బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

116 - అధ్యాయము

బాణ ఉవాచ:

అనిరుద్ధ! బుధో2సిత్వం త్వయోక్తం సత్యమేవచ

శంభునా చైవముక్తంచ సర్వంబుద్ధం స్వచేతసా

త్వయోక్తం శంకరవరాత్ పంచానాం స్వామినాం ప్రియా

ద్రౌపదీచ మహాభాగ! తన్మే వ్యాఖ్యాతుమర్హసి

శంబరేణహృతా పూర్వం తవమాతా కథం రతిః

దేవై రపి కథందత్తా దేవాసేన జితాకథం

అనిరుద్ధ ఉవాచ :

ఏకతా రఘనాథశ్చ సీతయలక్ష్మణేనచ

స్నాతః సరసితత్రస్టోరమ్యే పంచవటీతటే

ఉవాససీతా హేమంతే జలంసుస్వాదు నిర్మలం

తథాలన్నంవ్యంజనం రమ్యం సర్వం వస్తుసుశీతలం

ఫలావచయనం చక్రే సీతాయై ప్రదదౌముదా

తతోదదౌ లక్ష్మణాయ పశ్చాదుంకేస్వయం ప్రభుః

లక్ష్మణస్తధృహీత్వాచనైవ భుంక్తే ఫలంజలం

మేఘనాథ వధార్థంచ సీతోద్ధారణ కారణాత్

నిద్రాంనయాతినోభుంక్తే వర్షాణాంచ చతుర్ధశ

య ఏవంపురుషోయోగీతద్వధ్యో రావణాత్మజః

ఏతస్మిన్నంతరే రామం ద్రష్టుం కమలలోచనం

వహ్నిస్తత్ర సమాయాతో ద్విజరూపీ కృపానిధి

భవిష్యత్కథయామాస శ్రుతికౌటపరం వచః

వహ్నిరువాచ : 

విధాత్రాలిఖితం కర్మప్రాక్తనంకేనవార్యతే

శృణురామమహాభాగసీతాసంగోపనం కురు

సప్తాహాభ్యాంతరేచైవ రావణోదుష్టరాక్షసః

దుర్నివార్య ప్రాక్తనేన జానకీంచహరిష్యతి

దేవైఃచతుర్భిః కథితం నచదైవాత్సరం వరం

శ్రీరామ ఉవాచ :

సీతాంగృహీత్వాత్వం గచ్ఛఛాయాత్రైవతుతిష్ఠతు

కలత్రవర్ణనం కర్మ సర్వేషాంచ జుగుప్సితం

సీతాంగృహీత్వా ప్రయయా రుదంతీంచ హుతాశనః

సీతయాసదృశీఛాయా యా తస్ధారామసన్నిదౌ

సాచఛాయా హృతం పూర్వం రావణే నావలీలయా

సముద్ధధార తాంరామో నిహత్యతంస బాంధవం

వహ్నౌపరీక్షా కాలేచ ఛాయావహ్నౌ వివేశయా

అగ్నిశ్ఛాయాంచ సంరక్ష్య దదౌరామాయజానకీం

రామస్తోంచగృహీత్వాచ ప్రయహౌస్వాశ్రమంముదా

ఛాయాతస్థావహ్నిపార్శ్వే హృదయేన విదూయతా

సాచఛాయా తపశ్చక్రే నారాయణ సరోవరే

 తపశ్చకారదివ్యంచ శతవరంచ శూలినః

బాణుడిట్లా - అనిరుద్ద! నీవు తెలివి కలవాడివి. నీవు చెప్పింది సత్యమే. శంభువు కూడా ఇట్లాగే చెప్పాడు. నామనస్సుతో అంతా తెలుసుకున్నాను. (1) నీవు చెప్పావే, శంకరుని వరం వల్ల, ఐదుగురు స్వాములకు ప్రియ, మహాభాగ! ద్రౌపది అని దానిని నాకు వివరించాలి. (2) ఇదివరలో నీతల్లి రతి, శంబరుని చేత ఎట్లా తీసుకుపోబడింది. దేవతలు ఎట్లా ఇచ్చారు. వాడు దేవతలను ఎట్లా జయించాడు (3) అనిరుద్ధుడిట్లా - ఒకసారి రఘునాధుడు, సీత, లక్ష్మణులతో కలసి, రమ్యమైన పంచవటీ తటమందు ఉంటూ సరస్సులో స్నానం చేశాడు. (4) సీత పంచవటి తటమందు ఉంది. హేమంత ఋతువుయందు నీరు రుచికరంగా, నిర్మలంగా ఉంది. అన్నము, కూరలు, రమ్యమైన అన్ని వస్తువులు చాలా చల్లగా ఉన్నాయి. (5) రాముడు పండును తెంపి ఆనందంగా సీతకిచ్చాడు. ఆపై లక్ష్మణునకిచ్చాడు. ఆ తరువాత ప్రభువు తాను . తింటాడు. (6) లక్ష్మణుడు దాన్ని తీసుకుని ఆ పండును తినలేదు, నీరుత్రాగలేదు. మేఘనాథుని చంపేకొరకు, సీతను ఉద్ధరించేకొరకు (7) నిద్రపోడు, తినడు, ఇట్లా పదునాలు సంవత్సరాల దాకా. ఇట్టి పురుషుడు, యోగి ఐన వానిచేతిలో రావణుని కొడుకు చస్తాడు. (8) ఇంతలో, కమలలోచనుడైన రాముని చూడటానికి, వహ్ని అక్కడికి వచ్చాడు. కృపానిధికి, బ్రాహ్మణుడుగా వచ్చాడు. శ్రుతికటువైన మాటను, భవిష్యత్తును చెప్పసాగాడు. (9) వహ్ని ఇట్లా - ఓరామ! మహాభాగ! సీతను దాచి పెట్టు. (10) ఏడు రోజులలోపల దుష్టరాక్షసుడు, రావణుడు, నివారింప శక్యముకానివాడు, ప్రాక్తన కర్మననుసరించి జానకిని తీసుకుపోతాడు. (11). ఇది బ్రహ్మవ్రాసినమ్రత. ప్రాక్తనమైన దానిని ఎవడూ తప్పిచలేడు. నలుగురు దేవతలు చెప్పారు. దైవముకన్న పరమైనది, శ్రేష్టమైనది లేదు. (12) శ్రీరాముడిట్లా - సీతను తీసుకుని వెళ్ళు. ఛాయ (నీడ) ఇక్కడే ఉండని. భార్యను విచి పెట్టటమనే కర్మ అందరికి జుగుప్స కల్గించేదే. (13) ఏడుస్తున్న సీతను తీసుకొని అగ్ని వెళ్ళాడు. రాముని సన్నిధిలో సీతతో సమానమైన నీడ ఉంది. (14) ఆ నీడను ఇదివరలో రావణుడు అవలీలగా తీసుకెళ్ళాడు. బంధువులతో గూడా వానిని చంపి, రాముడు ఆమెను ఉద్దరించాడు. (15) వహ్నిలో పరీక్షాకాలమందు, ఆ ఛాయవహ్నిలో ప్రవేశించింది. అగ్ని ఛాయను కూడా రక్షించి, రామునకు జానకిని ఇచ్చాడు. (16) రాముడు ఆమెను స్వీకరించి తన ఆశ్రమానికి ఆనందంగా వచ్చాడు. ఛాయ హృదయంలో బాధపడుతూ వహ్ని పక్కన ఉన్నది. (17) నారాయణ సరోవర మందు తపస్సుచేసింది. దేవతల వేయి సంవత్సరాల కాలము శివుని గూర్చి ఆమె తపస్సు చేసింది. (18)

మూ వరం వృణుష్వభధ్రత్వమువాచ శంకరశ్చతాం

ఉవాచసాశివంవ్యగ్రాభక్తుర్ దుఃఖేనదుఃఖితా

పతిందేహి పంచధా సావరం వవ్రేత్రిలోచనం

సర్వసంపత్ర్పదస్తుష్టః తస్యైశర్వోవరందదౌ

శ్రీమహాదేవ ఉవాచ :

సాధ్విత్వం పంచధాబ్రూహిపతిందేహ్తి వ్యాకులా

 పంచేంద్రాశ్చ హర్రంశాభవిష్యంతి ప్రియాస్తవ

తేచసర్వేచ పంచేంద్రాశ్చాధునా పంచపాండవాః

సాచ ఛాయాద్రౌపదీచ యజ్ఞకుండ సముద్భవా

కృతయుగే వేదవతీ త్రేతాయాంజనకాత్మజా !

ద్వాపరే ద్రౌపదీ ఛాయాతేనకృష్ణా త్రిపోయణీ

వైష్ణవీ కృష్ణభక్తాచ తేన కృష్ణా ప్రకీర్తితా

స్వర్గలక్ష్మీః మహేంద్రాణాంసాచ పశ్చాద్భవిష్యతి

 రాజాదదౌ ఫాల్గునాయకన్యాయాశ్చ స్వయంవరే

పప్రచ్ఛమాతరం వీరోవస్తుప్రాప్తం మయాడువా

తమువాచస్వయం మాతాగృహాణ భ్రాతృభిఃసహ

శంభోర్వరేణ పూర్వంచ పరత్రమాతురాజ్ఞయా

ద్రౌపద్యాః స్వామినస్తేన హేతునా పంచపాండవాః

చతుర్ధశానామిద్రాణాం పంచేంద్రాః పంచపాండవాః

శంకరేణాభిసంశప్తా సామాత్రాభరితేనచ

భర్తతే భస్మసాద్భూతో హరకోపానలేనచ

హరేతిత్వం మయాశస్తాదైత్యగ్రస్తా భవాధునా

విజిత్య దేవాన్ సేంద్రాంశ్చ శంబరస్త్వాం హరిష్యతి

పునరుక్తం వరం ప్రాదాత్ సతీత్వంతేనయాస్యతి

ఛాయాందత్వాతిష్ఠ గే హేయావజ్జీవతితే పతిః

ఇతివేకథితం సర్వం ఇతిహాసంపురాతనం

దేవానాంగుప్తచరితం శృణుదైత్యేంద్ర సాంప్రతం

ఏతస్మిన్నంతరేతత్ర సుభద్రశ్చ మహాబలః

కుభాండభ్రతాబలవాన్ బాణ సేనాపతీశ్వరః

నిర్భరబాణం సమరేశస్త్ర పాణిర్మహారథః

 శ్రీకృష్ణపౌత్రంశూలంచచిక్షేప ప్రలయాగ్నివత్

అర్ధచంద్రోణతచ్ఛూలం చిచ్ఛేద కామపుత్రకః

శక్తించిక్షేప భద్రశ్చ శతసూర్యసమప్రభాం

వైష్ణవాస్రణ చిచ్ఛేదతాంశక్తిం కామపుత్రకః

నారాయణాస్త్రం చిక్షేపసుభద్రోరణమూర్ధని

ప్రణమ్యశేతేనిర్భీతో మదనస్యసుతోబలీ

ఊర్ధ్వమస్త్రంచబభ్రామ శతసూర్య సమప్రభం

ఓ భద్ర! నీవు వరమును కోరుకో, అని శంకరుడు ఆమెతో అన్నాడు. ఆమె శంకరునితో భర్త దుఃఖంతో దుఃఖితురాలై వ్యగ్రురాలై ఇట్లా అంది. (19) భర్తను ఇవ్వు అని ఐదుసార్లు ఆమె శివుని వరాన్ని కోరింది. అన్ని సంపదలనిచ్చేవాడు సంతోషించి ఆ శివుడు ఆమెకు వరమిచ్చాడు. (20) శ్రీమహాదేవుడిట్లా - నీవు వ్యాకులురాలవై ఓసాధ్వి! భర్తను ఇవ్వు అని ఐదుమార్లన్నావు. ఐదుగురు ఇంద్రులు, హరి అంశలు నీకు ప్రియులౌతారు. (21) వారంతా ఆ ఐదుగురింద్రులు ఇప్పుడు పంచపాండవులు. ఆఛాయ ద్రౌపది, యజ్ఞ కుండంలో పుట్టినది. (22) కృతయుగంలో వేదవతి, త్రేతాయుగమందు జనకుని కూతురు. ద్వాపరంలో ద్రౌపది ఆఛాయ. అందువల్ల కృష్ణ (స్త్రీ) మూడుకాలాల్లో ఉన్నది. (23) వైష్ణవి, కృష్ణభక్తురాలు అందువల్ల ద్రౌపది 'కృష్ణా' అని పిలువబడుతోంది. మహేంద్రులకు స్వర్గలక్ష్మి. ఆమె తరువాత జన్మిస్తుంది. (24) స్వయంవరంలో రాజుకన్యను ఫాల్గుణునకు ఇచ్చాడు. ఆవీరుడు, తల్లితో నేను ఇప్పుడు ఒక వస్తువును పొందాను. ఏం చేయాలని అడిగాడు. (25) అతనితో తల్లి స్వయంగా భ్రాతలతో కలిసి తీసుకో అని అన్నది. ఇదివరలో శంభుని వరముతో తరువాత తల్లి ఆజ్ఞతో ఇట్లా ఐంది. (26) అందువలన పంచపాండవులు ద్రౌపదికి యజమానులయ్యారు. పదునాలుగురింద్రులలో ఐదుగురింద్రులు పంచపాండవులు. (27) ఆతల్లి, భయ పెడుతూ, శంకరునితో శపింపబడింది. శివుని కోపాగ్నితో నీ భర్త భస్మమైనాడు. (28) హర అని నేను నిన్ను శపించాను. అందువలన ఇప్పుడు రాక్షసునితో తీసుకపోబడతావు (హరణం). దేవతలను, ఇంద్రుని జయించి శంబరుడు నిన్ను తీసుకుపోతాడు. (29) మళ్ళీ అడుగగా చెప్పాడు ఇట్లా చేస్తే నీగతీత్వము వస్తుంది అని వరమిచ్చాడు. నీఛాయను రాక్షసునకిచ్చి నీవు ఆ ఇంట్లో ఉండు, నీభర్త బ్రతికేవరకు అని అన్నాడు. (30) అని నీకు పురాతనమైన ఇతిహాసాన్నంతా చెప్పాను. ఓదైత్యేంద్ర! ఇప్పుడు దేవతల గుప్త చరితమును విను. (31) ఇంతలో మహాబలుడైన వసుభద్రుడు వచ్చాడు. వాడు కుభాండునిభ్రత, బలవంతుడు, బాణుని సేనాధిపతి, సమర్థుడు. (32) బాణుని యుద్దమందు అదిరించి శస్త్రము చేత ధరించి మహారథుడు శ్రీకృష్ణుని పౌత్రుని పై ప్రళయానగ్ని వంటి శూలమును వేశాడు. (33) కాముని పుత్రుడు, అర్ధచంద్రాకార బాణంతో ఆ శూలమును ఛేదించాడు. భద్రుడు నూరుగురు సూర్యులతో సమానమైన కాంతిగల శక్తిని వేశాడు. (34) కాముని పుత్రుడు దాన్ని వైష్ణవాస్త్రంతో ఛేదించాడు. సుభద్రుడు యుద్ధరంగంలో నారాయణాస్త్రాన్ని వేశాడు. (35) బలవంతుడైన మదనుని పుత్రుడు భయం లేకుండా నమస్కరించి నిద్రించాడు. నూరుగురు సూర్యుల సమానకాంతిగల ఆ అస్త్రము, పైన తిరుగసాగింది. (36)

మూII ప్రలీనమస్త్రమాకాశే విశ్వసంహారకారణం

అస్తేగతేస్కోనిరుదో గృహీత్వాచ మహానసిం

ప్రబభంజ భద్రరథం జఘనాశ్వాంశ్చ సారథిం

జఘాన తం సుభద్రంచలీలయారణ మూర్ధని

హతేసుభద్రేబాణశ్చ మహాబలపరాక్రమః

బాణానాం శతకంచాపి చిక్షేపరణ మూర్ధని

కామాత్మజ్యోగ్ని బాణేన బాణోఘం ప్రదదాహసః

బాణశ్చిక్షేపబ్రహ్మాస్త్రం సృష్టి సంహారకారణం

దృష్ట్వాకామాత్మజః శీఘ్రం సబీజం మంత్రపూర్వకం

బ్రహ్మాస్తీజైవ సహసాసంజహారావలీలయా

 బాణః పాశుపతంక్షేపం సమారేభేచ కోపతః

నిషిద్దశ్చ గణేశేన స్కందేన శంభునాతదా

తద్దృష్ట్వాస్కోని రుద్ధస్తం ధనుర్బాణాఘ సంయుతం

ముమోచ జృంభణం యుద్ధే శీఘంతంచ మహారథం

 జడోబభూవబాణశ్చ నిశ్చేష్ణోరణ మూర్ధని

పునశ్చిక్షేపనిద్రాస్త్రం నిద్రితంతం చకారసః

బాణంతంనిద్రితం దృష్ట్వా గృహీత్వా ఖడ్గముత్తమం

బాణం హంతుంసముద్యంతం వారయామాసకార్తికః

 స్కందశ్చ శతబాణేశ్చ వారయామాసలీలయా

అనిరుద్ధం మహాభాగం బలవంతం ధనుర్ధరం II

అనిరుద్ధశ్చ సహసాతయాశక్త్యాదురన్యయా

బభంజ కార్తికరథం రత్నేంద్రసారనిర్మితం

గదయాకార్తికం కృగ్గోప్య నిరుద్ధరథం ముదా

బభంజలీలయాతత్రక్షణేన రణ మూర్ధని II

అనిరుదోఆర్ధచంద్రేణ క్షురధారేణలీలయా

చిచ్ఛేదకార్తిక ధనుఃభల్లాస్త్రేణ నియోజితం

జఘనకార్తికస్తంచ గదయాచ దురంతయా

గదాంజగ్రాహతద్ధస్తావ్ జవేన మదనాత్మజః

శూలంగృహీత్వాస్కందంచతమేవ హంతుముద్యతం

అనిరుద్ధశ్చ కోపేన పేరయామాసదూరతః

కార్తిక పునరాగత్య గృహీత్వాకామపుత్రకం

గృహీత్వాచ కరేశైవ పాతయామాసభూతలే

అనిరుదోగృహీత్వాసిం సముత్తసౌమహాబలః !

తయోర్విరోధం దూరంచ ప్రచకారగణేశ్వరః

కార్తికః ప్రయగేహం ఉమాగేహం స్మరాత్మజః

సర్వంనివేదితుం శంభుం ప్రయయౌస గణేశ్వరః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే బాణయుద్దే షోడశాధిక శతతమోఽధ్యాయః

అను!! విశ్వసంహారమునకు కారణమైన అస్త్రము ఆకాశంలో లీనమయ్యాక, అస్త్రం పోయాక ఆ అనిరుద్దుడు పెద్దకత్తిని తీసుకొని (37) భద్రుని రధాన్ని భంజించాడు. అశ్వములను సారథిని చంపాడు. అవలీలగా యుద్దరంగంలో ఆసుభద్రుని కూడా చంపాడు. (38) సుభద్రుడు చనిపోయాక, మహాబలపరాక్రమము గల బాణుడు యుద్ధరంగంలో నూరు బాణములను వేశాడు. (39) కాముని కొడుకు అగ్ని బాణంతో ఆతడు బాణముల సమూహాన్ని కాల్చాడు. సృష్టి సంహార కారణమైన బ్రహ్మాస్త్రమును బాణుడు వేశాడు. (40) కాముని కొడుకు, చూచి త్వరగా, బీజాక్షరములతో సహమంత్రపూర్వకముగా బ్రహ్మాస్త్ర ముతోనే దానిని త్వరగా అవలీలగా సంహరించాడు. (41) బాణుడు కోపంతో పాశుపతాస్త్రాన్ని వేయటానికి ఆరంభించాడు శివుడు, స్కందుడు, గణేశుడు ఆతనిని వారించారు. (42) ఆ అనిరద్దుడు దానిని చూచి ధనుర్బాణముల సమూహంతో గల బాణుని చూచి త్వరగా జృంభకాస్త్రాన్ని యుద్ధంలో బాణుని పై ఆతని సారథి పైన వదిలాడు. (43) బాణుడు యుద్ధరంగంలో నిశ్చేష్టుడు జడుడుఐనాడు. తిరిగి నిద్రాస్త్రాన్ని వదిలాడు. ఆబాణుని ఆతడు నిద్రపోయేట్టు చేశాడు. (44) నిద్రిస్తున్న ఆ బాణుని చూచి ఉత్తమమైన ఖడ్గాన్ని తీసుకొని బాణుని చంపటానికి సిద్దమైన అనిరుద్ధుని కార్తికుడు, నివారించాడు. (45) స్కందుడు, నూరు బాణములతో అవలీలగా వారించాడు. మహాభాగుడైన, బలవంతుడైన, ధనుస్సు ధరించిన అనిరుదుని వారించాడు. (46) తప్పించుకో వీలులేని శక్తితో త్వరగా అనిరుద్ధుడు, శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మింపబడ్డ కార్తికుని రథాన్ని విరుగగొట్టాడు. (47) కార్తికుడు క్రుద్ధుడై గదతో, ఆనందంతో, అవలీలగా యుద్ధంలో క్షణంలో అనిరుద్ధుని రథాన్ని విరుగగొట్టాడు. (48) అనిరుద్ధుడు అర్ధచంద్రాకారంగల, కత్తి అంచుతో అవలీలగా, భల్లా స్త్రముతో కూర్చబడిన కార్తికుని ధనుస్సును ఛేదించాడు. (49) కార్తికుడు దానిని, అంతములేని గదతో కొట్టాడు. మదనుని కొడుకు వేగంగా ఆతని చేతినుండి గదను తీసుకున్నాడు. (50) - శూలాన్ని తీసుకొని తనను చంపటానికి వస్తున్న స్కందుని, - దూరంనుండే కోపంతో అనిరుద్ధుడు ప్రేరేపించసాగాడు. (51) కార్తికుడు తిరిగి వచ్చి కామపుత్రుని పట్టుకొని చేతితో పట్టుకొని భూమిపై పడవేయసాగాడు. (52) మహాబలుడు అనిరుద్ధుడు కత్తితీసుకొని లేచాడు. వారి విరోధాన్ని గణేశుడు దూరం చేశాడు. (53) కార్తికుడు ఇంటికివెళ్ళాడు. మన్మథుని కొడుకు పార్వతి ఇంటికి వెళ్లాడు. అంతా చెప్పటానికి గణేశ్వరుడు శంభుని ఇంటికి వెళ్ళాడు. (54)

 అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు బాణుని యుద్దమందు నూటపదహారవ అధ్యాయము.