25 - బలరామ కృత యమునాకర్షణము - పుత్రోదయము

శ్రీపరాశరుడు:

వనేవిచరత స్తస్య సహగోపైర్మహాత్మనః।

మానుషచ్చద్మరూపస్య శేషస్యధరణీధృతః॥

నిష్పాదితోరుకార్యస్య కార్యేణోర్వీప్రచారిణః।

ఉపభోగార్థమత్యర్థం వరుణః ప్రాహవారుణీమ్॥

అభీష్టసర్వదాయస్యమదిరేత్వం మహౌజసః।

అన స్తస్యోపభోగాయ తస్యగచ్చముదేశుభే॥

ఇత్యుక్తావారుణీ తేనసన్నిధాన మథాకరోత్।

బృందావనసముత్పన్న కదంబతరుకోటరే॥

విచరన్ బలదేవోఽపి మదిరాగన్ధముత్తమమ్।

ఆఘ్రాయ మదిరాతర్ష మవాపా థ వరాననః॥

తతః కదమ్భాతసహసా మద్యదారాంస లాఙ్గలీ।

పతన్తీంవీక్ష్య మైత్రేయ! ప్రయయౌపరమాం ముదమ్॥

పపౌచ గోపగోపీభి స్సమవేతో ముదాన్వితః।

ప్రగీయమానో లలితం గీతవాద్యవిశారదైః॥

స మత్తోఽత్యన్తఘర్మామ్భః కణికామౌక్తికోజ్జ్వలః।

ఆగచ్చయమునే స్నాతుమిచ్చామీత్యాహవిహ్వలః॥

శ్రీపరాశరుడు:

లీలా మానుష రూపియై గోపకులతో చరించు చున్న యాదిశేష మూర్తియగు బలరామ మూర్తి పెద్ద పెద్ద పనులు సేయుటయు కార్య నిమిత్తముగా భూమియందు సంచరించుటయుం గని వరుణ దేవుడాతని యుప భోగమునకై వారుణిం బిల్చి మదిరా! నీవెప్పుడు బలభద్రునకు మిక్కిలి యిష్టురాల వగుటం జేసి యయ్యనంతమూర్తి ఉపభోగము కొఱకు దరికేగుమన నా వారుణి యట్లు చేసెను. బలరాముడు బృందావన మందు చెట్టు తొర్రలో నివసించుచు నా మదిరా గంధ మాఘ్రణించి దానిం ద్రావ వలెనను వేడుక నందెను. ఆవ్వల కదంబ వృక్షము నుండి పడు మదిరాధారను హరి చూచి పరమానంద మొందెను. గోపగోపీ జనముతో సంగీతముల పాడుచు గంతులు వేయుచు వాద్యములు మ్రోయించుచు దీనిని త్రావెను. దాన నతడు మిగుల మత్తుగొని మిక్కిలి ఉక్కచే నొడలెల్ల జెమట గారరమ్ము యమునా స్నానము చేయ గోరెద ననెను.

తస్య వాచంనదీ సాతు మత్తోక్తా మవమత్య వై।

నాజగామ తతః క్రుద్దో హలం జగ్రాహ లాఙ్గలీ॥

గృహీత్వాతాం హలాం తేనచకర్ష మదవిహ్వాలః।

పాపే నాయాసి నాయాసి గమ్యతా మిచ్చయాఽన్యతః॥

సాకృష్ణ సహసాతేన మార్గం సంత్యజ్య నిమ్నగా।

యత్రాస్తే బలభద్రోఽసౌ ప్లవయామాస తద్వనమ్॥

శరీరిణీతదాభ్యేత్యత్రసవిహ్వాలలోచనా।

ప్రసీదేత్యబ్రవీద్రామం ముఞ్చమాం ముసలాయుధ॥

తత స్తస్యాస్తువచనమాకర్ ణ్యస హలాయుధః।

సోబ్రవీదవాజనాసి మమశౌర్యబలే నది!॥

సోఽహంత్వాంహలపాతేన నయిష్యామిసహస్రదా॥

మద్యపాన మత్తుడై ప్రేలుచున్నాడీ మాటలెక్కేమని యమునా నది యాతని మాటను తృణీకరించి దరికి రాదయ్యెను. అంతట నాతడు మదముచే విహ్వలుడై నాగలిగొని యా నదిని లాగెను. ఓ పాపాత్మురాల! నే పిలిచినా రావైతివి. శక్తియున్న యెడల నీ యిచ్చ వచ్చినట్లు మఱియొక తావునకు పోమ్మనినంత నా నదీ దేవత దారి వదలి పారి బలభద్రుడున్న వనమెల్ల ముంచియెత్తెను. శరీరము దాల్చి యయ్యెడ నాతని యెదుటికి వచ్చి జడుపునం గన్నులు విహ్వలింప దయసూపుమని ఓ ముసలాయుధా! నన్ను విడువు మనెను. ఆమె పలుకాలించి హలి, నది! నా శౌర్యముం బలము నవమానించితివి. ఈ నాగలి నడిచి నిన్ను వేయి తునుకలు గావింతును. జూడుమనియె.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తయాఽతిసంత్రాసాత్తయానద్యాప్రసాదితః।

భూభాగేప్లావితేతస్మిన్ ముమోచయమునాం బలః॥

తతస్స్నాతస్యవకాన్తిజాయతమహాత్మనః॥

అవతంసోత్పలంచారు గృహీత్వైకంచకుణ్డలమ్।

వరుణప్రహితాంచాస్మై మాలామమ్లానపఙ్కజామ్।

సముద్రాభేతథావస్త్రే నీలేలక్ష్మీరయచ్చాత॥

కృతావతం సస్సతదా చారుకుణ్డలభూషితః।

నీలామ్బరధరస్స్రగ్వీ శుశుభేకా న్తిసంయుతః॥

ఇత్థంవిభూశితోరేమేతత్రరామ స్తథావ్రజే।

మాసద్వయేనయాతశ్చసపునర్ ద్వారకాంపురీమ్॥

రేవతీం నామతనయాం రైవతస్య మహీపతేః।

ఉపయే మేబల స్తస్యాం జజ్ఞాతేనిశితోల్ముకౌ॥

అట్లనినంత మిగుల వెఱపొంది యా నది యాతని బ్రతిమాలు కొన్నంత నామెను ఆపారిన భూమిలో ఆ మేరనే వదలి పెట్టెను. అవ్వల నతడందు స్నానమాడినంత అతని కద్భుత కాంతి వచ్చెను. చక్కని కలువ పూవును వరుణునిచే పంప బడినదియగు వాడని పద్మములను సముద్రము వలె నల్లనైన రెండు వస్త్రములను లక్స్మీయాయన కిచ్చెను. చక్కని మణి కుండలములను మాలను కలువను శిరమున దాల్చి దండల నలంకరించుకొని నీలాంబరముల ధరించి చక్కని కాంతింగొని శోభించెను. ఇట్లు బలరామ మూర్తి నంద వ్రజమున రెండు మాసములు విహరించి మరల ద్వాపకాపురి కేగెను. రైవతరాజు కూతురు రేవతిం బరిణయమై బలభద్రుడు నిశితుడు ఉల్కుకుడు నను నిర్వురం బుత్రులం గనెను.