మూ॥ శ్రీకృష్ణఉవాచ-
ఏతస్మిన్నంతరే శుక్రః సురశ్రేణీం దదర్శ సః ।
ఆకాశమార్గాదాయాంతీం రణశస్త్రాస్త్ర ధారిణీం ॥
పతాకానాం త్రికోటిశ్చ శతకోటిర్మహారథః ।
శతకోటిర్గజేంద్రాణాం రథానాం తచ్చతుర్గుణం ॥
అశ్వానాంతచ్ఛతగుణం సమూహంచ సుదారుణం ।
పదాతీనాం సమూహంచ తురంగేభ్యశ్చ షడ్గుణం ॥
దుందుభీ వాద్యభాండానాం పంచలక్షం తథైవచ ।
పటహానాం త్రిలక్షంచ డిండిమానాం త్రిలక్షకం ॥
ఐరావతే మహేంద్రంచ శ్వేతాశ్వే ధర్మమేవచ ।
కుబేరం వరుణం వహ్నిం రథస్థం పవనం తథా॥
మహిషస్థం యమంచైవ స్యందనస్థంది వాకరం ।
ఈశానంచ మహేంద్రస్థ మనంతం నాగవాహనం ॥
ఆదిత్యాంశ్చ వసూన్ రుద్రాన్ సిద్ధగంధర్వ కిన్నరాన్ ।
జీవన్ముక్తమునీనాంచ సమూహం సూర్యవర్చసాం ॥
తాన్ దృష్ట్వా నిర్భయః శుక్రః సమాశ్వాస్య నిశాకరం ।
సురాణాం ద్విగుణం సైన్యమాజుహావ వ్రజేశ్వర ॥
రత్నమాలా నదీతరే హుతాశన ప్రియాశ్రయే ।
తత్ర తస్థౌ దైత్య సైన్యం పుణ్యక్షీరోదధేస్తటే ॥
ఏతస్మిన్నంతరే శుక్రః సమీపం సరసస్తటే ।
పుణ్యాశ్రమేఽక్షయవటే సుర సైన్యాత్సమాగతం ॥
దదర్శ వృషభస్థంచ శంకరం సర్వశంకరం ।
త్రిశూలం పట్టిశధరం వ్యాఘ్రచర్మాంబరం వరం ॥
తేజః స్వరూపం పరమం భక్తానుగ్రహవిగ్రహం ।
సర్వసంపత్ర్పదాతారం సర్వజ్ఞం సర్వకారణం ॥
సర్వేశ్వరం సర్వపూజ్యం సర్వరూపం సనాతనం ।
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణం ॥
సస్మితం పరమాత్మానం జ్వలంతం బ్రహ్మతేజసా ।
సంత్రస్తః సహసోత్థాయ ప్రణనామ పదాంబుజే ॥
దదౌ శుభాశిషం తస్మై సుప్రసన్న: పరాత్పరః ।
రత్నసింహాసనే తంచ వాసయామాస సాదరం ॥
అథతత్రాంతరే విప్రపురతస్తంద దర్శసః ।
శాంతంస్వయం విధాతారం రత్నస్యందన సుందరం ॥
వహ్నిశుద్ధాంశుకాధానం రత్నమాలావిభూషితం ।
ప్రసన్నం సుస్మితం శుద్ధం జగతామీశ్వరం పరం ॥
కర్మణాం ఫలదాతారం తపోరూపం తపస్వినాం ।
వేదానాం జనకం వేదప్రసూం కాంతం మనోహరం ॥
పుటాంజలిస్తదా త్రస్తః ప్రణనామ సురేశ్వరం ।
రత్నసింహాసనే రమ్యే వాసయామాస భక్తితః ॥
పూజాంచ కార భక్త్యాచ తయోశ్చరణపంకజే ।
నోచితం కుశలప్రశ్నే తయోః కళ్యాణమేవచ॥
విధాతా జగతాం శుక్రమాచార్యం పురతః స్థితం ।
సునీతిం కథయామాస యత్నతః శంభు సమ్మతః ॥
బ్రహ్మోవాచ-
శృణుశుక్రప్రవక్ష్యామి దుర్నీతిం శశినః సుత ।
లజ్జాకరం త్రిజగతాం కర్మ వేదబహిష్కృతం ॥
స్నాత్వా గృహోన్ముఖీం తారాం గురుపత్నీం పతివ్రతాం ।
గృహీత్వా శరణాపన్నస్త్వయి పాపశ్చ సాంప్రతం ॥
అను! శ్రీకృష్ణుని వచనమిట్లా - ఇంతలో శుక్రుడు దేవతాశ్రేణినిచూచాడు. ఆకాశ మార్గంలో వస్తోంది.యుద్ధ సంబంధ శస్త్రాస్త్రములు ధరించింది (1) మూడుకోట్ల ఝండాలు, నూరుకోట్ల మహారథములు, గజేంద్రములు, నూరుకోట్లు, అందుకు నాల్గింతలు రధములు, (2) గుఱ్ఱములు దానికి నూరింతలు. వీటి సమూహము చాలా దారుణంగా ఉంది. పదాతుల సమూహము గుర్రములకన్న ఆరింతలెక్కువ. (3) దుందుభి వాద్యభాండములు ఐదు లక్షలు. పటహములు మూడు లక్షలు డిండిమములు (వాద్యం) మూడు లక్షలు. (4) ఐరావతం పై మహేంద్రుడు, తెల్లని గుర్రం పై ధర్ముడు,కుబేరుడు, వరుణుడు, అగ్ని గాలివీరు రథం పై ఉన్నారు. (5) మహిషము పై యముడు, రథము పై సూర్యుడు, వృషభశ్రేష్ఠము పై ఈశానుడు, నాగవాహనము పై అనంతుడు (6) ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సిద్ధగంధర్వ కిన్నరులు,సూర్యకాంతి గల జీవన్ముక్తులైన మునుల సమూహము. (7) వీరందని చూచి, భయంలేకుండా శుక్రుడు, చంద్రుని ఊరడించి, ఓ వ్రజేశ్వర! దేవతల కన్న రెట్టింపు సైన్యమును తెప్పించాడు. (8) రత్నమాల నదీతీరమందు, హుతాశనుని ప్రియమైన ఆశ్రమమందు, పుణ్యకరమైన పాలసముద్రపు ఒడ్డుయందు, అక్కడ రాక్షస సైన్యముంది. (9) ఇంతలో శుక్రుడు, సరస్సుయొక్క ఒడ్డుయందు దగ్గరలో, పుణ్యమైన ఆశ్రమంలో, అక్షయవటమందు, దేవ సైన్యమునుండి వచ్చిన (10) వృషభము పైకూర్చున్న ,అందరికి మేలు చేకూర్చే శంకరునిచూచాడు. ఆతని చేతిలో త్రిశూలముంది. అడ్డకత్తి ఉంది. శ్రేష్ఠమైన వ్యాఘ్రచర్మము వస్త్రంగా ఉంది. (11) తేజఃస్వరూపుడు, పరముడు, భక్తులననుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు, అన్ని సంపదలనిచ్చేవాడు, సర్వజ్ఞుడు, అన్నింటికి కారణుడు (12) సర్వేశ్వరుడు, సర్వపూజ్యుడు, సర్వస్వరూపుడు, సనాతనుడు, శరణాగతులైన దీనులను బాధనుండి రక్షించుటలో ఆసక్తిగలవాడు. (13) చిరునవ్వుగలవాడు, పరమాత్మకలవాడు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. భయపడి, త్వరగా లేచి, ఆతని పాదములకు నమస్కరించాడు. (14) సుప్రసన్నుడై పరాత్పరుడు ఆతనికి శుభాశీస్సులనిచ్చాడు. ఆదరంగా ఆతనిని రత్నసింహాసనముపై కూర్చోబెట్టాడు. (15) ఇక అంతలో ఓ విపుత్రు! ఎదురుగా ఆతడు ఆతనిని (బ్రహ్మను) చూచాడు. శాంతుడు, స్వయంగా విధాత, రత్నరథమందు అందంగా ఉన్నాడు. (16) వహ్నిశుద్దమైన వస్త్రాన్ని ధరించాడు. రత్నమాలను అలంకరించుకున్నాడు. ప్రసన్నంగా ఉన్నాడు. నవ్వుతున్నాడు. శుద్దుడు. లోకాలకీ శ్వరుడు, పరుడు ఆతడు. (17) కర్మలకు ఫలమిచ్చేవాడు తపస్వులకు తపోరూపుడు. వేదములకు జనకుడు. వేదముల ప్రసవించినవాడు (కన్నవాడు). కానుడు, మనోహరుడు. (18) అప్పుడు భయపడి, చేతులు జోడించి సురేశ్వరునకు నమస్కరించాడు. భక్తితో రత్నసింహాసమున పై అందమైన దాని పై ఉంచాడు. (19) వారి పాదపద్మములను భక్తితో పూజించాడు. కుశలప్రశ్న తగదు కనుక వేయలేదు. ఎందుకంటే వారికి కళ్యాణమేగదా. (20) జగత్తునకు విధాతయైన బ్రహ్మ ఎదురుగా ఉన్న శుక్రాచార్యుని, నీతిమంతునితో శివుని అనుమతితో, ప్రయత్నపూర్వకముగా ఇట్లా అన్నాడు. (21) బ్రహ్మ వచనమిట్లా - ఓ సుత! శుక్ర! చంద్రుని దుర్నీతిని చెబుతాను, విను. ముల్లోకాలకు, సిగ్గు కల్గించేది, ఈపని. వేదములు బహిష్కరించాయి (22) స్నానం చేసి గృహంవైపు బయలుదేరిన గురుపత్ని, పతివ్రత, ఐన తారను స్వీకరించి పట్టుకొని) నిన్ను శరణువేడాడు. ఇప్పుడు ఈపాపి.
మూ॥ప్రస్తుతం దేవ సైన్యంచ పశ్య, వత్స రణోద్యతం ।
అహం శంభుస్త్వత్సమీపంత దర్థంచ సమాగతౌ ॥
శంభురువాచ-
చంద్రమానయ హేవిప్ర యద్యాత్మ శివమిచ్ఛపి ।
సంహరి ష్యే శిరస్తస్య త్రిశూలేన చ పాపినః ॥
అన్యథా సంహరిష్యామి సర్వదైత్యాన్ క్షణేనచ ।
మయి దుష్ట రక్షితా కో దైత్యానాంచ భవేద్ద్విజ ॥
సద్యః పాశుపతేనైవ వాయ్వస్త్రేణచ సాంప్రతం ।
సురాణాం రిపువర్గంచ హరిష్యామిచ లీలయా ॥
దుర్వాససో మదంశస్య గురుస్తస్యాంగిరామునిః ।
పరస్పరాచ్చ సంబంధాత్ గురుపుత్రో గురుర్మమ ॥
బృహస్పతిశ్చ తేజస్వీ తం భస్మీకర్తుమీశ్వరః ।
న చకార కృపాలుశ్చేత్ప్రియశిష్యేణ హేతునా ॥
ఉతథ్య పత్నీం దృష్ట్వా స పురా రేమే స్వకామతః ।
తత్సతేః శాపతోఽస్యైవ పరగ్రస్తా ప్రియా సతీ ॥
పత్నీం మద్గురుపుత్రస్య దేహి తారాం మనోహారాం ।
మద్వైరిణంచ చంద్రంచ భ్రాతృభార్యా పహారిణం॥
శరణాగత దీనార్తం నహిరక్షేద్యదీశ్వరః ।
పచ్యతే నిరయే తావద్యావదింద్రా శ్చతుర్ధశ ॥
అత్ర నాస్తి విచారో మే పాపిష్టే శరణాగతే ।
పాపీయం శరణం యాతి స పాపీచ న సంశయః ॥
దేహి తం విప్రశార్దూల పాపినం మాతృగామినం ।
బహిష్కృత్య స్వాశ్రమచ్చ తారా సాధ్వీసమన్వితం ॥
శుక్రఉవాచ –
సురాణామసురాణాంచ సర్వేషాం జగతామపి ।
త్వమేవ శాస్తా భగవాన్ కోవా శాస్తి సురేఽసురే ॥
కృత్వా సురాణాం సాహాయ్యం కథం దైత్యాన్ హనిష్యసి ।
సంహర్తుః సర్వజగతాం దైత్యౌ ఘే కించ పౌరుషం ॥
త్వం జ్యోతిః పరమం బ్రహ్మ సగుణో నిర్గుణః స్వయం ।
గుణభేదా న్మూర్తిభేదో బ్రహ్మవిష్ణు శివాత్మకః ॥
బలిద్వారే గదాపాణిః స్వయమేవ భవాన్ ప్రభో ।
స్వయం ప్రదత్తా శక్రాయ తస్మై శ్రీరపి లీలయా ॥
క్షమస్వ భగవన్ శంభో హర క్రోధంచ సంహర ।
కిం పౌరుషంచ భవతో బ్రాహ్మణస్యాపి హింసయా ॥
అహం జీవచ్ఛరీరేణ నదాస్యామి నిశాకరం ।
శరణాగతదీనార్తం లజ్జితం పాప సంయుతం ॥
అహంచ త్వత్పదాంభోజే శరణం యామి శంకర ।
యధోచితం కురు విభో జగత్సర్వం తథైవచ ॥
శుక్రస్య వచనం శ్రుత్వా ప్రసన్నో భగవాన్ శివః ।
ఇత్యువాచ నిశానాథం సమానయ శుభం భవేత్ ॥
ఏతస్మిన్నంతరే బ్రహ్మా బోధయిత్వా కవింవిభుః ।
సమానీయ నిశానాథం తారకాసహితం ప్రజ ॥
శంభోశ్చ చరణాంభోజే చకారచ సమర్పణం ।
శంభుస్తం ప్రీతియుక్తశ్చ వాసయామాస వక్షసి ॥
అను!! ఓవత్స! ఇప్పుడు యుద్ధసన్నద్దమైన దేవసైన్యాన్ని చూడు. నేను, శంభుడు, ఇద్దరము నీ దగ్గరకు అతని కొరకై వచ్చాము. (24) శంభువిట్లన్నాడు - ఓవిప్ర! నీకు క్షేమం జరగాలనుకుంటే చంద్రుని తీసుకురా. త్రిశూలంతో ఆపాపి శరస్సును ఖండిస్తాను (25) లేదా క్షణకాలంలో రాక్షసులనందరిని సంహరిస్తాను. నేను కోపగిస్తే రాక్షసులకు రక్షకుడెవడున్నాడు, ఓ ద్విజుడ! (26) వెంటనే పాశుపతాస్త్రంతో, వాయ్వస్త్రంతో ఇప్పుడు, దేవతల శత్రువులైన వారిని (రాక్షసులను) అవలీలగా హరిస్తాను. (27) నా అంశమైన దుర్వాసుని గురువు, ఆతనికి అంగిరసుడు " ముని గురువు. పరస్పరము సంబంధమున్నందువల్ల గురుపుత్రుడు నాకు గురువు. (28) బృహస్పతి తేజస్వంతుడు. ఆతనిని భస్మంచేయడానికి ఈశ్వరుడు సిద్దపడలేదు. దయగలవాడు, అదిగాక ప్రియశిష్యుడైనందువల్లను (29) ఉతథ్యుని భార్యను చూచి ఆతడు ఇదివరలో తన కోరికతో రమించాడు. ఆమె భర్త శాపంతో ఈతని ప్రియసతి ఇతరులతో గ్రహింపబడింది. (30) నా గురువు పుత్రుని భార్యను, మనోహరమైన తారను ఇవ్వు. నాశత్రువైన చంద్రుని భ్రాతృ భార్యను అపహరించేవానిని (31) శరణాగతుడైన దీనుని ఆర్తుని యతీశ్వరుడు రక్షించరాదు. పదునాలుగురింద్రుల కాలపర్యంతము నరకమందు వండబడతాడు (32) పాపిష్టుడు శరణాగతుడైతే నాకు విచారం లేదు. పాపి ఎవనిని శరణు వేడుతాడో వాడుకూడా పాపియే అనుమానం లేదు. (33) పాపి, మాతను పొందిన వానిని, వానిని ఓ బ్రాహ్మణశార్దూల అప్పగించు. తారాసాధ్వితో కూడిన వానిని నీ ఆశ్రమం నుండి బహిష్కరించు. (34) శుక్రుడిట్లన్నాడు - దేవతలకు రాక్షసులకు అందరికి లోకములకు కూడా భగవాన్! నీవేశాసకుడవు. సురుడు అసురుడైతే శాసించేవాడెవడు (35) దేవతలకు సహాయం చేసి రాక్షసులనెట్లా చంపుతావు. జగత్తులనంతా సంహరించేవానికి రాక్షస సమూహ. మందు పౌరుషం చూపటం అదెంత (నీచం) (36). నీవు జ్యోతివి, పరబ్రహ్మవు.. సగుణుడవు నిర్గుణుడవు స్వయంగా గుణభేదం వల్ల బ్రహ్మ విష్ణు శివాత్మకముగా మూర్తి భేదము. (37) బలియొక్క ద్వారమందు గదచేత ధరించి ఉన్నవాడివి స్వయంగా నీవే. ఓ ప్రభు! స్వయంగా ఇంద్రునకిచ్చావు. ఆతనికి అవలీలగా నికూడా ఇచ్చావు. (38) ఓ భగవన్ శంభు! క్షమించు. క్రోధమునుహరించు ఉపసంహరించు. మీరు బ్రాహ్మణుని హింసిస్తే అదేమంత పౌరుషకార్యము. (39) నేను బ్రతికుండగా చంద్రుని అప్పగించను. శరణాగతుడు దీనుడు ఆర్తుడు, సిగ్గుపడుతున్నాడు.పాపయుక్తుడాతడు. (40) ఓ శంకర! నీపాదాంబుజముల పై నేను శరణు పొందుతున్నాను. ఓవిభు! నీకు తోచినట్లు చేయి. అట్లాగే జగత్తునంతా చేయి. (41) శుక్రుని మాటను విని భగవంతుడైన శివుడు ప్రసన్నుడై ఇట్లన్నాడు - చంద్రుని తీసుకురా. శుభంకలుగుతుంది అని (42) ఇంతలో బ్రహ్మ, విభువు శుక్రుని బోధించాడు. ఓ ప్రజ! తారతో పాటు నిశానాథుని తీసుకువచ్చి (43) శివుని పాదాంబుజముల పై సమర్పించాడు. ప్రీతికలవాడై శివుడు, ఆతనిని వక్షస్సు పై ఉంచుకున్నాడు.
మూ॥ దత్వా తస్మై పాదరేణుం నిష్పాపంచ చకార సః ।
దత్వా తన్మస్తకే హస్తం కృపాలురభయం దదౌ ॥
క్షీరోదే స్నాపయిత్వాచ ప్రాయశ్చిత్తేన శంకరః ।
చకార చంద్రం నిష్పాపం బ్రహ్మణా సహితః శుచిం ॥
యోగేన చంద్రం యోగీంద్రో ద్విఖండం తం చకార సః ।
రరక్షార్ధం లలాటేచ సోఽప్యర్ధం బ్రహ్మణః పురః ॥
ఏవమేవ మహాదేవః బభూవ చంద్రశేఖరః ।
మృగాంకో లజ్జిత స్తత్ర కలం కీదేవసంసది ॥
లజ్జయాచ స్వయోగేన దేహత్యాగంచ కారసః ।
తచ్ఛరీరంచ క్షీరోదే బ్రహ్మణాచ సమర్పితం
రురోదాత్రిశ్చ కృపయా శుచా క్షీరోదధేస్తటే ॥
అత్రేశ్చక్షుర్జలం తస్యప పాతచ జలే ప్రజ ।
తస్మాద్బభూవ చంద్రశ్చ నిష్పాపో దేవ సంసది ॥
బ్రహ్మాచ భగవాన్ శంభుః అభిషేకం చకార తం ।
ఉవాచ తం మహాదేవో నిర్భయం దేవసంసది ॥
మహాదేవ ఉవాచ
స్వస్థానం గచ్ఛ పుత్ర త్వం కురుష్వ విషయం ముదా ।
పశ్చాత్తస్యాశ్చ శాపేన యక్ష్మగ్రస్తో భవిష్యసి ॥
వ్యర్థం పతివ్రతా శాపం కర్తుమీశశ్చ కో భువి ।
మదాశిషా యక్ష్మణశ్చ ప్రతీకారో భవిష్యతి ॥
యస్మాద్భాద్రచతుర్థ్యాం తు గురుపత్నీ క్షతిః కృతా ।
తస్మాత్తస్మిన్దినే వ త్స పాపదృశ్యా యుగేయుగే ॥
నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి ।
అవశ్యమేవ భోక్తవ్యం కృతంకర్మ శుభాశుభం ॥
దేహత్యాగేన హేవత్స కర్మభోగో న నశ్యతి ।
ప్రాయశ్చిత్తాన్నసందేహో హ్యస్తమేవ భవిష్యతి ॥
తారాపహారణాద్వత్స కలం కశ్చంద్ర మండలే ।
మృగాకృతిర్విలగ్నశ్చ భవిష్యతి యుగేయుగే ॥
శృణు వాక్యమిహాగచ్ఛ తారకే చ పతివ్రతే ।
సత్యం బ్రూహికస్య గర్భంత్యక్త్వా శుద్ధాభవప్రియే ॥
అకామతో బలాత్సాధ్వీ నస్త్రి జారేణ దుష్యతి ।
కామతో నరకం యాతి యావచ్చంద్రదివాకరౌ ॥
ఉవాచ తారా బ్రహ్మాణం గర్భం చంద్రస్య సస్మితం ।
జహసు: దేవతాః సర్వాః శంభుశ్చమునిసంఘకాః ॥
దదౌ తారాంచ గురవే లజ్జితాయ వ్రజేశ్వర ।
బృహస్పతిర్యయౌ గేహం గృహీత్వాచ పతివ్రతాం ॥
తయా ప్రసూతం పుత్రంచ సుందరం కనకప్రభం ।
గృహీత్వా ప్రయయౌ చంద్రో నమస్కృత్య విధింశివం ॥
యయుర్దేవాశ్చ మునయః శంభుశ్చ కమలోద్భవః ।
ప్రయణా స్వగృహం శక్రో దైత్యయుక్తో ముదాన్వితః ॥
ఏతత్తే కథితం నంద హ్యాఖ్యానం పుణ్యదం శుభం ।
ఏతచ్చ్రుత్వా తునిష్పాపో నిష్కలంకీ నరో భవేత్॥
ధన్యం యశస్య మాయుష్యం సర్వ సంపత్కరం పరం ।
శోకాపనోదనం హర్షకరం సర్వత్ర మంగలం ॥
త్యజ శోకం సదానంద గృహం వ్రజ వ్రజేశ్వర ।
బ్రూహి సర్వం యశోదాంచ మత్ర్పసూం గోపికా గణం ॥
బోధయిష్యసి సర్వాంతాం స్త్రీ జాతిం శోకసంయుతాం ।
మదీయజ్ఞానదత్తేన హర్షయుక్తః సదా భవ ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధ తారాహారణం నామ ఏకాశీతితమోఽధ్యాయః ॥
అతనికి పాదరేణువునిచ్చి పాపరహితునిగా ఆతనిని చేశాడు. ఆతనితల పై చేయి ఉంచి, అభయమిచ్చాడు, దయగల ఆస్వామి (45) శంకరుడు పాలసంద్రమందు ప్రాయశ్చిత్తపూర్వకముగా స్నానం చేయించి బ్రహ్మతో కూడి చంద్రుణ్ణి పాపరహితుని, శుచిని చేశాడు (46) యోగీంద్రుడు శివుడు ఆ చంద్రుని యోగశక్తితో రెండు భాగములు చేశాడు. సగభాగాన్ని తలలో ఉంచుకొని రక్షించాడు. ఆతడు మిగిలిన సగభాగాన్ని బ్రహ్మముందుంచాడు (47) ఈరకంగా మహాదేవుడు చంద్రశేఖరుడైనాడు. అక్కడ దేవసభయందు, కలంకితుడైన మృగాంకుడు సిగ్గుపడ్డాడు. (48) లజ్జవల్ల తనయోగశక్తితో ఆతడు తన దేహాన్ని విడిచి పెట్టాడు. ఆశరీరాన్ని బ్రహ్మ, పాలసముద్రంలో వేశాడు. ప్రేమతో, అత్రి, బాధతోను పాల సముద్రపు ఒడ్డులో దుఃఖించాడు. (49) ఓ ప్రజ! అత్రి యొక్క ఆకన్నీరు ఆనీటిలో పడింది. అందునుండి పాపరహితుడై చంద్రుడు వచ్చాడు. దేవసభకొచ్చాడు. (50) బ్రహ్మ భగవంతుడైన శంభువు ఆతనికి అభిషేకం చేశారు. మహాదేవుడు, నిర్భయంగా దేవసభలో ఆతనితో ఇట్లన్నాడు. (51) మహాదేవుని వచనమిట్లా - ఓపుత్ర నీస్థానానికి వెళ్ళునీవు. ఆనందంతో నీ పనులు చేయి. ఆ పైన, ఆమె శాపం ప్రకారము క్షయరోగానికి గురి ఔతావు. (52) ఈశుడైనా పతివ్రతా శాపాన్ని వ్యర్థపరచటానికి అసమర్థుడు. ఆశీర్వచనంతో క్షయ రోగానికి ప్రతీకారము కలుగుతుంది. (53) భాద్రపద చవితియందు గురుపత్నిని గాయపరిచావు కనుక అందువల్ల ఆరోజున ఓ వత్స! ప్రతి యుగంలో నిన్ను చూస్తే పాపం వస్తుంది. (54) నూరుకోట్ల కల్పములకాలానికైనా కర్మఫలము అనుభవించకుండా నశించదు. శుభమైనా అశుభమైనా చేసిన కర్మను తప్పకుండా అనుభవించాలి (55) ఓవత్స! శరీర త్యాగముతో కర్మ అనుభవించటము తప్పిపోదు. ప్రాయశ్చిత్తం వల్లనైతే తప్పకుండా నశిస్తుంది, అనుమానం లేదు. (56) తారను అపహరించటం వల్ల ఓ వత్స! చంద్రమండలమందు కళంకం వస్తుంది. మృగము ఆకారము బాగా ఏర్పడి, ప్రతియుగంలో ఉంటుంది. (57) నామాటవిను. ఇక్కడికి రా ఓతార! పతివ్రత! నిజం చెప్పు, ఆగర్భం ఎవరిది. ఓప్రియా! దాన్ని పోగొట్టుకొన్ని శుద్ధురాలివికమ్ము. (58) ఇష్టం లేకుండా, బలవంతంగా, సాధ్వియైన స్త్రీ చెరచబడితే ఆజారతనదోషం ఉండదు. ఇష్టపూర్తిగా జారత్వం చేస్తే సూర్యచంద్రులున్నంత కాలము నరకానికి పోతుంది. (59) అప్పుడు తార బ్రహ్మతో అంది, నవ్వుతూ, ఈ గర్భము చంద్రునిది, అని. దేవతలంతా నవ్వారు శివుడు, ముని సంఘములు నవ్వారు. (60) ఓవ్రజేశ్వర! సిగ్గుపడుతున్న గురువునకు తారను అర్పించారు. బృహస్పతి, పతివ్రతయైన ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. (61) ఆమె కన్నటువంటి (ప్రసవించిన) సుందరంగా ఉన్న బంగారంలా మెరిసిపోతున్న పుత్రుడిని తీసుకొని చంద్రుడు, బ్రహ్మకు శివునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. (62) దేవతలు, మునులు, శంభువు బ్రహ్మ వెళ్ళారు. దైత్యులతో కూడి, ఆనందంతో శుక్రుడు తన గృహమునకు వెళ్ళాడు. (63) ఓనంద! పుణ్యమును కల్గించే, శుభమైన ఈ కథను నీకు చెప్పాను. దీనిని విన్న నరుడు పాపరహితుడు, కలంకరహితుడు ఔతాడు. (64) ధన్యతను కల్గించేది కీర్తి ఆయుస్సులనిచ్చేది. అన్ని సంపదలనిచ్చేది పరమైనది. దుఃఖాన్ని తొలగించేది, ఆనందాన్నిచ్చేది. అంతటా మంగళమైనది. (65) ఓ నంద! శోకాన్ని ఎల్లప్పుడు విడిచి పెట్టు. ఓ ప్రజేశ్వర! ఇంటికి వెళ్ళు. నన్ను గన్నయశోదకు, గోపికాగణములకు ఇదంతా చెప్పు (66) శోకముతో కూడిన ఆ స్త్రీ జాతినంతా మేల్కొలుపగలవు.నేనిచ్చిన జ్ఞానంతో ఎల్లప్పుడు ఆనందం కలవాడవుకా (67) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ మందు తారనుహరించుట అనునది ఎనుబది ఒకటవ అధ్యాయము.
Summary of chapter 81 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Addressing potential misunderstandings regarding the transcendent pastimes, Maharshi Nārada illuminated the confidential spiritual significance of the Rāsalīlā. He clarified that the dance of Śrī Kṛshṇa with the Gopīs is entirely spiritual, transcending all material lust and physical desires, representing the pure non-dual union of the Supreme Soul with individual liberated souls. Hearing or reading about these pastimes with pure faith completely eradicates material lust from the human heart, filling the soul with unalloyed divine love.