విష్ణు మహా పురాణము

24 - ముచుకుందుని బదరికాగమనము

శ్రీపరాశరుడు:

ఇత్థంస్తుత స్తదాతేన ముచుకున్దేనధీమతా!

ప్రాహేశాస్సర్వభూతానామనాదినిధనోహరిః

శ్రీపరాశరుడు:

బుద్దిమంతుడగు ముచుకుందునిచే నిట్లు స్తుతింప బడి యనాదినిధనుడు సర్వ భూతేశుడు నగు హరి నిట్లనియె

శ్రీభగవానుడు:

యథాభివాఞ్చితాన్ దివ్యాన్ గచ్చలోకాన్నరాదిప

అవ్యాహతపరైశ్వర్యో మత్పసాదోపబృహితః

భుక్త్వాదివ్యాన్ మహాభోగాన్ భవిష్యసిమహాకులే

జాతిస్మరోమత్ప్రసాదా త్తతోమోక్షమవాప్స్యసి

శ్రీభగవానుడు:

ఓయీ! రాజా! నీవభీష్ట దివ్యభోగము లనుభవించి అవ్యాహతైశ్వరుడవై నా యనుగ్రహ సంపూర్ణ బలమున నుత్తమ లోకముల కేగుము. అట దివ్యభోగము లనుభవించి మహాకాల మందు బుట్టి జన్మాంతర వృత్తాంతా మెరిగి నా ప్రసాదముచే మోక్షమొందెదవు.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తః ప్రణిపత్యేశం జగతామచ్యుతం నృపః

గుహాముఖాద్వినిష్క్రాన్తస్సదదర్శాల్పకాన్నరాన్

తతః కలియుగం మత్వాప్రాప్తం తప్తుం నృపస్తవః

నరనారాయణ స్థానం ప్రయయౌ గన్ధమాదకమ్

శ్రీపరాశరుడు:

అనిన నాతడు ప్రణతుడై గుహ నుండి వెడలి యల్పాకారుల నరులంగని కలి యుగమని యెరింగి తపము సేయ నర నారాయణ స్థాతానమగు గన్ధమాదన గిరికి బదరీ క్షేత్రమునకు జనెను.

కృష్ణోపిఘాతయిత్వారిముపాఏనహితద్బలమ్

జగ్రాహమదురామేత్యహస్త్యశ్వస్యన్ధనోజ్జ్వలమ్

అనీయచోగ్రాసేనాయద్వారవత్యాంన్యవేదయత్

పరాభిభవనిశ్శంకంబభూవచయదోః కులమ్

బలదేవోఽపిమైత్రేయ! ప్రశాన్తాకిలవిగ్రహః

జ్ఞాతిదర్శనసోత్కణ్ఠః ప్రయయౌనన్దగోకులమ్

తతోగోపాంశ్చగోపీశ్చయథాపూర్వమమిత్రజిత్

తథైవాభ్యవదత్ప్రేమ్ణాబాహుమానపురస్సరమ్

సకైశ్చిత్సంపరిశ్వక్తః కాంశ్చిచ్చపరిషస్వజే

హాస్యంచక్రేసమంకై శ్చిద్గోపై ర్గోపీజనై స్తథా

ప్రియాణ్యనేకాన్యవదన్ గోపాస్తత్రహలాయుధమ్

గోప్యశ్చప్రేమకుపితాః ప్రోచుస్సేర్ ష్యమతాపరాః

కృష్ణుడును నుపాయముచే పగతుని వాని బలముం గూల్చి మథురకు వచ్చి గజతురగ పదాది సంకులమగు వాని సైన్యము స్వాధీనము చేసికొని దానిని ద్వారక యందుగ్రసేనునికి నివేదించెను. అంతట యాదవ కులము పరాభిభవశంక యే మాత్రమేని లేక హాయిగా నుండెను. మైత్రేయా! బలదేవుడు తగవులన్నియు శాంతివడ జ్ఞాతుల దర్శింప వేడ్కగొని నన్దగోకుల మేగెను. గోపీగోపాలురను మున్నట్లు బహుమాన పూర్వకముగ బలుకరించెను. ప్రేమతో కొందఱు కౌగిలించు కొనిరి. కొందరి నీతడు కౌగిలించెను. పరియాచకము లాడి కొందరితో బ్రియమ్ములాడ వారును హరింగని పెక్కు ముచ్చటలు జరిపిరి.

గోప్యః పప్రచ్చురపరా నాగరీజన వల్లభమ్

కచ్చిదా స్తేసుఖం కృష్ణశ్చల ప్రేమలవాత్మకః

అస్మచ్చేష్టామపహసన్ నకచ్చిత్పురయోషితామ్

సౌభాగ్యమానమధికం కరోతిక్షణసౌహృదః

కచ్చిత్స్మరతినః కృష్ణోగీతానుగమనం కలమ్

అప్యసౌమాతరంద్రష్టుంసకృదప్యాగమిష్యతి

అథవాకింతదాలాపైః క్రియన్తామపరాః కథాః

యస్యాస్మాభిర్వినాతేనవినాస్మాకంభవిష్యతి

పితామాతాతథాభ్రాతాభార్తాబన్ధుజనశ్చకిమ్

సంత్యక్తస్తత్క్రుతేస్మాభిరకృతజ్ఞ ధ్వజోహిసః

తథాపికచ్చిదాలాపమిహాగామానసంశ్రయమ్

కరోతికృష్ణోవక్తవ్యం భవతా రామ! నానృతమ్

దామోదరోసౌగోవిన్దః పురస్త్రీస క్తమానసః

అపేతప్రీతిరస్మాసు దుర్దర్శః ప్రతిభాతినః

ఆమన్త్రితశ్చకృష్ణే పునర్దామోదరేతిచ

జహసుస్సస్వరం గోప్యో హరిణాహృతచేతసః

సందేశై స్సామమధురైః ప్రేమగర్భైరగర్వితైః

రామేణాశ్వాసితాగోప్యః కృష్ణస్యాతిమనోహరైః

గోపైశ్చపూర్వావద్రామః పరిహాసమనోహరాః

కథాశ్చకారారేమేశ్చసహతైః వ్రజభూమిషు

గోపికలు మాత్రము ప్రణయ కుపితలై కొందరు ఈర్ష్యగొని నాగరీజన వల్లభుడు ఇచ్చకాలమారి యాకృష్ణుడు సేమమున నున్నాడు గద! పల్లె పడుచులగు మా చేష్టలు సరిపడక పురాంగనల నెరజాణ లందవిలి సౌభాగ్య గర్వమాధికముగ బెంచికొన లేదు గద!

కణమాత్రపు మెరమెచ్చు గాడతడు. వేణు గీతమున దన్ను వెంటాడిన మమ్ము స్మరించునా? మంముంజూడనైన ఒకసారి యీతడిట కరుదెంచునా? అదిగాక ఆ మాట ఎందులకు? ఒండు ముచ్చటల జెప్పుకొందము. అతడు లేక మనకు మనము లేక యతనికిం, జరుగదు కనుకనా! తండ్రి తల్లి అన్న తమ్ముడు భర్త బంధువు ననున దెల్ల వానికై వడలు కొంటిమిగద! అతడు కృతఘ్నులకెల్ల యోకపతాక. అయినను నిచటికి తిరిగి రాకను గూర్చిన మాట నీతో నోక్కమాటైన నన్నాడా! రామా! అబద్ద మాడకము. ఈ దామోదరుడు గోవిందుడు నాగరిక విలాసినులం దవిలెను. మా యెడల ప్రీతివోయినది. ఇంక దర్శనము దుర్లభమే. ఇక మాకు కనబడడని తోచును. కృష్ణా! దామోదరా! అని పిలిచి పిలిచి హరి మనసులం దొంగిల గోపికలు నవ్విరి. సామ మధురములు ప్రేమ గర్భములు గర్వ రహితములు నైన కృష్ణస్వామి సందేశములను బలరాముడు వారికి వినిపించి వారల నోదార్చెను. మునుపటివలె తోడి గోపాలురతో పరిహాస మనోహరము లగు కథలు సెప్పుచు నా వ్రజ భూములందు వారితో బలరామ మూర్తి విహరించెను.