24 - మౌర్యశుంగ ఆంధ్ర ఆభీర నాగ వంశములు

శ్రీపరాశరుడు:

యోఽయం రిపుంజయో నామబార్హద్రథోఽన్త్యః తస్యామాత్యః మునికోనామ భవిష్యతి॥

సచై నంస్వామినంహత్వా స్వపుత్రంప్రద్యోతనామానభిషేక్ష్యతి॥

తస్యాపిబలాకనామా పుత్రో భవితా॥

తతశ్చవిశాఖయూపః॥

తత్పుత్రో జనకః॥

తస్యచనన్దివర్ధనః॥

తతోనన్దీ॥

ఇత్యేతేఽష్ట త్రింశ దుత్తరమష్టశతంపంచ ప్రద్యోతాః పృథివీంభోక్ష్యన్తి॥

తతశ్చ శిశునాభః॥

తత్పుత్రః కాకవర్ణో భవితా॥

తస్యచ పుత్రః క్షేమధర్మా॥

తస్యాపిక్షతౌజాః॥

తత్పుత్రోవిధిసారః॥

తతశ్చాజాత శత్రుః॥

తస్మాదర్బకః॥

తస్మాచ్చోదయనః॥

తస్యాపినన్దివర్ధనః॥

తతోమహానన్దీ॥

ఇత్యేతేశ్తే శునాభాభూపాలా స్త్రీణివర్షశతానిద్విషష్ట్యధికాని భవిష్యన్తి॥

శ్రీపరాశరుడు:

బార్హద్రథులలో చివరి వాడు రిపుంజయుడను వాని మంత్రి మునికుడు రాజుం జంపి తన కొడుకగు ప్రద్యోతనుని పట్టాభిషేకము సేయును. వాని నుండి తండ్రి కొడుకులగు బలాక విశాఖయూప జనక నందివర్ధన నంది ప్రభృతులు ఎనిమిది వందల నలుబది మూడుమంది ప్రద్యోతులు భూపతులగుదురు. అక్కడ నుండి తండ్రి కొడుకులగు కాకవర్ణ, శిశునాభుడు, క్షేమధర్మ, క్షతౌజులు, విధిసార, అజాతశత్రు, అర్భక, ఉదయనందివర్ధన మహానందులు శైశునాథులు మూడు వందల యరువది రెండేండ్లు పాలింతురు.

మహానన్దిన స్తతోశూద్రాగర్భోర్భవోఽతిలుబ్ధోఽతిబలోమహాపద్మోనన్దనామా పరశురామ ఇవాపరోఽఖిలత్రన్తకారీభవిష్యతి॥

తతః ప్రభృతిశూద్రాభూపాలాభవిష్యన్తి॥

సచై కచ్చత్రామనుల్లఙ్ఘితశాసనోమహాపద్మః పృథివీం భోక్ష్యతి॥

తస్యాప్యష్టౌసుతాస్సుమాల్యద్యాభావితారః॥

తస్యమహాపద్మస్యాను పృథివీంభోక్ష్యన్తి॥

మహాపద్మపుత్రాశ్చై కంవర్షశతమవపతయోభవిష్యంతి॥

తతశ్చనవచైతాన్నన్దాన్ కౌటిల్యో బ్రాహ్మణస్సముద్దరిష్యతి॥

తేషామభావేమౌర్యాః పృథివీంభోక్ష్యన్తి॥

కౌటిల్య ఏవచన్ద్రగుప్తముత్పన్నం రాజ్యేభిషేక్ష్యతి॥

తస్యాపిపుత్రోబిన్దుసారోభవిష్యతి॥

తస్యాప్యశోకవర్ధనస్తత స్సుయశాః తతశ్చ దశరథతశ్చసం తస్తత శ్శాలిశూక స్తస్మా త్సో మశర్మాతస్యాపిసోమ శర్మణశ్శతధన్వా॥

తస్యానుబృహద్రథనామాభావితా॥

ఏవమేతేమౌర్యా దశభూపతయోభవిష్యన్తి అబ్దశతం సప్తత్రింశదుత్తరం తేషామన్తే

పృథివీందశశుఙ్గాభోక్ష్యన్తి॥

మహానందికి శూద్రస్త్రీ యందు అతిలుబ్దుడు అతి బలుడునగు మహాపద్మనందు డనువాడు అపర పరశురాముడట్లు అఖిల క్షత్రాంతము సేయును. అటునుండి శూద్రరాజులు వత్తురు. ఆ మహాపద్ముడు అనుల్లంఘ్య శాసనుడై యేకచ్చత్రముగ నీ పృథివి ననుభవించును. వానికెనమండ్రు కొడుకులు సుమాలి మొదలయిన వారు. అతని తర్వాత భూపతులగుదురు. వారీభూమిని నూరేండ్లనుభవింతురు. అవ్వల నిందు నవనందులను కౌటిల్యుడను బ్రాహ్మణు డుద్దిరించును. వారయి పోయిన తర్వాత మౌర్యులు పాలిన్తురు. కౌతిల్యుడే బుట్టియున్న చంద్రగుప్తుని రాజ్యమందు పట్టాభిషేకము సేయును. అతనికి బిందుసారుడు కల్గును. అతని నుండి అశోకవర్దనుడు సుయశుడు దశరథుడు సంయుతుడు శాలిశూకుడు సోమశర్మ శతధన్వుడు బృహద్రథుడు ననువారు పదిమంది తండ్రి కొడుకులు మౌర్యులు రాజులగుదురు. నూట ముప్పది యేడేండ్లు పాలింతురు. వీరి తర్వాత పదిమంది శుంగరాజు లేలుదురు.

పుష్యమిత్రస్సేనాపతిస్స్వామినం హత్వారాజ్యం కరిష్యతి॥

తస్యాత్మజోఽగ్నిమిత్రః॥

తస్మాత్సుజ్యేష్ఠస్తతోవసుమిత్ర స్తస్మాదప్యుఙ్కస్తతః పుళిన్దక స్తతోఘోశవసు రస్మాదపి వజ్రమిత్ర స్తతోభాగవతః॥

తస్మాద్దేవభూతిః॥

ఇత్యేతేశుఙ్గాద్వాదశోత్తరం వర్షశతం పృథివీం భోక్ష్యన్తి॥

తథా కణ్వా నేషాభూ ర్యాస్యతి॥

దేవభూతింతుశుఙ్గరాజానం వ్యవసినంతస్యైవామాత్యః కణ్వోవసుదేవనామా తంనిహత్యస్వయమవానిం భోక్ష్యతి॥

తస్యపుత్రోభూమిస్తస్యాపి నారాయణః॥

నారాయణాత్మజస్సుశర్మా॥

ఏతేకాణ్వాయనాశ్చత్వారః పఞ్చచత్వారింశద్వర్షాణి భూపతాయోభవిష్యన్తి॥

సుశర్మాణం తుకాణ్వం తద్భృత్యోబలిపుచ్చకనామాహత్వా ఽన్ద్రజాతీయోవసుధాం భోక్ష్యతి॥

తతశ్చకృష్ణనామాత్రద్భ్రాతా పృథివీపతిర్భావిష్యతి॥

తస్యాపిపుత్రశ్శాన్తకర్ణి స్తస్యాపిపూర్ణోత్సఙ్గ స్తత్పుత్రశ్శాతకర్ణి స్తస్మాచ్చలమ్బోదర స్తస్మాచ్చపిలక స్తతోమేఘస్వాతి స్తతః పటుమాన్॥

తతశ్చారిష్టకర్మాతతోహాలాహలః॥

హాలాహలాత్పలలక స్తతః పులిన్దసేన స్తతస్సున్దర స్తతశ్శాతకర్ణి స్తతశ్శివస్వాతి స్తతశ్చగోమతి పుత్ర స్తత్పుత్రోళిమాన్॥

తస్యాపిశాన్తకర్ణిస్తతశ్శివశ్రీ స్తతశ్చశివస్కన్దస్తస్మాదపి యజ్ఞశ్రీస్తతో ద్విజయజ్ఞ స్తస్మాచ్చన్ద్రశ్రీః॥

తస్మాత్సులోమాపిః॥

ఏవమేతేత్రిం శచ్చత్వార్యబ్దశతాని షట్పఞ్చాశదదికకానిపృథివీం భోక్ష్యన్తి॥

ఆన్ద్రభృత్యాస్సప్తాభీరప్రభృతయః దశగర్దభినశ్చభూభుజోభవిష్యన్తి॥

తతష్షోడశభూపతయో భవితారః॥

సేనాధిపతి యగు పుష్యమిత్రుడు రాజుం జంపి రాజగును. వాని కొడుకు అగ్నిమిత్రుడు సుజ్యేష్టుడు వసుమిత్రుడు ఉదంకుడు పులిందకుడు ఘోషవసువు వజ్రమిత్రుడు భాగవతుడు దేవభూతి అను నీ శుంగరాజులు నూటపండ్రేండ్లేలుదురు. ఆ మీద కణ్వులనీ భూమిచేరును. శుంగరాజగు దేవభూతి వ్యసన లోలుడైనంత నాతని మంత్రి కణ్వుడు వశుదేవుడను వాడు వానింజంపి తాను భూపతి యగును. వాని కొడుకు భూమిత్రుడు వాని

కొడుకు నారాయణుడు వాని కొడుకు సుశర్మ. ఈ నల్గురు కాణ్వులు నలుబది యైదేండ్లు పాలింతురు. సుశర్మ యను కాణ్వుని వాని నౌకరు బలిపుచ్ఛకుడను వాడు భూమి ననుభవించును. వీడాంద్రుడు. వాని తమ్ముడావల కృష్ణుడను వాడు పృథివీపతి యగును. వాని నుండి శాన్తకర్ణిపూర్ణోత్సంగుడు శాతకర్ణి లంబోదరుడు పిలకుడు మేఘస్వాతి పటువంతుడు అరిష్ట కర్ముడు హాలాహలుడు పలలకుడు పులిందసేనుడు సుందరుడు శాతకర్ణి శివస్వాతి గోమతిపుత్రుడు వాని కొడుకు అలిమంతుడు శాంతకర్ణి శివశ్రీ శివస్కందుడు యజ్ఞశ్రీ ద్విజుజ్ఞుడు చంద్రశ్రీ సులోమాపియను తండ్రి కొడుకులు ముప్పది మంది నాలుగు వందల యేబది యారేండ్లు మించి భూమి ననుభవింతురు. ఆంధ్రభృత్యులు ఏడుగురా భీరాదులు గర్దభులు పదిమంది రాజులగుదురు. ఆ మీద షోడశ రాజులు (16గురు) రాజు లగుదురు.

తతశ్చాష్టౌయవనాశ్చతుర్దశతురుష్కాముణ్డాశ్చత్రయోదశ ఏకాదశమౌనా ఏతేవై పృథివీపతయో పృథివీం దశవర్షశతానినవత్యధికానిభోక్ష్యన్తి॥

తతశ్చమౌనా ఏకాదశభూపతయోఽబ్దశతాని త్రీణిపృథివీంభోక్ష్యన్తి॥

తేషూత్సన్నేషుపునః కైంకిలాయవనా భూపతయో భవిష్య న్త్యమూర్దాభిషిక్తాః॥

తేషామపత్యం విన్ద్యశక్తిస్తతః పురంజయ స్తస్మాద్రామచన్ద్రస్తస్మాదర్మవర్మా తతోవఙ్గస్తతోభూన్నన్ద నస్తతస్సునన్దీతద్భ్రాతానన్దియశాశ్శుక్రః ప్రవీర ఏతేవర్షశతం షడ్వర్షాణి భూపతయో భవిష్యన్తి॥

తతస్తత్పుత్రాస్త్రయోదశై తేబాహ్లికశ్చత్రయః॥

తతః పుష్యమిత్రాః పటుమిత్రాస్త్రయోదశై కలాశ్చసప్తాన్ద్రాః॥

తతశ్చకోసలాయాంతు నవచైవ భూపతాయో భవిష్యన్తి॥

నైషథాస్తుత ఏవ॥

మాగధాయాంతు విశ్వస్ఫాటిక సంజ్ఞోఽన్యాన్ వర్ణాన్ కరిష్యతి॥

కైవర్తపటువుళిన్దబ్రాహ్మణాన్ రాజ్యేస్థాపయిష్యతి॥

అటుపై యవను లెనమండుగురు పదునల్గురు తురుష్కులు పద ముగ్గురు ముండులు మేనులు పదనొకండుగురు భూపతులు భూమిని పదివందల తొంబదియేండ్ల నుభవింతురు. పిమ్మట మేనులు పదునొకండుగురు రాజులు మూడు వందల సంవత్సరములు భూమి ననుభవింతురు. వారు తొలగింప బడిన తర్వాత కైంకిలులును యవనులు పట్టాభిషేకము పొందనివారు భూపతు లగుదురు. వారి సంతతి వింధ్యశక్తి పురంజయుడు రామచంద్రుడు ధర్మవర్మ వంగుడు నందనుడు సునంది వాని తమ్ముడు నందియశుడు శుక్రుమి ప్రవీరుడు ననువారు నూటయారెండ్లు భూపతు లగుదురు. అటుపై వారి కొడుకులు పదుముగ్గురు. బాహ్లికులు ముగ్గురు వారి తర్వాత పుష్యమిత్ర పటుమిత్రులు పదముగ్గురు ఏకలులు ఏడుగు రాంధ్రులు పాలింతురు. కోసల యందు తొమ్మండుగురు రాజులగుదురు. నైషధులును వారే. మాగధయందు విశ్వస్ఫాటికుడను వాడు వర్ణములను మార్చును. కైవర్త పటుపులింద బ్రాహ్మణులను రాజ్యము నందు నిల్పును.

ఉత్సాద్యాఖిలక్షత్రజాతిం నవనాగాః పద్మవత్యాం నామపుర్యామను గఙ్గాప్రయాగంగయాద్గుప్తాంశ్చ మాగదాభోక్ష్యన్తి॥

కోసలాన్ద్రాపుణ్డ్రతామ్రలి ప్తసమతటపురీంచదేవరక్షితోరక్షితా॥

కళిఙ్గమహిషమహేన్ద్రభౌమాన్ గుహా భోక్ష్యన్తి॥

నైషధ నైమిషికకాలకోశకాన్ జానపదాన్ మణిధాన్యకవంశ్యాభోక్ష్యాన్తి॥

త్రైరాజ్యమూషికజానపదాన్ కనకాహ్వయో భోక్ష్యతి॥

సౌరాష్ట్రావన్తిశూద్రాభీరాన్ నర్మదామరుభూవిషయాంశ్చ వ్రాత్యద్విజాభీర శూద్రాద్యాభోక్ష్యన్తి॥

సిన్దుతటదావికోర్వీచన్ద్రభాగాకాశ్మీర విషయాంశ్చ వ్రాత్యమ్లేచ్చశూద్రాడయోభోక్ష్యన్తి॥

ఏతేచతుల్యకాలాస్సర్వే పృథివ్యాంభూభుజో భవిష్యన్తి॥

క్షత్రజాతి నంతను లేపివేసి నవనాగులు పద్మావతి యను పురమందు గయా నుండి గంగా ప్రయాగ ప్రాంతము నంటిన భూమిని మాగధు లనుభవింతురు. కోసలాంధ్ర పుండ్రాతామ్రలిప్తసమతట పురమును దేవరక్షితుడు పాలించును. కళింగమాహిష మహేంద్ర భౌమము లను గుహు లనుభవింతురు. నైషధ నైమిషకకాలకోశకములను జనపదములను మణిధాన్యక వంశ్యు లనుభవింతురు. త్రైరాజ్యముషికములను జనపదములను కనకుడు భుజించును. సౌరాష్ట్ర అవంతి (ఉజ్జయిని) శూద్ర అభీరములను నర్మదా మరుభూములందలి దేశములను వ్రాత్యద్విజులు అభీరశూద్రాదు లనుభవింతురు. సిందుతట దావికోర్వీ చంద్రభాగా కాశ్మీర దేశములను వ్రాత్యమ్లేచ్చ శూద్రాదులను వీరందరు సమకాలికులు గానే భూపతు లగుదురు.

అల్పప్రసాదాబృహత్కోపాస్సార్వకాలమనృతాధర్మరుచయః స్త్రీబాలగోవధకర్తారః పరస్వాడానరుచయోఽల్పసారాస్థాస్రప్రాయా ఉదితాస్తమితప్రాయా అల్పాయుషోమ హేచ్చాహ్యల్పధర్మాలులుబ్ధాశ్చ భవిష్యన్తి॥

తైశ్చవిమిశ్రా జనపదాస్తచ్చీలానువర్తినో రాజాశ్రయశుష్మిణోమ్లేచ్చారాశ్చవిపర్యయేణ వర్తమానాప్రజాః క్షపయిష్యన్తి॥

అనుగ్రహము కొంచెము కోపముహెచ్చు సర్వకాల మందు అబద్దము అధర్మము లందు రుచి గలవారు స్త్రీబాల గోవధ పరధ నాపహరణము లందు రుచి గలవారు అల్పసారము గలవారు తమో గుణప్రాయములు పుట్టిగిట్టుట మాత్రమైన అల్ప జీవితము అల్పాయుర్దాయము గల్గి పెద్దకోరిక అల్పధర్మము గల్గి లుబ్దలయి వీరుందురు. వారితో గలసిపోయి జనపదములు యదేశీలమునకు వర్తించుచు రాజాశ్రయము చేతనే శుష్మిణః (= బలవంతులై) మ్లేచ్చాచారులై విపర్యయ ప్రవర్తనులై ప్రజలను నాశనము చేయుదురు.

తతశ్చానుదినమాల్పల్పహ్రాసవ్యవచ్చేదాద్దర్మార్థయోర్జగాతస్సం క్షయోభవిష్యతి॥

తతశ్చార్థ ఏవాభిజనహేతుః॥

బలమేవాశేషధర్మహేతుః॥

అభిరుచిరేవదామ్పత్యసంబన్దహేతు॥

స్త్రీత్వమేవోపభోగహేతుః॥

అనృతమేవవ్యవహారజయహేతుః॥

ఉన్నతామ్బుతైవ పృథివీహేతుః॥

బ్రహ్మసూత్రమేవవిప్రత్వహేతుః॥

రత్నాధాతుతై వశ్లాఘ్యతాహేతుః॥

లిఙ్గధారణమేవాశ్రమహేతుః॥

అన్యాయ ఏవవృత్తిహేతుః॥

దౌర్బల్యమేవావృత్తిహేతుః॥

అభయప్రగల్భోచ్చారణమేవపాణ్డిత్య హేతుః॥

అనాఢ్యతైవ సాధుత్వహేతుః॥

స్నానమేవ ప్రసాధనహేతుః॥

దానమేవధర్మహేతుః॥

స్వీకరణమేవవివాహహేతుః॥

సద్వేషధార్యేవపాత్రామ్॥

దూరాయతనోదకమేవతీర్థహేతుః॥

కపటవేషధారణమేవమహత్త్వహేతుః॥

ఇత్యేవమానేకదోషోత్తరెతుభూమణ్డలేసర్వవర్ణేష్వే వయోయో బలవాన్ సస భూపతిర్భవిష్యతి॥

ఏవంచా తిలుబ్ధకరాజాసహాశ్శైలానామన్తరద్రోణీః ప్రజాస్సంశ్రమిష్యన్తి॥

మధుశాకమూలఫలపత్రపుష్పాద్యాహారాశ్చభవిష్యన్తి॥

తరువల్కలపర్ణచీరప్రావరణాశ్చాతి బహుప్రజాశ్శీతవాతాతపవర్షసహాశ్చ భవిష్యన్తి॥

నచకశ్చిత్త్రయోవిశంతివర్షాణి జీవిష్యతి, అనవరతంచాత్ర కలియుగే క్షయ మాయా త్యఖిల ఏవైషజనః॥

కవిలక్షణాలు:

అందువలన ననుదినము కొంచెను కొంచెముగా తఱిగి పోయి ధర్మార్థ పురుషార్థములు క్షయించుటచే జగత్తు నశించును. అటుపై ధనమే అభిజన (కుల) కారణము (ధనమున్న వాడే ఉత్తమ కులీనుడన్నమాట) అభిరుచియే దాంపత్య కారణము. స్త్రీత్వమే భోగ కారణము. అనృతమే వ్యవహార జయహేతువు ఎత్తున ఉదక సమృద్దియే పృథివీ (స్వీకార) హేతువు. జందెమే విప్రత్వ హేతువు. రత్నములు సువర్ణాది ధాతువు లుండుటయే శ్లాఘ్యడగుటకు కారణము అన్యాయమే జీవన కారణము. దౌర్బల్యమే అవృత్తి కారణము భయము లేకుండ

ప్రగల్భముగ (బల్లగుద్ది) పలుకుటయే పాండిత్య కారణము. బీదరికమే (దైన్యమే) సాధుత్వ హేతువు. స్నానమే ప్రసాదన హేతువు (స్నానమే సర్వానుష్టానం) దానమే ధర్మ హేతువు. స్వీకరణమే వివాహ హేతువు. సద్వేష దారియే పాత్రము (దానపాత్ర మన్నమాట). దూరముగా నున్న యుదకమే తీర్థ హేతువు. కపట వేషదారణమే మహత్త్వమునకు హేతువునై యిట్లనేక దోషములు భూమండలమున బెచ్చు పెరిగి ఆయా వర్ణము లందెవ్వడు బలవంతుడో వాడే భూపతి యగును. ఇట్లతి లుబ్దమైన పాలకులను సహింప లేక ప్రజలు కొండగుట్టలు లోయలం బట్టిపోయి యట తలదాచు కొందురు. కల్లు ఆకుకూరలు దుంపలు పండ్లు ఆకులు పువ్వులుం దిందురు. చెట్లపట్టాలు ఆకులు గట్టు కొందురు. పిపుల్లందెగ కందురు. శీతవాతాతప వర్షముల కోర్చుకొని బ్రతుకుదురు. ఇరువది మూడేండ్లు ఎవ్వడుం బ్రతకడు. ఈ సకల జనము నీ కలి యుగమున తఱిగిపోవును.

శ్రౌతస్మార్తేచధర్మే విప్లవమత్యన్తముపగతే క్షీణప్రాయేచ కలావశేష జగత్స్రష్టుశ్చరాచరగురోరాదిమధ్యాన్త రహితస్య బ్రహ్మమయస్యాత్మరూపిణో భగవతో వాసుదేవస్యాంశ శ్శంబళగ్రామ ప్రధాన బ్రాహ్మణస్య విష్ణుయశసో గృహేఽష్టగుణర్దిసమన్వితః కల్కిరూపీజగత్యత్రావతీర్య సకలమ్లేచ్చాదస్యు దుష్టాచరణచేతసామశేషాణామ పరిచ్చిన్నశక్తిమాహాత్మ్యః క్షయంకరిష్యతి, స్వధర్మేషు చాఖిలమేవసం స్థాపయిష్యతి॥

అనన్తరం చాశేషకలేరవసానేనిశావసానేవిబుద్ధానామివతేషామేవ జనపదానామమల స్ఫటికదళ శుద్దామతయో భవిష్యన్తి॥

తేషాంచ బీజభూతానామశేష మనుష్యాణాం పరిణతానామపితత్కాలకృతాపత్య ప్రసూతిర్భవిష్యతి॥

తానిచతదపత్యాణికృతయుగానుసారీణ్యేవభవిష్యన్తి॥

కలియుగం శ్రౌతస్మార్త ధర్మము మహోపద్రవము పొంది క్షీణమైపోగా జగత్కర్త జరాచర గురువు ఆది మధ్యంత రహితుడు బ్రహ్మ మయుడునగు భగవంతుడు వాసుదేవుని యంశము శంబాల గ్రామమునందు ముఖ్యుడైన బ్రాహ్మణుడగు విష్ణుయశుని యింట అష్టగుణ సమృద్దితో కల్కిరూపియై యీ జగమం దవతరించి సకల మ్లేచ్చులను దస్యులను (దొంగలను) దుష్టచిత్తుల నెల్లరనపరిమేయ శక్తి మహిమలు గలవాడై నశింప జేయును. సర్వమును స్వధర్మమందు నిలుపును. అశేష కలియుగము తుదను రాత్రితుద మేల్కొన్న వారికి వలె నా మనుష్యులకే స్వచ్చ స్ఫటిక దళమువలె పరిశుద్దమైన బుద్దులు కల్గును. వినము లట్లున్న వారికి పరిణతు లయిన వారికి గూడ (వయస్సు చెల్లిన వారికిని) తత్కాలమందు సంఘటితమైన సంతానము గల్గును. ఆ సంతతి కృతయుగాను సారులే యగును. ధార్మికమగు కృత యుగమునకు వారు బీజము లగుదురన్న మాట.

అత్రి:

యథాచన్ద్రశ్చసూర్యశ్చ తథాతిష్యే బృహస్పతిః।

ఏకరాశౌ సమేష్యన్తి తదాభవతి వై కృతమ్॥

అతీతా వర్తమానాశ్చ తథైవానాగతాశ్చయే।

ఏతే వంశేషు భూపాలాః కథితా మునిసత్తమ॥

యావత్పరీక్షితోజన్మయావన్నన్దాభిషేచనమ్।

ఏతద్వర్షసహస్రంతుజ్ఞేయం పఞ్చాశదుత్తరమ్॥

అత్రి:

ఈ విషయంలో నిట్లు చెప్పబడినది. చంద్రసూర్యులు బృహస్పతి పుష్యమి నక్షత్రము లేక రాశి యందున్న తఱి కృతయు గారంభమగును. గడచిన యిప్పుడున్న రాగల యాయా వంశము లందలి రాజులం జెప్పితిమి. పరీక్షిత్తు జన్మించినది మొదలు నందరాజుల యభిషేకము దాక గల ఈ కాలము ఒక వేయియేబది సంవత్సరములు.

సప్తర్షీణాంతుయౌపూర్వౌదృశ్యేతేహ్యుదితౌదివి।

తయోస్తుమధ్యే నక్షత్రం దృశ్య తేయత్సమంనిశి॥

తేనస ప్తర్షయోయుక్తాస్తిష్ఠన్త్యబ్దశతం నృణామ్।

తేతుపారీక్షితేకాలేమఖాస్వాసన్ ద్విజోత్తమ॥

తదాప్రవృత్తశ్చ కలిః ద్వాదశాబ్దశతాత్మకః॥

యదై వభవాన్ విష్ణోరంశోయాతోదివంద్విజ।

వసుదేవ కులోద్భూత స్తదైవాత్రాగతః కలిః॥

యావత్స పాదపద్మాభ్యాం పస్పర్శేమాం వసుంధరామ్।

తావత్పృథ్వీం పరిష్వక్తుం సమర్థోనాభవత్కలిః॥

గతేసనాతనస్యాం శేవిష్ణోస్తత్రభువోదివమ్।

తత్యాజసానురాజ్యం ధర్మపుత్రో యుధిష్ఠిరః॥

విపరీతానిద్రుష్ట్వ్వాచ నిమిత్తాని హి పాణ్డవః।

యాతేకృష్ణేచకారాథ సోఽభిషేకం పరీక్షితః॥

ప్రయాస్య న్తియదాచై తేపూర్వాషాఢాం మహర్షయః।

తదా నన్దాత్ప్రభృత్యేష గతివృద్దిం గమిష్యతి॥

యస్మిన్ కృష్ణోదివం యాత స్తస్మిన్నేవతదాఽహని।

ప్రతిపన్నం కలియుగం తస్యసంఖ్యాంనిభోధమే॥

త్రీణిలక్షాణివర్షాణాం ద్విజమానుష్యసంఖ్యయా।

షష్టిశ్చైవసహస్రాణిభవిష్యత్యేషవైకలిః॥

శతానితానిదివ్యానాంస ప్తపఞ్చచసంఖ్యయా।

నిశ్శేషేణగతేతస్మిన్ భవిష్యతి పునః కృతమ్॥

బ్రాహ్మణాః క్షత్రియావైశ్యాశూద్రాశ్చ ద్విజసత్తమ।

యుగేయుగే మహాత్మానస్సమతీతాస్సహస్రశః॥

బహుత్వాన్నామధేయానాం పరిసంఖ్యాకులే కులే।

పౌనరుక్త్వాద్దిసామ్యచ్చ నమయా పరికీర్తితా॥

దేవాపిః పౌరవోరాజాపురుశ్చేక్ష్వాకువంశజః।

మహాయోగబలోపేతౌ కలాపగ్రామసంశ్రితౌ॥

కృతేయుగేత్విహగమ్యక్షత్రప్రావర్తకౌహితౌ।

భవిష్యతిమనోర్వంశ బీజభూతౌవ్యవస్థితౌ॥

అనేనక్రమయోగేన మనుపుత్త్రైర్వసుంధరా।

కృతత్రేతాద్వాపరాణియుగానిత్రీణిభుజ్యతే॥

కలౌతే బీ జభూతా స్తుకేచిత్తిష్ఠన్తివై మునే।

యథైవదేవాపిపురాసాంప్రతంసమాధిష్టితౌ॥

ఏష తూద్దేశతోవంశ స్తవోక్తోభూభుజాంమయా।

నిఖిలోగదితుంశక్యో నైష వర్షశతైరపి॥

సప్తర్షులు పరీక్షిత్తు కాలములో మఖానక్షత్ర మందుండిరి. అప్పటికి కలియుగము పండ్రెండు వందల సంవత్సరముల ముందారంభమైనది. వాసుదేవ కులము నందవతరించిన విష్ణువు యొక్క యంశమైన కృష్ణ భగవానుడు స్వర్గమలంకరించిన సమయమందే కలి యీ లోకమునకు వచ్చినాడు. అంతదాక పృథివిని కలి క్రమ్ముకొన సమర్థుడు గాడయ్యె. సనాతన వాసుదేవాంశము దివమ్మున కేగగా యుధిష్ఠిరుడు విపరీత నిమిత్తముల (దుశ్శకునములు}

చూచి కృష్ణుడు వెళ్ళిన తరువాత పరీక్షిత్తునకు బట్టబిషేకము గావించెను. సప్తర్షులు పూర్వాషాఢా నక్షత్రమునకు వచ్చినపుడు నంద రాజ్యారంభము నుండి కలి వృద్దినందును. ఏ రోజున కృష్ణుడు వైకుంఠము నధిరోహించె నా రోజుననే కలి యుగము వచ్చినది. ఆ సంఖ్య వినుము. కలి పండ్రెండు వందల దివ్య సంవత్సరములు పూర్తిగ జరిగిన తరువాత కృతయుగము రాగలదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మహాత్ము లనేకులు యుగ యుగమందును వేలకొలది గడచినారు. వారివారి పేరులు వారి లెక్క మిక్కిలి ఎక్కువగుట చేతను యాయా కులమందు పునరుక్తిగా వచ్చుట చేతను నాకు సామ్యము చేతను నేనవన్నియుం జెప్పనైతిని. దేవాపి పౌరవ వంశ నృపతి. పురువు ఇక్ష్వాకు వంశజుడు మహాయోగ బలసంపన్నులై కలాపగ్రమ మందున్న వారై కృత యుగమందు ఇక్కడకు వచ్చి (భారత భూమికి) క్షత్రవంశ ప్రవర్తకులు గాగలరు. మనువు యొక్క వంశమునకు బీజభూతులు వారు. ఈ క్రమరీతిని మను పుత్రులచే నివ్వసుంధర కృతత్రేతా ద్వాపర యుగములు మూడింట నుప భుక్తమగును. దేవాపి పురువు లిప్పుడున్నట్లే కలిలో వారు గొందరు బీజ స్వరూపులై యుందురు. ఈ రాజవంశ చరిత్ర నీకు సంక్షేపముగ దేల్పితిని. దీనిని వందేండ్ల కైనను సమగ్రముగ దెలుప శక్యము గాదు.

ఏతేచాన్యేచభూపాలాయైరాత్రక్షితిమణ్డలే।

కృతం మమత్వం మోహానైర్నిత్యం హేయకళేబరే॥

కథంమమేయ మచలా మత్పుత్రస్యకథం మహీ।

మధ్వంశ్యస్యేతిచిన్తార్తాజగ్మురన్తమిమేనృపాః॥

తేభ్యః పూర్వతరాశ్చాన్యేతేభ్యస్తేభ్యస్తథాఽపరే।

భవిష్యాశ్చైవయాస్యన్తితేషామాన్యేచయేఽప్యను॥

విలోక్యాత్మజయోద్యోగం యాత్రావ్యగ్రాన్నరాధిపాన్।

పుష్పప్రహాసై శ్శరదిహస న్తీవవసుంధరా॥

మైత్రేయ! పృథివీగీతాన్ శ్లోకాంశ్చాత్రనిబోధమే।

యానాహధర్మధ్వజినేజనకాయాసితోమునిః॥

ఈ భూమండల మందును తుచ్చమైన శరీరము నందును ఈ రాజులు మఱి యితరులును మొహాంధులై మమకారము పెట్టుకొన్నారు. ఈ నేల నాదెట్లగును. నా కొడుకునకిది యెట్లగును? నావంశపుది యెట్లు అగును. అనుచింతచే గుమిలి కుమిలి యంతమొందిరి. వారికి మునుముందటి వారు వారికంటె తరువాతి వారు. ఇంకను రాగల వారును వారి వారిని ననుసరించు వారు నందరును పోక మానరు. తనను గెల్చుకొనం జేయు ప్రయత్నమును దానికై దండయాత్ర లందు వ్యగ్రులైన రాజులను గని వసుంధర శరద్ద్రుతువు నందలి పుష్ప వికాసము నెపమున విరగబడి నవ్వుచున్నదా యన్నట్లున్నది. మైత్రేయ! ఈ విషయము నందు పృథివీగీత శ్లోకములివె వినుము. వీనిని ధర్మద్వజ యగు జనకునకు అసితుడను ముని వినిపించెను.

పృథివి:

కథమేషనరేన్ద్రాణాం మోహోబుద్దిమతామపి।

యేనఫేనసధర్మాణోప్యతివిశ్వస్తచేతసః॥

పూర్వమాత్మజయం కృత్వాజేతుమిచ్చన్తిమన్త్రిణః।

తతోభృత్యాంశ్చపౌరాంశ్చజిగీషన్తేతథారిపూన్॥

క్రమేణానేనజేష్యా మోవయం పృథ్వీం ససాగరామ్।

ఇత్యాసక్తధియోమృత్యుం నపష్యన్త్యవిదూరగమ్॥

సముద్రావరణం యాతిభూమణ్డలమథోవశమ్।

కియదాత్మజయస్యైతన్ముక్తిరాత్మజయేఫలమ్॥

ఉత్సృజ్యాపూర్వజాయాతాయాం నాదాయగతః పితా।

తాంమామతీవమూఢత్వాజ్జేతుమిచ్చన్తిపార్థివాః॥

మత్కృతేపితృపుత్రాణాంభ్రాతౄణాంచాపినిగ్రహః।

జాయతేఽత్యన్తమో హేనమమత్వాదృతచేతసామ్॥

పృథ్వీమమేయం సకలామమైషా మదన్వయస్యాపిచశాశ్వతీయమ్।

యోయోమృతోఽన్యత్రబభూవరాజాకుబుద్దిరాసీదితితస్యతస్య॥

దృష్ట్వామమత్వాద్రుచితత్తమేకం విహాయమాం మృత్యువశం వ్రజన్తమ్॥

తస్యాను యస్తస్యకథంమమత్వం హృద్యాస్పదంమత్ప్రభవం కరోతి న॥

పృథ్వీమమైషాఽఽశుపరిత్యజైనాం వదన్తియేదూతముఖైస్స్వశత్రూన్॥

నరాధిపా స్తేషుమమాతిహాసః పునశ్చమూఢేషుదయాఽభ్యుపైతి॥

పృథివీ గీతం:

బుద్దిమంతు లయిన నీ రాజుల యొక్క యీ మోహమెంత చిత్రము! వట్టినురుగ మాత్రమైన వారు (అశాశ్వతులు) అయ్యు అథి విశ్వాసము పెట్టుకొన్నారు. తొలుత దమ్ముదాము జయించి కొని మంత్రులను నౌకరులను పౌరులను అట్లే శత్రువులను జయింప నెంతురు. ఈ రీతిగ గ్రమముగ సాగర పర్యంతమైన నేల జయింతుమని యాసక్తచిత్తులై మిక్కిలి దరినున్న మృత్యు వుంగానరు. సముద్ర మావరణము గాగల క్షితి మండలము స్వాధీన మైనను నిది ఆత్మజయము ముందేపాటిది? ఆత్మను గెలిచినపుడు గలుగు ఫలము ముక్తి. మున్ను పుట్టినవారు భూమిని విడిచి వెళ్ళిరి. తండ్రి వెంట గొనిపోలేదు. అట్టి నన్ను జయింతుమని పరమ మూఢులై రాజులు కోరుదురు. నా కొఱకై తండ్రి కొడుకులకు అన్నదమ్ములకును అత్యంత మోహము వల్ల మమకారము గలవారికి విరోధము వచ్చును. పెద్దరగడ ఈ భూమి నాది నాది యిదంతయు నా కుటుంబమునకు గూడ శాశ్వతము అనుకోని ఎవ్వడెవ్వడు రాజు చచ్చి మఱి యోకచో పుట్టినాడో వానివానికీ కుబుద్ది పొడముచునే యుండెను. మమకారము పెట్టుకొన్న మనసు గల వానినిది విడిచి మృత్యు ముఖగ్రస్తు డగుచున్న వానింగని వాని వెంబడినే పోవనున్న వానికి హృదయము లోనున్న గూర్చిన యీ మమకార మేమి? ఈ భూమి నాది. వెంటనే దీనిని వదలి పెట్టుము. అనిదూత ముఖమున తమ శత్రువులకు కబురు పంపు నరాదిపుల యెడ నాకెక్కడ లేని నవ్వు వచ్చును. వచ్చియు నా మూఢుల యెడ మఱి జాలియుం గల్గు చున్నది!

శ్రీపరాశరుడు:

ఇత్యేతే ధరణీగీతా శ్శోకా మైత్రేయ! యైశ్శ్రుతాః।

మమత్వం విలయం యాతితపత్యర్కే యథాహిమమ్॥

శ్రీపరాశరుడు:

ఇవి ధరణీ గీతము లయిన శ్లోకములు. మైత్రేయ! వీని నెవరు విందురో వారికి సూర్యుడు తపించు తఱి మంచు విరిసినట్లు మమకారము విలయించును.

ఇత్యేష కథత స్సమ్యఙ్మశో యయాతవ।

యత్ర స్థితి ప్రవృత్తస్యవిష్ణో రంశాంశకా నృపాః॥

శృణోతి య ఇమంభక్త్వామనోర్వంశ మనుక్రమాత్।

తస్యపాపమశేషంవై ప్రణశ్య త్యమలాత్మనః॥

ధనధాన్యర్ ద్దిమతులాం ప్రాప్నోత్యవ్యాహతేన్ద్రియః।

శ్రుత్వైవమఖిలం వంశం ప్రశస్తం శశిసూర్యయోః॥

ఇక్ష్వాకుజహ్నుమాంధాతృసగరావిక్షితాన్ రఘూన్।

యయాతినహుషాద్యాంశ్చజ్ఞాత్వా నిష్ఠాముపాగతాన్॥

మహాబలాన్ మహావీర్యా ననన్తధనసంచయాన్।

కృతాన్ కాలేన బలినా కథాశేషాన్నరాధిపాన్॥

శ్రుత్వాన పుత్రదారాదౌ గృహక్షేత్రాదికే తథా।

ద్రవ్యాదౌవాకృతప్రజ్ఞో మమత్వంకురుతేనరః॥

తప్తం తపోయైః పురుషప్రవీరై రుద్భాహుభిః వర్షగణాననేకాన్॥

ఇష్ట్వాసుయజ్ఞెః బలినోఽతివీర్యాః కృతాస్సుకాలేన కథావశేషాః॥

పృథుస్సమస్తాన్ విచచారలోకా నవ్యాహతోయోవిజితారిచక్రః।

సకాలవాతాభిహతః ప్రణష్టః క్షిప్రం యథాశాల్మలితూలమగ్నౌ॥

యః కార్తవీర్యోబుభుజేసమస్తాన్ ద్వీపాన్ సమాక్రమ్యహతారిచక్రః।

కథాప్రసంగేష్వభిదీయమానస్స ఏవసం కల్పవికల్పహేతుః॥

దశాననావిక్షతరాఘవాణామైశ్వార్యముద్భాసిదిఙ్ముఖానామ్।

భస్మావశిష్టం న కథంక్షణేన భ్రూభఙ్గపాతేనథిగన్తకస్య॥

కథాశరీరత్వమవాప యద్వై మాంధాతృనామా భువిచక్రవర్తీ।

శ్రుత్వాఽపి తత్కోహి కరోతిసాధుః మమత్వమాత్మన్యపిమన్దచేతాః॥

భగీరథాద్యాస్సగరః కకుత్ స్థోదశాననోరాఘవలక్ష్మణౌచ।

యుధిష్టిరాద్యాశ్చబభూవురేతే సత్యం నమిథ్యా క్వనుతే నవిద్మః॥

యేసాంప్రతం యేచనృపాభవిష్యాః ప్రోక్తామయావిప్రవరోగ్రవీర్యాః।

ఏతే తథాఽన్యేచతధాఽభిధేయాః సర్వేభవిష్యన్తి యథైవపూర్వే॥

ఏతద్విదిత్వానన రేణకార్యం మమత్వ మాత్మన్యపి పణ్డితేన।

తిష్ఠన్తుతావ త్తనయాత్మజాయాః క్షేత్రాదాయోయేచశరీరిణోఽన్యే॥

ఇది మనువు వంశము. చక్కగా దెల్పితిని. స్థితి కార్య ప్రవృత్తుడైన విష్ణువు యొక్క అంశాంశమూర్తు లయిన రాజులింద వతరించి నారు. దీనిని మొదటి నుండి క్రమముగా భక్తితో నెవ్వడు వినునో వాని యశేష పాపము నశించును. మనస్సు శుద్దమగును. సాటిలేని ధనధాన్య సమృద్ధిని నాతడవ్వాహతేంద్రియుడై పొందును. చంద్ర సూర్య వంశముళ నెల్ల విని ఇక్ష్వాకు జహ్ను మాంధాతృసగరా విక్షిత రఘు యయాతి నహుషాదులను నాశము పొందిన వారిని మహాబలులను మాహావీరులను ననంత ధన సంపన్నులను బలీయమైన కాలముచే కధామాత్రా వశిష్టులుగా చేయ బడిన రాజులను వినిన వాడు పుత్రదార గృహక్షేత్రాది ద్రవ్య సముదాయ మందు నరుడు ప్రాజ్ఞుడై మమకార ముంజేయడు. చేతులు మీదికెత్తి యనేకవర్ష గణములు తపస్సు చేసిన పురుష ప్రవీరులు మహాయజ్ఞముల నాచరించిన బలశాలురు మహావీరులు గూడ కాలముచే కథామాత్రా వశేషులు (కీర్తిశేషులు) గావింప బడినారు. అడ్డులేని వాడై యరి చక్రమెల్ల గెల్చి సర్వ లోకములను స్వేచ్చా సంచారము సేసిన పృథు చక్రవర్తి కాలవాత హతుడై యగ్ని యందు వేసిన బూరుగు దూదివలె నష్టమై పోయినాడు. సర్వ ద్వీపములను ఆక్రమించి యనుభవించి యరి చక్రముం గూర్చిన కార్తవీర్యుడు ఉన్నాడా? లేడా అను సంకల్ప వికల్పములకు హేతు వయినాడు. కథామాత్ర శేషియై పోయినాడు. (భూభంగ కనుబొమల ముడి) ప్రకాశింప జేయబడిన దిజ్ముఖములు గల రావణ రాఘవాదుల యైశ్వర్యము, యముని యొక్క ప్రసారముచే బూడిద కూడ మిగులని దాయెనేల? ఛీ! యశ్వైర్య మంతుడును భ్రూభంగపాత మాత్రమున క్షణమున భస్మా వశిష్టమై పోలేదా? మాంధాతృ చక్రవర్తి పుడమిపై కీర్తి శరీరుడైనాడని వినియే సాధువు మంద బుద్దియై దేహము నందు కూడ మమత్వముం జేయును? భగీరథాదులు సగరుడు కకుత్స్థుడు రావణుడు రామ లక్ష్మణులు యుదిష్ఠిరాదులు నుండిరి. నిజమిది. యబద్దము గాదు. వారందరూ నేమయినారో యెఱుంగము. ఎవరిప్పు డున్నారు ఎవరుండ బోవమన్నారు. వారందరు మహావీర్యులు వారుం నే సెప్పిన మఱి యితరులు బ్రాహ్మణోత్తమా! పూర్వులట్లనే యందఱు రుగుదురు. అని చెప్పడగు యుందురు. ఈ యంశ మెఱిగి పండితుడు (జ్ఞాని) యైన మానవుడు క్షేత్రపుత్ర కలత్రాదుల నిందింతురు గాక! తమ శరీరధారులు నట్లుందురు గాక! అనగా వారియందు మమకారము అసలే పనికి రాదని భావము. వారి యెడ మనసులో మమకారము సేయ గూడదు. శరీరము నాడును మమకారము చేయరాదు.