బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

122 - అధ్యాయము

నారద ఉవాచ :

సర్వాసాం రమణీనాంచ కృష్ణేన పరమాత్మనా

సముద్వాహశ్చకథితః త్వయా భగవతాముదా

స్యమంతకస్యచ మణే: ఉపాఖ్యానమభీప్సితం

తన్నశ్రుతం మహాభాగ! తన్మాంవ్యాఖ్యాతుమర్హసి

నారాయణ ఉవాచ :

భాద్రశుక్లచతుర్థ్యాంచ తారకాం హృతవాన్శశీ

తాంతత్యాజ సకృష్ణాయాం గురుస్తాంచ గృహీతవాన్

గురుణాభర్త్సితా తారాసగర్భాలజ్జితాసతీ

శశాపలజ్ఞయాకోపాత్ చంద్రం కామాతురం పురా

తారోవాచ :

భవశాపకలంకీత్వం యస్త్వాం పశ్యతి దేహభృత్

పాపందృష్ట్వా సపాపీచ కలంకీచ భవిష్యతి

ఇతిశ్రుత్వాస చంద్రశ్చ నారాయణ సరోవరే

నారాయణ తపస్త్వ ముమోచకృతపాతకాత్

తపఃక్లిష్టంచతం దృష్ట్వా భగవాన్ పురుషోత్తమః

తమువాచ మహాభీతం కృపయాచకృపానిధిః

శ్రీభగవానువాచ :

ముక్తోభవకలంకీత్వం సర్వకాలం కలానిధే

శాపస్థానంతారకాయా భాద్రేమాసిసితాగితే

చతుర్థ్యాముదితంచంద్రం యస్తుపశ్యతి కామతః

తంయాతితత్కలంకశ్చ సకలంకీ భవిష్యతి

హరిణాదీయతే తాలీభాద్రేమాసిసితాసితే

చతుర్థ్యాముదితశ్చంద్రో నేక్షితవ్యః కదాచన

స్వయందృష్ట్వాస్వవాక్యంచ పాలనం కర్తుమర్హతి

భాద్రేచంద్రం చతుర్ధ్యాంతు సకలంకీ బభూవహ

కలంకీయేనరూపేణ తద్వక్ష్యామి నిశామయ

సముమోచకలంకాచ్చలోక శిక్షార్థమీశ్వరః

సత్రాజితః సూర్యభక్తః తపస్తప్త్వాచ పుష్కరే

శ్యమంతకం మణిశ్రేష్ఠం సంప్రాపభాస్కరాదపి

అష్టౌభారాన్ సువర్ణానాం ప్రసూతే నిత్యమేవచ

విష్ణోర్మణా వధిష్టానం మహాపూతేచపుణ్యదే

సత్రాజితః సత్యభామాందత్వాకృష్ణాయ భక్తితః

 యౌతుకార్థేమణిందాతుముద్వతో మహతేమహాన్

తంనిషిధ్య ప్రసేనశ్చ దుర్మతిః కాలపీడితః

మణింగృహీత్వాప్రయయౌ పుణ్యాం వారాణసీంపురీం

నిహత్యతం పథి బలాత్ సింహః సబల ఏవచ

మణిం జగ్రాహ రుచిరం సూత్రబద్ధంగలే దదౌ

 కలింగరాజ పుత్రశ్చ బ్రహ్మశాపాత్సుదారుణాత్

విప్రేణాభ్యుదిత స్తేన పశుయోనింజగామసః

నారదుడిట్లా - అందరుస్త్రీలతో పరమాత్మయైన కృష్ణునకు వివాహమైనట్లు చెప్పారు. భగవంతుడైన మీరు సంతోషంతో చెప్పారు. (1) నాకు ఇష్టమైన స్యమంతకమణి కథను చెప్పండి. ఓ మహాభాగ! దానిని వినలేదు. దానిని నాకు వివరించగలరు. సమర్థులు మీరు (2) అనగా నారాయణుడిట్లా - భాద్రశుక్ల చతుర్థియందు తారకను, చంద్రుడు ఎత్తుకెళ్ళాడు. ఆమెను కృష్ణ పక్షమందు వదిలాడు. గురువు ఆమెను గ్రహించాడు. (3) గురువు భయ పెట్టగాతార, గర్భవతి, సిగ్గుతో ఆ స్త్రీ, కోపంతో లజ్జతో కామాతురుడైన చంద్రుని ఇదివరలో శపించింది. (4) తార ఇట్లా - నీవు శాపంతో కళంకితుడవు. నిన్ను చూచిన దేహధారి పాపం చూస్తాడు కనుక వాడు పాపి, కలంకి ఔతాడు. (5) అని దానిని విని చంద్రుడు నారాయణ సరోవరమందు, నారాయణుని గూర్చి తపస్సుచేసి, చేసిన పాపం నుండి ముక్తుడైనాడు. (6) తపస్సుతో క్లేశమందిన ఆతనిని చూసి భగవంతుడు పురుషోత్తముడు, కృపానిధి, కృపతో మహాభీతుడైన ఆతనితో ఇట్లన్నాడు. (7) శ్రీభగవంతుడిట్లా – ఓకళానిధి! ఎప్పటికీ కలంకియైన నీవు, పూర్తిగా ముక్తుడవుకా. తారక ఇచ్చిన శాపమునకు స్థానము భాద్రపద మాసంలోని శుక్లకృష్ణ పక్షములందు మాత్రమే (8) చతుర్థినాడు ఉదయించిన చంద్రుని కోరికతో చూసినవాడు, ఆపాపాన్ని పొందుతాడు. వాడు కలంకిఔతాడు. (9) హరి చేయెత్తి హెచ్చరిస్తున్నాడు, భాద్రపదమాసంలోని , శుక్లకృష్ణ పక్షములందు చవితినాడుదయించిన చంద్రుని చూడరాదు. ఎప్పుడూ తగదు. (10) స్వయంగా చూచిన తనవాక్యాన్ని పాలించాలి. భాద్రపద చవితి చంద్రుని చూచీ ఆతడు కలంకిఐనాడు. (11) కలంకం ఏరూపంలో వచ్చిందో చెప్తాను విను. లోకులకు తెలియజేసే కొరకు ఈశ్వరుడు తన కలంకం నుండి విడిపించుకున్నాడు. (12) సత్రాజిత్తు సూర్యభక్తుడు. పుష్కరక్షేత్రంలో తపస్సుచేసి, స్యమంతకమను శ్రేష్ఠమైన మణిని భాస్కరుని నుండి పొందాడు. (13) ప్రతిరోజు అది ఎనిమిది భారల సువర్ణాన్ని ఇస్తుంది. మహాపుణ్యమునిచ్చే, పవిత్రమైన ఆ మణియందు విష్ణువు అధిష్ఠించి ఉంటాడు. (14) సత్రాజిత్తు సత్యభామను కృష్ణునకు భక్తితో ఇచ్చి అరణంగా మణిని ఇవ్వటానికి గొప్పవాడైన కృష్ణునకిచ్చుటకు ఆ మహాత్ముడు ప్రయత్నించాడు. (15) ఆతనిని కాదని, దుర్మతియైన, ప్రసేనుడు కాలమువల్ల ప్రేరితుడై (పీడితుడై) మణిని తీసుకొని పుణ్యప్రదమైన వారాణసీ పురికి వెళ్ళాడు. (16) దారిలో బలము గల సింహము బలంతో ఆతనిని చంపి మణిని తీసుకున్నది. రుచిరమైన ఆమణిని దారంతో కట్టి మెడలో వేసుకుంది. (17) కలింగరాజు పుత్రుడు, చాలా దారుణమైన బ్రహ్మ శాపం పొంది బ్రాహ్మణునితో ఉత్సాహపరుపబడి ఆతడు పశుయోనిని పొందాడు.

మూ నిహత్యసింహం గహనే భల్లూకోజాంబవాన్ బలీ

మణింగృహీత్వాప్రయయౌ స్వపురంరత్న నిర్మితం

ఊచుఃసర్వేద్వారకాయాం మణింజగ్రాహ మాధవః

తస్యబుద్ధింన జానీమ: కేనోపాయేన, వేతిచ

ఇతిశ్రుత్వాతు భగవాన్ కలంక కృంతనాయచ

ప్రయయౌకాననం ఘోరం చౌరచి హ్నేన వర్త్మనా

మృతం ప్రసేనం దృష్ట్వాచ దుఃఖిసింహం దదర్శసః

మణిశూన్యంచ తందృష్ట్వా విషసాదచ మాధవః

సర్వంజ్ఞాత్వాచ సర్వజ్ఞో భల్లూక భవనం యయౌ

రుదంతంబాలకం తత్ర ధాత్రీక్రోడేదదర్శసః

బాలకంబోధయామాస సాధాత్రీకరుణాన్వితా

మణింగృహాణ బాలేతి తవ హ్యేష స్యమంతకః

సింహః ప్రసేనమవధీత్ సింహొజాంబవతాహతః

సుకుమారకమారోదీః తవ హ్యేషస్యమంతకః

ఇతిధాత్ర్యుక్త సుశ్లోకం యశ్చస్మృత్వాజలంపిబేత్

దైవదృష్టనష్టచంద్రదోషాదేవ ప్రముచ్యతే

కామతో యదిపశ్యంతి దాంభికా వేదనిందకాః

కలంకినోభవంత్యేవ మిత్యాహ కమలోద్భవః

కృష్ణోధాత్రీవచః శ్రుత్వామణిం జగ్రాహబాలకాత్

ధాత్రీగత్వాచ భల్లూకం కథయామాసకోపతః

జాంబవాంశ్చ సమాగత్య తుష్టావ ప్రణిపత్యసః

కన్యాంజాంబవతీంతస్మై యౌతకార్థంమణిందదౌ

ద్వారకామణిమానీయ దర్శయామాస యాదవాన్

ప్రభుశ్చ సర్వతః శుద్ధోనిష్కలంకోబభూవసః

ఏతేనకథితం వత్సమణేరాఖ్యానముత్తమం

అధ్యాయశ్రవణాదేవ నిష్కలంకో భవేన్నరః

యచ్చృతంధర్మవక్త్రేణ తదుక్తంచ యథాగమం

సుదర్లభముపాఖ్యానం కింభూయః శ్రోతుమిచ్ఛసి

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే స్యమంతకమణి హరణం నామ ద్వావింశత్యధిక శతతమోఽధ్యా యః

బలవంతుడైన జాంబవంతుడను భల్లూకము సింహమును అడవిలో చంపి మణిని తీసుకుని రత్న నిర్మితమైన తనపట్టణానికి వెళ్ళాడు. (19) ద్వారకలో అంతా మాధవుడు మణిని తీసుకున్నాడు అని అన్నారు. ఆతని బుద్ధిమనకు తెలియదు. ఏ ఉపాయంతో తీసుకున్నాడో అని. (20) అనే ఈ మాటను భగవంతుడు విని, కలంకాన్ని తొలగించుకునే కొరకు, చోరులు గుర్తించిన మార్గం గుండా ఘోరమైన అడవికి వెళ్ళాడు. (21) చచ్చిపోయిన ప్రసేనుని చూచి దుఃఖించాడు. ఆతడు ఆపై సింహాన్ని చూచాడు. మణి లేని సింహాన్ని చూచి మాధవుడు విచారించాడు. (22) అన్నీ తెలిసి ఆ సర్వజ్ఞుడు భల్లూక భవనానికి వెళ్ళాడు. ఆతడక్కడ ధాత్రియొక్క (దాది) రొమ్ముపై ఏడుస్తున్న పిల్లవాడిని చూచాడు. (23) కరుణతో ధాత్రి ఆబాలకునితో ఇట్లా అంటోంది. ఓబాల! మణిని తీసుకో, ఈ స్యమంతకమునీదే, అని (24) ప్రస సేనుణ్ణి సింహం చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమారుడ! ఏడవకు, ఈ స్యమంతకనీ.. (25) అని. ధాత్రి చెప్పిన శ్లోకాన్ని విని, స్మరించి నీరు తాగితే అనుకోకుండా, దైవవశాత్తుచూచిన నష్టచంద్ర దోషం నుండి విడువబడుతారు. (26) కావాలని చూస్తే, దాంభికులైన వారు వేదనిందకులు, కలంకితులౌతారు. ఇట్లాగే అని కమలోద్భవుడు చెప్పాడు. (27) కృష్ణుడు ధాత్రిమాటను విని బాలకుని నుండి మణిని తీసుకున్నాడు. ధాత్రి వెళ్ళికోపంతో భల్లూకానికి చెప్పింది. (28) జాంబవంతుడు వచ్చి ఆతడు నమస్కరించి, స్తుతించాడు. జాంబవతి యను కన్యను ఆతనికిచ్చి అరణంగా మణిని ఇచ్చాడు. (29) ద్వారకకు మణిని తెచ్చి యాదవులకు చూపాడు కృష్ణుడు. ప్రభువు అన్ని విధాల శుద్దుడు. అతడు నిష్కలంకుడైనాడు. (30) మణి యొక్క ఉత్తమమైన కథను, ఓవత్స! దీనిని నీకు చెప్పాను. అధ్యాయము విన్న మాత్రాన నరుడు నిష్కలంకుడౌతాడు. (31) ధర్మాత్ముని ముఖం నుండి విన్నది, జరిగింది జరిగినట్లుగా చెప్పినట్లు. చాలా దుర్లభమైన ఉపాఖ్యానాన్ని ఇంకా దేన్ని మళ్ళీ వినదలిచావు. (32) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు స్యమంతకమణి హరణమనునది నూట ఇరవై రెండవ అధ్యాయము.