మూII శ్రీనారాయణ ఉవాచ –
కృత్వా క్రీడాం సముత్థాయ పుష్పతల్పాత్పురాతనః ।
నిద్రితాం ప్రాణసదృశీం బోధయామాస తత్క్షణం ॥
వస్త్రాంచలేన సంస్కృత్య కృత్వా తన్నిర్మలం ముఖం ।
ఉవాచ మధురం శాంతం శాంతాంచ మధుసూదనః ॥
శ్రీకృష్ణఉవాచ :
అయితిష్ఠ క్షణం రాసే రాసేశ్వరి శుచిస్మితే ।
వ్రజ వృందావనం వాపి వ్రజంవ్రజ వ్రజేశ్వరి ॥
రాసాధిష్ఠాతృదేవి త్వం రాసం రాసే కురు క్షణం ।
గ్రామే గ్రామే యథా సంతి సర్వత్ర గ్రామ దేవతాః ॥
ప్రియాలినినహైః సార్థం క్షణం చందన కాననం ।
క్షణంవా చంపకవనం గచ్చవా తిష్ఠ సుందరి ॥
క్షణం గృహంచ యాస్యామి విశిష్టం కార్యమస్తిమే ।
విరామం దేహి మే ప్రీత్యాక్షణం మాం ప్రాణవల్లభే ॥
ప్రాణాధిష్ఠాతృదేవి త్వం ప్రాణాశ్చ త్వయి సంతి మే ।
ప్రాణీ విహాయ ప్రాణాంశ్చ కుత్ర స్థాతుం క్షమః ప్రియే ॥
త్వయిమే మానసం శశ్వత్త్వం మే సంసారవాసనా ।
త్వత్తో మమ ప్రియా నాస్తి త్వమేవశంకరాత్ప్రియా ॥
ప్రాణా మే శంకరః సత్యం త్వంచ ప్రాణాధికా సతి ।
ఇత్యుక్త్వా తాం సమాశ్లిష్య భగవాన్ గంతుముద్యతః ॥
అక్రూరాగమనం జ్ఞాత్వా సర్వజ్ఞః సర్వసాధనః ।
ఆత్మా పాతాచ సర్వేషాం సర్వోపకారకారకః ॥
దృష్ట్వా తమేవ గచ్ఛంతముత్సుకంభిన్నమానసం।
ఉవాచ రాధికాదేవీ హృదయేన విదూయతా ॥
రాధికోవాచ –
హేనాథ రమణ శ్రేష్ఠ శ్రేష్ఠశ్చ ప్రేయసాం మమ ।
హేకృష్ణ హేరమానాథ వ్రజేశ మా వ్రజ ప్రజం ॥
అధునా త్వాం ప్రాణనాథ పశ్యామి భిన్నమానసం ।
గతే త్వయిమమప్రేమ గతం సౌభాగ్యమేవచ ॥
క్వయాసి మాంవినిక్షిప్య గంభీరే శోకసాగరే ।
విరహవ్యాకులాం దీనాం త్వయ్యేవ శరణాగతాం ॥
న యాస్యామి పునర్గేహం యాస్యామి కాన నాంతరం ।
కృష్ణకృష్ణేతి కృష్ణేతి గాయం గాయం దివానిశం ॥
న యాస్యామ్యథఽవారణ్యం యాస్యామి కామసాగరే ।
తత్ర త్వత్కామనాం కృత్వా త్యక్ష్యామిచ కలేవరం ॥
అను!! శ్రీనారాయణుడన్నాడు: క్రీడించి, పురాతనుడు, పుష్పతల్పంనుండిలేచి, నిద్రించిన, ప్రాణసదృశమైన ఆమేను ఆ క్షణంలో మేల్కొలుపసాగాడు (1) చీర చెరుగుతో (అంచు) ఆమెముఖమును సంస్కరించి (తుడిచి), ముఖాన్ని నిర్మలంగా చేసి శాంతమైన ఆమెతో మధుసూదనుడు, మధురముగా, శాంతముగా, ఇట్లా అన్నాడు. (2) శ్రీకృష్ణుడిట్లన్నాడు - ఓ శుచిస్మితా! (స్వచ్ఛమైన చిరునవ్వుదాన) రాసేశ్వరి! క్షణకాలము రాసక్రీడయందు ఉండు. వృందావనానికైనా వెళ్ళు. ఓవ్రజేశ్వరి! ప్రజమునకైనావెళ్ళు (3) రాసక్రీడకు అధిష్టాన దేవతవీవు. క్షణకాలము రాసక్రీడయందు రాసము చేయి (రసముననుభవించు) ప్రతిగ్రామమందు గ్రామదేవతలున్నట్లే, (రాసాధిష్టాతవు నీవు) ప్రియమైన స్నేహితురాండ్రతో కూడి కొద్దికాలము చందన కాననమునకువెళ్ళు. క్షణకాలము చంపకవనానికి వెళ్ళు ఓ సుందరి! అక్కడ ఉండు. (5) క్షణకాలముగృహమునకు వెళ్తాను. నాకు విశిష్టమైన పని ఉంది. ఓ ప్రాణవల్లభ (ప్రియ) దయతో క్షణకాలము నాకు విరామాన్ని ఇవ్వు (6) ప్రాణాధిష్ఠాతృదేవివి నీవు. నా ప్రాణములు నీదగ్గరున్నాయి. ప్రాణి ప్రాణములను వదిలి ఎక్కడుండగల సమర్థుడు, ఓప్రియ (7) నీలో నామన స్టెప్పుడూ ఉంటుంది. నీవు నా సంసారవాసనవు. నీకన్నా నాకిష్టమైన ప్రియురాలులేదు. శంకరునికన్నా నీవే ప్రియమైనదానవు. (8) నాకు శంకరుడు ప్రాణములు. ఓ సతి! నీవు ప్రాణములకన్నా అధికమైన దానివి, నిజమీ మాట. అని పలికి ఆమెను కౌగిలించుకొని, భగవంతుడు వెళ్ళటానికి సిద్ధమైనాడు. (9) సర్వజ్ఞుడు, అన్ని సాధనములు (గా) కలవాడు (సాధించగల), అక్రూరుడు వచ్చాడని తెలుసుకొన్నాడు. ఆతడు, ఆత్మ, రక్షకుడు, అందరికి. అందరికి ఉపకారకుడు గూడా. (10) మనస్సుమారిపోయి, ఉత్సాహంగా వెళ్ళుతున్న ఆతనిని చూచి, మనుస్సులో బాధపడుతూ రాధిక! దేవి! ఇట్లా అంది (11) రాధికవచనమిట్లా - ఓనాధ! రమించుట యందు శ్రేష్టుడ ! నాకిష్టమైన వానిలో శ్రేష్ఠుడ! ఓ కృష్ణ! ఓరమానాథ! ఓ వ్రజేశ! ప్రజమునకు వెళ్ళకు (12) ఓ ప్రాణనాథ! ఇప్పుడు,నీ మనస్సు భిన్నమైనదని (వికలమైనదని) చూస్తున్నాను (గ్రహిస్తు). నీవు వెళితే నాప్రేమపోతుంది. నాసౌభాగ్యం పోతుంది. (13) గంభీరమైన శోకసాగరమందు నన్నుంచి ఎక్కడికెళ్తున్నావు. విరహవ్యాకులను, దీనురాలిని, నిన్నే శరణువేడాను. (14) తిరిగి ఇంటికి వెళ్ళను. మరో అడవికి (అడవిలోకి ) వెళ్తాను. కృష్ణ! కృష్ణ కృష్ణ అని అంటూ రాత్రింబగళ్ళు పాడుతూ, పాడుతూ వెళ్తాను (15) లేదా, అడవికి వెళ్ళను. కామసాగరానికి వెళ్లాను. అక్కడ నీకామననుతీర్చి, శరీరాన్ని వదిలివేస్తాను. (16)
మూ॥ యథాకాశో యథాత్మాచ యథాచంద్రో యథారవిః ।
తథాత్వం యాసి మత్పార్శ్వే నిబద్ధో వసనాంచలే ॥
అధునా యాసి నైరాశ్యం కృత్వా మే దీనవత్సల ।
న యుక్తం హి పరిత్యక్తుం దీనాం మాం శరణాగతాం ॥
యత్పాదపద్మం ధ్యాయంతే బ్రహ్మ విష్ణు శివాదయః ।
త్వాం మాయయా గోప వేషం కథం జానామి మత్సరీ ॥
కృతం యద్దేవదుర్నీతమపరాధసహస్రకం ।
యదుక్తం పతిభావేన చాభిమానేన తత్క్షమ ॥
చూర్ణీభూతశ్చ మధ్గర్వో దూరీభూతో మనోరథః ।
విజ్ఞాతుమాత్మసౌభాగ్యం కిమన్యత్ కథయామి తే ॥
జ్ఞాత్వా గర్గముఖాచ్ఛుత్వా మోహితా తవ, మాయయా ।
త్వాంచ వక్తుం నశక్నోమి ప్రేమ్ణావా భక్తి పాశతః ॥
యాసి చేన్మాంపరిత్యజ్య స కలంకో భవిష్యసి ।
త్వత్పుత్రపౌత్రా నశ్యంతిబ్రహ్మ కోపానలేనచ ॥
క్షణం యుగశతం మన్యే త్వాం వినా ప్రాణవల్లభం ।
కధం శతాబ్దం త్వాం త్యక్త్యా బిభర్మి జీవనం ప్రభో ॥
ఇత్యుక్త్వా రాధికాకోపాత్ పపాత ధరణీతలే ।
మూర్చాం సంప్రాప సహసా జహార చేతనాం మునే ॥
కృష్ణస్తాం మూర్ఛితాం దృష్ట్వా కృపయా చ కృపానిధిః ।
చేతనాం కారయిత్వాచ వాసయామాస వక్షసి ॥
బోధయామాస వివిధం యోగైః శోకవిఖండనైః ।
తథాపి శోకం త్యక్తంచ నశశాకశుచిస్మితా ॥
సామాన్య వస్తువిశ్లేషో నృణాం శోకాయ కేవలం ।
దేహాత్మనోశ్చ విచ్చే దః క్వ సుఖాయ ప్రకల్పతే ॥
న యయౌ తత్ర దివసే ప్రజరాజో వ్రజంప్రతి ।
క్రీడాసరోవరాభ్యాశం ప్రయయౌరాధయాసహ॥
తత్ర గత్వా పునః క్రీడాం చకారచ తయాసహ ।
విజహౌ విరహజ్వాలాం రాసే రాసేశ్వరీముదా ॥
రాధా సా స్వామినాసార్థం పుష్పచందనచర్చితా ।
పుష్పచందనతల్పే చ తస్థౌరహాసి, నారద ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే రాధాశోకవిమోచనం నామ అష్టషష్టితమోఽధ్యాయః॥
అకాశము, ఆత్మ చంద్రుడు, సూర్యుడు ఎట్లా ఉన్నారో అట్లాగేనీవు నా వసనాంచలమందు (చీరచెంగు) నాపక్కలో బంధింపబడి ఉంటున్నావు (17) ఓదీనవత్సల ! ఇప్పుడు, నీవు నన్ను నిరాశపరచి వెళ్తున్నావు. దీనురాలిని, శరణాగతురాలిని ఐన నన్ను విడిచి పెట్టుట తగదు. (18) ఏనీపాదపద్మములను బ్రహ్మవిష్ణు శివాదులు ధ్యానిస్తారో అట్టి నిన్ను, మాయగా, గోపవేషంలో ఉన్నవాణ్ణి, మాత్సర్యం గల నేను ఎట్లా తెలుసుకోగలను (19) ఓ దేవ! చెడుగా చేయబడిన, వేలకొలది అపరాధము లేవున్నాయో, అభిమానంతో, పతివి అనే భావంతోనేను, నిన్నే మన్నానో, వాటిని క్షమించు (20) నాగర్వము చూర్ణమైంది. నామనోరథము దూరమైంది. ఆత్మ సౌభాగ్యాన్ని తెలుసుకోవటానికి వేరే ఇంకేం చెప్పాలి నీకు. (21) తెలుసుకొనీ, గర్గుని ముఖం నుండి వినీ, నీమాయతో మోహింపబడ్డాను. ప్రేమతో కాని, భక్తిపాశంతోకాని నీకు చెప్పలేకపోతున్నాను. (22) నన్ను విడిచివెళితే కలంకుడవౌతావు. బ్రహ్మకోపానలముచే (అగ్ని) నీ పుత్రపౌత్రులు నశిస్తారు. (23) ప్రాణవల్లభుడవైన నిన్ను విడిచిన, క్షణంను నూరుయుగాలుగా భావిస్తాను. ఓ ప్రభు! శతాబ్దము కాలము నిన్ను విడిచి, జీవితాన్ని ఎట్లా భరిస్తాను (24) అని పలికి రాధిక, కోపంతో భూమిపై పడింది. త్వరలోనే మూర్ఛపోయింది. ఓ ముని! చేతనను కోల్పోయింది. (25) మూర్ఛితమైన ఆమెను కృష్ణుడు చూచి, కృపానిధి దయతో, చైతన్యవంతురాలిని చేసి, వక్షమందుంచుకున్నాడు. (26) శోకమును తొలగించే యోగములతో రకరకాలుగా బోధించాడు. ఐనా, ఆ శుచిస్మిత! శోకమును విడువలేకపోయింది (27) సామాన్యవస్తువుతో వినియోగము, నరులకు దుఃఖమును మాత్రమే కల్గిస్తుంది. దేహాత్మ విచ్ఛేదము జరిగితే సుఖమెక్కడుంటుంది. (28) ప్రజరాజు అప్పుడు దివసంలో ప్రజమునకు వెళ్ళలేదు. రాధతోకూడి క్రీడా సరోవరం దరికి వెళ్ళాడు. (29) అక్కడికి వెళ్ళి ఆమెతో కూడి మరల క్రీడించాడు. రాసేశ్వరి, రాసక్రీడయందు, ఆనందంతో, విరహ జ్వాలను పోగొట్టుకుంది (30) ఆ రాధ, స్వామితో కూడి పుష్పచందనములతో అలంకరించుకొని, రహస్యంలో, పుష్పచందన తల్పమందు, ఉంది, ఓ నారద! (31) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మ ఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధ శోకమును తొలగించుట అనునది అరువది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 68 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Elaborating upon the transcendent abodes, Śrī Sūta Gosvāmī described to Maharshi Śaunaka the supreme splendor of Goloka Vṛndāvana, which exists far beyond the material realms of illusion and decay. Glowing with self-effulgent light, filled with wish-fulfilling desire trees, golden lotus ponds, and celestial cows, Goloka is the eternal realm where Lord Śrī Kṛshṇa and Goddess Śrī Rādhā enjoy endless divine pastimes surrounded by liberated Gopas and Gopīs. The text emphasizes that those who dedicate their lives to pure devotion and unalloyed Bhakti achieve eternal residence in this immortal realm, transcending the cycle of rebirth forever.