మూ॥నారాయణ ఉవాచ :
అథభీతారక్షకాస్తే సమూచుర్బాణమీశ్వరం ।
స్కందం గణేశం దుర్గాంచ దండవత్ర్పణిపత్యచ ॥
రక్షకా ఊచుః
అహోదుష్టశ్చకాలో యమతీవ దురతిక్రమః ।
స్వతంత్రా బాలికాప్రౌడా పతిమిచ్ఛతిసాంప్రతం ॥
అసంగసంగమం నాధసాధూనాం దుఃఖకారణం ।
సంసర్గజా గుణదోషాభవంతి సతతం నృణాం ॥
చిత్రలేఖాస్వయందూతీ సమానీయ పరంవరం ।
రణశూరం మహావీరం నృపేంద్రంచ మహారథం ॥
యువానంవ్యాధిహీనంచ కందర్పదపిసుందరం ।
సంభోగం కారయామాస బుబుధే న దివానిశం II
సాంప్రతంతవకన్యాసాజప్యూషా గర్భవతీసతీ ।
కులజాకులయోశ్చైవ తప్తాంగార స్వరూపిణీ ।
దౌహిత్రీవాదౌహిత్రీ బభూవ సాంప్రతంతవ ।
కన్యాంపశ్యమహాప్రౌఢాం నగరీం నాగరాన్వితాం ॥
నఖవిక్షత సర్వాంగీంవరాధీనాంచ చంచలాం ।
పుంసశ్చ సంగినీం శశ్వత్ రహస్యేరతి సంగినీం ॥
సస్మితాంస కటాక్షాంచ చంచలేక్షణ వీక్షితాం ।
ఏవంశ్రుత్వాలజ్జితశ్చ బాణస్తత్రచుకోపహ ॥
యుద్ధాయచ మతించక్రేవారితః శంభునాభృశం ।
వారితశ్చగణేశేన స్కందేన శివయాతథా ॥
భైరవ్యాభద్రకాళ్యాచయోగినీభిశ్చ సంతతం ।
అష్టభిః భైరవైశ్చైవ రుదైరేకాదశాత్మకైః ॥
భూతైఃపేతైశ్చ కూష్మాండై: వేతాలైర్ర్బహ్మ రాక్షసైః ।
యోగీందైరైపి సిద్ధేందైః రుదైః చండాదిభిస్తథా ।
కోటర్యాగ్రామదేవ్యాచ యథామాత్రాహితాయచ ।
ఉవాచశంకరోణం మూఢంపండితమానినం
హితం సత్యంనీతిశాస్త్రం పరిణామసుఖావహం ॥
శ్రీమహాదేవ ఉవాచ :
శృణుబాణ ప్రవక్ష్యామికథామేతాం పురాతనీం ॥
భువోభారావతరణే భారతే స్వయమీశ్వరః ।
నిహత్య సర్వాజేంద్రాన్ ద్వారకాయాం విరాజతే ॥
యస్యలోమసువిశ్వానితస్యవాసః సదీశ్వరః ।
వాసుదేవ ఇతిఖ్యాతః కథ్యతేతేనకోవిదైః ॥
నారాయణుడిట్లా – ఇక రక్షకులు భయపడి, ప్రభువైన బాణునితో వారు చెప్పారు. స్కందుని, గణేశుని, దుర్గను సాష్టాంగంగా దండమువలె నమస్కరించి అన్నారు. (1) రక్షకులిట్లా - కాలము దుష్టమైంది. ఇది మిక్కిలి దాటరానిది. బాలిక స్వతంత్రురాలు, పౌడ, ఇప్పుడు భర్తను కోరుతున్నది. (2) ఓ నాధ! సంగము తగనివానితో సంగమము సాధువులకు దుఃఖకారణము. నరులకు ఎల్లప్పుడు సహవాసము వల్ల గుణములు దోషములు కలుతాయి. (3) చిత్రలేఖ స్వయంగా దూతి, పరుడైన వరుని తీసుకువచ్చింది.వాడు రణశూరుడు, మహావీరుడు, రాజశ్రేష్ఠుడు, మహారథుడు. (4) యువకుడు, వ్యాధిహీనుడు, కందర్పుని కన్న సుందరుడు. సంభోగం చేయించింది. రాత్రింబగళ్ళు వారు గమనించలేదు. (5) ఇప్పుడు నీకన్య ఆ ఉష, సతి, గర్భవతి, కులజురాలు, కులము వారికి కాలుతున్న (మండుతున్న) నిప్పులాటిది. (6) దౌహిత్రుడో లేదా దౌహిత్రియో నీకిప్పుడు కలిగింది. కన్యను చూడు, ఆమె మహాప్రౌఢ, నగరంనకు చెందింది. నాగరులతో కూడింది. (7) ఆమె అవయములన్నింటా నఖక్షతములున్నాయి, వరునకు అధీనమైనది, చాలా చంచల. పురుషునితో కూడింది. ఎప్పుడూ రహస్యంగా రతి సంగమం చేసేది. (8) చిరునవ్వుతో, ఓరచూపులతో, చంచలమైన కనులతో చూచేది. ఈరకమైన మాటలను భటులవలన విని సిగ్గుపడి అప్పుడు బాణుడు కోపగించాడు. (9) యుద్ధం చేయటానికి నిశ్చయించాడు. శివుడు మాటిమాటికి వారించాడు. గణేశుడు, స్కందుడు, పార్వతి వీరు వద్దన్నారు. (10) భైరవి భద్రకాళి యోగినులు ఎల్లప్పుడూ వద్దన్నారు. ఎనిమిదిమంది భైరవులు, ఏకాదశ రుద్రులు, (11) భూతకోటి, ప్రేతములు, భేతాళురు, బ్రహ్మరాక్షసులు, పిశాచములు (కూష్మాండ) యోగీంద్రులు, రుద్రేంద్రులు, రుద్రులు, చండాదులు (12) కోటరి, గ్రామ దేవత వీరంతా వద్దన్నారు తల్లి, పిల్లవాడి హితంకోరి చెప్పినట్లుగా చెప్పారు. మూడుడు, తనకుతాను పండితుడని భావించుకునే బాణునితో శంకరుడన్నాడు. నీతిశాస్త్ర బద్దమైన, హితమైన, సత్యమైన, పరిణామంలో సుఖం కలిగించే మాటచెప్పాడు. (13) శ్రీమహాదేవుడిట్లో - ఓబాణ! ఈ పురాతనకథను చెబుతాను, విను. (14) భూభారాన్ని తగ్గించే కొరకు భారతమందు ఈశ్వరుడు స్వయంగా జన్మించాడు. రాజేంద్రులందరిని చంపి ద్వారక యందున్నాడు. (15) ఆతని వెంట్రుకలందు లోకములున్నాయి. ఆతడు సత్, ఈశ్వరుడు. అందుకే వాసుదేవుడని ప్రసిద్ధిచెందినాడు అని తెలిసినవారంటారు.(16)
మూII ధాతుర్విధాతా భగవాన్ చక్రపాణిః స్వయంభువి ।
బ్రహ్మవిష్ణుశివాచీనామీశ్వరః ప్రకృతేః పరః ॥
నిర్గుణశ్చనిరీహశ్చ భక్తానుగ్రహ విగ్రహః ।
పరంబ్రహ్మ పరంధామ పరమాత్మాచదేహినః ॥
యస్మిన్ గతేశవోజీవః సంగ్రామ స్తేన సంభవేత్ ।
శస్త్రవిధోమహాకాశో యథామూఢదిశస్తథా ॥
తదాత్మాచ నిరాకారోదేహిచ ధ్యాన హేతునా ।
తస్యపుత్రోనిరుద్ధశ్చ మహాబలపరాక్రమః ॥
త్రైలోక్యమపిసంహర్తుంక్షణేనచక్షమ: స్వయం ।
సర్వేదేవాశ్చదైత్యాశ్చ బలవంతోమహారథాః ॥
తేసర్వేచానిరుద్దస్య కలాంనార్హంతిషోడశీం ।
యయోరేవం సమంవిత్తం యయోరేవ సమంబలం ॥
తయోర్వివాహామైత్రీచ నతుపుష్ట విపుష్టయోః ।
బలిఃపితాతేదైత్యానాం సారభూతోమహారథః ॥
క్షణేనయేననీతశ్చ సుతలంసహరేః కలా ।
సర్వేచాం శకలాః పుంసః పరిపూర్ణతమస్యచ
బృందావనేశ్వరశ్చాపి కృష్ణస్య పరమాత్మనః ॥
పార్వత్యువాచ :
ధ్యాయతే ధ్యాన నిష్ఠశ్చహృత్పద్మేచ దివానిశం ॥
బ్రహ్మామహేశః శేషశ్చ భగవంతం సనాతనం ।
దినేశశ్చ గణేశశ్చ యోగీంద్రాణాం గురోర్దురుః
ధ్యాయంతే పరమాత్మానం భగవంతం సనాతనం ॥
సనత్కుమారః కపిలోనలోనారాయణస్తథా ।
ధ్యాయంతే హృదయాంభోజే భగవంతం సనాతనం ॥
మనవశమునీంద్రాశ్చ సిద్ధేంద్రయోగినాం వరాః ।
ధ్యానాసాధ్యంచ ధ్యాయంతే భగవంతం సనాతనం ॥
సర్వాదిం సర్వబీజంచ సర్వేశంచ పరాత్పరం ।
ధ్యాయంతేజ్ఞానినః సర్వేభగవంతం సనాతనం ॥
గణేశ ఉవాచ :
అభాగ్యంచ బలేశ్చాపి వైష్ణవస్య మహాత్మనః ।
మూడో యమీదృశః పుత్రః ప్రహ్లాదస్యచధీమతః ॥
స్కంద ఉవాచ :
అయే భ్రాతర్నశ్రుతాచ హిరణ్యకశిపోః కథా ।
హిరణ్యాక్షస్యచ మధోః కైటభస్యమహాత్మనః
పూర్వజా స్తేఽఆపితేదైత్యామహాబలపరాక్రమాః ॥
క్రమేణ విష్ణునా నీతా లీలయా యమసాదనం ।
భగవాన్యస్య సంహర్తా స్వయం నారాయణః ప్రభుః ॥
తస్యకోరక్షితాభ్రాతః నివర్తస్వశుభాయచ ।
తేషాంచ వచనం శ్రుత్వాతానువాచసురేశ్వరః ॥
ధాతకు విధాత (సృష్టికర్త) భగవాన్ చక్రపాణి స్వయంగా భూమి పైనున్నాడు. బ్రహ్మ విష్ణు శివాదులకు ఈశ్వరుడు, ప్రకృతికి పరుడు (17) నిర్గుణుడు, నిరీహుడు, భక్తులననుగ్రహించే కొరకు రూపధారి. పరమైన బ్రహ్మ పరమైనస్థానము, దేహికి పరమమైన ఆత్మ (18) ఆతడు శరీరంనుండి వెళ్ళిపోతే జీవుడు శవమే. ఆతనితో యుద్ధం ఔతుంది. శస్త్రముతో సమానుడు, మహాకాశము, దిశలెట్లాగో ఆతడట్లా, ఓమూడుడ! (19) ఆతడు ఆత్మ నిరాకారుడు, ధ్యానమునకు కారణమైనవాడు, దేహమందుండువాడు. ఆతని కొడుకు అనిరుద్ధుడు. గొప్పబలపరాక్రమములు గలవాడు. (20) స్వయంగా ముల్లోకములను కూడా నశింపచేయుటకు, క్షణంలో, సమర్థుడు. దేవతలు, దైత్యులు, బలవంతులు, మహారథులు అంతా (21) వారంతా అనిరుద్ధుని కళలో పదహారవ భాగానికి కూడా తగరు. సమానమైన ధనము, సమానబలము కలవారికి (22) వివాహము మిత్రత్వము తగును. ఒకడు బలిసి, ఒకడు బక్కచిక్కి ఉంటే వారికి స్నేహముతగదు. బలి నీతండ్రి దైత్యులందరికీ సారభూతుడు, మహారథుడు. (23) అతడు క్షణకాలంలో సుతలానికి తీసుకుపోబడ్డాడు. అదిహరికళ, పరిపూర్ణతముడైనపురుషునకు అందరు అంశభాగములే. ఆతడు బృందావనేశ్వరుడు. కృష్ణుడు, పరమాత్మ ఆతని కళలే. (24) పార్వతి ఇట్లా అంది - ధ్యాననిష్ఠుడు తన హృదయపద్మంలో రాత్రింబగళ్ళు ధ్యానిస్తాడు. (25) బ్రహ్మ, మహేశ్వరుడు, శేషుడు, సనాతనుడైన భగవంతుని ధ్యానిస్తారు. దినేశుడు, గణేశుడు, యోగీంద్రులకు గురువైన వానిగురువు కూడా పరమాత్మను, భగవంతుని సనాతనుని ధ్యానిస్తారు. (26) సనత్కుమారుడు, కపిలుడు, నరుడు, నారాయణుడు వీరంతా తమ హృదయపద్మమందు సనాతనుడైన భగవంతుని ధ్యానిస్తారు. (27) మనువులు, మునీంద్రులు, సిద్దేంద్రులు, యోగులలో శ్రేష్టులు, ధ్యానమునకు అసాధ్యుడైన సనాతనుడైన, భగవంతుని ధ్యానిస్తారు. (28) అన్నిటికి ఆది, అన్నిటికి బీజము, సర్వేశ్వరుడు, పరాత్పరుడు వీరంతా సనాతనుడైన భగవంతుని జ్ఞానులంతా ధ్యానిస్తారు. (29) గణేశుడిట్లా - దురదృష్టము, వైష్ణవుడు మహాత్ముడు ఐన బలికి, ధీమంతుడైన ప్రహ్లాదునికి ఇటువంటి కొడుకు ఇట్టి మూడుడు ఎట్లా పుట్టాడు. (30) స్కందుడిట్లా - ఓ అన్నా! హిరణ్యకశిపుని కథ వినలేదా, హిరణ్యాక్షునికథ, మధుకైటభుల కథ వినలేదా ఆ మహాత్ముడు, ఆదైత్యులంతా నీకన్న ముందున్నవారు. మహాబలపరాక్రమములు కలవారు. (31) క్రమంగా విష్ణువు అవలీలగా వారిని యమసదనానికి పంపించాడు, భగవంతుడు, నాశకుడు, ప్రభువు స్వయంగా నారాయణుడే. (32) ఆతని నుండి రక్షించేవాడు ఎవడున్నాడు, ఓభాత! శుభం కొరకు మరలిపో. వారిమాటవిని అసురేశ్వరుడు వారితో ఇట్లన్నాడు. (33)
మూ॥ కోపరక్తాస్య నయనోధనుష్పాణిర్యథాంతి తకః ।
శృణుమాతః ప్రవక్ష్యామి శృణుతాతమహేశ్వర ॥
శృణుభ్రాతః గణపతే శృణుభ్రాతశ్చకార్తిక ।
శుభాశుభం ప్రాక్తనేన ప్రాణినాం కర్మిణాంతథా ।
కృతకర్మాతిరిక్తంచ కార్యం కేషించ వర్తతే ।
నానాప్తకాలేమైయతే విద్ధః శరశతైరపి ॥
తృణాల్రోణాపిసంస్పృష్టః ప్రాప్తకాలో న జీవతి ।
యస్మాచ్చయస్య నిర్వాణం విధాత్రా లిఖితంపురా ॥
తదేవనిత్యం సత్యంచ ని షేకః కేనవార్యతే ।
సంగ్రామే కాతరో మోహినిష్ఫలంతస్య జీవనం ॥
జయీ యశశ్చలభతే మృతః స్వర్గంచ గచ్ఛతి ।
ప్రవిశ్యకన్యాం గృహ్లాతి నగరం శివ రక్షితం ॥
పార్వత్యాచ గణేశేన యుద్ధేన బలినా తథా ।
కోవాగృహ్లాతికన్యాంచ కస్యవాజీవితస్యచ ॥
సగర్భాతవకన్యేతి సభాయాం రక్షకోవదేత్ ।
ఇతిమేవజ్రతుల్యంచ ప్రతికౌటం పరంవచః I
అతో నిరుద్ధం హత్వాచ ఘాతయిష్యామికన్యకాం ।
అన్యథాజ్వలదగ్నౌచ త్యక్ష్యామిచ కలేవరం ॥
కోటర్యువాచ:
శృణువత్స ప్రవక్ష్యామిమాతామహం తేసిధర్మతః ।
దురంతేనాపిపుత్రేణ పిత్రోర్ దుఃఖం పదేపదే ॥
కన్యాపరగృహీతాసాప్యన్య స్మైదాతుమక్షమా ।
శ్రీకృష్ణస్యాపిపౌత్రాయ ప్రద్యుమ్నస్య సుతాయచ ॥
అనిరుద్ధాయ మహతే స్వేచ్ఛయా దేహికన్యకాం ।
పూతోసిభారతే వర్ష సప్తభిః పితృభిః సహ ॥
యాతుకం దేహిసర్వస్వం యశ సేమహతేభువి ।
అన్యథారణమధ్యేచత్వాం హనిష్యతి మాధవః ॥
సుదర్శనేన చక్రేణ కోవాత్వాం రక్షితుం క్షమః ।
కోటరీవచనం శ్రుత్వాచుపదైత్య పుంగవః ॥
ప్రయయారథమారుహ్యయత్రపౌత్రే హరేర్మునే ।
స్కందః సేనాపతిర్భూత్వా ప్రయయాశంకరాజ్ఞయా ॥
బాణః స్వస్త్యయనంచక్రెగణేశశ్చ శివః స్వయం ।
బాణం శుభాశిషం చక్రేపార్వతీకోటరీ తథా ॥
అష్టాచభైరవాశ్చైవ రుద్రాశ్చైకాదశైవతే ।
సర్వేయుద్ధాయ హంతారో బభూవుఃశస్త్ర పాణయః ॥
కోపంతో ముఖము కళ్ళు ఎర్రబడగా, ధనుస్సును ధరించిన యమునిలా, ఓతల్లి పార్వతి! చెప్తా విను. ఓతండ్రి! మహేశ్వర, విను. (34) ఓగణపతి! భాత! ఓకార్తిక! భ్రాత! విను. ప్రాణులకు శుభము అశుభము అనేది, ప్రాక్తన కర్మలననుసరించే (35) చేసిన కర్మకన్న వేరైన కార్యము ఎవరికుంది. కాలం దాపురించక పోతే, నూరు బాణాలతో కొట్టినా చావడు. (36) కాలం సమీపిస్తే గడ్డిపోచ మొదలు తాకించినా బ్రతకడు. ఎవని వలన ఎవనికి చావు విధాత ఇదివరలో వ్రాశాడో (37) అదే నిత్యము, సత్యము. ఆ బిందువును ఎవడు తప్పిస్తాడు. యుద్ధంలో భీరువైనవాని జీవనం వ్యర్థము. (38) జయిస్తే కీర్తివస్తుంది. చస్తే స్వర్గానికి పోతాడు. శివుడు రక్షిస్తున్న నగరంలోకి ప్రవేశించి కన్యను తీసుకుపోయాడు. (39) పార్వతి, గణేశుడు, బలి వీరితో యుద్ధంలో కన్యను ఎవడు గ్రహిస్తాడు. బ్రతికినవాని కెవనికి ధైర్యం. (40) నీకూతురు గర్భవతి అని సభలో రక్షకుడు చెప్పాడు. ఇది నాకు వజ్రతుల్యమైన మాట. మిక్కిలి శ్రుతికటువైనమాట. (41) అందువల్ల అనిరుద్ధుని చంపి, కన్యకను చంపుతాను. లేదా మండుతున్న అగ్నిలో శరీరాన్ని విడిచి పెడతాను. (42) కోటరీ ఇట్లా అంది - ఓ వత్స! చెబుతాను విను. నేను కూడా నీకు ధర్మం ప్రకారం తల్లిని. చెడుచావుగల కొడుకుతో కూడా తలిదండ్రులకు అడుగడుగునా దుఃఖమే. (43) కన్య ఇతరులతో తీసుకుపోబడ్డది కనుక ఆమెను ఇతరులకు ఇవ్వలేము. శ్రీకృష్ణుని పౌత్రునకు ప్రద్యుమ్నుని సుతునకు (44) అనిరుద్ధునకు, గొప్పవానికి స్వేచ్ఛగా (నీఇష్టంతో) కన్యకను ఇవ్వు. ఈ భారతవర్షంలో ఏడు తరాల పితరులతో గూడా పవిత్రుడవౌతావు. (45) నీసర్వస్వాన్ని అరణంగా ఇవ్వు. నీకు భూమిలో గొప్ప కీర్తి వస్తుంది. లేకున్న యుద్ధమధ్యంలో మాధవుడు నిన్ను చంపుతాడు. (46) సుదర్శన చక్రంతో చంపుతుంటే నిన్ను రక్షించటానికి సమర్థుడెవడున్నాడు. కోటరి మాటను విను, దైత్యపుంగవుడు కోపగించాడు. (47) ఓముని! రథమెక్కి హరిపౌత్రుడున్న చోటికి వెళ్ళాడు. శంకరుని ఆజ్ఞతో స్కందుడు సేనాపతిగా వెళ్ళాడు. (48) బాణుడు స్వస్త్యయనము చేశాడు గణేశుడు శివుడు స్వయంగా చేశారు. పార్వతి కోటరి (గ్రామదేవత) బాణునకు శుభాశీస్సులందించారు. (49) ఎనిమిది మంది భైరవులు, పదకొండు మంది రుద్రులు అందరుచేత శస్త్రములు ధరించి చంపేవాళ్ళయ్యారు. (50)
మూ॥ ఏతస్మిన్నంతరే దూతోప్యనిరుద్ధమువాచహ ।
పార్వత్యా ప్రేరితశ్చైవ బాణపత్యాచ సత్వరం ॥
దూత ఉవాచ :
అనిరుద్ధోత్తిష్ఠభద్రంతే పార్వతీవచనం శృణు ।
భవసాన్నా హికోవత్స కురు యుద్ధం బహిర్భవ ॥
బీతోషా రుదతీత్రస్తా సస్మార పార్వతీం సతీం ।
రక్షరక్ష మహామాయే మత్రాణేశ్వర మీప్సితం ॥
అభయేప్యభయం దేహిసంగ్రామే ఘోరదారుణే ।
త్వమేవజగతాంమాతా స్నేహస్తే సర్వతః సమః ॥
తథానిరుద్ధః సన్నాహీ శస్త్ర పాణిర్బభూవహా ।
ఉషాదత్తం రథం ప్రాప్య చకారారోహణం ముదా ॥
బహిః సంభూయశిబిరాత్ దదర్శబాణమీశ్వరః ।
సాన్నాహికం శస్త్రపాణిం రక్తస్య లోచనం పరం ॥
దృష్ట్వా నిరుద్ధం బాణశ్చ తమువాచరుషాన్వితః ।
ఘోరసంగ్రామ మధ్యేచ విషోక్తిం ప్రజ్వలన్నివ II
బాణ ఉవాచ :
అయేవీర మహాదుష్టనీతి శాస్త్ర వివర్జిత ।
చంద్రవంశ కులాంగార పుణ్యక్షేత్రేయశస్కర ॥
పితావేశంబరం హత్వాజగ్రాహతస్య కామినీం ।
తతోజాతోభవానేవ నిరోధం స్వకులక్షమం ॥
పితామహోవాసుదేవో మధురాయంచ క్షత్రియః ।
గోకులే వైశ్య పుత్రశ్చ నామ్నాచనంద నందనః ॥
బృందావనేచగోపస్యనందస్యపురక్షకః ।
సాక్షాజ్ఞారశ్చగోపీనాం దుష్టః పరమలంపటః ॥
జఘనపూతనాంసద్యోనారీఘాతీహ్య ధార్మికః ।
ఆగత్యమధురాంకుబ్జాంజఘాన మైథునేవచ ॥
దుర్బలం నరకం హత్వాస్తీ సమూహం మనోహరం ।
జగ్రాహ యోనిలుబ్ధంచ స్వపుత్రమతినిష్టురః ॥
భీష్మకం మానవంజిత్వా తత్పుత్రం చాపిదుర్బలం ।
జగ్రాహకన్యకాం తస్య దేవయోగ్యాంచ రుక్మిణీం ॥
సత్రాజితః సూర్యభృత్యోదేవాత్ర్పాప్య మణీశ్వరం ।
ఘాతయిత్వాహ్యుపాయేన జగ్రాహమణి కన్యకాం ॥
కురుపాండవయుద్ధంచ కారయిత్వాచ దారుణం ।
యుధిష్టిరస్య యజ్ఞేచ శిశుపాలం జఘాన సః ॥
ఇంతలో దూత అనిరుద్ధునితో ఇట్లన్నాడు. పార్వతితో బాణపత్నితో ప్రేరితుడై త్వరగా చెప్పాడు. (51) దూత ఇట్లా - అనిరుద్ధా, లే, క్షేమకరమైన పార్వతి మాటను విను. ఓవత్స! యుద్ధసన్నద్ధుడవుకా, యుద్ధం చేయి. బయటికిరా. అని (52) ఉషభయపడి ఏడుస్తూ, పార్వతి సతిని త్రాసముతో స్మరించింది. ఓమహామాయ! కోరిన నాప్రాణేశ్వరుని రక్షించు, రక్షించు. (53) అభయమిచ్చేదాన! ఘోరమైన దారుణమైన సంగ్రామమందు అభయమివ్వు. నీవే జగత్తునకంతా తల్లివి. నీ స్నేహము అంతట సమానము. (54) అట్లాగే అనిరుద్ధుడు యుద్ధమునకు సిద్దుడై శస్త్రమును చేత ధరించాడు. ఉష ఇచ్చిన రథాన్నిచేరి ఎక్కాడు, ఆనందంతో. (55) బయటికి వచ్చి శిబిరం నుండి (వచ్చి) సమర్థుడైన ఆతడు బాణుని చూచాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. శస్త్రము చేత ఉంది. ముఖము కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. (56) బాడు అనిరుద్ధుని చూచి కోపంతో అతనితో ఇట్లన్నాడు. ఘోరమైన యుద్ధమధ్యంలో మండిపోతూ విషపు మాటలన్నాడు. (57) బాణుడిట్లా - ఓవీర! మహాదుష్టుడ! నీతి శాస్త్రాన్ని వదిలినవాడ! చంద్రవంశమునకు నిపువంటి వాడ! పుణ్యక్షేత్రమందు అపకీర్తి తెచ్చేవాడ! (58) నీ తండ్రి శంబరుని చంపి, ఆతని కామినిని తీసుకవచ్చాడు. ఆ పిదప నీవే పుట్టావు. చేటు చేయటంలో నీకులము సమర్థమైంది. (59) నీ (తండ్రి తండ్రి) తాత వాసుదేవుడు మధురలో క్షత్రియుడు. గోకులంలో వైశ్యపుత్రుడు. పేరు నందనందనుడు, అని (60) బృందావనంలో గోపుడైన నందుని పశురక్షకుడు. గోపికలకు సాక్షాత్తుజారుడు. దుష్టుడు, పరమలంపటుడు. (61) పూతనను వెంటనే చంపాడు. ఆడదానిని చంపాడు, అధార్మికుడు. మథురకు వచ్చి మైథునంతో కుబ్జను చంపాడు. (62) దుర్భలుడైన నరకుని చంపి మనోహరమైన స్త్రీ సమూహమును స్వీకరించాడు యోనిలుబుడు. తనకొడుకును అతినిష్టురంగా చంపాడు. (63) మానవుడైన భీష్మకుని జయించి, దుర్బలుడైన ఆతని కొడుకును కూడా జయించి, దేవతలకు యోగ్యురాలైన ఆతని కన్యను రుక్మిణిని తీసుకొచ్చాడు. (64) సత్రాజిత్తుసూర్యుని భృత్యుడు. ఆతడు ఆ దేవుని నుండి మణి శ్రేష్ఠమును పొందగా ఉపాయంగా చంపి, మణి, కన్యకను స్వీకరించాడు. (65) కురు, పాండవులకు దారుణమైన యుద్ధాన్ని చేయించాడు, యుధిష్ఠిరుని యజ్ఞమందు ఆతడు శిశుపాలుని చంపాడు. (66)
మూ॥ దంతవక్రంచ శాల్వంచ జరాసంధంచ దారుణః ।
సంజహారభువోభూప సమూహమతి దారుణం ॥
ఉపాయాన్నరకం హత్వా సర్వస్వంతజ్ఞహార సః ।
దుర్బలో రాజభీతశ్చ సముద్రం శరణంగతః ॥
జిత్వాచ భ్రాతరం శక్రం భార్యాయావచనేనచ ।
జగ్రాహపారిజాతంచ పుష్పంచ స్వర్గ దుర్లభం II
కంసంనిహత్యాధర్మిష్ణో భ్రాతరం మాతురేవచ ।
జగ్రాహతస్య సర్వస్వం పరంకింకథయామితే ॥
జిత్వాచ భల్లుకం యుద్ధేజగ్రాహతస్యకన్యకాం ।
తత్సితుర్భగినీ కుంతీ చతుర్ణాంకామినీభువి ॥
ద్రౌపదీభ్రాతృపత్నీచ పంచానాం కామినీతథా ।
గోష్ఠినోయోనిలుబ్ధశ్చ శశ్వత్సరమలంపటః ॥
తజ్యేష్ణో బలదేవశ్చ శశ్వతి బతివారుణీం ।
యమునాంభ్రాతృపత్నీంచ కరోత్యాహ్వానమీప్సితం ॥
జహారభగినీంతస్య కౌంతేయః శక్రనందనః ।
సుభద్రాంమాతులసుతాం సన్నిబోధకులక్రమం ॥
బాణస్యవచనం శ్రుత్వా చుకోపకామనందనః ।
ఉవాచ పరమార్థంచ యోగ్యం ప్రత్యుత్తరంమునే ॥
అనిరుద్ద ఉవాచ :
పితామేకామదేవశ్చ బ్రహ్మపుత్రః పురాశుచిః ।
యస్యాస్త్రేణవశీభూతం త్రైలోక్యం సంతతం శృణు ॥
శివకోపానలేనైవ భస్మీభూతః స్వకర్మతః ।
కృష్ణస్యపుత్ర్యో ధునా సర్వేషాం పరమాత్మనః ॥
పతివ్రతా రతిర్మాతా పతిశోకేన సాంప్రతం ।
శంబరస్య గృహేతస్థా హృతాతేన బలెనచ ॥
ఛాయాంమాయావతీం దత్వా మాయయాశయనేనచ ।
రతింస్వధర్మం సంరక్ష్య ధర్మసాక్షీచతధృహే ॥
నిహత్యశంబరం శత్రుం గృహీత్వా స్వప్రియాంసతీం ।
ఆజగామద్వారకొంచ చంద్రసూర్యౌచ సాక్షిణా॥
పితామహం వాసుదేవం త్వంకింజానాసి మూఢవత్ ।
యంచసంతోనజానంతి వేదాశ్చత్వార ఏవచ ॥
వాసః సర్వనివాసస్య విశ్వానియస్యలోమసు ।
తస్యదేవః పరంబ్రహ్మ వాసుదేవ ఇతిస్మృతః ।
శంకరం పృచ్ఛసాక్షాచ్చ యస్యభృత్యోధునాభవాన్ ।
కృష్ణభృత్యస్యచబలేః పుత్రోసికింకరాత్మజః ॥
దంతవక్రునిసాల్వుని, జరాసంధుని, దారుణంగా చంపాడు. భూమియందు రాజసమూహమును అతిదారుణంగా చంపాడు. (67) నరకుణ్ణి ఉపాయంగా చంపి ఆతని సర్వస్వాన్ని ఆతడు హరించాడు. దుర్బలుడై, రాజులకు భయపడి, సముద్రుని శరణువేడాడు. (68) భార్యమాటతో అన్నను ఇంద్రుని జయించి, స్వర్గంలో దుర్లభమైన పారిజాతమును, దాని పుష్పాన్ని తీసుకున్నాడు. (69) అధర్మిష్ఠుడై తల్లిసోదరుడైన కంసుని చంపి, ఆతని సర్వస్వాన్ని తీసుకున్నాడు. ఇంకా నీకేం చెప్పాలి. (70) యుద్ధంలో భల్లుకాన్ని జయించి, దాని కన్యను స్వీకరించాడు. అతని తండ్రి, చెల్లెలైన కుంతి భూలోకంలో నలుగురికి భార్య. (71) ద్రౌపది భ్రాతృపత్ని అట్లాగే ఐదుగురికి కామిని కూడా. గుంపులో ఉండేవాడు, యోగిలుబుడు. ఎప్పుడు మిక్కిలి లంపటుడు. (72) అతని కన్న పెద్దవాడు బలదేవుడు. ఎల్లప్పుడు కల్లును తాగుతాడు. ఈప్సితమునకై భాతృపత్నిని యమునను పిలుస్తాడు. (73) ఆతనిచెల్లెలును ఇంద్రునికొడుకు కుంతిపుత్రుడు తీసుకుపోయాడు. మాతులుని బిడ్డయైన సుభద్రకు కులక్రమాన్ని చక్కగా చెప్పాడు. (74) బాణుని మాటను విని, కాముని పుత్రుడు కోపగించాడు. ఓముని! యధార్థమైన, యోగ్యమైన ప్రత్యుత్తరము చెప్పాడు. (75) అనిరుద్ధుడిట్లో - నాతండ్రి కామదేవుడు బ్ర్మపుత్రుడు ఇది వరలో శుచిగా ఉండేవాడు. ఆతని అస్త్రంతో త్రైలోక్యము ఎల్లప్పుడు వశీభూతమైనది, విను. (76) తన కర్మవల్ల శివుని కోపాగ్నితో భస్మమైనాడు. అందరికి పరమాత్మయైన కృష్ణుని కొడుకిప్పుడు (77) నాతల్లిరతి పతివ్రత. పతి శోకంతో ఇప్పుడు శంబరుడు బలవంతంగా తీసుకుపోగా ఆతని ఇంట్లో ఉన్నది. (78) ఛాయను మాయావతిని ఇచ్చింది. మాయతో శయనమందున్నాడు. రతిని తన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మసాక్షిగా ఆ ఇంట్లో ఉంది. (79) శత్రువైన శంబరుని చంపి తన ప్రియమైన సతిని గ్రహించి ద్వారకకు వచ్చాడు. దీనికి చంద్రసూర్యులు సాక్షి. (80) పితామహుడైన (తాత) వాసుదేవుని గూర్చి నీకేం తెలుసు మూడునివలె ఉన్నావు. ఆతనిని గూర్చిసజ్జనులు తెలుసుకోలేరు. నాలు వేదములకే తెలియదు. (81) నివసించేవారందరికి ఆతడు వాసము. ఆతని రోమములందు విశ్వముంది. నివాసానికి దేవుడు పరబ్రహ్మ కనుకనే వాసుదేవుడని చెప్పబడ్డాడు. (82) ఇప్పుడు నీవు సాక్షాత్తుగా శంకరుని భృత్యుడవు అతన్నే అడుగు. కృష్ణునకు భృత్యుడైన బలికి పుత్రుడవు. కింకరుని కొడుకువు. (83)
మూ॥ గోకులేవైశ్యపుత్రత్వం బ్రూహిత్వం జ్ఞానదుర్బల ।
భోజనం వేదవిహితం శశ్వత్ క్షత్రియవైశ్యయోః ॥
ద్రోణః ప్రజాపతిః శ్రేష్ఠః ధరాతస్య ప్రియాసతీ ।
పుత్రంచతపసాలేభే పరమాత్మానమీశ్వరం ॥
ద్రోణోనందోవైశ్యరాజ్యశోదా సా ధరాసతీ ।
వృషభానుసుతారాధా సుదామ్నః శాపకారణాత్ ॥
త్రింశత్కోటించ గోపీనాంగృహీత్వాభర్తురాజ్ఞయా ।
పుణ్యంచ భారతం క్షేత్రం గోలోకాదాజగామసా ॥
తాభిఃసార్థం సరేమేచస్వపత్నీభిః ముదాన్వితః ।
పాణింజగ్రాహ రాధాయాః స్వయంబ్రహ్మాపురోహితః ॥
గోపకోటిశ్చ గోలోకాదాజగామముదాన్వితా ।
తేజసాహరితుల్యా స్తే పారదప్రవరాహరేః ॥
గోరక్షణం హరేరేవ గోపవేషస్య చాత్మనః ।
గోపానాం శిశురక్షార్థం మాయేశస్యాపిమాయయా ॥
పూతనాబలకన్యాచ భగినీచతవాసుర ।
దృష్ట్వాచ వామనం వంధ్యా చకారపుత్రమానసం II
ఏవం భూతోయదిమమపుత్రో భవతిసాంప్రతం ।
స్తనందదామితనయంకృత్వావక్షసి సుందరం ॥
తస్యాఃపూర్ణం మానసంచ చకార భగవానభుః ।
స్తనందత్వాచ గోలోకం యసారత్నయానతః ॥
కుబ్జాసాభగినీపూర్వం రావణస్య దురాత్మనః ।
శ్రీరామం చకమేకామాత్ నామ్నాశూర్పణఖాసతీ ॥
నాసాంచిచ్ఛేదతస్యాశ్చ లక్ష్మణోధార్మికేశ్వరః ।
తపసాచవరంలేభేబ్రహ్మణఃప్రియమీశ్వరం ॥
తేనపుణ్యేన తంలబాగోలోకం సాజగామహ ।
గోపీబభూవ గోలోకే కృష్ణస్యాలింగనేవచ ॥
నరకోహరివధ్యశ్చ స్వపూర్వప్రాకనేనచ ।
పాణింజగ్రాహ కన్యానాం సాక్షిగౌశిశిభాస్కరౌ ॥
భీష్మ కన్యామహాలక్ష్మీః శ్రీకృష్ణస్య ప్రియాసతీ ।
వైకుంఠ దాగతాసాధ్వీ బ్రహ్మణోనుమతేనచ ॥
సత్రాజితస్య కన్యాసా సత్యభామా వసుంధరా ।
దదౌ కృష్ణాయరాజా స తంమణిం మౌతుకేనచ ॥
భువోభారావతరణ హేతునా ఆగమనం హరేః ।
సంజహారభువోభారం కురుపాండవ యుద్ధతః ॥
శిశుపాలదంతవక్రో జయోవిజయ ఏవచ ।
ద్వారిణో ద్వారషట్కే చవైకుంతే శ్రీహరేరపి ॥
కుమార శాపాత్పతితే ప్రాప్య జన్మత్రయం ధ్రువం ।
హిరణ్యకశిపుశ్చైవతథైవ పూర్వపూరుషః ॥
గోకులంలో వైశ్యపుత్రుడు ఓజ్ఞానదుర్బలుడ! దీనిని గూర్చి నీవు చెప్పు. క్షత్రియవైశ్యులకు ఎల్లప్పుడు పరస్పర భోజనము వేదవిహితము. (84) ద్రోణుడు ప్రజాపతి, శ్రేష్ఠుడు. ఆతని ప్రియసతి, ధర ఆతడు తపస్సుచేసి పరమాత్మయైన ఈశ్వరుని పుత్రునిగా పొందాడు. (85) ద్రోణుడు నందుడు. వైశ్యశ్రేష్ఠుడు. ఆ యశోద, సతి, ధర. రాధ వృషభానుని సుత, సుదాముని శాపకారణంగా ఐంది.(86) ముప్పది కోట్ల గోపికలను తీసుకొని భర్త ఆజ్ఞతో, పుణ్యప్రదమైన భారత క్షేత్రానికి, ఆమె గోలోకంనుండి వచ్చింది. (87) వారితో ఆతడు రమించాడు. ఆనందంతో తన భార్యలతో రమించాడు.రాధను వివాహమాడాడు, అందుకు బ్రహ్మపురోహితుడు. (88) ఆనందంతో కోటిమంది గోపికలు గోలోకం నుండి వచ్చారు. తేజస్సులో హరితో సమానమైనవారు హరికి వారు ప్రక్కన ఉండే వారలు, శ్రేష్టులు (89) గోపవేషమందున్న అతనికి గోరక్షణము అది హరిపనే. మాయకు ఈశడు ఆతడు మాయతో గోపుల శిశురక్షకొరకు అట్లా ఉన్నాడు. (90) ఓ అసుర! పూతన బాలకన్య, నీ చెల్లెలు. వామనుని చూచి ఆగొడ్రాలు మనస్సులో పుత్రునిగా భావించింది. (91) ఇట్టివాడు, ఇప్పుడునా కొడుకు ఐతే బాగుండునని. ఆ కొడుకును సుందరుని వక్షమందుంచుకొని పాలిస్తాను. (92) ప్రభువు భగవానుడు ఆమె మనస్సును పూర్తి చేశాడు. పాలిచ్చి ఆమె రత్నముల పల్లకిలో గోలోకానికి వెళ్ళింది. (93) కుఱ్ఱపూర్వ జన్మలో దురాత్ముడైన రావణుని చెల్లెలు. శ్రీరాముణ్ణి కామంతో కోరుకున్నది. ఆమె పూర్వం శూర్పణఖ, సతి (94) ధార్మిక శ్రేష్ఠుడైన లక్ష్మణుడు ఆమె ముక్కుకోశాడు. తపస్సుతో బ్రహ్మవరాన్ని పొందినది. ఈశ్వరుని ప్రియునిగా పొందింది. (95) ఆ పుణ్యంతో ఆతనిని పొంది గోలోకానికి ఆమె వెళ్ళిపోయింది. కృష్ణుని ఆలింగనముతో గోలోకంలో గోపిక ఐంది. (96) తనపూర్వమందలిప్రాక్తనకర్మతో నరకుడు హరిచేతనే చంపబడుతాడు. సూర్యచంద్రుల సాక్షిగా కన్యలను వివాహమాడాడు. (97) భీష్ముని కన్య మహాలక్ష్మి శ్రీకృష్ణుని ప్రియమైన భార్య. బ్రహ్మ అనుమతితో వైకుంఠం నుండి వచ్చింది, ఆ సాధ్వి (98) సత్రాజిత్తుకన్యయైన ఆసత్యభామ వసుంధర. ఆ రాజు ఆమణిని కృష్ణునకు అరణంగా ఇచ్చాడు. (99) హరిభూభారాన్ని తగ్గించడానికి వచ్చాడు. కురుపాండవుల యుద్దంతో భూభారాన్ని తగ్గించాడు. (100) శిశుపాల దంత వక్రులు జయవిజయులను వారు. వైకుంఠంలో శ్రీహరికి కూడా ఆరు ద్వారములందు ద్వారపాలకులు. (101) కుమారుని శాపం వల్ల పతితులైనారు. మూడు జన్మలను పొందారు. హిరణ్యకశిపుడు కూడా నీ పూర్వ పురుషుడే. (102)
మూ॥ తస్యభ్రాతాహిరణ్యాక్షః తేనైవవరుణోజితః ।
హరిర్ నృసింహరూపేణతం జఘనావలీలయా ॥
సూక రేణహతో ఒన్యశ్చ పూర్వజన్మకథాం శృణు ।
ద్వితీయే జన్మని పురా రావణ కుంభకర్ణకః ॥
శ్రీరామేణహతా తౌద్వౌ శేషజన్మ కలౌతయోః ।
శ్రీకృష్ణనహతౌ తౌద్వౌ ధర్మపుత్రావుభౌతథా ॥
జరాసంధశ్చసాల్వశ్చ దురాత్మకంస ఏవచ ।
ప్రాక్తనాత్తస్యవధ్యా స్తే భువోభారజిహీర్షయా ॥
మాంధాతుః సుతమధ్యేచ యవనశ్చాపిప్రాక్తనాత్ ।
లక్ష్మీశ్వరస్య కృష్ణస్యధనేనకిం ప్రయోజనం ॥
ప్రతిజ్ఞయాచ సత్యాయాః పుణ్యకవ్రతకారణాత్ ।
పారిజాతం సమానీయచకారస్వాత్మనోవ్రతం ॥
స్వయంజాంబవతీ దేవీ దుర్గాంశా భల్లుకాత్మజా ।
పాణింజగ్రాహతస్యాశ్చ తపసాభారతేహరిః ॥
కుంత్యాశ్చక్షేత్రజాః పుత్రాః కేవలం భర్తురాజ్ఞయా ।
కరౌనిషిద్ధం త్రియుగేప్రసిద్ధం పల పైతృకం ॥
యుధిష్ఠిరో ధర్మపుత్రో భీమశ్చపవనాత్మజః ।
మహేంద్రపుత్రో ధర్మిష్ఠః ఫాల్గునో విజయీభువి ॥
య స్మైపాశుపతం శంభుః ప్రదదౌచ స్వయంపురా ।
అశ్వమేధం గవాలంభం సంన్యాసంపల పైతృకం ॥
దేవరేణసుతోత్పత్తిం కరౌపంచవివర్జయేత్ ।
ద్రౌపద్యాఃపంచభర్త్రః శాంకరేణవరేణచ ॥
బలదేవః పుష్పమధుపూతంపిబతినిత్యశః ।
చకారయమునా స్నానం స్నానార్థం ధార్మికః శుచిః ॥
సుభద్రాంచదదౌ కృష్ణః ఫాల్గునాయ మహాత్మనే ।
కన్యకాం మాతులానాంచ దాక్షిణాత్యః పరిగ్రహః ॥
దేశేష్వన్యేషు దోషోయం ఇత్యాహకమలోద్భవః ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే బాణానిరుద్ద సంవాదే పంచదశాధిక శతతమోధ్యాయః॥
అను!! ఆతని భౌతహిరణ్యాక్షుడు. ఆతడు వరుణుని జయించాడు. హరినృసింహరూపంగా వచ్చి అవలీలగా ఆతనిని చంపాడు. (103) వరాహ రూపంతో మరొకడు చంపబడ్డాడు. వారిపూర్వజన్మ కథను విను.రెండవ జన్మలో ఇదివరలో వారు రావణ కుంభకర్ణులు. (104) వారిద్దరిని శ్రీరాముడు చంపాడు. మిగిలిన జన్మ వారికి కలిలో, వారిద్దరు శ్రీకృష్ణునితో చంపబడ్డారు. వారు ఇద్దరు ధర్మపుత్రులు. (105) జరాసంధుడు, సాళ్వుడు, దుర్మార్గుడు కంసుడు ప్రాచీనులు. ఆతనిచే చంపదగినవారు,భూభారాన్ని తగ్గించడానికి (106) మాంధాత కొడుకుల మధ్యలో యవనుడు కూడా పూర్వకర్మననుసరించి చంపతగినవాడు లక్ష్మీశ్వరుడైన కృష్ణునకు ధనంతో పనేమి. (107) సత్యభామ ప్రతిజ్ఞ కారణంగా, పుణ్యకవ్రత కారణముగా పారిజాతాన్ని తెచ్చితన వ్రతాన్ని చేయించాడు. (108) దుర్గాంశ కలది స్వయంగా జాంబవతిదేవి, భల్లూకుని కూతురు. ఆమెను పెళ్ళాడాడు. తపస్సుతో భారతదేశంలో హరి (109) కుంతికి క్షేత్రజులైన పుత్రులు, కేవలము భర్త ఆజ్ఞతో పుట్టినవారే, పితృకర్మలలో మాంసము పెట్టుట మూడు యుగాలలో ప్రసిద్దము. కలిలోనిషిద్ధము. (110) యుధిష్ఠిరుడు ధర్మునీ పుత్రుడు. భీముడు పవనుని పుత్రుడు. ధర్మిష్ఠుడైన ఫాలునుడు మహేంద్రుని పుత్రుడు. భూమిలో విజయి (111) ఇదివర్లో శంభువు ఆతనికి పాశుపతాన్ని ఇచ్చాడు. అశ్వమేధయాగము, గోవధ సంన్యాసము, శ్రాద్దంలో పితరులకై మాంసం పెట్టుట.(112) మరిదితో సంతానాన్ని కనుట, ఈ ఐదు కలికాలంలో వదలాలి (యుగం) శంకరుని వరంతో ద్రౌపదికి ఐదుగురు భర్తలైనారు. (113) బలదేవుడు నిత్యము స్వచ్చమైన పూలమధువును తాగుతాడు. ధార్మికుడు, శుచియైన ఆయన స్నానం చేయాలని యమునా నదిలో స్నానం చేశాడు. (114) కృష్ణుడు సుభద్రను మహాత్ముడైన ఫాలునునకిచ్చాడు. మేనమామ కూతురును వివాహమాడుట దక్షిణదేశపు వారి సంప్రదాయము. (115) ఇతర ప్రాంతములలో ఇది తప్పు అనికమలోద్భవుడన్నాడు. (116)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణ అనిరుద్ధ సంవాదమందు నూటపది హేనవ అధ్యాయము.
Summary of chapter 115 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Revealing a supreme spiritual treasure, this chapter presents the Kṛshṇa-Sahasranāma, containing the thousand holy names of Lord Śrī Kṛshṇa. Each name illuminates a specific divine pastime, attribute, or cosmic potency of the Lord. The text promises that reciting or listening to these thousand names daily purifies the consciousness, destroys all severe sins, bestows material and spiritual prosperity, and grants ultimate liberation.