శ్రీమైత్రేయుడు:
శమ్భరేణహృతో వీరః ప్రద్యుమ్నస్సకథం మునే।
శమ్బరస్సమహావీర్యః ప్రద్యుమ్నేనకథం హతః॥
యస్తేనాపహృతః పూర్వం సకథంనిజఘానతమ్।
ఏతద్విస్తరతః శ్రోతుమిచ్చామిసకలంగురో॥
శ్రీమైత్రేయుడు:
శంబరుడు ప్రద్యుమ్నునేట్లు హరించెను? ప్రద్యుమ్నుడు వాని నెట్లు వధించెను? ఈ కథ సవిస్తరముగ నాన తిండన
శ్రీపరాశరుడు:
షష్ఠేహ్నిజాతమాత్రం తుప్రద్యుమ్నం సూతికాగృహాత్।
మమైషహ న్తేతిమునే హృతవాన్ కాలశమ్భరః॥
హృత్వాచిక్షేపచై వైనం గ్రాహోగ్రేలవణార్ణవే।
కల్లోలజనితావర్తేసుఘోరేమకరాలయే॥
పాతితస్తత్రచై వైకోమత్స్యోజగ్రాహబాలకమ్।
సమమారచతస్యాపిజఠరాగ్నిప్రదీపితః॥
మత్స్యబంధైశ్చ మత్స్యోసౌమత్స్యైరన్యైస్సహద్విజ।
ఘాతితోఽసురవర్యాయ శంభారాయనివేదితః॥
తస్యమాయావతీనామపత్నీసర్వగృహేశ్వరీ।
కారయామాససూదానామాధిపత్యమనిన్దితా॥
దారితేమస్త్యజఠరేసాదదర్శాతిశోభనమ్।
కుమారం మన్మథతరోర్ధగ్దస్యప్రథమాఙ్కురమ్॥
కోఽయం కథమయం మత్స్యజఠరే ప్రవివేశితః।
ఇత్యేవంకౌతుకావిష్టాం తన్వీం ప్రాహాథనారదః॥
అయం సమస్త జగతః స్థితి సంహార కారిణః।
శమ్భరేణహృతోవిష్ణోస్తనయస్సూతికాగృహాత్॥
క్షిప్తస్సముద్రేమత్స్యేననిగీర్ణస్తేగృహంగతః।
నరరత్నమిదంసుభ్రు! విస్రభ్దాపరిపాలయ॥
నారదేనైవముక్తాసాపాలయామాసతంశిశుమ్।
బాల్యాదేవాతిరా గేణరూపాతిశయమోహితా॥
శ్రీపరాశరుడు:
ఓ మునీ! ప్రద్యుమ్నుడు పుట్టిన యాఱవనాడు వీడు నన్ను జంపువాడని తెలిసి కాల (మృత్యుతుల్య) శంబరుడా శిశువును బురిటింటి నుండి గొంపోయి పెను మోసళ్ళతో సుడులతో భయంకరమైన సముద్ర మందు బడవేసెను. ఆ బాలు నొక చేప మ్రింగెను. ఆ చేప జఠరాగ్నికాతడు నశింపడయ్యె. జాలరు లా చేపను దక్కిన చేపలట్ల వలలో బడిన దానిని శంబరాసురునికి నివేదించిరి. ఆతని నామమాత్ర భార్యయగు మాయావతి సర్వగృహేశ్వరి కావున నా చేపను వంటవాంద్ర కందించెను. దానిం గోసి నంతట నందు అతిశోభన మూర్తి మున్ను దగ్దుడైన మన్మథుడనెడి తరువు యొక్క ప్రతమాంకుర మన్నట్లున్న కుమారుని జూచెను. వీడెవడు? చేప కడుపునా నెట్లు ప్రవేశించెను. అని యిట్లు వేడుకగోన యామాయావతిం గని నారదుడు ఈతడు సకల జగత్థ్సితి సంహార కారకుడగు విష్ణుని తనయుడు. శంబరునిచే పురిటింటి నుండి హరింప బడినవాడు. సముద్రమునం బడవేయ జేప మ్రింగగా చేప మూలమున నీ యింట బయలు వడిన వాడు. ఇదియొక్క మానవ రత్నము. విశ్వాసముతో వానిని బాలింపుము. అనవిని మాయావతి బాల్య నిమిత్తమైన యనురాగము పెంపునను వాని రూపాతిశయము వలని మోహమునను వానిం జక్కగ పెంచెను.
సయదాయౌవనాభోగభూషితోఽభూన్మహామతే।
సాభిలాషాతదాసాఽపిబభూవగజగామినీ॥
మాయావతీదాదౌతస్మై మాయాస్సర్వామహామునే।
ప్రద్యుమ్నాయానురాగాన్దా తన్న్యస్తహృదదీక్షణా॥
ప్రసజ్జన్తీంతుతాంప్రాహసకార్ ష్ణిః కమలేక్షణామ్।
మాతృత్వమపహయాద్యకిమేవం విష్ణోః హృతవాన్ కాలశమ్భారః॥
సాతస్మైకథయామాస నపుత్రస్త్వంమమేతివై।
తనయంత్వామయం విష్ణోః హృతవాన్ కాలశమ్బరః॥
క్షిప్తస్సముద్రేమత్స్యస్యసంప్రాప్తోజఠరాన్మయా।
సాహి రోదితి తేమాతా కాన్తా ద్యాప్యతివత్సలా॥
ఆతడు నిండు జవ్వనమున దీపించినంత నాగజయాన వానియంద భిలాషగలదై వానికి తాదెలిసిన సర్వమాయల నోసంగెను. ప్రద్యుమ్నుడను పేరందిన యాతనిపై ననురాగమూని వానిపైనే మనసుంజూపులు పెట్టికొనెను. ఇట్లు తనపై ఆసక్తిం జూపు నా పద్మనయనంగని కృష్ణ సుతుడు మాత్రుభావము తలగి నాయెడ నిట్లేల వర్తింతువని యడిగెను. ఆమె నీవు నాకు బుట్టిన వాడవు గావనియె. ఈ కాలశంబరుడు కృష్ణుని తనయుడ వగు నిన్ను హరించి సముద్రమునం బడవేయ చేప కడుపునం బడి నీవు దాని మూలాన నాకు లభించితివి. ఆమె నిను గన్న తల్లి నీకై యిప్పుడ డలుచును వత్సల్యాతి శయమున నేడ్చు చున్నదనియె.
శ్రీపరాశరుడు:
ఇత్యుక్తశ్శమ్బరం యుద్దే ప్రధ్యుమస్ససమాహ్వయత్।
క్రోధాకులీకృతమనా యుయుధేచమహాబలః॥
హత్వాసై న్యమశేషంతుతస్యదైత్యస్యయాదవః।
సప్తమాయావ్యతిక్రమ్య మాయాంప్రయూయుజేఽష్టమీమ్॥
తయాజఘానతం దైత్యం మాయయాకాలశమ్బరమ్।
ఉత్పత్యచతయాసార్ధమాజగమపితుః పురమ్॥
అన్తః పురేనిపతితం మాయావత్యాసమన్వితమ్।
తందృష్ట్వాకృష్ణసంకల్పాబభూవుః కృష్ణయోషితః॥
రుక్మిణీసాభావత్ప్రేమ్ణాసాసరదృష్టిరానిన్దితా।
ధన్యాయాః ఖల్వయం పుత్రోవర్తతేనవయౌవనే॥
అస్మిన్ వయసిపుత్రోమేప్రద్యుమ్నోయదిజీవతి।
సభాగ్యాజననీవత్ససాత్వయాకావిభూషితా॥
అథవాయాదృశః స్నేహోమమయాదృగ్వపుస్తవ।
హరేరపత్యం సువ్యక్తం భవాన్ వత్సభవిష్యతి॥
శ్రీపరాశరుడు:
ఈ మాటలాలించి ప్రద్యుమ్నుడు శంబరుని యుద్దమునకు ఆహ్వానించెను. క్రోధాకులుడై వానితో బోరెను. వాని సేనల గూల్చి వాని యేడు మాయల నతిక్రమించి తన యెనిమిదవ మాయాశక్తిం బ్రయోగించి యా రక్కసునిం గూల్చెను. ఆవల నా మాయావతిం గైకొని యాకసమున కేగిరి తండ్రి పురమున కేతెంచెను. మాయావతితో గూడ నంతఃపుర మందు వ్రాలిన యాతనింగని కృష్ణ భార్యలు ఇతడు కృష్ణుడే యనుకొనిరి. రుక్మిణి వానింగని ప్రేమతో కన్నీరు దొరుగ ఈ బిడ్డడే ధన్యురాలు కన్నవాడో కద! ఎలాప్రాయమున నున్నాడు. ప్రద్యుమ్నుడు జీవించి యుండెనేని ఈ యీడువాడై యుండువాడు. నీవంటి కొడుకుచే భూషితురాలైన యా తల్లి ధన్యురాలు. అది కాదు. నీపైనాకు నీ ప్రీతిని బట్టియు నీమేని కవళికలం బట్టియు నీవు హరి గన్నవాడవే. స్పష్టముగ నీవు హరి కుమారుడవై యుందు వనియె.
శ్రీపరాశరుడు:
ఏతస్మిన్నన్తరేప్రాప్తస్సః కృష్ణేననారదః।
అన్తః పురచరాందేవీం రుక్మిణీం ప్రాహహర్షయన్॥
ఏషతేతనయస్సుభ్రు! హత్వాశమ్బరమాగతః।
హృతోయేనాభవద్భలో భవత్యాస్సూతికాగృహాత్॥
ఇయం మాయావతీ భార్యాతనయస్యాస్యతేసతీ।
శమ్బరస్యనభార్యేయం శ్రూయతామత్రకారణమ్॥
మన్మథేతుగతేనాశంతదుద్భవపరాయణా।
శమ్బరం మొహయామాసమాయా రూపేణరూపిణీ॥
విహారాద్యుపభోగేషురూపంమయామయం శుభమ్।
దర్శయామాసదైత్యస్య తస్యేయం మదిరేక్షణా॥
కామోవతీర్ణః పుత్రస్తేతస్యేయందయితారతిః।
విశఙ్కానాత్రకర్తవ్యాస్ను షేయంతవశోభనే॥
తతోహర్షసమావిష్టౌ రుక్మిణీకేశవౌతదా।
నగరీచసమస్తాసా సాధుసాధ్విత్యభాషత॥
చిరంనష్టేనపుత్రేణసంగతాంప్రేక్ష్యరుక్మిణీమ్।
అవాప్యవిస్మయంసర్వో ద్వారవత్యాంతదాజనః॥
శ్రీపరాశరుడు:
ఇంతలో నారద మహర్షి కృష్ణునితో నంతఃపురమున కేతెంచి రుక్మిణీ దేవిం గని యామె నుల్లాస పరచుచు ఓ సుందరీ! వీడు నీ కొడుకు. శంబరునిం జంపి వచ్చినాడు. పురిటింట నుండి వానిచే హరింప బడిన వాడితడే. ఈమె యీనీ కుమారుని భార్య. ఈమె శంబరుని భార్య కాదు. ఇందులకు గారణము వినుము. మును మన్మథుడు గతించిన తరువాత మరల నతడు పుట్టునను గట్టి తలంపుగొని మాయా రూపమున నీ సుందరి శంబరాసురుని మొహవశుం గావించెను. వానితోడి విహారము లందు భోగము లందును తన రూపమును మాయగొని యిరురూపులం గావించి యా దైత్యుని కామాయా రూపము దర్శింప జేసెను. ఆ నీ కుమారుడా కాముడే ప్రద్యుమ్నుడి యవతరించి నాడు. అతని భార్య రతీదేవియే యీ మాయావతి. ఇందు సంశయింప వలసినది లేదు. కల్యాణి ఈమె నీ కోడలు. అనవిని రుక్మిణీ కృష్ణు లానంద భరిత మానసులైరి. నగర మెల్ల బాగుబాగని కొనియాడెను. చిర కాలమునకు గనిపించిన కొడుకు గలిసి కొన్న రుక్మిణీ దేవింగని ద్వారకంగల జనమెల్ల ఆశ్చర్య మొందెను.
Summary of chapter 27 of the Vishnu Mahā Purāṇa is as follows:
The demon Śambara, forewarned that Pradyumna will destroy him, abducts the infant from his cradle and throws him into the ocean. A large fish swallows the infant; the fish is caught and brought to Śambara's kitchen. The cook Māyāvatī — who is in fact Rati reborn, waiting for the soul of Kāmadeva — discovers the child alive in the fish's belly and raises him lovingly. Nārada reveals Pradyumna's identity to him when he comes of age. Pradyumna then kills Śambara using the eighth māyā (illusionary weapon). He returns to Dvārakā with Māyāvatī, causing initial confusion; Nārada explains to Rukmiṇī that Māyāvatī is Rati herself reunited with Kāmadeva.