7 - కాలియ మర్దనము

శ్రీపరాశరుడు:

ఏకదాతువినారామం కృష్ణోబృన్దావనంయయౌ।

విచచారవృతోగో పైర్వన్యపుష్పస్రగుజ్జ్వలః॥

సజగామాథ కాళిన్ధీం లోకకల్లోల శాలినీమ్।

తీరసం లగ్న ఫేనౌఘైః హసన్తీమివసర్వతః॥

తస్యాశ్చాతిమహాభీమం విషాగ్ని శ్రితవారిణమ్।

హ్రదం కాళీయనాగస్యదదర్శాతివిభీషణమ్॥

విషాగ్నినా ప్రసరతాదగ్ధతీరమహీరుహమ్।

వాతాహతామ్బువిక్షేపస్పర్శదగ్ధవిహంగమమ్॥

త మతీవమహారౌద్రం మృత్యువక్త్రమివాపరమ్।

విలోక్యచిన్తయామాసభగవాన్మదుసూదనః॥

అస్మిన్వసతిదుష్టాత్మాకాళీ యోఽసౌవిషాయుధః।

యోమయానిర్జితతస్త్యక్త్వాదుష్టోగాచ్చేత్పయోనిధిమ్॥

తేనేయందూశితాసర్వాయమునాసాగరం గమా।

ననరైః గోధనై శ్చాపితృషార్తై రుపభుజ్యతే॥

తదస్యనాగరాజస్యకర్తవ్యోనిగ్రహోమయా।

నిస్త్రాసా స్తుసుఖంయేనచరేయుర్ వ్రజవాసినః॥

ఏతదర్ధం తులోకేఽస్మిన్నవతారః కృతోమయా।

యదేషాముత్పథస్థానాం కార్యాశాన్తిర్దురాత్మనామ్॥

తదేతన్నా తిదూరస్థం కదమ్భమురుశాఖినమ్।

అధిరుహ్యపతిష్యామిహ్రదేఽస్మిన్ననిలాశినః॥

ఒకతఱి బలరాము తోడు లేకుండ కృష్ణుడు బృందావన మేగెను. అడవి పూల మాలలు చక్కగ గై సేసి యక్కడ గోపకులతో విహరించెను. కెరటము లువ్వెత్తుగ లేవ నొడ్డుల నంటిన పెను నురుగుల నల్లన నవ్వుచున్న దా యన్నట్లున్న కాలిందిం దరిసెను. అందున మిగుల వెఱపుగొల్పు విషాగ్నుల నలము కొన్న నీటిలో కాలియుడను నాగుడున్న మహా భయంకరమైన మడుగుం గాంచెను. అతి రౌద్రము మృత్యుదేవత నోరట్లున్న యా మడుగుం జూచి భగవంతుడు మధుసూదను డెదలో నిట్లనుకొనెను. దీని యందు మహాదుష్టుడు విషయుధుడు కాలియు డున్నాడు. నాచే నోటువడి యీ దుష్టు డీమడుగు విడిచి సముద్రమున కేగ వలయును. సాగర మందు సంగమించు యమునా వానిచే దోషగ్రస్త మైనది. దప్పికగొని యావుల మందలు మానవులు దీని ననుభవింప లేకున్నారు. అందువలన నేనీ పాపఱేని నదుపునం బెట్ట వలయు వ్రజావాసులు జడుపు విడిచి యీ మడువు నందు స్వేచ్చగ సంచరింప వలయును. ఇందులకే యీ లోకమునం దేనవతార మెత్తితిని. మిడిసి పడు చెడగఱుల నవశ్య మదుపులో బెట్టి తీర వలయుం గావున నల్లదె యీ దరినున్న కదంబ తఱువెక్కి యీ గాలిమేపరి మడువులో దూకెద గాక!

శ్రీపరాశరుడు:

ఇత్థంవిచిన్త్యబధ్వాచగాఢంపరికరంతతః।

నిపపాతహ్రదేతత్రనాగరాజస్యవేగాతః॥

తేనాతిపతతాతత్రాక్షోభితస్సమహాహ్రదః।

అత్యర్థం దూరజాతాం స్తుసమసిఞ్చన్మహీరుహాన్॥

అహిదుష్టవిషజ్వాలాతప్తామ్బుపవానోక్షితాః।

జజ్వలుః పాదపాస్సద్యోజ్వాలావ్యాప్తదిగన్తరాః॥

తేస్పోటయామాసతదాకృష్ణోనాగహ్రదేభుజమ్।

తచ్చబ్దశ్రవణాచ్చాశునాగరాజోభ్యుపాగమత్॥

ఆతామ్రనయనః కోపాద్విషద్విషజ్వాలాకులై ర్ముఖైః।

వృతోమహావిషైశ్చాన్యైరురగై రనిలాశనైః॥

నాగపత్న్యశ్చశతశోహారిహారోపశోభితాః।

ప్రకమ్పితతనుక్షేపచలత్ కున్తలకాన్తయః॥

తతః ప్రవేష్టితస్సర్పైస్సకృష్ణోభోగబన్ధనైః।

దదంశు స్తేపితంకృష్ణం విషజ్వాలాకులై ర్ముఖైః॥

తంతత్రాపతితం దృష్ట్వాసర్పభోగైర్నిపీడితమ్।

గోపావ్రజముపాగమ్యచుక్రుశుశ్శోకలాలసాః॥

అని యిట్లు తలచి గట్టిగ తన వస్త్రము బిగించి కట్టుకొని శ్రీహరి చట్టననమ్మడువులో దుమికెను. పై బడిన యా బాలునిచే నా పెనుమడువు మిగుల కలగుండువడి మిక్కిలి మిక్కిలి దూరమందున్న తరువులం గూడ ముంచెత్తెను. అవి యా దుష్ట సర్ప విష జ్వాలలం గ్రాగిన నీటిగాలిం దడిసి దరినున్న చెట్లు నలుదెసలకిం మంటలు గ్రామము మండి పోయినవి. అప్పుడు కృష్ణుడా నాగుని మడువునం జబ్బలు సరచెను. దాననైన చప్పుడు విని యా సర్పరాజు మీదికి వచ్చెను. అంతట నేఱుపాఱిన గ్రుడ్లు విషజ్వాలా కులమైన ముఖములతో మహావిష సర్పములు మఱి పరివారముతో వానిం జుట్టెను. వందల కొలది యా నాగుని భార్యలు మనోహర హారములతో మేనులు వణక చెదరిన కుంతలముల కాంతులదర నా నాగుని వెంట వచ్చిరి. అవ్వల కృష్ణుడు పాముల ఫణా బంధనముల జుట్ట బడియుండెను. అవియు నాతని విష జ్వాలా కులములైన ముఖములం గఱచెను. పాము పడగల నిఱుకున బడిన యాతనింగని శోక వివశులై గోపకుల ఘోషమునకు వచ్చి యిట్లు ఘోషించిరి.

గోపాలురు:

ఏషమోహం గతః కృష్ణోమాగ్నోవైకాళియహ్రదే।

భక్ష్యతేనాగరాజేనతమాగచ్చతపశ్యత॥

తచ్చ్రుత్వాతత్రతేగోపా వజ్రపాతోపమంవచః।

గోప్యశ్చత్వరితాజగ్ముః యశోదా ప్రముఖాహ్రదమ్॥

హాహాక్వాసావితిజనోగోపీనామతివిహ్వలః।

యశోదయాసమంభ్రాన్తోద్రుతప్రస్ఖలితంయయౌ॥

నన్దగోపశ్చగోపాశ్చరామశ్చాద్భుతవిక్రమః।

త్వరితం యమునాం జగ్ముః కృష్ణ దర్శనలాలసాః॥

దదృశుశ్చాపితేతత్రసర్పరాజవశంగతమ్।

నిష్ప్రయత్నీకృతం కృష్ణం సర్వభోగవివేష్టితమ్॥

నన్దగోపోఽపినిశ్చేష్టోన్యస్యపుత్రముఖేదృశమ్।

యశోదచమహాభాగాబభూవ మునిసత్తమ॥

గోప్యస్త్యన్యారుదన్త్యశ్చదదృశుశ్శోకకాతరాః।

ప్రోచుశ్చ కేశవం ప్రీత్యాభాయకాతర్యగద్గదమ్॥

గోపాలురు:

ఇదుగో కృష్ణుడు కాళియుని మడువున మూర్ఛిల్లినాడు. నాగరాజు వీని భక్షించును. రండు రండు చూడుడు. అన విని గోపకుల పొడుగు పడినట్లా మాటవిని గోపికలును తొందర పడి యశోద మొదలగు నందఱు నమ్మడువున కేగిరి. అయ్యో అయ్యో ఎక్కడ కృష్ణుడేడి! అని మిక్కిలి విహ్వలించి యశోదతో నా గోపిక జనము సంభ్రమించి వేవేగ నడుగులు దడబడ వచ్చి యట గ్రమ్ముకొనెను. నందాదులును బలరాముడును కృష్ణుం జూడ యమున కేతెంచి సర్పరాజు వశంబున పాము పడగలం జుట్టబడి యే యత్నము సేయకున్న యాతనిం జూచిరి. యశోదయు నందుడు నిశ్చేష్టులయి బిడ్డని వంక బిక్క చూపులం జూచుచుండిరి. గోపికలు శోకించుచు దిగులు గుడిచి భయముచే గద్గద భాషణముల నిట్లు పలవింప జొచ్చిరి.

గోపికలు:

సర్వాయశోదయాసార్థం విశామోత్రమహాహ్రదమ్।

సర్పరాజస్యగన్తుమస్మాభిర్యుజ్యతేవ్రజమ్॥

దివసః కోవినాసూర్యం వినాచన్ద్రేణకానిశా।

వినావృషేణకాగావోవినాకృష్ణేనక్రోవ్రజః॥

వినాకృతానయాస్యామః కృష్ణేనానేన గోకులమ్।

అరమ్యంనాతిసేవ్యంచవారిహీనం యథాసరః॥

యత్రనేన్దీవరశ్యామకాయకాన్తిరయంహరిః।

తేనాపిమాతుర్వాసేనరతిర స్తీతివిస్మయః॥

ఉత్ఫుల్ల పంకజ దళస్పష్టకాన్తివిలోచనమ్।

అపశ్యన్తోహరిందీనాః కథం గోష్ఠెభవిష్యథ॥

అత్యన్తమధురాలాపహృతాశేషమనోరథమ్।

నహీనపణ్డరీకాక్షంయాస్యా మోనన్దగోకులమ్॥

భోగేనావేష్టితస్యాపి సర్ప రాజస్య పశ్యత।

స్మితశోభిముఖం గోప్యః కృష్ణస్యాస్మద్విలోకనే॥

గోపికలు:

యశోదతో గూడ యందఱ మీ కాళియుని మడువులో దిగెదము. మేమిక వ్రేపల్లెకుం జనుట సరిగాదు. సూర్యుడు లేని పగలు చంద్రుడు లేని రాత్రి వృషభ రాజు లేని యావులు కృష్ణుడు లేని వ్రేపల్లెయు నేమందము? ఈ కృష్ణుడు లేని గోకులము నందియు నీరు లేని మడువట్టిది. నల్లగాలువ రేకులటుల నిగనిగలాడు శ్యామలమూర్తి హరిలేని యా తల్లి యశోద గృహమున నానందము గల్గుట వింతైన విషయము. వికసించిన తామర పూరేకు వలె విశదమగు కాంతిగులుకు కన్నులు గల హరిం జూడక దీనలై యా గోష్టమునం డెటులుండ గలము? మిగుల తియ్యని పలుకులచే మా మనోరథ మెల్ల దొంగిలిన పుండరీక లోచనకుడు లేని నందగోపకులమునకు పోనేపోము. పాము పడగలం జుట్టు కొనియుచు మనలంగని చిఱునవు దొలక మన కృష్ణుని మోము యో గోపికలార తిలకింపుడు.

శ్రీపరాశరుడు:

ఇతిగోపీవచశ్శ్రుత్వారౌహిణేయోమహాబలః।

గోపాంశ్చత్రాసవిదురాన్విలోకస్తిమితేక్షణాన్॥

నన్దంచదీనమత్య ర్థంన్య స్తదృష్టింసుతాననే।

మూర్ చ్ఛాకులాం యశోదాంచ కృష్ణ మాహాత్మ్యసంజ్ఞయా॥

కిమిదం దేవదేవేశ! భావోఽయం మానుషస్త్వయా।

వ్యజ్యతేఽత్యన్తమాత్మానంకిమన న్తంనవేత్సియత్॥

త్వమేవజగతోనాభిరరాణామివసంశ్రయః।

కర్తాపహర్తాపాతాచత్త్రైలోక్యంత్వం త్రయీమయః॥

నేన్ద్రైరుద్రాగ్నివసుభిరాదిత్యై ర్మరుదశ్విభిః।

చిన్త్యసేత్వమచిన్త్యాత్మన్ సమస్తైశ్చైవాయోగిభిః॥

జగత్యర్థం జగన్నాథ! భారావతరణేచ్ఛయా।

అవతీర్ ణోసిమర్ త్యేషుతవాం శశ్చాహమగ్రజః॥

మనుష్యలీలాం భగవన్ భజతాభవతాసురాః।

విడమ్బయన్త స్త్వల్లీలాం సర్వ ఎవసహాసతే॥

అవతార్యభవాన్ పూర్వం గోకులేతుసురాఙ్గనాః।

క్రీడార్థమాత్మనః పశ్చాదవతీర్ణోసిశాశ్వత॥

అత్రావతీర్ణయోః కృష్ణగోపా ఏవహిబాన్ధవాః।

గోప్యశ్చసీదతః కస్మాదేతాన్ బన్ధూనుపేక్షసే॥

దర్శితోమానుషోభావః దర్శితం బాలచాపలమ్।

తదయం దమ్యతాం కృష్ణదుష్టాత్మాదశనాయుధః॥

శ్రీపరాశరుడు:

అని ఇట్లు పలవించు వల్ల వాంగన పలుకు విని మహాబలుడు బలరాముడు జడియుచు తన వంక చూపులు నిలిపి చూచు గోపకులను మిక్కిలి దిగులుగొని బిడ్డని మోమునం జూపు వెట్టియున్న నందుని మూర్చాకులయైన యశోదనుం జూచి కృష్ణుని మహిమ యొక్క కృష్ణుని మహిమ యొక్క గుర్తుం బట్టి, దేవదేవ! ప్రభూ! ఈ మానుష వర్తనమేల యింతగా నటింతు వేల? నీవు నిన్ననంతునిగా నెఱుంగవా? నీవే యీ జగచ్ఛక్రమున నాకులకు వలె నడిమి యధారమైన నాభివి (కేంద్రమయిన బండి కుంచము) కర్తవు హర్తవు భర్తవును నగు

వేదత్రయ మూర్తివి నీవు. నీ వింద్రాది దేవతలకు సర్వ యోగులకును భావింపనలను గాని యచింత్య స్వరూపుడవు. జగతి కొఱకు (భూదేవి ప్రార్థనమన్నించి) జగన్నాథా యామె బరువు దింపనెంచి మర్త్యలోకమున కీవు దిగి వచ్చితివి. నీ యంశమున నీ కన్నను నేను, ఓ భగవంతుడ! మనుష్యలీలల నటించు నీతో నెల్లదేవతలు నీ లీలలు ననకరించుచు నీతోగూడ యున్నారు. శాశ్వతుడ వగు నీవు మునుముందమర సుందరుల గోకులమం దవతరింప జేసి యా పైని వారితో నీ క్రీడా వినోదము కీవవతరించితివి, కృష్ణా! ఇట నవతరించిన మన యిద్దరకు జుట్టాలు గోపకులు గోపికలుం గదా! వారు బాధపడుచుండ నీ బంధుగులం గని యుపేక్షింతు వెందులకు? మాయామానుష భావము చూపితివి. బాల చాపల్యమునుం జూప బడినది. చాలునిక నీ దుష్టాత్ముని దశానాయుధుని (దంతములే యాయుధముగా గలవానిని) నాగుని దమింపుము.

శ్రీపరాశరుడు:

ఇతిసంస్మారితః కృష్ణస్స్మితభిన్నోష్ఠసంపుటః।

ఆస్పోట్య మోచయామాసస్వ దేహం భోగిబన్ధనాత్॥

అనమ్యచాపిహస్తాభ్యాముభాభ్యాం మధ్యమంశిరః।

ఆరుహ్యాభుగ్నశిరసః ప్రణనర్తోరువిక్రమః॥

ప్రాణాః ఫణేఽభవంశ్చాస్యకృష్ణస్యాంఘ్రినికుట్టనైః।

యత్రోన్నతించకురుతేననామాస్యతతశ్శిరః॥

మూర్చాముపాయయౌభ్రాన్త్యానాగః కృష్ణస్యరేచకైః।

దణ్డపాతనిపాతేనవవామరుధిరంబహు॥

తంవిభుగ్నశిరోగ్రీవమాస్యేభ్యస్స్రుతశోణితమ్।

విలోక్యకరుణంజగ్ముస్తత్పత్న్యోమధుసూదనమ్॥

శ్రీపరాశరుడు:

అని యిట్లు జ్ఞప్తి సేయబడి కృష్ణుడు చిఱునవ్వునం బెదవులు విప్పార బాహువులు చాచి చఱచి తన శరీరమును నాగబంధము నుండి విడివడం జేసెను. రెండు చేతులం బాము యొక్క నడిమి తలను వంచి వంగిన తలపై కెక్కి యమిత విక్రమమున నర్తనము సేయ నారంభించెను. కృష్ణు పాదముల తాకిడిచే నీ నాగుని తోకనున్న ప్రాణములు తలకు వచ్చినవి. దాన నా కాళియుడు తల ఎత్తినట్లెత్తి యప్పుడు వాంచెను. ఆ పడగలపై కృష్ణుడు పరిభ్రమించిన కొలది బుసలు కొట్టుచు మూర్ఛ పడిపోయెను. పెనుబడి తెల నడచినట్ల దిగిపడి మిగుల రక్తము గ్రక్కెను. తలయు మెడయు చితికిపోయి భగ్నమై మొగముల రక్తము దొఱక దమదొరంగని వాని భార్యలు కరుణామూర్తిని మధుసూదను శరణంది యిట్లనిరి.

నాగపత్నులు:

జ్ఞాతోఽసేదేవదేవేశసర్వజ్ఞస్త్వమనుత్తమః।

పరంజ్యోతిరచి న్త్యం యత్తదంశః పరమేశ్వరః॥

న సమర్థాస్సురాస్త్సోతుంయ మనన్యభవంవిభుమ్।

స్వరూపవర్ణనం తస్యకథం యోషిత్కరిష్యతి॥

యస్యాఖిలమహీవ్యోమజలాగ్నిపవనాత్మకమ్।

బ్రహ్మాణ్డమల్పకాల్పాం శస్త్సోష్యామ స్తంకథంవయమ్॥

యమతోనవిదుర్నిత్యం యత్స్వరూపంహియోగినః।

పరమార్థమణోరల్పంస్తూలాత్ స్థూలం నతాః స్మతమ్॥

నయస్యజన్మనేధాతాయస్యచాన్తాయనాన్తకః।

స్థితికర్తానచాన్యోస్తియస్యతస్మైనమస్సదా॥

కోపస్స్వల్పోఽపితేనప్తిస్థితిపాలన మేవతే।

కారణం కాళియస్యాస్యదమనేశ్రూయతాం వచః॥

స్త్రీయోఽనుకమ్ప్యాస్సాధూనాం మూఢాదీనాశ్చజన్తవః।

యతస్తతోఽస్యదీనస్యక్షమ్యతాంక్షమతాంవర!॥

సమస్తజగదాధారోభవానల్పబలః ఫణీ।

త్వత్పాదపీడితోజహ్యాన్ముహూర్తార్దేనజీవితమ్॥

క్వపన్నగోఽల్పవీర్యోఽయంకవభవాన్ భువనాశ్రయః।

ప్రీతిద్వేషౌసమోత్కృష్టగోచరౌభవతోఽవ్యయ!॥

తతః కురుజగత్య్వామిన్ ప్రసాదమవసీదతః।

ప్రాణాం స్త్యజతినాగోయం భర్తృభిక్షాప్రదీయతామ్॥

భువనేశజగన్నాథమహాపురుషపూర్వజ।

ప్రాణాం స్త్యజతినాగోయం భర్తృభిక్షాంప్రయచ్ఛనః॥

వేదాన్తవేద్యదేవేశదుష్టదైత్య నిబర్హణ।

ప్రాణాం స్త్యజతినాగోయం భర్తృభిక్షాప్రదీయతామ్॥

నాగపత్నులు కృష్ణుని వేడుకొనుట:

దేవదేవేశుడవు సర్వజ్ఞుడవు పురుషోత్తముడవు అచింత్యమగు పరంజ్యోతి యంశ స్వరూపుడవు పరమేశ్వరుడవు అని మాకు నీ వెఱుగ బడినావు. అనన్య భవుడగు ప్రభువును నిన్ను వేల్పులును స్తుతింప జాలరు. అట్టి నీ స్వరూపము నాడుది యెట్లు స్తుతి చేయగలదు? ఏనికఖిల పృథివ్యప్తేజో వాయు రాకాశములు ననంతకోటి బ్రహ్మాండములు నల్పాంశకములో అట్టి వానిని మేమేట్లు స్తుతింప గలము? యోగులేవ్వని కలరూపు నిచ్చలుం దెలియ లేరట్టి యల్పము కంటె నల్పము స్థూలము కంటె స్థూలమైన యా వస్తువునకు వినత లయ్యెదము. ఎవ్వని పుట్టువునకు ధాత, యంతమున కంతకుడు స్థితికి స్తితికర్తయు వేఱొకడు లేడట్టి వానికిదే నిత్య నమస్కారము. నీకించుకేని కినుక లేదు. ఈ కాళియుని దమనమునకు గారణము ధర్మపాలనమే. కావున దయసేసి మా విన్నప మాలింపుము. సాధువు లబలలం గనికరింతురు. జంతువులు మూఢములు దీనములునుం గావున నీ దీనుని క్షమించు వారి కధినేతవు గావున స్వామీ! క్షమింపుము. నీవు సమస్త జగదాధారుడవు. ఈ పామో అల్పబలుడు. నీ యడుగుల నలుగుడు వడి యిదె ఈ క్షణమ జీవితము వాయును. అల్ప వీర్య మీ నాగమెక్కడు? అఖిల భువన శరణ్యుడ వీవెక్కడ. ఓ అవ్యయ! నీకు ప్రీతి ద్వేషమును సమస్థాయిలో గోచరించునని. అందుచే ఓ జగత్ప్రభూ! చావకున్న వీనిపై దయ చూపుము. ఈ నాగన్న ప్రాణముల విడుచు చున్నాడు. భర్తృభిక్ష వెట్టుము. భువనేశ్వర! జగన్నాథ! మహాపురుషుల కెల్ల ముందటి వాడ! ప్రాణములు గోల్పోవు చున్నాడు. మాకు భర్తృ భిక్షవెట్టుము. వేదాంతవేద్య! వేదప్రభూ! దుష్ట దైత్యదమన! ప్రాణములం బాయుచున్నాడు. భర్తృభిక్ష వెట్టుము. అని నాగ పత్నులు పలవించుచుం బలుక,

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తేతాభిరాశ్వస్యక్లాన్తదేహోఽపిపన్నగః।

ప్రసీద దేవా దేవేతి ప్రాహవాక్యంశనై శ్శనైః॥

శ్రీపరాశరుడు:

 నొడలు బడలువడి పన్నగము దేవదేవ! ప్రసన్నుడ వగుమని మెల్లమెల్లన పలికెను.

కాళియుడు:

తవాష్టగుణమైశ్వర్యం నాథస్వాభావికం పరమ్।

నిరస్తాతిశయం యస్యతస్యస్తోష్యామికిన్న్వహమ్॥

త్వంపరస్త్వం పరస్యాద్యః పరం త్వత్తః పరాత్మక।

పరస్మాత్పరమోయస్త్వం తస్యస్తోష్యామికిన్న్యహమ్॥

యస్మాద్బ్రహ్మాచారుద్రశ్చచన్ద్రేన్ద్రమరుదశ్వినః।

వసవశ్చసహాదిత్యైస్తస్యస్తోష్యామికిన్న్వహమ్॥

ఏకావయవసూక్ష్మాం శోయస్యైతదఖిలం జగత్।

కల్పనావయవస్యాంశ స్తస్యస్తోష్యామికిన్న్వహమ్॥

సదాసద్రూపిణోయస్యబ్రహ్మాద్యాస్త్రిదశేశ్వరాః।

పరమార్థంనజాన న్తితస్యస్తోష్యామికిన్న్వహమ్॥

బ్రహ్మాద్యైరర్ చ్యతేయ స్తుగన్ధపుష్పానులేపనైః।

నన్ధనాదిసముద్భూతై స్సోఽర్ చ్యతే వాకధం మయా॥

యస్యావతారరూపాణిదేవరాజస్సదార్చతి।

నవే త్తిపరమం రూపంసోర్ చ్యతేవాకధం మయా॥

విషయేభ్యస్సమావృత్య సర్వాక్షాణిచయోగినః।

యమర్చయ న్తిధ్యానేన సోఽర్ చ్యతేవాకధం మయా॥

హృదిసంకల్ప్యయద్రూపం ధ్యానేనార్చన్తియోగినః।

భావపుష్పాదినానాథసోఽర్ చ్యతేవాకథం మయా॥

సోహంతేదేవదేవేశనార్చనాదౌస్తుతౌనచ।

సామర్ థ్యవాన్ కృపామాత్రమనోవృత్తిః ప్రసీదమే॥

సర్పజాతిరియంక్రూ రాయస్యాంజాతోఽస్మికేశవ।

తత్స్యభావోఽయమత్రా స్తినాపరాథోమమాచ్యుత॥

సృజ్యతేభవతా సర్వం తథాసంహ్రియతే జగత్।

జాతిరూపస్వభావాశ్చ సృజ్యన్తే సృజతాత్వయా॥

యథాహం భవతాసృష్టోజాత్యారూపేణచేశ్వర।

స్వభావేనచ సాధుత్వం తథేదం చేష్టితంమయా॥

యద్యన్యథాప్రవర్తేయందేవదేవతతోమయి।

న్యాయ్యోదణ్డనిపాతోవైతవై వవచనంయథా॥

తథాఽప్యజ్ఞేజగత్స్వామిన్ దణ్డం పాతితవాన్మయి।

సశ్లాఘ్యోఽయం వరోదణ్డస్త్వత్తోమేనాన్యతోవరః॥

హతవీర్యోహతవిషోదమితోఽహంత్వయాచ్యుత।

జీవితం దీయతామేకమాజ్ఞాపయకరోమికిమ్॥

కాళీయుడు:

నీ యైశ్వర్యము మష్టవిధము. అష్టైశ్వర్య సంపన్నుడవు. అది నీకు స్వాభావికము. సర్వాతిశాయి వైభవము. అట్టి వాని నేనేమి స్తుతించెదను? నీవు పరుడవు. పరమమునకు మొదలు. నీ వలననే యది పరము. పరమమున కంటె పరముడవు. నిన్నే నేమి పొగడెదను. ఈ ఎల్ల జగమెవ్వని యొక్క భాగములో భాగమో? ఆ యవయవము కూడ నిరవయవునికి కల్పనా మాత్రమో యట్టి నిన్నే నేమి స్తుతించ గలను? సత్తు అసత్తును దానయై యున్న ఎవ్వని కలరూపు బ్రహ్మాదు లెఱుంగరట్టి నిన్నే నేమి కొనియాడుదును? బ్రహ్మాదు లెవ్వని నందనవనము నందలి ఏ గంధ పుష్పాదులచే నర్చింతు రట్టి స్వామి నేనేమి యర్చింతును?

ఎవ్వని యవతార మూర్తులను దేవేంద్రుడు నిచ్చల నర్చించును ఎవ్వడెవ్వని పరమ రూపమెఱుంగ డట్టివాడు నాచే నెట్లర్చింప నగును? యోగులు సర్వేంద్రియములను విషయముల నుండి మరలించి ధ్యానముచే నెవ్వని నర్చింతు రతడు నాచే నర్చితుడగునట్లు? యోగులెవ్వని రూపమును ధ్యానముచే కల్పించు కొని భావమయ మయిన (అహింసా ప్రథమం పుష్పం) పుష్పములతో పూజింతురో వానిని నేనెట్లు పూజింతును! అట్టి నేను దేవదేవ! ప్రభూ! అర్చనాదులందు గాని స్తుతియందు గాని స్తుతియందు గాని సామర్థ్యము లేని వాడను గావున కృపా మాత్రమయిన మనోవృత్తి గలవాడవై నన్ననుగ్రహింపుము. ఈ పాపజాతి పరమక్రూర జాతి. ఇందు బుట్టినవాడను. కేశవా! ఇక్కడ యా స్వభావము (నైజము) ఉన్నది. నా చేసిన తప్పిదము లేదు. జగత్తు నీచే సృజింప బడుచున్నది. ఉపసంహరింప బడుచున్నది. సృష్టించు నీచేత జాతులు జాతుల కనుసారము లైన రూపములు స్వభావములు సృష్టింప బడును. నీచే నేనే జాతి స్వభావ రూపములచే సృష్టింప బడితినో యదే స్వభావముచే నీ సాధుత్వమున యాదేశాను గుణచేష్ట చేష్టింప బడినది. మరొక తీరున నేను ప్రవర్తింతు నేని యప్పుడు నాపయి దండపాతము నీ వచనానుసారము న్యాయము గదా! అయినను బాలుడ (అజ్ఞానిని) నా యెడ దండము వైచితి విది యితరుల చేతనైనది గాదు. నీ వలన నయినది గావున నిది యితరుల చేతనైంది గాదు. నీ వలన నయినది గావున నిది మెచ్చదగినది. (ఇది నా యదృష్టము) వీర్యము హతమయ్యె. విషము హతమయ్యె. నన్నణగ ద్రొక్కితివి. ఒక్క ప్రాణము దయసేయుము. నేనేమి సేయుడునో నన్నాన వెట్టుము. అని యిట్లు వినతుడై వినుతించి కాళియుడు విన్నవింప

శ్రీభగవానుడు:

నాత్రస్థేయంత్వయాసర్ప! కదాచిద్యమునాజలే।

సపుత్రపరివార స్త్వంసముద్రసలిలం వ్రజ॥

మత్పదానిచతేసర్పదృష్ట్వామూర్ధనిసాగరే।

 గరుడః పన్నగరిపుస్త్వయి నప్రహరిష్యతి॥

 ఇత్యుక్త్వాసర్పరాజంతంముమోచ భగవాన్ హరిః।

 ప్రణమ్యసోపికృష్ణాయ జగామపయసాం నిధిమ్॥

పశ్యతాం సర్వభూతానాం సభృత్యసుతబాన్ధవః।

సమస్తభార్యాసహితః పరిత్యజ్యస్వకం హ్రదమ్॥

గతేసర్పేపరిష్వజ్యమృతంపునరివాగతమ్।

గోపామూర్ధనిహార్దేనసిషిచుర్నేత్రజైర్జలైః॥

కృష్ణమక్లిష్టకర్మణమన్యేవిస్మతచేతసః।

తుష్టువుర్ముదితాగోపాదృష్ట్వాశివజలాం నదీమ్॥

గీయమానస్సగోపీభిశ్చరితైః సాధుచేష్టితైః।

సంస్తూయమానోగోపి శ్చకృష్ణోవ్రజముపాగమత్॥

శ్రీభగవానుడు:

ఓ సర్పమా! నీవిక్కడ నీ యమునా జలమున నెన్నడు నుండ గూడదు. సపుత్ర కళత్రముగా సముద్రము నీటి కేగుము. నీ తలపై నా పాదములం జూచి యా సాగరమందు పన్నగారి గరుడుండు నీపయి దెబ్బతీయడు అని పలికి యా సర్ప రాజమును భగవానుడు హరి వదలి పెట్టెను. అతడును కృష్ణునికి ప్రణామములు చేసి తన మడువు విడిచి సర్వ భూతములు సూచుచుండ సపత్నీ పుత్ర బంధు భృత్య పరివారముగ సముద్రమునకుం జనెను. సర్పమట్లేగ గోపకులు మృతుండు బ్రతికి వచ్చి నట్లుగా కృష్ణునిం గని కౌగిలించుకొని శిరమ్ము మూర్కొని హృదయ పూర్వకముగ నాదరించి యానంద బాష్పముల స్వామి నభిషేకించిరి. మఱియుం గలయెల్లరూ డెందముల నచ్చేరువంది పరమ మంగళోదకములం జెలంగు యమునా నదిం గని యుప్పొంగి స్వామిని నుతించిరి. గోపికలు గోపకులును కలన్వనంబుల సంగీతమ్ముల స్వామీ లీలలు కథలు చేయ్దములు గానములు సేయ వారితో కృష్ణస్వామి వ్రేపల్లెకు విచ్చేసెను.