13 - జాతకర్మాదికము

ఔర్వుడు:

సచేలస్యపితుః స్నానంజాతేపుత్రేవిధీయతే।

జాతకర్మతథాకుర్యాచ్చ్రాద్ధమభ్యుదయేచయత్॥

యుగ్మాన్ దేవాంశ్చపిత్య్రాంశ్చ సమ్యక్సవ్యక్రమాద్ద్విజః।

పూజయేద్భోజయేచ్చైవ తన్మనానాన్యమానసః॥

దధ్యక్షతై స్సబదరైః ప్రాజ్ఞుఖోదజ్ఞ్ముఖోఽపివా।

దేవతీర్థేనవై పిణ్డాన్ దద్యాత్కాయేనవానృప॥

నాన్దీముఖపితృగణ స్తేనశ్రాద్ధేనపార్థివ।

ప్రీయతేతత్తుకర్తవ్యం పురుషైస్సర్వవృద్ధిషు॥

కన్యాపుత్రవివాహేషుప్రవేశేషుచవేశ్మనః।

నామకర్మణిబాలానాంచూడాకర్మాదికేతథా॥

సీమన్తోన్నయనేచైవపుత్రాదిముఖదర్శనే।

నాన్దీముఖంపితృగణంపూజయేత్ప్రయతోగృహీ॥

పితృపూజాక్రమః ప్రోక్తోవృద్ధావేషసమాసతః।

శ్రూయతామవనీపాలప్రేతకర్మక్రియావిధిః॥

ఔర్వుడు:

కుమారుడు పుట్టగనే తండ్రి సచేల స్నానం (కట్టు బట్టతో) స్నానము చేయ వలెను. జాతకర్మను, వృద్ధి (నాందీ) శ్రాద్ధమును చేయ వలయును. మిథునములను దేవతలను, పితరులను తదేక చిత్తుడై యన్య చిత్తము లేకుండ ద్విజుడు క్రమమున పూజించి భుజింప చేయ వలయును. రాజా! తూర్పు లేక ఉత్తర దిగభి ముఖుడై రేగు పళ్ళతో గూడిన పెరుగు, అక్షతలతో పిండములను దేవతీర్థము (అంగుళ్యగ్రము)తో గాని, ప్రజాపత్యతీర్థము (కనిష్టికా మూలము) తో గాని నీయ వలయును. ఆ నాందీ (వృద్ధి) శ్రాద్ధముతో నాందీ మొదలగు పితృ గణము తృప్తి చెందును. కావున సమస్తాభ్యుదయ (వృద్ధి) కర్మలందును నాందీ శ్రాద్ధమవశ్య కర్తవ్యము. కన్యాపుత్ర వివాహము లందును గృహ ప్రవేశము లందును, నామకరణము నందును, బాలుర చూడాకర్మ (పుట్టు వెంట్రుకల తీయించుట) మున్నగు వాని యందును, సీమంత కర్మ మందును, పుత్రాది ముఖావలోకన కర్మ మందును, గృహస్తు సావధానముగా నాందీ మొదలగు పితృ గణమును పూజింప వలెను. వృద్ధి కర్మలందు చేయ దగిన పితృగణ పూజా విధానమును సంగ్రహముగ చెప్పితిని.

ప్రేతకర్మాదికము:

ప్రేతదేహంశుభైస్స్నానై స్స్నాపీతంస్రగ్విభూషితమ్।

దగ్ద్వాగ్రామాద్బహిప్స్నాత్వా సచేలస్సలిలాశయే॥

యత్రతత్రస్థితాయైతదాముకాయేతివాదినః।

దక్షిణాభిముఖాదద్యుః బాన్ధవాస్సలిలాఞ్జలిమ్॥

ప్రవిష్టాశ్చసమంగోభిఃగ్రామంనక్షత్రదర్శనే।

కటకర్మతతఃకుర్యుఃభూమౌప్రస్తరశాయినః॥

దాతవ్యోనుదినంపిణ్డఃప్రేతయభువిపార్థివ।

దివాచభక్తంభోక్తవ్యమమాంసంమనుజర్షభ॥

దినానితానిచేచ్చాతః కర్తవ్యంద్విజభోజనమ్।

ప్రేతస్తృప్తిపథాయాతి బన్ధువర్గేణభుఞ్జతా॥

ప్రథమేహ్నితృతీయేహ్నిసప్తమేనవమేతథా।

వస్త్రత్యాగబహిస్స్నానేకృత్వాదద్యాత్తిలోదకమ్॥

చతుర్థేహ్నితతఃకుర్యాదస్థిసంచయనంనృప।

తదూర్ ధ్వమంగసంస్పర్శస్సపిణ్డానామపీష్యతే॥

యోగ్యాస్సర్వక్రియాణాంతుసమానసలిలాస్తథా।

అనులేపనపుష్పాదిభోగాదన్యత్రపార్థివ॥

శయ్యాసనోపభోగశ్చ సపిణ్డానామపీష్యతే॥

భస్మాస్థిచయనాదూర్ధ్వం సంయోగోనతుయోషితామ్।

బాలేదేశాన్తరస్థేచ పతితేచమునౌమృతే।

సద్యశ్శౌచంతథేచ్చాతో జలాగ్న్మద్బన్ధనాదిషు॥

మృతబన్దోర్దశాహానికులస్యాన్నంనభుజ్యతే।

దానంప్రతిగ్రహో యజ్ఞస్స్వాధ్యాయశ్చనివర్తతే॥

విప్రస్యైతద్ద్వాదశాహం రాజన్యస్యాప్యశౌచకమ్।

అర్థమాసంతువైశ్యస్య మాసంశూద్రస్యశుద్ధయే॥

అయుజోభక్షయేత్కామంద్విజానన్తెతతోదినే।

దద్యాద్దర్భేషుపిణ్డంచప్రేతాయోచ్చిష్టసన్నిధౌ॥

వార్యాయుధప్రతోదాస్తు దణ్డశ్చద్విజభోజనాత్।

స్పృష్ఠవ్యోఽనన్తరంవర్ణైశ్శుద్ధ్యేరం స్తేతతఃక్రమాత్॥

తతస్స్వవర్ణధర్మాయే విప్రాదీనాముదాహృతాః।

తాన్కుర్వీతపురాజీవేన్నిజధర్మార్జనైస్తథా॥

మృతాహనిచకర్తవ్యమేకొద్దిష్టమతః పరమ్।

ఆహ్వానాదిక్రియాదైవనియోగరహితంహితత్॥

ఏకోర్ఘ్యస్తత్రదాతవ్యస్తథైవైకపవిత్రకమ్।

ప్రేతాయపిణ్డోదాతవ్యోభుక్తవత్సుద్విజాతిషు॥

ప్రశ్నశ్చతత్రాభిరతిః యజమానద్విజన్మనామ్।

అక్షయ్యమముకస్యేతి వక్తవ్యంవిరతౌతథా॥

ప్రేతకర్మాదికము:

ఓ రాజా! ప్రేత కర్మాచరణ విధానమును చెప్పెద వినుము. మృతుని శరీరమును శుభములగు స్నాన సాధనములతో స్నానము చేయించి మాలలతో నలంకరించి గ్రామమునకు వెలుపల దహనము చేసి సచేల (కట్టు బట్టతో) స్నానము చేసి, బంధువులు దక్షిణ దిశాముఖులై యెచటనో అచ్చట నున్న యీ గోత్ర నామములు గలవానికి చెందు గాక! అని జలాంజలుల నీయ వలెను. గోవులతో గూడ గాని, నక్షత్ర దర్శన సమయమున గాని గ్రామమును ప్రవేశించి, భూమి యందు త్రుణాది శయ్యపై పరుండుచు శవ సంబంధమైన అశౌచకృత్య మాచరింప వలయును. రాజా! ప్రేత కొఱకు ప్రతి దినము భూమిపై పిండ ప్రదానము చేయ వలయును. మాంస రహితమైన యన్నమును పగటి పూట యందు మాత్రము భుజింప వలెను. అశౌచ దినములలో తమ ఇచ్చ ననుసరించి బ్రాహ్మణ భోజనము చేయింప వలెను. బంధు జన భోజనముచే ప్రేత తృప్తి చెందును. మొదటి రోజున మూడవ రోజున నేడవ రోజున తొమ్మిదవ రోజున వస్త్ర త్యాగ బహిస్స్నానములను చేసి తిలోదకము నీయ వలెను. నాల్గవ దినమందు నస్థి సంచయనము చేయనగును. అటు పిమ్మట నపిండుల (సమస్త పురుష పర్యంతము సాపిండ్య ముండును. సాపిండ్యం సప్తపూరుషం) అంగ స్పర్శ చేయవచ్చును. సమాన సలిల (సమానోదక భావస్తు జన్మనామ్నో రావేదనే) సంధ్యోపాసనాది సర్వ కర్మల నాచరింప వచ్చును. చందన పుష్పాదుల భోగము పనికి రాదు. సంచయనానంతరము సపిండుల కూడ శయ్యాసనాది భోగము పనికి వచ్చును. స్త్రీ సంగము పనికి రాదు. బాలుడు, దేశాంతరగతుడు (అనగా మహానది గాని, పర్వతము గాని, వ్యవదానముగ నున్నను, భాష మారినను దేశాంతరగతుడు) పతితుడు, యతి, మృతుడు కాగా అట్లే కావలయునని నీరు, అగ్ని, ఉరి మొదలగు వానిచే మృతుడైనను వెంటనే శౌచము ప్రమాదమున జలాగ్నులచే చనిపోయిన యెడల అశౌచ ముండును. ఎవని బంధువు మరణించునో వాని యింట భుజించరాదు. దాన ప్రతి గ్రహములు, పంచ యజ్ఞములు, వేదాధ్యయనము వానికి లేదు. ఈ ఆశౌచము బ్రాహ్మణునకు క్షత్రయునకు పన్నెండు రోజులు, వైశ్యునకు పదునైదు రోజులు, శూద్రునకు మాసము ఉండును. చివరి రోజున విషమ సంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనము పెట్టి, ఉచ్చిష్ట సాన్నిధ్యమున దర్భల మీద ప్రేతకు పిండ ప్రదానము చేయ వలయును. బ్రాహ్మణ బోజనానన్తరము చాతుర్వర్ణ్యులు క్రమముగ నీరు, ఆయుధము, కొరడా, దండములను తాకిన యెడల శుద్దులగుదురు. పిమ్మట బ్రాహ్మణాదులకు విహితములగు ధర్మముల నాచరించ వలయును. నరుడు నిజ ధర్మములచే నార్జించిన ధనముతో జీవింప వలెను. పిమ్మట రెండవ మాసము నుండి మృత తిథినాడు ఏకోద్ధిష్టముగ ఆవాహనాదికము, దైవ నియోగము లేకుండా చేయవలెను. అందు ఏకార్ఘ్యము ఏక పవిత్రము ఎంత మంది బ్రాహ్మణులు భుజించినను ప్రేత కొఱకు నొక పిండము నీయవలెను. యజమానునకు బ్రాహ్మణుల ప్రశ్న ప్రతి వచనములు. చివరకు ఈతనికి అక్షయ్యమని చెప్పవలెను. ఇట్లు సంవత్సర పర్యంతము నేకోద్ధిష్టమయమగు ధర్మమే.

సపిండీకరణము:

ఏకోద్ధిష్టమయో ధర్మ ఇత్థమావత్సరాత్ స్మృతః।

సపిణ్డీకరణం తస్మిన్ కాలేరాజెన్ద్రతచ్చృణు॥

ఏకొద్ధిష్ట విధానేన కార్యం తదపిపార్థివ।

సంవత్సరేఽథషష్ఠేవా మాసివాద్వాదశేఽహ్నితత్॥

తిలగన్ధోదకైర్యుక్తం తత్రపాత్రచతుష్టయమ్॥

పాత్రంప్రేతస్యతత్రైకం పైత్రంపాత్రత్రయంతథా।

సేచయేత్పితృపాత్రేషు ప్రేతపాత్రంనృప! త్రిషు॥

తతః పితృత్వ మాపన్నేతస్మి ప్రేతెమహీపతే।

శ్రాద్ధధర్మైరశేషైస్తుతత్పూర్వానర్చయేత్పితౄన్॥

పుత్రః పౌత్రః ప్రపౌత్రోవా భ్రాతావాభ్రాతృసంతతిః।

సపిణ్డసంతతిర్వాపి క్రియార్హానృప! జాయతే॥

తేషామభావేసర్వేషాం సమానోదక సంతతిః।

మాతృపక్షసపిణ్డేన సంబన్ధాయేజలేనవా॥

కులద్వయేపిచోచ్చిన్నే స్త్రీభిః కార్యానృపక్రియాః।

పితృమాతృసపిండైస్తుసమానసలిలైస్తథా॥

సంఘాతాన్తస్థితైర్వాపికార్యాః ప్రేతస్యతాః క్రియాః।

ఉత్సన్నబన్ధోరిక్థాద్వాకారయేదవనీపతిః॥

సపిండీకరణము:

సపిణ్డీకరణము కూడా నేకోద్ధిష్ట విధానమున నాచరింప వలెను. సంవత్సరాంతము నందు గాని ఆరవ మాసము నందు గాని ద్వాదశాహస్సు నందు గాని చేయ వలెను. తిలగంధ జలములతో గూడిన నాలుగు పాత్రము లుంచవలెను. అందు ప్రేతకొకటి పితృ దేవతలకు మూడు. ప్రేత పాత్రను పితామహ, ప్రపితామహ పాత్రలలో కలుపు వలెను. దానిచే ప్రేత పితృత్వము నందగా నాతడు మొదలుగా గల ముగ్గురు పితృ దేవతలను సమస్త శ్రాద్ధ ధర్మములతో పూజింప వలెను. పుత్రుడు పౌత్రుడు ప్రపౌత్రుడు (ముని మనుమడు) సోదరుడు వాని సంతతి సపిండ సంతతి వీరిలో నెవరైన ఈ కర్మ చేయ నర్హుడు. వారెవ్వరూ లేని యెడల సమానోదక సంతతి (పిందముతో సంబంధము గలవారు సపిండులు జలముతో సంబంధము గలవారు సమానోదకులు) మాతృపక్ష సపిండ సంబంధులు మాతృపక్ష జల సంబంధులు ఆ రెండు కులముల వారు లేనప్పుడు స్త్రీలు చేయనగును. పితృ మాతృ సపిండ సంబంధుల చేతగాని, పితృమాతృ సమానోదక సంబంధుల చేగాని ప్రేతకు సహాధ్యాయులు సహాయులు సహా యాత్రికులు గాని ప్రేత కర్మలు చేయ నగును. బంధు రహితుడైన ప్రేత యొక్క ధనముతో భూపతి కర్మ చేయింప వలెను.

పూర్వాః క్రియామధ్యమాశ్చ తథాచైవోత్తరాః క్రియాః।

త్రిప్రకారాః క్రియాహ్యేతాస్తాసాంభేదం శృణుష్వమే॥

ఆదాహవార్యాయుధాదిస్పర్శాద్యన్తాస్తుయాః క్రియాః।

తాః పూర్వామధ్యమామాసి మాస్యేకొద్ధిష్టసంజ్ఞితాః॥

ప్రేతేపితృత్వమాపన్నే సపిణ్డీకరణాదను।

క్రియాన్తేయాః క్రియాః పైత్ర్యః ప్రోచ్యన్తేతానృపోత్తరాః॥

పితృమాతృసపిండైస్తు సమానసలిలైస్తథా।

సంఘాతాన్తగతై ర్వాపి రాజ్ఞావాధనహారిణా॥

పూర్వాః క్రియాస్తు కర్తవ్యాః పుత్రాద్యైరేవచోత్తరాః।

దౌహిత్రైర్వా నృపశ్రేష్ఠ! కార్యాస్తత్తనయైస్తథా॥

మృతాహనిచకర్తవ్యాస్త్స్రీణామప్యుత్తరాః క్రియాః।

ప్రతిసంవత్సరంరాజన్నేకోద్ధిష్టవిధానతః॥

తస్మాదుత్తరసంజ్ఞాయాః క్రియాస్తాశ్శృణుపార్థివ।

యదాయదాచకర్తవ్యావిధినాయేనవానఘ॥

పూర్వ క్రియలు, మధ్యమ క్రియలు, ఉత్తర క్రియలు అని ఈ క్రియలు మూడు విధములు. వాని బేధమును చెప్పెద వినుము. దహన ప్రభృతి ఆశౌచాంతము వరకు పూర్వ క్రియలు. నెల నెలకు ఏకొద్ధిష్ట విధితో చేయు కర్మలు, మధ్యమ కర్మలు, పేత పితృత్వము నందిన తరువాత సపిండీకరణము తరువాత చేయబడు క్రియలు ఉత్తర క్రియలు. అందు పితృ, మాతృ సపిండులచే గాని, సమానోదకులచే గాని, సంఘాతాంతర్గతులచే అనగా సహాధ్యాయ సహాయ సహయాత్రికులచే గాని, ప్రేతధనము తీసికొనిన రాజుచే గాని పూర్వ మధ్యమ క్రియలు చేయనగును. ఉత్తర క్రియలు పుత్రాదుల చేతనే చేయనగును. దౌహిత్రులచే గాని, వారి పుత్రులచే గాని ఈ ఉత్తర క్రియలు చేయనగును. మృత దినము నందు స్త్రీలకు కూడ నుత్తర క్రియలు చేయ వలెను. ప్రతి సంవత్సరము నేకోద్ధిష్ట విదానముతో చేయవలసిన యుత్తర క్రియల నే విధమున చేయ వలయునో చెప్పెద వినుము.