విష్ణు మహా పురాణము

18 - ప్రహ్లాదుని భాదించుట - తత్త్వబోధ

శ్రీపరాశరుడు:

తస్యైతాం దానవాశ్చేష్టాం దృష్ట్వాదైత్యపతే ర్భయాత్

ఆచచక్షు స్సచోవాచ సూదానాహూయ సత్వరః

శ్రీపరాశరుడు:

ఆ ప్రహ్లాదునీ రీతిని చూచి రాజు వలన భయమున రాక్షసులు రాజుతో చెప్పగా నాతడు వంట వారిని పిలిచి యిట్లు చెప్పెను.

హిరణ్యకశిపుడు:

హేసూదా! మమపుత్రో సావన్యేషామపిదుర్మతిః

కుమార్గాదేశికో దుష్టో హన్యతా మనిలమ్భితమ్

హాలాహలం విష్మచాస్య సర్వభక్ష్యే షుదీయతామ్

అవిజ్ఞాత మసౌపాపో వధ్యతాం మావిశార్యతామ్

హిరణ్యకశిపుడు:

“ఓ పాచకులారా! నా పుత్రుడు దుష్టబుద్దియై యితరులకూగూడ కుమార్గము నుపదేశించు చున్నాడు. దుష్టుడగు నీతనిని ఆలశ్యము చేయక చంపి వేయుడు. తిను పదార్ధములలో హాలాహలమును కలిపి తెలియనీయ కుండ నాతనికీయుడు. ఆలోచింప వలదు.”

శ్రీపరాశరుడు:

తే తథైవ దాదుస్తస్మై ప్రహ్లాద యమహాత్మనే

విషదానాంయథాజ్ఞప్తంపిత్రాతస్యమహాత్మనః

హాలాహల విషంఘోర మనన్తోచ్చారణేన సః

అభిమన్త్య్ర సహాన్నేన మైత్రేయ బుభుజేతదా

అవికారం సతద్భుక్త్వా ప్రహ్లాద స్స్వస్థమానసః

అనన్తఖ్యాతి నిర్వీర్యం జరయామాస దుర్విషమ్

తతస్సుదాభయత్రస్థాజీర్ణందృష్టామహావిషమ్

దైత్యేశ్వరముపాగమ్య ప్రణిపత్యేద మబ్రువన్

దైత్యరాజ విషందత్తమస్మాభిరతిభీషణమ్

జీర్ణంతచ్చ సహాన్నెన ప్రహ్లాదేన సుతేన తే

శ్రీపరాశరుడు:

రాజాజ్ఞ ననుసరించి వంటవారు మహానుభావుడగ సంకీర్తనమున విషము నిర్వీర్య మాయెను. ఆ సంగతి విని వంటవారు రాజున కెరింగింపగా రాజు తన పురోహితులతో

హిరణ్యకశిపుడు:

త్వర్యతాంత్వర్యతాంసద్యో హేహేదైత్యపురోహితాః

కృత్యంతస్య వినాశాయ హ్యుత్పాదయత మాచిరమ్

హిరణ్యకశిపుడు:

“శీఘ్రముగ కృత్యయను శక్తిని పుట్టింపు డనెను”.

శ్రీపరాశరుడు:

సకాశమాగమ్య తతః ప్రహ్లాదస్య పురోహితాః

సామపూర్వమథోచూస్తే ప్రహ్లాదంవినయాన్వితమ్

శ్రీపరాశరుడు:

పురోహితులు ప్రహ్లాదుని కడకేతెంచి సవినయముగ సామ పూర్వకముగ వినయాన్వితుడగు ప్రహ్లాడునకిట్లు చెప్పిరి.

పురోహితుడు:

జాతస్త్రైలోక్య విఖ్యాత ఆయుష్మన్ బ్రహ్మణఃకులే

దైత్యరాజస్యతనయో హిరణ్యకశిపోర్భవాన్

కిందేవైః కిమనన్తేన కిమన్యేనతవాశ్రయః

పితాసమస్త లోకానాం త్వంతథై వభవిష్యసి

తస్మాత్పరిత్యజైతాం త్వం విపక్షస్తవసంహితామ్

శ్లాఘ్యఃపితా సమస్తానాంగురూణాం పరమోగురుః

పురోహితులు:

బ్రహ్మ వంశమున పుట్టి త్రైలోక్య విఖ్యాతిగన్న దైత్యనాథుడగు హిరణ్యకశిపుని పుత్రుడవగు నీకు నితర దేవతలతో నేమి ప్రయోజనము! సర్వ లోకములకు ఆశ్రయుడైన నీ తండ్రి వలెనే నీవు కూడా కాగలవు. కావున నీవు శత్రుపక్ష ప్రశంసను మానుము. అందరిచే శ్లాఘింపబడు నీ తండ్రి గురువులకు గూడ గురువు అని పలుకగా ప్రహ్లాదుడు ఇట్లనెను.

ప్రహ్లాదుడు:

ఎవమేతన్మహాభాగా శ్శ్లాఘ్యమేతన్మహాకులమ్

మరీచేస్సాకలేప్యస్మింస్త్రైలోక్యేనాన్యథావదేత్

పితాచమమసర్వస్మిన్ జగత్యుత్కృష్టచేష్టితః

ఏతదప్యవగచ్చామి సత్యమాత్రాపినానృతమ్

గురూణామపిసర్వేషాం పితాపరమకోగురుః

యదుక్తంభ్రాన్తిరత్రాపి స్వల్పాపిహినవిద్యతే

పితాగురు ర్నసందేహః పూజనీయః ప్రయత్నతః

తత్రాపినాపరాధ్యామీత్యేవం మేమనసిస్థితమ్

యథ్త్వేతత్కిమనన్తేనేత్యుక్తో యుష్మాభి రీదృశః

కోబ్రవీతియథాయుక్తంకిన్తునైతద్వచోఽర్ధవత్

ఇత్యుక్త్వాసోఽభావన్మౌనీ తేషాంగౌరవయన్త్రితః

ప్రహస్యచపునః ప్రాహ కిమనన్తేనసాధ్వితి

సాధుభో కిమనన్తేన సాధుభోగురవోమమ

శ్రూయతాంయదనన్తేన యదిభేదం నయాస్యథ

ప్రహ్లాదుడు:

ఈ వంశము మరీచి మహాముని వంశము. చాల గొప్పది. గురువులలో తండ్రియే పరమ గురువు. పూజ్యుడు. అందు సంశయము లేదు. ఆ విషయమై నేను పొరబడను. అనంతునితో నేమి ప్రయోజనమని మీరనిన మాట నిజము కాదు. అని పలికి గురువు లందలి గౌరవముతో మౌనము వహించి నవ్వి “అనంతునిచే నేమి లాభము” అని బాగా పలికినారు. మీకు కష్టము లేనిచో ఏమి లాభమో చెప్పెద వినుడు.

ప్రహ్లాదుడు:

ధర్మార్ధకామమోక్షాఖ్యః పురుషార్ధ ఉదాహృతః

చతుష్టయమిదం యస్మాత్తస్మాచ్చకిమిదంవృథా

మరీచిమిశ్రైర్దక్షాద్యైస్తథైవాన్యైరనన్తతః

ధర్మఃప్రాప్తస్తథాచాన్యైరర్ధఃకామస్తథాపరైః

తత్తత్త్వవేదినోభూత్వాజ్ఞానధ్యానసమదిభిః

అవాపుః ముక్తిమపరేపురుషాధ్వస్తబన్దనాః

సంపదైశ్వార్యమహాత్మ్యజ్ఞానసంతతికర్మణామ్

విముక్తి(క్తే)శ్చైకథోలభ్యం(భ్యా) మూలమారాధనంహరేః

యతోధర్మార్ధకామాఖ్యంవిముక్తిశ్చఫలంద్విజాః

తేనాపికింకిమిత్యేవమనన్తేనాకిముచ్యతే

కించాత్రబహునోక్తేన భావన్తోగురవోమమ

వదన్తుసాధువాసాధువివేకోఽస్మాకమల్పకః

బహునాత్రకిముక్తేన సఏవాజగతః పతిః

సకర్తాచావికర్తాచ సంహర్తాచహృదిస్థితః

సభోక్తాభోజ్యమప్యేవంస ఏవజగదీశ్వరః

భవద్భిరేతత్ క్షన్తవ్యం బాల్యాదుక్తంతుయన్మాయా

ప్రహ్లాదుడు:

ధర్మార్ధ కామ మోక్షములు నాలుగు పురుషార్ధములు, అవి ఎవని వలన సిద్దించునో యట్టి అనంతుని వలన నేమిలాభ మనుట బాగున్నది. మరీచి దక్షుడు మున్నగు వారు అనంతుని వలననే ధర్ము పొందిరి. మరి కొందరు అర్ధమును, మరి కొందఱు కామమును పొందిరి. తత్త్వవేత్తలగు మరి కొందఱు జ్ఞాన ధ్యాన సమాదులచే ద్వాస్తమైన అజ్ఞాన బంధము గలవారై ముక్తిని పొందిరి. అనంతుడగు హరి యారాధనమే సంపత్తికి, ఇష్వర్యమునకు, మహాత్మ్యమునకు, జ్ఞానమునకు మూల కారణము, సర్వ పురుషార్ధములు. ఆ ఆరాధనమునకు ఫల భూతములు. అట్టి అనంతుని వలన ఫలమేల యనుట బాగున్నది. వేయి మాటలెల? తాము మాకు గురువులు మంచియో చెడో చెప్పండి. మా వివేకము మిక్కిలి అల్పము. ఈ విషయమై వేరు చెప్పనేల? ఆ అనంతుడే జగత్పతి. అతడే కర్త వికర్త సహర్తయు అందరి హృదయము లందు గలడు. భోక్త భోజ్యము కూడా నాతడే. ఆతడే జగదీశ్వరుడు. బాల్యముచే నేను చెప్పిన దానిని క్షమించుడు.

పురోహితులు:

దహ్యమానస్త్వ మస్మాభి రాగ్నినాబాల! రక్షితః

భూయోనవక్ష్యసీత్యేవంనైవాజ్ఞాతోస్యబుద్దిమాణ్

యద్యస్మద్వాచనాన్మోహగ్ర(గ్రా) హంనత్యక్ష్యతేభవాన్

తతఃకృత్యంవినాశాయ తవస్రక్ష్యామ దుర్మతే

పురోహితులు:

“ఇక మరల నీవిట్లు పలుకవు గదాయను భావముతో అగ్నిచే దగ్దమగు చున్న మీవు మాచే రక్షింప బడితివి. నీవింత అవివేకివని మేము తలంచ లేదు. ఈ దురాగ్రహ్మును విడువ లేని దుర్భుధ్దీ! నీ వినాశము కొఱకై కృత్యను సృజించెదము.”

ప్రహ్లాదుడు:

కః కేనరక్ష్యతే జన్తుః జన్తుఃకః కేనహన్యతే

హన్తిరక్షతిచై వాత్మాహ్యసత్సాదుసమాచరన్

కర్మణాజాయతేసర్వం కర్మైవగతిసాధనమ్

తస్మాత్సర్వ ప్రయత్నేనసాదుకర్మసమాచరేత్

ప్రహ్లాదుడు:

ఎవడెవ్వనిచే చంప బడును? ఎవనిచే రక్షింప బడును? అధర్మ మాచరించని వాడు రక్షితు డగును. సమస్తమునకు కర్మయే కారణము. కావున సర్వ ప్రయత్నములచే సత్కర్మ నాచరింప వలెను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తాస్తేనతే క్రుద్దా దైత్యరాజ పురోహితాః

కృత్యాముత్పాదయామాసుః జ్వాలామాలోజ్జ్వలాననామ్

అతిభీమ సమాసాద్యపాద న్యాసక్షతక్షితిః

శూలేనసాదుసంక్రుద్ధా తంజఘానాథవక్షసి

తత్తస్యహృదయంప్రాప్యశూలం బాలస్యదీప్తిమత్

జగామాఖణ్డితం భూమౌతత్రాపిశతధాభవత్

యత్రానపాయీభాగావాన్ హృద్యాస్తే హరిరీశ్వరః

భంగోభవతి వజ్రస్య తత్రశూలస్య కాకథా

అపాసే తత్రపాపైశ్చ పాతితా దైత్యయాజకైః

తానేవ సా జఘానాశు కృత్యా నాశంజగామచ

కృత్యయాదహ్యమానాంస్తాన్వి లోక్యసమహామతిః

త్రాహికృష్ణేత్యనన్తేతివదన్నభయావపద్యత

సర్వవ్యాపి జగద్రూప జగత్స్రష్టజనార్ధన

పాహివిప్రానిమానస్మాద్దుస్సహాన్మంత్రపావకాత్

యథాసర్వేశుభూతేషుసర్వవ్యాపీజగద్గురుః

విష్ణురేవతథాసర్వేజీవన్త్యేతే పురోహితాః

శ్రీపరాహరుడు:

ఇట్లనగనే రాజ పురోహితులు కుపితులై అతి భయంకరమైన జ్వాలా మాలలచే నొప్పుచున్న కృత్యను సృజించిరి. ఆ కృత్య పాదములతో భూమి తాడనము చేసి మహా కోపముతో ప్రహ్లాదుని హృదయమును శూలముతో గొట్టగా నా శూలము శత ఖండములుగా భగ్న మాయెను. ఎవ్వని హృదయమును ననపాయిగా హరి యుండునో అచట వజ్రమే భిన్న మగును. శూలము మాట చెప్పనేల? పాపాత్ములగు దైత్య పురోహితులచే పాప రహితుడైన ప్రహ్లాదునిపై ప్రయోగింప బడిన కృత్య వారినే చంపాను. దగ్ధ మగుచున్న వారిని చూచి ఆ బాలుడు కృష్ణా! అనంతా! రక్షింపుమని వెంట బడెను. మఱియు నిట్లనెను. సర్వవ్యాపివి! జగత్ర్సష్టవు! జగద్రూపుడవు! ఈ బ్రాహ్మణులను దుస్సహమగు మంత్రాగ్ని వలన రక్షింపుము. జగద్గురు వగు నీవే సర్వ భూతము లందు వ్యాపించి యున్నావు. కావున వీరు బ్రతుకుదురు గాక!

యథాసర్వగతంవిష్ణుం మన్యమానోఽనపాయినమ్

చిన్తయామ్యరిపక్షేఽపిజీవన్త్వేతేతథాద్విజాః

యే హన్తుమాగతా దత్తంయైర్విషం యైర్హుతాశనః

యైర్దిగ్గజైరహంక్షుణ్ణోదష్టస్సర్పైశ్చయైరహమ్

తేష్వహంమిత్రపక్షేచసమఃపాపోఽస్మినక్వచిత్

తథాతేనాద్యసత్యేన జీవన్త్వసురయాజాకః

విష్ణువగు నిన్ను సర్వత్ర అనపాయిగా నున్నట్లు భావించు చున్నాను. కావున శత్రు పక్షీయు లైనను వీరు జీవింతురు గాక! నన్ను చంప జూచినవారు విషము పెట్టిన వారు అగ్నిని నాపై

రగులు కోల్పినవారు దిగ్గజములచే త్రోక్కించిన వారు సర్పముల కరపించిన వారు వీరందరి యందు నేను సమమైన మైత్రితోనే యుంటిని.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తాస్తేన తే సర్వే సంహృష్టాశ్చనిరామయాః

సముత్తాస్థుఃద్విజాభూయ స్తం చోచుః ప్రశ్రయాన్వితమ్

దీర్ఘాయు రప్రతిహతో బలవీర్య సమన్వితః

పుత్రపౌత్రధనైశ్వర్యైర్యు క్తోవత్స భావోత్తమః

ఇత్యుక్త్వా తం తతో గత్వా యథావృత్తం పురోహితాః

దైత్యరాజాయ సకల మాచచక్షు ర్మహామునే

అని పలికిన ఆ బాలుని ఆహ్సీర్వదించిరి “వత్సా! బలవీర్యో పేతుడవై దీర్ఘాయువువై అడ్డులేని వాడవై పుత్రపౌత్ర ధనైశ్వర్యోపెతుడవై అని పలికి పురోహితులు రాక్షస ప్రభువునకు జరిగిన వృత్తంతమును నివేదించిరి.