10 - యయాతి చరిత్రము

శ్రీపరాశరుడు:

యతియయాతి సంయాత్యాయాతి వియాతికృతిసంజ్ఞా ।

నహుషస్య షట్పుత్రా మహాబల పరాక్రమా బభూవుః॥

యతిస్తురాజ్యం నైచ్ఛత్॥

యయాతిస్తు భూభృదభవాత్॥

ఉశనసశ్చదుహితరం దేవయానీం వార్షపర్వణీంచ శర్మిష్ఠాముపయేమే ॥

అత్రానువంశశ్లోకోభవతి॥

యదుంచదుర్వసుంచైవ దేవయానీవ్యజాయత।

ద్రుహ్యంచానుంచపూరుంచ శర్మిష్ఠావార్షపర్వణీ॥

శ్రీపరాశరుడు:

నహుషుని కొడుకులు ఆరుగురు. యతి యయాతి సంయాతి ఆయాతి వియీతి కృతి అనువారు. మహా బలశాలురు. యతి రాజ్యమును గోరలేదు. యయాతి భూపతి అయ్యెను. అతడు శుక్రాచార్యుల కూతురును దేవయానిని వృష పర్వుడను రాజు కూతురును శర్మిష్ఠను పెండ్లాడెను. ఇక్కడ అనువంశమైన శ్లోకమొకటి యున్నది, దాని భావము. “దేవయాని యదువును దుర్వసుని గన్నది. వృషపర్వుని కూతురు (వార్షపర్వణి) ద్రుహ్యుని అసువును బూరుని గనెను”.

కావ్యశాపాచ్చ కాలేనై వయయాతిర్జరామవాప॥

ప్రసన్నశుక్రవచనాచ్చస్వజరాం సంక్రామయితుం జ్యేష్ఠంపుత్రం యదుమువాచ॥

వత్స! త్వన్మాతామహశాపాదియమకాలేనై వజరామమోపస్థితా।

తామహంతస్యైవానుగ్రహా ద్భవతస్సంచారయామి॥

ఏకం వర్షసహస్రమాతృప్తోస్మివిశయేషు త్వద్వాయసావిషయానాహం భోక్తుమిచ్చామి॥

నాత్రభవతాప్రత్యాఖ్యానం కర్తవ్యమిత్యుక్తస్సయదుర్ నైచ్ఛత్తాం జరామాదాతుమ్॥

తంచపితాశశాప త్వత్ర్పాసూతిర్నరాజ్యార్హాభావిష్యతీతి॥

అనంతరం చదుర్వసుంద్రుహ్యనుంచపృథివీపతిర్జ రాగ్రహణార్థం స్వయౌవనప్రదానాయచ అభ్యర్థయామాస తైరప్యేకై కేనప్రత్యాఖ్యాతస్తాన్ శశాప॥

అథశర్మిష్ఠాతనయమ శేషకనీయాం సంపూరుం తథై వాహ॥

సచాతిప్రవణమతిః సబహుమానం పితరం ప్రణమ్య మహాప్రసాదోఽయమస్మాకమిత్యుదారమభి ధాయజరాం జగ్రాహ స్వకీయం చయౌవనం స్వపిత్రేదదౌ॥

సోపిపౌరవం యౌవనమాసాద్యధర్మావిరోధేనయథాకామం యథాకాలోలోపపన్నం యథోత్సా హంవిషయాంశ్చచార॥

సమ్యక్చప్రజాపాలనమకరోత్ విశ్వాచ్యాదేవయాన్యాచ సహోపభోగం।

భుక్త్వాకామానామన్తం ప్రాప్య్స్యామీత్యనుదినం తన్మనస్కోబభూవ॥

అనుదినంచోపభోగతః కామానతిరమాన్ మేనే తతశ్చైనమగాయత॥

నజాతుకామః కామానాముపభోగేనశామ్యతి।

హవిషాకృష్ణవర్ త్మేవ భూయ ఏవాభివర్థతే॥

యాత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః।

ఏకస్యాపినపర్యాప్తం తస్మాత్తృష్ణాం పరిత్యజేత్॥

యదానకురు తేభావం సర్వభూతేషుపాపకమ్।

సమదృష్టేస్తదాపుంసః సర్వాస్సుఖమయాదిశః॥

యదుస్త్వజాదుర్మతిభిః యానజీర్యతిజీర్యతః।

తాంతృష్ణాం సంత్యజేత్ ప్రాజ్ఞాస్సుఖేనై వాభిపూర్యతే॥

జీర్యన్తిజీర్యతః కేశాదన్తాజీర్యన్తిజీర్యతః।

ధనాశాజీవితాశాచ జీర్యతోఽపినజీర్యతః॥

పూర్ణం వర్షం సహస్రం మేవిషయాసక్తచేతసః।

తథాప్యనుదినం తృష్ణామమతేషూపజాయతే॥

తస్మాదేతామహాన్త్యక్త్వా బ్రాహ్మణ్యాధాయమానసమ్।

నిర్ ద్వన్ద్వోనిర్మమోభూత్వా చరిష్యామిమరుగైస్సహ॥

శ్రీపరాశరుడు:

పూరోస్సకాశాదాడాయ జరాం దత్త్వాచయౌవనమ్।

రాజ్యేభిశిచ్యపూరుంచ ప్రయయౌతపసేవనమ్॥

దిశిదక్షిణపూర్వస్యాం సుర్వసుంచసమాదిశత్।

ప్రతీచ్యాంచతతాద్రుహ్ర్యం దక్షిణాయాం తతోయదుమ్॥

ఉదీచ్యాంచ తథైవాసుం కృత్వామణ్డలినోనృపాన్।

సర్వపృథ్వీపతిం పూరుం సోఽభిషిచ్యవనం యయౌ॥

శుక్రుని శాపముచే యయాతి కొంత కాలము ముసలి తనము పొందెను. ఆ మీద ప్రసన్నుడైన యా శుక్రుని మాటను బట్టి తన ముసలి తనమును పెద్దకొడుకగు యదువునకు సంక్రమింప జేయవలె నని, వత్సా! నీ మాతా మహుడు ఇచ్చిన ఈ శాపముచే అకాలమున నాకు జర వచ్చినది. దానిని అతని అనుగ్రహముననే సంక్రమింప జేసెదను ఒక వేయేండ్లు విషయ భోగములు అనుభవించితి గాని తృప్తి కలుగ లేదు. నీ ప్రాయముచే నేను విషయములను అనుభవింప కోరుచున్నాను. ఇది నీవు కాదనరాదు. అన విని యదువు ఆ ముదిమిని తీసుకొనడానికి ఇష్ట పడలేదు. వానిని దండ్రి నీ సంతతి రాజ్యార్హము గాబోదని శపించెను. అటుపై శర్మిష్ఠ తనయుని అందరి కన్న చిన్నవానిని పూరుని నట్లు అడిగెను. అతడు అత్యంత ఆదర బుద్దియై సబహుమానముగ తండ్రికి ప్రణమిల్లి మహాప్రసాద మిది మాకని ఉదారముగా పలికి ముదిమిని గొనెను. తన యౌవనమును తండ్రికి ఒసగెను. అతడును పూరువు యవ్వనమును పొంది ధర్మము తప్పకుండ యథాభిలాషముగ సమయమునకు సమకూరిన విధముగ ఉత్సాహముతో విషయముల వెంట జరించెను. ప్రజా పాలనము కూడ చక్కగా చేసెను. విశ్వాచి (అప్సరస)తో దేవయాని తోడను నుపభోగ అనుభవము నంది కామముల తుదినందెద ననియు ననుదినము నదే మనసు పడియుండెను. దినదినోప భోగములచే కామములతి రమ్యములని తలంచెను. అందుచే ఇతని గూర్చి యిది యొక గాథ. దీవి భావము. ఎన్నడునేని కామము కామముల యుపభోగమున శమింపదు. హవిస్సు చేత అగ్ని వలె మిక్కిలిగా అభివృద్ధి చెందును. పృథివి యందున్న మొత్తము వ్రీహులు యవలు ఇత్యాది దానయ విశేషములు హిరణ్యము (బంగారము) పశువులు స్త్రీలును నొక్కనికి గూడ సరిపోవు. అందువలన తృష్ణను ఆశను పరిత్యజించ వలయును. సర్వ భూతము లందును పాపపు తలంపు నెప్పుడు సేయడో అప్పుడు అసమా దృష్టి గలవాని కన్ని దిశలు సుఖ వలయములు. దుర్మతులైన వాండ్రేది వదల జాలరు. ఏ కొలది జరించిన కొలది జరింపదో (ముదిమి గ్రమ్మినం దేనికి ముదిమి లేదో) అట్టి తృష్ణను ఆశను ప్రాజ్ఞుడు వీడ వలయును. అట్టివాడు సుఖముచే నింప బడును. జరించిన వానికి జుట్టు దంతముళ్ళు జరించును (జుట్టు నేరియును పండ్లూడును) ధనాశ జీవితాశ మాత్రము జరావశుడైన వానికి జరింపవు. విషయ లంపటుడైన నాకు వేయి ఏండ్లు నిండినవి. అయినను ననుదినము నాకు వాని యందాశ కల్గుచునే యున్నది. కావున నేనీ తృష్ణను విడిచి మనసును బ్రహ్మమందుంచి నిర్ద్వంద్వుడనై (సుఖ దుఃఖములు శోక మోహములు అనునీ జంటలు అంటూ తొలగి) నిర్మముడనై నాది నేను అను మమకారమును బాసి మృగములతో గూడ జరించెదను. అని పూరుని నుండి జరం గైకొని యౌవనము వానికిచ్చి రాజ్యము నందతని నభిషేకించి తపస్సునకు అడవికి పోయెను. ఆగ్నేయ భాగమందు దుర్వాసుని బడమాట ద్రుహ్యుని దక్షిణా పథమున యదువును ఉత్తర దిశ ననువును పరిమితి మండలాధిపతుల గావించి సర్వ పృథ్వీ మండలేశ్వరుని పూరువుం

గావించి యాతడు వనమేగెను.