శ్రీనారాయణ ఉవాచ :
శ్రీకృష్ణస్మరణం కృత్వాగమనోన్ముఖ ముద్ధవం ।
నతం రాధా పదాంభోజేశిరసాపుల కాంచితం ॥
ఉవాచమాధవీ గోపీరుదంతీ ప్రేమవిహ్వలా ।
భక్తం రుదం తముచ్చైశ్చ రాధావిచ్ఛేదకాతరం ॥
మాధవ్యువాచ :
ఉద్ధవ శృణువక్ష్యామిక్షణం తిష్ఠ యథోచితం ।
నిగూఢం పరమంజ్ఞానం యత్తేమనసి వాంఛితం ॥
సుదుర్లభం పురాణేషువేదేషు గోపనీయకం ।
ప్రశ్నంకురు మహాభాగరాధికాం త్రిజగత్ప్ర సూమ్ ॥
ఇత్యుక్త్వా సాచగోపీశాసమువాస సుసంపది ।
వాచమధురంశాంతం ఉద్ధవశ్చాపి రాధికాం ॥
ఉద్దవ ఉవాచ :
ఏకాకీ భయమాయాతి యాత్యేకాకీ పునః పునః ।
ప్రాణీకర్మానురోధేన స్వకర్మ ఫలభుక్ పుమాన్ ।
కర్మణాజాయతేజంతుః కర్మణైవ ప్రతీయతే ।
సుఖందుఃఖం భయం శోకం కర్మణైవాభిపద్యతే ॥
జంతుర్భోగావశేషేణ భోగం భుంక్తే భవేషుచ ।
పునశ్చ కర్మణో భోగాత్ సమాయాతిచ యాతిచ ॥
రత్నాదికం చ యత్కించిత్ మహ్యందత్తం త్వయాసతి ।
మయాసార్థం నయాత్యేవ తేనమేకిం ప్రయోజనం ॥
భవాబ్దితారణే దేవీభవతీతరణిర్వరా ।
కర్ణధారః స్వయం కృష్ణః సర్వేషాం పారకారకః ॥
కించిద్దానం దేహిమహ్యంభవాబ్ధిపారకారణం ।
ప్రాప్యప్రసాదం యాస్యామి మధురాంకృష్ణమూలకం ॥
యాంయాంకాలగతిం మాతః సురాణాంచ నృణామపి ।
పితౄణాం బ్రహ్మలోకస్య తదూర్ధ్వస్యచ తాంవద ॥
తామేవదుస్తరాంఘోరాం తీర్త్వాయామి హరేఃపదం ।
ఏవం భూతముపాయంచ దేహిమే కమలాలయే ॥
దూరతో యత్పదాంభోజం ధ్యాయంతే చదివానిశం ।
దేవాబ్రహ్మేశశేషాద్యాః త్వంతద్వక్షఃస్థలస్థితా॥
ఉద్ధవస్యవచః శ్రుత్వా జహాస కమలాలయా ।
వాససానేత్రనీరంచ సంమార్జ్య తమువాచ సా ॥
శ్రీరాధోవాచ :
మాధవీ వచనేనైవ కరోషి ప్రశ్నముద్దవ ।
స్త్రీజాతిరబలా లోకేకిం వాజ్ఞానందదామితే ॥
శుద్ధాం కాలగతిం వత్సజానాతి భగవాన్ హరిః ।
బ్రహ్మామ హేశః శేషశ్చ వేదాశ్చత్వార ఏవచ ॥
కించిద్వేదానుసారేణ సంతోజానంతి పుత్రక ।
శ్రూయతాం కృష్ణవక్త్రేణ గోలోకేరాసమండలే ॥
గోలోకేచాపి వైకుంఠే బ్రహ్మలోకేచ సాంప్రతం ।
యాచదృష్ణా కాలగతి: తామేవకథయామితే ॥
నృణాం పితౄణాం దేవానాం బ్రహ్మలోకాదికస్యచ ।
బహిర్లోకస్య బ్రహ్మాండాత్ పాతాళానాంచ నిశ్చితం ॥
దురత్యయాంకాలగతిం యేనోపాయేన పండితాః ।
నిస్తరంతిబుధశ్రేష్ఠ కథయామి నిశామయ ॥
భజంతి జగతాం నాథం కాలకాలం జగద్గురుం ।
నిర్గుణంచ నిరీహంచ పరమాత్మానమీశ్వరం ॥
సద్యః పతతిదేహోఽయం వినా యేన సదాత్మనా ।
తంని షేవ్య కాలగతిం తరత్యేవహికేవలం ॥
ఆయుర్హ రతిసర్వేషాం ప్రాణినాంరవిరేవచ ।
శ్రీహరేఃశుద్ధ భక్తానాం సతాంపుణ్యవతాంవినా ॥
విధేర్మానసికాన్ పుత్రాంశ్చతురః పశ్యపుత్రక ।
సనకాదీన్ భాగవతాన్ యేషాంచ సుస్థిరం వయః ॥
రుద్రాధ్యాన్వయసాఽఽదిత్యాన్ జ్ఞానినాంచ గురోర్గురూన్ ।
బాలాననుపనీతాంశ్చపంచవర్ష శిశూన్యథా ॥
అభ్యంతరే మహాస్ఫీతాన్ సస్మితాంశ్చ దిగంబరాన్ ।
శ్రీకృష్ణధ్యాన పూతాంశ్చ తీర్థపూతాంశ్చ వైష్ణవాన్ ॥
వేదవేదాంగ శాస్త్రాణాం చింతాహినాన్ ప్రఫుల్లితాన్ ।
భక్త్యా దివానిశం శశ్వత్ హరిభావేన తత్పరాన్ ॥
నారాయణుడిట్లన్నాడు : శ్రీకృష్ణుని స్మరించి వెళ్ళటానికి సిద్దమైన ఉద్ధవుని, రాధ పాదపద్మముల పైబడి తలవంచి నమస్కరిస్తున్న, పులకాంకితుడైన వానినిచూచి (1) ప్రేమతో చంచలమై, ఏడుస్తూ మాధవి అనే గోపిక ఇలా అన్నది. రాధవలన వియోగం కలుగబోతున్నదని భయపడుతున్న, గట్టిగా ఏడుస్తున్న భక్తునితో ఇట్లా అన్నది. (2) మాధవిపచనమిట్లా - ఉద్ధవ నేను చెప్పేది విను. నీకనుకూలమైనట్లుగా కొద్ది సేపు ఉండు.నీ మనస్సులో కోరిన, నిగూఢమైన, పరమజ్ఞానాన్ని ఇస్తాను. (3) పురాణముల వల్ల లభించనిది, గోప్యంగా వేదములలో ఉన్నది, అట్టి దానిని గూర్చి, ముల్లోకములను సృజించే రాధికను ప్రశ్నించు, ఓ మహాభాగ! (4) అని పలికి ఆ గోపికల పెద్ద ఆ సభ యందు కూర్చున్నది. ఉద్ధవుడు రాధికతో శాంతంగా, మధురంగా ఇట్లా అన్నాడు. (5) ఉద్ధవుని వచనమిట్లా - జీవి ఒంటరిగానే సంసారంలోకి వస్తాడు. మళ్లీ మళ్ళీ ఒంటరిగానే తిరిగిపోతాడు. ప్రాణి తన కర్మననుసరించి (పురుషుడు) తన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు.(6) కర్మ వల్లనే ప్రాణి జన్మిస్తాడు. కర్మవల్లనే లీనమౌతాడు. కర్మవల్లనే సుఖదుఃఖములను భయశోకములను పొందుతాడు. (7) భోగం మిగిలినందు వల్ల ప్రాణి ఆయా జన్మలందు భోగాన్ని అనుభవిస్తాడు. తిరిగి కర్మానుభవం వల్ల వస్తాడు, పోతాడు (8) ఓసతి! నీవు రత్నాదికములు ఏవి ఇచ్చావో, నాకు, అవి నాతో పాటు రావు. అటువంటప్పుడు వాటితో నాకేమి పని (9) సంసార సాగరాన్ని దాటటానికిఓదేవి! నీవు ఉత్తమమైన తెప్పవు. కృష్ణుడు స్వయంగా నావను నడిపేవాడు. అందరిని అవతలి దరికి చేర్చేవాడు. (10) భవసాగరాన్ని దాటటానికి కారణమైన దానాన్ని (వస్తువును) నాకివ్వు, కొంచము. దానిని, ఆ ప్రసాదాన్ని తీసుకొని కృష్ణుని మూలస్థానమైన మధురకు వెళ్తాను. (11) సురలకు నరులకు ఏది ఏదికాలగతో, ఓ తల్లి! కొంచం చెప్పు. పితరులకు, బ్రహ్మ లోకమునకు ఆపై దానికినీ చెందిన కాలగతిని చెప్పు. (12) ఆదుస్తరమైన ఘోరమైన కాలగతిని దాటి హరిపదానికి చేరుతాను. ఇట్టి ఉపాయాన్నినాకివ్వు, ఓ కమలాలయ! (13) దూరం నుండే రాత్రింబగళ్ళు ఎవని పాదపద్మములను దేవతలు, బ్రహ్మ ఈశుడు, శేషుడు మొదలగువారు ధ్యానిస్తారో ఆతని వక్షఃస్థలమందు నివసించేదానివి నీవు. (14) ఉద్దవుని మాటవిని కమలాలయనవ్వింది. వస్త్రంతో, ఆతని కన్నీటిని తుడిచి ఆమె, ఆతనితో ఇట్లా అంది. (15) రాధ వచనమిట్లా - ఉద్దవ! మాధవి మాటను విని నీవు ఈ ప్రశ్నవేస్తున్నావు. స్త్రీ జాతి బలహీనురాలు, లోకమందు. నీకు నేనేమి జ్ఞానమిస్తాను. (16) ఓ వత్స! శుద్ధమైన కాలగతిని, భగవంతుడైన హరి తెలుసుకుంటాడు. బ్రహ్మ, మహేశుడు, శేషుడు నాలు వేదాలు (17) తెలుసుకుంటాయి. ఓ పుత్రక! వేదాన్ననుసరించి సజ్జనులు కొంచం తెలుసుకుంటారు. గోలోకంలో రాసమండలమందు కృష్ణుని నోటినుండి విను. (18) గోలోకమందు, వైకుంఠ బ్రహ్మలోకాలలో ఇప్పుడు ఏ కాలగతి ఉందో దానినినీకు చెబుతాను. (19) నరులకు,పితరులకు, దేవతలకు బ్రహ్మలోకం మొదలగువానికి, బ్రహ్మాండము నుండి బయట ఉన్న లోకాలకు పాతాళ లోకాలకు నిశ్చితమైన (20) దాటరాని కాలగతిని పండితులు ఏ ఉపాయంతో దాటుతారో చెబుతాను, విను, ఓ బుధశ్రేష్ఠుడ! (21) కాలమునకు కాలమైన, జగత్తునకు గురువైన, జగత్తునకు నాధుడైన వానినిభజిస్తారు. ఆతడు నిర్గుణుడు,నిరీహుడు, పరమాత్మ ఈశ్వరుడు (22) ఆ సదాత్ముడు లేకపోతే ఈశరీరం వెంటనే పడిపోతుంది. ఆకాలగతిని సేవించి మాత్రమే తరిస్తాడు తప్పక. (23) అందరి ప్రాణుల ఆయస్సును సూర్యుడే హరిస్తాడు. శ్రీహరికి శుద్ధభక్తులైనవారి, సజ్జనుల, పుణ్యవంతుల ఆయస్సును హరించడు. (24) ఓ పుత్రక విధికి మానసిక పుత్రులైన వారిని నలుగురిని చూడు. వారు సనకాది భాగవతులు. వారి వయస్సు సుస్థిరమైనది. (25) రుద్రాదులను వయస్సుతో ఆదిత్యులను, జ్ఞానుల గురువులకు గురువులను, బాలురను, అనుపనీతులను, ఐదు సంవత్సరాల శిశువులలా ఉన్నవారిని, (26) అంతర్గతంగా చాలా గొప్పవైన వారిని ఎప్పుడూ చిరునవ్వు గల వారిని, దిగంబరులను, శ్రీకృష్ణుని ధ్యానంతో పవిత్రులైన వారిని, తీర్థమువలె పవిత్రులైన వారిని, వైష్ణవులను, (27) వేదవేదాంగ శాస్త్రముల చింతలేని వారిని, మానసికంగా బాగా వికసించిన వారిని, రాత్రింబగళ్ళు ఎప్పుడూ, భక్తితో, హరి భావన యందు తత్పరులైన వారిని.
మూ॥ బాహ్యపూజావిహీనాంశ్చ పూతాన్మానసికాం స్తథా ।
మృత్యుంజయాన్ మహాభాగాన్ కాలవ్యాలజీతస్తథా ॥
సనకంచసనందంచ తృతీయంచ సనాతనం ।
పరంసనత్కుమారం చ యే స్మరంతిచ సర్వశః ॥
తీర్థస్నానఫలం లబ్ధ్వా ముచ్యంతేకృత పాతకాత్ ।
హరిభక్తిర్భవత్యేషాంహరిదాస్యం లభంతిచ ॥
మృకండుబాలకం పశ్యకర్మణాచ ద్విజోత్తమం ।
దశవర్షాయుతం తీవ్రం జ్వలంతం బ్రహ్మతేజసా ॥
హరిమేవ మతః పశ్చాత్సప్త కల్పాంతజీవినం ।
వోడుం పంచశిఖంపశ్య లోమకంచా సురింతథా ॥
సర్వకర్మ విహీనంచ హరి సేవన తత్సరం ।
శతకల్పాయుషం చైవధ్యాయమానం హరేః పదం ॥
జమదగ్నేఃసుతం పశ్యరామంతం చిరజీవినం ।
హనుమంతం బలిం వ్యాసమశ్వత్థామాన మేవచ ॥
విభీషణం కృపం విప్రం జాంబవంతంచ భల్లుకం ।
హరిభావనయా చైతేశుద్ధాః సుచిరజీవినః ॥
సిద్ధేంద్రేషు మునీంద్రేషునరేష్వన్యేషు చోద్ధవ ।
హరిభావేన శుద్ధాశ్చ సర్వేతే చిరజీవినః ॥
ప్రహ్లాదం పశ్యదైత్యేషు హిరణ్యకశిపోః సుతం ।
హరిద్విషోదురంతస్య హరిభావన తత్పరం ॥
చిరాయుషం కాలజితం పశ్యాన్యం చాప్యసం జ్ఞకం ।
అనేక జన్మతహసా లబ్ధ్వా జన్మచ భారతే ॥
యేహరింతం న సేవంతే, తేమూఢాః కృతపాపినః ।
వాసుదేవం పరిత్యజ్య విషయే నిరతోజనః ॥
త్యక్వాఽమృతం మహామూడో విషంభుంక్తే నిజేచ్ఛయా ।
కస్యస్త్రీ కస్యవా పుత్రః కస్యవాబాంధవాస్తథా ॥
కఃకస్య బంధుః విపది శ్రీకృష్ణేన వినాభువి ।
తస్మాత్సంతః సదాకృష్ణం భజంత్యేవదివానిశం ॥
జన్మమృత్యుజరా వ్యాధి హరం సర్వహరం పరం ।
కాలస్యతరణోపాయం భజనం పరమాత్మనః ॥
ఆనందనందన స్యైవ పరిపూర్ణతమస్యచ ।
శృణుకాలగతిం వత్సమదీయ జ్ఞానగోచరాం ॥
నరాణాంచ పితృణాంచ సురాణాం చాపిబ్రహ్మణః ।
నాగానాంరాక్షసాదీనాం తత్పరేషాంచ పుత్రక ॥
కథయామి నిగూఢార్థం సావధానం నిశామయ ।
సర్వస్మాచ్ఛ పరస్థానం సర్వాధారో మహాన్విరాట్ ॥
యస్యలోమసు విశ్వానిచాసంఖ్యానిచ తానిచ ।
సర్వస్మాచ్చ పరం సూక్ష్మం పరమాణుం నిశామయ ॥
కాలారంభాత్మకం సర్వమనూహం పరమీప్సితం ।
పరమః సద్విశేషాణాం అనేకోఽసంయుతః సదా ॥
పరమాణుఃసవిజ్ఞేయో నృణామైక్య భ్రమోయతః ।
పరమాణుద్వయేనాణు స్త్రసరేణుస్తు తే త్రయః ॥
త్రసరేణుత్రికేణాపి తృటిరుక్తా మనీషిభిః ।
వేధస్తృటిశతేనైవ త్రివేధన, లవస్తథా ॥
బాహ్యపూజలేనివారు, మానసికంగా పవిత్రులైనవారు, మృత్యుంజయులు, మహాభాగులు, కాలమనువ్యాలము (పాము) జయించిన వారు. (29) వారేసనకుడు, సందుడు, సనాతనుడు, సనత్కుమారుడు వీరిని అన్ని విధములుగా స్మరించినవారు. (30) తీర్దమందు స్నానం చేసి నందువల్ల కలిగే ఫలమును పొంది చేసిన పాపం నుండి ముక్తులౌతారు. వీరికి హరిభక్తి కల్గుతుంది. హరిదాస్యాన్ని పొందుతారు. (31) మార్కండేయునిచూడు, కర్మవల్ల ద్విజోత్తముడు. పదిసంవత్సరాలవాడు బ్రహ్మతేజస్సుతో తీవ్రంగా వెలుగొందుచున్నాడు. (32) హరినే నమ్మినవాడు, సప్తకల్పముల చివరదాకా ఉంటాడు. ఐదు శిఖలు కలిగి తరింపదలచిన లోమకుడను ఆసురుణ్ణి చూడు, (33) ఏకర్మలులేనివాడు, హరి సేవనతత్పరుడు. శతకల్పముల కాలము హరిపదములను ధ్యానించేవాడు. (34) చిరజీవియైన జమదగ్ని సుతుడైన పరశురాముని చూడు. హనుమంతుని, బలిని, వ్యాసుని, అశ్వత్థామను చూడు. (35) కృపాళుడు, విప్రుడైన విభీషణుని, భల్లూకుడైన జాంబవంతుని చూడు. వీరంతా హరిభావనతో శుదులైనవారు, చిరజీవులు. (36)సిద్దేంద్రులు, మునీంద్రులు, ఇతర నరులు వీరిలో ఓ ఉద్దవ! హరిభావనతో శుదులైన వారంతా చిరంజీవులు(37) హిరణ్యకశిపు సుతుడైన ప్రహ్లాదుని దైత్యులలో చూడు. అంతములేని హరిద్వేషియైన హిరణ్యకశిపు సుతుని ప్రహ్లాదుని, హరిభావనతత్పరునిచూడు. (38) చిరాయుస్సు కల కాలమును జయించిన, పేరులేని ఇతరుని చూడు. అనేక జన్మల తపస్సువల్ల భారతదేశమందు జన్మపొందాడు. (39) హరిని సేవించని వారు మూడులు, పాపం చేసినవారు. వాసుదేవుని మరచి విషయములందు ఆసక్తిగల జనుడు. (40) అమృతాన్ని వదలి స్వేచ్ఛగా విషాన్ని భుజించే మహామూఢుని వంటివాడు. ఎవడి భార్య, ఎవని కొడుకు, ఎవని బంధువులు. (41) ఎవడు ఎవనికి బంధువు. భువిలో ఆపదలో శ్రీకృష్ణుడు తప్ప ఎవరులేరు. అందువల్ల సజ్జనులు రాత్రింబగళ్ళు ఎప్పుడూ కృష్ణుని భజిస్తారు. (42) జన్మ మృత్యుజర వ్యాధులను హరించేవాడు, అన్నిటిని హరించేవాడు, పరుడు, ఆ పరమాత్మ భజనము కాలాన్ని దాటటానికి చక్కని ఉపాయము. (43) పరిపూర్ణతముడైన ఆనందనందనుని కాలగతిని విను. ఓ వత్స! నాజ్ఞానమునకు తెలిసిన దానినిచెప్తాను. (44) నరులకు, పితరులకు, సురలకు, బ్రహ్మకు, నాగులకు,రాక్షసాదులకు, ఓ పుత్రక! తత్పరులైన వారికి (45) నిగూఢమైన అర్థమును చెబుతాను. సావధానంగా వినండి. అన్నింటికన్న పరమైన స్థానము. సర్వాధారుడు, మహావిరాట్టు. (46) ఆతని రోమములందు ఆ అసంఖ్యాకములైన విశ్వములున్నాయి. అన్నిటికన్న పరుడు, సూక్ష్ముడు, పరమాణువు, విను. (47) కాలారంభాత్మకుడు. సర్వుడు. ఊహకందనివాడు, పరుడు, ఈప్సితమైనవాడు. పరముడు. అనేక మంచివిశేషణములు కలవాడు. అనేకుడు, ఎప్పుడూ అసంయుతుడు (48) ఆతడు పరమాణువని తెలుసుకో. నరులకు ఐక్య భ్రమను కల్గించేవాడు. రెండు పరమాణువులు అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. (49) మూడు త్రసరేణువులతో ఒకత్రుటి. నూరుత్రుటులైతే ఒక వేధ. మూడు వేధలతో ఒక లవము.
మూ॥ త్రిలవేన నిమేషశ్చ త్రినిమే షేణచ, క్షణః ।
కాషాపంచక్షణేనైవ లఘుశ్చ దశకాష్ఠయా ॥
లఘుపంచ దశం దండః తత్ప్రమాణం నిశామయ ।
ద్వాదశార్థ పలోన్మానం చతుర్భి శ్చతురంగులైః ॥
స్వర్ణమా షైఃకృతచ్ఛిద్రం యావత్ప్రస్థ జలపుతం ।
దండద్వయే ముహూర్తః స్యాత్ షష్ఠిదండాత్మికాతిథిః ॥
తదష్టభాగః ప్రహరః ప్రమాణంచ నిరూణం ।
చతుర్భిః ప్రహరైః రాత్రిః చతుర్భిః దినముచ్యతే ॥
తిథిపంచదశేనైవ పక్షమానం ప్రకీర్తితం ।
పక్షద్వయేన మాసః స్యాచ్ఛుక్ల కృష్ణాభిధేనచ ॥
ఋతుర్మాసద్వయేనైవ తత్ షట్కేనైవవత్సరః ।
వసంతగ్రీష్మ వర్షాశ్చ శరథేమంత శీతకాః ॥
వర్షాఃపంచవిధాజ్ఞేయాః కాల విద్భిః నిరూపితాః ।
సంవత్సరః ప్రవత్సర ఇలావత్సర ఏవచ ॥
అనువత్సరో వత్సరోఽయమితి కాలవిదోవిదుః ।
అబ్ధోద్విషట్కమాసైశ్చతన్నామశృణుచోద్ధవ ॥
వైశాఖో జ్యేష్ఠ ఆషాఢః శ్రావణోభాద్ర ఏవచ ।
ఆశ్వినః కార్తికోమార్గః పౌషోమాఘస్తు ఫాలునః ॥
చైత్రస్తుచరమోజ్ఞేయో వర్షశేషోనిరూపితః ।
వసంతశ్చైత్రవైశాఖ మాసయుగ్మేన కీర్తితః ॥
జ్యేష్ఠాషాఢద్వయేనైవ గ్రీష్మస్తు పరికీర్తితః ।
వర్షా శ్రావణ భాద్రేచ హ్యాశ్వినేకార్తి కేశరత్॥
మార్గేపౌ షేచ హేమంతః శిశిరోమాఘఫాల్గునే ।
అబ్దస్తుచాయనే ద్వేవైచోత్తరే దక్షిణాయనే ॥
మాఘాదిషడ్వినిర్మితముత్తరాయణమీప్సితం ।
శ్రావణాదిమాసషట్కం దక్షిణాయనమేవచ ॥
నక్త వృద్ధిః శ్రావణాచ్చపౌషపర్యంతమేవచ ।
ప్రతిపత్పూర్ణిమాంతస్య శుక్లపక్షఃప్రకీర్తితః ॥
పూర్ణిమాయాః ప్రతిపదశ్చామావాస్యాంత ఏవచ ।
కృష్ణపక్షస్తు విజ్ఞేయోవేద విద్భిర్నిరూపితః ॥
ద్వితీయాచ తృతీయాచ చతుర్థిపంచమీ తథా ।
షష్ఠీచ సప్తమీచైవ హ్యాష్టమీనవమీ తథా॥
దశమ్యేకాదశీచాపిద్వాదశీచ త్రయోదశీ ।
చతుర్దశీ కుహర్యావత్ దినంతు గణనంస్కృతం ॥
అశ్వినీభరణీచాపికృత్తికారోహిణీ తథా ।
మృగశిరస్తథాఽఽర్ద్రాచ నక్షత్రేద్వేపునర్వసూ ॥
పుష్యాశ్లేషే మఘాచైవ పూర్వాచోత్తరఫల్గునీ ।
హస్తచిత్రే తథాస్వాతీ విశాఖా చానురాధికా ॥
జ్యేష్ఠామూలం తథా జ్ఞేయ పూర్వాషాఢత్తరా తథా ।
శ్రవణాభిజితీ చైవ ధనిషాచ ప్రకీర్తితా ॥
తతః శతభిషాజ్ఞేయ పూర్వాభాద్రపదా తథా ।
తథోత్తరాతు విజ్ఞేయారేవతీ చరమా స్మృతా ॥
అష్టావింశతి నక్షత్రం కలత్రంశశినస్తథా ।
క్రమేణతాభిఃసార్థంచ చంద్రస్తిష్ఠతి నిత్యశః ॥
మూడులవములతో నిమేషము. మూడు నిమేషములతో క్షణము. ఐదు క్షణములతో కాష్టము. పదికాష్టములతో లఘువు. (51) పది హేను లఘువులు ఒకదండం. దాని ప్రమాణము, విను. నాలుగు సార్లు నాలుగు వేళ్ళతో పద్దెనిమిది (ఆరు) పలములైతే (పరిమాణమైతే) అది మానము. (52) బంగారు మాషములతో ఛిద్రము చేయగా ఎంతవరకైతే జలపుతి వ్యాపిస్తుందో (అందు). రెండు దండలైతే ఒక ముహూర్తము. అరవైదండములు ఒకతిథి. (53) అందు ఎనిమిదవ భాగం ప్రహర, అని ప్రమాణం చెప్పబడింది. నాలుగు ప్రహరలైతే ఒకరాత్రి నాలుగు ప్రహరలైతే దినము. (54) పది హేను తిథులైతే ఒక పక్షము. రెండు పక్షములు మాసము. శుక్లము, కృష్ణ పక్షము అని. (55) రెండు నెలలకొక ఋతువు. ఆరు ఋతువులు ఒక వత్సరము. వసంతగ్రీష్మ వర్ష శరత్ హేమంత శీత (శిశర)ములని (56) కాలం తెలిసినవారు సంవత్సరాలు ఐదు విధాలన్నారు. అవి సంవత్సర, ప్రవత్సర, ఇలావత్సర (57) అనువత్సర, వత్సరమని ఐదు విధాలు. పన్నెండు నెలలు ఒక సంవత్సరము. (58) నెలల పేర్లు ఇవి. వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢ, శ్రావణ, భాద్ర, ఆశ్విన, కార్తీక, మార్గ, పౌష, మాఘపాలున (59) చైత్రములని, చైత్రము చివరిది. వర్షశేషము అన్నారు. చిత్రవైశాఖాలు వసంతం, (60) జ్యేష్ఠ ఆషాఢ గ్రీష్మం, శ్రావణ భాద్ర పదాలు వర్షము. ఆశ్విన కార్తికములు శరత్తు (61) మార్గశీర్ష పౌషములు హేమంతము. మాఘ పాలునములు శిశిరము. సంవత్సరానికి రెండు అయనాలు అవి ఉత్తర దక్షిణాయనాలు (62) మాఘ మొదలు ఆరుమాసాలు ఉత్తరాయణం, శ్రావణం మొదలు ఆరు మాసాలు దక్షిణాయనం (63) శ్రావణం నుండి పౌషం వరకు రాత్రి ఎక్కువ. ప్రతి పదనుండి పూర్ణిమ వరకు శుక్ల పక్షమనబడుతుంది. (64) పూర్ణిమ తరువాతి ప్రతిపదనుండి అమావాస్య వరకు కృష్ణ పక్షమని వేదవేత్తలు నిరూపించారు. (65) ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి (66) దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరకు లెక్కించాలి. (67) ఆశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర, పునర్వసు, (68) పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, (69) జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, అభిజిత్, ధనిష్ఠ, (70) శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఇది చివరిది. (71) ఇట్లా నక్షత్రాలు ఇరువది ఎనిమిది. ఇవి చంద్రునికి భార్యలు, క్రమంగా వాటితో కూడి చంద్రుడు రోజు ఉంటాడు.
మూII సప్త వింశతి నక్షత్రం కలత్రంచ శ్రుతౌ స్మృతం ।
అభిజిచ్చ్రవణచ్ఛాయా తేనాష్టా వింశతిః స్మృతా॥
ఏకదా చ మధౌ చంద్రో రోహిణ్యా వామయాసహ ।
రేమే దివానిశం నిత్యం శ్రవణా చ చుకోపసా ॥
ఛాయాంచదత్వా చంద్రాయయయౌతా తాంతికం భియా ।
తతః పితరమాదాయ సాచక్రేచ విభాగకం ॥
బభూవ తేన నక్షత్రమభిజిన్నామకం పురా ।
ఏతచ్చ్రుత్వా కృష్ణముఖాచ్ఛతశృంగేచ పర్వతే ॥
నక్షత్రం కథితం వత్స తిథ్యాభ్రమతినిత్యశః ।
యోగంచ కరణంచైవమద్వత్రేణ నిశామయ ॥
విష్కంభః ప్రీతిరాయుష్మాన్ సౌభాగ్యం శోభనస్తథా ।
అతిగండః సుకర్మాచ ధృతిః శూలస్తథైవచ ॥
గండోవృద్ధిః ధ్రువనైశ్చైవ వ్యాఘాతో హర్షణస్తథా ।
వజ్రం సిద్ధిర్వ్యతీపాతో వరీయాన్ పరిఘఃశివః ॥
సిద్ధిః సాధ్యఃశుభః శుక్లో బ్రహ్మేంద్రో వైధృతిస్తథా ।
కీర్తితస్తే యోగగణః కరణం శ్రూయతామితి ॥
బవశ్చబాలవశ్చైవ కౌలవః తైతిలస్తథా ।
గరశ్చవణిజశ్చాపి విశిష్టిః శకునిస్తథా ॥
చతుష్పాచ్చాపినాగశ్చ కింస్తుఘ్న ఇతికీర్తితం ।
నరాణాంచాపిమా సేన, పితృణాం చ దివానిశం ॥
శుక్లచాపిదినం తేషాం కృష్ణోనక్తం ప్రకీర్తితం ।
వత్సరేణన రాణాంచ సురాణాం చదివానిశం ॥
దినం తేషాముత్త రేచ నక్తంచ దక్షిణాయనే ।
మన్వంతరం తు దివ్యానాం యుగానామేక సప్తతిః ॥
మనోరాయుః పరిమితం శక్రస్యాయుః ప్రకీర్తితం ।
పంచవింశత్సహస్రంచ తథా పంచశతం పరం ॥
తత్రసూర్య గతిర్నాస్తి శక్రపాతానుసారతం (క) ।
దివానీశంచ జానంతి బ్రహ్మలోకనివాసినః ॥
దండద్వయం నరపలం శకపాతేనతత్పలం ।
ఏవం త్రింశద్దినేనైవ ధాతుర్మాసః ప్రకీర్తితః ॥
అబ్ధో ద్వాదశభిర్మాసైః ఏవంతస్య శతాయుషః ।
బ్రహ్మణః పతనేనైవ నిమేషాచ్చ్రీహరేరపి ॥
ధాతుఃపాతానుసారేణ వైకుంఠే న దివానిశం ।
తత్రసూర్య గతిర్నాస్తి చైవం గోలోకతః స్మృతః ॥
వైకుంఠవాసినః సర్వే నవైజానంత్య హర్నిశం ।
చంద్రస్యాపి గ్రహాణాంచ గతిర్నాస్తి చతత్రవై ॥
చక్రం నైవభ్రమత్యేవ రాశీనామిచ్చయా హరేః ।
దినంచ తేజసాదీప్తం కృష్ణస్యపరమాత్మనః ॥
నక్తం తేజోవిహీనంచహరౌచ మందిరం గతే ।
ఏవం కాలగతిస్తత్ర విష్ణులోకేఽస్తి సంతతం ॥
కాలస్వరూపోభగవాన్ పరమాత్మా నిరాకృతిః ।
చంద్రసూర్య గతిర్నాస్తి పాతాలేషుచ సప్తసు ॥
ఆను॥ ఇరువది ఏడు నక్షత్రాలని, భార్యలని శ్రుతియందు చెప్పబడింది. అభిజిత్తను నది శ్రవణ నక్షత్రపుఛాయ. అందువలన ఇరువది ఎనిమిది నక్షత్రాలు అన్నారు. (73) ఒకసారి వసంత ఋతువులో చంద్రుడు, సౌందర్యవతియైన రోహిణితో, ప్రతిరోజు రాత్రింబగళ్ళు రమించాడు. అప్పుడు శ్రవణకోపించింది. (74) చంద్రునకు ఛాయను ఇచ్చి (అభిజిత్తును) భయంతో తండ్రి దగ్గరకు వెళ్ళింది. పిదవ తండ్రిని తెచ్చి విభాగం చేసింది. (75) అందువల్ల ఇదివరలో అభిజిత్తనే నక్షత్ర మేర్పడింది. శత శృంగపర్వతమందు కృష్ణుని ముఖం నుండి దీన్ని విన్నాడు. (76) ఓవత్స! నక్షత్రమెప్పుడు తిథితో కలిసి తిరుగుతుందని చెప్పారు. యోగకరణములను నానోటి నుండి విను. (77) విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము. అతిగండము, సుకర్మ, ధృతి, శూల (78) గండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము వరీయము, పరిఘ, శివము, (79) సిద్ధి, సాధ్యము, శుభము, శుక్లము, బ్రహ్మ, ఐంద్రము, వైధృతి ఇవి యోగములని చెప్పబడ్డాయి. ఇక కరణములు - (80) బవ, బాలవ, కౌలవ,తైతిల, గర, వణిజ, విష్టి శకుని (81) చతుష్పాత్, నాగము, కింస్తుఘ్నము, అని. నరులకు ఒక మాసమైతే పితరులకు, పగలు రాత్రి. (82) శుక్లపక్షం పగలు, కృష్ణ, పక్షంరాత్రి. నరులకు సంవత్సరమైతే సురలకు ఒక పగలు రాత్రి (83) ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల డెబ్బది ఒక్క యుగాలు ఒక మనువు కాలం, (84) మనువు ఆయువు, పరిమితమైనది. శక్రుని ఆయువు ఇరువది ఐదువేల ఐదువందల పరమైనది, అని (85) అక్కడ సూర్యుని గమనం లేదు. శక్రుని పాతముననుసరించి బ్రహ్మలోక నివాసులు రాత్రింబగళ్ళేరుగుదురు. (86) నరపలము దండద్వయము అట్లా శక్రుని పాతంతో ఏర్పడ్డపలము. ఇట్లా ముప్పది. దినములైతే ధాతయొక్క మాసంగా చెప్పబడింది. (87) పన్నెండు మాసములైతే ఒక సంవత్సరము. అట్లా బ్రహ్మకు నూరు సంవత్సరాలు. బ్రహ్మ పతనంతో శ్రీహరికి, నిమేషము, (88) ధాతువు పాతముననుసరించి, వైకుంఠములోపగలు రాత్రి ఉండదు. అక్కడ సూర్యగతి లేదు. ఇట్లా గోలోకమని తెలిపారు. (89) వైకుంఠవాసులకు పగలు రాత్రి తెలియదు. అక్కడ చంద్రుని, గ్రహముల గమనం లేదు. (90) రాశిఇచ్ఛననుసరించి అక్కడ రాశి చక్రము తిరుగదు. పరమాత్ముడైన కృష్ణుని తేజస్సుతో వెలిగేదిదనము. (91) హరిమందిరంలోకి వెళ్ళినప్పుడు, హరి తేజస్సు ఉండనిచో రాత్రి. ఇట్లా విష్ణులోకంలో ఎప్పుడు కాలగమనము ఉంటుంది. (92) భగవంతుడు కాలస్వరూపుడు, పరమాత్మ, ఆకారరహితుడు. ఏడు పాతాళ లోకములందు చంద్ర సూర్యుల గమనం లేదు.
మూ॥ తద్వాసినశ్చజానంతి శంకంతే చ దివానిశం ।
దినేచమూర్ధ్నినాగానాం మణిర్జ్వలతి నిత్యశః ॥
సంధ్యాయాం దీప్త మగ్నిశ్చ రాత్రిశ్చ తమసాఽవృతా ।
కాలంతామ్రీ ప్రమాణేన జానంతి తన్నివాసినః ॥
యథాభువి తథాతత్ర పరిమాణం ప్రకీర్తితం ।
కృతంత్రేతా ద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం ॥
దివ్యైర్ద్వాదశ సాహస్రైర్వత్సరైశ్చాపి తన్మితం ।
అష్టౌశతాన్య ప్యధికం సహస్రాణాం చతుష్టయం ॥
దివ్యైర్వర్షైః కృతయుగం కాలవిద్భిః నిరూపితం ।
అష్టావింశత్సహస్రాణ్య ప్యధికం పరిమాణం ॥
లక్షాణాంచ సప్తదశం నృమానం పరికీర్తితం ।
అధికం షట్ శతాన్యేవ సహస్రాణాం శతంతథా ॥
దివ్యైర్వర్షైశ్చ త్రేతేతి వత్సకాలవిదో విదుః ।
షణ్ణవతి సహస్రాణి లక్షైః ద్వాదశభిస్సహ ॥
నృణాంవర్షైశ్చ త్రేతేతికాలవిద్భిః ప్రకీర్తితః ।
చతుష్టయం శతానాంచా ప్యధికం ద్విసహస్రకం ॥
వర్షం దివ్యం ద్వాపరంచ కాలజ్ఞైః పరికీర్తితం ।
చతుఃషష్టి సహస్రాణిలక్షై రష్టభిరేవచ ॥
నృణాం వర్షైః ద్వాపరంచ కాలజ్ఞైః పరికీర్తితం ।
అధికం ద్విశతం చైవదివ్యం వర్షసహస్రకం ॥
ఏవం మితం కలియుగం వత్సప్రాజ్ఞైర్నిరూపితం ।
ద్వాత్రింశచ్చ సహస్రంచ చతుర్లక్షం నృమానకం ॥
వర్షంచేతి కలియుగే చకార కాలకోవిదః ।
లక్షద్విచత్వారింశద్భిః సహవింశత్సహస్రకై:
నృమాన వర్షైః కాలజ్ఞైః వ్యక్తమేవచతుర్యుగం ॥
ఇతి తే కథితం వత్సవాల సంఖ్యా నిరూపణం ।
యథాశ్రుతం యథాజ్ఞానం గచ్చ వత్స హరేఃపురం ॥
ఇతి బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే రాధోద్ధవ సంవాదే కాల నిరూపణం నామషజ్ఞవతి తమోఽధ్యాయః ॥
అక్కడి వారు కూడా రాత్రింబగళ్ళు తెలుసుకుంటారు. పగటి పూట ఎప్పుడూ నాగుల తల పై మణి వెలుగుతుంది. (94) సంధ్యా కాలమందు అగ్నిమండుతుంది. రాత్రి చీకటి ఆవరిస్తుంది. అక్కడ ఉన్నవాళ్ళు కాలమును తామ్ర ప్రమాణంతో (ఎరుపులోని హెచ్చు తగ్గుల బట్టి) తెలుసుకుంటారు. (95) భూమి పై పరిమాణం ఎట్లో అక్కడ కూడా అట్లాగే. కృతవ్రేతద్వాపర కలి అని నాలుగు యుగాలు. (96) పన్నెండు వేల దేవ వత్సరాల కాలమది. నాలుగు వేల ఎనిమిది వందల (97) దేవ సంవత్సరాల కాలం కృతయుగము. అది పది హేడు లక్షల ఇరువది ఎనిమిది వేల మానవ ప్రమాణంగా చెప్పారు. ఒక లక్ష ఆరువందల సంవత్సరాల కాలము. (98, 99) దేవ వరమైతే త్రేతాయుగమని కాలవిదులన్నారు. పన్నెండు లక్షల తొంబది ఆరువేల (100) మానవ సంవత్సరాలు త్రేతాయుగమన్నారు. రెండు వేల నాలుగు వందల (101) దేవవరములు ద్వాపరమని కాలజులన్నారు. ఎనిమిది లక్షల అరువది నాలుగు వేల (102) మానవ వత్సరములు ద్వాపరయుగమని కాలజ్ఞులన్నారు. దేవతల ఒక వేయి రెండు వందల సంవత్సరాలు పరిమితిగలది కలియుగమని ప్రాజ్ఞులన్నారు. నాలుగు లక్షల ముప్పది రెండు వేల నరమానము సంవత్సరములు కలియుగమని కాలకోవిదులన్నారు. (103, 104) నలుబది రెండు లక్షల ఇరువదివేల నరమాన సంవత్సరములు నాలుగు యుగములని కాలజ్ఞులన్నారు. (త్రేత మూడు వేల ఆరువందల దేవ) సంవత్సరాలు అయ్యుండాలి. మొత్తం నరవత్సరాలు నలుబది మూడు లక్షల రెండు వందలు కావాలి అట్లైతే సరిపోతుంది. దేవతలది 12 వేలు నరులది 43 లక్షలు చిల్లర) (105) ఓవత్స! ఈ విధంగా కాలసంఖ్యానిరూపణాన్ని నీకు చెప్పాను. నేను విన్నట్లు నాకు తెలిసినట్లు చెప్పాను. ఓవత్స! హరిపురానికి వెళ్ళు (106) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రాధ ఉద్ధవ సంవాదమందు కాలనిరూపణమనేది తొంబది ఆరవ అధ్యాయము.
Summary of chapter 96 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Presenting profound philosophical wisdom, the text recounts the historical meeting between King Nimi and the nine saintly sons of Rishabhadeva, known as the Nine Yogendras. The sage brothers answered the king's deep inquiries regarding the nature of Bhakti, the characteristics of pure devotees, the subtle working of Māyā, and the specific worship procedures for each Yuga, establishing that loving surrender to Lord Śrī Kṛshṇa is the ultimate goal of human life.