119 - అధ్యాయము

మూ ॥ నారాయణ ఉవాచ :

పార్వతీ వచనంశ్రుత్వా గణేశశ్చ శివః స్వయం ।

కార్తికేయశ్చకాలీచతాం ప్రశంసాంచకరహ ॥

ఉవాచ భగవాన్ శంభుః జగతాం మాతరం పరాం ।

జ్యోతి స్వరూపాం పరమాం మూలప్రకృతిమీశ్వరీం ॥

శ్రీమహాదేవ ఉవాచ :

త్వయాయదుర్గం దేవేశిసర్వం వేదోక్తమీప్సితం ।

అయుక్త ముపహాస్యంచ సమరం పరమాత్మనా ॥

బాణోదదాతుకన్యాంతాం స్వర్ణభూషణభూషితాం ।

సామంజస్యం యశస్యంచ శుభదంసర్వకర్మసు ॥

నదదాతియదాబాణో హిరణ్యకశిపోఃప్రజా !

యుద్ధే పరాజ్ ముఖోభీతో భగవత్యయశస్కరః ॥

బాణోగచ్ఛతుసన్నాహీరణశాస్త్ర విశారదః ।

పశ్చాచ్చాగమనం కుర్మోవయం సాన్నాహికాః శివే ॥

ఉవాచ బాణంతాందాతుంసచ న స్వీచకారహ ।

దుర్గాతం బోధయామాస నబుబోధచ మద్వచః ॥

ఏతస్మిన్నంతరేతాంచ సభామేవమనోరమాం ।

ఆజగామ మహాధర్మోబలిశ్చ వైష్ణవాగ్రణీః ॥

రథం రథేంద్ర నిర్మాణం సమారుహ్య మహాబలః ।

ప్రతతైః సప్తభిద్దెత్యేః సేవితః శ్వేతచామరైః ॥

దైత్యేంద్రాణాం సప్తలకై ఆవృతః పరమాస్త్రవిత్ ।

అవరుహ్యరథాత్తూర్ణం గణేశంచ శివాంశివం ॥

ప్రణమ్యకార్తికేయంచస ఉవాస చ సంసది ।

ఉత్తస్థు రారాత్తం దృష్ట్వాతే సర్వేశంకరం వినా

తమువాచ మహాదేవః సంభాష్య ప్రియభాషణం ॥

శ్రీమహాదేవ ఉవాచ :

భగవంశ్చతురస్త్వంచ ప్రదాతా సర్వసంపదాం ॥

అయంహిపరమో లాభోవైష్ణవానాం సమాగమః ।

తీర్థాన్యపీచపూతాని వైష్ణవస్పర్శ మాత్రతః ॥

సర్వేషామాశ్రమాణాంచ పూజితో బ్రాహ్మణః శుచిః।

తతో ఆధికః పూజితోఆపిబ్రాహ్మణో యదివైష్ణవః ॥

నహిపూతంచ పశ్యామి వైష్ణవ బ్రాహ్మణాత్సరం ।

సపూతః పవనాదేవ సపూతశ్చహుతాశనాత్ ॥

అను ॥ నారాయణుడిట్లా - పార్వతి మాటనువిని గణేశుడు, శివుడు, కార్తికేయుడు, కాళి వీరలు ఆమెను ప్రశంసించారు. (1) భగవాన్ శంభుడు, పరురాలు జగత్తునకు మాతయైనది, జ్యోతి స్వరూపురాలు, పరమమైన మూలప్రకృతి, ఈశ్వరితో ఇట్లన్నాడు. (2) శ్రీమహాదేవుడిట్లా - ఓదేవేశ! నీవేది చెప్పావో అదంతా వేదోక్తమైనది, కోరతగినది. పరమాత్మతో సమరము, అయుక్తము, నవ్వతగినది. (3) సర్వభూషణములతో అలంకరింపబడ్డ ఆ కన్యకను బాణుడు ఇవ్వాలి. అది సమంజసము. కీర్తికరము, శుభాన్నిచ్చేది అని కర్మలలో (4) బాణుడు ఇవ్వకపోతే హిరణ్యకశిపుని సంతానము బాణుడు యుద్ధంలో పరాజ్ ముఖుడై, భయపడిపోతాడు. ఇది అపకీర్తికరము, ఓభగవతి! (5) రణశాస్త్ర విశారదుడైన బాణుడు సన్నద్ధుడై వెళ్ళని. ఓశివ! (పార్వతి) మేము బాణధారులము తరువాత తిరిగి వచ్చేట్లు చేస్తాము. (6) ఆమెను ఇవ్వమని బాణునితో చెప్పాము. కాని ఆతడు స్వీకరించలేదు. దుర్గ ఆతనికి బోధించింది. కాని ఆ మంచి మాటలను తెలుసుకోలేదు. (7) ఇంతలో ఈమనోరమమైన సభకే మహాధర్ముడు, వైష్ణవాగ్రణి, ఐన బలి వచ్చాడు. (8) వజ్రములతో నిర్మింపబడ్డ రథాన్ని ఎక్కి మహాబలుడు ఏడుగురు దైత్యులతో చుట్టబడి శ్వేతచామరములతో సేవింపబడుతూ (9) ఏడు లక్షల దైత్యేంద్రులు ఆవరించగా పరమ అస్త్రములను ఎరిగినవాడు వచ్చి, రథమునుండి వేగంగా దిగివచ్చి, గణేశునకు, పార్వతికి, శివునకు (10) కార్తికేయునకు నమస్కరించి ఆతడు సభలో కూర్చున్నాడు. ఆతనిని దూరం నుండే చూచి శంకరుడు తప్ప మిగిలిన వారంతా లేని నిలుచున్నారు. మహాదేవుడు ప్రియభాషణము చేసి, ఆతనితో అన్నాడు. (11) శ్రీమహాదేవుడిట్లా - భగవాన్! నీవు చతురుడవు. సర్వసంపదలనిచ్చేవాడివి. (12) వైష్ణవుల సమాగమమిది గొప్పలాభకారి. వైష్ణవుని స్పర్శ మాత్రముతో తీర్థములు కూడా పవిత్రమౌతాయి. (13) అన్ని ఆశ్రమములందు శుచియైనవాడు, బ్రాహ్మణుడు పూజితుడు. ఒకవేళ ఆ బ్రాహ్మణుడు వైష్ణవ మతస్థుడైతే అధికంగా పూజింపతగివాడు. (14) వైష్ణవుడైన బ్రాహ్మణుని కన్న పవిత్రమైనది లేదు. ఆతడు గాలికన్న పవిత్రుడు. అగ్నికన్న పవిత్రుడు. (15)

మూII తీర్థేభ్యో పిచ సర్వేభ్యోబిఖేతిచతతో అసుర ।

నహిపాపానితద్దేహో వహ్నౌ శుష్కతృణాదివత్ ॥

బలిరువాచ :

కథంస్తౌషి జగన్నాథభృత్యస్తవ మహేశ్వర ।

ప్రదత్తం పరమైశ్వర్యం త్వయానాథ సుదుర్లభం II

అధునాస్థాపితోదైవాత్ సర్వాధః సుతలేపిచ ।

ఇంద్రాయ దత్తమైశ్వర్యం మత్తేభక్తత్సు రేశ్వర ॥

త్వయావామనరూ పేణ సర్వరూపోసి సర్వతః ।

బాణంబోధయ భద్రంచ మమప్రాణాత్మజం పరం ॥

ఆత్మనాసహయుద్ధంచ దేవేష్వపివిగర్హి తం ।

ఇత్యుక్త్యాచ శివంనత్వాశిరసా ప్రణనామ తం ॥

సామవేదోక్త స్తోత్రేణ తుష్టావ పరమేశ్వరం ।

పులకాంచిత సర్వాంగః సామ్రనేత్రోతి విహ్వలః ॥

ధ్యాయమానశ్చ నిత్యంయో హృత్పద్మే సుమనోహరః ।

శుక్రేణ దత్తంమంత్రంచ జప్త్వానైకాదశాక్షరం ॥

బలిరువాచ :

ఆదిత్యాః ప్రార్థనేనైవ మాతుర్దేవ్యావ్రతేనచ ।

పురావామన రూపేణ త్వయాజహం వంచితప్రభో ॥

సంపద్రూపా మహాలక్ష్మీః దత్తా భక్తాయభక్తితః ।

శక్రాయమత్తో భక్తాయభ్రాత్రేపుణ్యవతే ధ్రువం ॥

అధునా మమపుత్రోయం బాణః శంకరకింకరః ।

ఆరాచ్చరక్షితః సోఆపితేనైవభక్త బంధునా ॥

పరిపుష్టశ్చ పార్వత్యా యథామాత్రాసుతస్తథా ।

గృహీతవాంశ్చతత్కన్యాం బలేన యువతీం సతీం ॥

సముద్యతశ్చతం హంతుం కార్తి కేనాపి వారితః ।

ఆగతోసి పునర్ఘ ర్తుం పౌత్రస్యదమనే క్షమః ॥

సర్వాత్మనశ్చ సర్వత్ర సమభావః శ్రుతాశ్రుతః ।

కరోషి జగతాం నాథకథమేవం వ్యతిక్రమః ॥

త్వయాచ నిహతోయోహితస్యకో రక్షితా భువి ।

సుదర్శనస్యతేజోహి సూర్యకోటి నిభంపరం II

కేషాం సురాణమస్తేణ తదేవ మనివారితం ।

యథాసుదర్శనం చైవ మస్త్రాణాం ప్రవరం వరం ॥

ఓఅసుర! సర్వతీర్ధములకంటెను ఆతని నుండి భయపడుతాను. ఆతని దేహంలో పాపాలు వహ్నిలో ఎండిన గడ్డిపోచలు మొదలగువానివలె బూడిదౌతాయి.(16) బలిఇట్లా - ఓ జగన్నాథ! మహేశ్వర! నేను నీభృత్యుణ్ణి, ఎట్లా స్తుతిస్తున్నావు. ఓనాథ! నీవిచ్చిన పరమ ఐశ్వర్యము చాలా దుర్లభమైనది. (17) దైవంవల్ల ఈవేళ అన్నింటికన్న క్రింద సుతలంలో ఉంచబడ్డాను. ఓసురేశ్వర! భక్తుడనైన నానుండి ఐశ్వర్యాన్ని తీసి ఇంద్రునికిచ్చావు. (18) నీవు వామనరూపంలో ఇట్లా చేశావు. అంతట అన్ని రూపాల్లో ఉన్నావు. నాప్రాణము, ఆత్మజుడు, ముఖ్యుడు ఐన. బాణునకు మంచి బోధించు. (19) ఆత్మతో సహా యుద్దము దేవతలందును నిందించతగినది. అని పలికి, శివునకు నమస్కరించాడు, ఆ శివునకు శిరస్సువంచి నమస్కరించాడు. (20) సామవేదంలో చెప్పబడ్డ స్తోత్రంతో పరమేశ్వరుని స్తుతించాడు. ఆతని శరీరం అంతా పులకలతో నిండిపోయింది. కళ్ళవెంట కన్నీళ్ళొచ్చాయి. చాలా చంచలంగా ఉన్నాడు. (21) ప్రతిరోజు హృదయ పద్మంలో ధ్యానించగా, మనోహరంగా ఉండేవాడు. శుక్రుడిచ్చిన మంత్రాన్ని జపించి, ఏకాదశాక్షరిని జపించి ఉండేవాడు. (22) బలి ఇట్లా - అదితి ప్రార్ధనతో, మాతయైన దేవివ్రతంతో ఇదివరలో వామనరూపంలో నీవు నన్ను వంచించావు, ఓ ప్రభు! (23) సంపద రూపమైన మహాలక్ష్మిని భక్తునకు భక్తితో ఇచ్చావు. నాకంటే భక్తుడైన ఇంద్రునకు నాభ్రతకు, పుణ్యవంతునకు ఇచ్చావు, నిశ్చయము. (24) ఇప్పుడు వీడు నా పుత్రుడు. బాణుడు శంకరుని సేవకుడు. ఆభక్త బంధుత్వంతోనే దూరం నుండి ఆతనిని రక్షించావు. (25) తల్లితో సుతుడువలె పార్వతితో ఈతడు పరిపుష్టుడయ్యాడు. యువతి, సతి, ఐన ఆతని కన్యను బలవంతంగా గ్రహించావు. (26) కార్తికుడు వారించినా వాడిని చంపటానికి సిద్దమైనావు. పౌత్రుని దమనమందు సమర్థుడవై తిరిగి చంపటానికి వచ్చావు. (27) సర్వాత్ముడవు, అంతటా సమానమైన భావనగల వాడివని వేదములలో విన్నాము. ఓ జగన్నాథ! ఇట్లా వ్యతిక్రమము ఎందుకు చేస్తున్నావు. (28) నీతో చంపబడేవాడికి లోకంలో రక్షకుడెవ్వడు. సుదర్శనము యొక్క తేజము కోటిసూర్యుల కాంతిగలది, పరమైనది. (29) సురల యొక్క ఎవ్వని అస్త్రముతోను, అది ఇట్లా నివారింపబడేదికాదు. ఆసుదర్శనాస్త్రము అట్టిది. అస్త్రములలో శ్రేష్ఠమైనది, ఇష్టమైనది. (30)

మూ॥ తథాభవాంశ్చదేవానాంసర్వేషా మీశ్వరః పరః ।

యథా భవాంస్తథాకృష్ణో విధాతా వేధసామపి II

విష్ణుః సత్వగుణాధారః శివః సత్యాశ్రయస్తథా ।

స్వయం విధాతారజసః సృష్టికర్తాపితామహః ॥

కాలాగ్నిరుద్రోభగవాన్ విశ్వసంహార కారకః ।

తమసశ్చాశ్రయఃస్కోపిరుద్రాణాం ప్రవరోమహాన్ ॥

స ఏవశంకరాంశశ్చాప్యన్యే రుద్రాశ్చతత్కలాః ।

భవాంశ్చనిర్గుణ స్తేషాం ప్రకృతేశ్చపరస్తథా ॥

సర్వేషాం పరమాత్మావై ప్రాణావిశ్వస్వరూపిణః ।

మానసంచ స్వయం బ్రహ్మ స్వయం జ్ఞానాత్మకః శివః ॥

ప్రవరాసర్వశక్తీనాం బుద్ధి: ప్రకృతిరీశ్వరీ ।

స్వాత్మనః ప్రతిబింబస్తే జీవః సర్వేషుదేహిషు ॥

జీవః స్వకర్మణాం భోగీస్వయంసాక్షీభవాంస్తథా ।

సర్వేయాంతిత్వయిగతే నరదేవే యథానుగాః ॥

సద్యః పతతిదేహశ్చ శవో స్పృశ్యస్త్వయా వినా ।

బుద్ధాః సంతోనజానంతి వంచితాస్తవమాయయా ॥

త్వాంభజంత్యేవ యే సంతో మాయామేతాం తరంతితే । త్రిగుణాప్రకృతిర్దుర్గావైష్ణవీచసనాతనీ ॥

పరాకారాయ ణీశానీ తమాయాదురత్యయా ।

త్వదంశాః ప్రతివిశ్వేషు బ్రహ్మవిష్ణు శివాత్మకాః ॥

సర్వేషామపి విశ్వేషాం ఆశ్రయో యోమహాన్ విరాట్ ।

సశేతే చజలే యోగాత్ విశేషాం గోకులే యథా ॥

స ఏవవాసురగవాన్ తస్యదేవోభవాన్ పరః ఠ।

వాసుదేవ ఇతిఖ్యాతః పురావిద్భిః ప్రకీర్తితః ॥

త్వమేవకలయాసూర్యః త్వమేవకలయాశశీ ।

కలయాచహుతాశశ్చకలయా పవనః స్వయం ॥

కలయావరుణశ్చైవ కుబేరశ్చయమస్తథా ।

కలయత్వం మహేంద్రశ్చ కలయాధర్మ ఏవచ ॥

త్వమేవ కలయాశేషః ఈశానోనైఋతిస్తథా ।

మునయోమనవశ్చైవ గ్రహాశ్చ ఫలదాయకాః ॥

కలాకలాయాశ్చాంశేన సర్వేజీవాశ్చరాచరాః ।

త్వంబ్రహ్మపరంజ్యోతిఃధ్యాయంతే యోగినః పదా II

అను II అట్లాగే నీవు దేవతలందరికి ఈశ్వరుడు, పరుడవు, నీవెట్లాగో కృష్ణుడట్లాగే బ్రహ్మలకు బ్రహ్మ. (31) విష్ణువు సత్వగుణమునకు ఆధారము. శివుడు మంగళుడు సత్వమునాశ్రయించినవాడు, విధాత, సృష్టికర్త పితామహుడు స్వయంగా రజోగుణమునకు ఆధారము. (32) కాలాగ్ని స్వరూపుడు రుద్రుడు భగవాన్ విశ్వసంహారానికి కారకుడు తమస్సున కాశ్రయమైనవాడు. ఆతడు కూడా రుద్రులకు శ్రేష్ఠుడు గొప్పవాడు. (33) ఆతడే శంకరాంశ. ఇతర రుద్రులు ఆతని కళలే. నీవు నిర్గుణుడవు. వారికి ప్రకృతికి పరుడవు. (34) విశ్వస్వరూపులైన అందరికి పరమాత్మప్రాణము. బ్రహ్మ మానసము. శివుడు జ్ఞానాత్మకుడు. (35) శ్రేష్ఠురాలు అన్ని శక్తులకు, బుద్ది, ఈశ్వరి ప్రకృతి. అన్ని దేహములు కలవారి యందుకలజీవుడు, నీ ఆత్మకు ప్రతిబింబము. (36) జీవుడు తన కర్మఫలాన్ని అనుభవించేవాడు. నీవు స్వయంగా సాక్షివి. నీవుపోతే అందరూ పోతారు, రాజు వెంట ఆతని అనుచరులలాగ (37) నీవు లేక పోతే దేహముపడిపోతుంది. శవము, అస్పృశ్యము, తెలిసిన సజ్జనులు తెలుసుకోలేకపోతున్నారు. నీ మాయతో మోసగింపబడ్డారు. (38) నిన్ను భజించే సజ్జనులు, వారు ఈమాయను తరిస్తారు. ప్రకృతి మూడురకాలు, దుర్గ, వైష్ణవి, సనాతని అని. (39) నారాయణి వీరికన్న పరమైనది, ఓ ఈశానీ నీమాయదాటరానిది. ప్రతి విశ్వము లందు బ్రహ్మవిష్ణు శివాత్మకులు నీ అంశమే. (40) విశ్వములకన్నిటికి ఆశ్రయుడు ఆమహావిరాట్టు ఐనవాడు విశ్వేశుడు, యోగంతో నీటియందు పడుకుంటాడు, గోకులంలో పడుకున్నట్టు (41) ఆతడే వాసువు అనే భగవంతుడు. ఆతని దేవుడవు నీవు పరుడవు. వాసుదేవుడు అని ఖ్యాతినందాడు. తెలిసిన ప్రాచీలు చెబుతారు. (42) కలతో (భాగం) నీవే సూర్యుడివి. కళతో నీవే చంద్రుడివి. కళతో అగ్నివి. కళతో వాయువువు. (43) కళతో వరుణుడవు, కుబేరుడవు, యముడవు. కలతో నీవు మ హేంద్రుడవు, కళతో ధర్ముడవు (44) నీవే కళతో శ్రేష్టుడవు, ఈశానుడవు, నైఋతివి. మునులు, మనువులు, గ్రహములు వీరంతా ఫలమిచ్చేవారు. (45) కళ, కళ యొక్క అంశభాగంతోనే చరాచరజీవులంతా, నీవు బ్రహ్మవు. పరమజ్యోతివి. యోగులు ఎల్లప్పుడు ధ్యానిస్తుంటారు. (46)

మూII తంత్వాద్రియంతే భక్తా స్తే ధ్యాయంతేచ తదంతరే ।

నవీన నీరదశ్యామం పీతకౌశేయ వాససం ॥

ఈషదాస్య ప్రసన్నాస్యం భక్తీశం భక్త వత్సలం ।

చందనోక్షిత సర్వాంగం ద్విభుజం మురళీధరం ॥

మయూరపింఛచూడంచ మాలతీ మాల్యభూషితం ।

అమూల్యరత్న నిర్మాణకేయూర వలయాన్వితం ॥

మణికుండల యుగ్మేన గండస్థల విరాజితం ।

రత్నసారాంగుళీయంచ క్వణన్మంజీర రంజితం ॥

 కోటికందర్పలీలాభం శరత్కమలలోచనం ।

శరత్పూర్ణేందు నిందాస్యం చంద్రకోటి సమప్రభం !!

వీక్షితం సస్మితాభిశ్చ గోపీనాం కోటికోటిభిః ।

వయ స్యైః పార్షదైః గోపైః సేవితం శ్వేతచామరైః ॥

గోపబాలకవేషంచ రాధావక్షః స్థలస్థితం ।

ధ్యానాసాధ్యం దురారాధ్యం బ్రహ్మేశశేష వందితం ।

సిద్దేందైశ్చ మునీంద్రాంశ్చ యోగీంద్రైః ప్రణతస్తుతం ।

వేదానిర్వచనీయంచ పరం స్వేచ్చామయం విభుం ॥

స్థూలాత్స్థూలతమం రూపం సూక్ష్మాతి సూక్ష్మతరం పరం ।

సత్యం నిత్యం ప్రశస్తంచ ప్రకృతేః పరమీశ్వరం ॥

నిర్లిప్తంచ నిరీహంచ భగవంతం సనాతనం ।

ఏవంధ్యత్వాచతేపూతాః స్నిగ్ధదూర్వాక్షతాజలం II

పద్మాపద్మార్చితే పాదపద్మేచ దాతుముత్సుకాః ।

వేదాః స్తోతుమశక్తాస్యాం అశక్తాసా సరస్వతీ ॥

శేషః స్తోతుమశక్తశ్చ స్వయంభూః శంభురీశ్వరం ।

గణేశశ్చదినేశశ్చ మహేంద్రశ్చంద్ర ఏవచ ॥

స్తోతుంనాలంధనేశశ్చ కిమన్యే జడబుద్ధయః ।

గుణాతీతమనీహంచ కింస్తామి నిర్గుణంపరం II

అపండిత్య మసురో న సురః క్షంతు మర్హతి

బలేస్తువచనం శ్రుత్వాతమువాచ జగత్పతిః ।

పరిపూర్ణతమః శ్రీమాన్ భక్తంచ భక్తవత్సలం ॥

నీభక్తులు ఆతనిని ఆదరిస్తున్నారు. అతనిని అంతరంలో ధ్యానిస్తున్నారు. వర్షాకాల మేఘంవలె శ్యాముడు, పచ్చని పట్టుబట్ట వస్త్రంగా గలవాడు. (47) కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు, భక్తులకు ఈశుడు, భక్తుల పై వాత్సల్యం కలవాడు, ఒంటి నిండా చందనం పూసుకున్నవాడు, రెండు చేతులవాడు, మురళీధరుడు, (48) నెమిలి ఫించము తల పై గలవాడు, మాలతి మాలతో అలంకరింపబడినవాడు. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ కేయూర, వలయాభరణములు కలవాడు (49) మణులతో చేసిన రెండు కుండలములు చెక్కిళ్ళ పై ప్రకాశిస్తున్నాయి. వజ్రముల ఉంగరము, శబ్దిస్తున్న కాలి అందెలు వీనితో ప్రకాశిస్తున్నాడు. (50) కోటి మన్మథుల లీలవంటి కాంతిగలవాడు, శరత్కాల పూర్ణచంద్రుని నిందించే ముఖం కలవాడు, కోటి చంద్రులతో సమానమైన కాంతిగలవాడు. (51) గోపికలు కోట్ల కోట్లకొలది చిరునవ్వునవ్వుతూ చూస్తున్నారాయనను. వయస్యులు, పక్కనున్న గోపాలురు తెల్లని చామరలతో సేవిస్తున్నారు. (52) గోపలబాలుని వేషంలో ఉన్నాడు. రాధవక్షఃస్థలమందున్నాడు. ధ్యానమునకు సాధ్యంకాడు, ఆరాధించుటకు కష్టమైనవాడు. బ్రహ్మ ఈశ, శేషులతో నమస్కరింపబడేవాడు. (53) సిద్దేంద్రులు, మునీంద్రులు, యోగీంద్రులు వీరంతా నమస్కరిస్తూ స్తుతిస్తారు. వేదములచే నిర్వచింపరానివాడు, పరుడు స్వేచ్ఛామయుడు, విభువు. (54) స్థూలముకన్న స్టూలతమమైన రూపము, సూక్ష్మముకన్న సూక్ష్మతర రూపం కలవాడు, పరుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, ప్రశస్తుడు. ప్రకృతికన్నపరుడు, ఈశ్వరుడు. (55) నిర్లిప్తుడు, నిరీహుడు, భగవంతుడు, సనాతనుడు. ఇట్లా ధ్యానించి వారంతా పవిత్రులైనారు. మృదువైన దూర్వ అక్షతలు, జలముతో ధ్యానించారు. (56) లక్ష్మిపద్మములతో అర్చించిన పాదపద్మమందు దూర్వ అక్షతలు ఉంచుటకు ఇచ్చగించారు. నిన్ను వేదములు స్తుతించుటకు అశక్తములు. ఆసరస్వతి అశక్తురాలు. (57) శేషుడు స్తుతించుటకు అశక్తుడు. స్వయంభువు, శంభుడు, ఈశ్వరునిస్తుతించలేరు. గణేశుడు, దినేశుడు, మహేంద్రుడు కూడా స్తుతించలేరు. (58) కుబేరుడు స్తుతించలేడు. జడబుధులైన ఇతరుల గూర్చి చెప్పేదేముంది. గుణాతీతుడు, కోరికలు లేనివాడు, పరుడు నిరుణుడు, ఆతనిని ఏం స్తుతిస్తాను. (59) ఈ అసురుడు అపండితుడు. సురుడు (దేవత) కాడు. క్షమించతగినవాడు బలిమాటను విని జగత్పతి అతనితో అన్నాడు. శ్రీమాన్,పరిపూర్ణతముడు, భక్తవత్సలుడు, ఆతడు భక్తునితో. (60)

మూII శ్రీభగవానువాచ :

మాభైర్వత్సగృహంగచ్ఛసుతలం రక్షితం మయా ॥

మద్వరేణ ప్రసాదేన త్వత్పుత్రోప్యజరామరః  I

దర్పహానిం కరిష్యామితస్య మూర్ఖస్య దర్సిణః ॥

ప్రహ్లాదాయవరోదతో భక్తాయచ తపస్వినే ।

మయావధ్యశ్చత్వ ద్వంశశ్చేతి ప్రీతేన చేతసా ॥

తవపుత్రాయదాస్యామిజ్ఞానం మృత్యుంజయం పరం ।

త్వయాకృత మిదం స్తోత్రం సామవేదోక్తమీప్సితం ॥

పురాసనత్కుమారాయప్రదత్తం బ్రహ్మణాతథా ।

సిద్ధాశ్రమే పుణ్యతమే ప్రశస్తే సూర్యపర్వణి ॥

గౌతమాయ ప్రదత్తంచ గౌర్యామందాకినీతటే ।

శంకరేణచ శిష్యాయ భక్తాయచ దయాలునా ॥

బ్రహ్మణేచమయాదత్తం శివాయ విరజాతటే ।

భృగవేత పురాదత్తం కుమారేణచ ధీమతా ॥

త్వంచ దాస్యామి బాణాయ బాణః స్తోష్యత్యమేనమాం ।

ఇదంస్తోత్రం మహాపుణ్యం ఉందిశ్యగురోర్ముఖాత్ ॥

వృత్తస్య పూజితస్యాపి వస్త్రభూషణచందనైః ।

సుస్నాతో యః పఠేన్నిత్యం పూజాకాలేచభక్తితః ॥

కోటిజన్మార్జితాత్ పాపాత్ ముచ్యతే నాత్రసంశయః ।

విపదాంఖండనం స్తోత్రం కారణం సర్వసంపదాం ॥

వారణందుఃఖశోకానాం భవాబ్ధఘోరతారణం ।

ఖండనం గర్భవాసానాం జరామృత్యుహరం పరం ॥

బంధనానాంచరోగాణాం ఖండనం భక్తమండనం ।

సస్నాతః సర్వతేర్ణేషు సర్వయజ్ఞేషుదీక్షితః ॥

ప్రతివ్రతేషు సర్వేషు తపస్వీచతపఃసుచ ।

ససత్యం సర్వదానానాంఫలంచ లభతే, ధ్రువం ॥

లక్షధా స్తోత్రపాలేన స్తోత్రసిద్ధిర్భవేన్నృణాం ।

సర్వం సిద్ధంచ లభతే సిద్ధస్తోత్రోభవేద్యది II

ఇహలోకే దేవతుల్యో ప్యంతే యాతిహరేః పదం ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణే శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే బాణయుద్ధే బలికృత శ్రీకృష్ణస్తోత్రం నామ ఏకోనవింశతితమోధ్యా యః ॥

అను । భగవానుడిట్లా –

భయపడకు, ఓవత్స! ఇంటికి వెళ్ళు. నేను సుతలాన్ని రక్షించాను. (61) నా ప్రసాదంతో, వరంతోనీపుత్రుడు అజరామరుడౌతాడు. మూర్ఖుడు, దర్పంగల ఆతనికి దర్పహాని చేస్తాను. (62) భక్తుడు, తపస్విఐన ప్రహ్లాదునకు వరమిచ్చాను. సంతోషమైన మనస్సుతో అన్నాను. నీ వంశము వారిని నేనుచంపను అని. (63) నీ పుత్రునకు మృత్యుంజయమైన పరమైన జ్ఞానాన్ని ఇస్తాను. నీవు చేసిన ఈస్తోత్రము సామవేదమందు చెప్పబడినది. ఇష్టమైనది. (64) ఇదివరలో సనత్కుమారునకు బ్రహ్మ ఇచ్చాడు. పుణ్యతమమైన సిద్ధాశ్రమమందు, ప్రశస్తమైన సూర్యపర్వమందు ఇచ్చాడు. (65) గౌరి మందాకిని ఒడ్డుయందు గౌతమునకు ఇచ్చింది. శంకరుడు, శిష్యునకు భక్తునకు దయాళువై ఇచ్చాడు. (66) విరజాతటమందు శివునకు బ్రహ్మకునేనిచ్చాను, ధీమంతుడైన కుమారుడు (స్వామి) భృగువునకు ఇదివరలో ఇచ్చాడు. (67) బాణునకు నీకు ఇస్తున్నాను. బాణుడు దీనితో నన్ను స్తుతిస్తాడు. ఈస్తోత్రము మహాపుణ్యమైనది. గురుముఖం నుండి ఉపదేశం పొంది (68) ఎన్నుకొనబడి, వస్త్రచందనభూషణములతో పూజింపబడిన వానికి మహాపుణ్యము. స్నానం చేసి రోజు చదివేవాడు. పూజాకాలంలో భక్తితో చదివేవాడు. (69) కోటిజన్మలలో వచ్చిన పాపంనుండి ముక్తుడౌతాడు. ఇందులో అనుమానం లేదు. స్తోత్రము ఆపత్తులను ఖండిస్తుంది. అన్ని సంపదలకు కారణము (70) దుఃఖశోకములను నివారిస్తుంది, భవసాగరంనుండి ఘోరమైన దానినుండి దాటిస్తుంది. గర్భవాసాన్ని ఖండిస్తుంది. జర, మృత్యువులను హరిస్తుంది. పరమైనది. (71) బంధనములు,రోగములు వీటిని ఖండిస్తుంది. భక్తులకు అలంకారము. దీనిని పఠించినవాడు అన్ని తీర్థములలో స్నానం చేసినట్టు, అన్ని యజ్ఞములలో దీక్షితుడైనట్లు (72) అన్ని వ్రతములలో వ్రతమాచరించినవాడు, తపస్సుచేసిన వారిలో తపస్వి. అన్నిదానముల ఫలం పొందుతారు. అదే సత్యము. (73) లక్షసార్లు స్తోత్రం పఠిస్తే నరులకు స్తోత్ర సిద్ధిఔతుంది. అన్ని సిద్ధులను పొందుతాడు, ఒకవేళ స్తోత్రం సిద్ధించిన వాడైతే (74) ఈలోకంలో దేవతలతుల్యుడు. చివర హరిస్థానానికి పోతాడు. (75)

అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమందు బలిచేసిన శ్రీకృష్ణ స్తోత్ర మనునది నూట పందొమ్మిదవ అధ్యాయము.