శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లు పలికెను :
వసిష్ఠస్య వచః శ్రుత్వా నగణోపి హిమాలయః ।
విస్మితో భార్యయా సార్ధం జహాస పార్వతీ స్వయం ॥
అరుంధతీ చ తాం మేం బోధయామాన కాతరాం ।
నిరాహారాం రుదంతీం తార జహా శోకం ముదా చ సా ॥
అరుంధతీం భోజయిత్వా బుభుజే భోగముత్తమం ।
సర్వం ప్రహృష్ణ మనసా మంగలం చ చకార హ ॥
తతః సంభృత సంభారో వసిష్ఠస్యాజ్ఞయా ప్రియే ।
పత్రం ప్రస్థాపయామాస నాసస్థానం త్వరాన్వితః ॥
తతః ప్రస్తావయామాస శివం మంగల పత్రికాం ।
నానా ప్రకార ద్రవ్యాణి బాహ్యాని చ చకార హ ॥
తండులానాం చ శైలాన్యై పృథుకొనాం చ సుందరి।
తైలానాం చ ఘృతానాం చ దధ్నాం వాపేశ్చకార హ ॥
గుడానామానవానాం చ క్షీరాణాం చ తథైవ చ ।
అధో హైయంగవీనాసాం లవణానాం పరం మునే ॥
లడ్డుకాణాం శర్కరాణాం స్వస్తికానాం తథైవ చ ।
యవచూర్ణాది పిష్టానాం మృతపక్వాని తాని చ ॥
నానా ప్రకార వస్రాణి వహ్ని శౌచాని యావి చ ।
మహారత్న ప్రపోళానీ సువర్ణ రజతాని చ॥
ద్రవ్యాణ్యేతాని శైలేంద్రః కృత్వా తు విధిపూర్వకం ।
మంగలం కర్తుమారేభే తదైవ మంగలే దినే॥
ఓ ప్రియరాధా! తన బంధువులతో కూడి హిమవంతుడిట్లు వసిష్టుడు చెప్పిన మాటలు విని భార్యయును అతడును ఆశ్చర్యపడిరి. పార్వతీదేవి నవ్వెను. తన కూతురును శివునకిచ్చుట కంగీకరించని-మేనాదేవి భయముతో ఉపవాసముతో రోదించుచుండగా ఆరుంధతీదేవి ఆమెకు వరుడైన శివుని మహిమను చెప్పి శాంతపరచెను. మేనాదేవి సంతసించి శోకము త్యజించెను. ఉత్తమ భోగ పదార్థమును అరుంధతికి తీనబెట్టి తానును భుజించెను. మిక్కిలి వారముతో అన్ని మంగళకార్యములను చేసెను. వసిష్టుని ఆజ్ఞననుసరించి హిమవంతుడు వివాహ సామగ్రిని సమకూర్చి త్వరగా అన్ని ప్రదేశములకు వివాహాహ్వాన పత్రికలను పంపించెను. శివునకు గూడ శుభలేఖను పంపించేను. నానావిధములైన పదార్థములను బయటినుండి సేకరించవలసిన వానినీ సంపాదించెను. ఓ సుందరీ! పర్వతముల వలె బియ్యపురాసులను అటుకుల రాసులను నూనె నెయ్యి పెరుగు పాలు ఫలరసములు దిగుడు బావుల (వంటి పాత్రలలో) లో సిద్ధపరపించెను. వెన్న ఉప్పు బెల్లము రాసులుగా - శర్కరతో చేసిన లడ్డూలు స్వస్తికపు ఆకారములో నున్న పిండి వంటకములు నేతిలో గోలించి ఉంచెను. బియ్యపు పిండి మొదలైన రకరకములు చూర్ణములు - అగ్ని పర్ణము కలిగి కొన్ని అగ్ని వేడి చేత శుద్ధమైనవి కొన్ని ఇట్లు నానావిధములైన వస్త్రములను - మహారత్నములను పగడములను వెండి బంగారు ఆభరణములను - ఇట్లు శైలేంద్రుడు శాస్త్రానుసారము అన్ని ద్రవ్యములను సిద్ధపరచెను. అక్కడ అప్పుడే ఒక శుభకరమైన దినమున వివాహమునకు ముందు చేయు మంగళ కార్యము చేయనారంభించెను.
సంస్కారం కారయామాసుః పార్వతీం పర్వత స్త్రియః ।
స్నావయిత్వా వస్త్రయుగ్మం ధారయామానురాశ తాః ॥
కారయిత్వా సువేషాం చ రత్నభూషణ భూషితాం ।
దర్పణం ధారయామాసుర్జూర్వాక్షత సమన్వితం ॥
దదుశ్చాలన్తకం చారు పాదాంగులీషు పాదయోః ।
గండే వత్రావలీం రమ్యాం నేత్రే కజ్జలముజ్జ్వలం ॥
కబరీం కారయామానుర్మాలతీ మాల్య వేష్టితాం ।
పట్ట సూత్ర పినద్ధాం తాం వామపక్షార మనోహరాం ॥
పర్వతరాజు యొక్క స్త్రీలు (భార్యలు బంధువులు) పార్వతికి తలకు నూనెనంటి మంగళ స్నానము చేయించి వెంటనే వస్త్ర యుగ్మమును ధరింపజేసిరి, రత్నాభరణములతో అలంకరించి పాదములకు పాదముల వ్రేళ్లకు {గోళ్లకు ఎర్రని లత్తుక రంగును అలంకరించిరి. చెక్కిలిపై సుందరముగా మకరికా పత్రరేఖలను {మొసలి ఆకారముగా రేఖలను తీర్చుట) కన్నులకు తళతళలాడు కాటుకను - కొప్పున మాలతీ పుష్పమాలను - నడుమున వెడల్పైన పట్టుదారముల మొలనూలును - చేవిసందునను నవనవలాడు పచ్చిగరికను - శిరస్సున అక్షతలను ఉంచి అద్దమును చేతికిచ్చి అలంకరించిరి. ఓరచూపుతో ఆమె మనోహరముగా నుండెను.
ఏతస్మిన్నంతరే రాధే సమాజగ్ముః సురేశ్వరాః ।
నీత్వా త్రినేత్రం తళైవ రత్నయానస్థమీశ్వరం ॥
శైలః సంభృతసంఖారాన్ సంభాషయితుమీశ్వరాన్ ।
శైలాన్ ప్రస్థాపయామాస బ్రాహ్మణానపి పూజితాన్ ॥
ప్రాంగణం కారయామాస రంభాస్తంబై సమన్వితం ।
పట్టసూత్రే సన్నిబద్ధ రసాల పల్లవాన్వితైః ॥
ఫలపల్లవ సంయుక్తైః కలశైర్జల సంయుతైః ।
చందనాగురు కస్తూరీ నుచారు కుసుమాన్వితైః ॥
మాలతీమాల్య సంయుక్తైః సంయుక్తం సుమనోహరం।
రాధాదేవీ! త్రినేత్రుని రత్నాల రథములో కూర్చుండబెట్టి సురేశ్వరులందరు అక్కడికి చేరవచ్చిరి. ఇట్లు వివాహార్థము సంచారములు సమకూర్చుకొని వచ్చిన వరుని పక్షము వారిని దేవేశ్వరులను గౌరవ సత్కారముతో పలుకరించుటకు హిమవంతుడు తన బంధువులగు పర్వతులను సత్కారము పొందిన బ్రాహ్మణులను పం పెను. రాజభవనపు ముందు వాకిలిని అరటిబోదెలతో పట్టుదారములకు బంధించిన మామిడాకులలో చందనము అగురు కస్తూరీ ద్రవ్యములు పూయబడి నీరు నింపి పైన చిగుళ్లు పుష్పములు ఫలములతో అలంకరింపబడిన పూర్ణ కుంభములతో - మాలతీ పుష్ప హారములతో మనోహరముగా అలంకరింపజేసెను.
దేవేశ్వరాన్ పరాన్ దృష్ట్యా ప్రణనామ హిమాలయః ॥
రత్న సింహాసనం దాతుం ప్రేరయామాస కింకరాన్ ।
నారాయణో హి భగవానువాస పారదైః సహ ॥
వినతానందనాత్తూర్ణమపరుహ్య చతుర్భుజః ।
చతుర్భుజైః పార్షదైశ్చ రత్నభూషణ భూషితైః ॥
రత్నముష్టి నిబద్దెశ్చ సేవితః శ్వేత చామరైః ।
ఋషి శ్రేష్ఠి సురశ్రేష్ఠః స్తూయమానశ్చ నంది॥
ఈషదాస్య ప్రసన్నాస్యో భక్తాసుగ్రహకాతరః ।
ఉవాన చ తదఖ్యాశే బ్రహ్మా దేవగణైః సహ ॥
ఋషయో మునయశ్చ సమూషుర్మంగలే స్థలే ।
శ్రేష్టులైన దేవేశ్వరులను (బ్రహ్మ విష్ణువు మొదలగు వారిని) చూచి హిమవంతుడు నమస్కరించెను. వారికి రత్న సింహాసనములర్పించుటకై సేవకులను ప్రేరేపించెను. గరుత్మంతుని నుండి దిగిన చతుర్భుజుడైన నారాయణుడు రత్నభూషణాలంకృతులు చతుర్భుజులునైన తన పార్షదులతో కలిసి కూర్చుండెను. రత్న శలాకలలో పొదిగిన తెల్లని చామరములతో సేవకులతని సేవించిరి. మహర్షులు దేవాధిపతులు సభలో స్వామిని స్తుతించిరి. నారాయణుని ప్రక్కన భక్తుల ననుగ్రహించుటలో త్వరగలవాడును చిరునవ్వు ప్రసన్నమైన ముఖము గలవాడునైన బ్రహ్మ, దేవగణములతో కూర్చుండెను. ఇక ఋషిగణములు మునిగణములు ఆ మంగళ స్థలములో కూర్చుండిరి.
ఏతస్మిన్నంతరే శంభురవరుహ్య రథాదహో ॥
రత్నాననే సముత్తిష్ఠన్ దదర్శ పర్వతాలయం ।
సమాజగ్ము శివం ద్రష్టుం శైలేంద్ర నగరస్త్రీయః ॥
ఇంతలో శంకరుడు రధము నుండి దిగి రత్నాసనము పై కూర్చుండి హిమవంతుని చూచెను. పెండ్లికొడుకైన శివుని చూచుటకై హిమవంతుని నగరములోని స్త్రీలు గుంపులుగా చేరవచ్చిరి.
వృద్ధాబాలా యువత్యశ్చ వస్త్రాభరణ భూషితాః ।
కాశ్చి తజల హస్తాశ్చ వస్త్ర హస్తాశ్చ కాశ్చన ॥
కాశ్చిత్ సిందూర హస్తాశ్చ కాశ్చిత్కంకతికాకరా! ।
వేషార్ధ భూషితాః కాశ్చీత్ కాశ్చిన్నవార్ధ భూషితాః ॥
కాశిన్నిర్భూషితాః కాశ్చిత్సర్వాభరణభూషితాః ।
సర్వా ఆగత్య సంతసుః నస్మితాః వర్వతాలయే ॥
వస్త్రములు ఆభరణములు అలంకరించుకొని వృద్ధ స్త్రీలు యువతులు బాలికలు వచ్చిరి. వారిలో కాటుక బరీణలు చేతబట్టుకోనీ . కన్నులకలంకరించుకోనకనే కొందరు వచ్చిరి. మరి కొందరు మంచి వస్త్రములు చేతబట్టుకొని అలంకరించుకొనకనే త్వరపడి పచ్చిరి.. - కొందరు సిందూర ద్రవ్యము మరికొందరు దువ్వెనలను చేతబట్టుకొని యుండి వచ్చిరి. కొందరు తమ శరీరమును సగము మాత్రమే అలంకరించుకొని కొందరు ఆ సగము కూడి శ్రీలంకరించుకొనక ఆ సామగ్రితో మరికొందరు బోసిగా మరికొందరు సర్వాభరణము లలంకరించుకొని - ఇట్లందరు స్త్రీలు వచ్చి పర్వతరాజ గృహములో చిరునవ్వుతో నిలిచియుండిరి.
ఋషికన్యా దేవకన్యా సాగకన్యాః మనోహరాః ।
గంధర్వశైలకన్యాశ్చ రాజకన్యాః సమాగతా: ॥
సర్వా ఆప్సరసో దివ్యా రంభాద్యాః సముపస్థితాః ।
మేన కస్యోగణైః సార్ధం దదర్శ శంకరం వరం ॥
ఋషికన్యలు దేవకన్యలు సుందరులైన నాగకన్యలు గంధర్వ కన్యలు పర్వత కన్యలు రాజకన్యలు చేరవచ్చిరి. రంభాద్యప్సరసలందరు వచ్చి చేరిరి. అప్పుడు మేనాదేవి కన్యాగణములతో వచ్చి తమ బిడ్డనిచ్చెడి వరుడైన శంకరుని చూచెను.
చారుచంపక వర్ణాభమేకవక్త్రం త్రిలోచనం ।
ఈషదాస్య ప్రసన్నాస్యం రత్నాభరణ భూషితం ॥
చందనాగురు కస్తూరీ చారు కుంకుమ భూషితం ।
మాలతీ మాల్య సంయుక్తం సద్రత్న ముకుటోజ్వలం॥
వహ్ని శాచేనాతులేన చాతిసూక్ష్మణ చారుణా ।
అమూల్య వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి భూషితం ॥
రత్నదర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం ।
సర్వయా ప్రభయాచ్ఛన్నమతీవ సుమనోహరం ॥
అతివ తరుడైరమ్యైర్భూషితాంగైశ్చ భూషితం ।
బీభ్రంతం రూపమతులం వరం నారాయణాజ్ఞయా ॥
సంపెంగ పువ్వు వన్నె గల సుందర శరీరకాంతి గలవాడును ఏకముఖము మూడు నేత్రములు గలవాడును ముఖమున కొంచెము చిరునవ్వుతో ప్రసన్నముగా ఉన్నవాడును రత్నాలంకార భూషితుడును చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క సుగంధ ద్రవ్యము పులుముకొన్న వాడును ఉత్తమమైన రత్నకిరీటముతో ప్రకాశించుచు మాలతీ పుష్పహారము ధరించిన వాడును అగ్నితో పరిశుద్ధమై మిక్కిలి సన్నగా సుందరముగా నుండి సాటిలేనట్టి విచిత్రమైన వక్రోత్తరీయములను అలంకరించుకొన్నవాడును, కాటుకతో ప్రకాశించు కన్నులు గలవాడును రత్నదర్చణమును చేత బట్టుకొన్నవాడును సర్వవిధములైన ప్రభతో కప్పబడినట్లున్న - మిక్కిలి మనోహరముగా నున్న పరమేశ్వరుడు నారాయణుని ఆజ్ఞననుసరించి సాటిలేని గొప్ప రూపము ధరించి యుండెను. శరీరావయవములు మిక్కిలి పడుచుదనముతో రమ్యములై అలంకరింపబడి ఉండిను. మేనాదేవి అట్టి వరుని చూచెను.
యోగస్వరూపం యోగేశ్వరం యోగీంద్రాణాం గురోర్గురుం ।
స్వేచ్ఛామయం గుణాతీతం బ్రహ్మజ్యోతి సనాతనం ॥
గుణభేదాద్రూపభేదం ధత్తే నంతమరువకం ।
తారణం తం భవస్తానాం సృష్టిస్థిత్యంత కారణం ॥
నర్వాధారం సర్వబీజం సర్వేశం సర్వజీవనం ।
సాక్షిరూపం నిరీహం చ పరమానందమక్షరం ॥
ఆద్యంత మధ్య రహితం సర్వాద్యం సర్వరూపకం।
దృష్వా జామాతరం మేనా జహా శోకం ముదాన్వితా ॥
(వరునికుండదగిన రూపాలంకార సంపదను చెప్పి ఆ వరుడెంత మహితుడో మహర్షి వివరించుచున్నాడు) ఆ పరమ శివుడు యోగమునకీశుడు యోగమే స్వరూపమైనవాడు యోగీశ్వరులకు పరమగురువు. తన ఇచ్ఛననుసరించి ఆకారము తాల్చువాడు. ప్రకృతి గుణములకతీతుడు. సనాతనుడై జ్యోతి రూపమున వెలు బ్రహ్మము, రూపరహితుడై కూడి సత్త్వరజస్తమోగుణభేదములను బట్టి రూపభేదములను ధరించు అనంతుడు. సంసార జనులను తరింపజేయువాడు. సృష్టి స్థితిలయములకు కారణమైన వాడు (మూలము) సర్వమునకు ఆధారమతడే. సర్వమునకు బీజమతడే. సర్వమునకు ప్రభువు సర్వులకు ప్రాణము అతడే. జీవకర్మలకతడే సాక్షిగానుండువాడు. ఏ కోరికలు లేనివాడు. పరమానందమయుడు, నాశములేనివాడు, జన్మజరామరణములు లేనివాడు. సర్వమునకు ఆది సర్వరూపధారి అతడే. అట్టి అల్లుని చూచి మేనక అతని లక్షణములు తెలియకముందు పొందిన శ్లోకమును త్యజించి మోదము పొందెను.
ప్రశశంసుర్యుషత్యశ్చ ధన్యా ధన్యా సతీతి తాః ।
దుర్గా భాగ్యవతీర్యేవమూచు కాశ్చన కన్యకాః॥
కామేన కాశ్చితామిన్యో మౌనీభూతాశ్చ స్తంభితాః।
న దృషో వర ఇత్యేవమస్మాభిరోజ్ఞాన గోచరే ॥
కాశ్చీన్నిమేష రహితా మూర్ఛామాపుశ్చ కాళ్ళన ।
నినిందు స్వపతిం కాశ్చిత్ స్వేచ్ఛాం చక్రుశ్చ కొశ్చన॥
కాశ్చిద్భావేన రురుదు పులకాంచిత విగ్రహాః ।
జగుర్గంధర్వ పతయో ననృతుశ్చాప్పరో గణాః ॥
దృష్ట్వా శంకరరూపం చ ప్రహృష్టాః సర్వదేవతాః ।
నానా ప్రకార వాద్యాని చారూణి మధురాణి చ ॥
వాదకా వాదయామాసుర్నానాళిల్నేన తత్ర వై।
చూడవచ్చిన యువతులు ఈ వరుని పెండ్లాడనున్న సతి ధన్యురాలు ధన్యురాలు అని ప్రశంసించిరి. కొందరు కన్యలు దుర్గ (పార్వతి) భాగ్యవతి అనిరి. శివుని చూచి కామముతో కొందరు కామినులు స్తంభించి (శరీరములు కదలక నీలిచి). మౌనముగా నుండిరి. ఇటువంటి వరుడు మారుకలో కనిపించలేదు అనుకొనిరి. కొందరు కనురెప్పలు కొట్టక అట్లే చూచుచుండిరి. మరికొందరు తట్టుకొనలేక మూర్ఛపోయిరి. కొందరు తమ భర్తలను నిందించిరి, కొందరు శివుని గోరుకొనిరి. కొందరు పొంగి వచ్చెడి కామభావముతో శరీరములు పులకలెత్తగా రోదించిరి. గంధర్వరాజులు పాడిరి. అప్సరసలు నృత్యము చేసిరి. శంకరుని రూపము చూచి సర్వదేవతలు మిక్కిలి హర్షించిరి. మంగళ వాద్యములు మ్రోగించువారు సుందరముగా నున్న నానావిధ వాద్యములను స్వరతాళలయల విద్యలో నేర్పును చూపుచు చెవులకు మధురముగా మ్రోగించిరి.
ఏతస్మిన్నంతరే దుర్గాం శైలాంతః పురచారికా॥
బహిశ్చకార సద్రతాసనస్థాం రత్నవేదికాం ।
కస్తూరీ బిందుభిః సాంద్ర సిందూర బిందు భూషితాం ॥
చారు చందన చంద్రాభోం నమ్రపాలస్థలోజ్జ్వలాం।
రత్నేంద్ర సారహారేణ వక్షఃస్థల విభూషితోం॥
త్రినేత్ర దత్తనేత్రాం తామన్యవారితలోచనాం ।
అతీషదాస్య యుక్తాస్యాం సకటాక్షం మనోహరాం ॥
రత్నకేయూర వలయ రత్నకంకణమండీతాం ।
రత్నపాశక సంసక్తాం క్వజన్మంజీర రంజితాం ॥
ఆమూల్యాతుల్యచిత్రాడ్య వస్త్రయుగ్మనుశోభితాం ।
సద్రత్న కుండలాభ్యాం చ చారు గండస్థలోజ్జ్వలాం॥
మణిసార ప్రఖాముష్ణ దంతరాజీ విరాజితాం ।
రత్నదర్పణ హస్తాం చ క్రీడాపద్మం విఘూర్జతీం ॥
చందనాగురు కస్తూరీ కుంకుమేహంగ చర్చితాం ।
ముదితా దదృశుః సర్వే జగదాద్యాం జగత్రిసూం ॥
ఇంతలో పర్వతుని అంతఃపుర పరిచారిక రత్నవేదికయందు రత్నాననము ఫై కూర్చుండియున్న దుర్గను (పార్వతిని) గృహము నుండి బయటకు తెచ్చెను. జగత్తునకు మూలమై జగములను కన్నట్టి ఆ సతి నుదుట చుట్టును చిన్న కస్తూరి చుక్కలతోను నడుమ చక్కని సిందూరపు చుక్కలోను అలంకరింపబడిన సుందరమైన చంద్రాకారము గల చందన తిలకము ప్రకాశించుచుండెను. కొద్దిగా, - ఫాలస్థలము క్రిందికి వంగి వెలుగు చుండెను. వక్షఃస్థలము శ్రేష్ఠమైన ఇంద్రనీలమణుల హారముతో అలంకరింపబడియుండెను. త్రినేత్రునియందే కన్నుల చివరి నుండి ప్రసరింపజేయు దృష్టి గలదై ఇతరులవైపు చూడకుండెను. అత్యంత మందస్మితము (మిక్కిలి కొద్దిపాటి నవ్వు)తో కూడిన ముఖము కడగంటి చూపులతో మనోహరముగా నుండెను. రత్నకంకణములు రత్నాలగాజులు రత్నాల దండ కడియములు హస్తముల నలంకరింపగా, రత్నాల గొలుసులు ధ్వనించుచున్న రత్నాల అందెలతో పొదములలంకరింపబడి యుండెను. ఆమె ధరించిన వస్త్రయుగ్మము వెలగట్టరానిదై సాటిలేనిదై చిత్రించబడిన ప్రకృతి చిత్రములచేత అతిశయమై శోభ తెచ్చుచుండెను. రత్నకుండల కాంతులతో చెక్కిళ్లు ఉబికియున్న చెంపలు ప్రకాశించుచుండెను. మణుల కాంతిని దొంగిలించినట్లు పలువరుస ప్రకాశించుచుండెను. చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవ పదార్థము శరీరాంగము లందు పులుమబడియుండెను. ఆ సతి ఒకచేత రత్నదర్పణము (అద్దము) ధరించి మరియొక చేత విలాసముగా పద్మమును త్రిప్పుచుండెను. అక్కడున్న వారందరామెను మిక్కిలి సంతోషముతో చూచిరి.
త్రినేత్రో నేత్ర కోణేన తాం దదర్శ ముదాన్వితః ।
సర్వాం నత్యాకృతిం దృష్ట్వా విజహా వీరహజ్వరం ॥
శివః సర్వం విసస్మార దుర్గాసన్యస్త మానసః ।
పులకాంచిత సర్వాంగో హర్షాశ్రు యుక్తలోచన ॥
త్రినేత్రుడు సంతోషముతో ప్రక్కచూపుతో ఆమెయందు పూర్వము తన పత్నియొక్క (సతియొక్క) స్వరూపమునే చూచి విరహతాపము త్యజించెను. ఆ పార్వతీయందే పూర్తి మనసునుంచి పులకరించిన దేహము ఆనంద బాష్పములు గల కన్నులు గలవాడై బాహ్యప్రపంచమును మరచెను.
ఏతస్మిన్నంతరే శైలః ప్రహృష్టః సపురోహితః ।
తం వరం వరయామాస వస్రచందన భూషణైః ॥
భక్త్యా పాద్యాదిభిర్మాల్యెర్ధివ్య గంధమనోహరైః।
తతః శీఘ్రం వేదమంత్రైః సంప్రదానం చకార తాం ॥
యాతుకానీ దదౌ తస్మై రత్నాని వివిధాని చ ।
చారు రత్న వికారాణి పాత్రాడి సుందరాచీ॥
గవాం లక్షం గజేంద్రాణాం సహస్రాణి చ రాధీకే ।
రత్నకంబల యుక్తానీ సాంకుశాని ముదాన్వితః ॥
త్రింశల్లక్షం హయానాం చ సజ్జితానామకాతర: ।
దాసీనామనురక్తానాం లక్షం సద్నత్ర భూషితం ॥
శతం ద్విజపటూనాం చ పార్వతీ భ్రాతృ కల్పకం ।
రథానాం చ శతం రమ్యం రత్నేంద్ర సారనిర్మితం ॥
పార్వతీం వస్తు సహితాం స్వస్తిత్యుచ్పోర్య శంకరః ।
జగ్రాహానంద మనసా యత్నాచ్చైలసమర్చితాం ॥
ఇంతలో సంతోషించిన హిమవంతుడు పురోహితునితో గూడి ఆ వరునికి. భక్తితో ఆర్ఘ్యపాద్యములు వస్త్రములు గంధము దివ్య పరిమళము గల పూమాలలు భూషణములు సమర్పించి పూజించెను. వెంటనే వేద మంత్ర పూర్వకముగా కన్యాదానము చేసెను. ఆ వరునకు వివిధ రత్నములను రత్న నిర్మితములైన సుందర పాత్రలను రత్నకంబలములతో అంకుశములతో కూడిన సహస్ర సంఖ్యగల గజేంద్రములను, లక్షగోవులను, అలంకరింపబడిన ముప్పదిలక్షల అశ్వములను యజమానులయందు మిక్కిలి ప్రేమగల - రత్న భూషితలైన దాసీజనమొక లక్షను, పార్వతి యందు సోదరప్రేమను ప్రకటించు బ్రాహ్మణ బ్రహ్మచారులను ఒక వందమందిని శ్రేష్ఠమైన ఇంద్రనీలమణులతో - నిర్మితమైన నూరు రథములను హిమవంతుడు వివాహ సందర్భపు కట్నముగా ముదముతో సమర్పించెను. శంకరుడానంద చిత్తముతో స్వస్తి అని పలికి ప్రయత్నపూర్వకముగా శైలరాజు సమర్పించిన ఆ వస్తుసామగ్రిని పార్వతితో బాటు స్వీకరించెను.
హిమాలయః సుతాం దత్యా పరిహారం చకార తం ।
మాధ్యందినేన స్తోత్రేణ తుషాన సంపుటాంజలి ॥
హిమవంతుడు ఇట్లు బిడ్డను దానమిచ్చి తన అపచారమునకు పరిహారము చేసుకొనెను. తరువాత సామవేదమునకు చెందిన మాధ్యందిన శాఖలోని స్తోత్రముతో చేతులు జోడించి శివుని స్తుతించి ఆనందపరచెను.
హిమాలయ ఉవాచ - హిమాలయుడిట్లనెను :
ప్రసీద దక్ష యజ్ఞమ్న నరకార్ణవ తారక ।
సర్వాత్మరూప నర్వేశ పరమానంద విగ్రహ॥
గుణార్ణవ గుణాతీత గుణయుక్త గుణేశ్వర ।
గుణబీజ మహాభాగ ప్రసీద గుణినాం వర ॥
యోగాధార యోగరూప యోగజ్ఞ యోగకారణ ।
యోగీశ యోగినాం బీజ ప్రసీద యోగినాం గురో ॥
ప్రలయ ప్రలయాద్యైక భవ ప్రలయకారణ ।
ప్రలయాంతే సృష్టి బీజ ప్రసీద పరిపాలక॥
సంహార కాలే ఘోరే చ వృద్ధి సంహార కారణ ।
దుర్నివార దురారాధ్య చాశుతోష ప్రసీద మే ॥
కాలస్వరూప కాలేశ కాలే చ ఫలదాయక ।
కాలబీజైక కాలఘ్న ప్రసీద కాలపాలక ॥
శివ స్వరూప శివద శివబీజ శీవాశ్రయ ।
శివభూత శివప్రాణ ప్రసీద పరమాశ్రయ ॥
ఇత్యేవం స్త్రవనం కృత్వా విరరామ హిమాలయః।
ప్రశళంసుః సురాః సర్వే మునయశ్చ గిరీశ్వరం ॥
హిమాలయ కృతం స్తోత్రం సంయతో య పఠేన్నరః ।
ప్రదదాతి శివస్తస్మై వాంఛితం రాధికే ధ్రువం ॥
ఓ సర్వేశా! దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చినవాడా! నరకమను సముద్రమును దాటించువాడా! ఎల్లరికి ఆత్మరూపమైనవాడా! పరమానందమే ఆకారమైనవాడా! అనుగ్రహించుము. ఓ నదుణ సముద్రుడా! త్రిగుణములకు అతీతమైనవాడా! సృష్ట్యాది కర్మలలో త్రిగుణములతో కూడియుండువాడా! ఆ గుణములకు ప్రభూ! ఆ గుణములకు బీజమైనవాడా! సద్గుణవంతులలో శ్రేష్టుడా! దయదలచుము, యోగమునకాధారమైనవాడా! యోగుల ధ్యానమే రూపమైనవాడా! యోగ విధము తెలిసినవాడా! యోగుల యోగమునకు హేతువైనవాడా! యోగీశ్వరా! యోగులకు బీజభూతుడా! యోగులకాచార్యుడా! అనుగ్రహించుము. ప్రళయరూపా! ప్రళయాదులను పుట్టించువాడా! ప్రలయమునకు మూలమైనవాడా ప్రలయాంతమున సృష్టికి బీజమైనవాడా! నన్ను పాలించువాడా! అనుగ్రహించుము. ఘోరమైన సంహారకాలమందు సృష్టిని సంహరించుటకు మూలమైనవాడా! ఇతరులచేత నివారింపబడరానివాడా! పూర్ణముగా ఆరాధింప సాధ్యము కానివాడా! ఐనను శీఘ్రముగా సంతుష్టినొందువాడా! నాయందనుగ్రహింపుము. కాలమే స్వరూపమైనవాడా! కాలమునకీశ్వరుడా! భక్తుల కర్మలు పరిపక్వమైనప్పుడు కర్మకు తగిన ఫలమిచ్చువాడా! దయచూపుము. మంగళమైన స్వరూపము గలవాడా! ఆశ్రితులకు శంభములిచ్చువాడా! మంగళములకు బీజమైనవాడా! శివ పార్వతికి)కు ఆశ్రయమైనవాడా! మంగళభూతుడా! జీవకోటికి ప్రాణమైనవాడా! శ్రేష్టులందరికి ఆధారమైనవాడా! అనుగ్రహించుము. హిమవంతుడిట్లు స్తోత్రమొనర్చి చాలించెను. సురలు మునులందరాగిరీంద్రుని ప్రశంసించిరి. హిమవంతుడొనర్చిన ఈ స్తోత్రమును ఏ నరుడు మనోనిగ్రహము కలవాడై పరించునో వానికి శివుడు కోరినదానీనిచ్చును. ఇది సత్యము రాధా! అని కృష్ణుడు చెప్పెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే పార్వతీ సంప్రదానే చతుశ్చత్వారింశోధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన పార్వతీ సంప్రదానమను పేరు గల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 44 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Following the downfall of Kaṃsa, Kṛshṇa and Balarāma rushed immediately to the dark prison cells, breaking open the heavy iron chains and freeing their grieving parents, Vasudeva and Devakī, who embraced their divine sons with overwhelming tears of joy. Kṛshṇa then approached His grandfather, the pious Ugrasena, and formally crowned him as the righteous king of Mathura, restoring peace, justice, and prosperity to the Yādava dynasty and fulfilling the long-awaited desires of the citizens.