3 - జంబూద్వీప వర్ణనము

శ్రీపరాశరుడు:

ఉత్తరంయత్సముద్రస్యహిమాద్రేశ్పై వదక్షిణమ్।

వర్షంతద్భారతంనామభారతీయత్రసంతతిః॥

నవయోజనసాహస్రోవిస్తారోఽస్యమహామునే।

కర్మభూమిరియంస్వర్గమపవర్గంచగచ్ఛతామ్॥

మహేన్ద్రోమలయస్సహ్యశ్శుక్తిమానృక్షపర్వతః।

విన్ధ్యశ్చపారియాత్రశ్చసప్తాత్రకులపర్వతాః॥

అతస్సంప్రాప్యతేస్వర్గోహ్యతోముక్తింప్రయాన్తిచ।

తిర్యక్త్వంనరకంచాపి యాన్త్వతఃపురుషామునే॥

ఇతస్స్వర్గశ్చమోక్షశ్చ మధ్యంచాన్తశ్చగమ్యతే।

నఖల్వన్యత్రమర్త్యానాం కర్మభూమౌవిధీయతే॥

భారతస్యతువర్షస్యనవభేదంనిశామయ।

ఇన్ద్రద్వీపఃకమేరుశ్చతామ్రపర్ణోగభస్తిమాన్॥

నాగద్వీపస్తథాసౌమ్యోగాన్ధర్వస్త్వథవారుణః।

అయంతునవమస్తేషాంద్వీపస్సాగరసంవృతః॥

యోజనానాంసహస్రంతుస్ ద్వీపోఽయందక్షిణోత్తరాత్।

పూర్వేకిరాతాయస్యాన్తే పశ్చిమేయవనాః స్థితాః॥

బ్రాహ్మణాః క్షత్రియావైశ్యా మధ్యేశూద్రాశ్చభాగశః।

ఇజ్యాయుద్దవాణిజ్యాద్యైర్వర్తయన్తోవ్యవస్థితాః॥

శతద్రూచన్ద్రభాగాద్యాహిమవత్పాదనిస్సృతాః।

వేదస్మృతిముఖాశ్చాన్యాఃపారియాత్రోద్భవామునే॥

నర్మదాసురసాద్యాశ్చనద్యోవిన్ధ్యవినిర్గతాః।

తాపీపాయోష్ణీనిర్విన్ధ్యా ప్రముఖాఋక్షసంభవాః॥

గోదావరీభీమరథీకృష్ణ వేణ్యాదికాస్తథా।

సహ్యపాదోద్భవానద్యస్స్మృతాః పాపభయాపహాః॥

కృతమాలాతామ్రపర్ ణీ ప్రముఖామలయోద్భవాః।

త్రిసామాఋషికుల్యాద్యా మహేన్ద్రప్రభవాస్స్మృతాః॥

ఋషికుల్యాకుమారాద్యాశ్శుక్తిమత్పాదసంభవాః।

అసాంనద్యుపనద్యశ్చ సన్త్యన్యాశ్చసహస్రశః॥

శ్రీపరాశరుడు:

సముద్రమున కుత్తరమున, హిమాలయమునకు దక్షిణమున భారత వర్షము గలదు. అందలి సంతతి భారతి యనబడును. ఇది తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమి యని దీనికి పేరు. కోరిన వారికి స్వర్గము మోక్షము గూడ నిందె యున్నవి. ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము నను సప్తకుల పర్వతము లున్నవి. జీవులు భారత వర్షము నుండియే స్వర్గ మోక్షముల పొందుదురు. అవాంతర కర్మఫలము స్వర్గము పర్యవసాన మందాత్యంతిక ఫలమైన మోక్షము గూడ యిట నుండియే మానవుడు పొందును. ఈ భూమండల మందే కర్మానుష్టానము విధింప బడినది. అందుచేతనే దీనికి కర్మభూమి యనుపేరు సార్ధకము. భారత వర్షమున తొమ్మిది ద్వీప భాగము లున్నవి. ఇంద్ర ద్వీపము, కశేరువు (కశేరుమంత మని కూడా యందురు), తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగ ద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఇందు తొమ్మిదవది సముద్ర సంవృతము. ఇది దక్షిణ దిశనుండి యుత్తర దిక్కుకు వేయి యోజనములు. తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నుందురు. యజన యాజనములు యుద్దము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు. హిమవత్పర్వత ప్రత్యంత పర్వతము నుండి శతద్రు (సట్లజ్) చంద్రభాగ వేదము స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద సురస మొదలగునవి వింధ్య గిరి నుండి వెలువడు చున్నవి. తాపి, పయోష్ణి, నిర్వింధ్య, కావేరి మొదలైనవి ఋక్ష పర్వత ప్రాంతమందు కనించినవి. గోదావరి, భీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాద మందు బుట్టినవి. కృతమాలా, తామ్రవర్ణీ, ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్యా మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్య కుమారి మొదలయినవి శుక్తిమత్పర్వత పాదమందు బుట్టినవి. వీని యుప నదులు వేలకొలదిగ గలవు.

తాస్విమేకురుపాంచాలామధ్య దేశాదయోజనాః।

పూర్వదేశాదికాశ్చైవకామరూపనివాసినః॥

ఆన్ద్రాః కళింగమగధా దాక్షిణాత్యాశ్చకృత్స్నశః।

తథాపరాన్తాః సౌరాష్ట్రాశ్శూద్రాభీరాశ్చబర్బరాః॥

మారుకామాళవాశ్చైవ పారియాత్రనివాసినః।

సౌవీరాస్సైన్ధవాహూణాస్సాల్వాః కోసలవాసినః॥

మద్రారామాస్తథామ్భష్ఠాః పారశీకాదయస్తథా।

అసాంపిబన్తిసలిలంవసన్తిసరితాంసదా॥

సమానతోమహాభాగ హృష్టపుష్టజనాకులాః॥

చత్వారిభారతేవర్షేయుగాన్యత్రమహామునే।

కృతంత్రేతాద్వాపరశ్చకలిశ్చాన్యాత్రసక్వచిత్॥

తపస్తప్యన్తియతయోజుహ్వతేచాత్రయజ్వనః।

దానానిచాత్రదీయన్తేపరలోకార్ ర్థమాదరాత్॥

పురుషైర్యజ్ఞపురుషో జమ్భూద్వీపేసదేజ్యతే।

యజ్ఞైర్యజ్ఞమయోవిష్ణురన్యద్వీపేషుచాన్యథా॥

అత్రాపిభారతంశ్రేష్ఠం జమ్భూద్వీపే మహామునే।

యతోహికర్మభూరేషాహ్యతోఽన్యాభోగభూమయః॥

అత్రజన్మసహస్రాణాంసహస్రైరాపిసత్తమ।

కదాచిల్లభతేజన్తుర్మనుష్యంపుణ్యసంచయాత్॥

వానియందు కురు పాంచాల దేశ ప్రజ నివసించు చున్నది. తూర్పున కామరూప దేశవాసులు కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు దక్షిణము నందుండు వారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు అర్బుదులు మారుకులు మాళవులు పారియాత్ర నివాసులు మద్రులు రాములు అంబుష్టులు పారసీకాదులు. వీరందరూ నీయీ నదుల జలములం ద్రావుదురు. ఈ దేశములు కలిసి మెలసి ఆనంద భరితులు పుష్టివంతులునైన జనులతో నిండి యుండును. కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగ మిక్కడనే కలదు. అన్యత్ర లేదు. ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పర లోకము గోరి యిచట దానము లాచరింప బడును. జంబూద్వీప మందు యజ్ఞ పురుషు డుపాసింప బడును. విష్ణువు యజ్ఞ రూపుడుగ యజ్ఞేశ్వరుడుగ నిచట నుపాసింప బడును. ఇతర ద్వీపము లందు మరియొక పేరున గొల్వబడును. ఈ జంబూ ద్వీపమున భారత వర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగభూములు. బహు జన్మ ఫలభోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము జీవుడు పొందును.

దేవతల గీతము:

గాయన్తిదేవాః కిలగీతకాని ధన్యాస్తుయేభారతభూమిభాగే।

స్వర్గాపవర్గాస్పదమార్గభూతే భవన్తిభూయః పురుషాస్సురత్వాత్॥

కర్మాణ్య సంకల్పితతత్ఫలాని సంన్యస్య విష్ణౌపరమాత్మ రూపే।

అవాప్య తాం కర్మ మాహీమనన్తే తస్మిన్ లయం యేత్వామలాః ప్రయాన్తి॥

జానీమనైత త్క్వవయంవిలీనే స్వర్గప్రదే కర్మణి దేహబన్దమ్।

ప్రాప్స్యామ ధన్యాఃఖలు తేమనుష్యా యేభారతే నేన్ద్రియవి ప్రహీనాః॥

నవవర్షంతుమైత్రేయ జమ్భూద్వీపమిదంమయా।

లక్షయోజనవిస్తారంసంక్షేపాత్కథితంతవ॥

జమ్భూద్వీపంసమావృత్యలక్షయోజవిస్తరః।

మైత్రేయ వలయాకార స్థ్సితః క్షారోదధిర్భహిః॥

దేవతల గీతము:

దేవతలు ఈ భారత భూమిని గూర్చి యిట్లు గానము సేయు చుందురు. స్వర్గాపవర్గము లొసంగు భారత భూమి యందు మనుష్యులయి పురుషులయి పుట్టి కర్మభూమి యందు జన్మము వడసి ఫలాభిసంది లేక సర్వకర్మ ఫలములను పరమేశ్వరర్పాన మని పరమాత్మ యగు విష్ణువు నందర్పించి పాప దూరులై యా పరబ్రహ్మ యందు లీనమగు వారు ధన్యులు. పరమేశ్వరార్పనముగ నాచరించిన స్వర్గ ప్రదమగు కర్మలీనమై పోయిన తర్వాత దేహ బంధమును మరెక్కడా పొందుదుమో యెరుగము. పరిశుద్దేంద్రియ వంతులై భారత వర్షమున పుట్టిన వారు ధన్యులు. తొమ్మిది వర్షములు గల్గి లక్ష యోజనములు విరివిఁగల యీ జంబూ ద్వీపమును గూర్చి సంక్షేపముగా దేల్పితిని. ఈ ద్వీపము నావరించి లక్ష యోజనముల విస్తారము గల క్షార ఉప్పు సముద్రము వలయాకారముగా నున్నది.