శ్రీపరాశరుడు:
ధృతే గోవర్దనే శైలేపరిత్రాతేచ గోకులే।
రోచమాయాస కృష్ణస్య దర్శనం పాకశాసనః॥
సోఽధీరుహ్య మహానాగ మైరావత మమిత్రజిత్।
గోవర్ధన గిరౌ కృష్ణం దదర్శ త్రిదశేశ్వరః॥
చారయన్తం మహావీర్యం గాస్తు గోపవపుర్ధరమ్।
కృత్స్నస్య జగతోగోపంవృతం గోపకుమారకైః॥
గరుడంచ దదర్శోచ్చైరన్తర్దానగతం ద్విజ।
కృతచ్చాయంహరేర్మూర్ని పక్షాభ్యాం పక్షిపుంగవమ్॥
అవరుహ్య స నాగేన్ద్రాదేకా న్తేమదుసూదనమ్।
శక్రస్సస్మితమా హేదం ప్రీతివిస్తారితేక్షణః॥
శ్రీపరాశరుడు:
కృష్ణుడు గోవర్ధన శైలమును గోకులము నుద్దరింప పాకశాసనుడు కృష్ణ దర్శనము సేయ నభిలషించెను. అతడైరావతమేక్కి వచ్చి గోవర్ధన గిరిపై గోపాల బాలక రూపము ధరించి గోవులం గాచుచు గోప కుమారులతో చుట్టబడి సకల జగద్రక్షకుని హరిని హరి (ఇంద్రుడు) దర్శనము సేసికొనెను. మఱియు నందరకుం గనబడకుండ పై యెత్తున హరి శిరమ్మున దన రెక్కలతో నీడ గల్పించుచున్న పక్షిరాజును గరుడును గూడ దర్శించెను. అతడైరావతముం దిగి ఏకాంతమున ప్రీతిచే గనులు విప్పార నల్లన నవ్వుచు మధువైరి కిట్లనియె.
ఇంద్రుడు:
కృష్ణ! కృష్ణ! శృణుష్వేదం యదర్థ మహ మాగతః।
త్వత్సమీపం మహాబాహో నైతచ్చిన్త్యం త్వయాఽన్యథా॥
భారావతరణార్థాయ పృథివ్యాః పృథివీతలే।
అవతీర్ణోఽఖిలాధార! త్వమేవపరమేశ్వర!॥
మఖభంగవిరోధేన మయాగోకులనాశకాః।
సమాదిష్టా మహామేఘాస్టై శ్చేదంకదనంకృతమ్॥
త్రాతాస్తాశ్చత్వయాగావస్సముత్పాట్య మహీధరమ్।
తేనాహంతోషితోవీర! కర్మణాఽత్యద్భుతేన తే॥
సాధితం కృష్ణ దేవానా మహంమన్యే ప్రయోజనమ్।
త్వయా యమద్రిప్రవరః కరేణై కేనయద్ధృతః॥
గోభిశ్చచోదితః కృష్ణ! త్వత్సకాశమిహాగతః।
త్వయాఽత్రతాభి రత్యర్థంయుష్మత్సత్కారకారణాత్॥
స త్వాంకృష్ణాఽభిషేక్ష్యామి గవాంవాక్యప్రచోదితః।
ఉపేన్ద్రత్వే గవామిన్ద్రోగోవింద స్త్వంభవిష్యసి॥
ఇంద్రుడు:
కృష్ణ! కృష్ణ! ఇదే యాలింపు మేనెందులకు నీ సన్నిధి కేతెంచితినో విన్నపము సేసెద. నీ వింకొకలాగు భావింప వలదు. పరమేశ్వరా! అఖిలాధారుడవీవ పృథివీ భారముడుప నవతరించినాడవు. యాగభంగము సేసితివని పగగొని నేను గోకుల మాకులము సేయ మేఘముల కాన యిచ్చితిని. వానిచే నీ కల్లోలము సేయబడినది. నీవు గిరినెత్తి గోవుల గాచితివి. అధ్బుతమైన నీ ఈ లీలచే నేను సంతసించితిని. ఒక్క కేల నీవీగిరి నవలీల నెత్తుట వలన స్వామీ! వేల్పుల ప్రయోజనము నేరవేర్ప బడినదని నేదలంతును. నీచే సురక్షితులైన గోవులు నిన్ను సత్కరింప వలెనను కారణముచే నన్ను మిక్కిలి ప్రేరేప నీ దరి కిట కేతెంచితిని. గోవుల మాట నుత్తేజితడనై గోకులమునకు ప్రభునిగా నుపేంద్రునిగ సత్యలోకో పరిస్థిత గోకులేశునిగా నిన్ను బట్టాభిషేకించెద. గోవుల కింద్రుడవగు నీవు గోవిందుడవుం గాగాలవు.
శ్రీపరాశరుడు:
అథోపవాహ్య దాదాయఘణ్టామైరావతాద్గజాత్।
అభిషేకంతయాచక్రేపవిత్రజలపూర్ణయా॥
క్రియమాణేఽభిషేకే తు గావః కృష్ణస్యతత్ క్షణాత్।
ప్రస్నవోద్భూతదుగ్దార్ ద్రాం సద్యశ్చక్రుర్వసుంధరామ్॥
అభిషిచ్యగవాంవాక్యాదుపేన్ద్రంవై జనార్దనమ్।
ప్రీత్యాసప్రశ్రయం వాక్యం పునరాహశఛీపతిః॥
గవామేతత్కృతం వాక్యంతథాన్యదపిమేశృణు।
యద్బ్రవీమి మహాభాగ! భారావతరణేచ్చయా॥
మమాంశః పురుషవ్యాఘ్రపృథివ్యాంపృథివీధర।
అవతీర్ణోర్జునోనామ సంరక్ష్యోభవతాసదా॥
భారావతరణే సాహ్యంసతేవీరః కరిష్యతి।
సంరక్షణీయో భవతా యథాఽఽత్మామధుసూదన!॥
శ్రీపరాశరుడు (దేవేంద్రకృత గోవింద పట్టాభిషేకము):
అంతట సురపతి తన వాహనమైన యైరావతము నుండి గంటం జేకొని దానం బవిత్ర జలములు నింపి గోపాల కృష్ణున కభిషేకము గావించు చుండగా నా క్షణమున గోవులు పాలు చేపి వసుంధర నెల్ల గోక్షీరధారార్ద్రం బొనరించినవి. మాట వెంబడి శచీపతి జనార్దను నుపేంద్రునిగ సంప్రీతి నభిషేకించి వెండియు సవినయముగ నిట్లనియె. పృథ్వీధరా! గోవుల మాట సెల్లించితిని. మఱియు భూభారము తగ్గించ దలచి చెప్పు నా పలుకాలింపుము. నా యంశము భూమి యందు అర్జునుండను పేర నవతరించినది. ఆతడు నీచే రక్షింపబడు గాక! ఆ వీరుడు భూభారవతరణముణ నీకు సాహాయ్య పడగలడు. ఆత్మవలె నతడు నీకు సంరక్షణీయుడు అనియె. అంత నింద్రునితో భగవంతు డిట్లనియె.
శ్రీభగవానుడు:
జానామిభారతేవం శేజాతంపార్థం తవాంశతః।
తమహంపాలయిష్యామి యావత్థ్వాస్యామిభూతలే॥
యావన్మహీతలేశక్ర! స్థాస్యామ్యహ మరిందమ!।
నతావదర్జునంకశ్చిద్దేవేన్ద్ర యుధి!జేష్యతి॥
కంసోనామమహాబాహుః దైత్యోఽరిష్ట స్తథాఽసురః।
కేశీకువలయాపీడోనరకాద్యా స్తథాపరే॥
హతేషుతేషుదేవెన్ద్ర! భవిష్యతి మహాహవః।
తత్ర విద్ధిసహస్రాక్ష! భారవతరణం కృతమ్॥
సత్వంగచ్చ ణ సంతాపం పుత్రార్థే కర్తుమర్హసి।
నార్జునస్యరిపుః కశ్చిన్మమాగ్రేప్రభవిష్యతి॥
అర్జునార్థేత్వహంసర్వాన్ యుతిష్ఠిర పురోగమాన్।
నివృత్తే భారతే యుద్దె కున్త్యైదాస్యామ్యవిక్షతాన్॥
ఇత్యుక్తస్సంపరిష్వజ్యదేవరాజో జనార్దనమ్।
ఆరుహ్యైరావతం నాగంపునరేవదివంయయౌ॥
కృష్ణోహి సహితో గోభిః గోపాలైశ్చ పునర్ వ్రజమ్।
ఆజగామాథ గోపీంనాందృష్టిపూతేనవర్త్మనా॥
శ్రీభగవానుడు:
భరతవంశ మందు నీ యంశమున బుట్టినాడని పార్థుని నే నెరుంగుదును. నేను భూతలమున నున్నంత వరకాతని నేను బాలించెదను. దేవేంద్రా! నేనున్నంత వరకు అయ్యర్జునుని బోర నెవ్వడుం గెలువ లేడు. కంసుడను దైత్యుడు అరిష్టుడు కేశీ కువలయాపీడుడు నరకుడు మరి యా పెక్కురు హతులై నంత మీదట మహా యుద్దము జరుగును. అందు సర్వ భారావతరనముం జేయబడి నట్లే యెరుంగుము. నీ కుమారుడగు నర్జునుని విషయమై సంతాప పడకుము. అర్జునుని శత్రువెవ్వడును నా యెదుట నేమియు చేయజాలడు. అర్జునుని కొరకే నేను యుధిష్టర పురస్సరులైన బిడ్డలను భారత యుద్దమైన తరువాత నెట్టి దెబ్బ తినకుండ కుంతీ కొసంగెదను. అని పలుక విని దేవపతి జనార్ధనుం గౌగిలించుకొని యైరావత గజమెక్కి తిరిగి దివమ్మున కేగెను. పిమ్మట కృష్ణుడును, గోవులతోను, గోపాలురతోను, గోపికల చూపులచే బవిత్రమయిన దారివెంట వ్రేపల్లెకు విజయం చేసెను.
Summary of chapter 12 of the Vishnu Mahā Purāṇa is as follows:
With the storm over, Indra descends from Svarga on his elephant Airāvata, humbled and filled with devotion. He formally bathes Kṛṣṇa with water from the Pāñcajanya vessel and coronates him with the title "Govinda" — protector of the cows and the gopas. He presents the Sudharmā Sabhā (the divine assembly hall) as a gift, conveyed through Vāyu. The chapter uniquely notes that Arjuna is the aṃśa of Indra himself.