మూ॥ నంద ఉవాచ:
శ్రుతం సర్వం మహాభాగ! దుఃస్వప్నం కథయ ప్రభో ।
ఉవాచ తం వై భాగవాన్ శ్రూయతామితితద్వచః ॥
శ్రీభగవానువాచ :
స్వప్నే హసతి యో హర్షాత్ వివాహం యది పశ్యతి ।
నర్తనం గీతమిష్టంచ విపత్తిస్తస్త్య నిశ్చితం ॥
దంతా యస్య విపీడ్యంతే విచరంతంచ పశ్యతి ।
ధనహానిర్భవేత్తస్య పీడాచాపి శరీరజా॥
అభ్యంగితస్తు తైలెన యోగచ్ఛేద్దక్షిణాం, దిశం ।
ఖరోష్ట్ర మహిషారూడో మృత్యుస్తస్య న సంశయః ॥
స్వప్నే కర్ణే జపాపుష్ప మశోకం కరవీరకం ।
విపత్తిస్తస్య తైలంచ లవణం యదిపశ్యతి ॥
నగ్నాం కృష్ణాం ఛిన్ననాసాం శూద్రస్య విధవాం తథా ।
కపర్దకం తాలఫలం దృష్ట్వా శోకమవాప్నుయాత్॥
స్వప్నేరుష్టం బ్రాహ్మణంచ బ్రాహ్మణీం కోపసంయుతాం ।
విపత్తిశ్చభవేత్తస్య లక్ష్మీర్యాతిగృహాద్దృవం ॥
వనపుష్పం రక్తపుష్పం పలాశంచ సుపుష్పితం ।
కార్పాసం శుక్ల వస్త్రంచ దృష్ట్వా దుఃఖమవాప్నుయాత్ ॥
గాయంతీం చ హసంతీంచ కృష్ణాంబర ధరాం స్త్రియం ।
దృష్ట్వా కృష్ణాంచ విధవాం నరో మృత్యుమవాప్నుయాత్ ॥
దేవతా యత్ర నృత్యంతి గాయంతిచ హసంతిచ ।
ఆస్పోటయంతి ధావంతి తస్య దేహో మరిష్యతి ॥
వాంతం మూత్రం పురీషంచ వైద్యం రౌప్యం సువర్ణకం ।
ప్రత్యక్షమథవా స్వప్నే జీవితం దశమావధి ॥
కృష్ణాంబరధరాం నారీం కృష్ణమాల్యానులేపనం ।
ఉపగూహతి యః స్వప్నే తస్య మృత్యుర్భవిష్యతి ॥
మృతవత్సంచ ముండంచ మృగస్యచ నరస్యచ ।
యః ప్రాప్నోత్యస్థిమాలాంచ విపత్తిస్తస్యనిశ్చితం ॥
రథం ఖరోష్ట్రసంయుక్తం ఏకాకీ యోఽధిరోహయేత్ ।
తత్రస్థోఽపిచ జాగర్తి మృత్యురేవ, నసంశయః ॥
అభ్యంగితస్తు హవిషా క్షీరేణ మధునాఽపిచ ।
తక్రేణాఽపి గుడేనైవ పీడాతస్య వినిశ్చితం ॥
రక్తాంబరధరాంనారీం రక్తమాల్యానులేపనాం ।
ఉపగూహతి యః స్వప్నే తస్య వ్యాధిర్వినిశ్చితం ॥
పతితా న్నఖకేశాంశ్చ నిర్వాణాంగారమేవచ ।
భస్మపూర్ణాం చితాం దృష్ట్వా లభతే మృత్యుమేవచ ॥
శ్మశానం శుష్క కాష్ఠంచ తృణాని లోహమేవచ ।
శమీంచ కించిత్కృష్ణాం శ్వం దృష్ట్వా దుఃఖం లభేద్ధృవం ॥
పాదుకాం ఫలకం రక్తం పుష్పమాల్యం భయానకం ।
మాషం మసూరం ముద్గంవా దృష్ట్వా సద్యోవ్రణం లభేత్ ॥
నందుడిట్లన్నాడు - ఓ మహాభాగ! అంతా విన్నాను. ఓ ప్రభు! దుఃస్వప్నాన్ని గూర్చి చెప్పు. విను, అని ఆతనికి భగవంతుడు ఆమాట చెప్పాడు. (1) భగవంతునివచనమిట్లా - కలలో ఆనందంతో నవ్వితే, వివాహాన్ని చూస్తే, నాట్యము పాట ఇష్టమైంది వింటే ఆతనికి ఆపద తప్పదు.(2) పళ్ళు కొరకటం, నడుస్తూన్నట్టు చూడటం జరిగితే వానికి ధనహాని జరుగుతుంది. శరీర సంబంధమైన పీడకల్గుతుంది. (3) నూనెతో తలంటుకొని, దక్షిణ దిక్కుగాపోతే, గాడిద, ఒంటె, మహిషము వీటిని ఎక్కినట్టు కన్పిస్తే వాడికి మృత్యువు కల్గుతుంది అనుమానం లేదు. (4) కలలో, చెవిలో దాసనపువ్వు, అశోకము, గన్నేరు కన్పిస్తే, నూనె ఉప్పు, వీటిని చూస్తే వానికి ఆపద సంభవిస్తుంది. (5) దిగంబరి, నల్లనిది, ముక్కు కోయబడ్డది శూద్రునిది విధవ స్త్రీ, జడముడి, తాటిపండు వీనినిచూస్తే దుఃఖం కల్గుతుంది. (6) కలలో కోపంతో ఉన్న బ్రాహ్మణుని, కోపంగల బ్రాహ్మణ స్త్రీని చూస్తే వానికి ఆపద సంభవిస్తుంది. ఇంటినుండి లక్ష్మిపోతుంది, నిశ్చయము. (7) అడవిపూలు, ఎర్రనిపూవు, పూచిన మోదుగ, దూది, తెల్లని వస్త్రము వీటిని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు. (8) పాడుతున్న దాన్ని, నవ్వుతున్నదాన్ని, నల్లచీరకట్టుకున్న స్త్రీని,నల్లని విధవస్త్రీని చూస్తే నరుడు మృత్యువును పొందుతాడు. (9) దేవతలు నాట్యం చేస్తే, పాటలు పాడితే, నవ్వితే, పెద్దగా అరిస్తే, పరుగెత్తితే (కలలో) ఆమనిషి మరణిస్తాడు. (10) వాంతి, మూత్రము, పురీషము, వైద్యుడు వెండి, బంగారం వీనిని ప్రత్యక్షంగా కానికలలోకాని చూస్తే వాని జీవితము పదిరోజులు మాత్రమే ఉంటుంది. (11) నల్లచీర ధరించిన స్త్రీని, నల్లనిమాలలు, నల్లని మై పూతగలదానిని కలలో కౌగిలించుకుంటే, వాడికి చావు కల్గుతుంది. (12) చనిపోయిన మృగపు దూడ (పిల్ల)తల గొరిగించుకున్న వాడి తల, అస్థికలమాల కన్పిస్తే వానికి ఆపద తప్పదు. (13) గాడిద, ఒంటే వీటితో కూడిన రథము, దీనిని ఒంటరిగా ఎక్కినట్టు కన్పిస్తే, వెంటనే మెలకువ వస్తే మృత్యువు కల్గుతుంది అనుమానం లేదు. (14) హవిస్సుతో, పాలతో తేనెతో, మజ్జిగతో, బెల్లంతో కాని అభ్యంగస్నానం చేసిన కలవస్తే వానికి పీడ తప్పదు. (15) ఎర్రచీర ధరించిన స్త్రీని, రక్తమాలను ఒంటిపూతనుగలదాన్ని కలలో కౌగిలించుకుంటే వానికి వ్యాధి తప్పదు. (16) పడిపోయిన గోళ్ళను, వెంట్రుకలను నిర్వాణపు అగ్నిని (చితిది), భస్మంతో నిండిన చితినిచూస్తే, మృత్యువుపొందుతాడు. (17) శ్మశానము, ఎండినకర్ర, గడ్డిపోచలు, లోహము, శమీవృక్షాన్ని కొద్ది నలు పైన గుర్రాన్ని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు, నిశ్చయము. (18) పాదుకను, ఫలకము (డాలు), ఎర్రని పూమాల, భయానక దృశ్యము, మినుములు, చిరు సెనగలు, పెసలు వీటిని (కలలో) చూస్తే వెంటనే పుండు కలుగుతుంది.
మూ॥కటకం సరటం కాకం భల్లూకం వానరం గవం ।
పూయం గాత్రమలం స్వప్నే కేవలం వ్యాధి కారణం ॥
భగ్నభాండం క్షతం శూద్రం గలత్కుష్ఠంచ రోగిణం ।
రక్తాంబరంచ జటిలం సూకరం మహిషం ఖరం ॥
అంధకారం మహాఘోరం మృతం జీవం భయంకరం ।
దృష్ట్వా స్వప్నే యోని లింగం విపత్తిం లభతే ధ్రువం ॥
కువేషరూపం మ్లేచ్చంచ యమదూతం భయంకరం ।
పాశహస్తం పాశశస్త్రం దృష్ట్వా మృత్యుం లభేన్నరః ॥
బ్రహ్మణో బ్రాహ్మణీ బాలా బాలకోవా సుతః సుతా ।
విలాపం కురుతే కోపాత్ దృష్ట్వా దుఃఖమవాప్నుయాత్ ॥
కృష్ణం పుష్పంచ తన్మాల్యం సస్యం శస్త్రాస్త్రధారిణం ।
మ్లేచ్ఛాంచ వికృతాకారాం దృష్ట్వా మృత్యుం లభేద్ధృవం ॥
త్యక్షప్రాణం మృతం దృష్ట్వా మృత్యుంచ లభతే ధ్రువం ।
మత్స్యాది ధారయే ద్యోహి తద్ర్భాతుర్మరణం ధ్రువం ॥
వాద్యంచ నర్తనం గీతం గాయనం రక్తవాససం ।
మృదంగం వాద్యమానంతం దృష్ట్వా దుఃఖం లభేద్ద్రువం ॥
చిన్నం వాపికబంధంవా వికృతం ముక్త కేశినం ।
క్షిప్రంనృత్యంచ కుర్వంతం దృష్ట్వా మృత్యుం లభేన్నరః ॥
మృతోవాపి మృతావాపి కృష్ణమ్లేచ్చా భయానకా ।
ఉపగూహతి యంస్వప్నే తస్య మృత్యు ర్వినిశ్చితం ॥
యేషాం దంతాశ్చ భగ్నాశ్చ కేశాశ్చాపి పతంతిహి ।
ధనహానిర్భవేత్తస్య పీడావా తచ్ఛరీరజా ॥
ఉపద్రవంతి యం స్వప్నే శృంగిణో దంష్ట్రిణోఽపివా ।
బాలకా మానవాశ్చైవ తస్య రాజకులాద్భయం ॥
ఛిన్నం వృక్షం పతంతం చ శిలావృష్టిం తుషం క్షురం ।
రక్తాంగారం భస్మవృష్టిం దృష్ట్వా దుఃఖమవాప్నుయాత్ ॥
గృహం పతంతం శైలం వాధూమకేతుం భయానకం ।
భగ్నస్కంధం నరంవాపి దృష్ట్వా దుఃఖమవాప్నుయాత్ ॥
రథగేహశైలవృక్షగోహస్తి తురగాం బరాత్ ।
భూమౌ పతతి యః స్వప్నే విపత్తి స్తస్య నిశ్చితం ॥
ఉచ్చైః పతంతి గర్గేషు భస్మాంగారయుతేషుచ ।
క్షారకుండేషు చూర్ణేషు మృత్యు స్తేషాం నసంశయః ॥
బలాధృధ్గృష్ణాతి దుష్టశ్చ ఛత్రంచ తస్య మస్తకాత్ ।
పితుర్నాశో భవేత్తస్య గురోర్వాపి నృపస్యవా ॥
సురభిర్యస్యగేహాచ్చ యాతి త్రస్తా సవత్సికా ।
ప్రయాతి పాపినస్తస్య లక్ష్మీరపి వసుంధరా ॥
పాశేన కృత్వా బద్ధంచ యం గృహీత్వా ప్రయాంతిచ ।
యమదూతాశ్చ యేమేచ్ఛాస్తస్య మృత్యుర్వినిశ్చితం ॥
గణకో బ్రాహ్మణోవాపి బ్రాహ్మణీవా, గురుస్తథా ।
పరిరుష్టః శపతి యం విపత్తి స్తస్య నిశ్చితం ॥
విరోధినశ్చ కాకాశ్చ కుక్కుటా భల్లుకాస్తథా ।
పతం త్యాగత్య యద్గాత్రే తస్య మృత్యుర్న సంశయః ॥
అను ॥ కడియము, తొండ, కాకి, ఎలుగుబంటు, కోతి, గవము (గోవా, గుహనా) మలము, శరీర మలము కలలో చూస్తే ఇవి వ్యాధికి కారణమౌతాయి (20) పగిలిన కుండ, గాయపడ్డ శూద్రుడు, కుష్ఠురోగం కన్పిస్తున్న రోగిని, ఎర్రని వస్త్రంగల సన్యాసి, పంది, మహిషము, గాడిద (21) మహాఘోరమైన అంధకారము, బ్రతికిన వానిని భయంకరంగా చచ్చిన వానినిగాను, . ఇవన్నీ కలలో చూస్తే యోనిని, లింగాన్ని కలలో చూస్తే ఆపద నందుతాడు, తప్పదు.(22) కుత్సితమైన వేషము రూపముగల మైచ్చుని, భయంకరమైన యమదూతను, చేత పాశం ధరించినవానిని, పాశశస్త్రమును కలలో చూస్తే నరుడు మృత్యువు నందుతాడు. (23) బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, పిల్ల, పిల్లవాడు, కొడుకు, కూతురు, ఏడుస్తున్నట్లుగాని కోపంతో ఉన్నట్టుగాని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు (24) నల్లనిపూవు, నల్లనిమాల, ధాన్యము, శస్త్ర, అస్త్రధారి వికృత ఆకారంగల మేచ్ఛస్త్రీ వీరిని చూస్తే మృత్యువు నందుతాడు తప్పదు. (25) ప్రాణం పోయిన; మృతుని చూస్తే మృత్యువునందుతాడు, తప్పదు. మత్స్యాదులను ఎవడు ధరిస్తాడో వాని భౌతమరణిస్తాడు తప్పదు. (26) వాద్యము, నర్తనము, పాట పాడటము, ఎర్ర వస్త్రము, వాయిస్తున్న మృదంగం వానిని చూస్తే దుఃఖాన్నందుతాడు, తప్పదు. (27) ఛిన్నమైన శరీరాన్ని లేదా మొండెమును, వికారంగా ఉన్న వెంట్రుకలు విరియబోసుకున్న, వేగంగా నాట్యం చేస్తున్న వానిని చూస్తే నరుడు మృత్యువు నందుతాడు, (28) చచ్చినవాడైనా చచ్చినదైనా, భయానకమైన నల్లని మేచ్ఛ కలలో ఎవడిని కౌగిలించుకున్న వాడు చస్తాడు తప్పదు. (29) పండ్లు పడిపోయినట్టు, వెంట్రుకలు రాలిపోయినట్టు కలగంటే వానికి ధనహాని కలుగుతుంది. వానికి శరీరంవల్ల ఏదోపీడకల్గుతుంది. (30) కొమ్ములు గలవి, కోరలు గలవి కలలో ఇబ్బంది పెడే పిల్లలుకాని మానవులు కాని బాధిస్తే వానికి రాజకులం నుండి భయం వస్తుంది (31) విరిగిన వృక్షాన్ని, రాళ్ళ వానపడటం, ఉముక, మంగలికత్తి, ఎర్రని నిప్పుకలు, బూడిద వానవీటిని కలలో చూస్తే దుఃఖాన్ని పొందుతాడు. (32) ఇల్లు పడిపోవడం, పర్వతం పడటం, భయంకరమైన తోకచుక్కను, భుజం విరిగిన మనిషిని కలలో చూస్తే దు:ఖాన్ని పొందుతాడు. (33) రథము, ఇల్లు, పర్వతము, చెట్టు, గోవు, ఏనుగ, గుర్రము, ఆకాశము వీటినుండి భూమి పై పడుతున్నట్లు కలలో చూస్తే వాడికి ఆపద తప్పదు నిశ్చయము. (34) బూడిద, నిప్పులు గల గోయిలో పైనుండి పడ్డట్టు, కారపుకుండములందు, కారపు పొడులందు పడ్డట్టొ కలగంటే వారికి చావు తప్పదు, అనుమానం లేదు. (35) దుష్టుడు, బలవంతంగా తన తల పై నుండి ఛత్రమును తీసుకున్నట్లు కలగంటే వాని తండ్రి, కాని గురువుకాని రాజుకాని మరణిస్తారు. (36) దూడతో కూడి, భయంతో సురభి (ఆవు) ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నట్టు కలవస్తే ఆపాపి యొక్క లక్ష్మి పోతుంది, భూమిపోతుంది. (37) తాడుతో కట్టి తీసుకుపోతున్నట్టు యమదూతలు లేదా ప్లేచ్ఛులు కన్పిస్తే వానికి మృత్యువు నిశ్చయము. (38) కరణం (జోస్యుడు) బ్రాహ్మణుడు, బ్రాహ్మణి గురువు వీరు కోపించి శపించినట్లు కలవస్తే వానికి ఆపద తప్పదు. (39) శత్రువులు, కాకులు, కోళ్ళు, ఎలుగుబంట్లు, వచ్చి శరీరం పై పడ్డట్టు కలవస్తే వానికి చావు నిశ్చయము.
మూII మహిషా భల్లుకా ఉష్ట్రాః సూకరా: గర్దభాస్తథా ।
రుష్టా ధావంతి యం స్వప్నే స రోగీ నిశ్చితం భవేత్ ॥
రక్త చందనకాష్ఠాని ఘృతాక్తా ని జుహోతి యః ।
గాయత్ర్యాశ్చ సహస్రేణ తేన శాంతిర్విధీయతే ॥
సహస్రధాజ సేద్యోహి భక్త్యైవమధుసూదనం ।
నిష్పాఽపోహి భవేత్సోఽపి దుఃస్వప్నః సుఖవాన్భవేత్ ॥
అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం ।
హంసం నారాయణంచైవ హ్యేతన్నామాష్టకం శుభం ॥
శుచిః పూర్వముఖః ప్రాజ్ఞో దశకృత్వశ్చ యో జపేత్ ।
నిష్పాపోఽపి భవేత్సోఽపిదుః స్వప్నః శుభవాన్భవేత్॥
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం ।
హరిం నరహరిం రామంగోవిందం దధివామనం ॥
భక్త్యా చేమాని నామాని దశ భద్రాణి యో జపేత్ ।
శతకృత్వో భక్తి యుక్తో జప్త్వా నీరోగతాం వ్రజేత్ ॥
లక్షదా హి జపేద్యోహి బంధనాన్ముచ్యతే ధ్రువం ।
జప్త్వా దశలక్షంచ మహావంధ్యా ప్రసూయతే॥
ఔహవిష్యాశీ యతః శుద్దో దరిద్రో ధనవాన్భవేత్ ।
శతలక్షంచ జప్త్వాచ జీవన్ముక్తో భవేన్నరః ॥
ఓం నమః శివం దుర్గాం గణపతిం కార్తికేయం దినేశ్వరం ।
ధర్మం గంగాం చ తులసీం రాధాం లక్ష్మీం సరస్వతీం ॥
నామాన్యేతాని భద్రాణి జలే స్నాత్వాచ యో జపేత్ ।
వాంఛితంచ లభేత్సోఽపి దుఃస్వప్నః శుభవాన్భవేత్ ॥
ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతినాశిన్యై మహా మాయాయై స్వాహా ।
కల్పవృక్షో హి లోకానాం మంత్రః సప్తదశాక్షరః ।
శుచిశ్చ శతధా జప్త్వా దుఃస్వప్నః సుఖవాన్భవేత్ ॥
శతలక్ష జపేనైవ మంత్ర సిద్ధిర్భవేత్నృణాం ।
సిద్ధమంత్రస్తు లభతే సర్వసిద్ధించ వాంఛితాం ॥
ఓంనమో మృత్యుంజయాయేతి స్వాహాంతం లక్షధా జపేత్ ।
దృష్ట్వాచ మరణం స్వప్నే శతాయుశ్చ భవేన్నరః ॥
పూర్వోత్తరముఖో భూత్వా స్వప్నం ప్రాజ్ఞే ప్రకాశయేత్ ।
కాశ్య పే దుర్గతే నీచే దేవ బ్రాహ్మణనిందకే ।
మూర్ఖేచైవానభిక్షే చన చ స్వప్నం ప్రకాశయేత్ ॥
అశ్వత్థేగణకేవిప్రే పితృదేవాసనేషుచ ।
ఆర్యేచ వైష్ణవే మిత్రీ దివాస్వప్నం ప్రకాశయేత్ ॥
ఇతితే పుణ్యమాఖ్యాతం కథితం పాపనాశనం ।
ధన్యంయశస్య మాయుష్యం కిం భూయః శ్రోతుమిచ్చసి ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే శ్రీభగవన్నందసంవాదే ద్వ్యశీతితమోఽధ్యాయః. ॥
మహిషములు, ఎలుగుబంట్లు, ఒంటెలు, పందులు, గాడిదలు, ఇవి కోపంతో పరుగెత్తుతున్నట్లు కనిపిస్తే ఆతడు రోగగ్రస్తుడౌతాడు నిజము (41) ఎర్రచందనం కట్టెలు నేతిలో ముంచిహోమం చేస్తే గాయత్రి మంత్రంతో వేయి మార్లు హోమం చేస్తే దానిని శాంతిగా చెప్పారు. (42) భక్తితో మధుసూదనుని వేయిసార్లు జపిస్తే వాడు పాపరహితుడౌతాడు పీడకల ఫలం పోయి సుఖవంతుడౌతాడు. (43) అచ్యుతుడు, కేశవుడు, విష్ణువు, హరి, సత్యము,జనార్థనుడు, హంస, నారాయణుడు ఈ ఎనిమిది పేర్లు స్మరిస్తే శుభమౌతుంది. (44) శుచిగా తూర్పుముఖంగా, ప్రాజ్ఞుడు, పదిమార్లు జపిస్తే ఆతడు పాపరహితుడౌతాడు పీడకల, మంచిఫలాన్నే ఇస్తుంది. (45) విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, మాధవుడు, మధుసూదనుడు, హరి, నరహరి, రాముడు గోవిందుడు, దధివామనుడు (46) భద్రకరమైన ఈ పది పేర్లను భక్తితో జపించాలి. భక్తితో నూరుమార్లు జపిస్తే రోగం పోతుంది. (47) లక్షసార్లు జపిస్తే బంధనం నుండి ముక్తుడౌతాడు, నిశ్చయము. పది లక్షలమార్లు జపిస్తే మహావంధ్య కూడా సంతానం పొందుతుంది. (48) హవిష్యం తినే వాడు. ఎట్లా శుద్ధుడో అట్లా దరిద్రుడు ధనవంతుడౌతాడు. కోటిమార్లు జపిస్తే నరుడు జీవన్ముక్తుడౌతాడు. (49) ఓం నమః శివుడు, దుర్గ, గణపతి, కార్తికేయుడు, సూర్యుడు, ధర్మము, గంగ, తులసి, రాధ, లక్ష్మి, సరస్వతి, (50) ఈ పేర్లు శుభకరమైనవి. నీటిలో స్నానం చేసి వీనిని జపించినవాడు, ఆతడు తన కోరికను పొందుతాడు. చెడుకల మంచిదౌతుంది. (51) ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతి నాశినికి మహామాయకుస్వాహా. (52) పది హేడక్షరముల ఈ మంత్రము లోకములకు కల్పవృక్షము వంటిది. శుచిగా పదిసార్లు జపిస్తే దుఃస్వప్నంకలవాడు సుఖవంతుడౌతాడు. (53) నూరు లక్షల జపంతో నరులకు మంత్రము సిద్ధిస్తుంది. మంత్రసిద్దిపొందినవాడు వాంఛితమైన సర్వసిద్ధిని పొందుతాడు. (54) ఓం నమోమృత్యుంజయాయ అని స్వాహాంతంతో ఈ మంత్రాన్ని లక్షసార్లు జపించాలి. కలలో మరణాన్ని చూచినవాడు కూడా నరుడు నూరు సంవత్సరాల ఆయుర్దాయం కలవాడౌతాడు. (55) పూర్వ ముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చోని స్వప్నమును గూర్చి ప్రాజ్ఞునకు చెప్పాలి. తాగినవాడు లేదా మాంసం తినేవాడు (కాశ్యపం) దుర్గతుడు, నీచుడు, దేవబ్రాహ్మణ నిందకుడు మూర్ఖుడు, అనభిజ్ఞుడు వీరికికలను చెప్పరాదు. (56) అశ్వత్థము, జ్యోతిషుడు, విప్రుడు, పితృదేవ ఆసనములు, ఆర్యుడు, వైష్ణవుడు, మిత్రుడు, వీరికి పగటి కలగూర్చి చెప్పాలి (57) అని పాపనాశనమైన, పుణ్యకరమైన కథను నీకు చెప్పాను. ఇది విన్నవారు ధన్యులు. కీర్తికరము ఆయుష్కారకమిది. ఇంకా ఏం వినదలిచావు (58) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీ భగవంతుడు, నందుడు వీరి సంవాదంలో ఎనుబది రెండవ అధ్యాయము.
Summary of chapter 82 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Recalling a confidential dialogue on Mount Kailāsa, Maharshi Nārada shared the profound teachings imparted to him by Lord Śiva regarding the path of Krishna-Bhakti. Lord Śiva explained that among all forms of worship, the worship of Lord Śrī Vishṇu and His pure devotees is the supreme highest. Lord Śiva revealed that He Himself constantly meditates upon the lotus feet of Śrī Kṛshṇa and chants His holy names day and night, demonstrating that true knowledge culminates in humble devotional surrender to the Supreme Lord.