23 - మగధ రాజ వంశము

శ్రీపరాశరుడు:

మాగధానాంబార్హద్రథానాంభావినామనుక్రమం కథయిష్యామి॥

అత్రహివంశే మహాబల పరాక్రమా జరాసంధ ప్రధానా బభూవుః॥

జరాసంధస్య పుత్రస్సహదేవః॥

సహదేవాత్సోమాపి స్తస్యానుశ్రుతశ్రవా స్తస్యాప్యయుతాయు స్తతశ్చనిరత్రస్తత్తనయస్సు నేత్రాస్తస్మాదపి బృహత్కర్మా॥

తతశ్చశ్యేనజి త్తతశ్చుతంజయ స్తతోవిప్రస్తస్యచపుత్రశ్శుచినామా భవిష్యతి॥

తస్యాపిక్షేమ్యస్త తశ్చసువ్రతస్సువ్రతాద్దర్మ స్తతస్సుశ్రవః॥

తతోధృడసేనః॥

తత్మాత్సుబలః॥

సుబలాత్సునీతోభవితా॥

తతస్సత్యజిత్॥

తస్మాద్విశ్వజిత్॥

తస్యాపిరిపుంజయః॥

ఇత్యేతేబార్హద్రథా భూపతాయో వర్షసహస్రమేకం భవిష్యన్తి॥

శ్రీపరాశరుడు:

రాబోవు బార్హద్రథులు మాగధులనబడు వారి వంశమిది. ఈ వంశమందు జరాసంధుడు మొదలుగా మహాబలశాలురు గల్గిరి. జరాసంధుడు సహదేవుడు సోమాపి అనుశ్రుతశ్రవుడు అయుతాయువు నిరమిత్రుడు సునేత్రుడు బృహత్కర్ముడు శ్యేనజిత్తు శ్రుతంజయుడు విప్రుడు శుచి క్షేమ్య సువ్రతుడు ధర్ముడు సుశ్రవుడు దృడసేనుడు సుబలుడు సునీతుడు సత్యజిత్తు విశ్వజిత్తు రిపుంజయుడు ననువారు వరుసగా తండ్రి కొడుకులు. ఈ బార్హద్రథ మగధ రాజుల వంశ మొక్క వేయి యేండ్లుండును.