నారద ఉవాచ :
కేన వా ప్రార్ధితః కృష్ణో మహీం చ కేన హేతునా ।
ఆజగామ జగన్నాథో వద వేదవిదాం వర ॥
వేదవేత్తలకు శ్రేష్ఠుడవైన ఓ జగన్నాథ! కృష్ణుడు ఎవరిచేత ప్రార్థింపబడి ఏకారణముగా భూలోకమునకు వచ్చెను.
నారాయణ ఉవాచ :
పురా వారాహకల్పే సా భారాక్రాంతా వసుంధరా ।
భృశం బభూవ శోకార్తా బ్రహ్మాణం శరణం యయౌ ॥
సురైశ్చాసుర సంతప్తైర్భృశముద్విగ్న మానసైః ।
సార్ధం తైస్తాం దుర్గమాం చ జగామ వేధనః సభాం ॥
దదర్శ తస్యాం దేవేశం జ్వలంతం బ్రహ్మతేజసా ।
ఋషీంధైశ్చ మునీంద్రైశ్చ సిద్ధేంద్రైః సేవితం ముదా ॥
అప్సరోగణ నృత్యం చ పశ్యంతం నస్మితం ముదా ।
గంధర్వాణాం చ సంగీతం శ్రుతవంతం మనోహరం ॥
జపంతం పరమంబ్రహ్మ కృష్ణ ఇత్యక్షర ద్వయం ।
భక్త్యానందాశ్రు పూర్ణం తం పులకాంకీత విగ్రహం ॥
భక్త్యా సా త్రిదశైః సార్ధం ప్రణమ్య చతురాననం ।
నర్వం నివేదనం చక్రే దైత్య భారాదికం మునే ।
సాశ్రుపూర్ణా సపులకా తుషావ చ రురోద చ ॥
నారాయణముని ఇట్లు చెప్పెను:
పూర్వము వారాహ కల్పమున పాపభారము అధికమై భూదేవి మిక్కిలి శోకార్తురాలై బ్రహ్మదేవుని శరణు పొందెను. రాక్షసుల బాధలకు తాళలేక భీతులైన దేవతలతో పాటు దుర్గమమైన బ్రహ్మ సభకు భూదేవి వెళ్లి అచ్చట బ్రహ్మ తేజస్సుతో వెలుచు ఋషులు, మునులు, సిద్ధగణములతో సేవించబడుచు అప్సరసల నృత్యమును చిరునవ్వుతో దర్శించుచు మనోహరమైన గంధర్వుల సంగీతమును ఏనుచు మంత్రరాజమైన కృష్ణ అను రెండక్షరములను జపించుచు భక్త్యానందములతో కన్నులనీరు నీండగా పులకలెత్తిన ఆకారము గల దేవేశుడగు చతురాననుని (నాలుగు ముఖములు గల బ్రహ్మ) భక్తితో తానును దేవతలును సమస్కరించిన పిదప తను పడుచున్న రాక్షసుల పాపభారమును గూర్చి నివేదించెను. ఆ పరమేష్టిని స్తుతించి కన్నీరు పెట్టి రోదించెను.
తామువాచ జగద్ధాతా కథం స్తౌషి చ రోదిషి ।
కథమాగమనం భద్రే వద భద్రం భవిష్యతి ॥
సుస్థిరా భవ కల్యాణి భయం కిం తే మయి స్థితే ।
ఆశ్వాస్య పృథివీం బ్రహ్మా దేవాన్ పప్రచ్చ సాదరం ॥
కథమాగమనం దేవా యుష్మాకం మమ సన్నిధిం ।
బ్రహ్మణో వచనం శ్రుత్వా దేవా ఊచుః ప్రజాపతిం ॥
భారాక్రాంతి చ వసుధా దస్యుగ్రస్తా వయం ప్రభో ।
త్వమేవ జగతాం స్రష్టా శీఘ్రం నో నిష్కృతిం కురు ॥
గతిస్త్వమస్యా భో బ్రహ్మన్ నివృత్తిం కర్తుమర్హసి ।
పీడితా యేన భారేణ పృథివీయం పీతామహ ॥
వయం లేనైవ దుఃఖార్తాస్తద్భారహరణం కురు ।
దేవానాం వచనం శ్రీత్వా తాం పప్రచ్చ జగద్వధీః ॥
దూరీకృత్య భయం వత్సే సుఖం తిష్ఠ సుమాంతకం ।
కేషాం ఖారవశక్తా త్వం సోఢుం పంకజలోచనే ॥
అపేశేష్యామి తం భద్రే భద్రం తే భవితా ధ్రువం ।
తస్య సా వచనం శ్రుత్వా తమువాచ స్వపీడనం ॥
పీడితా యేన యేనైవం ప్రసన్న వదనేక్షణా ॥
జగత్కర్త “ఓ మంగళమూర్తీ! నన్ను స్తుతించుచు ఏడ్చుచుంటివేమి? ఎందుకొరకు వచ్చితివో చెప్పుము. నీకు శుభము సమకూరును. ఓ కళ్యాణి! నేనుండగా నీకు భయమేమి? సుస్థిరవగుము” ఇట్లు భూదేవినోదార్చి బ్రహ్మ సాదరముగా దేవతలను ప్రశ్నించెను. “మీరు నా వద్దకు వచ్చుటకు కారణమేమీ”? ఆ పలుకులు విని దేవతలు ప్రజాపతితో “భూదేవి భారాక్రాంత అయినది. మేము దస్యుగ్రస్తులమైతిమీ. ఓ సృష్టికర్తా! శీఘ్రముగా మాకు నిష్కృతి (నివారణచర్య) నీ కళించుము” అనిరి. దేవతల వాక్కు విని బ్రహ్మ భూదేవితో “బిడ్డా! నీభయము తొలగించుకొని నావద్ద సుఖముగా ఉండుము. ఎవరి భారము చేయుటకు నీవశక్తురాలవైతివి వారిని నేను తొలగింతును. నీకు నిశ్చయముగా మంగళమగును” అని పలికెను. అతని మాట విని ఆమె ప్రసన్నమైన ముఖము కన్నులు కలదై ఎవరెవరి వలన ఏ విధముగా పీడితురాలయ్యెనో ఆ బాధలు తెలిపెను.
క్షితి రువాచ :
శృణు తాత ప్రవక్ష్యామి స్వకీయం మానసీం వ్యధాం ।
వినా బంధుం సవిశ్వాసం నాన్యం కథితుమర్హతి ॥
స్త్రీజాతిరబలా శశ్వద్రక్షణీయా స్వబంధుభిః ।
జనక స్వామీ వుత్రైశ్చ గర్హితాఽ న్యైశ్చ నిశ్చితం ॥
త్వయా పృష్టా జగత్తాత న లజ్జా కథితుం మమ ।
యేషాం భరైః పీడితాఽహం శ్రూయతాం కథయామి తే ॥
భూదేవి ఇట్లు పలికెను :
ఓ తండ్రీ! నా మనోవ్యధను తెలిపెదను వినుము. విశ్వసింపదగిన బంధువునకు తప్ప స్త్రీలు ఇతరులకు తమ బాధలు చెప్పకూడదు. అబలలైన స్త్రీలు తండ్రిచేతగాని భర్తచేతగాని కొడుకుల చేత గాని తపు బంధువుల చేత గానీ రక్షింపబడవలెనని నిశ్చయించబడినది. ఇతరులు ఆమెను రక్షించుట నిందింపబడినది. ఓ జగత్పతో! నీవడిగినప్పుడు ఎవరి పాపభారము చేత పీడింపబడితినో ఆ విషయము చెప్పుటకు నాకు సిగ్గేందుకు దానిని చెప్పేదను వినుము.
కృష్ణ భక్తి వీహీనా యే యే చ తద్భక్త నిందకాః ।
తేషాం మహాపాతకీనామశక్తా భారవాహనే ॥
స్వధర్మాచార హీనా యే నిత్యకృత్య వివర్జితాః
శ్రద్ధాహీసాశ్చ వేదేషు తేషాం భారేణ పీడితా ॥
పితృమాతృ గురుస్త్రీణాం పోషణం వుత్రపోష్యయోః ।
యే న కుర్వంతి తేషాం చ న శక్తా భారవాహనే ॥
యే మిధ్యావాదివస్తాత దయా నత్య వివర్జితాః ।
నిందకా గురుదేవానాం తేషాం భారేణ పీడితా ॥
మిత్ర ద్రోహి కృతఘ్నశ్చ మీథ్యాసాక్ష్య ప్రదాయకః ।
విశ్వాసఘ్నో న్యావహర్తా తేషాం భారేణ పీడితా॥
కల్యాణ సూక్షసామాని హరేరామైక మంగలం ।
కుర్వంతి విక్రయం యే వై తేషాం భారేణ పీడితా ।
జీవఘాతీ గురు ద్రోహీ గ్రామయాజీ చ లుబ్దకః
శవదాహి శూద్రభోజీ తేషాం భారేణ పీడితా ॥
పూజా యజ్ఞోపవాసాది వ్రతాని వివిధాని చ ।
యే యే మూఢ విహంతారస్తేషాం ఖారేణ పీడితా
సదా ద్విషంతి యే పాపా గోవిప్ర సుర వైష్ణవాస్
హరిం హరికధాం భక్తిం తేషాం భారేణ పీడితా ।
శంఖాదీనాం చ భారేణ పీడిఽతా హం యథా విధే
తతోఽ ధీకానాం దైత్యానాం భారేణ వరపీడితా ॥
ఇత్యేవం కథితం సర్వం మద్వ్యధాయా నివేదనం ।
త్వయా యది సుపాల్యాఽహం ప్రతీకారం కురు ప్రభో ॥
ఇత్యేవముక్త్వా వసుధా రురోధ చ ముహుర్ముహుః ।
బ్రహ్మా తద్రోదనం దృష్ట్వా తొముపోచ కృపానిధిః ॥
కృష్ణభక్తి లేనివారును కృష్ణభక్తులను నిందించువారును మహాపాతకులు. అట్టివారిని భరించుట నాకు శక్యమగుట లేదు. స్వధర్మమును పాటించనివారును శాస్త్రము విధించిన నిత్యకర్మలనాచరించక వదిలి వేసినవారును వేదమునందు శ్రద్ధాభక్తులు లేనివారును నాకు భారమై పీడితురాలనగుచున్నాను. తల్లిదండ్రులను గురువులను భార్యాపుత్రులను పోషింపవలసిన వారిని ఎవరు పోషింపరో అట్టి పాపుల భారమును నేను మోయలేకున్నాను. ఓ తండ్రీ! మిథ్యావాదులు (ఉన్న వస్తు తత్త్వమును లేదని వాదించువారు) దయా సత్యములను వదిలిపెట్టినవారును గురువులను దేవతలను నిందించువారునగు దుర్జనుల భారము చేత పీడింపబడుచున్నాను. మిత్రద్రోహులు, చేసిన మేలు మరచి కీడు తల పెట్టు కృతఘ్నులు, దొంగసాక్ష్యము చెప్పుచారు, నమ్మినవారికి ద్రోహము తల పెట్టువారు, ఇతరులు దాచిపెట్టిన ధనమును దిగమ్రింగువారు అగు పాపుల భారము చేత పీడితురాలనగుచుంటిని. లోక కల్యాణ కరములైన వేద భాగములను, సామవేద గానమును మిక్కిలి మంగళకరములైన హరి నామములను ధనము కొరకమ్ము కొను వ్యక్తులను భరింపలేక వ్యధ చెందుచుంటిని., జీవహింస చేయువాడు, గురుద్రోహి, గ్రామపురోహితుడు, లోభ, శవములను దహించు రాబడితో జీవించువాడు, శూద్రాన్నము భుజించువాడు అగు పాపుల భారముతో క్రుంగిపోవుచున్నాను. దేవతార్చనలను యజ్ఞములను ఉపవాసాది వ్రతములను వివిధ సత్కర్మలను భంగపరచు మూఢుల భారముచేత పీడింప బడుచున్నాను. ఏ పాపాత్ములు గోవులను బ్రాహ్మణులను దేవతలను విష్ణుభక్తులను శ్రీహరిని హరికథలను హరిభక్తిని ద్వేషింతురో వారి భాగము వలన క్రుంగి పోవుచున్నాను. శంఖచూడుడు మొదలగు వారి భారముచేత పీడితురాలగునగుచున్న నాకు ఓ విధీ! అంతకంటే అధిక దుర్జనులగు దైత్యుల భారము చేత పీడింపబడుచుంటిని, ఇట్లు నా వ్యథలన్నిటిని నీ ముందు నివేదించితిని. నేను నీచేత పాలింపబడుటకు పాత్రురాలనేని ఓ ప్రభూ తగిన ప్రతిక్రియ చేయుము”. ఇట్లు పలికీ భూదేవి మాటి మాటికీ దుఃఖించగా దయానీధియగు. బ్రహ్మ అది చూచీ ఆమెతో నిట్లనెను.
భారం తవాపనేష్యామి దస్యూనామప్యుయతః ।
ఉపాయతోఽపి కార్యాణి సిద్ధ్యంత్యేవ వసుంధరే ॥
కాలేన భారహరణం కరిష్యతి మదీశ్వరః ।
యంత్రం మంగళ కుంభం చ శివలింగం చ కుంకుమం ॥
మధుకాష్ఠం చందనం చ కస్తూరీం తీర్థమృత్తికాం ।
ఖడ్గ గండక ఖండం చ స్ఫాటికం పద్మరాగకం ॥
ఇంద్రనీలం సూర్యమణిం రుద్రాక్షం కుశమూలకం ।
సాలగ్రామశిలాం శంఖం తులసీం ప్రతిమం జలం ॥
శంఖం ప్రదీపమాలాం చ శిలామర్చ్యాం చ ఘంటికాం ।
నిర్మాల్యం చైవ నైవేద్యం హరిద్వర్ణ మణిం తధా ॥
గ్రంధియుక్తం యజ్ఞసూత్రం దర్పణం శ్వేత చామరం ।
గోరోచనం చ ముక్తాం చ శుక్తిం మాణిక్యమేవ చ ।
పురాణసంహితాం వహ్నిం కర్పూరం వరశుం తధా ॥
రజతం కాంచనం చైవ ప్రవాళం రత్నమేవ చ ।
కుశబీజం తీర్ధతోయం గవ్యం గోమూత్ర గోమయం ॥
త్వయి యే స్థాపయిష్యంతి మూఢ శ్చైతాని సుందరి ।
పచ్యంతే కాలసూత్రేణ వర్షాణామయుతం ధ్రువం ॥
బ్రహ్మా వృధ్విం సమాశ్వాస్య దేవతాభిస్తయా సహ ।
జగామ జగతాం ధాతా కైలాసం శంకరాలయం ॥
ఓ వసుంధరా! ఉపాయము వలన సర్వకార్యములు సిద్ధించును. కావున నీకు రాక్షసుల వలన ఏర్పడిన భారమును ఉపాయముతో తొలగింతును. నా ప్రభువగు భగవంతుడు కాలక్రమమున నీ భారమును తొలగించగలడు.
పూజింపదగిన యంత్రమును పూర్ణకుంభమును శివలింగమును కుంకుమ పువ్వును శ్రీగంధపు చెక్కను కస్తూరిని పవిత్రస్థానమునుండి తెచ్చిన మట్టిని (గంగమట్టి) ఖడ్గమును గండకీనది శిలను స్ఫటికమును పద్మరాగమణిని, ఇంద్రనీల సూర్యమణులను రుద్రాక్షను, సాలగ్రామ శిలను శంఖమును తులసీదళములను పూజావిగ్రహమును పూజ జలమును దీప హారతిని పూజించు శిలను పూజా ఘంటను నిర్మాల్యమును (విగ్రహాదులనుండి తీసివేసిన పుష్ప పత్రాదులు) నైవేద్యమును, మరకతమణిని, ముడివేసిన జందెమును పూజలోని అర్ధమును వింజామరను (చమరీమృగపు వెండ్రుకల చామరము) గోరోచనమును ముత్యమును ముత్యపు చిప్పను మణినీ, భాగవతాది పురాణ గ్రంధములను, అగ్నిని, కర్పూరమును, గండ్ర గొడ్డలిని (పూజలోనిది) వెండి బంగారము పగడము రత్నములను, కుశబీజమును, తీర్థజలము (అభిషేక జలము, గంగాజలము)ను పంచగవ్యములను (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రగోమయములు) ఎవరు వట్టి నేల పై పెట్టుదురో ఆ మూడులు పదివేల సంవత్సరములు ఘోరనరక బాధలనుభవించుట సత్యము. ఇట్లు సృష్టికర్తయగు బ్రహ్మ భూదేవి నోదార్చి దేవతలను ఆమెను వెంటబెట్టుకొని శంకరుని నివాసమగు కైలాసమున కేగెను.
గత్వా తమాశ్రమం రమ్యం దదర్శ శంకరం విధిః ।
వసంతమక్షయ వటమూలే స్వఃసంతస్తటే ॥
వ్యాఘ్ర చర్మపరీధానం దక్షకన్యాశీ భూషణం ।
త్రిశూల పట్టిశధరం పంచవక్త్రం త్రిలోచనం ॥
నానా సిద్ధేః పరివృతం యోగీంద్ర గణసేవితం ।
పరితోఽప్సరసాం నృత్యం పశ్యంతం నస్మితం ముదా ॥
గంధర్వాణాం చ సంగీతం శ్రుతవంతం కుతూహలాత్ ।
పశ్యంతీం పార్వతీం ప్రీత్యా పశ్యంతం వక్ర చక్షుషా ॥
జవంతం పంచ వక్త్రేణ హరేర్నామైక మంగళం ।
మందాకినీ పద్మబీజమాలయా పులకాంకితం ॥
బ్రహ్మ సుందరమైన ఆ శివుని ఆశ్రమమునకు పోయి ఆకాశ గంగాతటమున అక్షయ వటవృక్ష మూలమున నివసించి యున్న శంకరుని దర్శించెను. ఆ పరమేశ్వరుడు పులితోలు చుట్టుకొని దక్షకన్యయగు సతీదేవిని కపాలములను భూషణముగా ధరించీ త్రిశూలమును పట్టేశాయుధమును చేతబట్టి ఐదు ముఖములతో మూడు కన్నులతో ఒప్పుచు నానావిధ సిద్ధులు పరివేష్టించి యుండగా యోగీంద్ర గణములతో సేవింపబడుచు తన చుట్టు సాగుచున్న అప్సరసల నృత్యమును చిరునవ్వుతో సంతోషముతో దర్శించుచుండెను. ఆసక్తిగా గంధర్వుల సంగీతమును వినుచు, తృప్తిగా తననే చూచుచున్న పార్వతిని ఓరచూపులతో చూచుచు, జగన్మంగళమైన హరినామమును ఐదు ముఖములతో జపించుచు, మందాకిని (ఆకాశగంగ) లో జనించిన పద్మముల పూసలతో క్రుచ్చిన జపమాలతో లెక్కించుచు ఆనందముతో పులకాంకితుడగుచుండెను.
ఏతస్మిన్నంతదే బ్రహ్మా తస్థావగ్రే స ధూర్జటేః ।
పృధివ్యా సురసం ఘైశ్చ సార్ధం ప్రణత కంధరైః ॥
ఉత్తస్థౌ శంకరశ్శీమ్రం భక్త్యా దృష్వా జగద్గురుః ।
సనామ మూర్ధ్నా సంప్రీత్యా లఖవానాశిషం తతః ॥
ప్రణేముర్దేవతాస్సర్వే శంకరం చంద్రశేఖరం ।
ప్రణనామ ధరా భక్త్యా చాశిషం యుయుజే హరః ॥
ఇంతలో భూదేవితోబాటు దేవగణములు శిరస్సులు వంచగా ధూర్జటి ముందు బ్రహ్మ నీలిచెను. సృష్టికర్త జగత్పితయగు బ్రహ్మను చూచి శంకరుడు భక్తితో త్వరగా లేచి ప్రీతితో తలను వంచి నమస్కరించి ఆశీస్సులు పొందెను. చంద్రుని తలపై దాల్చిన శంకరునకు భూదేవియును సర్వదేవతలును భక్తితో నమస్కరించిరి. హరుడు వారీకాశీస్సులు సమకూర్చెను.
వృత్తాంతం కధయామాస పార్వతీశం ప్రజాపతిః ।
శ్రుత్వో నతముఖస్తూర్ణం శంకరో భక్త వత్సలః ॥
భక్తాపాయం సమాకర్ణ్య పార్వతీ పరమేశ్వరౌ ।
బభూవతుస్తౌ దుఃఖార్తౌ బోధయామాన తౌ విధిః ॥
తతో బ్రహ్మా మహేశశ్చ సురసంఘాన్ వసుంధరాం ।
గృహం ప్రస్థాపయామాన సమాశ్వాన్య ప్రయత్నతః ॥
ప్రజాపతి (బ్రహ్మ) పార్వతీవల్లభునకు తాము వచ్చిన వృత్తాంతమును చెప్పెను. భక్తవత్సలుడైన శంకరుడు ఆ వార్త విని త్వరగా (విచారముతో) తలవంచెను. భక్త వర్గమునకు వచ్చిన అపాయమును విని పార్వతీపరమేశ్వరులు మిక్కిలి దుఃఖార్డులు కాగా బ్రహ్మవారిని ఓదార్చెను. అంతట బ్రహ్మయు శంకరుడును భూదేవిని సురగణములను ఓదార్చి భూదేవిని ఆమె లోకమునకు సాగనంపిరి.
తతో దేవేశ్వరైస్తూర్ణమాగత్య ధర్మమందిరం ।
సహ తేన సమాలోచ్య ప్రజగ్ముర్భవసం హరేః ॥
ఆ పిదప బ్రహ్మరుద్రాది దేవేశ్వరులు త్వరగా ధర్మునీ మందిరమునకేగి అతనితో పై విషయ మాలోచించి శ్రీహరీ భవనమునకేగిరీ.
వైకుంఠం పరమంధామ జరామృత్యుహరం పరం ।
వాయునా ధార్యమాణం చ బ్రహ్మాండాదూర్ధ్వముత్తమం ॥
కోటయోజనమూర్ధ్వం చ బ్రహ్మలోకాత్సనాతనం ।
వర్ణనీయం న కవిభిర్విచిత్రం రత్ననిర్మితం ॥
పద్మరాగైరంద్రనీలై రాజమార్గై ర్విభూషితం ॥
తే మనోయాయినస్సర్వే సంప్రాపుస్తం మనోహరం ।
హరే రంతఃపురం గత్వా దదృశుః శ్రీహరి సురాః ॥
వైకుంఠమనేడి ఉత్తమ లోకము దేహధారుల జరామృత్యువులను (ముసలితనము-మరణము) హరించివేయునది. బ్రహ్మాండమునకు మిక్కిలి పైన బ్రహ్మలోకమున కంటే కోటి యోజనముల మీద వాయువు చేతనే ధరింపబడుచు సనాతనముగా వెల్గుచు ఊహాశాలులైన కవుల వర్ణనల కందక విచిత్రముగా ఒప్పునది. రత్ననిర్మితమగు ఆలోకము పద్మరాగ ఇంద్రనీల మయములైన రాజమార్గములతో అలంకరింపబడినది. మనస్సుతో ప్రయాణము చేయగల ఆ దేవేశ్వరులు మనోహరమైన శ్రీహరి లోకమును తరువాత అతని అంతఃపురమును చేరనేగి శ్రీహరిని దర్శించిరి.
రత్నసింహాసనస్థం చ రత్నాలంకార భూషితం ।
రత్నకేయూరవలయ రత్ననూపుర శోభితం ॥
రత్నకుండల యుగ్మేన గండస్థల విరాజితం ।
పీత వస్త్ర పరీధానం వనమాలా విభూషితం ॥
శాంతం సరస్వతీ కాంతం లక్ష్మీధృత పదాంబుజం ।
కోటి కందర్ప లీలాభం స్మితవక్త్రం చతుర్భుజం ॥
సునంద నంద కుముదైః పార్షదైరువసేవితం ।
చందనోక్షిత సర్వాంగం సురత్న ముకుటోజ్జ్వలం ।
పరమానంద రూపం చ భక్తానుగ్రహకారకం ॥
తం ప్రణేయున్చురేంద్రాశ్చ భక్త్యా బ్రహ్మాదయో మునే ।
తుష్టువుః పరయా భక్త్యా భక్తినమ్రాత్మ కంధరాః ।
పరమానంద భారార్తాః పులకాంచిత విగ్రహాః ॥
రత్నసింహాసనమందు వేంచేసియున్నవాడును రత్నాలంకారముల చేత అలంకరింపబడినవాడును రత్నాల బాహపురులు (దండకడియములు) ముంజేతి కంకణములు రత్నాల కాలి అందెలతో శోభించుచున్నవాడును, రత్నాల కుండల (చెవుల కమ్మలు) ముల జంటతో వెలుగుచున్న చెక్కిళ్లు గలవాడును, పీతాంబరము (పసుపు వన్నె గల వస్త్రము) ధరించినవాడును, కంఠము నుండి పాదముల వరకు వ్రేలాడుచున్న వనమాలయను పూలదండతో అలంకృతుడును, శాంతస్వరూపుడును, సత్త్వగుణముచేత వేదవాణీకి ఇంపైనవాడును, లక్ష్మీదేవిచేత ధరింపబడిన పాదపద్మములు గలవాడును, కోటి మన్మధుల విలాసముచేత వెలుగువాడును, చతుర్భుజుడును, చిరునవ్వు చిందించు ముఖము గలవాడును, నంద సునంద కుముదులనెడి అంగరక్షకులచేత సేవింప బడువాడును, చందనము పులుపబడిన దివ్య విగ్రహము గలవాడును, శ్రేష్ఠరత్న కిరీటము చేత వెలుగుచున్నవాడును, పరమానంద రూపుడును, భక్తుల ననుగ్రహించువాడును అగు ఆ శ్రీహరిని బ్రహ్మాదిదేవతలు భక్తితో నమస్కరించి తమ శిరస్సులు భక్తిభావమున వంగగా స్వామిని దర్శించిన పరమానంద భారము చేత ఆర్తులై పులకరించిన శరీరములు గలవారై పరమ భక్తితో నిట్లు స్తుతించిరి.
బ్రహ్మోవాచ :
నమామి కమలాకాంతం శాంతం సర్వేశమచ్యుతం ।
వయం యస్య కళాభేదాః కళాంశకళయా సురోః ॥
మనవశ్చ మునీంద్రాశ్చ మానుషాశ్చ చరాచరాః ।
కళాకళాంశ కళయా భూలోస్త్వతో నిరంజన! ॥
బ్రహ్మదేవుడిట్లు పల్కెను కమలానాథుడు శాంతస్వరూపుడు సమస్తమునకు ఈశ్వరుడును తన అత్యున్నత స్థితి నుండి జారుపాటు లేనివాడును అగు వానికి నమస్కరించుచున్నోను. ఓ నిరంజన స్వరూపా! మేము (బ్రహ్మరుద్రులు) నీ మహిమలోని ఒక కళారూపములుగా ఏర్పడితిమీ. ఒక కళలోని పదునారవ భాగపు అంశతో దేవతలేర్పడిరి. మనువులు, మునీంద్రులు, మనుష్యులు, చరాచర జీవకోటి నీ యొక్క ఒక కళ యొక్క పదునారవ భాగపు కళలోని అంశకళతో ఏర్పడిరి.
శంకర ఉవాచ :
త్వామక్షయమక్షరం వా వ్యక్తమవ్యక్తమీశ్వరం ।
అనాదిమాదిమానంద రూపిణం నర్వరూపిణం ॥
అణిమాదిక సిద్ధీనాం కారణం సర్వకారణం ।
సిద్ధిజ్ఞం సిద్ధిదం సిద్ధిరూపం కః స్తోతుమీశ్వరః ॥
శంకరుడిట్లు పలికెను :
నిన్ను నాశములేనివానిగాను మార్పులేనివానిగాను వ్యక్తస్వరూపుడవై గూడి అవ్యక్త మహిమ గల పరమాత్మగాను, అనాది లక్షణుడవును నీకంటే ఇతరమైన జగత్తునకు ఆది (కారణము) యైనవాడవును, ఆనందరూపుడవును సర్వరూపములు నీవైనవాడవును. అణిమాది సీదులకు మూలమైన వాడవును, సమస్త ప్రపంచమునకు కారణమైన వాటికీని కారణమైనవాడవును, సీదు లెరిగిన వాడవును సిద్ధులనొసగువాడవును తపోయోగాదుల ఫలస్వరూపుడవును అగు పరమేశ్వరుని నిన్ను స్తుతింపనెవడు సమర్థుడు?
ధర్మ ఉవాచ :
వేదే నిరూపితం వస్తు వర్ణనీయం విచక్షణైః ।
వేదే నిర్వచనీయం యత్తన్నిర్వక్తుం చ కః క్షమః ।
యస్య సంభావనీయం యద్గుణ రూపం నిరంజనం ॥
త దతరిక్తం స్తవనం కిమహం స్తౌమి నిర్గుణం ।
ధర్మదేవత ఇట్లు పల్కెను :
వేదమునందు నిరూపింపబడిన స్వరూపస్వభావములు గల వస్తువేదో విమర్శజ్ఞానము గల వారిచేత ఏ వస్తువు వర్ణింపబడునో, నిర్వికారములైన ఎవని గుణరూపములు సంభావనీయములో (భక్ష్యాదరములతో తలచదగినవి) ఆ నిరుణుని ఈ చెప్పబడిన లక్షణములకు భిన్నముగా ఏమని వర్ణించి స్తుతింతును.
బ్రహ్మాదీనా మిదం స్తోత్రం షట్ శ్లోకోక్తం మహామునే ॥
పఠిత్వా ముచ్యతే దుర్గాద్వాంఛితం చ లభేన్నరః ।
దేవానాం స్తవం శ్రుత్వా తానువాచ హరిస్స్వయం ॥
ఓ నారద మహామునీ! బ్రహ్మాదులు ఆరుశ్లోకములలో చెప్పిన ఈ స్తోత్రమును పఠించి మనుష్యుడు దుర్గమ బంధముల నుండి విడివడును. వాంఛిత ఫలమును పొందగల్గును. దేవతల స్తోత్రమును విని శ్రీహరి వారితో నిట్లనెను.
గోలోకం యాత యూయం చ యామీ పశ్చాచ్ఛ్రియా సహ ।
నర నారాయణౌ తౌ ద్వౌ శ్వేత ద్వీప నివాసినౌ ॥
ఏతే యాస్యంతి గోలోకం తథా దేవీ సరస్వతీ ।
అనంతా మమ మాయా చ కార్తికేయో గణాధిపః ।
సావిత్రీ వేదమాతా చ పశ్చాద్యాస్యంతి నిశ్చితం ॥
తత్రాహం ద్విభుజః కృష్ణో గోపీభీ రాధయా సహ ।
అత్రాహం కమలాయుక్తః సునందాదిభిరావృతః ॥
నారాయణశ్చ కృష్ణాఽహం శ్వేతద్వీపనివాసకృత్ ।
మమైవైతాః కళా స్సర్వే దేవా బ్రహ్మాదయః స్మృతాః ॥
కళా కళాంశ కళయా నురానుర నరాదయః ।
గోలోకం యాత యూయం చ కార్యసిద్ధిర్భవిష్యతి ॥
వయం పశ్చాధమిష్యామః సర్వేషామిష్ట సిద్ధయే ।
ఇత్యుక్త్యా వై సభామధ్యే విరరామ హరిః న్వయం ॥
మీరు గోలోకమునకు వెళుడు. నేను లక్ష్మీదేవితోబాటు పీదపవత్తును. శ్వేతద్వీపమునందు నివసించు నరనారాయణు లిద్దరచ్చటనుందురు. సరస్వతీదేవియు కుమారస్వామియు గణపతియు సావిత్రీదేవియు వేదమాతయగు గాయత్రీదేవియు ఆద్యంతములు లేని నామాయయు వీరందరును గోలోకమునకు ఆ వెనుక వత్తురు. ఆ లోకమున నేను గోపికలతోను రాధతోను కూడి ద్విభుజ (రెండు చేతులు గల) కృష్ణుడనుగాను ఇక్కడ (విష్ణులోకమున) నేను కమలా (లక్ష్మి) యుక్తుడనై సునందాదులచేత పరివేష్టింపబడి ఉందును. శ్వేతద్వీపమున నివసించు నారాయణుడను కృష్ణుడను నేనే. ఆ రూపములన్నియు నా కళలు. బ్రహ్మాది దేవతలందరు నాకళల్లోని అంశమాత్రులు. సురలు అసురులు మానవులు మొదలగు జీవులందరు అంశాంశమాత్రులుగా చెప్పబడిరి. మీరు గోలోకమునకు పొండు మీకు కార్యసిద్ధియగును. అందరి కోరికలు సిద్ధించుటకు మేము ఆ వెనుక వత్తము. ఇట్లు వైకుంఠమున శ్రీహరి స్వయముగా సభామధ్యమున పలికి విరమించేను.
ప్రణమ్య దేవతాస్సర్వాః జగ్ముర్గోలోకమద్భుతం ।
విచిత్రం పరమంధామ జరామృత్యుహరంపరం ॥
ఊర్ధ్వం వైకుంఠతో గమ్యం పంచాశత్కోటీ యోజనం ।
వాయునా ధార్యమాణం చ నిర్మితం స్వేచ్చయా విభోః ॥
తమనిర్వచనీయం చ దేవాస్తే గమనోత్సుకాః ।
తే మనోయాయినస్సర్వే సంప్రాపుర్విరజాతటం ॥
దృష్ట్వా దేవాః సరిత్తరం విస్మయం వరమం యయుః ।
దేవతలందరు శ్రీహరికి నమస్కరించి జరామృత్యువులను హరించునదియు అత్యద్భుతమును శ్రేష్ఠమగు పరమ ధామమును, శ్రీహరి తన సంకల్పముతో సృష్టించినదియు, వైకుంఠమునకు పైన ఏబదికోట్ల యోజనముల తరువాత చేరదగినదియు వాయువుచేతనే ధరింపబడునదియునగు గోలోకమను అనిర్వచనీయ ప్రదేశమునకు పోవలెనన్న ఆసక్తి కలవారై మనస్సులే వాహనములుగా చేసికొని పయనించి ఆ దేవతలందరు విరజానదీ తీరమును చేరబోయిరి. ఆ నదీ తీరమును చూచి వారందరు పరమాశ్చర్యమును పొందిరి.
శుద్ధ స్ఫటిక సంకాశం సువిస్తీర్ణం మనోహరం ॥
ముక్తామాణిక్య వరమ మణిరత్నాకరాన్వితం ।
కృష్ణ శుభ్రహరిద్రక్తమణిరాజి విరాజితం ॥
ప్రవాళాంకురముద్భూతం కుత్రచిత్సుమనోహరం ।
పరమామూల్య సద్రత్నాకర రాజి విభూషితం ॥
విధేరదృశ్యమాశ్చర్య నిధిశ్రేష్ఠికరాన్వితం ।
పద్మరాగేంద్ర నీలానామాకరం కుత్ర చిన్మునే ॥
కుత్రచిచ్చ మరకతాకర శ్రేణీ సమన్వితం ।
న్యమంతకాకరం కుత కుత్రచిద్రుచకాకరం ॥
అమూల్య పీత వర్ణాభం మణిశ్రేణ్యాకరాన్వితం ।
రత్నాకరం కుత్రచిచ్చ కుత్రచిత్కౌస్తుభాకరం ॥
కుత్ర నిర్వచనీయానాం మణీనామాకరం పరం ।
కుత్రచిత్కుత్రచిద్రమ్య విహారస్థలముత్తమం ॥
దృష్ట్వా తు పరమాశ్చర్యం జగ్ము సతారమీశ్వరాః ।
స్వచ్ఛమైన స్ఫటికమణుల కాంతి గలదియు మనోహరమై సువిశాలమైనదియు, ముత్యములు శ్రేష్ఠమైన మణిరత్నములకు. నెలవైనదియు, నలుపు తెలుపు ఆకుపచ్చ ఎరుపు వన్నెల మణి సమూహములతో విలసిల్లునదియు, ఒకచోట మనోహరముగా మొలచిన పగడాల మొలకలు గలదియు, మిక్కిలి అమూల్యమైన మేలుజాతి రత్నములతో వెలుగొందునదియు, సృష్టికర్తయగు బ్రహ్మయును ఇంతకుముందు చూడనట్టి ఆశ్చర్యకరమైన, శ్రేష్ఠములైన నిధుల సమూహముతో కూడినదియు, ఒకచోట పద్మరాగ ఇంద్రనీల మణులకు ఆకరమైనదియు, మరియొక చోట మరకత మణి సమూహములకు, ఇంకొక చోట శ్యమంతకమణులకు, వేరొక చోట రుచకమణులకు నివాసస్థానమైనదియు, అమూల్యమైన పసుపుపచ్చ రంగు గల మణిశ్రేణులు గలదియు, ఒకచోట రత్నములకు ఇంకోక చోట కౌస్తుభములకు వేరొక చోట వర్ణింపనలవిగాని మణులకు ఆకరమైనదియు, అచ్చటచ్చట సుందరములైన విహార స్థలములు గలదియు నగు ఆ విరజా తీరమును చూచి దేవతలు పరమాశ్చర్యము పొంది దానిని దాటిరి.
దదృశుః పర్వతశ్రేష్ఠం శత శృంగం మనోరమం ॥
పారిజాత తరూణాం చ వనరాజి విరాజితం ।
కల్పవృక్షైః పరీవృతం వేష్టితం కామధేనుభిః ॥
కోటి యోజనమూర్ధ్వం చ ధైర్ఘ్యం దశగుణోత్తరం ।
శైల ప్రస్థ పరిమితం పంచాశత్కోట యోజనం ॥
ప్రాకారాకారముస్యైవ శిఖరే రాసమండలం ।
దశయోజన విస్తీర్ణం వర్తులాకార ముత్తమం ॥
పుష్పోద్యాన సహస్రేణ పుష్పితేన సుగంధినా ।
సంకులేన మధుఘ్రాణాం సమూహేన సమన్వితం ॥
నురతద్రవ్య సంయుక్తై రాజీతం రతిమందిరైః ।
రత్నమండప కోటీనాం సహస్రేణ సమన్వితం ॥
రత్నసోపాన యుక్తేన సద్రత్న కలశేన చ ।
హరిన్మణీనాం స్తంభేన శోభితేన చ శోభితం ॥
సిందూరవర్ణమణిభిః పరితః ఖచితేన చ ।
ఇంద్రనీలైర్మధ్యగతైర్మండితేన మనోహరైః ॥
రత్న ప్రాకార సంయుక్త మణి భేదైర్విరాజితం ।
ద్వారైః కవాట నంయుకై శ్చతుర్భిశ్చ విరాజితం ॥
రజ్ఞుగ్రంధి సమాయుక్త రసాల పల్లవాన్వితైః ।
పరితః కదళీస్తంభ సమూ హైశ్చ నమన్వితం ॥
శుక్లధన్యపర్ణజాల ఫల దూర్వాంకురాన్వితం ।
చందనాగరు కస్తూరీ కుంకుమద్రవ చర్చితం ॥
వేష్ఠితం గోపకన్యానాం సమూహైః కోటీశో మునే ।
ఓ నారదమునీ! చూచువారి మనస్సుల నానందపరచునదియు, నూరు శిఖరములు గలదియు, పారిజాత వనములతో ఒప్పుచున్నదియు, కల్పవృక్షములు కామధేనువులతో కూడినదియు, కోటి యోజనముల ఎత్తుగలదియు, అంతకన్న పదింతలు పొడవు గలదియు ఏబది కోట్ల యోజనముల శైల ప్రస్థము (కొండమీది సమతలము) గలదియు అగు నొక శ్రేష్ఠపర్వతమును దేవాదులు చూచిరి. ఆ కొండ పైన పదియామడల విస్తీర్ణము గల గుండ్రనీ ప్రాకారము నడుమ ఆ శిఖరము పై రాసమండలమున్నది. పుష్పించి సువాసనలు విరజిమ్ముచు దట్టమైన గండు తుమ్మెద గుంపులతో గూడిన వేల పుష్పోద్యానములతోను, భోగద్రవ్యములతో గూడిన అనేక విలాస మందిరములతోను, రత్న సోపానములతో రత్న కలశములతో మరకత మణిస్తంభములతో శోభిల్లుచున్న వేలకోట్ల రత్నమంటపములతోను, సిందూర (ఎరుపు) వర్ణముణులు చుట్టును పొందుగబడి మనోహరములైన ఇంద్రనీలమణుల మధ్యవెలుగందుచున్న నవవిధ మణులతో నిర్మించిన ప్రాకారములతోను, మామిడి చిగుళ్ల తోరణములు అరటిబోదెలు అలంకరించిన నాలు కవాట ద్వారములతోను, తెల్లని బియ్యము పచ్చని ఆకులు ఫలములు గరికమొలకలు అలంకరించిన (గడపలతోను) చందనము, అగరు, కస్తూరి కుంకుమ పువ్వుల ద్రవము పులిమిన ముంగిళ్ళతోను, గుంపులు గుంపులుగా సున్న అనేక గోపకన్యల చేత పరివేష్ఠింపబడి ఆ రాసముండల మొప్పుచుండెను.
రత్నాలంకార సంయుకై రత్నమాలా విరాజితైః ॥
రత్నకంకణ కేయూర రత్ననూపుర భూషితైః ।
రత్నకుండల యుగ్మేన గండస్థలవిరాజితైః ॥
రత్నాంగుళీయ లలితైర్హస్తాంగులి విరాజితైః ।
రత్నపాశక బృందైశ్చ విరాజిత పదాంగుళైః ॥
భూషితై రత్న భూషాభిః సద్రత్న ముకుటోజ్జ్వలైః ।
గజేంద్ర ముక్తాలంకారైర్నిసీకామధ్య రాజితైః ॥
సిందూర బిందునా సార్థమలకాథ స్థలోజ్జ్వలైః ।
చారుచంపక వర్ణాభైశ్చందన ద్రవ చర్పితైః ॥
పీత వస్త్ర పరీధానైర్బింబాధర మనోహరైః ।
శరత్పార్వణ చంద్రాణాం ప్రభాం ముష్ణన్ముఖోజ్జ్వలైః ॥
శరత్ప్రఫుల్ల పద్మానాం శోభామోషణ లోచనైః ।
కస్తూరీ పాత్రీకాయుక్తై రేఖాక్త కజ్ఞలోజ్జ్వలైః ॥
ప్రపుల్ల మాలతీమాలా జాలైః కురశోభితైః ।
మధులుబ్ధ మధుఘ్రాణాం నమూ హైశ్చాపి సంకులైః ॥
చారుణా గమనేనైవ గజ ఖంజన గంజనైః ॥
వక్ర భ్రూభంగ సంయోగ శ్లక్ణ సీత సమన్వితైః ।
పక్వదాడిమ బీజాభ దంతపంక్తీ విరాజితైః ॥
ఖగేంద్ర చంచుశోభాఢ్య నాసికోన్నత భూషితైః ।
గజేంద్ర గండ యుగ్మాభ స్తన భార నతైరవ ॥
నితంబ కఠిన శ్రోణీపీన భార భరాగతైః ।
కందర్పశర చేష్టాభిర్జర్జరీ భూత మానసైః ॥
దర్పణైః పూర్ణ చంద్రాస్య సౌందర్య దర్శనోత్సుకైః ।
రాధికా చరణాంభోజ సేవాసక్త మనోరదైః ॥
సుందరీణాం సమూ హైశ్చ రక్షితం రాధికాజ్ఞయా ।
రత్నాలంకారములు రత్నములహారములు గల సుందరీమణులు రాధికాదేవి ఆజ్ఞచేత ఆ ప్రదేశమును గుంపులు గుంపులుగా గూడి రక్షించుచుండిరి. వారు రత్న కంకణములు రత్నాల దండకడియములు రత్ననూపురములు (కాళ్ల అందెలు) అలంకరించుకొని యుండిరి. చెవులకు బెట్టుకొన్న రత్నకుండలములతో వారి చెక్కిళ్లు (చెంపలు) తళతళలాడుచుండెను. సుందరములైన వారి చేతివ్రేళ్లయందు రత్నాంగుళీయములు (ఉంగరములు) విరాజిల్లుచుండెను. ఆ స్త్రీల పాదముల వ్రేళ్లు రత్నాల మట్టెలతో వెలయుచుండెను. శిరస్సున అలంకరించుకున్న రతనాల నగలతోను మెరయుచున్న కిరీటములతోను, ముక్కు నడుమ మెరయుచున్న ఏనుగు ముతైపు (జాతిముత్యము) ఆభరణములతోను, ఎఱ్ఱని చుక్క తిలకములతో ప్రకాశించుచున్న ముంగురుల క్రింది ఫాలభాగములతోను కూడి సుందరమైన సంపెంగ పువ్వు వన్నె వంటి గంధములు పులుముకొన్నవారును, మనోహరములైన దొండపండువంటి క్రింది పెదవులు గల వారును పీతాంబరములు ధరించిన వారును, శరత్కాలపూర్ణీమనాటి చంద్రుల కాంతిని దోచుకోనుచున్న ముఖకాంతులు గలవారును, శరదృతువున వికసించిన పద్మ సౌందర్యమును దోచుకొనుచున్న కన్నులు గలవారును, కస్తూరీ పాత్రలు చేతబట్టి రేఖలుగా తీర్చిన కన్నుల కాటుక కాంతి గలవారును, నిండుగా విచ్చుకొన్న మాలతీ పుష్పహారములు కొప్పులయందు ధరించిన వారును, పూలతేనె కాశీంచిన తుమ్మెదల గుంపులు గలవారును, సుందరగమనము (నడక) తో ఏనుగులను కాటుక పిట్టలను తిరస్కరించుచున్నవారును, వక్రము సుందరమునైన బొమముడి గల స్వచ్ఛమైన చిరునవ్వుతో విరాజిల్లుచున్నవారును, పండిన దానిమ్మ పండులోని బీజముల వంటి పలువరుసలు గలవారును, పక్షిరాజగు గరుత్మంతుని ముక్కు అందమును మించిన ఉన్నత నాసికలతో (ముక్కు) ఒప్పుచున్నవారును, గజరాజు కుంభయుగము వంటి స్తనముల భారముతో వంగినట్లున్నవారును, మధ్యభాగమున కఠినములు పుష్టిగా నున్నవియునగు పిరుదుల భారముతో వంగినవారును, మన్మథ బాణ ప్రయోగముల వలన వణకుచున్నట్లున్న మనస్సులు గలవారును నిండు చంద్రుని వంటి తమ ముఖ సౌందర్యమును అద్దములలో చూచుకొను ఆసక్తి గలవారును, రాధాదేవి పాదపద్మములను సేవించుట యందాసక్తి గలవారును అగు గోపకన్యలు అనేకు లుండిరి.
క్రీడా సరోవరాణాం చ లక్షైశ్చ పరివేష్టితం ॥
శ్వేతరక్తైర్లోహితైశ్చ వేష్టితైః పద్మరాజితైః ।
సుకూజద్భి ర్మదుఘ్రాణాం సమూ హై స్సంకులై స్సదా ॥
పుష్పోద్యాన సహస్రేణ పుష్పితేన సమన్వితం ।
కోటికుంజ కుటీరైశ్చ పుష్పశయ్యా సమన్వితైః ॥
భోగద్రవ్య సకర్పూరతాంబూల వస్త్ర సంయుతైః ।
రత్న ప్రదీ పైః పరితః శ్వేత చామర దర్పణైః ॥
విచిత్ర పుష్పమాలాభిః శోభితైః శోభితం మునే ।
తం రాసమండపం దృష్ట్వా జగ్ముస్తే పర్వతాద్బహిః ॥
అచ్చట లక్షలకొలది క్రీడా సరోవరములు తెలుపు ఎరుపు నలుపుతో గూడిన ఎరుపు రంగు గల పద్మములతో కూడి విస్తరించి యుండెను. గుంపులు గట్టి ఝంకారములు చేయుచున్న తుమ్మెదల సమూహములు గల పుష్పోద్యానములు వేలకొలది అలరారుచుండగా వాటిలో పూలశయ్యలతోను, కర్పూర తాంబూలాది భోగద్రవ్యములతోను మంచి వస్త్రములతోను శ్వేత చామరములు నిలువుటద్దములతోను చిత్ర విచిత్రములైన పూలమాలలతోను, చుట్టు వెలుగుచున్న రత్నదీపములతోను గూడిన కోటిసంఖ్య గల పొదరిండ్లు (లతా గృహములు) వెలసియున్న రాసమండపమును చేరి దేవతలు దానిని దర్శించి శతశృంగ పర్వతము దాటి వెళ్లిరి.
తతో విచక్షణం రమ్యం దదృశుః సుందరం వనం ।
వనం బృందావనం నామ రాధామాధవయోః ప్రియం ॥
క్రీడాస్థానం తయోరేవ కల్పవృక్ష చయాన్వితం ।
విరజా తీర నీరాక్తైః కంపితం మందవాయుభిః ॥
కస్తూరీ యుక్త పత్రాభై: పుష్పౌఘైః సురభీకృతం ।
నవ పల్లవ సంసక్త పరపుష్ఠ రుతైర్యుతం ॥
కుత్ర హేలీ కదంబనాం కదంబైః కమనీయకం ।
మందారాణాం చంపకానాం చందనానాం తథైవ చ ॥
సుగంధికుసుమానాం చ గంధేన సురభీకృతం ।
ఆమ్రాణాం నాగరంగాణాం పనసానాం తథైవ చ ॥
తాలానాం నారికేళానాం బృందైర్బృందారకం వనం ।
జంబూనాం బదరీణాం చ కర్జూరాణాం విశేషతః ॥
గుర్వాకామ్రాతకానాం చ జంబీరాణాం చ నారద ।
కదలీనాం శ్రీఫలానాం దాడిమానాం మనోహరైః ॥
సుపక్వఫల సంయుక్తైః సమూహైశ్చ విరాజితం ।
పిప్పలీనాం చ సాలానామశ్వత్థానాం తథైవ చ ॥
నింబానాం శాల్మలీనాం చ తిత్తిడీనాం చ శోభనైః ।
అన్యేషాం తరుభేదానాం సుకులైస్సంకులం సదా ॥
పరితః కల్పవృక్షాణాం బృందైర్బృందైర్విరాజితం ।
మల్లికామాలతీ కుంద కేతకీ మాధవీలతాః ॥
ఏతాసాం చ నమూహైశ్చ యూధికాభిస్సమన్వితం ।
చారు కుంజ కుటీరై స్తై స్తైః పంచాశత్కోటిభిర్మునే ॥
రత్న ప్రదీప దీపైశ్చ ధూపనైః సురభీకృతైః ।
శృంగారద్రవ్య యుక్తైశ్చవాసితైర్గంధవాయుభిః ॥
చందనాక్తైః పుష్పడల్ఫైర్మాలాజాల సమన్వితైః ।
మధులుబ్ధ మధుఘ్రాణం కలశబ్దైశ్చ శబ్ధిబ్తం ॥
రత్నాలంకార శోభాఢ్యైర్గోపీ బృందైశ్చ వేష్టితం ।
పంచాశత్కోటి గోపీభీ రక్షితం రాధికాజ్ఞయా ॥
రాధామాధవులకు ప్రియమై ఆ దంపతులకు క్రీడా స్థానమైన పరమ సుందర బృందావనమును దేవతలు దర్శించిరి. ఆ బృందావనము కల్చవృక్ష సమూహములతో కూడి, విరజా నదీ జలముచే తడిపబడిన పిల్లగాలులు వీచగా కంపించుచు, కస్తూరీ సహిత పద్మ పత్రముల యొక్క పుష్పముల యొక్క సువాసనలతో కూడి, క్రొత్త చివుళ్లకు మరిగిన కోకిలల ధ్వనులతో కూడి, ఒకచోట విలాసపు కడిమీ చెట్ల గుంపులతో కోరదగినదై, మందారముల చంపకముల చందన వృక్షముల సుగంధ పుష్పముల వాసనలతో పరిమళించునదై, మామిడి నారింజ పనస తాడి కొబ్బరి చెట్ల గుంపులతో దేవవనమై, అల్లనేరడి, రేగు, ఖర్జూర, గజనిమ్మ, అరటి, మారేడు, దానిమ్మ మొదలగు ఫలవృక్షముల మగ పండిన ఫలములతో నిండి గుంపులు గుంపులుగా మనోహరములై ఒప్పున, పిప్పలి మద్ధి రావి, వేప, బూరుగు మొదలగు మంగళ వృక్షములలో అనేక విధములు దట్టముగా గుంపులు గుంపులుగా విలసిల్లునదై, అంతట విస్తరించిన కల్పవృక్ష బృందములు గలదై, మల్లి, మాలతి, మొల్ల బండి గురివింద, మొగిలి మొదలగు పుష్పలతల పొదలు గలదై విరాజిల్లుచుండెను. ఆ బృందావనములో పొగదినుసుల పొగలతో పరిమళించుచు రత్నదీప మాలలతో వెలుగుచు సుగంధ వాయువులు సోకించిన శృంగార ద్రవ్యములతో అలరుచు, మంచి గంధములతో తడిపిన పుష్పశయ్యలు పూలమాలలు చేరులు పూలతావికీ లేనెకు ఆశీంచి వచ్చిన తుమ్మెదల రొదలు ధ్వనించుచు, మనోహరముగా నున్న పొదరిండ్లు ఏబది కోట్లుండెను. ఆ ప్రదేశమును రాధాదేవి ఆజ్ఞతో రత్నాలంకార శోభాడ్యలైన ఏబది కోట్ల గోపికా స్త్రీలు చుట్టు ముట్టి రక్షించుచుండిరి.
ద్వాత్రింశత్కాననం తత్ర రమ్యం రమ్యం మనోహరం ।
బృందావనాభ్యంతరితం నిర్జనస్థాన ముత్తమం ॥
సుపక్వ మధురస్వాదు ఫలైర్బృందారకం మునే ।
గోష్ఠానాం చ గవాం చైవ నమూహైశ్చ సమన్వితం ॥
పుష్పోద్యాన సహస్రేణ పుష్పితేన సుగంధినా ।
మధులుబ్ధ మధుఘ్రాణం సమూహేన సమన్వితం ॥
పంచాశత్కోటి గోపీనాం విలాసైశ్చ విరాజితం ।
శ్రీకృష్ణ తుల్యరూపాణాం సద్రత్న గుడితైర్వరైః ॥
దృష్ట్వా బృందావనం రమ్యం యయుగ్గోలోక మీశ్వరాః ।
అచట బృందావనము లోపల ఉత్తమము మనోహరము పరమ సుందరమైన ఏకాంత ప్రదేశము ద్వాత్రింశల్కొనన మను పేరుతో గలదు. ఓ నారదమునీ! బాగుగా పండి తీయని రుచిగల ఫలములతో ఆవులతో నిండిన గోశాలల సమూహములతో తేనెనాళించి వచ్చిన లేనె టీగల గుంపులు గల నిలువెల్ల పుష్పించిన వేల పుష్పోద్యానములతో శ్రీకృష్ణుని సౌందర్యాదులకు తగిన పంచాశత్కోటి సంఖ్యగల సద్రత్నాలంకార ధారిణులైన గోపికారమణుల యొక్క విలాస చేష్టలతో కూడిన ఆ రమ్య వనమును దర్శించి లోకపాలకులు గోలోకమునకేగిరి.
పరితో వర్తులాకారం కోటియోజన విస్తృతం ॥
రత్నప్రాకార సంయుక్తం చతుర్ద్వారాన్వితం మునే ।
గోపానాం చ సమూహైశ్చ ద్వారపాలై స్సమన్వితం ॥
ఆశ్రమై రత్న ఖచితైర్నానో భోగ సమన్వితైః ।
గోపీనాం కృష్ణ భృత్యోనాం పంచాశత్కోటిభిర్యుతం ॥
భక్తానాం గోపబృందానామాశ్రమైః శతకోటిభిః ।
తతోఽధిక సువిస్తీర్ణైః సద్రత్న గ్రధితైర్యుతం ॥
ఆశ్రమైః పార్షదానాం చ తతోఽధీక విలక్షణైః ।
అమూల్య రత్న రచితైస్సంయుక్తం దశకోటిభిః ॥
పార్షద ప్రవరాణాం చ శ్రీకృష్ణ రూపధారిణం ।
ఆశ్రమైః కోటిభిర్యుక్తం నద్రత్నేన వినిర్మితైః ॥
రాధికా శుద్ధ భక్తానాం గోపీనామాశ్రమైర్వరైః ।
సద్రత్న రచితైర్ద్రవ్యైర్ద్వాత్రింశత్కోటిభిర్యుతం ॥
తాసాం చ కింకరీణాం చ భవనైన్సుమనోహరైః ।
మణిరత్నాది రచితైః శోభితం దశకోటిభిః ॥
శతజన్మ తపః పూత భక్తా యే భారతే భువి ।
హరిభక్తిపరా యే చ కర్మనిర్వాణ కారకాః ॥
స్వప్నే జ్ఞానే హరేర్ధ్యానే నివిష్టమానసా మునే ।
రాధాకృష్ణేతి కృష్ణేతి ప్రజవంతో దీవానిశం ॥
తేషాం శ్రీకృష్ణ భక్తానాం నివాసైః సుమనోహరైః ।
సద్రత్న మణి నిర్మాణైర్నానా భోగ సమన్వితైః ॥
పుష్పశయ్యా పుష్పమాలా శ్వేత చామరశోభితైః ।
రత్నదర్శణ శోభాడ్యైర్హ రిన్మణి సమర్పితం ॥
అమూల్య రత్నకలశ సమూహాన్విత శేఖరైః ।
సూక్ష్మ వస్త్రాభ్యంతరితైః సంయుక్తం శతకోటిభిః ॥
దేవాస్తమద్భుతం దృష్ట్వా కియద్దూరం యయుర్ముదా ।
ఆ గోలోకము వలయాకారముగా నుండీ అంతట కోటి యోజనముల వైశాల్యము గలదిగా నుండెను. చుట్టు రత్నప్రాకారము గలీకి గోపాలకులు ద్వారపాలకులు గల నాలు ద్వారములతో నుండెను. ఆ లోపల రత్నములు పొదిగిన, నానా భోగ వస్తువులతో కూడిన ఆశ్రమములు కృష్ణదాసీజనమైన గోపికల యొక్క నివాస స్థానములు ఏబది కోట్లుండెను. అంతకన్న సువిశాలములై సద్రత్నములు కూర్చిన భక్తులైన గోపాలక బృందముల ఆశ్రమములు శతకోట్లుండెను. అంతకంటే విశేషముగా అమూల్య రత్నముల చేత నిర్మించబడిన కృష్ణపార్షదుల పదికోట్ల ఆశ్రమములు ఉండెను. శ్రీకృష్ణుని వంటి రూపములు ధరించిన పార్టదనాయకుల యొక్క ఆశ్రమములోక కోటి, సద్రత్న నిర్మితములై ఉండెను. రాధికాదేవియందు శుద్ధభక్తి గల గోపికల యొక్క ఆశ్రమములు ముప్పది రెండు కోట్లు, మేలి రత్నములతో నిర్మించబడి అన్ని పదార్థములు గలవీయై యుండెను. భక్తురాండ్రైన ఆ గోపికల యొక్క దాసీజనము నివసించు భవనములు మణిరత్న నిర్మితములు పదికోట్లుండెను. భారత దేశమున (భూమండలములోని) నూరు జన్మల తపస్సు చేత పూతాత్ములైన భక్తులు, విశేషించి హరి భక్తులు, మోక్షము కొరకు కర్మాచరణ చేయు వారు స్వప్నమందును మెలకువ యందును శ్రీహరి ధ్యానములో లగ్నమైన మనస్సులు గలవారు రాత్రింబవళ్లు రాధాకృష్ణ “శ్రీకృష్ణ” అను మంత్రమును జపించుచున్న శ్రీకృష్ణ భక్తుల నివాస స్థానములు సుమనోహరములై యుండును. ఓ నారదమునీ! ఆ స్థానములు సద్రత్న నిర్మితములు నానాభోగములతో కూడినవి. పూలశయ్యలు పుష్పమాలలు శ్వేతచామరములు మరకత మణులు పొదిగిన రత్న దర్పణములు అందుశోభిల్లుచుండెను. అమూల్య రత్నకలశములు గోపుర శిఖరములపై ఒప్పుచుండగా సూక్ష్మ వస్త్రములు గప్పబడియుండు ఆ యాశ్రమములు నూరుకోట్లు అలరారుచుండెను. దేవతలందరు అద్భుతమైన ఆ గోలోకము దర్శించి ఆనందముతో కొంత దూరమేగిరి.
తత్రాక్షయ వటం రమ్యం దదృశుర్జగదీశ్వరాః ॥
పంచయోజన విస్తీర్ణమూర్ధ్వం తద్ద్విగుణం మునే ।
సహస్ర స్కంధ సంయుక్త శాఖా సంస్థాసమన్వితం ॥
రక్త పక్వ ఫలాకీర్ణం శోభితం రత్నవేదిభిః ।
కృష్ణ స్వరూపాన్ తన్మూలే దదృశుర్వల్లభాంచ్ఛిశూన్ ॥
పీత వస్త్ర పరీధానాన్ క్రీడాసక్త మనోహరాస్ ।
చందనోక్షిత సర్వాంగాస్ రత్నభూషణ భూషితాన్ ॥
దదృశుస్తత్ర దేవేశాః పార్షద ప్రవరాన్ హరేః ।
తతోఽవిదూరే దదృశూ రాజమార్గం మనోహరం ॥
సిందూరాకార మణిభిః వరితోరచితం మునే ।
ఇంద్రనీలైః పద్మరాగై ర్హీ రకై రుచకై స్తథా ॥
నిర్మితైర్వేదీభిర్యుక్తం వరితో రత్నమండవం ।
చందనాగురు కస్తూరీ కుంకుమ ద్రవ చర్చితం ॥
దధి పూర్ణ లాజ ఫలపుష్ప దూర్వాంకురాన్వితం ।
సూక్ష్మ సూత్ర గ్రంధియుక్త శ్రీఖండ పల్లవాన్వితం ॥
రంభాస్తంభ సమూహైశ్చ కుంకుమార్తె ర్విరాజితం ।
సద్రత్న మండల ఘటైః ఫలశాఖా సమన్వితైః ॥
సిందూర కుంకుమాక్తైశ్చ గంధ చందన చర్చితై: ।
భూషితైః పుష్పమాలాభిః పాదపైః పరిభూషితం ॥
గోపికానాం సమూహైశ్చ క్రీడాసక్తైశ్చ వేష్టితం ।
ఆ లోకపాలకులు అచ్చట ఐదుయోజనముల విస్తారమును అంతకు రెండింతల ఎత్తును కలిగి వేయి స్కంధములతోను (బోదెలు) శాఖోపశాఖలతోను గూడి ఎఱ్ఱగా పండిన ఫలములతోను మూలమున గత్న వేదికలతో విరాజిల్లుచున్న సుందరమైన అక్షయ వటమును దర్శించిరి. ఆ చెట్టు మొదట పీతాంబరములు ధరించి శ్రీగంధము పులిమిన సర్వాంగములు గలవారై రత్పభూషణముల చేత అలంకృతులై చూచువారికి మనోహరముగా బాల్యక్రీడా సక్తులై శ్రీకృష్ణరూపులై యున్న మోహన శిశువులను వారి సమీపమున విష్ణుపారదశ్రేష్టులను దర్శించిరి. అచ్చటికి సమీపముననే మనోహరమైన రాజమార్గమొకటి వారికి కన్పించెను. ఓ నారదా! ఆ మార్గమెర్రని మణులతో నిర్మితమై యుండెను. ఆ తరువాత ఇంద్రనీల, పద్మరాగ, వజ్ర రుచక మణులతో నిర్మితములైన ఆరుగులతో (తిన్నెలు) గూడిన రత్నమండపము కన్పించెను. ఆ మండపము చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవముతో అలుకబడి (పూయబడి) ఉండెను. ఆ రత్నమండపములో మేలిమి రతనాల పూర్ణకుంభములు మండలాకారముగా అమర్చబడియుండెను. ఆ కుంభములు కుంకువు ద్రవము పూయబడి శ్రీ గంధపు చిగురులతో గూడిన సన్నని సూత్రములచేత బంధింపబడి (కంకణ సూత్రములు) పెరుగు వరి పేలాలు ఫలములు పుష్పములు పచ్చిగరికలతో కూడి చుట్టు అరటిబోదెలు చుట్టియుండగా విరాజిల్లుచుండెను. ఎఱ్ఱని కుంకుమ ద్రవము చేత తడుపబడి శ్రీగంధ చందనమలదబడి పుష్పమాలాలంకృతములై యున్న వృక్షములు రత్నమండపము చుట్టునుండెను. అక్కడ క్రీడాసక్తలైన గోపికల నమూహములు పరివేష్టించి యుండిరి.
బహామూల్యేన రత్నేన రత్న సోపాన నిర్మితాన్ ॥
వహ్ని శౌచాంశుకై రమ్యైః శ్వేత చామర దర్పణైః ।
రత్న తల్ప విచిత్రైశ్చ పుష్పమాల్యైర్విరాజితాన్ ॥
షోడశ ద్వార సంయుక్తాస్ ద్వారపాలైశ్చ రక్షతాన్ ।
పరితః పరిఖాయుక్తాన్ రత్న ప్రాకార వేష్ఠితాన్ ॥
చందనా గురు కస్తూరీ కుంకుమ ద్రవ చర్చితాన్ ।
గృహాన్ మనోరమాస్ దృష్వా తే దేవా గమనోత్సుకాః ॥
జగ్ముః శీఘ్రం కియద్దూరం దదృశుః సుందరం తతః ।
ఆశ్రమం రాధికాయాశ్చ రాసేశ్వర్యాశ్చ నారద ॥
ఓ నారదా! రత్నమండపము దాటిన తరువాత దేవతలకు మనోహరములైన గృహములు కన్పించెను. అవి గొప్ప వెలగల రత్ననిర్మితములైన సోపానములతోను, అగ్నికాంతి గల సుందర వస్త్రములు వింజామరలు నిలువుటద్దములు విచిత్ర రత్న తల్పములు (శయ్యలు) పుష్పమాలలు మొదలగు భోగద్రవ్యములతోను, ద్వారపాలకులు రక్షించు పదహారు ద్వారములతోను చుట్టు అగడ్తలతోను రత్న ప్రాకారముతోను విరాజిల్లుచు చందనము అగరు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవములు పులుమబడి (పూయబడి) ఉండెను. ఆ గృహములను దర్శించి దేవతలు ప్రయాణాసక్తులై శీఘ్రముగా కొంత దూరమేగి ఇంతకు పూర్వము చూచిన వాటికన్న సుందరమైన ఆశ్రమమును చూచిరి. అది రాసేశ్వరియైన రాధికాదేవి యొక్క నిలయము.
దేవాధిదేవ్యా గోపీనాం వరాయాశ్చారు నిర్మితం ।
ప్రాణాధికాయాః కృష్ణస్య రమ్యద్రవ్య మనోహరం ॥
సర్వానిర్వచనీయం చ పండితైర్న నిరూపితం ।
సుచారు వర్తులాకారం షఢ్గవ్యూతి ప్రమాణకం ॥
శతమందిర సంయుక్తం జ్వలితం రత్న తేజసా ।
అమూల్య రత్న సారాణాం చయైర్విరచితం వరం ॥
దుర్లంఘ్యభర్గభీరాభిః పరిఖాభిన్సుశోభితం ।
కల్పవృకైః పరివృతం పుష్సోద్యాన శతాంతరం ॥
సుమూల్య రత్న ఖచిత ప్రాకారైః పరివేష్ఠితం ।
నద్రత్న వేదికాయుక్తైర్యుక్తం ద్వారైశ్చ సప్తభిః ॥
సంయుక్తం రత్నచిత్రైశ్చ విచిత్రైర్వర్తులం మునే ।
ప్రధాన సప్తద్వారేభ్యః క్రమశః క్రమశో మునే ॥
సర్వతోఽపి తతస్తత్ర షోడశద్వార సంయుతం ।
దేవాధిదేవి గోపీగణ శ్రేష్ఠురాలు, కృష్ణునకు ప్రాణముల కన్న మిక్కిలి ప్రియురాలు ఐన రాధాదేవి కొరకు ఇం పైన ఉత్తమ ద్రవ్యములతో మనోహరముగా సుందరముగా నిర్మించబడిన ఆ యాశ్రమము ఎట్టివారికిని నిర్వచింపరానిదై పండితులచేతను నిరూపింప బడనిదై ఆరుగవ్యూతుల ప్రమాణము గలదై వర్తులాకారముగా నుండెను. (గవ్యూతి - ఎదురంకె వినబడునంత దూరము) అమూల్యము లైన శ్రేష్ఠమణులతో నిర్మించబడి రత్నకాంతులు విరజిమ్ముచున్న సూరు మందిరములు వేర్వేరుగానుండెను. ప్రతి మందిరము దాట శక్యము గాని లోతైన అగడ్డతో రత్నఖచిత ప్రాకారముతో పరివేష్టితమై కల్పవృక్షములు చుట్టుముట్టియున్న పుష్పోద్యానము నడుమ రతనాల తిన్నెలు (అరుగులు) గల ఏడేసి ద్వారములు విచిత్రములైన రత్నాల చిత్తరువులు వెలయుచుండగా ఆ గృహములను మండ లాకారముగా ప్రధాన సప్తద్వారములను వరుసగా చుట్టుముట్టి అక్కడ పదహారు ద్వారములు గల ఒక ప్రాకారముండెను.
దేవా దృష్ట్వా చ ప్రాకారం సహస్రధసురుచ్ఛ్రితం ॥
నద్రత్న క్షుద్ర కలశనమూహైః సుమనోహరైః ।
ప్రదీప్తం తేజసా రమ్యం పరమం విన్మయం యయుః ॥
వేయి ధనుస్సుల ఎత్తు కలిగి మేలి రత్నముల చిన్న చిన్న కలశములు తేజస్సుతో వెలుగుచుండగా రమ్యముగానున్న ఆ ప్రాకారమును దేవాధీశులు దర్శించి మిక్కిలి ఆశ్చర్యము పొందిరి.
తతః ప్రదక్షిణీకృత్య కియద్దూరం యయుర్ముదా ।
పురతోగచ్ఛతాం తేషాం వశ్చాద్భూతస్తదాశ్రమః ॥
ఆ ప్రదేశమునకు ప్రదక్షిణము చేసి వారు సంతసముతో ముందుకు కొంత దూరమగిరి. ముందుకేగుచున్న వారికి ఆ రాధాశ్రమము వెనుకగానుండెను.
గోపానాం గోపీకానాం చ దదృశుశ్చాశ్రామాన్ పరాన్ ।
అమూల్య రత్న రచితాన్ శతకోటి మితాన్ మునే ॥
దర్శందర్శం చ వరితో గోపానాం నర్వమాశ్రమం ।
గోపీకానాం చాపరం వా రమ్యం రమ్యం నవం నవం ॥
గోలోకం నిఖిలం దృష్ట్వా పులకాంగం యయుస్సురాః ।
తదేవ వర్తులాకారం గమ్యం బృందావనం వనం ॥
దదృశుః శతశృంగం చ తద్బహి ర్విరజా నదీం ।
విరజాం తాం యయుర్దేవా దదృశుః శూన్యమేవ చ ॥
వాయ్వాధారం చ గోలోకం సద్రత్నమయమద్భుతం ।
ఈశ్వరేచ్చా వినిర్మాణం రాధికాజ్ఞాఽను బంధనాత్ ॥
యుక్తం సహస్రైః సరసాం కేవలం మంగళాలయం ।
అచ్చట వారు అమూల్య రత్నముల చేత నిర్మించబడిన శతకోటి సంఖ్య గల గోపికల యొక్కయు గోపాలకుల యొక్క ఆశ్రమ ములను దర్శించిరి. ఓ మునీ! అంతట విస్తరించి యున్న గోపాలుర ఆశ్రమములను పరమ సుందరములైన గోపికల క్రొంగొత్త ఆశ్రమములను ఇట్లు మొత్తము గోలోకమును చూచి దేవతలు పులకాంచితులైరి. అదియే వర్తులాకారమైన రమ్య బృందావనము. శతశృంగ పర్వతము. దానికి వెలుపల విరజానదీ. వీరజను దాటిన తరువాత అంతయు శూన్యమే కన్పించేను. ఆ గోలోకము వాయువే ఆధారముగా వెలయును. అది సద్రత్నమయము. అద్భుతము. రాధికాదేవి ఆజ్ఞననుసరించి పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పముతో నిర్మించబడిన ఆ లోకము వేల సరస్సులు కలిగే శుభములకు నిలయమై యుండెను.
నృత్యం చ దదృశు స్తత్ర దేవాశ్చ సుమనోహరం ॥
సుతానం చారుసంగీతం రాధాకృష్ణ గుణాన్వితం ।
శ్రుత్యైవ గీతపీయూషం మూర్ఛామాపుస్సురా మునే ॥
క్షణేన చేతనాం ప్రాప్య తే దేవాః కృష్ణ మానసాః ।
దదృశుః పరమాశ్చర్యం స్థానే స్థానే మనోహరం ॥
ఆ దేవతలచ్చట ఇంపైన నృత్యమును మంచి మూర్చనలతో గూడిన, రాధాకృష్ణుల గుణములను వర్ణించు సుందర సంగీతమును వినిరి. ఈ గీతామృతమును విని వారు మూర్ఛ పొంది మరుక్షణములో తేలివికి వచ్చి ఆ కృష్ణ భక్తులు అడుగడుగున మిక్కిలి ఆశ్చర్యకరములు మనోహరములునైన దృశ్యములను చూచిరి.
దదృశు ర్గోపికా స్సర్వా నానావేష విధాయకాః ।
కాశ్చిన్మృదంగ హస్తాశ్చ కాశ్చిద్వీణాకరా వరాః ॥
కాశ్చీ చ్చామర హస్తాశ్చ కరతాల కరాః పరాః ।
కాశ్చి ద్యంత్ర వాద్యహస్తా రత్ననూపుర శోభితాః ॥
సద్రత్న కింకిణీజాల శబ్దేన శబ్దితా వరాః ।
కాశ్చిన్మస్తక కుంభాశ్చ నృత్య భేద మనోరథాః ॥
వుంవేష నాయికాః కాశ్చిత్కాశ్చి త్తాసాం చ నాయికాః ।
కృష్ణవేషధరాః కశ్చిద్రాధావేషధరాః పరాః ॥
కాశ్చిత్సంయోగ వీరతాః కాశ్చిదాలింగనే రతాః ।
క్రీడా నక్తాశ్చ తా దృష్ట్వా సస్మితా జగదీశ్వరాః ॥
ప్రగచ్ఛంతః కియద్దూరం దదృశు శ్ఛాశ్రమాన్ బహూన్ ।
రాధా సఖీనాం గేహాంశ్చ ప్రధానానాం చ నారద ॥
ఆ లోకపాలకులు నానా వేషములు ధరించియున్న గోపికలనచ్చట దర్శించిరి. కొందరు మృదంగపాద్యములు ధరించి మరికొందరు వీణలను ధరించి ఇంక కొందరు చామరములు పట్టుకొని ఇంకొక కొందరు. తాళములు పట్టుకొని కొందరు చిమ్మున గొట్టములు వాద్యములను ధరించి-రత్ననూపురములతో (కాలి అందెలు) శోభిల్లుచు కొందరు, రత్నాల మొలనూలు లోని మువ్వల గుంపు ధ్వనించుచుండగా కొందరు, శిరస్సుల మీద కుంభములు (కడవలు) పెట్టుకొని వేర్వేరు నృత్యములు చేయు కోరికలు గల్గి కొందరు, పురుష వేషములు ధరించిన నాయికలు కొందరు వారికి నాయికలుగా మరికొందరు, కృష్ణవేషములు ధరించి కొందరు, రాధా వేషములు ధరించి ఇంక కొందరు, ప్రియసంయోగము చాలించిన వారు కొందరు, ప్రియుల నాలింగనము చేసికొను నాసక్తి గలవారు కొందరు ఇటు క్రీడాసక్తలైన యున్న గోపికలను చూచి ఆ దేవతలు చిరునవ్వుతో కొంతదూరము పోవుచు రాధాదేవి యొక్క ప్రధాన సఖుల ఆశ్రమములను అనేకములను చూచిరి.
రూపేణైవ గుణేనైవ వేషేణ యౌవనేన చ ।
సౌభగ్యేనైవ వయసా సదృశీసోం చ తత్ర వై ॥
త్రయస్త్రింశద్వయాశ్చ రాధికాయాశ్చ గోపీకాః ।
వేషానిర్వచనీయాశ్చ తాసాం నామాని చ శ్రణు ॥
సుశీలా చ శశికలా యమునా మాధవీ రతీ ।
కదంబమాలా కుంతీ చ జాహ్నవీ చ స్వయంప్రభా ॥
చంద్రముఖీ చ సావిత్రీ గాయత్రీ సుముఖీ సుఖా ।
పద్మాలయా పారిజాతా గౌరీ చ సర్వమంగళా ॥
కాలికా కమలా దుర్గా భారతీ చ సరస్వతీ ।
గంగాఽoబికా మదుమతీ చంపాఽవర్ణా చ సుందరీ ॥
కృష్ణప్రియా నతీ చైవ నందినీ నందనేతి చ ।
ఏతాః సమానాః సద్రత్న రచితా రాధికా ప్రియాః ॥
ఏతాసాం సమరూపాణాం రత్నధాతు విచిత్రితాన్ ।
నానాప్రకార చిత్రేణ చిత్రితాన్ సుమనోహరాన్ ॥
అమూల్య రత్న కలశ సమూహైః శిఖరోజ్జ్వలాన్ ।
సద్రత్న రచితాంచ్ఛుభ్రా నాశ్రమాన్ దదృశస్తథౌ ॥
బ్రహ్మాండాద్భహిరూర్ధ్వం చ నాస్తి లోకస్తదూర్ధ్వకః ।
ఊర్ధ్వం శూన్యమయం నర్వం తదంతాసృష్టిరేవ చ ॥
రసాతలేభ్య స్సప్తభ్యో సొస్త్యధః సృష్టి రేవ చ ।
తదధశ్చ జలం ధ్వాంతమగంతవ్యమదృశ్యకం ।
బ్రహ్మాండాంతం తత్భహిశ్చ సర్వం మత్తో నిశామయ ॥
రూపముచేతను గుణము చేతను, వేషము చేతను, యావనము చేతను, సౌభాగ్యము చేతను, వయస్సు చేతను ఒకే తీరుగా నుండి నిర్వచింప సాధ్యము గాని అలంకారములు గలవారై రాధికాదేవికి చెలికత్తెలైన గోపికలు ముప్పది ముగ్గురు అక్కడే ఉండిరి. వారి పేర్లివి. సుశీల, శశికళ, యమున, మాధవి, రతి, కదంబమూల, కుంతి, జాహ్నవి, స్వయంప్రభ, చంద్రముఖి, సావిత్రీ, గాయత్రి, సుముఖీ, సుఖ, పద్మాలయ, పారిజాత, గౌరి, సర్వమంగళ, కాళిక, కమల, దుర్గ, భారతీ, సరస్వతి, గంగ, అంబిక, మధుమతి, చంప, అపర్ణ, సుందరి, కృష్ణప్రియ, సతి, నందిని, నందన, వీరందరు రాధాదేవికి మిక్కిలి ఇష్టమైన సమాన సఖులు. ఇట్టి సమాన సుందరీమణుల ఆశ్రమములు అన్నియు సద్రత్న రచితములు, శుభ్రములు, రత్నములచేత బంగారము మొదలగు ధాతువులచేత మనోహరముగా నానావిధ చిత్ర చిత్రీతములు, విమాన గోపురముల ఫై మెరయుచున్న అమూల్య రత్నకలశములు గలవి. ఆ యాశ్రమములను దేవతలు దర్శించిరి. బ్రహ్మాండమునకు బయట పైన నున్న గోలోకమునకు పైగా వేరొక లోకము లేదు. ఆ పై అంతయు శూన్యమే. సృష్టి అంతవరకే. సప్తపాతాళములకు క్రింది సృష్టిలేదు. ఆరసాతలము క్రింద నీరు చీకటియే. పోరోనీది, చూడరానిది. ఓ నారదమునీ బ్రహ్మాండము చివరి వరకు దాని బయటున్న సమస్త విషయము నావలన వినుము.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త్ మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే గోలోక వర్ణనం నామ చతుర్ధోఽధ్యాయః ॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములో శ్రీకృష్ణజన్మఖండమున నరనారాయణ సంవాదమున గోలోక వర్ణన అను నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 4 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Driven by fear and paranoia despite Vasudeva's solemn promise, the wicked King Kaṃsa seized both Vasudeva and Devakī, binding them in heavy iron chains and casting them into a dark, impenetrable prison cell guarded by fierce soldiers. Soon thereafter, Kaṃsa overthrew his pious father King Ugrasena and usurped the throne of Mathura, establishing a reign of terror and oppression across the Yādava kingdom. Within the gloomy confines of the prison cell, Vasudeva and Devakī spent their days in deep meditation upon the Supreme Lord Śrī Kṛshṇa, patiently awaiting the divine hour of liberation and the promised advent of the Savior.