శ్రీపరాశరుడు:
సర్వేషామేవభూతానాం త్రివిధః ప్రతిసంచరః।
నై మిత్తికః ప్రాకృతికః తథైవాత్యన్తికోలయః॥
బ్రాహ్మో నైమిత్తిక స్తేషాం కల్పాన్తేప్రతిసంచరః।
ఆత్యన్తికస్తుమోక్ష్యాఖ్యః ప్రాకృతోద్విపరార్ధకః॥
శ్రీపరాశరుడు:
సర్వ భూతముల యొక్కయు ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతము, 3. ఆత్యంతికము. బ్రహ్మకల్పము చివరనగునది బ్రహ్మ ప్రళయము నైమిత్తికము. ద్విపరార్థక ప్రళయము ప్రాకృతము. ఆత్యంతికము మోక్షము.
మైత్రేయుడు:
పరార్ధసంఖ్యాం భగవన్ మమాచక్ష్వయయయాతుసః।
ద్విగుణీకృతయజ్ఞేయః ప్రాకృతః ప్రతిసంచరః॥
మైత్రేయుడు:
పరార్థమను దాని సంఖ్యా వత్సరములు తెలుపుము. దానికి రెట్టింపు కాలమే ప్రాకృత ప్రళయము.
శ్రీపరాశరుడు:
స్థానాత్ స్థానందశగుణమేకస్మాద్గణ్యతేద్విజ।
తతోఽష్టాదశమేభాగే పరార్ధమభిధీయతే॥
పరార్ధద్విగుణం యత్తుప్రాకృతస్సలయోద్విజ।
తదావ్యక్తేఖిలం వ్యక్తంస్వ హేతౌలయమేతివై॥
నిమేషోమానుషోయోఽసౌ మాత్రామాత్రాప్రమాణతః।
తైః పఞ్చదశభిః కాష్ఠాత్రింశత్కాష్ఠాః కలాస్మృతః॥
నాడికాతుప్రమాణేన సాకాలాదశపఞ్చచ॥
ఉన్మానేనామ్భాసస్సాతు పలాన్యర్ధ త్రయోదశ।
మాగధేనతుమానేన జలప్రస్థస్తుసస్మృతః॥
హేమమాషైః కృతచ్చిద్రశ్చతుర్భిశ్చతురంగుళైః॥
నాడికాభ్యామథద్వాభ్యాం ముహూర్తో ద్విజసత్తమ।
అహోరాత్రం ముహూర్తా స్తుత్రిం శన్మాసోదినై స్తథా॥
మాసైర్ ద్వాదశభిర్వర్షమహోరాత్రంతుతద్దివి।
త్రిభిర్వర్షశతైర్వర్షం షష్ట్వాచై వాసురద్విషామ్॥
తేస్తూద్వాదశసహస్రైశ్చతుర్యుగముదాహృతమ్।
చతుర్యుగహసహస్రంతు కథ్యతే బ్రహ్మణోదినమ్॥
సకల్పస్తత్రమనమశ్చతుర్దశమహామునే।
తదన్తేచైవమైత్రేయబ్రాహ్మోనైమిత్తికోలయః॥
తస్యస్వరూపమత్యుగ్రం మైత్రేయ! గదతోమమ।
శృణుష్వప్రాకృతం భూయస్తవవక్ష్యామ్యహంలయమ్॥
శ్రీపరాశరుడు:
ఒక స్థానము నుండి ఇంకొక స్థానము పదిరెట్లు. అట్లు లెక్కించు కొనుచు పోగా పదునెనిమిదవ స్థానము పరార్థ మనబడును. అప్పుడు ప్రాకృత లయమగును. అపుడు వ్యక్తమైన ప్రపంచమెల్ల అవ్యక్తము నందు లయించును. మాత్రామాత్ర ప్రమాణము నిమేషము. 15 నిమేషములు 1 కాష్ఠ, ముప్పది కాష్ఠలు కల. 15 కలలు నాడిక. 2 నాడికలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 పగలు 1 రాత్రి దినము. 30 దినములు 1 మాసము. 12 మాసములు 1 సంవత్సరము. 1 మానవ సంవత్సరము దేవతలు 1 దినము. 360 మానవ సంవత్సరములు దేవతలకొక సంవత్సరము. 1200 దేవా సంవత్సరములు ఒక్క చతుర్యుగము. వేయి మహా యుగములు బ్రహ్మకొక పగలు. అదే కల్పము. అందు మనువులు పదునాల్గురు. ఆ చతుర్దశ మన్వంతరముల చివరనగు లయము నైమిత్తక ప్రళయము అదే బ్రహ్మ ప్రళయము. ఆ లయము యొక్క స్వరూపము మహా భయంకరము. వినుము. ఆ మీద ప్రాకృత ప్రలయమును దెలిపెదను.
చతుర్యుగసహస్రాన్తేక్షీణప్రాయేమహీతలే।
అనావృష్టిరాతీవోగ్రా జాయతేశతవర్షాకీ॥
తతోయాన్యల్పసారాణితానిసత్త్వాన్యశేషతః।
క్షయం యాన్తిమునిశ్రేష్ఠపార్థివాన్యనుపీడనాత్॥
తతస్సభగవాన్ విష్ణురుద్రరూపధరోఽవ్యయః।
క్ష్యయాయయతతేకర్తుమాత్మస్థాస్ససకలాః ప్రజాః॥
తతస్సభగవాన్ విష్ణుర్భానోస్సప్తసురశ్మిషు।
స్థితః పిబత్య శేషాణిజలానిమునిసత్తమ!॥
పీత్వామ్భాంసిసమస్తానిప్రాణిభూమిగతాన్యపి।
శోషం నయతి మైత్రేయ! సమస్తంపృథివీతలమ్॥
సముద్రాన్ సరితశ్శైలనదీప్రస్రవణానిచ।
పాతాళేషుచయత్తోయం తత్సర్వం నయతిక్షయమ్॥
తతస్తస్యానుభావేనతోయాహారోపబృంహితాః।
త ఏవరశ్మయస్సప్తజాయ న్తేసప్తభాస్కరాః॥
అధశ్చోర్ ద్వంచతేదీప్తాస్తతస్స ప్తదివాకరాః।
దహన్త్యశేషం త్రైలోక్యం సపాతాళతలంద్విజ॥
దహ్యమానం తుతైర్దీప్తైస్త్రైలోక్యం ద్విజభాస్కరైః।
సాద్రినద్యర్ణవాభోగం నిః స్నేహమభిజాయతే॥
తతోనిర్దగ్ధవృక్షామ్భుత్రైలోక్యమఖిలం ద్విజ।
భవత్యేషాచవసుధాకూర్మపృష్ఠోపమాకృతిః॥
తతః కాలాగ్నిరుద్రోసౌభూత్వాసర్వహరోఽనలః।
శేషాహిశ్వాససంభూతః పాతాళనిదహత్యధః॥
పాతాళానిసమస్తాని సదగ్ధ్వాజ్వలనో మహాన్।
భూమిమభ్యేత్యసకలంహిన స్తివసుధతలమ్॥
భువర్లోకం తతస్సర్వంస్వర్లోకంచసుదారుణః।
జ్వాలామాలామహావర్తస్తత్త్రైవపరివర్తతే॥
అమ్బరీషవివాభాతి త్రైలోక్యమఖిలం తదా।
జ్వాలావర్తపరీవారముపక్షీణచరాచరమ్॥
వేయి చతుర్యుగ సహస్రము, బ్రహ్మ కల్పము నందు, భూమండలము క్షీణ ప్రాయమగును. నూరేండ్లు భయంకర మయిన అనావృష్టి యేర్పడును. అల్పమైన పార్థివ ప్రాణులన్నియు నశించును. అప్పుడా భగవంతుడు విష్ణువు రుద్ర రూపము దాల్చి తన యందలి సకల ప్రజలను క్షయింప జేయజూచును. సూర్య కిరణము లేడింటను తానుండి సర్వ జలములను ద్రావివైచును. భూమి యందు ప్రాణు లందును గల జలము నట్లు త్రావి సర్వమును శోషింప జేయును. సముద్రాదు లందున్న పాతాళ మందున్న నీరంతయు ఇంకి పోవును. ఆ విష్ణువు యొక్క చేష్ట చేతనే ఉదకము నాహారించు కొన్న యా యేడు కిరనములే యేడుగురు సూర్యులగును. వారు క్రిందునకు మీదికిని గూడ వెలుంగుచు పాతాళముతో గూడ ముల్లోకములను దహింతురు అందువలన ముల్లోకములు నదులతో సముద్రములతో పర్వతములతో శోషించి పోవును. ఇవి తాబేటి వెనుడిప్ప వలె ఘనీభావ మందును. అప్పుడే ప్రళయ కాలాగ్ని రుద్రుడు సర్వహరుండై శేష సర్పము యొక్క నిశ్శ్వాసము నుండి పుట్టి క్రింది పాతాళములం గాల్చును. భూమికి వచ్చి యిదెల్లనుం దహించును. ఆ పైని భువర్లోకమును అంతరిక్షమును సువర్లోకము, ఆదిత్య మండల స్థానమును, జ్వాలామాలలచే యక్కడనే గ్రామముకొని యుండును. ముల్లోకమును నయ్యెడ స్థావర జంగమాత్మక మెల్ల జ్వాలలు గ్రమ్ముకొని కాలుచున్న అంబరీశ మట్లుండును.
తతస్తాపపరీతాస్తులోకత్రాయనివాసినః।
కృతదికారాగచ్చన్తిమహార్లోకం మహామునే॥
తస్మాదపిమహాతాపతప్తాలోకాత్తతః పరమ్।
గచ్చన్తిజనలోకంతే దశావృత్త్యాపరై షిణః॥
తతోదగ్ధ్వాజగత్సర్వం రుద్రరూపీజనార్దనః।
ముఖనిశ్వాసజాన్ మేఘాన్ కరోతిమునిసత్తమ॥
తతోగజకులప్రఖ్యాస్తటిత్వన్తోతినాదినః।
ఉత్తిష్ఠన్తితథావ్యోమ్నిఘోరాస్సం వర్తకాఘనాః॥
కేచిన్నీలోత్పలశ్యామాః కేచిత్కుముదసన్నిభాః।
ధూమ్రవర్ణాఘనాః కేచిత్కేచిత్పీతాః పయోధరాః॥
కేచిద్రాసవర్ణాభాలక్షారసనిభాస్తథా।
కేచిద్వైడూర్యాసంకాశా ఇన్ద్రనీలనిభాః క్వచిత్॥
త్రిలోక వాసులు నుడికి పోయి మహార్లోకమునకు బోవుదురు. మరొక దశలో రుద్రమూర్తియై విష్ణు విట్లు సర్వ జగమ్ముం దహించి తన ముఖ నిశ్శ్వాసములచే ఘోరము లయిన సంవర్తకములను మేఘములను సృజించును. పెద్ద యేనుగు లట్టివి ఉఱుములు, మెరుపులతో గూడినవియు నగు ప్రళయ కాల మేఘములు కొన్ని నల్ల గలువ రంగు కలవి కొన్ని తెల్ల కలువ లట్టివి కొన్ని ధూమ్ర వర్ణములు కొన్ని పచ్చనివి కొన్ని గాడిద రంగువి లక్క రంగువి వైఢూర్య వర్ణములు ఇంద్ర నీలము లట్టివి.
శఖ్ఖకున్దభాశ్చాన్యే జాత్యఞ్జననిభాః పరే।
ఇన్ద్రగోపనిభాః కేచిత్తతశ్శిఖినిభాస్తథా॥
మనశ్శిలాభాః కేచి ద్వైహరితాళనిభాః పరే।
చాషపాత్రనిభాః కేచిదుత్తిష్ఠన్తేమహాఘనాః॥
కేచిత్పురవరాకారాః కేచిద్వైహరితాళనిభాః పరే।
కూటాగారనిభాశ్చన్యే కేచిత్ స్థలనిభాషునాః॥
హాహారావామహాకాయాః పురయన్తినభస్థ్సలమ్।
వర్షన్తస్తేమహాసారా స్తమగ్నిమతిభై రవమ్॥
శమయ న్త్యఖిలం విప్ర! త్రైలోక్యక్యాన్తరదిష్ఠితమ్॥
నష్టేచాగ్నౌచసతతం వర్షమాణాహ్యహర్నిశమ్।
ప్లావయంతిజగత్సర్వమంభోభిర్మునిసత్తమ॥
ధారాభిరతిమాత్రాభిః ప్లావయిత్వాఖిలాం భువమ్।
భువర్లోకంత థైవోర్థ్ వంప్లావయన్తిహితేద్విజ॥
అన్ధకారీ కృతేలోకే నష్టేస్థావరజఙ్గమే।
వర్షన్తితేమహామేఘావర్షాణామధికం శతమ్।
ఏవంభ వతికల్పాన్తే సమస్తం మునిసత్తమ।
వాసుదేవస్యమాహాత్మ్యన్నిత్యస్యపరమాత్మనః॥
శంఖముల మొల్లపూవుల వంటివి ఆర్ద్ర పురుగుల వంటివి నెమల్ల వంటివి మణిశిల వంటివి కాటుక వంటివి అరిదళము వంటివి పాలపిట్ట ఱెక్కల వంటివి పెద్ద నగరముల పెద్ద పర్వతముల వంటివి, కూటాగారముల వంటివి స్థలము లట్టివి. యైహాహాకారములచే నాకసమును నింపి అతిభయంకర మయిన యగ్నిని వర్షించుచు త్రిజగత్తు లందలి గాలాగ్ని నెల్ల నార్పి వేయును. నిర్విరామముగ వర్షించుచు నుదకములచే లోక త్రయమును ముంచెత్తును. స్థూల ధారలచే భూమి నెల్లకాక భువర్లోకముం గూడ ముంచెత్తును. లోకమంధకార బంధురమయి చరాచర భూత కోటి నశింప నూరు సంవత్సరము లట్లేయవి వర్షించును. కల్పాంతమున నిత్యుడు మహాత్ముడగు వాసుదేవ పరమాత్ముని యొక్క మహిమచే నిట్లు జరుగును.
Summary of chapter 3 of the Vishnu Mahā Purāṇa is as follows:
Maitreya requests the teaching on cosmic dissolution. Parāśara declares that three types of pralaya govern all beings: naimittika (at the end of a kalpa), prākṛta (at the end of Brahmā's lifespan), and ātyantika (liberation of the individual jīva through jñāna). The chapter provides detailed time-measurement from nimēṣa through kalpa and up to parārdha — establishing that two parārdhas constitute Brahmā's lifespan and mark the interval of the prākṛta pralaya. The naimittika pralaya sequence begins with the description of a hundred-year drought, the seven rays of the sun becoming seven suns, pralaya-agni, and the great saṃvartaka clouds.