంతః కరణము అనగా మనో, బుద్ధి, అహంకార, చిత్తములు, ప్రకృతి, పురుషుడు అను నీ మూర్తామూర్త రూపము స్థాన కాల భేదము కలదియు నగు జగత్తు నీ యొక్క శరీరము. అందు నీ నాభి కమల మందు పుట్టిన విశ్వోపకారకమగు బ్రహ్మకు నమస్కారము. ఇంద్ర, సూర్య, రుద్ర, వసు, మరు, దశ్విసోమాది భేదముతో గూడిన దేవతలమగు మేము నీ యొక్క రూపము. అట్టి దేవరూపుడ వగు నీకు నమస్కారము. దంభమే ప్రధానముగ గలదియు వివేక శూన్యము, సహనము, నిగ్రహము లేనిదియు నగు నేనీ రూపము గలదో ఆ దైత్య రూపుడవగు నీకు నమస్కారము. స్తబ్దమైన వివేకము గల యే యక్ష ఊపము నందు నాడులు అధిక జ్ఞానవాహినులు కాక యుండునో శబ్దాది లోభము కల్గి యుండునో అట్టి యక్ష రూపుడవగు నీకు నమస్కారము. క్రౌర్యము మాయ ప్రధానముగ నుండి తమోమయమైన ఏ నీ ఘోర రూపము గలదో అట్టి నీ నిశాచర రూపమునకు నమస్కారము.

స్వర్గస్థధార్మితద్ధర్మఫలోపకరణంతవ

ధర్మాఖ్యంచ తథారూపం నమస్తస్మై జనార్ధన

హర్షప్రాయమసం సర్గిగతి మద్గామనాదిషు

సిద్దార్ థంతవయద్రూపం తస్మైసిద్దత్మనే నమః

అతితిక్షాయనంక్రూరముపభోగాసహంహరే

ద్విజిహ్వంతవయద్రూపంతస్మైనాగాత్మనేనమః

అవబోదియచ్చాన్తమదోషమపకల్మషమ్

ఋషిరూపాత్మనేతస్మైవిష్ణు రూపాత్మనే నమః

భక్షయత్యథకల్పాన్తేభూతానియదవారితమ్

త్వద్రూపంపుణ్దరీకాక్షతస్మై రుద్రాత్మనే నమః

సంభక్ష్యసర్వభూతానిదేవాదీన్యవిశేషతః

నృత్యత్యన్తేచయద్రూపంతస్మై రుద్రాత్మనే నమః

ప్రవృత్త్యారాజసోయచ్చకర్మణాంకారణాత్మకమ్

జనార్ధననమస్తస్మైత్వద్రూపాయనరాత్మనే

అష్టావింశద్వధోపేతం యద్రూపంతమసంతవ

ఉన్మార్గాగామిసర్వాత్మంస్తస్మైశ్వాత్మనే నమః

యజ్ఞాఙ్గభూతంయద్రూపంజగతస్సిద్దిసాధనమ్

వృక్షాదిభేదైష్షడ్భేదితస్మైముఖ్యాత్మనే నమః

తిర్యజ్ఞ్మనుష్య దేవాదివ్యోమశబ్దాది కంచయత్

రూపంతవాదేస్సర్వస్యతస్మైసర్వాత్మనేనమః

ప్రధాన బుధ్యాదిమయాదశేషాద్యదన్యదస్మాత్పరమన్తరాత్మన్

రూపంతవాద్యంనయదన్యతుల్యం తస్మైనమః కారణకారణాయ

శుక్లాది దీర్ఘాదిఘనాదిహీనమగోచరంయచ్చవిశేషణానామ్

శుద్దాతి శుద్ధంపరమర్షిదృశ్యం రూపాయతస్మైభగవన్నతాస్స్మః

యన్నశ్శరీరేషుయదన్యదేహేష్వశేషవస్తుష్వజమవ్యయంయత్

యస్మాచ్చనాన్యద్వ్యతిరిక్తమస్తి బ్రహ్మస్వరూపాయనతాస్స్మృతస్మై

స్వర్గ వాసులగు సుకృతవంతుల సద్ధర్మ ఫలము నంద జేయు నీ యొక్క యమ ధర్మరాజ రూపమునకు నమస్కారము. ఆనంద ప్రచురము జలగ్న్యాదులతో సంగమము లేనిదియు (సిద్ధులు జలగ్న్యాదు లందున్నను వాని సంపర్క ముండదు) గమనాదులందు గతితో కూడుకొని యుండునదియు నగు నే నీయొక్క సిద్ధరూపము గలదో దానికి నమస్కారము. హరీ! నహనము లేనిది క్రూరమైనది ఉపభోగ సమర్థము రెండు నాలుకలు గల నీ నాగ రూపమునకు నమస్కారము. జ్ఞానముతో గూడినదియు శాంతమైనదియు రాగాది దోష శూన్యము, పాపరహితము, వ్యాప్త రూపమునగు నీ యొక్క ఋషి రూపమునకు నమస్కారము. పుండరీకాక్షా! కల్పాంతము నందెవ్వరి చేతను నివారింపబడనిదై సమస్త భూతములగు భక్షించు నీ యొక్క కాల రూపమునకు నమస్కారము. జనార్ధనుడా! రజోగుణ ప్రవృత్తిచే కర్మల నాచరించు నరాత్మకమగు నీ రూపమునకు నమస్కారము. సర్వాత్మకా! తమోగుణ ప్రధానమై యిరువది ఎనిమిది వధల (ఇంద్రియ వధలు 11, తుష్టి వధలు 9, సిద్ధి వధలు 8 = 28) తో కూడినదియు మార్గము నతిక్రమించి నడచునదియునగు నీ యొక్క పశు రూపమునకు నమస్కారము. యజ్ఞమునకు అంగ భూతము జగత్తు యొక్క సిద్ధికి సాధనము వృక్షములు, పొదలు, తీగలు, కొమ్మలు, గడ్డి, పర్వతములు అను భేదములలో నారు భేదములు గల ముఖ్య రూపమగు నీకు నమస్కారము. (వృక్షాదులు యజ్ఞాంగములు) సమస్త ప్రపంచమునకు మూలమై పశు, పక్షి, మనుష్య, దేవాదులు, ఆకాశము, శబ్దాది రూపము, సర్వాత్మకమగు నీ యొక్క విశ్వ రూపమునకు నమస్కారము. అంతర్యామీ! ప్రకృతి (ప్రధానము), బుద్ధి (మహత్తు) మున్నగు సమస్త జడ వర్గము కంటే భిన్నమై యసదృశమగు కారణము (అవ్యక్తము)నకు గూడ కారణ (పురుష) రూపమగు నీ యొక్క ఆది రూపమునకు నమస్కారము. శుక్లాది వర్ణములు గాని, దీర్ఘాది ప్రమాణములు గాని, ఘనాది భేదములు గాని లేనిదియు విశేషణములగు నందనిదియు, శుద్దము కంటే శుద్ధము అనగా ప్రకృతి కంటె బుద్ధుడు శుద్ధమయిన వాడు ఆ బుద్ధుని కంటె ముక్తుడు శుద్దమైన వాడును మహర్షులకు మాత్రము దృశ్యమగు నీ శుద్ధ రూపమునకు నమస్కారము. మా శరీరము లందును నితర దేహము లందును సమస్త వస్తువు లందును జన్మనాశాదులు లేనిదై యున్నదియు తన కంటే నితరము లేనిదియునగు నీ బ్రహ్మ స్వరూపమునకు నమస్కరించు చున్నాము.

సకలమిదమజస్యయస్యరూపం పరమపదాత్మవతస్సనాతనస్య

తమనిధనమశేషబీజభూతం ప్రభుమమలంప్రణస్స్మవాసుదేవమ్

సచేతనమగు నీ జగత్తంతయు సనాతనుడు (శాశ్వతుడు) చైతన్య ఘనుడునగు నే వాసుదేవుని రూపమో! నాశరహితుడు సమస్త కారణభూతుడు, పరిశుద్ధుడు, ప్రభువునగు నా వాసుదేవునకు నమస్కరింతును.

శ్రీపరాశరుడు:

స్తోత్రస్యాస్యావసానే తే దదృశుః పరమేశ్వరమ్

శంఖచక్రగదాపాణిం గరుడస్థంసురా హరిమ్

తమూచుస్సకలాదేవాః ప్రణిపాతపురస్సరమ్

ప్రసీద నాథ! దైత్యేభ్యస్త్రాహినశ్శరణార్థినః

త్రైలోక్యయజ్ఞభాగాశ్చదైత్యైః హ్రాదపురోగమైః

హృతానోబ్రాహ్మణోఽప్యాజ్ఞాముల్లజ్ఘ్య పరమేశ్వర!

యద్యప్యశేషభూతస్యవయంతేచతవాంశకాః

తథాప్యవిద్యాభేదేనభిన్నంపశ్యామహేజగత్

స్వవర్ణధర్మాభిరతావేదమార్గానుసారిణః

నాశక్యాస్తేఽరయోహన్తుమస్మాభిస్తాపసాన్వితాః

తముపాయమశేషత్మన్నస్మాకందాతుమర్హసి

యేనతానసురాన్హన్తుంభవేమభగవన్క్షమాః

శ్రీపరాశరుడు:

ఈ స్తవము ముగించగనే యా దేవతలు గరుడారూడుడై శంఖ చక్ర గదలను హస్తము లందు ధరించిన పరమేశ్వరుడగు శ్రీహరిని చూచిరి. సర్వ దేవతలు నమస్కార పూర్వకముగ నిట్లనిరి. ప్రభో! నీ శరణు జొచ్చిన మమ్ము అనుగ్రహించి రాక్షసుల బారినుండి రక్షింపుము. పరమేశ్వరా! బ్రహ్మ యొక్క యానతి నుల్లంఘించి హ్రాదుడు మున్నగు రాక్షసులచే ముల్లోకము లందలి మా హవిర్భాగములు హరింప బడినవి. మేమందరము సర్వాత్ముడవగు నీకు అంశభూతులమే కాని అజ్ఞానముచే జగత్తును వేరుగా చూచు చున్నాము. తమతమ వర్ణ ధర్మము లందాసక్తి గలవారును వేద మార్గము ననుసరించు చున్నవారును తపో బలముతో గూడిన శత్రువులునగు రాక్షసులు మాచే చంపబడువారు కారు. సర్వాత్మకుడవగునో భగవంతుడా! వీరిని చంపు నుపాయము ననుగ్రహింపుము.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తోభగవాంస్తేభ్యో మయామోహంశరీరతః

సముత్పాద్యదదౌవిష్ణుః ప్రాహచేదంసురోత్తమాన్

శ్రీపరాశరుడు:

అని దేవతలు చెప్పగనే భగవంతుడు తన శరీరము నుండి మాయామోహుని పుట్టించి దేవతల కిచ్చి యిట్లు పలికెను.

శ్రీభగవానుడు:

మాయామోహోఽయమఖిలాన్ దైత్యంస్తాన్ మోహయిష్యతి

తతోవధ్యాభవిష్యన్తి వేదమార్గబహిష్కృతాః

స్థితౌస్థితస్యమేవధ్యాయావన్తః పరిపన్థినః

బ్రాహ్మణోయేఽధికారస్యదేవదైత్యాదికా స్సురాః

తద్గచ్చత నభీః కార్యా మాయామోహోఽయమగ్రతః

గచ్చన్నద్యోపకారాయ భవతాంభవితా సురాః

శ్రీభగవానుడు:

వీడు మాయామోహుడు. దైత్యుల నందరను మోహ పెట్టును. దాని వలన వేద మార్గమును వదలుటచే వారు వధింప బడుదురు. దేవతలారా! పరిపాలకుడనగు నాకు బ్రహ్మ యొక్క అధికారమునకు విఘ్నకర్తలగు దేవదానవు లెంత మందియైనను వధ్యులగుదురు. దేవతలారా! వెళ్ళుడు. భయపడ వలదు. మీకు ముందుకెళ్ళుచు మయామోహుడు మీకుపకారము చేయ గలడు.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తాః ప్రణిపత్యైనం యయుర్దేవా యథాగతమ్

మాయామోహోఽపితైస్సార్థం యయౌయత్ర మహాసురాః

శ్రీపరాశరుడు:

భగవంతుడిట్లు పలుకగా దేవతలు నమస్కరించి వెళ్ళిరి. మయామోహుడు కూడ వారితో రాక్షసులున్న తావునకు వెళ్ళెను.