విష్ణు మహా పురాణము

9 - రజివంశ చరిత్ర

శ్రీపరాశరుడు:

రజేస్తుపఞ్చపుత్ర శాతాన్యతుల బలవీర్య పరాక్రమసారాణ్యాసన్

దేవాసుర సంగ్రామారమ్భే చపరస్పరధేప్సవోదేవాశ్చాసురాశ్చ బ్రహ్మాణము ప్రేత్యపప్రచ్చుః

భగవన్నస్మాకమత్రవిభఠోధేకతమః పక్షోజేతాభావిష్యతీతి

అథాహభగవాన్

యేషామర్థేరాజిరాత్తాయుధోయోత్స్యతతత్పక్షోజేతేతి

అథదైత్యేరుపేత్యరజిరాత్మసాహాయ్య దానాయాభ్యర్థితః ప్రాహ

యోత్స్యేహం భవ తామర్ధే యద్యహమమరజయాద్భవతామిన్ద్రో భవిష్యామీత్యాకర్ణ్యై తత్తైరభిహితమ్

నవయవన్యథావదిష్యామోఽన్యథా కరిష్యామోఽస్మాకమిన్ద్రః ప్రహ్లాదస్తదర్థమేవాయ ముద్యమ ఇత్యుక్త్వాగతేష్వసురేషుదేవై రప్యసావావనిపతి రేవమేవోక్తస్తే నాపిచతథై వోక్తేదేవై రిన్ద్రస్త్వం

భవిష్యసీతిసమన్విచ్చితమ్

శ్రీపరాశరుడు:

రజికి అసమాన బలవీర్య పరాక్రమము లయిదు వందల మంది కుమారు లుండిరి. దేవాసుర సంగ్రామమందు దేవతలు రాక్షసులు నొండొరులం జంపి కొననెంచి బ్రహ్మ దగ్గరకు వచ్చి మాలో నే పక్షము గెలుచుననిరి. బ్రహ్మ ఎవరివైపు రజి యాయుధమెత్తి పోరాడునో ఆపక్షము జయింప గలదనియె, అంత దైత్యులు వచ్చి రజిని దమవైపు పోరుమని యర్థించిరి. అతడు పోరేదను గాని యమరుం గెల్చి నేను మీకింద్రుడు గావలయునన విని దైత్యులు మేమింకొకలాగు మాట్లాడము ఇంకొకలాగు చేయము. మాకింద్రుడు ప్రహ్లాదుడు అతని కోసమే యీ మాయుద్యమము అని వారు జనినంత దేవతలు వచ్చి మాపక్షమున బోరుమన వారి తోడను నతడటు పలుక వారంగీకరించిరి.

రజినాపిదేవసైన్యసహాయేనానేకై ర్మహాస్త్రై స్తదశేషమసురబలం నిషూదితమ్

అథజితారిపక్షశ్చ దేవేన్ద్రోరజిచరణయుగలమాత్మనః శిరసానిపీడ్యాహ

భయత్రాణాదన్నదానాద్భ వానస్మత్పితా శేషలోకానాముత్తమోత్తమోభవాన్ యస్యాహం పుత్రస్త్రిలోకేన్ద్రః

సచాపిరాజా ప్రహస్యాహ

ఏవమస్త్వేవామస్త్వనతిక్రమణీయాహి వై రిపక్షాదప్యనేకవిధచాటువాక్యగర్భా ప్రణతిరిత్యు క్త్వాస్వపురం జగామ

శతక్రతురపీన్ద్రత్వంచకార

రజియును దేవసైన్య సహాయమున ననేక మహాస్త్రములచే నసుర బలమును సంహరించెను. ఆమీద నిటు శత్రుపక్షముం గెలిచి దేవేంద్రుడు రజి పాదములు రెండుం దనతల నానించి యిట్లనియె. భయము నుండి రక్షించి మాకు అన్నము పెట్టినావు గాన మాకీవు తండ్రివి ఎల్లలోకాల నీవుత్త మోత్తముడవు. అట్టి నీకు ద్రిభువనాధీశ్వరుడనైన నేను పుత్రుడను. రజి మహారాజును నవ్వి యిట్లే యగుత ఇట్లేయగు గాక! అనేక మధురమయిన

మాటలతో జేసినా యీ ప్రణతి (సాష్టాంగ నమస్కారము) శత్రువేని గాదనరానిది. అని నిజ రాజధాని కరిగెను. శతక్రతువింద్ర పదవిని నిర్వహించెను.

స్వర్యాతేతు రాజౌనారదర్షి చోదితారాజిపుత్రాశ్శతక్రతుమాత్మపితృపుత్రం సమాచారాద్రా జ్యంయాచితవన్తః

అప్రదానేనచవిజిత్యేన్ద్రమతిబలినః స్వయమిన్ద్రత్వం చక్రుః

తతశ్చబహుతిథేకాలేహ్యతీ తేబృహస్పతియేమే కాన్తేదృష్ట్వా అపహృతత్రైలోక్యయజ్ఞభాగః శతక్రతురువాచ

బదరీఫలమాత్రమాప్యర్హసిమమాప్యాయనాయపురోడాశకణ్డం దాతుమిత్యుక్తో బృహస్పతి రువాచ

యద్యేవం త్వయాహం పూర్వమేవచోదితస్స్యాం త్వన్మయాత్వదర్ధం కిమకర్తవ్యమిత్యలైరే వాహోభిస్త్వాం నిజం పదం ప్రాపయిష్యామీత్యభిదాయతేసామనుదినమాభిచారికం బుద్ది మోహా యశక్రస్యతేజోభివృద్దయేజుహావ

తేచాపితేనబుద్దిమో హేనాభిభూయమానా బ్రహ్మద్విషోధర్మత్యాగినో వేదపఙ్ముఖాబభూవుః

తతస్తానపేతధర్మాచారానిన్ద్రోజఘాన

పురోహితాప్యాయిత తేజాశ్చశక్రః దివమాక్రమత్

ఏతదిన్ద్రస్యపదచ్యవనాదారోహణం శ్రుత్వాపురుషః స్వపదభ్రం శందౌరాత్మ్యంచనాప్నోతి

అవ్వల రజి స్వర్గమునకరుగ రజి కుమారులు నారదుని ప్రేరణచే తమ తండ్రికి కొడుకైన శతక్రతుని (ఇంద్రుని) పిత్రుపుత్ర సంప్రదాయము ననుసరించి దేవేంద్ర రాజ్యము నడిగిరి. అతడీయకున్నంత నాతని నోడించి యా బలశాలురు తామింద్రత్వమును నిర్వహించిరి. అవ్వల పెద్దకాలము గడువ నేకాంత మందు బృహస్పతిం దర్శించి త్రైలోక్య యజ్ఞ భాగము లిట్లు రజి కొడుకులచే నపహరింప బడి యుంద్రుడు రేగు పండంతా యేని పురోడాశ ఖండము నాకీవు దయదేయ దగుదు వన గురుండీ మాటమున్నే నాకు చెప్పియున్నట్లైన నీకై జేయరాని పని ఏమున్నది? కొలది నాళ్లలో నిన్ను నీ స్థానమును బొందింతును జూడుమని యా రజి సంతానమునకు మతి చెడుటకు శక్రునికి తేజో వృద్ది యగుటకు ఆభిచారిక హోమము గావించెను. దానిచే వాండ్రు బుద్ది, మోహము చేజెడి బ్రహ్మద్వేషులై ధర్మత్యాగులై వేద విముఖులైరి. అవ్వల నింద్రుడాయ ధర్మచారుల నుక్కడగించెను. పురోహితునిచే దేజస్సాప్యాయన మొంద నింద్రుడు దివమ్ము నాక్రమించెను. ఈ యింద్రపదచ్యుతి నుండి పునరారోహణము దనుకగల కథను విన్నవాడు స్వపద భ్రష్టుడు గాడు. దౌరాత్మమునుం బొండదు (దౌర్భాగ్యము వానికి గలుగ దన్నమాట).

రమ్భస్త్వనపత్యోఽభవత్

క్షత్రవృద్దసుతః ప్రతిక్షత్రోఽభవత్

తత్పుత్రస్సంజయః తస్యాపిజయః తస్యాపివిజయః తస్మాచ్చజజ్ఞేకృతః

తస్యచహర్యధనః హర్యధనసుతస్సహదేవః తస్మాదదీనస్తస్యజయత్సేనః తతశ్చసం కృతిః

తత్పుత్రః క్షత్రధర్మా ఇత్యేతేక్షత్రవృద్దస్యవంశ్యాః

తతోనహుషవంశం ప్రవక్ష్యామి

రంభుని సంతతి లేదు. క్షత్రవృద్దుని కొడుకు ప్రతిక్షత్రుడు వాని కొడుకు సంజయుడు. వానికి జయుడు వానికి విజయుడుం బుట్టిరి. విజయుని వాడు సహదేవుడు. వాని కొడుకు అదీనుడు. వాని తనయుడు జయత్సేనుడు. వానికి సంకృతి క్షత్ర ధర్ముడునుగా వీరు క్షత్రవృద్ద వంశీయులు. ఈ మీద నహుష వంశము దెలిపెద.