శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
ఏకదైవోదయం కృత్వా రవిరస్తం జగాన హ ।
మాలీ నుమాలీ దైత్యేంద్రో దీప్తిం కర్తుం సముద్యతౌ ॥
మహా సంపన్మదోన్మత్తౌ శంకరస్య వరేణ చ ।
తయోశ్చ ప్రభయా రాత్రిర్నభవేదిత సుందరి ॥
రుష్ఠః సూర్యః స్వశూలేన తౌ జఘనావలీయయా ।
పతితౌ సూర్యశూలేన మూర్చితౌ ధరణీతలే ॥
భక్తాపాయం చ విజ్ఞాయ శంకరో భక్తవత్సలః ।
ఆగత్య జీవయామాన మహాజ్ఞానేన తౌ విభుః ॥
తౌ చ నత్వా శివం భక్త్యా జగ్మతుర్నిజ మందిరం ।
ఓ సుందరీ! ఒకప్పుడు సూర్యుడు (ఎప్పటివలె తన విధి నిర్వహణలో) ఉదయించి సాయంత్రము అస్తమించెను. అప్పుడు మహాసంపద చేతను శంకరుని వరము వలనను మిక్కిలి మదించిన మాలి సుమాలి అన్న ఇద్దరు దైత్యేంద్రులు తమ శరీర తేజస్సుచేత రాత్రి (సూర్యుడు అస్తమించినప్పటికిని) కాకుండుగాక అని ప్రకాశము కల్గించుటకు ప్రయత్నించిరి. అది చూచి కోపించిన సూర్యుడు తన శూలముతో లీలగా వారిని కొట్టెను. సూర్య శూలము తాకి వారిద్దరు భూమి పై పడిరి. భక్తుల యందు వాత్సల్యము గల శివుడు తన భక్తులకు ఏర్పడిన ఆపదను తెలిసికొని వేగముగా అక్కడికి వచ్చి తన గొప్ప జ్ఞాన ప్రభావము చేత ఆ యిద్దరిని బ్రతికించెను. వారు భక్తితో శంకరునికి నమస్కరించి తమ ఇంటికీ వెళ్లిపోయిరి.
దుద్రావ చ మహాదేవః సూర్యం హంతుం రుషా జ్వలన్ ॥
దృష్ట్వా సంహార కర్తారం జీఘాంసంతం హరం రవీః ।
భియా పలాయమానశ్చ బ్రహ్మాణం శరణం యయౌ ॥
దుద్రావ చ మహాదేవో బ్రహ్మాణో నిలయం రుషా ।
శూలమత్యర్థముద్యమ్య కాలకాలో విధేర్విధిః ॥
తరువాత శంకరుడు కోపముతో మండిపోవుచు సూర్యుని చంపుటకు పరుగెత్తాను. సర్వజీవుల యొక్క సంహారకర్తయైన హరుడు తనను చంపరాగా సూర్యుడు భయముతో పారిపోయి బ్రహ్మను శరణుజొచ్చెను. మహాదేవుడు కోపముతో శూలము నెత్తిపట్టి బ్రహ్మను శాసించువాడు యమునకు యముడు కనుక బ్రహ్మలోకమునకును పరుగెత్తెను.
దృష్ట్వా బ్రహ్మా హరం రుష్టం తుష్టావ పరమేశ్వరం ।
చతుర్వక్త్రేణ వేదోక్త స్తోత్రేణ జగతాం పతిః ॥
కోపించి యున్న హరుని చూచి జగత్తులకు పతియైన బ్రహ్మ వేదములలో చెప్పబడియున్న స్తోత్రమును నాల్గు ముఖములతో (పఠించుచు) స్తుతించెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను :
ప్రసీద దక్ష యజ్ఞఘ్న నూర్యం మచ్ఛరణాగతం ।
త్వయైవ సృష్ఠం సృష్టెశ్చ సమారంభే జగద్గురో ॥
ఆశుతోష మహాభాగ ప్రసీద భక్తవత్సల ।
కృపయా చ కృపాసింధో రక్ష రక్ష దీవానిశం ॥
బ్రహ్మ స్వరూప భగవన్ సృష్టి స్థిత్యంత కారణ ।
స్వయం రవిం చ నిర్మాయ స్వయం సంహర్తుమిచ్ఛసి ॥
స్వయం బ్రహ్మా స్వయం శేషో ధర్మః సూర్యో హుతాశనః ।
ఇంద్ర చంద్రాదయో దేవాస్త్వత్తో భీతాః పరాత్పర ॥
ఋషయో మునయశ్చైవ త్వాం నిషేవ్య తపోధనాః ।
తపసాం ఫలదాతా త్వం తపస్త్వం తపసాం ఫలం ॥
దక్షయజ్ఞము ధ్వంసమొనర్చిన జగదురూ! నన్ను శరణు పొందినవాడును సృష్టి యొక్క ఆరంభ కాలములో నీచేతనే సృష్టింపబడిన వాడును ఐన ఈ సూర్యుని యందు ప్రసన్నుడవు కమ్ము. అల్ప ప్రార్థనకు అల్పపూజకును త్వరగా సంతుష్టి చెందు మహానుభావా! భక్తులయందు వాత్సల్యము కలవాడా, దయాసముద్రా! రాత్రి పగలు రూపమున నున్న కాలమును రక్షింపుము. అంతట వ్యాపించునట్టి స్వరూపము గలవాడా! (వివర్తన రూపమైన జగద్రూపా) ఓ భగవంతుడా! సృష్టి స్థితి లయములను చేయువాడా! నీవే సూర్యుని నిర్మించి నీవే సంహారింప గోరుచున్నావు! నీవే బ్రహ్మవు. నీవే జగత్తును మోయుశేషడవు. ధర్మదేవత, ఆర్నీ నీవే. ఇంద్రచంద్రాది దేవతలు నీ వలన భయము పొందుదురు. (నీకు భయపడుదురు) తపస్సే ధనమైన ఋషులు మునులు నిన్నే సేవించిరి. తపస్సులకు ఫలదాతవు నీవు తపస్సు నీవే. తపస్సు ఫలము కూడ నీవే.
ఇత్యేవ ముక్త్వా బ్రహ్మా తం సూర్యమనీయ భక్తితః ।
ప్రీత్యా సమర్పయామాన శంకరే దీనవత్సలే ॥
శంభుస్తమాశిం కృత్వా వీధిం నత్వా జగద్విధిః ।
ప్రసన్నవదనః శ్రీమానాలయం ప్రయయౌ ముదా ॥
ఇతి ధాతృకృతం స్తోత్రం సంకటే యః పఠేన్నరః ।
భయాత్ప్రముచ్యతే భీతో బద్ధో ముచ్యేత బంధనాత్ ॥
రాజద్వారే శ్మశానే చ మగ్నపోతే మహార్ణవే ।
స్తోత్ర స్మరణమాత్రేణ ముచ్యతే నాత్ర సంశయః ॥
భక్తితో బ్రహ్మ ఇట్లు పలికి సూర్యుని తెచ్చి దీనవత్సలుడైన శంకరునికి ప్రీతితో సమర్పించెను. శంభుడు ప్రసన్నమైన ముఖము కలవాడై తాను జగత్కర్త కనుక సూర్యునికాశీస్సులిచ్చి బ్రహ్మకు నమస్కరించి (ఒకరినొకరు గౌరవించుకొనుట సూర్యుడు శరణాగతుడగుట వలన) ముదము పొంది కైలాసమున కేగెను. ఇట్లు బ్రహ్మచేసిన స్తోత్రము నెవడు ఆపత్కాలమందు పఠించునో ఆ నరుడు భీతుడైనచో భయము నుండి, బంధింపబడినవాడైనచో ఆ బంధనము నుండి విడుదల పొందును. ఒక కార్యమును సాధించుటకై రోజు ద్వారమున కేగినవాడు శ్మశానమందున్నవాడు మహా సముద్రములో తానెక్కిన ఓడ మునుగుచున్నప్పుడు ఈ స్తోత్రమును స్మరించినంతలో ఆపద నుండి విముక్తి పొందును. సందేహము లేదు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాధాశ్రీకృష్ణ సంవాదే అష్టచత్వారింశోఽధ్యాయః ॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధాశ్రీకృష్ణ సంభాషణ రూపముననున్న నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 48 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Enraged by the slaying of his son-in-law Kaṃsa, the mighty Emperor Jarasandha of Magadha launched seventeen massive military invasions against Mathura, laying siege to the city repeatedly with millions of soldiers. Although Kṛshṇa and Balarāma defeated Jarasandha's armies each time without taking weapons, Kṛshṇa foresaw continuous warfare and decided to construct an impregnable island fortress in the western ocean named Dvārakā. Through divine architectural skill, the magnificent jeweled city of Dvārakā arose overnight, and Kṛshṇa peacefully evacuated the entire Yādava population across the western sea to safety, outwitting Jarasandha's next campaign.