శ్రీ నారాయణ ఉవాచ :
ఏకదా మందిరే నంద పత్నీ సాఽ నంద పూర్వకం ।
కృత్వా వక్షసి గోవిందం క్షుధితం చ స్తనం దదౌ ॥
ఏతస్మిన్నంతరే గోప్య ఆజగ్ముర్నంద మందిరం ।
స్థవిరాశ్చ వయస్యాశ్చ బాలికా బాలకాన్వితాః ॥
నారాయణమునీ పలికెను.
ఒకసారి నందుని భార్యయగు యశోదాదేవి ఆకలిగొన్న శ్రీకృష్ణుని ఒడిలో చేర్చుకొని ఆనందముగా పాలిచ్చుచుండెను. ఇంతలో నామే యింటికి ముదుసలులు, పడుచువారు, బాలికలు ఐన గోపికలు గోపాల బాలురు చేరవచ్చిరి.
అతృప్తం బాలకం శీఘ్రం సన్న్యస్య శయనే సతీ ।
ప్రణనామ సముత్థాయ కర్మణ్యౌత్థానికే ముదా ॥
తైల సింధూర తాంబూలం దదౌ తాభ్యో ముదాఽన్వితా ।
మిష్టవస్తూని వస్త్రాణి భూషణాని చ గోపికా ॥
వచ్చిన వారికి మర్యాదలు చేయవలెనన్న సంతోషములో ఆ సాధ్వియైన యశోద ఆకలి తీరకముందే పిల్లవానీని త్వరగా మంచము మీద పడుకో బెట్టి గోపికలకు నమస్కరించెను. వారికి తైలము, సిందూరము తాంబూలము, భూషణములు, వస్త్రములు భుజించు పదార్థములు ఇచ్చుచుండెను.
ఏతస్మిన్నంతరే కృష్ణో రురోద క్షుధితస్తదా।
ప్రేరయిత్వా స చరణం మాయేశో మాయయా విభుః ॥
వపాత చరణం తస్య ప్రవీణే శకటే మునే ।
విశ్వంభర పదాఘాతాత్తచ్చ చూర్ణం బభూవ హ ॥
బభంజ శకటం పేతుర్భగ్న కాష్మాని తత్ర వై ।
పపాత దధి దుగ్ధం చ నవనీతం ఘృతం మధు ॥
ఇంతలో ఆకలితో నున్న మాయా ప్రభువగు శ్రీకృష్ణుడు తన పాదాలు చాచి ఆడించుచు (తన్నుకొనుచు) ఏడ్చుచుండెను. అది మాయా నటనము. ఓ నారదా అట్లు తన్నుకొనుచుండగా సమీపమున నున్న బండి చక్రమున కాపాదము తాకెను. ఆ విశ్వంభరుని (విశ్వము మోయువాడు) పాదపుదెబ్బకు అది పొడిపొడియై బండి మొత్తము విరిగిపడెను. విరిగి పడిన దాని కజ్జలు తాకి పాలు పెరుగు వెన్న నెయ్యి లేని పాత్రలన్నియు పడిపోయి పదార్థమంతయు నేలపాలాయెను.
దృష్ట్వాఽశ్చర్యం గోపికాశ్చ దుద్రువుర్చాలకం భయాత్ ।
దదృశుర్భగ్న శకటమిoధనాభ్యంతరే శిశుం ॥
భగ్నభాండ సమూహం చ పతితం బహు గోరసం ।
ప్రేరయిత్వా తు కాష్టాని జగ్రాహ బాలకం భీయా ॥
మాయా రక్షిత సర్వాంగం రుదితం క్షుధీతం క్షుధా ।
స్తనం దదౌ యశోదా తం రురోద చ భృశం శుచా ॥
ఆ ఆశ్చర్యకరమైన సంఘటనను గోపికలు చూచి భయముతో బాలకుని వద్దకు పరుగెత్తి విరిగిన బండిని ఆ కట్టల నడుమ నున్న శిశువును పగిలిన కుండలను నేలపాలైన పెరుగు పాలను చూచిరి, భయముతో యశోదా దేవి కఱలను తొలగింప జేసి తన మాయచేతనే ఏ ప్రమాదము రాకుండ కాపాడబడిన కుమారుని ఎత్తుకొనెను. ఆకలితో నకనకలాడుచు ఏడ్చుచున్న ఆ శిశువుకు పాలిచ్చుచు ఆ సంఘటనకు కలతచెంది వెక్కి వెక్కి యేడ్చెను.
పప్రచ్చు ర్బాలకాన్ గోపా బభంజ శకటం కథం ।
కించిద్ధేతుం న పశ్యామః సహ సేతి కిమద్భుతం॥
ఇత్యూచుర్బాలకాస్సర్వే గోపాః శ్రుణుత మద్వచః ।
శ్రీకృష్ణస్య పదాఘాతాద్బభంజ శకటం ధృవం ॥
శ్రుత్వా తద్వచనం గోపా గోప్యశ్చ జహసుర్ముదా।
న హి జగ్ముః ప్రతీతిం చ మిథ్యేత్యూచు ర్ర్వజే ప్రజాః ॥
ఏమాశ్చర్యము ! హఠాత్తుగా బండి యెట్లు విరిగినది? అట్లు విరుగుటకు ఏమి కారణము కన్పించుట లేదే? అని గోపాలురు బాలకుల నడిగిరి. దానికి బాలకులందరు మామాట వినండి. నమ్మండి. శ్రీకృష్ణుని పాదపు దెబ్బకే బండి విరిగినది అనీ పల్కిరి. ఆ మాటలు విని గోపాలురు గోపికలు సంతసముతో నవ్వుకొనిరి. రేపల్లెలోని జనము ఆ వార్తవిని నమ్మక అసత్యమిది” అని పలికిరి.
శిశోః స్వస్త్యయనం కార్యం చక్రుర్ర్బాహ్మణ పుంగవాః ।
హస్తం దత్వా శిశోర్గాత్రే పపాఠ కవచం ద్విజః ॥
వదామి తత్తే విప్రేంద్ర కవచం సర్వరక్షణం ।
యద్దత్తం మాయయా పూర్వం బ్రహ్మణే నాభి పంకజే॥
నిద్రితే జగతీనాధే జలే చ జలశాయిని ।
భీతాయ స్తుతి కర్ర్తే చ మధు కైటభయోర్భయాత్ ॥
ఆ శిశువునకు చేయవలసిన స్వస్తి మంగళమును (స్వస్తి వాచనమును) బ్రాహ్మణ శ్రేష్టులు చేసిరి, ఒక బ్రాహ్మణుడు శిశువు శరీరమున హస్తముంచీ కవచమంత్రమును పఠించెను. ఓ నారదా! ఆ కవచము సర్వరక్షణ చేయునది. జలశాయి (జలమున పండుకొనువాడు) యైన జగన్నాథుడు మహాసముద్ర జలమున నిద్రించియున్న సమయమున అతని నాభి కమలమున జన్మించిన చతుర్ముఖ బ్రహ్మ మధుకైటభులను రాక్షసులకు భయపడి భగవంతుని ప్రార్థించుచు సతిచేయుచుండగా భీతుడగు అతనికి విష్ణు మాయాదేవి పూర్వము దేనిని ఉపదేశించినదో ఆ కవచమును నీకు చెప్పెదను వినుము.
యోగ నిద్రోవాచ :
దూరీభూతం కురు భయం భయం కిం తే హరౌ స్థితే ।
స్థితాయాం మయి చ బ్రహ్మన్ సుఖం తిష్ఠ జగత్పతే ॥
యోగనిద్ర ఇట్లు పలికెను:
సృష్టించిన జగత్తునకు నాథుడవగు ఓ బ్రహ్మ! నీ భయమును దూరము చేసికొనుము. శ్రీహరి యుండగా నీకేమి భయము, నేనుండగా నీకేల విచారము, సుఖముగా నుండుము అని అనెను.
శ్రీహరిః పాతు తే వక్రం మస్తకం మధుసూదనః ।
శ్రీ కృష్ణః చక్షుషి పాతు నాసికాం రాధికా పతీః ॥
కర్ణయుగ్మం చ కంఠం చ కపాలం పాతు మాధవః।
కపోలం పాతు గోవిందః కేశాంశ్చ కేశవః స్వయం ॥
అధరోష్ఠం హృషీకేశో దంత పంక్తిం గదాగ్రజః ।
రాసేశ్వరశ్చ రసనాం తాలుకం వామనో విభుః ॥
నీ ముఖమును శ్రీహరి కాపాడుగాక. నీ శిరస్సును మధుసూదనుడు, నీ కన్నులను శ్రీకృష్ణుడు, నీ నాసికను (ముక్కు) రాధికాపతి రక్షించుగాక, మాధవుడు నీ కర్ణములను రెంటీని, కంఠమును శిరస్సు పై భాగమును కాపాడు గాక. హృషీకేశుడు నీ క్రింది పెదవిని, గదాగ్రజుడు నీ పలువరుసను రక్షించుగాక, నీ నాలుకను రాసేశ్వరుడు దవడను సర్వవ్యాపకుడగు వామనుడు రక్షించుగాక.
వక్షః పాతు ముకుందశ్చ జఠరం పాతు దైత్యహా ।
జనార్దనః పాతు నాభిం పాతు విష్ణుశ్చ మేహనం ॥
నితంబయుగ్మం గుహ్యం చ పాతు తే పురుషోత్తమః ।
జాను యుగ్మం జానకీశః పాతు తే సర్వదా విభుః ॥
హస్త యుగ్మం నృసింహశ్చ పాతు సర్వత్ర సంకటే ।
పాదయుగ్మం వరాహశ్చ పాతు తే కమలోద్భవః॥
ముకుందుడు నీ వక్షస్థలమును దైత్యసంహారకుడు నీ గర్భమును రక్షించుగాక. నాభిని జనార్ధనుడు మేహనమును (లింగము) విష్ణువు కాపాడుగాక. పురుషోత్తముడు పిరుదులను, గుహ్యము (మర్మావయవము)ను రక్షించుగాక. అన్నీ సంకటములలో అన్ని ప్రదేశములలో నృసింహాడు నీ హస్తములను, వరాహమూర్తి నీ పాదములను కాపాడుగాక.
ఊర్ధ్వం నారాయణః పాతు హ్యధస్తాత్ కమలాపతిః ।
పూర్వస్యాం పాతు గోపాలః పాతు వహ్నౌ దశాస్యహా ॥
వనమాలీ పాతు యామ్యాం వైకుంఠః పాతు నైర్ఋతౌ ।
వారుణ్యాం వాసుదేవశ్చ సతో రక్షాకరః స్వయం ॥
పాతు తే సంతతముజో వాయవ్యం విష్టరశ్రవాః ।
ఉత్తరే చ సదా పాతు తేజసా జలజాననః ॥
ఐశాన్యామీశ్వరః పాతు పాతు సర్వత్ర శత్రుజిత్ ।
నీ ఊర్ధ్వ భాగమును నారాయణుడు క్రింది భాగమును కమలాపతి (లక్ష్మీభర్త) రక్షించుగాక. నీ తూర్పుదిశను గోపాలుడు, అగ్ని దిశను రావణాంతకుడు, వనమాలి దక్షిణ దిశను, వైకుంఠుడు నైఋతి దిశను కాపాడుగాక, సజ్జన రక్షకుడగు వాసుదేవుడు పశ్చిమ దిశను, పుట్టుకలేని విష్టరశ్రవుడు ఎల్లప్పుడు నీ వాయవ్య దిశను రక్షించుగాక. జలజాసనుడు (పద్మము పై కూర్చుండువాడు) తన తేజస్సుతో నీ ఉత్తర దిశను, ఈశ్వరుడు ఈశాన్య దిశను కాపాడుగాక, అంతట (పదివైపుల నుండి) శత్రుజేత రక్షించుగాక.
జలే స్థలే చాంతరిక్షే నిద్రాయాః పాతు రాఘవః॥
జలమందు నేలమీద ఆకాశమున నిదురలోను నిన్ను రాఘవుడు రక్షించుగాక.
ఇత్యేవం కథితం బ్రహ్మన్ కవచం పరమాద్భుతం।
కృష్ణేన కృపయా దత్తం స్మృతేనైవ పురా మయా ॥
శుంభేస సహసంగ్రామే నిర్లక్ష్యే ఘోరదారుణే ।
గగనే స్థితయా సద్యః ప్రాప్తిమాత్రేణ సో జితః ॥
కవచస్య ప్రభావేణ ధరణ్యాం పతితో మృతః ।
పూర్వం వర్షశతం ఖే చ కృత్వా యుద్ధం భయావహం॥
మృతే శుంభే చగోవిందః కృపాలుర్గగన స్థితః ।
మాలాం చ కవచం దత్వా గోలోకం స జగామ హ॥
పూర్వము నేను స్మరించినంత మాత్రమున దయతో శ్రీహరి నాకుపదేశించిన అద్భుతమైన ఫలమిచ్చునట్టి ఈ కవచమును నీకు చెప్పితిని. పూర్వము నూరేళ్ల ఆకాశమున నిలిచి భయంకరమైన యుద్ధమును నేను శుంభ రాక్షసునితో చేయవలసి వచ్చినది. గురి కన్పించని భయంకరమైన ఆ శుంభునితో సంభవించిన యుద్ధములో ఆకాశమున నిలిచిన నాకు ఈ కవచము లభించగనే దీని మహిమ వలస వాడు ఓడింపబడి చచ్చి నేలమీద పడెను. శుంభడట్లు చావగనే ఆకాశమున నిలచిన దయాళువగు గోవిందుడు కవచముతో బాటు నాకొక మాలనిచ్చి గోలోకమునకు వేంచేసెను.
కల్పాంతరస్య వృత్తాంతం కృపయా కథితం మునే ।
అభ్యంతర భయం నాస్తి కవచస్య ప్రభావతః ॥
కోటిశః కోటిశో నష్టా మయా దృష్టాశ్చ వేధనః ।
అహం చ హరిణా సార్థం కల్పే కల్పే స్థిరా సదా॥
ఇత్యుక్త్వా కవచం దత్వా సాఽoతర్ధానం చకార హ ।
నిశ్నంకో నాభి కమలే తస్థౌ స కమలోద్భవః ॥
(ఓ నారదా! కల్పాంతరమున జరిగిన యీ వృత్తాంతము దయతో నీకు చెప్పితిని} ఈ కవచ ప్రభావము వలన లోపలి భయముండదు. కోటిసంఖ్యలలో బ్రహ్మలు సృష్టికర్తలు} నేను చూచుచుండగా గడచిపోయిరి. నేను శ్రీహరితో బాటు ప్రతి కల్పమున (సృష్టి మొదలై అది గడచి ప్రళయమగు వరకుండు కాలమును కలమందురు) నేనును స్థిరముగా నుందును. అని యోగనిద్ర (మాయాదేవి} బ్రహ్మాకు చెప్పి కవచమిచ్చి (ఉపదేశించి అంతర్ధానమయ్యెను. అపుడు కమలోద్భవుడు జంకు లేకుండ స్వామీ నాభి కమలమున నిలిచియుండెను.
సువర్ణ గుటికాయాం చ కృత్వేదం కవచం పరం ।
కంఠే వా దక్షిణే బాహౌ బధ్నీయాద్యః సుధీః సదా॥
విషాగ్ని జలశత్రుభ్యో భయం తస్య న జాయతే ।
జలే స్థలే చాంతరిక్షే నిద్రాయాం రక్షతీశ్వరః॥
సంగ్రామే వజ్రపాతే చ విపత్తౌ ప్రాణ సంకటే।
కవచస్మరణాదేవ సద్యో నీశ్శంకతాం ప్రజేత్ ॥
బద్ధ్వేదం కవచం కంఠే శంకర స్త్రీపురం పురా ।
జఘాన లీలామాత్రేణ దురంతమసురేశ్వరం॥
బద్ధ్వేదం కవచం కాలీ రక్తబీజం చఖాద సా ।
సహస్ర శీర్షా ధృత్వేదం విశ్వం ధత్తే తిలం యథా ॥
ఆవాం సనత్కుమారశ్చ ధర్మః సాక్షీ చ కర్మణాం ।
కవచస్య ప్రభావేణ సర్వత్ర జయినో వయం॥
బంగారు తాయెత్తులో ఈ కవచము లిఖించిన పత్రమును బిగించి మెడలో గాని కుడి హస్తమున (మోచేచి పై భాగము) గాని విజ్ఞుడెప్పుడును కట్టుకొనవలెను. అట్టివానీకి నీరు అగ్నీ జలము శత్రువుల నుండి భయము కలుగదు. జలమందు స్థలమందు ఆకాశమందు నిద్రా దశయందును వానిని భగవంతుడు రక్షించును. యుద్ధరంగమున, పిడుగుపాటులో, ఆపదలలో, ప్రాణ' సంకట సమయములో ఈ కవచమును స్మరించినంతనే చదువుకోనగనే జంకు భయము లేనిపోడగును. ఈ కవచమును శంకరుడు కంఠమున బంధించుకొనియే పూర్వము త్రీపురములను కష్టసాధ్యులైన ఆ త్రిపురాసురులను విలాసముగా సంహరించెను. కాళికాదేవి ఈ కవచమును కట్టుకోనియే రక్తబీజ రాక్షసుని నమిలి చంపెను. వేయి తలల శేషుడును దీనిని ధరించియే ఈ విశ్వమును నువ్వుగింజను ధరించునట్లు తేలికగా ధరించును. మేమిద్దరము (నరనారాయణులు} జీవుల యొక్క కర్మలకు ధర్మకార్యములకు సాక్షిగా నుండు సనత్కుమారుడును ఈ కవచ ప్రభావము వలననే అంతట జయము పొందు వారముగా నున్నాము.
తస్య నంద శిశోః కంఠే చకార కవచం ద్విజః ।
ఆత్మనః కవచం కంఠే దధార చ స్వయం హరిః॥
ప్రభావః కథితః సర్వః కవచస్య హరేస్తథా ।
అనంతస్యాచ్యుతస్యైవ ప్రభావముతులం మునే ॥
(గోకులమందు సందునింట) బ్రాహ్మణుడు ఆ నంద శిశువు కంఠమందు కవచమును కట్టెను. శ్రీహరి స్వయముగా తన కవచమును తన కంఠమున ధరించెను. ఈ విధముగా శ్రీవారి యొక్కయు కవచము యొక్కయు మొత్తము ప్రభావమును చెప్పితిని. ఓ నారదా! అనంతుడును అచ్యుతుడుసు ఐన స్వామి యొక్క ప్రభావము సాటిలేనిది సుమా.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే శకట భంజన యోగనిద్రోక్త కవచ న్యాసో సామ ద్వాదశోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో శకట భంజనము యోగనిద్ర చెప్పిన కవచస్యానమనెడి పన్నెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 12 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Seeking astrological guidance for the divine child, Nanda Bābā invited the exalted sage Garga Muni to his home in Gokula. Conducting a private naming ceremony, Garga Muni whispered the secret truths of the child's divine identity to Nanda Bābā, revealing that this boy possessed the power of previous incarnations and would protect the universe from evil. Garga Muni formally named the elder boy Rāma due to his supreme strength and the younger dark-skinned child Kṛshṇa, warning Nanda Bābā to protect Him carefully as He would face many trials from wicked demons sent by Kaṃsa.