మైత్రేయుడు:
ప్రోక్తాన్యేతానిభవతాసప్తమన్వన్తరాణివై।
భవిష్యాణ్యపివిప్రర్షేమమాఖ్యాతుంత్వమర్హసి॥
మైత్రేయుడు:
మీచే మన్వంతరములు చెప్ప బడినవి. రాబోవు మన్వంతరములను నాకు చెప్పుదురు గాక!
శ్రీపరాశరుడు:
సూర్యస్యపత్నీ సంజ్ఞాభూత్తనయావిశ్వకర్మణః।
మనుర్యమోయమీచై వతదపత్యానివై మునే॥
అసహన్తీతుసాభర్తు స్తేజశ్చాయాంయుయోజవై।
భర్తుశ్శుశ్రూషణేఽరణ్యం స్వయంచతపసేయయౌ॥
సంజ్ఞేయమిత్యథార్కశ్చ ఛాయాయామాత్మజత్రయమ్।
శనైశ్చరంమనుంచాన్యం తపతించాప్యజీజనత్॥
ఛాయాసంజ్ఞాదదౌశాపం యమాయకుపితాతదా।
తదాన్యేయమాసౌబుద్ధిరిత్యాసీద్యమసూర్యయో॥
తతోవివస్వానాఖ్యాతేతయైవారణ్యసంస్థితామ్।
సమాధిదృష్ట్యాదదృశేతామశ్వీంతపసిస్థితామ్॥
వాజిరూపధరస్సోఽథతస్యాందేవావథాశ్వినౌ।
జనయామాసురేవన్తం రేతసో న్తేచ భాస్కరః॥
శ్రీపరాశరుడు:
సూర్యుని భార్య సంజ్ఞా దేవి. ఆమె విశ్వకర్మ యొక్క పుత్రిక. ఆమె సంతతి మనువు, యముడు, యమి. ఆమె భర్త యొక్క తేజస్సును సహించలేక తన వంటి యొక స్త్రీని తన ఛాయను శుశ్రూషార్థమై నియోగించి తపస్సు కొఱకై తానరణ్యమున కేగెను. సూర్యుడామెను సంజ్ఞా దేవిగనే యెంచి, యామె యందు శనైశ్చరుడు, మరియొక మనువు అను పుత్రులను, తపతి యను కన్యను సంతతిగ గాంచెను. తన సంతతి యందు పక్షపాత ముండుటచే కినిసి పాదముతో తన్నబోయిన యమునకు "నీ పాదము పడిబోవు గాక!" అని శాప మిచ్చెను. దాని వలన నీమే సంజ్ఞా దేవి కాదు మరియొక స్త్రీ యను భావము యమునకు తండ్రియగు సూర్యునకు కలిగెను. వెంటనే సూర్యుడు నీవెవరో చెప్పుమని నిర్భంధించగా నేను సంజ్ఞా దేవి యొక్క ఛాయను. సంజ్ఞ ఉత్తర కురు దేశారణ్యమున బడబా రూపమున తపస్సు చేయుచున్నదని తెలిపెను. సూర్యుడు సమాధి దృష్టితో నామెను వాజీ రూపమున తపస్సులో నున్నట్లు గాంచి తాను గూడ వాజీ రూపధరుడై యామె యందు అశ్వినీ కుమారులను రైవంతుని గనెను. సంజ్ఞను స్వస్థానమునకు గొని వచ్చెను.
ఆనిన్యేచపునస్సంజ్ఞాంస్వస్థానంభగవాన్ రవిః।
తేజసశ్శమనంచాస్య విశ్వకర్మాచకారహ॥
భ్రమిమారోప్యసూర్యంతు తస్యతేజోవశాతనమ్।
కృతవానష్టమంభాగంసవ్యశాతయదవ్యయమ్॥
యత్సూర్యాద్వైష్ణవం తేజశ్శాతితం విశ్వకర్మణా।
జ్ఞాజ్వల్యమానమపతత్తద్భూమౌమునిసత్తమ॥
త్వష్టైవతేజసాతేన విష్ణోశ్చక్రమకల్పయత్।
త్రిశూలం చైవశర్వస్య శిబికాంధనదస్యచ॥
శక్తింగుహస్య దేవానామన్యేషాంచయదాయుధమ్।
తత్సర్వం తేజసాతేన విశ్వకర్మావ్యవర్థయత్॥
చాయాసంజ్ఞాసుతోయోసౌద్వితీయః కథితోమనుః।
పూర్వజస్యసవర్ణోసౌసావర్ణిస్తేనకథ్యతే॥
తస్యమన్వన్తరం హేతత్సావర్ణికమతాష్టమమ్।
తచ్చృణుష్వమాహాభాగ భవిష్యం కథయామితే॥
సావర్ణిస్తుమనుర్యోఽసౌ మైత్రేయ! భావితాతతః।
సుతపాశ్చామితాభాశ్చ ముఖ్యాశ్చాపితదాసురాః॥
తేషాంగణాస్తుదేవానామేకై కోవింశకస్స్మృతః।
సప్తర్షీనథవక్ష్యామిభవిష్యాన్మునిసత్తమ॥
దీప్తిమాన్ గాలవోరామః కృపోద్రౌణిస్తథాపరః।
మత్పుత్రశ్చతథావ్యాసఋశ్య శృంగశ్చ సప్తమః॥
విష్ణుప్రసాదాదనఘః పాతాళాన్తరగోచరః।
విరోచనసుతస్తేషాం బలిరిన్ద్రో భవిష్యతి॥
విరజాశ్శార్వరీవాంశ్చ నిర్మోకాద్యాస్తథాపరే।
సావర్ణేస్తుమనోః పుత్రా భవిష్యన్తినరేశ్వరాః॥
విశ్వకర్మ సూర్యుని తరణి(సాన) పట్టి యెనిమిదవ భాగమును తగ్గింపగా వైష్ణవాంశమగు నా భాగము ప్రకాశించుచు క్రింద పడెను. ఆ తేజస్సుతో త్వష్ణయే విష్ణు చక్రమును, శివుని త్రిశూలమును, కుభేరుని పుష్పక విమానమును, కుమారస్వామి యొక్క శక్తియను ఆయుధమును, ఇతర దేవతల యాయుధములని రచించెను. ఛాయా సంజ్ఞా పుత్రుడగు ద్వితీయ మనువు లోగడ పుట్టిన మనువునకు సవర్ణుడు కాన సావర్ణియని చెప్ప బడెను. కావున నీ యెనిమిదవ మన్వంతరము సావర్ణిక మన్వంతరమని చెప్ప బడును. భవిష్యత్తు మన్వంతరములను చెప్పెద వినుము. రాబోవు మనువు సావర్ణి. దేవతలు మిక్కిలి తపస్వులు. మహా దీప్తిమంతులు. వారి గణములలో నొక్కొక్క గణమునకు నిరువది మంది గలరు. దీప్తిమంతుడు, గాలవుడు, రాముడు, కృష్ణుడు, ద్రోణి, నా పుత్రుడగు వ్యాసుడు, ఋష్యశృంగుడు సప్తర్షులు. విష్ణు దేవుని అనుగ్రహమున పాతాలాంతర గతుడు విరోచనుని కుమారుడగు బలి ఇంద్రుడు కాగలడు. విరజస్కుడు ఉత్వరీవంతుడు నిర్మోకుడు మున్నగు వారు సావర్ణి పుత్రులు మనుజేశ్వరులు.
నవమోదక్షసావర్ణిర్భవిష్యతి మునేమనుః॥
వారామరీచిగర్భాశ్చ సుదర్మాణశ్చ తేత్రిధా।
భవిష్యన్తితథాదేవా ఏకైకోద్వాదశోగణః॥
తేషామిన్ద్రోమహావీర్యో భవిష్యత్యద్భుతో ద్విజ॥
సవనోద్యుతిమాన్ హవ్యో వసుర్ మేధాతిథిస్తథా।
జ్యోతిష్మాన్ సప్తమస్సత్యస్తత్రై తేచమహర్షయః॥
దృతకేతుర్దీప్తకేతుః పంచహస్తోనిరామయః।
పృథుశ్రవాద్యాశ్చతథాదక్షసావర్ణికాత్మజాః॥
దశమోబ్రహ్మసావర్ణిర్భవిష్యతిమునేమనుః।
సుధామానోవీరుదాశ్చశతసంఖ్యాస్తథామరాః॥
తేషమిన్ద్రశ్చభవితాశాన్తిర్నామమహాబలః।
సప్తర్షయోభవిష్యన్తియేతదాతాన్ శృణుష్వమే॥
హవిష్మాన్ సుక్రుతస్సత్యస్తపోమూర్తి స్తథాపరః।
నాభాగోప్రతిమౌజాశ్చసత్యకేతుస్తథైవచ॥
సుక్షేత్రశ్చోత్తమౌజాశ్చ భూరిషేణాదయోదశ।
బ్రహ్మసావర్ణిపుత్రాస్తు రక్షిష్యన్తి వసుంధరామ్॥
తొమ్మిదవ మన్వంతరమున దక్షసావర్ణి మనువు కాగలడు. పారులు మరీచి గర్భులు సుధర్ములు అను మూడు గణముల వారు దేవతలు. ఒక్కొక్క గణము నందు పన్నిద్దరు గలరు. మహావీరుడగు అద్భుతుడను వాడు వారికి దేవేంద్రుడు. సవనుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, వసువు, మేదాతిథి, జ్యోతిష్మంతుడు, సత్యుడు వీరు సప్తర్షులు. ధృతకేతువు పంచహస్తుడు నిరామయుడు, పృథుశ్రవుడు మున్నగు వారు దక్షసావర్ణి పుత్రులు. పదవ మన్వంతరమున బ్రహ్మసావర్ణి మనువు. సుదాములు, విశుద్ధులు నూరుగురు దేవతలు. శాంతి యనువాడు ఇంద్రుడు కాగలడు. హవిష్మంతుడు, సుకృతుడు, సత్వుడు, తపోమూర్తి, నాభాగుడు, అప్రతిమేజుడు, సత్యకేతువు సప్తర్షులు. సుక్షేత్రుడు, ఉత్తమౌజుడు, భూరిషేణుడు మున్నగు వారు పది మంది బ్రహ్మసావర్ణి పుత్రులు భూమిని రక్షింతురు.
ఏకాదశశ్చభవితా ధర్మసావర్ణికోమనుః।
విహంగమాఃకామగమా నిర్వాణారుచయస్తాథా।
గణాస్త్వేతేతథాముఖ్యాదేవానాంహిభావిష్యతామ్॥
ఏకైకస్త్రింశకస్తేషాం గణశ్చేన్ద్రశ్చవైవృషా॥
నిశ్చరశ్చాగ్ని తేజాశ్చ వపుష్మాన్ ఘృణిరారుణిః।
హవిష్మాననఘశ్పైతెభావ్యాస్సప్తర్షయస్తదా॥
సర్వత్రగస్సుధర్మాచ దేవానీకాదయస్తథా।
భవిష్యన్తిమనోస్తస్య తనయాః పృథివీశ్వారాః॥
పడునొకండవ మన్వంతరమున ధర్మసావర్ణి మనువు కాగలడు. విహంగములు వామగములు నిర్వాణులు ఋషులు అను గణములు కాబోవు దేవతలలో ముఖ్యులు. ఒక్కొక్క గణములో ముప్పది మంది యుందురు. వృషుడు దేవేంద్రుడు నిశ్చరుడు అగ్ని తేజుడు వపుష్మంతుడు ఘృణి అరుణి హవిష్మంతుడు అనఘుడు అనువారు కాబోవు సప్తర్షులు. ధర్మసావర్ణి మనువు పుత్రులు సర్వత్రగుడు సుధర్ముడు దేవానికాదులు భూపతులు.
రుద్రపుత్రస్తుసావర్ణిర్భవితాద్వాదశోమనుః।
ఋతుధామాచతత్రేన్దో భవితాశృణుమేసురాన్॥
హరితారోహితాదేవా స్తథసుమనసోద్విజ।
సుకర్మాణస్సురాపాశ్చ దశకాఃపంచవై గణాః॥
తపస్వీసుతపాశ్పైవతపోమూర్తి స్తపోరతిః।
తపోధృతిర్ద్యుతిశ్చాన్యస్సప్తమ స్తుతపోధనః।
సప్తర్షయస్త్విమేతస్య పుత్రానపి నిబోధమే॥
దేవవానుపదేవశ్చ దేవశ్రేష్ఠాదయస్తథా।
మనోస్తస్య మహావీర్యా భవిష్యన్తి సుతానృపాః॥
ద్వాదశ మనువు రుద్ర పుత్రుడగు సావర్ణి. ఋతుధాముడు దేవేంద్రుడు. హరితులు రోహితులు సుమనసులు సుకర్ములు సురాపులు అను అయిదు గణములు. ఒక్కొక్క గణమున పది మంది చొప్పున దేవతలు, తపస్వి సుతపుడు తపోమూర్తి తపోరతి తపోధృతి ద్యుతి తపోధనుడు అను సప్తర్షులు. దేవవంతుడు ఉపదేవుడు దేవాశ్రేష్ఠుడు మున్నగు మహావీర్యులగు మహారాజులు ఆ మనువు పుత్రులు.
త్రయోదశోరౌచ్యనామా భవిష్యతిమునేమనుః॥
సుత్రామాణస్సుధర్మాణస్సుకర్మాణ స్తథామరాః।
త్రయస్త్రింశద్విభేదాస్తే దేవానాంయత్రవై గణాః॥
దివస్పతిర్మహావీర్యస్తేషామిన్ద్రోభవిష్యతి॥
నిర్మోహస్తత్త్వదర్శీచ నిష్ప్రకమ్ప్యోనిరుత్సుకః।
ధృతిమానవ్యయశ్చాన్యస్సప్తమస్సుతపామునిః॥
సప్తర్షయస్త్విమేతస్య పుత్రానపినిబోధమే॥
చిత్రసేనవిచిత్రాద్యా భవిష్యన్తిమహీక్షితః॥
భౌమశ్చతుర్ధశశ్చాత్రమైత్రేయభావితామనుః।
శుచిరిన్ద్రస్సురగణాస్తతః పంచశృణుష్వతాన్॥
చాక్షుశాశ్చపవిత్రాశ్చకనిష్ఠా భ్రాజితాస్తథా।
వాచావృద్ధాశ్చవై దేవాస్సప్తర్షీనపిమేశృణు॥
అగ్నిబాహుశ్శుచిశ్శుక్రోమాగదోగ్నీ ధ్రయేవచ।
యుక్తస్తదాజితశ్చాన్యోమనుపుత్రానతశ్శృణు॥
ఊరుగమ్భీరబుద్ధ్యాద్యా మనో స్తస్యసుతానృపాః।
కథితామునిశార్దూల! పాలయిష్యన్తియేమహీమ్॥
పదమూడవ మనువు రుచి యనువాడు కాగలడు. సుత్రాములు, సుకర్ములు, సుధర్ములు అను ముప్పది మూడు బేదములు గల గణములు దేవతలు. మహావీర్యవంతుడగు దివస్పతి వారల కింద్రుడు. చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగు భూపతులు వారి పుత్రులు. పదునాల్గవ మనువు భౌముడు. ఇంద్రుడు శుచి యనువాడు. దేవతలు అయిదు గణములు. చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజములు, వాచావృద్ధులు, అనుగణములు. సప్తర్షులు అగ్నిబాహువు, శుచి, శుక్రుడు, మగధుడు, అగ్నీధ్రుడు, యుక్తుడు, జితుడు అనువారు. ఊరువు గంభీర బుద్ధి మున్నగు మనుపుత్రులైన రాజులు భూమిని పాలింతురు.
చతుర్యుగాన్తేవేదానాంజాయతేకిలవిప్లవః।
ప్రవర్తయన్తితానేత్యభువంస ప్తర్షయోదివః॥
కృతేకృతేస్మృతేర్విప్రప్రణేతాజాయతేమనుః।
దేవాయజ్ఞభుజస్తేతుయావన్మన్వన్తరంతుతత్॥
భవన్తియేమనోఃపుత్రా యావన్మన్వన్తరంహితైః।
తదన్వయోద్భవైశ్చైవ తావద్భూః పరిపాల్యతే॥
మనుస్సప్తర్షయో దేవాభూపాలాశ్చమనోస్సుతాః।
మన్వన్తరే భావన్త్యైతేశక్రశ్చైవాధికారిణః॥
నాల్గవ యుగాంతము నందు వేదములు అధ్యయనా భావముచే విప్లవము (నాశనము) కలుగును. కృతయుగాది యందు దివము నుండి సప్తర్షు లేతెంచి యుత్సన్న ప్రాయములైన వేదములను అధ్యాపనాదులచే ప్రవర్తింప జేయుదురు. ప్రతికృత యుగారంభము నందు మనువు స్మ్రుతి ప్రణేత యగును. ఆ మన్వంతర దేవతలు మన్వంతర సమాప్తి వరకు యజ్ఞ భోక్తలుగ నుందురు. ఆ మను పుత్రులు భూపాలకులుగా నుందురు. ఇట్లు మనువు సప్తర్షులు దేవతలు భూపాలకులగు మను పుత్రులు నింద్రుడు నను వీరాధికారిక పురుషులుగా నా మన్వంతరమున నేర్పబడుదురు.
చతుర్దశభిరేతై స్తుగతైర్మన్వన్తరైర్ ద్విజ।
సహస్రయుగపర్యన్తః కల్పోనిశ్శేష ఉచ్యతే॥
తావత్ప్రమాణాచనిశా తతోభవతిసత్తమ।
బ్రహ్మరూపధరశ్షేతే శేషాహావమ్బుసంప్లవే॥
త్రైలోక్యమఖిలంగ్రస్త్వాభగవానాదికృద్విభుః।
స్వమాయాసంస్థితోవిప్రసర్వభూతోజనార్దనః॥
తతః ప్రబుద్దో భగవాన్ యథాపూర్వం తథాపునః।
సృష్టింకరోత్యవ్యయాత్మాకల్పేకల్పేరజోగుణః॥
మనవోభూభుజస్సేన్ద్రా దేవాస్సప్తర్షయస్తాథా।
స్వాతికాంశస్థితికరో జగతోద్విజసత్తమ॥
చతుర్యుగేప్యసౌవిష్ణుస్స్థితివ్యాపారలక్షణః।
యుగవ్యవస్థాంకురుతేయథామైత్రేయతచ్చృణు॥
పదునాల్గు మన్వంతరములు గతింపగా సహస్రయుగ పరిమితమగు కల్పము పూర్తి యగును. అటుపిమ్మట అంత పరిమాణము గల రాత్రి యేర్పడును. సర్వేశ్వరుడు బ్రహ్మ రూపధరుడై జలప్రళయము నందు నారాయణ రూపమున శేషతల్పము నందు శయనించును. ముల్లోకముల నెల్ల తన తర్భము నందిముడ్చుకొని సర్వభూత రూపుడైన జనార్ధనుడు స్వీయమాయ (యోగ నిద్ర) యందుండును. అవ్యయాత్మయగు భగవంతుడు కల్పకల్పము నందు తిరిగి మేల్కాంచిన వాడై రజోగుణ ప్రధానుడై యథా పూర్వముగా సృష్టిని చేయుచుండును. మనువులు రాజులు ఇంద్రుడు దేవతలు సప్తర్షులు వీరందరు జగత్తు యొక్క స్థితి (ఉనికి)కి కారణమగు భగవంతుని సాత్త్వికాంశములు సాత్త్విక తనువు నాలుగు యుగము లందును విష్ణు దేవుడు లోక స్థితిలో నిమగ్నుడై యుగ వ్యవస్థను చేయు చుండును. ఎట్లనగా
కృతేయుగేపరంజ్ఞానం కపిలాదిస్వరూపధృత్।
దదాతిసర్వభూతాత్మా సర్వభూతహితేరతః॥
చక్రవర్తిస్వరూపేణత్రేతాయామపిసప్రభుః।
దుష్టానాంనిగ్రహంకుర్వన్పరిపాతిజగత్త్రయమ్॥
వేదమేకంచతుర్భాగం కృత్వాశాఖాశతైర్విభుః।
కరోతిబహుళంభూయో వేదవ్యాసస్వరూపధృత్॥
వేదాంస్తుద్వాపరేప్యస్యకలేర న్తేపునర్ హరిః।
కల్కిస్వరూపీదుర్ వృత్తాన్మార్గే స్థాపయతిప్రభుః॥
ఏవమేషజగత్సర్వం కరోతిపరిపాతిచ।
హన్తిచాన్తేఽప్యనన్తాత్మా నాస్త్యస్మాద్వ్యతిరేకియత్॥
భూతంభవ్యంభవిష్యద్యా సర్వభూతాన్మహాత్మనః।
తదాత్రాన్యత్రవావిప్రసద్భావః కథితస్తవ॥
మన్వన్తరాణ్య శేషాణి కథితానిమయాతవ।
మన్వన్తరాధిపాశ్చైవ కిమన్యత్కథయామితే॥
కృత యుగము నందు సర్వ భూతరూపుడగు నారాయణుడు సర్వభూత హతార్థియై కపిలమున్యాది రూపముల ధరించి తత్త్వజ్ఞాన మనుగ్రహించును. ఆ ప్రభువే త్రేతా యుగము నందును చక్రవర్తి స్వరూపమున దుష్టనిగ్రహము చేయుచు జగత్త్రయముల పరిపాలించును. వేద వ్యాస రూపమును ధరించి యా ప్రభువే యొక వేదమును యుగ భేదముచే నాలుగు భేదములలో నొప్పు దానిని శాఖా శతములచే విస్తరింప జేయును. ద్వాపార యుగమున వేద విధాగమును ఆ వ్యాసుడే చేయును. కలి యుగాంతమున నా శ్రీహరియే కల్కి రూపధారియై దుష్టులను సన్మార్గమున పెట్టును. ఈ విధముగ నెల్లప్పుడు సమస్త ప్రపంచమును సృజించును. హరించును. అంతకాలమున ననంతుడుగా నా శ్రీహరి యుండును. కావున గతించినది గాని వర్తమానమున నున్నది గాని రాబోవునది గాని యీ సమస్తమును సర్వ భూతమయుడగు నా పరమాత్మ కంటే భిన్నము కాదు. మైత్రేయా! నీకు ఆ పరమాత్మ యొక్క సద్భావమే ఈ ప్రకరణమున గాని మరియొక ప్రకరణమున గాని నాచే చెప్ప బడినది. మన్వంతరములు తదధిపతులు కూడ నాచే సమగ్రముగ నీకు చెప్పబడిరి. ఇంకేమి చెప్పుమందువు?
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
The origin of the future Sāvarṇi Manus through the Sañjñā-Sūrya-Chāyā narrative: Saṃjñā, unable to bear Sūrya's intense radiance, created a perfect shadow-double (Chāyā) and departed for tapas in Uttara Kuru. Chāyā bore Śrāddhadeva (Vaivasvata Manu), Śani, and Tapatī from Sūrya. Saṃjñā bore Yama, Yamī, and the Aśvins. The Sāvarṇi Manu (8th) is the son born of Sūrya by Chāyā — his name meaning "of equal complexion" (savavarṇa) with his elder half-brother Vaivasvata Manu. The Viśvakarma-Śauri reduction of Sūrya's tejas and the birth of the Aśvins in Uttara Kuru are also narrated.