మూll శ్రీనారాయణ ఉవాచ :
శ్రీకృష్ణో భగవాంస్తత్ర పరిపూర్ణతమః ప్రభుః ।
దృష్ట్వాసాలోక్య మోక్షంచ సద్యోగోకులవాసినాం ॥
ఉవాస పంచభిర్గో పైః భాండీరే వటమూలకే ।
దదర్శగోకులం సర్వం గోకులం వ్యాకులం తథా ॥
అరక్షకంచ వ్యస్తంచ శూన్యం బృందావనం వనం ।
యోగినామృత వృష్ట్యాచ కృపయాచ కృపానిధిః ॥
గోపీభిశ్చతథా గో పైః పరిపూర్ణంచకారసః ।
తథా బృందావనంచైవ సరమ్యంచ మనోహరం ॥
గోకులస్థాంశ్చ గోపాంశ్చ సమాశ్వాసం చ కారసః ।
ఉవాచ మధురం వాక్యం హితం నీతంచ దుర్లభం ॥
శ్రీభగవానువాచ :
హేగోపగణ బంధో సుఖం తిష్టన్ స్థిరోభవ ।
రమణం ప్రియయా సార్థం సురమ్యం రాసమండలం ॥
తావత్ర్పభృతికృష్ణస్య పుణ్యే బృందావనే వనే।
అధిష్టానంచ సతతంయావచ్చంద్ర దివాకరౌ ॥
తథాజగామభాండీరం విధాతా జగతామపి ।
స్వయంశేషశ్చ ధర్మశ్చ భవాన్యాచ భవః స్వయం ॥
సూర్యశ్చాపి మహేంద్రశ్చ చంద్రశ్చాపి హుతాశనః ।
కుబేరో వరుణశ్చైవ పవనశ్చయమ స్తథా ॥
ఈశానశ్చాపిదేవాశ్చ వసవోఽష్టౌతథైవచ ।
సర్వేగ్రహాశ్చ రుద్రాశ్చమునయో మనవస్తథా ॥
త్వరితాశ్చాయయుస్సర్వే యత్రాస్తే భగవాన్ప్రభుః ।
ప్రణమ్య దండవద్భూమౌతమువాచ విధిః స్వయం ॥
బ్రహ్మోవాచ :
పరిపూర్ణతమ బ్రహ్మ స్వరూప నిత్య విగ్రహ ।
జ్యోతిః స్వరూప పరమ నమోఽస్తు ప్రకృతేః పర ॥
అను ॥ శ్రీనారాయణుడిట్లా –
శ్రీకృష్ణుడక్కడ భగవంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు. ఆతనిని చూస్తే గోకులవాసులకు వెంటనే సాలోక్య మోక్షము వస్తుంది. (1) ఐదుగురు గోపాలురతో భాండీర మందు వటమూలమందున్నాడు. గోకులాన్నంతా చూచాడు. గోకులం, గోకులమంతా వ్యాకులంగా ఉంది. (2) రక్షకుడు లేక విడిగా బృందావన వనము శూన్యంగా ఉంది. యోగంతో అమృతవర్షంతో, కృపతో, కృపానిధి (3) గోపికలతో, గోపాలురతో దానిని పరిపూర్ణం చేశాడు, ఆతడు. ఆట్లాగే బృందావనాన్ని చాలా రమ్యంగా, మనోహరంగా చేశాడు. (4) గోకులమందున్న వారిని గోపాలురను ఆతడు ఓదార్చాడు. దుర్లభమైన హితమైన నీతిగల వాక్యమును మధురంగా చెప్పాడు. (5) శ్రీభగవానుడిట్లా - ఓ గోప సమూహమ! ఓ మంధువులార! సుఖంగా ఉండి, స్థిరులు కండి ప్రియలతో రమణము (చేయండి) రాసమండలము చాలా రమ్యమైనది. (6) సూర్యచంద్రులున్నంత వరకు కృష్ణుడు పుణ్యమైన, బృందావన వనమందుంటాడు. ఎప్పుడూను, (7) జగత్తులకు విధాతయైన కృష్ణుడు భాండీరమునకు వెళ్ళాడు. తాను శేషుడు, ధర్ముడు, భవానితో భవుడు వెళ్ళారు. (8) సూర్యుడు, మహేంద్రుడు, చంద్రుడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు, పవనుడు, యముడు వెళ్ళారు. (9) ఈశానుడు, దేవతలు, ఎనిమిది మంది వసువులు అన్ని గ్రహములు, రుద్రులు, మునులు, మనువులు వెళ్ళారు. (10) భగవాన్ ప్రభువు ఉన్నచోటికి అందరు వేగంగా వచ్చారు. దండమువలె భూమియందు పరుండి నమస్కరించి స్వయంగా విధి ఆతనితో అన్నాడు. (11) బ్రహ్మ ఇట్లా - పరిపూర్ణతమ, బ్రహ్మస్వరూప, శాశ్వతమైన విగ్రహం కలవాడ, జ్యోతిః స్వరూప, పరమ, ప్రకృతికి పరుడ, నీకు నమస్కారము.
మూ॥ సునిర్లిప్త నిరాకార సాకార ధ్యాన హేతునా ।
స్వేచ్చామయ పరంధామ పరమాత్మన్నమోస్తుతే ॥
సర్వకార్య స్వరూ పేశ కారణానాంచ కారణ ।
బ్రహ్మేశశేష దేవేశ సర్వేశ తే నమోనమః ॥
సరస్వతీశ పద్మేశ పార్వతీశపరాత్పర ।
హే సావిత్రీశ రాధేశ రాసేశ్వర నమోస్తుతే ॥
సర్వేషామాది భూతస్త్వం సర్వః సర్వేశ్వరస్తథా ।
సర్వ పాతాచ సంహర్తా సృష్టి రూపనమోస్తుతే ॥
త్వత్పాదపద్మ రజసాధన్యా పూతా వసుంధరా ।
శూన్యరూపా త్వయిగతే హేనాధ పరమం పదం ॥
యత్పంచవింశత్యధికం వర్షాణాం శతకం గతం ।
త్యక్త్వేమాంసంపదంయాసి రుదంతీం విరహాతురాం ॥
శ్రీమహాదేవ ఉవాచ :
బ్రహ్మణా ప్రార్థితస్త్వంచ సమాగత్య వసుంధరాం ।
భూభారహరణం కృత్వాప్రయాసి స్వపదం విభో ॥
త్రైలోకే పృథివీధన్యా సద్యః పూతా పదాంకితా।
వయంచ మునయోధన్యాః సాక్షా ద్దృష్ట్వా పదాంబుజం ॥
ధ్యానాసాధ్యోదురారాధ్యో మునీనామూర్థ్వరేతసాం ।
అస్మాకమనఘశ్చేషః సోఽధునా చాక్షుషోభువి ॥
వాసుః సర్వనివాసశ్చ విశ్వాని యస్య లోమసు ।
దేవస్తస్య మహావిష్ణుః వాసుదేవోమహీతలే ॥
సుచిరంతపసాలబ్దం సిద్దేంద్రాణాం సుదుర్లభం ।
యత్పాదపద్మమతులంచాక్షుషం సర్వజీవినాం ॥
అనంత ఉవాచ :
త్వమనంతోహి భగవాన్నాహమేవకలాంశకః ।
శ్వైకస్థేక్షుద్రకూర్మే మశకోఽహంగజే యథా ॥
అసంఖ్యశేషా: కూర్మాశ్చ బ్రహ్మ విష్ణు శివాత్మకాః ।
అసంఖ్యానిచ విశ్వాని తేషామీశః స్వయం భవాన్ ॥
అస్మాకమీదృశం నాథ సుదినం క్వభవిష్యతి ।
స్వప్నాదృష్టశ్చయశ్చేశః సదృష్టః సర్వజీవినాం ॥
నాథప్రయాసి గోలోకం పూతాకృత్వా వసుంధరాం ।
తామనాధం రుదంతీంచ నిమగ్నాంశోకసాగరే ॥
దేవాఊచుః
వేదాస్తోతుంనశక్తా యం బ్రహ్మేశానాదయస్తథా ।
తమేవస్తవనంకింవావయం కుర్మోనమోఽస్తుతే ॥
ఇత్యేవముక్త్వా దేవాస్తే ప్రయయుర్ద్వారకాంపురీం ।
తత్రస్థంభగవంతంచ ద్రష్టుం శీఘ్రం ముదాన్వితాః ॥
అథతేషాంచ గోపాలాయయుర్గోలోకముత్తమం ।
పృథివీకంపితాభీతాచలంతః సప్తసాగరాః ॥
హతశ్రియం ద్వారకాంచ త్యక్త్వాచ బ్రహ్మశాపతః ।
మూర్తింకదంబ మూలస్థాం వివేశరాధికేశ్వరః ॥
తేసర్వేచైరకాయుద్ధేని పేతుర్యాదవాస్తథా ।
చింతామారుహ్య దేవ్యశ్చ ప్రయయౌస్వామిభిః సహ ॥ అర్జునఃస్వపురంగత్వాతమువాచయుధిష్ఠిరం ।
సరాజాభ్రాతృభిః సార్థం యయౌస్వర్గంచ భార్యయా ॥
దృష్ట్వా కదంబమూలస్యతిష్టంతం పరమేశ్వరం ।
దేవాబ్రహ్మాదయ స్తేచ ప్రణేముర్భక్తి పూర్వకం ॥
చాలా నిర్లిప్తుడ, నిరాకారుడ, ధ్యానంకారణంగా సాకారమైనవాడ! స్వేచ్చామయ, పరంధామ, పరమాత్మ నీకు నమస్కారము. (13) సర్వకార్యముల స్వరూపమునకు, ఈశుడ, కారణములకు కారణుడ, బ్రహ్మేశ,శేష, దేవేశ, సర్వేశ నీకు నమస్కారము. (14) సరస్వతీశ. పద్మేశ, పార్వతీశ, పరాత్పర, ఓసావిత్రీశ, రాధేశ, రాసేశ్వర, నీకు నమస్కారము. (15) అందరికి నీవు ఆదియైన వాడవు. సర్వము. సర్వేశ్వరుడవు, అందరిని రక్షించేవాడవు, సంహరించేవాడవు, సృష్టిరూపుడవు, నీకు నమస్కారము. (16) నీపాద పద్మముల ధూళితో ఈ భూమి ధన్యమైనది, పవిత్రమైనది ఓనాథ! నీవు పరమపదమునకు పోతే ఇది శూన్యరూపము. (17) ఇరువది ఐదు నూర్ల సంవత్సరాల కన్న ఎక్కువైన కాలం గడిచాక ఏడుస్తున్న విరహాతురురాలైన ఈమెను వదిలి నీస్థానానికి వెళ్తున్నావు. (18) మహాదేవుడిట్లా - బ్రహ్మ ప్రార్థించగా నీవు భూమి పైకి వచ్చి, భూమికి భారాన్ని లేకుండా చేసి నీస్థానానికి పోతున్నావు, ఓవిభు, (19) ముల్లోకములలో ఈభూమి ధన్యురాలు. నీపాద చిహ్నములతో వెంటనే పవిత్రురాలైంది. మేము మునులమునీ పదాంబుజములను సాక్షాత్తుగా చూచి ధన్యులమైనాము. (20) ఊర్థ్వరేతసులైనమునుల ధ్యానమునకు అసాధ్యుడవు. దురారాధ్యుడవు, మాకు ఈశుడవు. పాపరహితుడవు అట్టి నీవు ఇప్పుడు భూమి పై కళ్లెదుట ఉన్నావు. (21) వాసువువు, అంతటా ఉండేవాడివి ఆతని వెంట్రుకలందు విశ్వములన్ని ఉన్నాయి. ఆదేవుడు మహావిష్ణువు, భూమి పై వాసుదేవుడు. (22) సిద్ధేంద్రులకు చాలా కాలము తపస్సు చేస్తే లభించేవాడు, చాలా దుర్లభుడవు. అట్టిసాటిలేని నీపాదపద్మములు ప్రాణులన్నిటికి కళ్ళ ఎదుట కన్పించాయి. (23) అనంతుడిట్లో - ఓ భగవాన్! నీవు అనంతుడవు. నేను కాను. నేను కళలోని అంశ భాగాన్ని విశ్వమంతా ఒకచోట క్షుద్రకూర్మమందుండగా అక్కడ నేను, ఏనుగు పైన దోమలాంటి వాడిని (24) అసంఖ్యమైన శేషులు, కూర్మములు బ్రహ్మ విష్ణు శివులలాంటి వారు విశ్వములు అసంఖ్యాకమైనవి. వాటికి నీవు స్వయంగా ఈశుడవు. (25) ఓనాథ! మాకు ఇటువంటి మంచిరోజు ఎప్పుడు గలుగుతుంది భవిష్యత్తులో. కలలోకూడా ఏదేవుడు కన్పించడో ఆదేవుడు, ప్రాణులందరికి కన్పించాడు. (26) ఓనాథ! ఈభూమిని పవిత్రురాలను చేసి గోలోకానికి వెళ్తున్నావు. ఆ అనాథను, ఏడుస్తున్నదాన్ని, శోక సాగరమందు మునిగిన దానిని వదిలివెళ్తున్నావు. (27) దేవేతలిట్లా వేదములు స్తుతించలేకపోయాయి. బ్రహ్మ ఈశానాదులు కూడా అట్లాగే స్తుతించడానికి అశక్తులైనారు. అదే స్తుతిని మేమేమి చేస్తాము. నీకు నమస్కారము (28) అని పలికి ఆ దేవతలు ద్వారకాపురికి వెళ్ళారు. అక్కడున్న భగవంతుని చూడటానికి త్వరగా ఆనందంతో వెళ్ళారు. (29) ఆ గోపాలురు ఉత్తమమైన గోలోకానికి వెళ్ళారు. పృథివి భయపడి వణికింది. ఏడు సముద్రములు కదలినాయి. (30) బ్రహ్మ శాపం వల్ల శోభను కోల్పోయిన ద్వారకను వదిలి, రాధికేశ్వరుడు కదంబ మూలమందున్న మూర్తిని ప్రవేశించాడు. (31) వారంతా కొంతకాలంలో జరిగే యుద్ధంలో యాదవులంతా పడిపోతారు. దేవేరులంతా, చింత నొంది స్వాములతో (యజమానులతో) సహావెళ్ళారు. (32) అర్జునుడు తన పురానికి వెళ్ళి యుధిష్ఠిరునితో అన్నాడు. ఆ రాజు సోదరులతో భార్యతో కూడి స్వర్గానికి వెళ్ళాడు. (33) కదంబ మూలమందుకూర్చున్న పరమేశ్వరుని చూచి ఆ బ్రహ్మాది దేవతలంతా భక్తిపూర్వకముగా నమస్కరించారు.
మూ॥ తుష్టువు: పరమాత్మానం దేవం నారాయణం ప్రభుం ।
శ్యామం కిశోర వయసంభూషితం రత్నభూషణైః ॥
వహ్నిశుద్ధాంశుకాధానం శోభితం వనమాలయా ।
అతీవసుందరం శాంతం లక్ష్మీకాంతం మనోహరం ॥
వ్యాధాస్త్ర సంయుతం పాదపద్మం పద్మాది వందితం ।
దృష్ట్వా బ్రహ్మాది దేవాంస్తా నభయం సస్మితందదౌ ॥
పృథివీంతం సమూశ్వాస్యరుదంతీం ప్రేమ విహ్వలాం ।
వ్యాధం ప్రస్థాపయామాస పరం స్వపదముత్తమం ॥
బలస్యతేజః శేషేచ వివేశ పరమాద్భుతం ।
ప్రద్యుమ్నస్యచ కామైకే వానిరుద్ధస్య బ్రహ్మణి ॥
అయోని సంభవా దేవీ మహాలక్ష్మీశ్చ రుక్మిణీ ।
వైకుంఠం ప్రయయౌ సాక్షాత్స్వ శరీరేణ నారద ॥
సత్యభామాపృథివ్యాంచ వివేశకమలాలయా ।
స్వయంజాంబవతీ దేవీ పార్వత్యాం విశ్వమాతరి ॥
యాయాదేవ్యశ్చ యాసాంచాప్యం శరూపాశ్చ భూతలే ।
తస్యాంతస్యాం ప్రవిశుఃతా ఏవచ పృథక్ పృథక్ ॥
సాంబస్యతేజఃస్కందేచ వివేశ పరమాద్భుతం ।
కశ్యపే వసుదేవశ్చా ప్యదిత్యాం దేవకీ తథా ॥
రుక్మిణీ మందిరంత్యక్త్వా సమస్తాం ద్వారకాంపురీం ।
సజగ్రాహ సముద్రశ్చ ప్రపుల్ల వదనేక్షణః ॥
లవణోదః సమాగత్య తుష్టావ పురుషోత్తమం ।
రురోధ తద్వియోగేన సాశ్రునేత్రశ్చ విహ్వలః ॥
గంగా సరస్వతీ పద్మావతీచ యమునా తథా ।
గోదావరీ స్వర్ణరే ఖాకావేరీ నర్మదామునే ॥
శరావతీ బాహుదాచ కృతమాలాచ పుణ్యదా ।
సమాయయుశ్చతాః సర్వాః ప్రణేముః పరమేశ్వరం ॥
ఉవాచ జాహ్నవీ దేవీరుదంతీ పరమేశ్వరం ।
సాశ్రునేత్రాతిదీనాసా విరహజ్వర కాతరా ॥
భాగీరథ్యువాచ :
హేనాథ। రమణ శ్రేష్ఠ యాసి గోలోకముత్తమం ।
అస్మాకంకా గతిశ్చాత్ర భవిష్యతికలౌయుగే ॥
శ్రీభగవానువాచ :
కలే: పంచసహస్రాణి వర్షాణితిష్ఠభూతలే ।
పాపాని పాపినోయాని తుభ్యందాస్యంతి స్నానతః ॥
మన్మంత్రోపాసక స్పర్శాత్ భస్మీ భూతానితత్ క్షణాత్ ।
భవిష్యతి దర్శనాచ్ఛస్నానాదేవహి జాహ్నవి ॥
హరేర్నామానియత్రైవ పురాణాని భవంతి హి ।
తత్ర గత్వా సావధాన మాభిః సార్థంచ శ్రేష్యసి ॥
పురాణశ్రవణాచ్చైవ హరేర్నామాను కీర్తనాత్ ।
భస్మీభూతాని పాపాని బ్రహ్మహత్యాదికానిచ ॥
భస్మీభూతాని తాన్యేవ వైష్ణవా లింగనేవచ ।
తృణాని శుష్కకాష్ఠానిదహంతి పావకో యథా ॥
తథాపి వైష్ణవాలోకే పాపాని పాపినామపి ।
పృథివ్యాం యానితీర్థాని పుణ్యానపిచజాహ్నవి ॥
మద్భక్తానాంశరీరేషు సంతిపూతేషు సంతతం ।
మద్భక్త పాదరజసా సద్యః పూతా వసుంధరా ॥
సద్యః పూతానితీర్థాని సద్యఃపూతం జగత్తథా ।
మన్మంత్రోపా సకావిప్రాయే మదుచ్ఛిష్టభోజినః ॥
పరమాత్మయైన, దేవుని, ప్రభువును, నారాయణుని స్తుతించారు. ఆతడు, శ్యామలవర్ణుడు, చిన్నపిల్లవాని వయసు. రత్నాలంకారములతో అలంకరించుకున్నాడు. (35) వహ్నిశుద్దమైన వస్త్రమును ధరించాడు. వనమాలతో శోభిస్తున్నాడు. చాలా సుందరుడు శాంతుడు. లక్ష్మీకాంతుడు. మనోహరమైనవాడు. (36) పద్మాదులు నమస్కరించిన పాదపద్మములందువ్యాధుని అస్త్రము ఉంది. ఆ బ్రహ్మాది దేవతలను చూచి నవ్వుతూ అభయమిచ్చాడు. (37) ప్రేమ విహ్వలయై ఏడుస్తున్న ఆ భూమిని ఓదార్చి, వ్యాధుని పరమైన, ఉత్తమమైన తన స్థానానికి బయల్దేరదీశాడు.(రా) (38) బలరాముని తేజస్సు శేషుని యందు చాలా అద్భుతంగా ప్రవేశించింది. ప్రద్యమ్నుని తేజస్సు కాముని యందు, అనిరుద్ధుని తేజస్సు బ్రహ్మయందు చేరింది. (39) అయోని సంభవ, దేవి మహాలక్ష్మి రుక్మిణి, సాక్షాత్తు తన శరీరంతో వైకుంఠానికి వెళ్ళింది. ఓనారద! (40) సత్యభామ, కమలాలయ పృథివిలో ప్రవేశించింది. స్వయంగా జాంబవతిదేవి విశ్వమాతయైన పార్వతిలో చేరింది. (41) ఏఏ దేవతలు ఎవరెవరి అంగరూపంగా భూమి పై ఉన్నారో, వారంతా విడివిడిగా వారివారిలో ప్రవేశించారు. (42) సాంబుని తేజస్సు స్కందునిలో పరమాద్భుతంగా ప్రవేశించింది. వసుదేవుని తేజస్సు కశ్యపునిలో, అతిదిలో దేవకి ప్రవేశించింది. (43) రుక్మిణి మందిరాన్ని వదలి సమస్త ద్వారకాపురాన్ని సముద్రుడు, వికసించిన ముఖము చూపులు కలవాడై ఆతడు స్వీకరించాడు. (44) సముద్రుడు వచ్చి పురుషోత్తమునిస్తుతించాడు. పరమాత్మ వియోగంతో, కళ్ళనీళ్లు పెట్టుకొని విహ్వలుడై ఏడ్చాడు. (45) గంగ, సరస్వతి, పద్మావతి, యమున, గోదావరి, స్వర్ణరేఖ, కావేరి, నర్మద, ఓముని! (46) శరావతి బాహుద, కృతమాల, పుణ్యద, ఈ నదులన్నీ వచ్చి పరమేశ్వరునకు నమస్కరించాయి. (47) జాహ్నవిదేవి ఏడుస్తుపరమేశ్వరునితో ఇట్లా అన్నది. ఆమె కళ్ళనీళ్ళతో అతి దీనంగా, విరహజ్వరంతో చంచలురాలై అంది (48) భాగీరథి ఇట్లా - ఓనాథ ! రమణ! శ్రేష్ఠ! ఉత్తమమైన గోలోకానికి వెళ్తున్నావు. కలియుగంలో మాగతేమిటి ఇక్కడ. ఏమౌతుంది. (49) శ్రీభగవంతుడిట్లా - కలిలో ఐదువేల సంవత్సరాల వరకు భూమి పై ఉండు. పాపులు తమ పాపాలను స్నానంతో నీకిస్తారు. (50) నామంత్రాన్ని ఉపాసించేవాని స్పర్శతో ఆపాపాలు ఆక్షణంలోనే భస్మమౌతాయి. వాని దర్శనం వలన, స్నానం వలన నశిస్తాయి ఓ జాహ్నవి (51) హరినామాలు ఉన్నచోటకు పురాణాలు జరిగేచోటకు వెళ్ళి సావధానంగా వీరితో కూడా స్త్రీ) వింటావు. (52) పురాణం వినటం వలన, హరినామాన్ని కీర్తించటం వల్ల,బ్రహ్మ హత్యాదికమైన పాపములు భస్మమౌతాయి. (53) అవే వైష్ణవుని ఆలింగనముతో భస్మమౌతాయి, అగ్ని, గడ్డిని ఎండుకట్టెను కాల్చినట్టు నశిస్తాయి. (54) లోకంలో వైష్ణవులు పాపుల పాపాలను భస్మం చేస్తారు. భూమి పై ఎన్ని తీర్థాలున్నాయో, పుణ్యమైనవి అవన్నీ, ఓ జాహ్నవి! (55) నా భక్తుల . శరీరమందున్నాయి. పవిత్రమైన వారి యందున్నాయి. వసుంధర, నా భక్తుల పాదధూళితో వెంటనే పవిత్రమౌతుంది. (56) నా ఎంగిలిని తినే, నా మంత్రాన్నుపాసించే విప్రులతో తీర్థములు వెంటనే పవిత్రమౌతాయి. జగత్తు వెంటనే పవిత్రమౌతుంది.
మూ॥ మామేవనిత్యం ధ్యాయంతే తేమత్ప్రాణాధికా: ప్రియాః ।
తదుపస్పర్శ మాత్రేణ పూతోవాయుశ్చ పావకః ॥
కలేర్దశ సహస్రాణి మద్భక్తాః సంతి భూతలే ।
ఏకవర్ణాభవిష్యంతి మద్భక్తేషు గతేషుచ ॥
మద్భక్త శూన్యాపృథివీ కలిగ్రస్తా భవిష్యతి ।
ఏతస్మిన్నంతరే తత్రకృష్ణ దేహాద్వినిర్గతః ॥
చతుర్భుజశ్చ పురుషః శతచంద్రసమప్రభః ।
శంఖచక్రగదా పద్మధరః శ్రీవత్సలాంఛనః ॥
సుందరం రథమారుహ్య క్షీరోదంస జగామహ ।
సింధుకన్యాచ ప్రయయౌ స్వయం మూర్తిమతీసతీ ॥
శ్రీకృష్ణ మనసాజాతా మర్త్య లక్ష్మీర్మనోహరా ।
శ్వేతద్వీపం గతేవిష్ణౌ జగత్పాలన కర్తరి ॥
శుద్ధ సత్వస్వరూపేచ ద్విధారూపోబభూవహ ।
దక్షిణాంశశ్చద్విభుజో గోపబాలక రూపకః ॥
నవీన జలదశ్యామః శోభితః పీతవాససా ।
శ్రీవంశవదనః శ్రీమాన్ సస్మితః పద్మలోచనః ।
శతకోటిందు సౌందర్యం శతకోటి స్మరప్రభం ।
దధానః పరమానందః పరిపూర్ణతమః ప్రభుః ॥
పరంధామ పరబ్రహ్మస్వరూపో నిర్గుణః స్వయం ।
పరమాత్మాచ సర్వేషాం భక్తానుగ్రహ విగ్రహః ॥
నిత్యదేహశ్చ భగవానీశ్వరః ప్రకృతేః పరః ।
యోగినో యం వదంత్యేవం జ్యోతీరూపం సనాతనం ॥
జ్యోతిరభ్యంతరే నిత్యరూపంభక్తా విదంతీయం ।
వేదవదంతి సత్యం యంనిత్యమద్యం విచక్షణాః ॥
యం వదంతి సురాః సర్వేపరం స్వేచ్ఛామయం ప్రభుం ।
సిద్ధేంద్రమునయస్సర్వే సర్వరూపం వదంతియం ॥
యమనిర్వచనీయంచ యోగీంద్రః శంకరోవదేత్ ।
స్వయం విధాతా ప్రవదేత్ కారణానాంచ కారణం ॥
శేషోవదే దనంతంయం నవధారూపమీశ్వరం ।
తర్కాణామేవషణ్ణంచ షడ్విధం రూపమీప్సితం ॥
వైష్ణవానా మేకరూపం వేదానామేక మేవచ ।
పురాణానామేక రూపంతస్మాన్నవ విధం స్కృతం ॥
న్యాయోనిర్వచనీయంచయం మతం శంకరోవవేత్ ।
నిత్యం వైశేషికాశ్చ యంతం వదంతి విచక్షణాః ॥
సాంఖ్యోవదతితం దేవం జ్యోతీరూపం సనాతనం ।
మీమాంసా సర్వరూపంచ వేదాంతః సర్వకారణం ॥
పాతంజలోఽప్యనంతంచ వేదాః సత్య స్వరూపకం ।
స్వేచ్ఛామయం పురాణంచ భక్తాశ్చనిత్య విగ్రహం ॥
సోఽయం గోలోకనాథశ్చ రాధేశో నందనందనః ।
గోకులే గోపవేషశ్చ పుణ్యే బృందావనేవనే ॥
చతుర్భుజశ్చ వైకుంఠే మహాలక్ష్మీ పతిఃస్వయం ।
నారాయణశ్చ భగవాన్యన్నామ ముక్తి కారణం ॥
సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్కల్పశతత్రయం ।
గంగాదిసర్వతీర్ధేషు స్నాతోభవతి నారద ॥
సునందనందకుముదైః పార్షదైః పరివారితః ।
శంఖచక్ర గదా పద్మధరః శ్రీవత్సలాంఛనః ॥
నన్నే నిత్యం ధ్యానించేవారు నాకు నా ప్రాణములకన్న అధికులు, ప్రియులు. వారిని స్పృశిస్తే చాలు వాయువు, అగ్ని పవిత్రమౌతాయి. (58) కలిలో పదివేల సంవత్సరాలు భూమి పై నా భక్తులుంటారు. నా భక్తులు పోయాక అంతా ఒకే వర్ణం (కులం) వారౌతారు. (59) నాభక్తులులేని భూమి కలితో ఆక్రమించబడుతుంది. ఇంతలో అక్కడ కృష్ణుని శరీరం నుండి, బయటికి వచ్చిన (60) ఒక పురుషుడు, నాల్గు చేతులు కలిగి నూరుగురు చంద్రులతో సమానంగా వెలిగిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మములు ధరించాడు. శ్రీవత్సము గుర్తుగా ఉంది. (61) ఆతడు సుందరమైన రథమెక్కి క్షీరసముద్రానికి వెళ్ళాడు. సింధుకన్య గూడా స్వయంగా రూపం కలిగి ఆసతి వెళ్ళింది. (62) శ్రీకృష్ణుని మనస్సు నుండి పుట్టిన, మనోహరురాలైన మర్త్య లక్ష్మి, జగత్తును పాలించటానికి కర్తయైన విష్ణువు శ్వేత ద్వీపానికి వెళ్ళాక, (63) శుద్ధసత్వ స్వరూపము రెండు రూపాలైంది. దక్షిణ భాగమున (కుడి) రెండు చేతులతో గోపబాలుని రూపం ధరించింది. (64) కొత్త వర్షామేఘము వలె శ్యామలవర్ణము గలిగి, పచ్చని పట్టు వస్త్రముతో శోభిస్తుంది. ముఖంలో వేణువుంది. శ్రీమాన్, చిరునవ్వు నవ్వుతున్నాడు. కళ్ళు పద్మాలవలె ఉన్నాయి. (65) నూరుకోట్ల చంద్రుల సౌందర్యము, నూరుకోట్ల మన్మథుల కాంతికలిగి ఉన్నాడు. ఆతడు పరమానందుడు, పరిపూర్ణతముడు, ప్రభువు. (66) పరమైన స్థానము, పరబ్రహ్మ స్వరూపుడు, స్వయంగా నిర్గుణుడు అందరికి పరమాత్మ భక్తులను అనుగ్రహించే కొరకు రూపము ధరించినవాడు. (67) నిత్యశరీరుడు, భగవంతుడు, ఈశ్వరుడు, ప్రకృతికీపరుడు. ఆతనిని యోగులు జ్యోతిరూపుడు, సనాతనుడు అని అంటారు. (68) జ్యోతిలోపల నిత్యరూపుడు అని భక్తులంటారు. వేదములు సత్యస్వరూపుడని అంటాయి. విచక్షణులు, నిత్యుడు, ఆద్యుడు అని అంటారు. (69) దేవతలంతా పరుడు, స్వేచ్ఛామయుడు, ప్రభువు అని అంటారు. సిద్దేంద్రులు, మునులు అంతా ఆతనిని సర్వరూపుడని అంటాయి. (70) శంకరుడు, యోగీంద్రుడు, అనిర్వచనీయుడన్నాడు. కారణములకు కారణమని స్వయంగా బ్రహ్మ అన్నాడు. (71) శేషుడు, అనంతుడు అని అంటాడు. ఈశ్వరునకు తొమ్మిది రూపములు. ఆరుతర్కములకు ఆరు రూపములు ఇష్టము. (72) వైష్ణవులకు ఒకే రూపము. వేదములకు ఒకే రూపము. పురాణములకొక రూపము. కనుక (6+1+1+1=9) తొమ్మిది విధాలు అని అన్నారు. (73) న్యాయము (శాస్త్రం) నిర్వచనీయుడని అది మామతమని శంకరుడన్నాడు. విచక్షణులు వైశేషికులు, ఆతనిని, నిత్యమన్నారు. (74) సాంఖ్యులు, జ్యోతిరూపుడని సనాతనుడని ఆ దేవునన్నారు. మీమాంసకులు సర్వరూపుడు అని వేదాంతము సర్వకారణమని అన్నారు. (75) పాతంజలులు అనంతుడని అన్నారు. వేదములు సత్యస్వరూపుడన్నాయి. పురాణములు స్వేచ్చామయుడన్నాయి. భక్తులు నిత్యవిగ్రహుడని అన్నారు. (76) ఆతడు గోలోకనాథుడు, రాధేశుడు, నందనందనుడు గోకులంలో పుణ్యమైన బృందావన వనములో గోపవేషము (77) వైకుంఠంలో నాలుగు చేతులు స్వయంగా మహాలక్ష్మీపతి. భగవాన్ నారాయణుడు. ఆ పేరే ముక్తికారణము. (78) ఒక్కసారి నారాయణ అని అంటే పురుషుడు మూడు నూర్ల సంవత్సరాల కాలము గంగాది సర్వతీర్థములందు స్నానం చేసిన వాడౌతాడు, ఓ నారద! (79) సునందుడు, నందుడు, కుముదుడు, అను పరివారముతో చుట్టబడి శంఖచక్రగదా పద్మధరుడై శ్రీవత్సలాంఛనం కలిగి.
మూ॥ కౌస్తుభేన మణీంద్రేణ భూషితో వనమాలయా ।
వేదైఃస్తుతశ్చ యానేన వైకుంఠం స్వపదంయయౌ ॥
గతే వైకుంఠనాథేచ రాధేశశ్చ స్వయంప్రభుః ।
చకారవంశీ శబ్దంచ త్రైలోక్య మోహనం పరం ॥
మూర్చాం ప్రాపుర్దేవగణాః మునయశ్చాపి నారద ।
అచేతనాబభూవుశ్చ మాయయా పార్వతీం వినా ॥
ఉవాచ పార్వతీదేవీ భగవంతం సనాతనం ।
విష్ణుమాయా భగవతో సర్వరూపా సనాతనీ ॥
పరబ్రహ్మ స్వరూపా యా పరమాత్మ స్వరూపిణీ ।
సగుణ నిర్గుణాసాచ పరా స్వేచ్ఛామయీసతీ ॥
పార్వత్యువాచ :
ఏకాహం రాధికారూపా గోలోకే రాసమండలే ।
రాసశూన్యంచ గోలోకం పరిపూర్ణం కురుప్రభో ॥
గచ్ఛత్వం రథమారుహ్య ముక్తామాణిక్య భూషితం ।
పరిపూర్ణతమా హంచ తవవక్షః స్థలస్థితా ॥
తవాజ్ఞయా మహాలక్ష్మీ రహం వైకుంఠగామినీ ।
సరస్వతీచ తత్రైవ వామేపార్ష్వే హరేరపి ॥
తవాహం మానసాజాతా సింధుకన్యా తవాజ్ఞయా ।
సావిత్రీ వేదమాతాహం కలయా విధిసన్నిధే॥
తేజఃసుసర్వదేవానాం పురాసత్యతవాజ్ఞయా ।
అధిష్టానం కృతంతత్ర ధృతం దేవ్యాశరీరకం ॥
శుంభాదయశ్చదైత్యాశ్చ నిహతాశ్చావలీలయా ।
దుర్గాంనిహత్య దుర్గాహం త్రిపురాత్రిపురేవధే ॥
నిహత్యరక్తబీజంచ రక్తబీజవినాశినీ ।
తవాజ్ఞయా దక్షకన్యా సతీసత్య స్వరూపిణీ ॥
యోగేనత్యక్త్వా దేహంచశైలజాహం తవాజ్ఞయా ।
త్వయాదత్వాశంకరాయ గోలోకే రాసమండలే ॥
విష్ణు భక్తిరహంతేన విష్ణుమాయాచ వైష్ణవీ ।
నారాయణస్య మాయాహంతేన నారాయణీ స్మృతా ॥
కృష్ణప్రాణాధికాహంచ ప్రాణాధిష్ఠాతృ దేవతా ।
మహావిష్ణోశ్చ వాసోశ్చ జననీరాధికా స్వయం ॥
మణిశ్రేష్ఠమైన కౌస్తుభమణితో, వనమాలతో అలంకరింపబడ్డాడు. వేదములతో స్తుతింపబడుతూ విమానంలో తన స్థానమైన వైకుంఠానికి వెళ్లాడు. (81) వైకుంఠనాథుడు, రాధేశుడు, స్వయంగా ప్రభువుఐన స్వామి వెళ్లాక, ముల్లోకముల మోహింపచేసే, పరమైన, వేణుధ్వనిని చేశాడు. (82) ఓనారద! మునులు, దేవగణములు మూర్చపొందారు. పార్వతి తప్ప,ఆ మాయతో అంతా అచేతనులయ్యారు. (83) సనాతనుడైన భగవంతునితో దేవి పార్వతి ఇట్లా అంది. భగవంతుని విష్ణుమాయ అన్ని రూపములు కలది. సనాతనమైనది (84) పరబ్రహ్మ స్వరూపమైనది. పరమాత్మ స్వరూపమైనది. సగుణము; నిరుణము, పరమైనది. స్వేచ్ఛామయమైన సతి. (85) పార్వతి ఇట్లా - గోలోకంలో రాసమండలమందు రాధిక రూపురాలను ఒక్కదాన్నే. ఓప్రభు! గోలోకం రాసశూన్యమైంది. దానిని పరిపూర్ణం చేయి. (86) ముత్యములు మాణిక్యములతో అలంకరింపబడ్డ రథాన్ని ఎక్కి నీవు వెళ్ళు. నీ వక్షఃస్థలమందున్న నేను పరిపూర్ణతమురాలను. (87) నీ ఆజ్ఞతో నేను మహాలక్ష్మిని వైకుంఠానికి వెళ్ళేదాన్ని. హరికి ఎడమభాగంలో అక్కడే సరస్వతిని. (88) నేను నీమనస్సునుండి పుట్టినదానిని. నీ ఆజ్ఞతో సింధుకన్యను. ఒకకళతో విధి సన్నిధిలో నేను వేదమాత సావిత్రిని. (89) తేజస్సులలో సర్వవేదములకు ముందు నీ ఆజ్ఞతో సత్యను, అక్కడ అధిష్టానము చేశాను. దేవి శరీరాన్ని ధరించాను. (90) అవలీలగా శుంభాది దైత్యులను చంపాను. దుర్గను చంపి దుర్గనయ్యాను నేను. త్రిపుర వధయందు నేను త్రిపురను. (91) రక్తబీజుని చంపి రక్తబీజనాశిని నయ్యాను. నీ ఆజ్ఞతో దక్షకన్యను, సతిని, సత్యస్వరూపిణిని. (92) యోగంతో శరీరాన్ని విడిచినీ ఆజ్ఞతో శైలజనయ్యాను నేను. నీతో శంకరునకివ్వబడ్డాను. గోలోకంలో రాసమండలమందు (93) నేను విష్ణుభక్తిని. అందువల్ల విష్ణుమాయను, వైష్ణవిని. నారాయణుని మాయను నేను అందువల్ల నారాయణి అని అనబడ్డాను. (94) కృష్ణునకు ప్రాణంకన్న అధికురాలను నేను. ప్రాణఅధిష్ఠాతృ దేవతను. మహావిష్ణువునకు,వాసునకు తల్లిని, స్వయంగా రాధికను.
మూ॥ తవాజ్ఞయా పంచధాహం పంచప్రకృతిరూపిణీ ।
కలాకలాంశయాహంచ దేవపత్న్యో గృహే గృహే ॥
శీఘ్రంగచ్ఛమహాభాగతత్రాహం విరహాతురా ।
గోపీబిః సహితా రాసం భ్రమంతీ పరితః సదా ॥
పార్వతీవచనంశ్రుత్వా విహస్య రసికేశ్వరః ।
రత్నయానం సమారుహ్యయయౌ గోలోకముత్తమం ॥
పార్వతీబోధయామాస స్వయం దేవగణంతథా ।
మాయావంశీరావాచ్ఛిన్నం విష్ణుమాయాసనాతనీ ॥
కృత్వాతేహరిశబ్దంచ స్వగృహం విస్మయం యయుః ।
శివేన సార్థం దుర్గాసా ప్రహృష్టాస్వపురంయయౌ ॥
అథకృష్ణం సమాయాంతం రాధాగోపీగణైః సహ ।
అనువ్రజం యయౌహృష్టాసర్వజ్ఞా ప్రాణవల్లభం ॥
దృష్ట్వా సమీపమాయాంతం మవరుహ్య రథాత్సతీ ।
ప్రణనామ జగన్నాథం శిరసాసఖిభిః సహ ॥
గోపాగోప్యశ్చముదితాః ప్రఫుల్లవదనే క్షణాః ।
దుందుభిం వాదయామాసుః ఈశ్వరా గమనోత్సుకాః ॥
విరాజంచ సముత్తీర్య దృష్ట్వా రాధాం జగత్పతిః ।
అవరుహ్య రథాత్తూర్ణం గృహీత్వా రాధికా కరం ॥
శతశృంగేచ బభ్రామ సురమ్యం రాసమండలం ।
దృష్ట్వాక్షయ వటం పుణ్యంపుణ్యం బృందావనం వనం ॥
తులసీకాననం దృష్ట్వా ప్రయయౌ మాలతీవనం ।
వామేకృత్వా కుందవనం మాధవీకాననంతథా ॥
చకారదక్షిణే కృష్ణః చంపకా రణ్యమీప్సితం ।
చకార పశ్చాత్తూర్ణంచ చారుచందన కాననం ॥
దదర్శపురతో రమ్యం రాధికా భవనంపరం ।
ఉవాసరాధయా సార్థం రత్నసింహాసనేవరే ॥
సకర్పూరంచ తాంబూలం బుభుజే వాసితంజలం ।
సుష్వాప పుష్పతల్పేచ సుగంధి చందనార్చితే ॥
సరేమే రామయా సార్థం నిమగ్నోరస సాగరే।
ఇత్యేవం కథితం సర్వం ధర్మవక్త్రాచ్చ యచ్చ్రుతం ॥
గోలోకారోహణం రమ్యం కింభూయః శ్రోతుమిచ్చసి ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే గోలోకారోహణం నామ ఏకోనత్రిం శదధిక శతతమోఽధ్యాయః ॥
అను ॥ నీ ఆజ్ఞతోనేను ఐదు రకాలుగా పంచప్రకృతి రూపిణిని. కళ, కళాంశలతో నేను ప్రతి ఇంట్లో దేవతల పత్నిని (96) ఓమహాభాగ! శీఘ్రంగా వెళ్ళు. అక్కడ నేను విరహాతురురాలను గోపికలతో కూడి ఎప్పుడూ అంతటా రాసంలో తిరిగేదాన్ని (97)పార్వతి మాటను విని రసికేశ్వరుడు నవ్వి, రత్న విమానాన్ని ఎక్కి ఉత్తమమైన గోలోకానికి వెళ్లాడు. (98) పార్వతి స్వయంగా దేవగణానికి బోధించసాగింది. మాయా వంశీరవముతో అంతాకలత చెందింది. విష్ణుమాయ సనాతనమైంది. (99) వారు హరి శబ్దాన్ని చేసి తమ గృహాలకు ఆశ్చర్యంగా వెళ్ళారు. శివునితో పాటు ఆ దుర్గ ఆనందించి తన పురానికి వెళ్ళింది (100) వస్తున్న కృష్ణుని చూచి రాధ గోపీగణములతో కూడా ఆనందంతో ప్రజాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. ఆ సర్వజ్ఞురాలు ప్రాణవల్లభుడు రాగా (101) చూచి దగ్గరకు వస్తున్న వానిని చూచి రథం నుండి ఆసతిదిగి, శిరస్సుతో సఖురాండ్రతో కలిసి జగన్నాథునకు నమస్కరించింది (102) గోపాలురు గోపికలు ఆనందించి ముఖాలు చూపులు వికసించగా ఈశ్వరుని రాకతో ఉత్సుకులై దుందుభిని వాయించారు (103) విరజను దాటి జగత్పతి రాధను చూసి త్వరగా రథం నుండి దిగిరాధిక చేతిని పట్టుకొని (104) శతశృంగమందు తిరిగాడు. చాలా రమ్యమైన రాసమండలాన్ని పుణ్యప్రదమైన అక్షయ వటాన్ని, పుణ్యప్రదమైన బృందావనాన్ని చూసి (105) తులసి కాననాన్ని చూసి మాలతీ వనానికి వెళ్ళాడు. మాధవి వనాన్ని, కుందవనాన్ని ఎడమ ప్రక్కన ఉంచుకొని (ఉండగా) (106) కుడివైపు ఇష్టమైన చంపకారణ్యముండగా కృష్ణుడు వెళ్ళాడు. ఆ పిదప త్వరగా అందమైన చందన కాననాన్ని వెనుక చేసుకొని (107) ఎదురుగా పరమైన, రమ్యమైన రాధికా భవనాన్ని చూచాడు. వరమైన రత్నసింహాసనమందు రాధతో కలిసి ఉన్నాడు (108) కర్పూరంతో కూడిన తాంబూలాన్ని తిన్నాడు. వాసనగల నీరు తాగాడు. మంచివాసనగల చందనం పూయబడిన పుష్పతల్పమందు పరున్నాడు (109) ఆరామతో కలిసి ఆతడు రమించాడు. రససాగరమందు మునిగాడు. అని ఈరకంగా ధర్ముని నోటినుండి విన్నదానినిఅంతా చెప్పాను (110) రమ్యమైన గోలోక ఆరోహణమును (ఎక్కటం) చెప్పాను. ఇంకేమి వినదలిచావు (111) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు గోలోకా రోహణమనునది నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.